పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ద్వితీయాశ్వాసము)/కాశీరాజు వధ

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

కాశీరాజు వధ

తెలుగు భాగవతము (పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ద్వితీయాశ్వాసము)/కాశీరాజు వధ)
రచయిత: పోతన


(తెభా-10.2-524-చ.)[మార్చు]

' వక కాశికావిభుని స్తక ముద్ధతిఁ ద్రుంచి బంతి కై
' డి నది పింజ పింజ గఱవన్ విశిఖాళి నిగుడ్చి వాని యే
'లె డి పురిలోన వైచె నవలీల మురాంతకుఁ డిట్లు వైరులం
' డఁగి జయించి చిత్తమునఁ గౌతుకముం జిగురొత్త నత్తఱిన్.

(తెభా-10.2-525-క.)[మార్చు]

సు గంధర్వ నభశ్చర
' రుడోరగ సిద్ధ సాధ్యణము నుతింపన్
లి చనుదెంచి హరి నిజ
'పు మున సుఖముండె నతి విభూతి దలిర్పన్.

(తెభా-10.2-526-క.)[మార్చు]

జోదరు చిహ్నంబులు
'గొ కొని ధరియించి పౌండ్రకుఁడు మచ్చరియై
వరతము హరి దన తలఁ
'పు నఁ దగులుటఁ జేసి ముక్తిఁ బొందె నరేంద్రా!

(తెభా-10.2-527-సీ.)[మార్చు]

'క్కడఁ గాశిలో నా రాజు మందిరాం;
'ణమునఁ గుండల లిత మగుచుఁ
'డి యున్న తలఁ జూచి పౌరజనంబులు;
'మ రాజు తలయ కాఁ గ నెఱింగి
'చెప్పిన నా నృపు జీవితేశ్వరులును;
'సుతులు బంధువులును హితులు గూడి
'మొనసి హాహాకారమున నేడ్చి; రత్తఱిఁ;
'త్తనూభవుఁడు సుక్షిణుండు

(తెభా-10.2-527.1-తే.)[మార్చు]

'వెలయఁ దండ్రికిఁ బరలోకవిధు లొనర్చి
'నకు ననిలో వధించిన క్రపాణి
'డరి మర్దింపఁ దగు నుపాయంబు దలఁచి
'చతురుఁ డగు నట్టి తన పురోహితునిఁ బిలిచి.

(తెభా-10.2-528-క.)[మార్చు]

డుం దానును జని పశు
' తిపద సరసిజములకును బ్రమదముతో నా
తుఁడై యద్దేవుని బహు
' తులం బూజింప నతఁడు రుణాన్వితుఁడై.

(తెభా-10.2-529-క.)[మార్చు]

మె చ్చితి నే వర మైనను
'ని చ్చెద నను వేఁడు మనిన నీశ్వర! నన్నున్
చ్చిక రక్షింతువు పొర
'పొ చ్చెము సేయక మహేశ! పురహర! యభవా!

(తెభా-10.2-530-క.)[మార్చు]

దే వా! మజ్జనకుని వసు
'దే వాత్మజుఁ డాజిలో వధించెను, నే నా
గో విందుని ననిలోపల
'నే విధమున గెలుతు నానతీవె పురారీ!

(తెభా-10.2-531-తే.)[మార్చు]

'నిన శంకరుఁ డతనికి నియె ననఘ!
'నీవు ఋత్విజులును భూసురావళియును
'బ్రీతి నభిచార మొనరింప భూతయుక్తుఁ
'గుచు ననలుండు దీర్చు నీ భిమతంబు.

(తెభా-10.2-532-తే.)[మార్చు]

'నిన నా చంద్రమౌళి వాక్యముల భంగి
'భూరినియమముతో నభిచారహోమ
'మొనరఁ గావింప నగ్ని యథోచితముగఁ
'జెలఁగు దక్షిణవలమాన శిఖల వెలిఁగె.

(తెభా-10.2-533-వ.)[మార్చు]

అందుఁ దామ్రశ్మశ్రుకేశకలాపంబును, నశనిసంకాశంబులైన నిడుద కోఱలును, నిప్పులుప్పతిల్లు చూడ్కులును, ముడివడిన బొమలును, జేవురించిన మొగంబును గలిగి కృత్య యతి రౌద్రాకారంబునఁ బ్రజ్వరిల్లుచుఁ గుండంబు వెలువడి యనుదిన నిహన్య మాన ప్రాణిరక్తారుణ మృత్యుకరవాలంబు లీలం జూపట్టు నాలుకను సెలవుల నాకికొనుచు నగ్నికీలాభీలంబగు శూలంబు గేలం దాల్చి భువనకోలాహలంబుగా నార్చుచు, నుత్తాల తాలప్రమాణ పాదద్వయ హతులం దూలు పెంధూళి నింగిమ్రింగ, భూతంబులు సేవింప, నగ్నవేషయై, నిజవిలోచన సంజాత సముద్ధూత నిఖిల భయంకర జ్వాలికాజాలంబున దిశాజాలంబు నోలిం బ్రేల్చుచు, నుద్వేగగమనంబున నగధరు నగరంబున కరుగుదేరఁ, బౌరజనంబులు భయాకులమానసులై దావదహనునిం గని పఱచు వన మృగంబులచాడ్పునం బఱచి, సుధర్మాభ్యంతరంబున జూదమాడు దామోదరునిం గని “రక్షరక్షేతి”రవంబుల నార్తులయి “కృష్ణ! కృష్ణ! పెనుమంటలం బురంబు గాల్పం బ్రళయాగ్ని సనుదెంచె” నన వారిం జూచి “యోడకోడకుఁ” డని భయంబు నివారించి, సర్వరక్షకుండైన పుండరీకాక్షుండు జగదంతరాత్ముండు గావునం దద్వృత్తాంతం బంతయుఁ దన దివ్యచిత్తంబున నెఱింగి కాశీరాజపుత్త్ర ప్రేరితయైన యమ్మహాకృత్యను నిగ్రహింపం దలంచి నిజపార్శ్వవర్తి యయియున్న యద్దివ్యసాధనంబు గనుంగొని యప్పుడు.

(తెభా-10.2-534-సీ.)[మార్చు]

భీమమై బహుతీవ్రధామమై హతరిపు;
స్తోమమై సుమహితోద్దామ మగుచుఁ
జండమై విజితమార్తాండమై పాలితా;
జాండమై విజయప్రకాండ మగుచు
దివ్యమై నిఖిలగంతవ్యమై సుజన సం;
భావ్యమై సద్భక్త సేవ్య మగుచు
నిత్యమై నిగమసంస్తుత్యమై వినమితా;
దిత్యమై నిర్జితదైత్య మగుచు

(తెభా-10.2-534.1-తే.)[మార్చు]

విలయసమయ సముద్భూత విపులభాస్వ
ళికలోచన లోచనాల సహస్ర
టిత పటుసటాజ్వాలికా టుల సత్త్వ
యదచక్రంబు కృత్యపైఁ బంపె శౌరి.

(తెభా-10.2-535-వ.)[మార్చు]

అదియును, బ్రళయవేళాసంభూత జీమూతసంఘాత ప్రభూత ఘుమఘుమాటోప నినదాధరీకృత మహాదుస్సహ కహకహ నిబిడనిస్వననిర్ఘోషపరిపూరిత బ్రహ్మాండకుహరంబును, నభ్రంలిహ కీలాసముత్కట పటు చిటపట స్ఫుట ద్విస్ఫులింగచ్ఛటాభీలంబును, సకలదేవతాగణ జయజయశబ్దకలితంబును, ననంతతేజో విరాజితంబునునగుచుం గదిసినంబంటింపక కంటగించుకృత్యను గెంటి వెంటనంటిన నది తన తొంటిరౌద్రంబు విడిచి మరలి కాశీపురంబు సొచ్చి పౌరలోకంబు భయాకులతంబొంది వాపోవ, రోషభీషణాకారంబుతో నప్పుడు ఋత్విఙ్నికాయయుతంబుగ సుదక్షిణుని దహించె; నత్తఱిఁ జక్రంబును దన్నగరంబు సౌధ ప్రాకార గోపురాట్టాల కాది వివిధ వస్తు వాహన నికరంబుతో భస్మంబు గావించి మరలి యమరులు వెఱఁగందఁ గమలలోచన పార్శ్వవర్తి యై నిజ ప్రభాపుంజంబు వెలుఁగొందఁ గొల్చియుండె" నని చెప్పి; మఱియు నిట్లనియె.

(తెభా-10.2-536-క.)[మార్చు]

ము రిపు విజయాంకితమగు
రితము సద్భక్తిఁ దగిలి దివిన వినినన్
దు రితములఁ బాసి జను లిహ
సౌఖ్యము లతనిచేతఁ డయుదు రధిపా!

(తెభా-10.2-537-వ.)[మార్చు]

అనిన శుకయోగికి రాజయోగి యిట్లనియె.

21-05-2016: :
గణనాధ్యాయి 11:02, 12 డిసెంబరు 2016 (UTC)