పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ద్వితీయాశ్వాసము)/ఇంద్రప్రస్థంబున కరుగుట

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

ఇంద్రప్రస్థంబున కరుగుట

తెలుగు భాగవతము (పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ద్వితీయాశ్వాసము)/ఇంద్రప్రస్థంబున కరుగుట)
రచయిత: పోతన


(తెభా-10.2-103-వ.)[మార్చు]

అంత నొక్కనాఁడు పాండవులం జూడ నిశ్చయించి సాత్యకి ప్రముఖ యాదవులు గొలువఁ బురుషోత్తముం డింద్రవ్రస్థపురంబునకుం జనినం బ్రాణంబులంగనిన యింద్రియంబులభంగి వారఖిలేశ్వరుం డైన హరిం గని కౌఁగిలించుకొని; కృష్ణుని దివ్యదేహసంగమంబున నిర్ధూతకల్మషులై యనురాగహాసవిభాసితం బైన ముకుందము ఖారవిందంబు దర్శించి యానందంబు నొందిరి; గోవిందుండును యుధిష్ఠిర భీమసేనుల చరణంబులకు నభివందనంబులు సేసి యర్జును నాలింగనంబున సత్కరించి, నకుల సహదేవులు మ్రొక్కిన గ్రుచ్చియెత్తి, యుత్తమ పీఠంబున నాసీనుండై యుండె; నప్పుడు.

(తెభా-10.2-104-క.)[మార్చు]

చం ద్ఘనకుచభారా
కుం చితయై క్రొత్త పెండ్లికూఁతు రగుట నిం
చిం చుక సిగ్గు జనింపఁగఁ
బాం చాలతనూజ మ్రొక్కెఁ ద్మాక్షునకున్.

(తెభా-10.2-105-వ.)[మార్చు]

అంత సాత్యకి పాండువులచేతం బూజితుండై యొక్క పీఠంబున నాసీనుండై యుండెఁ; దక్కిన యనుచరులును వారిచేతఁ బూజితులై కొలిచి యుండిరి; హరియుం గుంతీదేవి కడకుం జని నమస్కరించి యిట్లనియె.

(తెభా-10.2-106-క.)[మార్చు]

త్తా! కొడుకులుఁ గోడలుఁ
జి త్తానందముగఁ బనులు సేయఁగ నాత్మా
త్తానుగవై యాజ్ఞా
త్తాదులు గలిగి మనుదె మ్మోదమునన్?

(తెభా-10.2-107-చ.)[మార్చు]

వుడుఁ బ్రేమ విహ్వలత నందుచు గద్గదభాషణంబులం
నుఁగవ నశ్రుతోయములు గ్రమ్మఁగఁ గుంతి సుయోధనుండు సే
సి యపచారముం దలఁచి చెందిన దుఃఖములెల్లఁ జెప్పి యా
నుజవిరోధి కిట్లనియెఁ ద్దయుఁ బెద్దఱికంబు సేయుచున్.

(తెభా-10.2-108-సీ.)[మార్చు]

న్న! నీ చుట్టాల రయుదు! మఱవవు;
నీవు పుత్తెంచిన నెమ్మితోడ
మా యన్న యేతెంచి ముఁ జూచి పోయెను;
నిల్చి యున్నారము నీ బలమున;
నా పిన్నవాండ్రకు నాకు దిక్కెవ్వరు;
నేఁ డాదిగా నింక నీవె కాక?
ఖిల జంతువుల కీ వాత్మవు గావునఁ;
రులు నా వారని భ్రాంతి సేయ;

(తెభా-10.2-108.1-తే.)[మార్చు]

య్య! నా భాగ్యమెట్టిదో? నవరతముఁ
జిత్తమున నుండి కరుణ మా చిక్కులెల్లఁ
వాపుచుందువు గాదె! యో! రమపుణ్య!
దుకుమారవరేణ్య! బుధాగ్రగణ్య! .

(తెభా-10.2-109-వ.)[మార్చు]

అనిన యుధిష్ఠిరుం డిట్లనియె.

(తెభా-10.2-110-మ.)[మార్చు]

ట్టఁగ లేరు నిన్నుఁ దమభావము లందు సనందనాదు లే
ట్టుననైన, నట్టి గుణద్రచరిత్రుఁడ వీవు, నేఁడు మా
చు ట్టమ వంచు వచ్చెదవు; చూచెద వల్పులమైన మమ్ము; నే
మె ట్టి తపంబు చేసితి మధీశ్వర! పూర్వశరీర వేళలన్?

(తెభా-10.2-111-వ.)[మార్చు]

అని ధర్మజుండు దన్నుఁ బ్రార్థించిన నింద్రప్రస్థపురంబు వారలకు నయనానందంబు సేయుచు హరి గొన్ని నెలలు వసియించి యుండె; నందొక్కనాఁడు.

21-05-2016: :
గణనాధ్యాయి 10:24, 12 డిసెంబరు 2016 (UTC)