పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ద్వితీయాశ్వాసము)/ద్వివిదుని వధించుట

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

ద్వివిదునివధించుట

తెలుగు భాగవతము (పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ద్వితీయాశ్వాసము)/ద్వివిదుని వధించుట)
రచయిత: పోతన


(తెభా-10.2-538-క.)[మార్చు]

భద్రుఁ డప్రమేయుం
ఘుఁ డనంతుండు నతని ద్భుతకర్మం
బు లు వినియు, దనియ దింకను
దె లియఁగ నా కానతిమ్ము దివ్యమునీంద్రా!

(తెభా-10.2-539-వ.)[మార్చు]

అనిన రాజునకు శుకుం డిట్లనియె.

(తెభా-10.2-540-క.)[మార్చు]

నాయక! విను సుగ్రీ
వు ని సచివుఁడు మైందునకు సహోదరుఁ డనఁగా
వి నుతికి నెక్కిన ద్వివిదుం
ను ప్లవగుఁడు నరకసఖ్యుఁ తిదర్పితుఁడై.

(తెభా-10.2-541-సీ.)[మార్చు]

చెలికానిపగఁ దీర్పఁ దలఁచి కృష్ణుం డేలు;
పురములు జనపదంబులు దహించి
రి దుపవన సరోరములు గోరాడి;
మందలఁ గొందలమందఁ జేసి
ప్రాసాదములు ద్రొబ్బి రిఖలు మాయించి;
తురంగబలముల మయఁ జేసి
పురుషుల సతులను భూధరగుహలలోఁ;
బెట్టి వాకిలి గట్టి బిట్టు నొంచి

(తెభా-10.2-541.1-తే.)[మార్చు]

ఫలిత తరువులఁ ద్రుంచి సాధుల నలంచి
కోట లగలించి పడుచుల నీట ముంచి
రణి నిబ్భంగిఁ బెక్కుబాలఁ జలంబు
రఁగఁజేయుచు నొకనాఁడు ప్లవగవరుఁడు.

(తెభా-10.2-542-క.)[మార్చు]

తుర మృదు గీతరవ ము
న్న తి వీతెంచినఁ జెలంగి గచరుఁ డా రై
గిరి కందరమున కా
తిగతిఁ జని యందు నెత్తమాడెడు వానిన్.

(తెభా-10.2-543-చ.)[మార్చు]

లితవినీలవస్త్రుని విలాసవతీయుతుఁ జంద్రచంద్రికా
లితమహోన్నతాంగు మణికాంచనదివ్యవిభూషణోన్నతున్
వి సితవారుణీసమదవిహ్వలలోచనుఁ గాంచె సీరని
ర్ద ళితరిపుక్షితీశనిజధాముని రాముని కామపాలునిన్.

(తెభా-10.2-544-సీ.)[మార్చు]

నుఁగొని తత్పురోమభూమిరుహశాఖ;
లెక్కి యూఁచుచుఁ జాల వెక్కిరించుఁ;
గికురించుచును బం డ్లిగిల్చి చూపుచు వెసఁ;
గొమ్మకొమ్మకు నుఱుకుచు నదల్చుఁ;
దోఁక నూరక మేను సోఁకఁగ నులివెట్టు;
వెడవెడ నాలుక వెడలఁబెట్టు;
బరుల నఖంబుల గిరగిర గోఁకుచుఁ;
బొరిఁబొరి ఫలములు గఱచి వైచు;

(తెభా-10.2-544.1-తే.)[మార్చు]

గోళ్ళు తెగ గొర్కి యుమియును; గుదము సూపు;
లసి మర్కటజాతి యిప్పగిదిఁ జేయఁ
గోపమున హలధరుఁ డొక గుండు వైవ
దానిఁ దప్పించుకొని ప్రల్లమున నతని.

(తెభా-10.2-545-క.)[మార్చు]

గి యాసవకలశముఁ గొని
' తీరుహశాఖ యెక్కి చాపలమున న
జ్జ తిపయి వైచెఁ దద్ఘట
' లగఁ; నది చూచి కోప గ్గల మొదవన్.

(తెభా-10.2-546-వ.)[మార్చు]

మఱియును.

(తెభా-10.2-547-క.)[మార్చు]

సీ రినిఁ దన మనమున నొక
'చీ రికిఁ గైకొనక కదిసి చీరలు చింపన్
వా క దా భువిజనములఁ
'గా రించుట మాన్పఁ దలఁచి నకుపితుం డై.

(తెభా-10.2-548-వ.)[మార్చు]

ఇట్లు కోపోద్దీపితమానసుండై కనుంగొని హలాయుధుం డప్పుడు

(తెభా-10.2-549-చ.)[మార్చు]

'ము లముఁ దీవ్రశాతహలమున్ ధరియించి సమస్తచేతన
'గ్ర నమునాఁడు పొంగు లయకాలునిభంగి నదల్చి నిల్వ; వా
' దృశవిక్రమక్రమవిహార మెలర్ప సమీపభూజమున్
'వె సఁ బెకలించి మస్తకము వ్రేసెఁ జలంబు బలంబు చొప్పడన్.

(తెభా-10.2-550-వ.)[మార్చు]

ఇట్లు వ్రేయ బలుం డప్పుడు.

(తెభా-10.2-551-చ.)[మార్చు]

' వడి దండతాడితమహోరగుభంగిఁ గడంగి వీర సా
' మున నేఁచి హేమకటకంబుల నొప్పు సునందనామ భీ
' ముసలంబునన్ ద్వివిదుకంఠము వ్రేసినఁ బొల్చె వాఁడు జే
'గు రుగల కొండచందమునఁ గోయని యార్చి సురల్‌ నుతింపఁగన్

(తెభా-10.2-552-మత్త.)[మార్చు]

'అం వాఁ డొక యింత మూర్ఛిలి యంతలోఁ దెలివొంది దు
'ర్దాం భూరిభుజావిజృంభణుఁడై మహీజము పూన్చి దై
'త్యాం కాగ్రజు వ్రేసె; వ్రేసిన నాగ్రహంబున దాని నిం
'తిం లై ధర రాలఁ జేసె నహీనవిక్రమశాలియై.

(తెభా-10.2-553-క.)[మార్చు]

ఱియును జల ముడుగక వెసఁ
' రుచరుఁ డొకతరువు వ్రేయఁ దాలాంకుఁ డనా
మునఁ దునిమిన వెండియుఁ
'దొ రఁగించెఁ గుజంబు లతఁడు దోడ్తోఁ దునుమన్.

(తెభా-10.2-554-క.)[మార్చు]

చందంబున వనచరుఁ
'డే చి మహీరుహచయంబు లెల్లను హలిపై
వై చి యవి శూన్య మగుటయుఁ
'జూ చి శిలావృష్టిఁ గురిసె సుర లగ్గింపన్.

(తెభా-10.2-555-క.)[మార్చు]

లుఁ డపుడు ఱాలు తుమురై
'యి రాలఁగఁ జేసి యార్వ నే వుడుగక యా
లిముఖుఁడు తాలసన్నిభ
'ము యిన నిజబాహుదండముల నుగ్రుండై.

(తెభా-10.2-556-క.)[మార్చు]

డిఁ బిడుగుఁ బోని పిడికిటఁ
'బొ డిచిన వడి సెడక బలుఁడు ముసలము హలమున్
వి డిచి ప్లవంగుని మెడఁ గడు
'వె వెడ బిగియించె గ్రుడ్లు వెలి కుఱుకంగన్.

(తెభా-10.2-557-క.)[మార్చు]

నమునఁ జెవుల రుధిరము
'మె డును దొరఁగంగ వాఁడు మేదినిమీఁదం
దికిలఁబడి యొక యింతయు
'మె లక మిడుకంగ లేక మృతిఁ బొందె నృపా!

(తెభా-10.2-558-తే.)[మార్చు]

'వానిపాటున కప్పుడు నసమేత
'గుచు నా శైలరాజ మల్లల్ల నాడె;
'సురగణంబులు రాముపై సురభి కుసుమ
'వృష్టి గురియించి రతుల సంతుష్టి మెఱసి.

(తెభా-10.2-559-వ.)[మార్చు]

ఇవ్విధంబున భువనకంటకుండైన దుష్టశాఖామృగేంద్రుని వసుంధరకుం బలిచేసి సకల జనంబులుఁ బరమానందకందళిత హృదయారవిందులై తన్ను నందింప నయ్యదునందనుండు నిజ నగరంబున కరుదెంచె" నని శుకుండు వెండియు నమ్మనుజ పతి కిట్లనియె.

21-05-2016: :
గణనాధ్యాయి 11:02, 12 డిసెంబరు 2016 (UTC)