పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ద్వితీయాశ్వాసము)/దంతవక్త్రుని వధించుట

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

దంతవక్త్రుని వధించుట

తెలుగు భాగవతము (పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ద్వితీయాశ్వాసము)/దంతవక్త్రుని వధించుట)
రచయిత: పోతన


(తెభా-10.2-914-వ.)[మార్చు]

ఇట్లు మాయావి యైన సాల్వుండును సౌభకంబును గృష్ణుచేతం బొలియుటఁ గనుంగొని నిజసఖులగు సాల్వ పౌండ్రక శిశుపాలురకుఁ బారలౌకికక్రియలు మైత్రిం గావించి దంతవక్త్రుం డతి భీషణాకారంబుతో నప్పుడు.

(తెభా-10.2-915-చ.)[మార్చు]

'పె పెటఁ బండ్లు గీఁటుచును బెట్టుగ మ్రోయుచుఁ గన్ను గ్రేవలం
'జి చిట విస్ఫులింగములు సింద మహోద్ధతపాదఘట్టన
'న్న నిటనై ధరిత్రి వడఁకాడ వడిన్ గద కేలఁ ద్రిప్పుచున్
'మి మిట మండు వేసవిని మించు దివాకరుఁ బోలి యుగ్రతన్.

(తెభా-10.2-916-చ.)[మార్చు]

' డిఁ జనుదేరఁ జూచి యదుల్లభుఁ డుల్లము పల్లవింప న
'ప్పు డు గదఁ గేలఁబూని రథమున్ రయమొప్పఁగ డిగ్గి యుగ్రతం
' డఁగి విరోధికిన్నెదురుగాఁ జన వాఁ డతినీచవర్తియై
' రుచు నట్టహాసముఖుడై వలచే గదఁ ద్రిప్పుచున్ హరిన్.

(తెభా-10.2-917-వ.)[మార్చు]

కనుంగొని పరిహాసోక్తులుగా నిట్లనియె, “నీవు మదీయభాగ్యంబునం జేసి నేఁడు నా దృష్టిపథంబునకు గోచరుండవైతివి; మిత్రద్రోహివైన నిన్ను మాతులేయుండ వని మన్నింపక దేహంబు నందు వర్తించు నుగ్రవ్యాధి నౌషధాదిక్రియల నివర్తింపఁజేయు చికిత్సకుని చందంబున బంధురూపశాత్రవుండవు గావున నిన్ను దంభోళి సంరంభ గంభీరంబైన మదీయ గదాదండహతిం బరేత నివాసంబున కనిచి మున్ను నీచేత నిహతులైన నాదు సఖుల ఋణంబుఁ దీర్తు” నని దుర్భాషలాడుచు డగ్గఱి.

(తెభా-10.2-918-చ.)[మార్చు]

పె నుగదఁ బూన్చి కృష్ణుతల బెట్టుగ మొత్తిన నంకుశాహతిం
లెడి గంధసింధురముకైవడి సింధురభంజనుండు పెం
పు పవిభాసమానగదఁ బూని మహోగ్రతఁ ద్రిప్పి దంతవ
క్త్రు ని యురముంబగిల్చినఁగుదుల్కొనుచున్రుధిరంబు గ్రక్కుచున్

(తెభా-10.2-919-వ.)[మార్చు]

తత్‌క్షణంబ పర్వతాకారంబగు దేహంబుతో నొఱలుచు నేలంగూలి కేశపాశంబులు సిక్కువడఁ దన్నుకొనుచుఁ బ్రాణంబులు విడిచె; నప్పుడు నిఖిల భూతంబులు నాశ్చర్యంబు వొందఁ దద్గాత్రంబున నుండి యొక్క సూక్ష్మతేజంబు వెలువడి గోవిందునిదేహంబుఁ బ్రవేశించె; నయ్యవసరంబున నగ్రజు మరణంబు గనుంగొని కుపితుండై కనుఁగవల నిప్పులుప్పతిల్ల విదూరథుండు గాలానల జ్వాలాభీలకరాళంబైన కరవాలంబును బలకయుం గేలందాల్చి దామోదరు దెసకుఁ గవయుటయుం గనుంగొని.

(తెభా-10.2-920-చ.)[మార్చు]

' రుహలోచనుండు నిజసాధనమై తనరారు చక్రమున్
' నుగఁ బూన్చి వైవ నది వారక వాని శిరంబు ద్రుంచె న
'బ్బ లియుఁడు సౌభ సాల్వ శిశుపాల సహోదర తత్సహోదరా
' లుల వధించి తత్కులము వారి ననేకులఁ ద్రుంచె నీ గతిన్.

(తెభా-10.2-921-వ.)[మార్చు]

అయ్యవసరంబున.

(తెభా-10.2-922-క.)[మార్చు]

ముని యోగి సురాసుర
' రుడోరగ సిద్ధ సాధ్య గంధర్వ నభ
శ్చ కిన్నర కింపురుషులు
' రిమహిమ నుతించి రద్భుతానందములన్.

(తెభా-10.2-923-వ.)[మార్చు]

మఱియు నప్సరోజనంబులు నృత్యంబులు సలుప, వేల్పులు కుసుమ వర్షంబులు గురియ, దేవతూర్యంబు లవార్యంబులై మొరయ, యదు వృష్ణి ప్రవరులు సేవింపఁ, బరమానందంబును బొంది నిజవిజయాంకితంబు లైన గీతంబుల వందిజనంబులు సంకీర్తనంబులు సేయ, నతి మనోహర విభవాభిరామంబును, నూతనాలంకారంబును నైన ద్వారకానగరంబు శుభముహూర్తంబునం బ్రవేశింపం జనునెడ.

(తెభా-10.2-924-క.)[మార్చు]

పు సతులు విరులు లాజలు
'గు రుసౌధాగ్రములనుండి కురియఁగ వికచాం
బు రుహాక్షుం డంతఃపుర
' మర్థిం జొచ్చె వైభవం బలరారన్.

(తెభా-10.2-925-వ.)[మార్చు]

అట్లు యోగీశ్వరేశ్వరుండును, షడ్గుణైశ్వర్యసంపన్నుండును, నిఖిలజగదీశ్వరుండును నైన పురుషోత్తముండు సుఖంబుండె; నంత.

(తెభా-10.2-926-క.)[మార్చు]

కౌ వ పాండవ పృథు సమ
'రా రంభ మెఱింగి తీర్థయాత్ర నెపముగా
సీ రాంకుఁ డుభయకులులకు
'నా య సముఁ డగుటఁ జేసి రిగె నరేంద్రా!

21-05-2016: :
గణనాధ్యాయి 11:16, 12 డిసెంబరు 2016 (UTC)