పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ద్వితీయాశ్వాసము)/దుర్యోధ గదా విధ్యాభ్యాసము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

దుర్యోధగదావిధ్యాభ్యాసము

తెలుగు భాగవతము (పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ద్వితీయాశ్వాసము)/దుర్యోధ గదా విధ్యాభ్యాసము)
రచయిత: పోతన


(తెభా-10.2-94-క.)[మార్చు]

మున గాంధారేయుఁడు ' లిత గదాయుద్ధగౌశము నేర్చెఁ దగన్
లిచే నాశ్రితనిర్జర
లిచేఁ ద్రైలోక్యవీరటగణబలిచేన్.

(తెభా-10.2-95-వ.)[మార్చు]

అటఁ గృష్ణుండును ద్వారకానగరంబునకుం జని శతధన్వుని మరణంబును మణి లేకుండుటయును, సత్యభామకుం జెప్పి, సత్యభామాప్రియకరుండు గావున సత్రాజిత్తునకుఁ బరలోకక్రియలు సేయించె; నక్రూర కృతవర్మలు శతధన్వు మరణంబు విని వెఱచి ద్వారకానగరంబు వెడలి బహుయోజన దూరభూమికిం జని; రక్రూరుండు లేమిం జేసి వానలు లేక మహోత్పాతంబులును, శరీర మానస తాపంబులును ద్వారకావాసులకు సంభవించిన నందుల వృద్ధజనులు బెగడి హరి కిట్లనిరి.

(తెభా-10.2-96-సీ.)[మార్చు]

మలాక్ష! వినవయ్య! కాశీశుఁ డేలెడి;
కుంభిని వానలు గురియకున్నఁ
గోరి శ్వఫల్కునిఁ గొనిపోయి యతనికిఁ;
గాందిని యనియెడు న్య నిచ్చి
కాశీవిభుండు సత్కారంబు సేసిన;
వానలు గురిసె నా సుధమీఁద;
నాతని పుత్త్రకుఁ యిన యక్రూరుండు;
నంతటివాఁడు, మహాతపస్వి

(తెభా-10.2-96.1-ఆ.)[మార్చు]

రలి వచ్చెనేని మాను నుత్పాతంబు
లెల్ల; వాన గురియు నీ స్థలమున;
దేవ! యతనిఁ దోడితెప్పింపు; మన్నింపు;
మానవలయుఁ బీడ మానవులకు.

(తెభా-10.2-97-వ.)[మార్చు]

అని పలుకు పెద్దల పలుకు లాకర్ణించి దూతలం బంపి కృష్ణుం డక్రూరుని రావించి పూజించి ప్రియకథలు కొన్ని సెప్పి సకలలోకజ్ఞుండు గావున మృదుమధుర భాషణంబుల నతని కిట్లనియె.

(తెభా-10.2-98-సీ.)[మార్చు]

తా నేగుతఱి శతన్వుండు మణిఁ దెచ్చి;
నీ యింటఁ బెట్టుట నిజము తెలిసి
నాఁడ, సత్రాజిత్తుకుఁ బుత్త్రకులు లేమి;
తనికిఁ గార్యంబు లాచరించి
విత్తంబు ఋణమును విభజించుకొనియెద;
తని పుత్త్రిక లెల్ల, తఁడు పరుల
చేత దుర్మరణంబుఁ జెందినాఁ, డతనికై;
త్కర్మములు మీఁద రుపవలయు,

(తెభా-10.2-98.1-ఆ.)[మార్చు]

ఱి గ్రహింపు మీవ, మా యన్న నను నమ్మఁ
డెలమి బంధుజనుల కెల్లఁ జూపు
య్య! నీ గృహమున హాటక వేదికా
హితమఖము లమరు సంతతమును.

(తెభా-10.2-99-వ.)[మార్చు]

అని యిట్లు సామవచనంబులు హరి పలికిన నక్రూరుండు వస్త్రచ్ఛన్నంబైన మణిం దెచ్చి హరి కిచ్చిన.

(తెభా-10.2-100-ఉ.)[మార్చు]

సం సమంది బంధుజనన్నిధికిన్ హరి దెచ్చి చూపె; న
శ్రాం విభాసమాన ఘృణిజాలపలాయిత భూనభోంతర
ధ్వాం ము, హేమభారచయర్షణవిస్మిత దేవ మానవ
స్వాం ముఁ, గీర్తి పూరితదిశావలయాంతము నా శమంతమున్.

(తెభా-10.2-101-క.)[మార్చు]

క్రాయుధుఁ డీ క్రియఁ దన
క్రూరత్వంబు జనుల కందఱకును ని
ర్వ క్రముగఁ దెలిపి క్రమ్మఱ
క్రూరుని కిచ్చె మణిఁ గృపా కలితుండై.

(తెభా-10.2-102-క.)[మార్చు]

నుఁడు భగవంతుఁ డీశ్వరుఁ
ఘుఁడు మణి దెచ్చి యిచ్చిట్టి కథనమున్
వి నినఁ బఠించినఁ దలఁచిన
నులకు దుర్యశముఁ బాపసంఘముఁ దలఁగున్.

21-05-2016: :
గణనాధ్యాయి 10:23, 12 డిసెంబరు 2016 (UTC)