పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ద్వితీయాశ్వాసము)/కాళింది మిత్రవిందల పెండ్లి

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

కాళింది మిత్రవిందల పెండ్లి

తెలుగు భాగవతము (పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ద్వితీయాశ్వాసము)/కాళింది మిత్రవిందల పెండ్లి)
రచయిత: పోతన


(తెభా-10.2-124-వ.)[మార్చు]

అంతం గృష్ణుండు ధర్మరాజప్రముఖుల వీడుకొని, సాత్యకిప్రముఖ సహచరులు గొలువ, మరలి తనపురంబునకుం జని బంధుజనంబులకుఁ బరమానందంబు సేయుచు నొక్క పుణ్య దివసంబున శుభలగ్నంబునం గాళిందిం బెండ్లి యయ్యె; మఱియు నవంతి దేశాధీశ్వరులయిన విందానువిందులు దుర్యోధనునకు వశులై హరికి మేనత్తయైన రాజాధిదేవి కూఁతురైన తమ చెలియలిని వివాహంబు సేయనుద్యోగించి స్వయంవరంబుఁ జాటించిన.

(తెభా-10.2-125-క.)[మార్చు]

భూ మణులు సూడఁగ హరి
'వీ తఁ జేకొనియె మిత్రవిందను నిత్యా
పూ రిత సుజనానందం
'జా రు చికురకాంతి విజిత ట్పదబృందన్.

21-05-2016: :
గణనాధ్యాయి 10:25, 12 డిసెంబరు 2016 (UTC)