పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ద్వితీయాశ్వాసము)/నృగోపాఖ్యానంబు

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

నృగోపాఖ్యానంబు

తెలుగు భాగవతము (పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ద్వితీయాశ్వాసము)/నృగోపాఖ్యానంబు)
రచయిత: పోతన


(తెభా-10.2-454-సీ.)[మార్చు]

'రణీశ! యొకనాఁడు రి తనూజులు రతీ;
'శ్వర సాంబ సారణ చారుభాను
'లాదిగా యదుకుమారావలి యుద్యాన, ;
'నమునకతి వైభమున నేగి
'లనొప్ప నిచ్ఛానుర్తులై సుఖలీలఁ;
'రియించి ఘనపిపాలను జెంది
'నెఱిదప్పి సలిల మన్వేషించుచును వేగ;
'చ్చుచో నొకచోట వారిరహిత

(తెభా-10.2-454.1-తే.)[మార్చు]

'కూపమును నందులో నొక కొండవోలె
'విపుల మగు మేని యూసరవెల్లిఁ గాంచి
'చిత్తముల విస్మయం బంది తత్తఱమున
'దాని వెడలించు వేడుక గులుటయును.

(తెభా-10.2-455-చ.)[మార్చు]

' రువిడి పోయి తెచ్చి ఘనపాశచయంబుల నంటఁగట్టి య
'గ్గు రుభుజు లందఱుంగదిసి కోయని యార్చుచు దాని నెమ్మెయిం
' లఁగఁ దీయలేక దగ ట్టముగా మది దుట్టగిల్ల నొం
'డొ రు గడవంగ వే చని పయోరుహనాభున కంతఁ జెప్పినన్.

(తెభా-10.2-456-ఉ.)[మార్చు]

వి ని సరసీరుహాక్షుఁ డతివిస్మితుఁడై జలశూన్యకూప మ
ల్ల కదియంగ నేఁగి కృకలాసము నొక్కతృణంబుఁ బోలె గొ
బ్బ వెడలించె వామకరద్మమునన్నది యంతలోనఁ గాం
రుచి మేనఁ గల్గు పురుత్వముతోఁ బొడసూపి నిల్చినన్.

(తెభా-10.2-457-వ.)[మార్చు]

చూచి కృష్ణుం డతని వృత్తాంతం బంతయు నెఱింగియు నక్కడి జనంబులుం గుమారవర్గంబును దెలియుకొఱకు నతనిచేత తద్వృత్తాంతం బంతయు నెఱింగించువాఁడై యిట్లనియె.

(తెభా-10.2-458-చ.)[మార్చు]

దురు రత్నభూషణ నికాయుఁడవై మహనీయమూర్తివై
నుపమకీర్తిశోభితుఁడవై విలసిల్లుచు ధాత్రిమీఁదఁ బెం
పొ రిన నీకు నేమిగతి నూసరవెల్లితనంబు చొప్పడెన్
వి నిది చోద్య మయ్యె సువివేకచరిత్ర! యెఱుంగఁ జెప్పుమా!

(తెభా-10.2-459-క.)[మార్చు]

ని యడిగిన మురరిపు పద
జంబులఁ దన కిరీటరమణు లొరయన్
వి యమున మ్రొక్కి యిట్లను
మోదముతోడ నిటల టితాంజలియై.

(తెభా-10.2-460-తే.)[మార్చు]

విశ్వసంవేద్య! మహిత! యీ విశ్వమందుఁ
బ్రకటముగ నీ వెఱుంగని దొకటి గలదె
యైన నాచేత విన నిష్టయ్యె నేని
వధరింపుము వినిపింతు నంబుజాక్ష!

(తెభా-10.2-461-శా.)[మార్చు]

నిక్ష్వాకుతనూజుఁడన్ నృగుఁడు నా నేపారు భూపాలుఁడన్;
దీ వ్రాతము నర్థిఁ బ్రోచుచు ధరిత్రీనాయకుల్‌ గొల్చి స
మ్మా నింపం జతురంత భూభరణసార్థ్యుండనై సంతత
శ్రీ నిండారినవాఁడ నుల్లసిత కీర్తిస్ఫూర్తి శోభిల్లఁగన్.

(తెభా-10.2-462-చ.)[మార్చు]

లుకులఁ దన్నుఁ దాఁ బొగడఁ బాతక మందు రటుండెఁ దారకా
లి సికతావ్రజంబు హిమవారికణంబులు లెక్క పెట్టఁగా
వడుఁ గాని యేను వసుధామరకోటికి దాన మిచ్చు గో
వు గణుతింప ధాతయునునోపఁడు మాధవ! యేమిసెప్పుదున్?

(తెభా-10.2-463-వ.)[మార్చు]

అదియునుం గాక.

(తెభా-10.2-464-చ.)[మార్చు]

పొ లుచు సువర్ణశృంగఖురముల్‌ దనరం దొలిచూలులై సువ
త్స లు గల పాఁడియావుల నుదాత్త తపోవ్రత వేదపాఠముల్‌
లిగి కుటుంబులై విహితర్మములం జరియించు పేద వి
ప్రు కు సదక్షిణంబుగ విభూతి దలిర్పఁగ నిత్తు, నచ్యుతా!

(తెభా-10.2-465-వ.)[మార్చు]

మఱియును న్యాయసముపార్జిత విత్తమ్ములగు గో భూ హిరణ్య రత్న నివాస రథ హస్తి వాజి కన్యా సరస్వతీ వస్త్ర తిల కాంచన రజత శయ్యాది బహువిధ దానంబు లనూనంబులుగా ననేకంబులు సేసితిఁ, బంచమహాయజ్ఞంబు లొనరించితి, వాపీ కూప తటాక వన నిర్మాణంబులు సేయించితి, నివ్విధంబునం జేయుచో నొక్కనాఁడు.

(తెభా-10.2-466-క.)[మార్చు]

ఘా! మునుపడఁ గశ్యపుఁ
ను విప్రున కే నకల్మషాత్ముఁడనై యి
చ్చి గోవు దప్పి నా మం
ను గలసినఁ దెలియలేక గ నా గోవున్.

(తెభా-10.2-467-క.)[మార్చు]

ఒం డొక భూమీసురకుల
మం నునకు దాన మీయ సలక యా వి
ప్రుం డా గోవుంగొని చను
చుం డన్ మును ధారగొన్న యుర్వీసురుఁడున్.

(తెభా-10.2-468-క.)[మార్చు]

ది రోష మొదవ దోవతి
లిన బిగియించుకొనుచు డిఁ గది సిది నా
మొ వు; నడివీథి దొంగిలి
లక కొనిపోయె; దిట్టివారుం గలరే?

(తెభా-10.2-469-చ.)[మార్చు]

వుడు నాతఁ డిట్లనియె నాతనితో నిపు డేను దీని నీ
పతిచేత ధారగొని సాధుగతిం జన నీది యంట యె
ట్ల'''''? ని'న నతండు నేనును ధరాధిపుచే మును ధారగొన్న యా
ని వినిపింప నిద్దఱకు య్యె నపార వివాద మచ్చటన్.

(తెభా-10.2-470-వ.)[మార్చు]

ఇట్లు విప్రు లిద్దఱుం దమలో నంతకంతకు మచ్చరంబు పెచ్చుపెరిఁగి కలహించి నాయున్నయెడకుం జనుదెంచిరి; మున్ను నా చేత గోదానంబు గొన్న బ్రాహ్మణుం డిట్లనియె.

(తెభా-10.2-471-సీ.)[మార్చు]

నుజేంద్ర! ప్రజ లధర్మప్రవర్తనముల;
డవకుండఁగ నాజ్ఞ డపు నీవు
నమున నే ధర్మని యాచరించితి? ;
మును నాకు నిచ్చిన మొదవు దప్పి
వచ్చి నీ మందలోఁ జొచ్చిన నిప్పు డీ;
భూసురునకు ధారవోసి యిచ్చి
గవు మాలితివి, దావు నపహర్తవు;
నైన ని న్నేమందు? వనినాథ!

(తెభా-10.2-471.1-తే.)[మార్చు]

యనిన మాటలు సెవులు సోఁకినఁ గలంగి
భూసురోత్తమ! యజ్ఞానపూర్వకముగ
నిట్టి పాపంబు దొరసె నే నెఱిఁగి సేయఁ
గొనుము నీ కిత్తు నొక లక్ష గోధనంబు.

(తెభా-10.2-472-క.)[మార్చు]

ని మఱియును నవ్విప్రుని
సు యోక్తుల ననునయింపుచును నిట్లంటిన్
నుఁ గావు, నరకకూపం
బు నఁ బడఁగా జాలఁ విప్రపుంగవ! యనుచున్.

(తెభా-10.2-473-తే.)[మార్చు]

ఎంత వేఁడిన మచ్చరంబంత పెరిఁగి
మొదల నాకిచ్చి నట్టి యీమొదవె కాని
యెనయ నీ రాజ్యమంతయు నిచ్చితేని
నొల్ల నని విప్రుఁ డచ్చట నుండ కరిగె.

(తెభా-10.2-474-వ.)[మార్చు]

అ ట్లతం డరిగిన నా రెండవ బ్రాహ్మణునిం బ్రార్థించిన నతండును జలంబు డింపక పదివే లేఱికోరిన పాఁడిమొదవుల నిచ్చిననైనను “దీనిన కాని యొల్ల” నని నిలువక చనియె; నంతఁ గాలపరిపక్వం బైన నన్ను దండధరకింకరులు గొనిపోయి వైవస్వతు ముందటం బెట్టిన నతండు నన్నునుద్దేశించి యిట్లనియె.

(తెభా-10.2-475-మ.)[మార్చు]

' నుజేంద్రోత్తమ! వంశపావన! జగన్మాన్యక్రియాచార! నీ
' దానక్రతుధర్మముల్‌ త్రిభువనఖ్యాతంబులై చెల్లెడిన్,
'ము ను దుష్కర్మఫలంబు నొంది పిదపం బుణ్యానుబంధంబులై
' ను సౌఖ్యంబులఁ బొందు; పద్మజునియాజ్ఞం ద్రోవఁగావచ్చునే?

21-05-2016: :
గణనాధ్యాయి 10:59, 12 డిసెంబరు 2016 (UTC)