పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ద్వితీయాశ్వాసము)/ప్రద్యుమ్న జన్మంబు

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

ప్రద్యుమ్న జన్మంబు

తెలుగు భాగవతము (పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ద్వితీయాశ్వాసము)/ప్రద్యుమ్న జన్మంబు)
రచయిత: పోతన


(తెభా-10.2-3-ఉ.)[మార్చు]

తా రసాక్షునంశమున ర్పకుఁ డీశ్వరుకంటిమంటలం
దా మును దగ్ధుఁడై; పిదపఁ త్పరమేశుని దేహలబ్ధికై
వే ఱు నిష్ఠఁ జేసి హరి వీర్యమునం బ్రభవించె రుక్మిణీ
కా మిని గర్భమం దసురఖండను మాఱట మూర్తియో యనన్.

(తెభా-10.2-4-వ.)[మార్చు]

అంత నా డింభకుండు ప్రద్యుమ్నుండను పేర విఖ్యాతుం డయ్యె; నా శిశువు సూతికాగృహంబునం దల్లి పొదిఁగిట నుండం దనకు శత్రుండని యెఱింగి శంబరుండను రాక్షసుండు దన మాయాబలంబునం గామరూపి యై వచ్చి కొనిపోయి సముద్రంబులో వైచి జనియె; నంత నా శాబకుండు జలధిజలంబున దిగఁబడ నొడిసి యొక మహామీనంబు మ్రింగె; నందు.

(తెభా-10.2-5-క.)[మార్చు]

జా లిఁ బడి పాఱు జలచర
జా లంబులఁ బోవనీక ని రోషాగ్ని
జ్వా లు నిగుడఁగ నూరక
జా లంబులు వైచిపట్టు జాలరు లంతన్.

(తెభా-10.2-6-వ.)[మార్చు]

సముద్రంబులోన నా మీనంబును దత్సహచరంబులైన మీనంబులనుం బట్టికొని తెచ్చి శంబరునకుం గానికఁగా నిచ్చిన నతండు “వండి తెండ”ని మహానస గృహంబునకుం బంచిన.

(తెభా-10.2-7-క.)[మార్చు]

రా జునగరి యడబాలలు
రా జీవముకడుపు వ్రచ్చి రాజనిభాస్యున్
రా శిశువుఁ గని చెప్పిరి
రా జీవదళాక్షియైన తికి నరేంద్రా!

(తెభా-10.2-8-వ.)[మార్చు]

అంత నారదుండు వచ్చి బాలకుని జన్మంబును శంబరోద్యోగంబును మీనోదరప్రవేశంబునుం జెప్పిన విని యా రతి మాయావతి యను పేర శంబరునియింట బాతివ్రత్యంబు సలుపుచు దహన దగ్ధుండయిన తన పెనిమిటి శరీర ధారణంబు సేయుట కెదురు చూచుచున్యది గావున; నయ్యర్భకుండు దర్పకుండని తెలిసి మెల్లన పుత్రార్థినియైన తెఱంగున శంబరుని యనుమతి వడసి సూపకారుల యొద్ద నున్న పాపనిం దెచ్చి పోషించుచుండె; నా కుమారుండును శీఘ్రకాలంబున నారూఢ యౌవనుండై.

(తెభా-10.2-9-క.)[మార్చు]

సుం ర మగు తన రూపము
సుం రు లొకమాఱు దేఱి చూచినఁ జాలున్
సౌం ర్య మేమి చెప్పను?
బొం దెద మని డాయు బుద్ధిఁ బుట్టించు, నృపా!

(తెభా-10.2-10-సీ.)[మార్చు]

క్కని వారల క్కఁ దనంబున;
కుపమింప నెవ్వండు యోగ్యుఁ డయ్యె!
మిక్కిలి తపమున మెఱయు నంబికకు నై;
శంకరు నెవ్వండు గము సేసె!
బ్రహ్మత్వమును బొంది రఁగు విధాతను;
వాణికై యెవ్వఁడు వావి సెఱిచె!
వేయిడాఁగులతోడి విబుధ లోకేశుని;
మూర్తికి నెవ్వఁడు మూల మయ్యె!

(తెభా-10.2-10.1-తే.)[మార్చు]

మునుల తాలిమి కెవ్వఁడు ముల్లు సూపు
గల మగువల నెవ్వండు రులుకొలుపు!
గుసుమధనువున నెవ్వండు కొను విజయము
చిగురువాలున నెవ్వండు సిక్కువఱుచు?

(తెభా-10.2-11-వ.)[మార్చు]

అని తన్ను లోకులు వినుతించు ప్రభావంబులు గలిగి పద్మదళలోచనుండును, బ్రలంబబాహుండును, జగన్మోహనాకారుండును నైన పంచబాణునిం గని లజ్జాహాస గర్భితంబు లైన చూపులం జూచుచు మాయావతి సురత భ్రాంతిఁ జేసినం జూచి ప్రద్యుమ్నుం డిట్లనియె.

(తెభా-10.2-12-మత్త.)[మార్చు]

నా నూభవుఁ డీతఁ డంచును నాన యించుక లేక యో!
మా త! నీ విది యేమి? నేఁ డిటు మాతృ భావము మాని సం
ప్రీ తిఁ గామినిభంగిఁ జేసెదు పెక్కు విభ్రమముల్‌? మహా
ఖ్యా వృత్తికి నీకు ధర్మము గాదు మోహము సేయఁగాన్.

(తెభా-10.2-13-వ.)[మార్చు]

అనిన రతి యిట్లనియె; “నీవు నారాయణనందనుండ వైన కందర్పుండవు; పూర్వకాలంబున నేను నీకు భార్య నైన రతిని; నీవు శిశువై యుండునెడ నిర్దయుండై దొంగిలి తల్లిం దొఱంగఁజేసి శంబరుండు కొని వచ్చి నిన్ను నీరధిలో వైచిన నొక్క మీనంబు మ్రింగె; మీనోదరంబు వెడలి తీవు; మీఁదటి కార్య మాకర్ణింవుము.

(తెభా-10.2-14-క.)[మార్చు]

మా యావి వీఁడు దుర్మతి
మా యఁడు సంగరములం దర్త్యుల గెలుచున్
మా యికరణమున వీనిన్
మా యింపుము మోహనాది మాయలచేతన్.

(తెభా-10.2-15-మత్త.)[మార్చు]

పా కర్ముఁడు వీఁడు నిన్నిఁటఁ ట్టి తెచ్చిన లేచి నా
పా పఁ డెక్కడఁ బోయెనో? సుతుఁ బాపితే విధి యంచుఁ దా
గ్రే పుఁ బాసిన గోవు భంగిని ఖిన్నయై పడి గాఢ సం
తా యై నిను నోఁచి కాంచిన ల్లి కుయ్యిడ కుండునే?

(తెభా-10.2-16-వ.)[మార్చు]

అనిపలికి మాయావతి మహానుభావుండైన ప్రద్యుమ్నునికి సర్వ శత్రు మాయా వినాశిని యైన మహామాయ విద్య నుపదేశించె; నివ్విధంబున.

21-05-2016: :
గణనాధ్యాయి 10:15, 12 డిసెంబరు 2016 (UTC)