పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ద్వితీయాశ్వాసము)/కృష్ణ సాళ్వ యుద్ధంబు

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

కృష్ణ సాళ్వ యుద్ధంబు

తెలుగు భాగవతము (పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ద్వితీయాశ్వాసము)/కృష్ణ సాళ్వ యుద్ధంబు)
రచయిత: పోతన


(తెభా-10.2-887-శా.)[మార్చు]

'కం టే దారుక! దుర్నిమిత్తము లనేకంబుల్‌ మహాభీలముల్‌
'మిం టన్ మేదినిఁ దోఁచుచున్నయవి; నెమ్మిన్ ఖాండవప్రస్థ మే
'నుం టం జైద్యహితక్షితీశ్వరులు మాయోపాయులై మత్పురిం
'గెం టింపం జనుదేరఁ బోలుదురు; పోనీ తేరు వేగంబునన్.

(తెభా-10.2-888-వ.)[మార్చు]

అని యతిత్వరితగతిం జనుదెంచి తత్పురంబు డగ్గఱి మహాబల పరాక్రమంబులం బ్రతిపక్షబలంబులతోడం దలపడి పోరు యదు బలంబులును నభోవీథి నభేద్య మాయా విడంబనంబునం బ్రతివీరు లెంతకాలంబునకు నే యుపాయంబునను సాధింప నలవి గాని సౌభకవిమానంబు నందున్న సాల్వునిం గని తద్విమానంబు డాయం దన తేరు దోల సారథిని నియమించి కదియంజను మురాంతకుని వీక్షించి యదు సైనిక ప్రకరంబులు పరమానందంబునం బొందిరి; మృతప్రాయంబులై యున్న సైన్యంబులం గనుంగొని సౌభకపతి విక్రమక్రియాకలాపుం డగుచు నురవడించి.

(తెభా-10.2-889-చ.)[మార్చు]

'మి డుఁగుఱు లెల్లెడం జెదర; మింటను మంటలు పర్వ; ఘంటికా
' ఘణ భూరినిస్వన నికాయమునన్ హరిదంతరాళముల్‌
' ణఁక; మహోగ్రశక్తిఁ గొని వారక దారుకుమీఁద వైవ దా
'రు గతి నింగినుండి నిజరోచులతోఁ బడు చుక్కకైవడిన్.

(తెభా-10.2-890-క.)[మార్చు]

డిఁ జనుదేరఁగఁ గని య
'ప్పు డు నగధరుఁ డలతి లీలఁ బోలెన్ దానిం
బొ డిపొడియై ధరఁ దొరఁగఁగఁ
' డుమన వెసఁ ద్రుంచె నొక్క నారాచమునన్.

(తెభా-10.2-891-చ.)[మార్చు]

'గు రుభుజుఁ డంతఁ బోవక యకుంఠిత శూరత శత్రుసైన్యముల్‌
'దె లఁగ నుగ్రతం గొఱవిఁ ద్రిప్పిన కైవడి మింట దిర్దిరం
'ది రుగుచు దుర్నిరీక్ష్యమగు దీపితసౌభము సాల్వుఁ జండభా
'స్క కిరణాభ షోడశ నిశాతశరంబులఁ గాఁడ నేసినన్.

(తెభా-10.2-892-చ.)[మార్చు]

డు వడి నల్గి వాఁడు నిజకార్ముకమున్ జలదస్వనంబుకై
డి మొరయించుచున్ వెడఁద వాతి శరంబులఁ బద్మలోచను
న్నె మభుజంబు గాఁడ వడి నేసినఁ దెంపఱి చేతి శార్‌ఙ్గమున్
వి డిచె రథంబుపై గగనవీథి సురల్‌ భయమంది చూడఁగన్.

(తెభా-10.2-893-క.)[మార్చు]

హా హా యని భూతావళి
హా హాకారములు సేయ నంతట దేఱ
న్నా రిఁ గనుఁగొని యతఁ డు
త్సా హంబునఁ బలికె బాహుశౌర్యస్ఫూర్తిన్.

(తెభా-10.2-894-చ.)[మార్చు]

ళినదళాక్ష! మత్సఖుఁడు నాఁ దగు చైద్యుఁడు గోరినట్టి కో
లి నవినీతిమైఁ దగవుమాలి వరించితి; వంతఁ బోక దో
ర్బ మున ధర్మనందును సభాస్థలి నేమఱి యున్న వాని న
చ్చ మునఁ జంపి తట్టి కలుషంబున నేఁడు రణాంగణంబునన్.

(తెభా-10.2-895-క.)[మార్చు]

చెడి పాఱక బాహా
మొప్పఁగ నాదు దృష్టిథమున ధృతితో
ని లిచిన నిష్ఠుర విశిఖా
ర్చు ముంచి మదీయసఖుని సూ డిటు దీర్తున్.

(తెభా-10.2-896-చ.)[మార్చు]

నిన మురాంతకుండు దరహాసము మోమునఁ దొంగలింప సా
ల్వు నిఁ గని యోరి! లావు బలుపుంగల పోటరి వోలెఁ బ్రేలె దే
నినను బాటు సన్నిహితమౌట యెఱుంగవు మూఢచిత్త! వొ
మ్మ ని గదఁ గేలఁ ద్రిప్పి యభియాతిని శత్రుని వ్రేసె నుద్ధతిన్.

(తెభా-10.2-897-వ.)[మార్చు]

అట్లు వ్రేసిన.

(తెభా-10.2-898-క.)[మార్చు]

పె నుమూర్ఛ నొంది వెస ము
క్కు వాతను నెత్తురొల్కఁ గొంతవడికి నొ
య్య తెలిసి నిలువరింపక
నె వాఁడు నదృశ్యుఁ డగుచు సౌభముఁ దానున్.

(తెభా-10.2-899-వ.)[మార్చు]

అయ్యవసరంబున.

(తెభా-10.2-900-తే.)[మార్చు]

గన మందుండి యొకఁ డార్తుఁ గుచు వచ్చి
నందనందను పాదారవిందములకు
వందనము సేసి యానకదుందుభిని మ
హోగ్రుఁడై పట్టితెచ్చె సాల్వుండు గడఁగి.

(తెభా-10.2-901-తే.)[మార్చు]

దేవ! మీ కెఱిఁగింపఁగాఁ దివిరి యిటకు
దేవకీదేవి నన్నుఁ బుత్తెంచె ననఁగ
విని సరోరుహనాభుఁడు ఘన విషాద
గ్నుఁ డయ్యెను గురుమీఁది మతఁ జేసి.

(తెభా-10.2-902-క.)[మార్చు]

గంధర్వ సురాసుర
రులకు నిర్జింపరాని వాఁడు బలుం డే
కరయ హీనబలుచేఁ
రికింపఁగ నెట్లు పట్టుడు నొకొ యనుచున్

(తెభా-10.2-903-వ.)[మార్చు]

మఱియును.

(తెభా-10.2-904-క.)[మార్చు]

భా వంబు గలఁగ నాహా!
దై కృతం బెవ్వరికిని ప్పింపఁగ రా
దే విధి నైనను నని శో
కా విలమతిఁ బలుకుచున్న త్తఱి వాఁడున్.

(తెభా-10.2-905-వ. )[మార్చు]

తన మాయాబలంబునఁ గ్రమ్మఱం దోఁచి కృతక వసుదేవునిం గల్పించి యతనిం బంధించి కొనితెచ్చి “పుండరీకాక్ష! నిరీక్షింపు భవజ్జనకుండు వీఁడె; యిప్పుడు నీవు గనుంగొన వీని తలఁద్రుంతు నింక నెవ్వనికింగా మనియెదు? కావంగల శక్తిగలదేనిం గావు” మని దురాలాపంబు లాడుచు మృత్యుజిహ్వాకరాళంబైన కరవాలంబు గేలంబూని జళిపించుచు నమ్మాయావసుదేవుని శిరంబు దునిమి తన్మస్తకంబు గొని వియద్వర్తి యై చరియించు సౌభక విమానంబు సొచ్చె; నంత గోవిందుండు గొంతతడవు మనంబున ఘనంబగు శోకంబునం గుందుచుండి యాత్మసైనికులు దెలుపం దెలివొంది యది మయోదితంబైన సాల్వుని మాయోపాయం బని యెఱింగె; నంతం దనకు వసుదేవుండు పట్టువడె నని చెప్పిన దూతయు నమ్మాయాకళేబరంబును నా క్షణంబ విచిత్రంబుగా మాయంబై పోయె; ననంతరంబ.

(తెభా-10.2-906-క.)[మార్చు]

ము ను లపుడు గొంద ఱచటికిఁ
' నుదెంచి విమోహియైన లజదళాక్షుం
నుఁగొని సమధికభక్తిన్
'వి యంబునఁ బలికి రంత విష్ణున్ జిష్ణున్.

(తెభా-10.2-907-సీ.)[మార్చు]

'మలాక్ష! సర్వలోములందు సర్వ మా;
'వులు సంసార నానావిధైక
'దుఃఖాబ్ధిమగ్నులై తుదిఁ జేరనేరక;
'వికలత్వమునఁ బొందు వేళ నిన్నుఁ
'లఁచి దుఃఖంబులఁ రియింతు రట్టి స;
'ద్గుణనిధి వై దేవకోటికెల్లఁ
'ట్టుగొమ్మై పరబ్రహ్మాఖ్యఁ బొగడొంది;
'రమయోగీశ్వర ప్రకరగూఢ

(తెభా-10.2-907.1-తే.)[మార్చు]

'రచిదానంద దివ్యరూమున వెలుఁగు
'నఘ! నీ వేడ? నీచజన్మాత్మ జనిత
'న భయస్నేహ మోహశోకంబు లేడ?
'నుచు సంస్తుతి సేసి వారిగి రంత.

21-05-2016: :
గణనాధ్యాయి 11:15, 12 డిసెంబరు 2016 (UTC)