పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ద్వితీయాశ్వాసము)/పారిజాతాపహరణంబు

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

పారిజాతాపహరణంబు

తెలుగు భాగవతము (పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ద్వితీయాశ్వాసము)/పారిజాతాపహరణంబు)
రచయిత: పోతన


(తెభా-10.2-215-మ.)[మార్చు]

రి కేలం బెకలించి తెచ్చి భుజగేంద్రారాతిపైఁ బెట్టె సుం
గంధానుగతభ్రమద్భ్రమరనావ్రాతముం బల్లవాం
కు శాఖా ఫల పర్ణ పుష్ప కలికా గుచ్ఛాది కోపేతమున్
గి రిభిత్త్రాతముఁ బారిజాతముఁ ద్రిలోకీయాచకాఖ్యాతమున్.

(తెభా-10.2-216-వ.)[మార్చు]

ఇట్లు పారిజాతంబును హరించి యదువల్లభుండు వల్లభయుం దానును విహగవల్లభారూఢుండై చనుచున్న సమయంబున.

(తెభా-10.2-217-సీ.)[మార్చు]

రకాసురుని బాధ లఁగి గోవిందుని;
డ కేగి తత్పాదమలములకుఁ
న కిరీటము సోఁక దండప్రణామము;
ల్గావింప నా చక్రి రుణ సేసి
నుదెంచి భూసుతు మయించి తనవారిఁ;
న్ను రక్షించుటఁ లఁప మఱచి
యింద్రుండు బృందారకేంద్రత్వ మదమునఁ;
ద్మలోచన! పోకు పారిజాత

(తెభా-10.2-217.1-ఆ.)[మార్చు]

రువు విడువు మనుచుఁ దాఁకె నడ్డము వచ్చి
ఱిమి సురలు నట్లు దాఁకి రకట!
యెఱుకవలదె నిర్జరేంద్రత కాల్పనే?
సురల తామసమును జూడ నరిది.

(తెభా-10.2-218-వ.)[మార్చు]

ఇట్లు దనకు నొడ్డారించి యడ్డంబు వచ్చిన నిర్జరేంద్రాదుల నిర్జించి తన పురంబునకుం జని, నిరంతర సురభి కుసుమ మకరంద మాధురీ విశేషంబులకుఁ జొక్కిచిక్కక నాకలోకంబుననుండి వెంటనరుగుదెంచు తుమ్మెదలకు నెమ్మిదలంచుచున్న పారిజాతమ్ము నాశ్రితపారిజాతుం డయిన హరి మహాప్రేమాభిరామ యగు సత్య భామతోఁ గ్రీడించు మహోద్యానంబున సంస్థాపించి, నరకాసురుని యింటం దెచ్చిన రాజకన్యక లెందఱందఱకు నన్నినివాసంబులు గల్పించి గృహోపకరణంబులు సమర్పించి.

21-05-2016: :
గణనాధ్యాయి 10:30, 12 డిసెంబరు 2016 (UTC)