Jump to content

పోతన తెలుగు భాగవతము/తృతీయ స్కంధము/విధాత వరాహస్తుతి

వికీసోర్స్ నుండి


తెభా-3-422-వ.
అట్టి యజ్ఞపోత్రిమూర్తిం జూచి కమలాసన ప్రముఖు లిట్లని స్తుతియించిరి.
టీక:- అట్టి = అటువంటి; యజ్ఞపోత్రిమూర్తిన్ = యజ్ఞవరాహమూర్తిని; చూచి = చూసి; కమలాసన = బ్రహ్మదేవుడు {కమలాసనుడు - కమలమువ ఆసీనుడు (కూర్చున్న వాడు), బ్రహ్మదేవుడు}; ప్రముఖులు = మొదలగు ముఖ్యులు; ఇట్లు = ఈ విధముగా; అని = అని; స్తుతియించిరి = స్తోత్రము చేసిరి.
భావము:- అటువంటి యజ్ఞవరాహమూర్తిని చూచి బ్రహ్మాదిదేవతలు ఇలా కీర్తించారు.

తెభా-3-423-సీ.
"దేవ! జితం జితంతే పరమేశ్వర!-
సియజ్ఞభావన! శ్రుతిశరీర!
కారణసూకరాకారుండ వగు నీకు-
తిభక్తి మ్రొక్కెద య్య వరద!
వదీయ రోమకూము లందు లీనంబు-
లై యుండు నంబుధుఁ ట్టి యధ్వ
రాత్మక మై తనరారు నీ రూపంబు-
గానంగరాదు దుష్కర్మపరుల

తెభా-3-423.1-తే.
ట్టి నీకుఁబ్రణామంబు లాచరింతు
ఖిలజగదేకకీర్తి! దయానువర్తి!
వ్యచారిత్ర! పంకజత్రనేత్ర!
చిరశుభాకార! యిందిరాచిత్తచోర!"

టీక:- దేవ = దేవుడా; జితం = జయము; జితం = జయము; తే = నీకు; పరమేశ్వర = భగవంతుడా {పరమేశ్వరుడు - పరమము (అత్యున్నత)మైన ఈశ్వరుడు, విష్ణవు}; సిత = చక్కటి; యజ్ఞ = యజ్ఞమునకు; భావన = కారణుడా; శ్రుతి = వేదములే; శరీర = దేహముగా కలవాడ; కారణ = పనిగట్టుకొని; సూకరా = వరాహము యొక్క; ఆకారుండవు = స్వరూపము ధరించినవాడవు; అగు = అయిన; నీకున్ = నీకు; అతి = మిక్కిలి; భక్తిన్ = భక్తితో; మ్రొక్కెదము = నమస్కరించెదము; అయ్య = తండ్రి; వరద = భగవంతుడా {వరదుడు - వరములను ఇచ్చువాడు, విష్ణువు}; భవదీయ = నీ యొక్క; రోమ = వెంట్రుకల; కూపంబులు = మొదళ్లు; అందున్ = లో; లీనంబులున్ = లీనమైనవి; ఐ = అయి; ఉండున్ = ఉండే; అంబుధులు = సముద్రములు {అంబుధి - నీటికి నిధి వంటిది, సముద్రము}; అట్టి = అటువంటి; అధ్వరము = యజ్ఞము చేయు; ఆత్మకము = మార్గము; ఐ = అయ్యి; తనరారు = అతిశయించు; నీ = నీ యొక్క; రూపంబున్ = రూపము; కానంగరాదు = కనపడదు; దుష్కర్మపరుల = చెడ్డపనులు చేయువారి; కున్ = కి; అట్టి = అటువంటి;
నీకున్ = నీకు; ప్రణామంబులు = నమస్కారములు; ఆచరింతుము = చేయుదుము; అఖిల = సమస్తమైన; జగదేకకీర్తి = విష్ణుమూర్తి {జగదేకకీర్తి - లోకముల అంతటిచేతను కీర్తింపబడువాడు, విష్ణువు}; దయానువర్తి = విష్ణుమూర్తి {దయానువర్తి - దయతో అనుకూలముగా వర్తించువాడు, విష్ణువు}; భవ్య = శుభకరమైన; చారిత్ర = చరిత్ర కలవాడ; పంకజనేత్ర = విష్ణుమూర్తి {పంకజనేత్ర - పంకజము (పద్మము) లవంటి నేత్రములు కలవాడ, విష్ణవు}; చిరశుభాకార = విష్ణుమూర్తి {చిరశుభాకారుడు - మిక్కిలి శుభకరమైన ఆకారము కలవాడు, విష్ణువు}; ఇందిరాచిత్తచోర = విష్ణుమూర్తి {ఇందిరాచిత్తచోరుడు - ఇందిర (లక్ష్మీదేవి) యొక్క చిత్తము (మనసు)ను చోరుడు (దొంగిలించిన వాడు), విష్ణువు}.
భావము:- దేవదేవా! జయం జయం నీకు పరమేశ్వరా! జయం జయం. నీవు యజ్ఞాధిపతివి. వేదమూర్తివి, దుష్టశిక్షణ శిష్టరక్షణార్ధం వరాహావతారం ధరించిన నీకు పరమ భక్తితో ప్రణమిల్లుతున్నాము. నీవు వరాలు ఇచ్చే వాడవు, ఈ మహాసముద్రాలన్నీ నీ రోమకూపాలలో ఇమిడి ఉన్నాయి. విశాల విఖ్యాత కీర్తివీ, పరమ కరుణామూర్తివీ, పరమ పవిత్ర చరిత్రుడవూ, పద్మాల రేకులకు సాటివచ్చే కన్నులు కలవాడవూ, మిక్కిలి మంగళ ఆకారుడవూ, శ్రీరమా చిత్త చోరుడవూ అయిన నీకు ఇదిగో చేతులెత్తి నమస్కారాలు చేస్తున్నాం.

తెభా-3-424-వ.
అని వెండియు నిట్లు స్తుతియించిరి.
టీక:- అని = అని; వెండియున్ = మరల; ఇట్లు = ఈవిధముగా; స్తుతియించిరి = స్తోత్రము చేసిరి.
భావము:- అని ఇంకా ఈవిధంగా దేవతలు దేవాదిదేవుణ్ణి స్తుతించారు.

తెభా-3-425-సీ.
"త్వక్కున నఖిల వేములు రోమంబుల-
యందును బర్హిస్సు క్షు లందు
నాజ్యంబు పాదంబు లందుఁ జాతుర్హోత్ర-
లితంబు లగు యజ్ఞర్మములును
స్రుక్కు తుండంబున స్రువము నాసికను ని-
డాపాత్ర ముదరకోరము నందుఁ
శ్రవణాస్య బిలములఁ మస ప్రాశిత్రముల్-
ళమున నిష్ఠిత్రికంబు జిహ్వఁ

తెభా-3-425.1-తే.
గుఁ బ్రవర్గ్యము నగ్నిహోత్రములు నీదు
ర్వణంబును సభ్యావధ్యు లుత్త
మాంగ మసువులు చయనము గుఁ గిటీశ!"
నుచు నుతియించి రత్తఱి జ్ఞవిభుని.

టీక:- త్వక్కునన్ = చర్మమునందు; అఖిల = సమస్తమైన; వేదములున్ = వేదమములును; రోమంబులన్ = వెంట్రుకల; అందున్ = అందు; బర్హిస్సున్ = దర్భలును; అక్షుల = కన్నుల; అందున్ = అందు; ఆజ్యంబున్ = నెయ్యి (హోమము చేయు); పాదంబులన్ = కాళ్ళ; అందున్ = అందు; చాతుర్ = నలుగురు (4); హోత్ర = ఋత్విక్కులచే; కలితంబులు = చేయబడునవి; అగు = అయిన; యజ్ఞ = యాగములను; కర్మములును = చేయుటలును; స్రుక్కున్ = స్రుక్కనేతెడ్డు {స్రుక్కు - హోమము కొరకు నేతిని తీయు తెడ్డు, గరిటి}; తుండంబునన్ = తొండమునందును; స్రువమున్ = స్రువనే తెడ్డు {స్రువము - హోమము చేయునప్పుడు నేతిని అగ్నిలో వేయుటకైన తెడ్డు, గరిటి}; నాసికను = ముక్కుయును; ఇడాపాత్రము = పిండివంటలకైన (భక్షణ) యజ్ఞపాత్ర, హవిస్సున్న పాత్ర; ఉదర = గర్భ; కోటరమున్ = ఆశయము; అందున్ = అందులో; శ్రవణ = చెవుల; అస్య = నోటి; బిలములన్ = రంధ్రములందు; చమస = చతురస్రముగ ఉండు యజ్ఞపాత్రలు; ప్రాశిత్రముల్ = బ్రహ్మ భాగ పాత్ర, తాగు యజ్ఞ పాత్రలు; గళమునన్ = గొంతునందు; ఇష్టిత్రికంబున్ = త్రికాలములను చేయబడు ఇష్టులు (చిన్ని యాగములు); జిహ్వన్ = నాలుక యందు; తగున్ = తగినది; ప్రవర్గ్యమున్ = మహావీతము అను యజ్ఞకార్యము {ప్రవర్గ్యము - మహావీతము - అగ్నిష్ఠోమాది యాగములకు విభాగములలో ఒకరకమైన యాగము}; అగ్నిహోత్రము = అగ్నిహోత్రము;
నీదు = నీ యొక్క; చర్వణంబునున్ = భక్షణము, నమలుట; సభ్య = హోమములేని అగ్నిహోత్రము; అపధ్యులున్ = హోమముచేయు (ఔపోసన) అగ్నిహోత్రము; ఉత్తమాంగము = తల; అసువులు = పంచప్రాణములు {అసువులు - పంచప్రాణములు - 1 ప్రాణము 2 అపానము 3 న్యాసము 4 ఉదానము 5 సాన వాయువులు}; చయనములున్ = ఇటుకలు పేర్చు యజ్ఞములు; అగున్ = అగును; కిటీశ = భగవంతుడా {కిటీశుడు - కిటి (వరాహము, పంది) రూపమున ఉన్న ఈశుడు (ప్రభువు), విష్ణువు}; అనుచున్ = అంటూ; నుతియించిరి = స్తుతించిరి; ఆ = ఆ; తఱిన్ = సమయమున; యజ్ఞవిభుని = భగవంతుని {యజ్ఞవిభుడు - యజ్ఞములకు ప్రభువు, విష్ణువు}.
భావము:- ఓ స్వామీ! నీ చర్మం నుండి, సమస్త వేదాలూ జనించాయి; నీ రోమకూపాల నుండి అగ్నులు ఆవిర్భవించాయి; నీ కన్నులనుండి హోమ ద్రవ్యమైన నెయ్యి, నీ నాలుగు పాదాలనుండి నాలుగు హోతలతో కూడిన యజ్ఞ కర్మలూ, మజ్జనుండి స్రుక్కూ, ముక్కునుండి సృవమూ, ఉదరమునుండి ఇడాపాత్రమూ, చెవులనుండి, ముఖంనుండి చమసం, ప్రాశిత్రం అనే పాత్రలూ, కంఠం నుండి ఇష్టులు అనే మూడు యజ్ఞాలూ, నాలుక నుండి, ప్రవర్గ్యం అనే యజ్ఞం పుట్టాయి; నీ చర్వణమే అగ్నిహోత్రం; సధ్యం అంటే హోమరహితాగ్ని, అపసథ్యం అంటే ఔపోసనాగ్ని నీ శరస్సు నుంచి జనించాయి; చయనాలు నీ ప్రాణ స్వరూపాలు; నీవు యజ్ఞాధికారుడవు; యజ్ఞవరాహమూర్తివి.

తెభా-3-426-వ.
వెండియు "ముహుర్ముహుర్భవ దావిర్భావంబు దీక్షణీయేష్టి యగు; నీదు దంష్ట్రలు ప్రాయణీయం బను దీక్షానంతరేష్టియు, నుదయనీయం బను సమాప్తేష్టియు, యుష్మద్రేతంబు సోమంబును, ద్వదీయావస్థానంబు ప్రాతస్సవనాదులు; నీదు త్వజ్మాంసాది సప్తధాతువు లగ్నిష్ఠోమాత్యగ్నిష్ఠోమోక్థ్యషోడశీ వాజపేయాతిరాత్రాప్తోర్యామంబు లను సంస్థాభేదంబులును, ద్వాదశాహాదిరూపంబులైన బహు యాగ సంఘాత రూపంబులు నగు; సర్వసత్త్రంబులు భవదీయ శరీరసంధులు; ససోమాసోమంబు లగు యజ్ఞక్రతువులు నీవ; మఱియును నీవు యజనబంధనంబులచే నొప్పుచుందువు; అదియునుం గాక.
టీక:- వెండియున్ = ఇంకనూ; ముహుర్ = మరల; ముహుర్ = మరల; భవత్ = నీ యొక్క; ఆవిర్భావంబున్ = ఉద్భవించుట, అవతరించుట; దీక్షణీయేష్టి = యజ్ఞ దీక్ష ప్రారంభ ఇష్టి; అగున్ = అగును; నీదు = నీ యొక్క; దంష్ట్రలు = కోరలు; ప్రాయణీయంబు = ప్రాయణీయము; అను = అను; దీక్ష = దీక్ష; అనంతర = అయిన తరువాత చేయు; ఇష్టియును = యాగములును; ఉదయనీయంబు = ఉదయనీయము; అను = అను; సమాప్త = యజ్ఞ సమాప్తమున చేయు యాగము; ఇష్టియున్ = యాగములును; ఉష్మత్ = నీ యొక్క; రేతంబున్ = రేతస్సు; సోమంబును = సోమరసమును {సోమము -వ్యు. (షూ-నూ(-ప్రనవే – ప్రేరణే), షు-ను(-అభిషవే) సూ – ను + మన్) కృ. ప్ర., యజ్ఞార్థమైన రసము నొసగునది, ప్రేరకమైనది (ఆంధ్రశబ్దరత్నాకరము), సోమరసము}; త్వదీయ = నీ యొక్క; అవస్థానంబున్ = ఉనికి, నిలబడుట; ప్రాతః = ఉదయము చేయు; సవన = యాగము; ఆదులు = మొదలగునవి; నీదు = నీ యొక్క; త్వక్ = చర్మము; మాంస = మాంసము; ఆది = మొదలగు; సప్తధాతువులున్ = సప్తధాతువులు {సప్తధాతువులు - వసాదులు (వస, అసృక్కు, మాంసము, మేధస్సు, అస్థి, మజ్జ, శుక్లములు) - రోమాది (రోమ, త్వక్, మాంస, అస్థి, స్నాయువు, మజ్జ, ప్రాణములు)}; అగ్నిష్ఠోమ = అగ్నిష్ఠోమము {అగ్నిష్ఠోమము - వసంత కాలమున ఐదు దినములలో చేయు యాగవిశేషము}; అతి + అగ్నిష్ఠోమ = అత్యగ్నిష్ఠోమము; ఉక్థ్య = ఉక్థ్యము; షోడశీ = షోడశీయము; వాజపేయ = వాజపేయము; అతిరాత్ర = అతిరాత్రము; ఆప్తోర్యామంబులు = ఆప్తోర్యామములు; అను = అను; సంస్థా = యజ్ఞముల విధానములలోని; భేదంబులునున్ = భేదములు, రకములు; ద్వాదశాహ = ద్వాదశాహము {ద్వాదశాహము - ద్వాదశ (పన్నెండు) అహములు (పగళ్ళు) చేయు ఒక విధమైన యాగము}; ఆది = మొదలగు; రూపంబులున్ = రకములు; ఐన = అయిన; బహు = చాలా రకములైన; యాగ = యాగముల; సంఘాత = విశేషములైన; రూపంబులున్ = రూపములు; అగున్ = అగును; సర్వ = సర్వమైన; సత్త్రంబులున్ = సత్రయాగములు {సత్రములు - సత్రయాగములు - 13 మొదలు 100 దినముల వరకు జరుగు యాగములు}; భవదీయ = నీ యొక్క; శరీర = శరీరమందలి; సంధులు = కీళ్ళు; ససోమ = సోమరసముతో కూడినవి; అసోమంబులు = సోమరసము లేనివియును; అగు = అయిన; యజ్ఞ = యాగముల; క్రతువులు = యజ్ఞవిధానములు; నీవ = నీవే; మఱియున్ = ఇంకనూ; నీవు = నీవు; యజన = యజ్ఞములు అను; బంధనంబులన్ = బంధములు; చేన్ = చేత; ఒప్పుచున్ = చక్కగా; ఉందువు = ఉంటావు; అదియునున్ = అంతే; కాక = కాకుండగ.
భావము:- అంతేకాక భగవంతుడవైన నీవు మళ్ళీమళ్ళీ ఆవిర్భవించటం “దీక్షణీయ” మనే యజ్ఞము; నీ కోరలు “ప్రాయణీయ” మనే దీక్షానంతరం జరిపే ఇష్టి, “ఉదయనీయం” అనే సమాప్తేష్టి; సోమరసం నీ రేతస్సు; నీ ఉనికియే ప్రాతఃకాలం, మధ్యాహ్నం, సాయం సమయం అనే మూడు యజ్ఞాంశలు. నీ చర్మం మాంసం మొదలైన సప్తధాతువులూ అగ్నిష్ఠోమం, ఉర్ధ్యం, షోడశి, వాజపేయం, అతిరాత్రం, ఆప్తోర్యామం, ద్వాదశాహం మొదలైన యజ్ఞ భేదాలు; సమస్త యజ్ఞాలు నీ శరీర సంధులు; సోమంతో కూడినవీ, కూడనివి అయిన క్రతువులన్నీ నీవే; నీవే యజ్ఞ బంధాలతో అలరారుతూ ఉంటావు.

తెభా-3-427-క.
రూపివి హవనేతవు
భోక్తవు నిఖిలహవఫలాధారుఁడవున్
రక్షకుఁడవు నగు నీ
వితథముగ నుతులొనర్తు య్య; ముకుందా!

టీక:- హవ = హోమము యొక్క; రూపివిన్ = రూపము కలవాడవు; హవ = హోమము యొక్క; నేతవు = నాయకుడవు; హవ = హోమము యొక్క; భోక్తవున్ = స్వీకరించువాడవు; నిఖిల = సమస్తమైన; హవ = హోమముల యొక్క; ఫల = ఫలితములకు; ఆధారుడవున్ = కారణము అయినవాడవు; హవ = హోమముల యొక్క; రక్షకుడవున్ = రక్షించువాడవును; అగు = అయిన; నీకు = నీకు; అవితథముగన్ = సత్యముగా; నుతులు = స్తోత్రములు; ఒనర్తుము = చేయుదుము; అయ్య = తండ్రి; ముకుందా = భగవంతుడా {ముకుందుడు - విష్ణుమూర్తి}.
భావము:- భూమ్యుద్ధరణ చేసిన దేవదేవుని దేవతలు స్తుతిస్తున్నారు. వరహావతారుడా! నీవు యజ్ఞ స్వరూపుడవు, యజ్ఞ కర్తవు, యజ్ఞ భోక్తవు, యజ్ఞఫల ప్రదాతవు, యజ్ఞ రక్షకుడవు, ముకుందుడవు; సమస్తము నీవే; నిన్ను హృదయ పూర్వకంగా కీర్తిస్తున్నాము.

తెభా-3-428-తే.
త్త్వగుణమున సద్భక్తి సంభవించు
క్తియుతముగఁ జిత్తంబు వ్య మగును
హృదయపద్మంబునం దోలి నెఱుఁగఁబడిన
ట్టి నీకు నమస్కారయ్య; వరద!

టీక:- సత్త్వగుణమునన్ = సత్త్వగుణము వలన; సత్ = మంచి; భక్తిన్ = భక్తి; సంభవించున్ = కలుగును; భక్తిన్ = భక్తిచేత; యుతముగన్ = కూడినదైన; చిత్తంబున్ = మనసు; భవ్యము = శుభకరము; అగును = అగును; హృదయ = హృదయము అను; పద్మంబునన్ = పద్మములో; ఓలిన్ = క్రమముగా; ఎఱుగబడిన = తెలియబడిన; అట్టి = అటువంటి; నీకున్ = నీకు; నమస్కారము = నమస్కారములు; అయ్య = తండ్రి; వరద = భగవంతుడా {వరదుడు - వరములను ఇచ్చువాడు, విష్ణువు}.
భావము:- సత్వగుణంవల్ల, మంచి భక్తి ప్రాప్తిస్తుంది. భక్తితో కూడిన మనస్సు పవిత్రం అవుతుంది. అటువంటి భక్తి యుక్తమైన పవిత్ర హృదయ పద్మంతో తలచి సేవించదగిన ఓ దేవాధిదేవా! నీకు నమస్కారం.

తెభా-3-429-మ.
విందోదర తావకీనసితదంష్ట్రాగ్రావ లగ్నక్షమా
నద్యబ్ధినదాటవీయుత సమిద్ధక్ష్మాతలంబొప్పె భా
సుకాసారజలావతీర్ణమదవచ్ఛుండాలరాడ్దంతశే
సంసక్త వినీలపంకజమురేఖంబొల్పు దీపింపఁగన్

టీక:- అరవిందోదర = భగవంతుడా {అరవిందోదరుడు - అరవిందము (పద్మము) ఉదరమున (కడుపున) కలవాడు, విష్ణువు}; తావకీన = నీ యొక్క; సిత = తెల్లనైన; దంష్ట్ర = కోరల; అగ్ర = కొనలందు, చివరలందు; లగ్న = చిక్కిన; క్షమాధర = పర్వతములు; నది = నదులు; అబ్ధి = సముద్రములు; నద = నదములు; అటవీ = అడవులతోను; యుత = కూడినదైన; సమిద్ధ = ప్రకాశితమైన; క్షాతలంబున్ = భూమండలము; ఒప్పెన్ = చక్కగా ఉన్నది; భాసుర = ప్రకాశిస్తున్న; కాసర = కోనేటి; జలా = నీట; అవతీర్ణ = దిగిన; మదవత్ = మదమెక్కిన; శుండాల = ఏనుగుల; రాట్ = రాజు యొక్క; దంత = దంతము; శేఖర = శిఖరమున, చివర; సంసక్త = చిక్కుకొన్న; వినీల = నల్ల; పంకజము = పద్మము {పంకజము - నీటిలో పుట్టునది, పద్మము}; రేఖన్ = వలె; పొల్పు = విలాసము; దీపింపగన్ = ప్రకాశిస్తుండగా.
భావము:- పద్మనాభా! వరాహా! పర్వతాలతో, నదీనదాలతో, సముద్రాలతో, అరణ్యాలతో నిండిన ఈ భూమండలం నీ తెల్లని కోర చివర ప్రకాశిస్తున్నది. ఆ భూదేవి మనోహరమైన సరోవర జలాలలో దిగిన మదించిన గజేంద్రుని దంతాగ్రాన తగులుకుని ఉన్న ఆకుతో కూడిన తామరపువ్వు లాగా చూడముచ్చటగా ఉంది.

తెభా-3-430-వ.
మఱియును.
టీక:- మఱియును = ఇంకనూ.
భావము:- అంతేకాదు,

తెభా-3-431-మ.
తురామ్నాయ వపుర్విశేష ధర! చంత్సూకరాకార! నీ
సి దంష్ట్రాగ్ర విలగ్నమై ధరణి రాజిల్లెం గులాద్రీంద్ర రా
శృంగోపరిలగ్న మేఘము గతిం జాలం దగెన్ సజ్జనాం
చి హృత్పల్వలలోల! భూరమణ! లక్ష్మీనాథ! దేవోత్తమా!

టీక:- చతురామ్నాయవపుర్విశేషధర = భగవంతుడా {చతురామ్నాయవపుర్విశేషధరుడు - చతుర (నాలుగు) ఆమ్నాయ (వేదము)లను వపుర్ (శరీర) విశేష (ప్రత్యేకతలు) వలె ధర (ధరించిన వాడు), విష్ణువు}; చంచత్సూకరాకార = భగవంతుడా {చంచత్సూకరాకారుడు - చంచత్ (చలిస్తున్న) సూకర (వరాహ) ఆకార (స్వరూపము) కలవాడు, విష్ణువు}; నీ = నీ యొక్క; సిత = తెల్లని; దంష్ట్ర = కోరల; అగ్ర = చివర; విలగ్నము = చక్కగ తగలుకొని ఉన్నది; ఐ = అయిన; ధరణి = భూమండలము; రాజిల్లెన్ = విరాజిల్లెను; కులాద్రి = కులపర్వతములలో {కులాద్రీంద్రము - కులపర్వతములలో శ్రేష్ఠమైనది, కైలాస పర్వతము}; ఇంద్ర = శ్రేష్ఠునియొక్క; రాజిత = వెండి; శృంగ = శిఖరము; ఉపరి = పైన; లగ్న = చిక్కుకొన్న; మేఘము = మేఘము; గతిన్ = వలె; చాలన్ = మిక్కిలి; తగెన్ = తగి ఉన్నది; సత్ = మంచి; జన = వారి; అంచిత = పూజనీయమైన; హృత్ = హృదయములు అను; పల్వల = నీటిగుంటలలో; లోల = విహరించువాడ; భూరమణ = విష్ణుమూర్తి {భూరమణ - భూదేవికి రమణుడు (భర్త), విష్ణువు}; లక్ష్మీనాథ = విష్ణుమూర్తి {లక్ష్మీనాథుడు - లక్ష్మీపతి, విష్ణువు}; దేవోత్తమ = విష్ణుమూర్తి {దేవోత్తముడు - దేవతలలో ఉత్తముడు, విష్ణువు}.
భావము:- చతుర్వేద స్వరూపమైన శరీరాన్ని ధరించి ఉన్న ఓ యజ్ఞవరాహా! నీవు జ్ఞానవంతుల అంతరంగాలనే నీటి మడుగులలో క్రీడిస్తూ ఉంటావు. భూదేవికి, శ్రీదేవికి మనోహారుడవు. దేవతలందరికి అగ్రేసరుడవు. నీ తెల్లని కోరల చివర తగులుకున్న భూమి కొండల చక్రవర్తి కైలాస పర్వతం వెండి శిఖరాన విరాజిల్లుతూ ఉండే, నీలమేఘంలా అందాలు చిందుతూ ఉంది.

తెభా-3-432-సీ.
మధిక స్థావర జంగమాత్మక మైన-
సుమతీచక్ర మక్ర లీల
నుద్ధరించితి కరుణోపేత చిత్తుండ-
గుచు నస్మన్మాత య్యె ధరణి
మాత యౌటెట్లని దిఁ దలంచెద వేనిఁ-
ర్చింప మాకు విశ్వమున కీవు
నకుఁడ వగుట యుష్మత్పత్ని భూదేవి-
గుటఁ మాకును దల్లి య్యె నిపుడు

తెభా-3-432.1-తే.
రకు నీతోడఁ గూడ వంన మొనర్తు
రణి యందును యాజ్ఞికుఁ గ్ని నిలుపు
రణి నీ తేజమీ ధరాకాంత యందు
నిలుప ధరణి పవిత్రయై నెగడుఁ గాన.


3-432/1-వ. అదియునుం గాక. - తంజనగరము - తేవప్పెరుమాల్లయ్య వారి ప్రతి



టీక:- సమధిక = మిక్కిలి ఎక్కువైన; స్థావర = స్థావరములు, వృక్షాదులు {స్థావరములు - ఉన్న స్థానము నుండి కదలలేనివి, చెట్లు మొదలగునవి}; జంగమ = జంగమములు, జంత్వాదులు {జంగమములు - ఉన్న స్థానముల నుండి కదల గలవి, జంతువులు, మానవులు మొదలగునవి}; ఆత్మకము = తో కూడినది; ఐన = అయినట్టి; వసుమతీ = భూ; చక్రమున్ = మండలమును; అవక్ర = సాటిలేని; లీలన్ = విధముగా; ఉద్ధరించితి = ఉద్ధరించితివి; కరుణా = దయతో; ఉపేత = కూడిన; చిత్తుండవు = మనస్సుకలవాడవు; అగుచున్ = అవుతూ; అస్మత్ = మా యొక్క; మాత = తల్లి; అయ్యెన్ = అయ్యెను; ధరణి = భూదేవి; మాత = మాతల్లి; ఔటన్ = అగుట; ఎట్లు = ఏవిధముగ; అని = అని; మదిన్ = మనసులో; తలంచెదవు = అనకొంటివి; ఏని = అయితే; చర్చింపన్ = విశ్లేషింపగా; మాకున్ = మాకు; విశ్వమున్ = భువనముల; కున్ = కి; ఈవున్ = నీవు; జనకుడవు = తండ్రివి; అగుటన్ = అగుటచేత; ఉష్మత్ = నీ యొక్క; పత్ని = భార్య; భూదేవి = భూదేవి; అగుటన్ = అగుటచేత; మాకునున్ = మాకును; తల్లి = తల్లి; అయ్యెన్ = ఆయెను; ఇపుడున్ = ఇప్పుడు;
ధరన్ = భూదేవి; కున్ = కి; నీ = నీ; తోడన్ = తో; కూడన్ = కూడా; వందనమున్ = నమస్కారములు; ఒనర్తుము = చేసెదము; అరణి = నిప్పు రగుల్చు సాధనము; అందునున్ = లోపల; యాజ్ఞికుడు = యజ్ఞముచేయువాడు; అగ్నిన్ = నిప్పును; నిలుపు = రగిల్చు; కరణిన్ = విధముగా; నీ = నీ యొక్క; తేజమున్ = తేజస్సును; ఈ = ఈ; ధర = భూ; కాంత = దేవి; అందున్ = అందు; నిలుపన్ = నిలుపుట వలన; ధరణిన్ = భూదేవి; పవిత్ర = పవిత్రమైనది; ఐ = అయ్యి; నెగడున్ = వర్థిల్లును; కాన = కావున.
భావము:- కరుణ నిండిన హృదయం కలవాడవై, సకల చరాచర సమూహంతో నిండిన ఈ భూమండలాన్ని సముద్రజలాల్లో మునిగిపోకుండా కాపాడు. ఈ భూమి మాకు తల్లి. ఎలాగంటావేమో, మాకు ఈ లోకానికి తండ్రివి. నీవు భరించుటచే భూదేవి నీ భార్య అయింది. అందుకని ఆమె మాకు తల్లి అవుతుంది. నీతోపాటు, ఈ భూమికి నమస్కారం చేస్తాము. యజ్ఞకర్త అరణి యందు అగ్నిని నిల్పిన విధంగా నీవు నీ తేజస్సును ఈ భూమి యందు నిల్పడం వల్ల ఈ ధరిత్రి పవిత్రమై ఒప్పుతూ ఉంది.

తెభా-3-433-చ.
లఁప రసాతలాంతరగక్షితిఁ గ్రమ్మఱ నిల్పినట్టి నీ
లితన మెన్న విస్మయము గాదు సమస్త జగత్తు లోలి మై
లుగఁగఁ జేయు టద్భుతము గాక మహోన్నతి నీ వొనర్చు పెం
రిన కార్యముల్ నడప న్యులకుం దరమే? రమేశ్వరా!

టీక:- తలపన్ = విచారించిన; రసాతల = రసాతలము; అంతర = లోపల; గతన్ = పడినదియైన; క్షితిన్ = భూమండలమును; క్రమ్మఱన్ = మరల; నిల్పిన = నిలబెట్టిన; అట్టి = అటువంటి; నీ = నీ; కలితనము = నేర్పరితనము; ఎన్నన్ = ఎంచుటకు; విస్మయము = ఆశ్చర్యము; కాదు = కాదు; సమస్త = సమస్తమైన; జగత్తులు = భువనములును; ఓలి = క్రమము; మై = తో; కలుగన్ = సృష్టి; చేయుట = చేయుటలును; అద్భుతము = ఆశ్చర్యకరము; కాకన్ = అగునట్లు; మహా = మిక్కిలి; ఉన్నతిన్ = గొప్పతనముతో; నీవు = నీవు; ఒనర్చు = ఆచరించు, చేయు; పెంపు = విస్తృతిని; అలరిన = చెందిన; కార్యముల్ = పనులు; నడపన్ = చేయుటకు; అన్యుల్ = ఇతరుల; కున్ = కు; తరమే = తరమా ఏమి; రమేశ్వరా = విష్ణుమూర్తి {రమేశ్వరుడు - రమ (లక్ష్మీదేవి) ఈశ్వరుడు (భర్త), విష్ణువు}.
భావము:- శ్రీవల్లభా! వాస్తవంగా ఆలోచిస్తే సమస్త లోకాలను క్రమానుసారంగా సృష్టించడ మన్నది, అత్యద్భుతమైన విషయం. అటువంటి శక్తి ముందు పాతాళంలో ఉన్న భూమిని యథాస్థితికి తెచ్చి నిలిపిన ఈ నీ సామర్ధ్యం ఏమంత ఆశ్చర్యాన్ని కలిగించలేదు. ఇటువంటి మహా కార్యాలు నిర్వహించటానికి నీవే సమర్ధుడవు. ఇతరులకు ఈ కృత్యాలు అసాధ్యాలు.

తెభా-3-434-చ.
ల జగన్నియామక విక్షణలీలఁ దనర్చు నట్టి నం
ధర! తావకస్ఫుర దుదారత మంత్రసమర్థుఁ డైన యా
జ్ఞికుఁ డరణిన్ హుతాశనుని నిల్పిన కైవడి మన్నివాస మౌ
కుఁ దలపోసి యా క్షితిఁ దృఢంబుగ నిల్పితి వయ్య; యీశ్వరా!

టీక:- సకల = సమస్తమైన; జగత్ = భువనములను; నియామక = నియమించుట యందలి; విచక్షణ = వివేకము యొక్క; లీలన్ = లీలతో; తనర్చుని = విలసిల్ల చేసేటి; అట్టి = అటువంటి; నందకధర = విష్ణుమూర్తి {నందకధరుడు - నందకము అను కత్తిని ధరించువాడు, విష్ణువు}; తావక = నీ యొక్క; స్ఫురత్ = వ్యక్తమగు; ఉదారత = గొప్పతనముతో; మంత్ర = మంత్రశక్తి కలిగిన; సమర్థుడు = సామర్థ్యము కలవాడు; ఐన = అయిన; యాజ్ఞికుడు = యజ్ఞము చేయు వాడు; అరణిన్ = అరణిలో {అరణి - కఱ్ఱపుల్లతో మధించుట ద్వారా అగ్నిని రగుల్చుటకైన సాధనము}; హుతాశనుని = అగ్నిహోత్రుని, నిప్పుని; నిల్పిన = రగిల్చు; కైవడిన్ = విధముగా; మత్ = మా యొక్క; నివాసము = నివాసము; ఔటన్ = అగుట; కున్ = కు; తలపోసి = ఆలోచించి; ఆ = ఆ; క్షితిన్ = భూమండలమును; దృఢంబుగన్ = గట్టిగా; నిల్పితివి = నిలబెట్టితివి; అయ్య = తండ్రి; ఈశ్వరా = విష్ణుమూర్తి {ఈశ్వరుడు - ఈశత్వము (ప్రభావము చూపు శక్తి) కలవాడు, విష్ణువు}.
భావము:- “నందకం” అనే ఖడ్గాన్ని ధరించినవాడా! ఈశ్వరుడా! ఓ శ్రీహరీ! నేర్పుతో సకల లోకాలను నియమబద్ధంగా ఏర్పాటు చేసిన నేర్పరివి. మంత్రసిధ్దుడైన యాజ్ఞికుడు ఆరణి యందు అగ్నిని నిలిపినట్లు నీవు దయపూని మేము నిలబడి మనుగడ సాధించడానికి ఈ భూమిని ఈ విధంగా సుస్థిరంగా నిలబెట్టావు.

తెభా-3-435-చ.
లిత వేదశాస్త్రమయ సౌకరమూర్తిఁ దనర్చుచున్ రసా
మున నుండి వెల్వడు నుదారత మేను విదుర్పఁ దత్సటో
చ్ఛలితము లైన బిందువుల సాధు తపోజన సత్యలోక వా
సు మగు మేము దోఁగి పరిశుద్ధి వహించితి మయ్య; మాధవా!

టీక:- సలలిత = గాయత్రీమంత్రము తోకూడిన, మనోజ్ఞము కలిగిన; వేద = వేదములు; శాస్త్ర = శాస్త్రములుతో; మయ = నిండిన; సౌకర = సౌకర్యమైన, వరాహము యొక్క; మూర్తిన్ = స్వరూపముతో; తనర్చుచున్ = వ్యాపించుతూ; రసాతలమునన్ = రసాతలము {రసాతలము - పాతాళాది సప్త అధోలోకములు యందలి ఒక లోకము}; నుండి = నుండి; వెల్వడున్ = బయటకు వచ్చు; ఉదారతన్ = వేగములో; మేను = శరీరము; విదుర్పన్ = విదిలించగా; తత్ = ఆ; సటన్ = జూలు నుండి; ఉచ్ఛలితములు = చిందుతున్నవి; ఐన = అయిన; బిందువులన్ = నీటి తుప్పరల వలన; సాధు = సాధులోకము; తపో = తపోలోకము; జన = జనలోకము; సత్య = సత్యలోకము; లోకవాసులము = లోకముల ఉండు వారము; అగు = అయిన; మేము = మేము; తోగి = మునిగి; పరిశుద్ధి = పరిశుద్ధిని; వహించితిమి = పొందితిమి; అయ్య = తండ్రి; మాధవా = విష్ణుమూర్తి {మాధవుడు - మానసములకు ధవుడు (ప్రభువు), విష్ణువు}.
భావము:- ఓ మాధవా! విష్ణుమూర్తీ! ఆహ్లాదంతో వేదశాస్ర స్వరూపమైన ఆదివరాహమూర్తివైన నీవు పాతాళంనుండి బయటికి వస్తూ సముద్రజలాలతో తడిచిన నీ శరీరాన్ని విదిలించావు. ఆ సమయంలో నీ మెడమీది జూలు నుండి నీటి చుక్కలు నలుదెసలా చిందాయి. పరమ పవిత్రా లయిన ఆ జల బిందువులలో తడిసి తపోలోకంలో, జనలోకంలో, సత్యలోకంలో, నివసించే మేమంతా ఎంతగానో పరిశుద్ధులము అయ్యాము.

తెభా-3-436-ఉ.
విశ్వభవస్థితిప్రళయ వేళల యందు వికారసత్త్వమున్
విశ్వము నీవ యై నిఖిల విశ్వము లోలి సృజింతు విందిరా
ధీశ్వర! యీశ! కేశవ! త్రయీమయ! దివ్యశరీర! దేవ! నీ
శాశ్వతలీల లిట్టి వని న్నుతిసేయఁగ మాకు శక్యమే?

టీక:- విశ్వ = విశ్వమునకు; భవ = సృష్టి; స్థితి = స్థితి; ప్రళయ = లయ; వేళలు = సమయముల; అందున్ = లో; వికార = మార్పులు పొందు; సత్త్వమున్ = సామర్థ్యమును; విశ్వమున్ = విశ్వము; నీవ = నీవే; ఐ = అయి; నిఖిల = సమస్తమైన; విశ్వములు = భువనములును; ఓలిన్ = క్రమబద్ధముగ; సృజింతువు = సృష్టించెదవు; ఇందిరాధీశ్వర = విష్ణుమూర్తి {ఇందిరాధీశ్వరుడు - ఇందిర (లక్ష్మీదేవి) అధీశ్వర (భర్త) అయినవాడు, విష్ణువు}; ఈశ = విష్ణుమూర్తి {ఈశుడు - ప్రభావము చూపకల వాడు, విష్ణువు}; కేశవ = విష్ణుమూర్తి {కేశవుడు - మంచి కేశములు కలవాడు, విష్ణువు}; త్రయీమయిదివ్యశరీర = విష్ణుమూర్తి {త్రయీమయ దివ్యశరీర - త్రయి (వేద) మయమైన దివ్య దేహము కలవాడు, వరాహమూర్తి, విష్ణువు}; దేవ = విష్ణుమూర్తి; నీ = నీ యొక్క; శాశ్వత = శాశ్వతములైన; లీలలు = లీలలు; ఇట్టివి = ఇటువంటివి; అని = అని; సన్నుతిన్ = సంస్తుతి; చేయగన్ = చేయుటకు; మాకు = మాకు; శక్యమే = శక్యమా ఏమి.
భావము:- ఓ రమావల్లభా! ఈశ్వరా! కేశవా! వేదమయా! దివ్య స్వరూపా! దేవదేవా! ఈ ప్రపంచం సృష్టించేది, రక్షించేదీ, లయంచేసేదీ నీవే. సర్వమూ నీవే అయి ఈ సమస్త లోకాలనూ మళ్ళీమళ్ళీ సృష్టిస్తున్నావు. అంతులేని నీ లీలలు “ఇటువంటివి” అని వర్ణించడం మా వల్ల కాదు.

తెభా-3-437-సీ.
పంకజోదర! నీ వపారకర్ముండవు-
వదీయకర్మాభ్ది పార మరయ
నెఱిఁగెద నని మది నిచ్చగించిన వాఁడు-
రికింపఁగా మతిభ్రష్టు గాఁక
విజ్ఞానియే చూడ విశ్వంబు నీ యోగ-
మాయాపయోనిధి గ్న మౌటఁ
దెలిసియుఁ దమ బుద్ధిఁ దెలియని మూఢుల-
నే మన నఖిలలోకేశ్వరేశ!

తెభా-3-437.1-తే.
దాసజనకోటి కతిసౌఖ్యదాయకములు
వితత కరుణాసుధాతరంగితము లైన
నీ కటాక్షేక్షణములచే నెఱయ మమ్ముఁ
జూచి సుఖులను జేయవో సుభగచరిత!"

టీక:- పంకజోదర = విష్ణుమూర్తి {పంకజోదరుడు - పంకజము (పద్మము) ఉదరమున కలవాడు, విష్ణువు}; నీవు = నీవు; అపార = అపారమైన; కర్ముండవు = కర్మములు కలవాడవు; భవదీయ = నీ యొక్క; కర్మా = చేయుపనులు అను; అబ్ధిన్ = సముద్రము యొక్క; పారమున్ = అంతుదరి, అవధులు; అరయన్ = తరచిచూసి; ఎఱిగెదన్ = తెలియుదును; అని = అని; మదిన్ = మనసులోన; ఇచ్చగించినవాడు = అనుకొనువాడు; పరికింపగన్ = పరిశీలించినచో; మతిభ్రష్టు = మతిపోయినవాడు, పిచ్చివాడు; కాకన్ = కాకుండగా; విజ్ఞానియే = తెలివైనవాడా ఏమి; చూడన్ = తరచి చూసినచో; విశ్వంబున్ = విశ్వము; నీ = నీ యొక్క; యోగమాయ = యోగమాయ అను; పయోనిధిన్ = సముద్రములో {పయోధి - నీరు కి నిధి వంటిది, సముద్రము}; మగ్నము = మునిగినది; ఔటన్ = అగుట వలన; తెలిసియున్ = తెలుస్తున్నప్పటికిని; తమ = తమ; బుద్ధిన్ = మనసులో; తెలియని = తెలియని; మూఢులన్ = మూర్ఖులను; ఏమనన్ = ఏమనవలెను; అఖిలలోకేశ్వరేశ = విష్ణుమూర్తి {అఖిలలోకేశ్వరేశ్వరుడు - సమస్తమైన లోకపాలకును ప్రభువు యైనవాడు, విష్ణువు}; దాస = దాసులు అయిన; జన = జనుల; కోటి = సమూహమున; కున్ = కు; అతి = మిక్కిలి; సౌఖ్య = సౌఖ్యమును; దాయకములు = ఇచ్చునవి; వితత = విస్తారమైన; కరుణా = దయతో కూడిన; సుధా = అమృతపు; తరంగితములు = తొణుకుచున్నవి; ఐన = అయినట్టి; నీ = నీ; కటాక్షములన్ = కటాక్షముల; చేన్ = చేత; నెఱయన్ = నిండుగా; మమ్మున్ = మమ్ములను; చూచి = చూసి; సుఖులను = సుఖముగ ఉండువారను; చేయవో = చేయుము; సుభగచరిత = సౌభాగ్యకరమైన ప్రవర్తన కలవాడ.
భావము:- వరాహా! దామోదరా! అఖిల లోక పాలకులకు ఈశ్వరుడు అయిన వాడా! మంగళ చరిత్రా! లోక కల్యాణం కోసం నీవు చేసే కార్యాలు అనంతాలు. “మహాసముద్రంవంటి వాటి అంతు తెలుసుకుంటాను.” అని అనుకునేవాడు మతి లేనివాడూ, అజ్ఞానీ అవుతాడు గాని విజ్ఞాని కాడు. ఈ సమస్త ప్రపంచం నీ యోగమాయా సముద్రంలో విలీనం అయి ఉందన్న సంగతి తెలిసి కూడా నీ ప్రభావాన్ని తెలియని మందబుధ్దులను ఏమనాలి. నీ చరణ దాసులకు సర్వదా సమధిక సౌఖ్యాన్ని కలిగించేవి, అపారమైన కరుణ అనే అమృత తరంగాలు పొంగిపొరలే నీ కడగంటి చూపులతో మమ్మల్ని చక్కగా చూసి సుఖసంతోషాలను అనుగ్రహించు.”

తెభా-3-438-క.
ని బ్రహ్మవాదు లగు స
న్మునివర్యులు భక్తియోగమున వినమితులై
మున మోదము ముప్పిరి
గొనఁ బొగడిరి ఖురవిదళితగోత్రిం బోత్రిన్.

టీక:- అని = అని; బ్రహ్మవాదులు = బ్రహ్మజ్ఞానమును పలుకువారు; అగు = అయిన; సత్ = మంచి; ముని = మునులలో; వర్యులు = శ్రేష్ఠులు; భక్తియోగమునన్ = భక్తియోగముచేత; వినమితులు = నమ్రత కలవారు; ఐ = అయి; మనమునన్ = మనసులో; మోదము = సంతోషము; ముప్పిరికొనన్ = పెనుగొనగా {ముప్పిరిగొను - మూడు రెట్లుగ పెరుగు, పెనుగొను}; పొగడిరి = పొగిడిరి; ఖుర = గిట్టలచే; విదళిత = చీల్చబడిన; గోత్రిన్ = కులపర్వతములు కలదానిని; పోత్రిన్ = వరాహమును.
భావము:- అని బ్రహ్మజ్ఞాన సంపన్నులైన మునివరేణ్యులు భక్తిప్రపత్తులతో వినయ వినమ్రతలతో, తమ అంతరంగాలలో ఆనంద తరంగాలు పొంగిపొర్లగా గిట్టలతో పర్వతాలను సైతం పగులగొట్టే జగజ్జెట్టి యైన వరాహస్వామిని ప్రస్తుతించారు.

తెభా-3-439-ఉ.
అంట లీలఁబోలె జగదాత్ముఁడు యజ్ఞవరాహమూర్తి య
త్యం గభీర భీషణ మహార్ణవతోయ సమూహమున్ ఖురా
క్రాంముఁ జేసి క్రమ్మఱ ధరాతలమంబులమీద నిల్పి వి
శ్రాంతి వహింపఁ జేసి గుణశాలి దిరోహితుఁ డయ్యె నయ్యెడన్.

టీక:- అంతటన్ = అంతట; లీలన్ = వినోదముకోసము; పోలెన్ = వలె; జగదాత్ముడు = ఆదివరాహమూర్తి {జగదాత్ముడు - జగత్తు (విశ్వము) అంతకు ఆత్మయైనవాడు, విష్ణువు}; యజ్ఞవరాహమూర్తి = యజ్ఞవరాహమూర్తి {యజ్ఞవరాహమూర్తి - శ్రేష్ఠమైన వరాహము (పంది) రూపము ధరించినవాడు, విష్ణువు}; అత్యంత = బహుమిక్కిలి; గభీర = గంభీరమైన; భీషణ = భయంకరమైన; మహా = గొప్ప; ఆర్ణవ = సముద్రపు; తోయ = జల; సమూహమునున్ = రాశిని; ఖుర = గిట్టలచేత; ఆక్రాంతము = ఆక్రమింపబడినదిగ; చేసి = చేసి; క్రమ్మఱన్ = మరల; ధరాతలమున్ = భూమండలమును; అంబుల = నీటి; మీదన్ = మీద; నిల్పి = నిలబెట్టి; విశ్రాంతి = ఊరట; వహింపన్ = కలుగునట్లు; చేసి = చేసిన; గుణ = మంచిగుణములు; శాలి = కలవాడు; తిరోహితుఁడు = మాయమైనవాడు; అయ్యెన్ = అయ్యెను; ఆ = ఆ; ఎడన్ = సమయమున.
భావము:- పిమ్మట విశ్వరూపుడైన అ యజ్ఞవరాహమూర్తి మహా భయంకరమూ, అత్యంత గంభీరమూ ఐన ఆ సముద్రపు నీటిని అంతా తన గిట్టలతో ఆక్రమించి, మళ్లీ భూమిని ఎప్పటిలాగా సుఖంగా నీళ్లమీద నిలిచి ఉండేలా సుస్థిరం చేసాడు. తరువాత అనంత గుణ సంపన్నుడైన ఆ స్వామి అదృశ్యమయ్యాడు..

తెభా-3-440-ఉ.
మంళమైన యీ కథ సమంచితభక్తి బఠింప విన్నవా
రిం రుణార్ద్రదృష్టిఁ గని శ్రీహరి సాల బ్రసన్నుఁ డౌను స
త్సంతుఁ డైన విష్ణుఁడు ప్రన్నుఁడు దా నగునేని వారికిన్
మంళముల్ లభించు ననుమానము లే దదిగాక వెండియున్.

టీక:- మంగళము = శుభకరము; ఐన = అయినట్టి; ఈ = ఈ; కథన్ = కథను; సమంచిత = చక్కగా నొప్పుతున్న; భక్తిన్ = భక్తితో; పఠింపన్ = చదివిన; విన్నన్ = వినిన; వారిన్ = వారిని; కరుణా = దయతో; ఆర్ద్ర = ఆర్థ్రమైన; దృష్టిన్ = దృష్టితో; కని = చూసి; శ్రీహరి = విష్ణుమూర్తి; చాలన్ = మిక్కిలి; ప్రసన్నుడు = ప్రసన్నమైనవాడు; ఔను = అగును; సత్ = మంచివారితో; సంగతుడు = కూడినవాడు; ఐన = అయిన; విష్ణుడు = విష్ణుమూర్తి; ప్రసన్నుడు = ప్రసన్నమైనవాడు; తాను = తను; అగున్ = అయినట్లు; ఏని = అయితే; వారిన్ = వారి; కిన్ = కి; మంగళముల్ = శుభములు; లభించున్ = దొరుకును; అనుమానము = అనుమానము; లేదు = లేదు; అదిగాక = అంతేకాకుండ; వెండియున్ = ఇంకనూ.
భావము:- ఈ కధ శుభప్రదమైనది. ఈ కధను భక్తితో చదువువారిని, వినువారిని అందరినీ కరుణతో శ్రీమహావిష్ణువు కటాక్షిస్తాడు. అటువంటి వారి విషయంలో శ్రీహరి చాలా ప్రసన్నుడు అవుతాడు. ఆ విధంగా, శ్రీహరి ప్రసన్నుడైన వారికి సమస్త సన్మంగళాలూ సంప్రాప్తిస్తాయి. ఇందుకు సందేహం లేదు.

తెభా-3-441-చ.
రి నిజదాసకోటికిఁ దదాశ్రయులై రమియించు నట్టి స
త్పురుషుల కిష్ట వస్తు పరిపూర్ణ మనోరథసిద్ధి గల్గు సు
స్థి మగుచున్న ముక్తియును సిద్ధముగాఁ జెలువారు నన్న న
స్థితర తుచ్ఛ సౌఖ్యములు సేకురుటల్ మఱి చెప్పనేటికిన్.

టీక:- హరి = విష్ణుమూర్తి; నిజ = తన; దాస = భక్తులు; కోటికిన్ = అందరకు; తత్ = వారిని; ఆశ్రయులు = ఆశ్రయించినవారు; ఐ = అయి; రమియించున్ = ఆనందించు; అట్టి = అట్టి; సత్ = మంచి; పురుషుల = పురుషుల; కిన్ = కి; ఇష్ట = ఇష్టమైన, కోరిన; వస్తు = వస్తువులును; పరిపూర్ణ = పూర్తిగా తీరిన; మనోరథ = ఆశించిన కోర్కెలు; సిద్ధి = సిద్ధించుట; కల్గు = కలుగును; సుస్థిరము = శాశ్వతము; అగుచున్ = అవుతూ; ఉన్న = ఉన్నట్టి; ముక్తియును = ముక్తికూడా {ముక్తి - భవబంధాలు నుండి పూర్తి విడుదల, మోక్షము}; సిద్ధముగన్ = అవశ్యము, తప్పక; చెలువారునున్ = చక్కగా లభించును; అన్నన్ = అంటే; అస్థిరతర = మిక్కిలి అస్థిరమైన {అస్థిరము - అస్థిరతరము - అస్థిరతమము}; తుచ్ఛ = నీచమైన; సౌఖ్యములున్ = సౌఖ్యములు; చేకూరుటల్ = సిద్ధించుట; మఱి = మరి; చెప్పన్ = చెప్పుట; ఏటికిన్ = ఎందులకు.
భావము:- తన భక్తుల హృదయాంతరాళాలలో, విష్ణుమూర్తి విలాసంగా విహరిస్తూ ఉంటాడు. అటువంటి సజ్జనులకు కోరిన వస్తువులన్నీ సమృద్ధిగా సిద్ధిస్తాయి. అక్షయమైన మోక్షం అరచేతిలో ఉన్నంత సులువుగా అందుబాటులో ఉంటుంది అంటే ఇక అస్థిరమైన సామాన్య వస్తువుల విషయం వేరే చెప్పాలా?

తెభా-3-442-ఉ.
కా సరోజలోచన జత్త్సవనీయ కథాసుథారసం
బానిన యట్టి జిహ్వ యసన్యకథాలవణోదకంబులం
బాముసేయఁ జూచునె సుర్వ మహీజ మరందపాన లా
భానుభవంబు నొందు మధుపంబునుఁ బోవునె వేపచెట్లకున్."

టీక:- కాన = కావున; సరోజలోచన = విష్ణుమూర్తి {సరోజలోచనుడు - సరోజము (పద్మము) వంటి కన్నులు ఉన్నవాడు, విష్ణువు}; జగత్ = లోకములను; స్తవనీయ = స్తుతింపదగిన; కథా = కథలు అను; సుధారసంబు = అమృతము; ఆనిన = త్రాగిన (శబ్దరత్నాకరము); అట్టి = అట్టి; జిహ్వ = నాలుక; అసత్ = చెడ్డవి యైన; అన్యన్ = ఇతరుల; కథా = కథలు అను; లవణ = ఉప్పు; ఉదకంబులన్ = నీటిని; పానమున్ = తాగుట; చేయన్ = చేద్దామని; చూచునే = చూస్తుందా ఏమిటి; సుపర్వమహీజ = కల్పవృక్షపు {సుపర్వమహీజము - సుపర్వు (దేవత)ల మహీజము (చెట్టు), కల్పవృక్షము}; మరంద = తేనెను; పాన = తాగుట; లాభ = ప్రాప్తించిన; అనుభవము = అనుభవమును; ఒందు = పొందెడి; మధుపంబులున్ = తేనెటీగలు; పోవునే = వెళ్ళునా ఏమి; వేప = వేప; చెట్లు = చెట్ల; కున్ = కి.
భావము:- అందువల్ల సమస్త లోకాలకూ స్తుతింపదగినవి అయిన విష్ణుదేవుని కథలు అనే అమృత ధారలను కమ్మగా త్రాగిన నాలుక, అసత్యాలు అయిన ఇతర కథలు అనే ఉప్పునీళ్లను తాగడానికి ఇష్టపడుతుందా? నందనవనంలోని మందార మకరందాన్ని, త్రాగటం అలవాటైన మేటి తుమ్మెద వేపచెట్ల వైపు వెళ్ళాలనుకుంటుందా?”

తెభా-3-443-క.
ని మైత్రేయమునీంద్రుం
ఘుఁడు విదురునకుఁ జెప్పి ట్టి తెఱంగ
ర్జుపౌత్రునకున్ వ్యాసుని
యుఁడు వినిపించి మఱియుఁ గ నిట్లనియెన్.

టీక:- అని = అని; మైత్రేయ = మైత్రేయుడు అను; ముని = మునులలో; ఇంద్రుండున్ = శ్రేష్ఠుడు; అనఘుడు = పుణ్యుడు; విదురున్ = విదురుని; కున్ = కి; చెప్పిన = చెప్పిన; అట్టి = అటువంటి; తెఱంగు = విధమును; అర్జున = అర్జునుని {అర్జునపౌత్రుడు - అర్జునుని మనుమడు, పరీక్షిత్తుమహారాజు}; పౌత్రునన్ = మనుమని; కున్ = కి; వ్యాసునిన్ = వేదవ్యాసుని {వ్యాసునితనయుడు - వేదవ్యాసుని పుత్రుడు, శుకమహర్షి}; తనయుడు = కొడుకు; వినిపించియున్ = చెప్పి; మఱియున్ = ఇంకనూ; తగన్ = తగినట్లు; ఇట్లు = ఈ విధముగా; అనియెన్ = పలికెను.
భావము:- అని మైత్రేయమహర్షి వికార విదూరుడైన విదురునకు వినిపించిన ఈ కథా విధానాన్ని వ్యాసమునీంద్రుని పుత్రుడైన శుకమహర్షి అర్జునుని మనుమడు అయిన పరిక్షన్నరేంద్రునికి వినిపించి ఇంకా ఇలా అన్నాడు.

తెభా-3-444-క.
"అని చెప్పిన మైత్రేయుని
నుగొనిఁ విదురుండు పల్కు నతర మగు నా
నుజకులాంతకు చరితము
విని తనియదు నామనంబు విమలచరిత్రా!

టీక:- అని = అని; చెప్పిన = చెప్పినట్టి; మైత్రేయునిన్ = మైత్రేయుని; కనుగొని = చూసి; విదురుండు = విదురుడు; పల్కు = పలికెను; ఘనతరము = మిక్కిలి గొప్పది {ఘనము - ఘనతరము - ఘనతమము}; అగు = అయిన; ఆ = ఆ; దనుజకులాంతకున్ = విష్ణుని {దనుజకులాంతకుడు - దనుజ (రాక్షస) కులము (వంశము)ను అంతము చేయువాడు, విష్ణువు}; చరితమున్ = చరిత్ర; విని = విని; తనియదు = తృప్తిపడదు; నా = నా యొక్క; మనంబున్ = మనసు; విమల = నిర్మలమైన; చరిత్రా = ప్రవర్తన కలవాడా.
భావము:- మైత్రేయుడు ఇలా చెప్పగా వినిన విదురుడు ఇలా అన్నాడు. “సచ్చరిత్రుడా! పరమ పవిత్రమైన విష్ణుదేవుని చరిత్రం ఎంత విన్నా నా మనస్సుకు తనివితీరకుండా ఉంది.

తెభా-3-445-చ.
నవరాహమూర్తికథ ర్వము నీ దయ వింటి వెండియున్
విరముగా వినం బలుకవే గుణసాంద్ర! మునీంద్రచంద్ర! మా
గుణకీర్తనామృత వితానముఁ గర్ణపుటాంజలిన్ వెసం
విఁగొన కేల మాను జన సంతతికిన్ భవతాపవేదనల్.

టీక:- సవనవరాహమూర్తి = యజ్ఞవరాహమూర్తి; కథ = కథ; సర్వమున్ = అంతయును; నీ = నీ యొక్క; దయన్ = దయ వలన; వింటిన్ = వింటిని; వెండియున్ = మరియును; వివరముగా = వివరముగా; వినంబలుకవే = చెప్పుము {వినంబలుకు - వినునట్లు పలుకు, చెప్పు}; గుణ = చక్కటి గుణములు; సాంద్ర = చిక్కగా కలవాడ; ముని = మునులలో; ఇంద్ర = శ్రేష్ఠమైన; చంద్ర = చంద్రుని వంటి వాడ; మాధవ = భగవంతుని {మాధవుడు - మానసములకు ధవుడు (ప్రభువు), విష్ణువు}; గుణ = గుణములను; కీర్తనా = కీర్తించుటలు అను; అమృత = అమృత; వితానము = ప్రవాహములు; కర్ణ = చెవుల; పుట = దొప్పలు అను; అంజలిన్ = దోసిళ్ళతో; వెసన్ = శ్రీఘ్రమే; చవిగొనకన్ = రుచిచూడక పోయినచో; ఏలన్ = ఎందులకు; మానున్ = మానును; జన = జనుల; సంతతికిన్ = సంతతకి; భవ = సంసార; తాప = తాపములు; వేదనల్ = వేదనలును.
భావము:- మునీశ్వరా! సుగుణసాంద్రా! యజ్ఞవరాహమూర్తి కథ నీ దయవల్ల విన్నాను. కానీ ఇంకా విశదంగా వివరించి చెప్పు. మధురాతి మధురమైన విష్ణు కథా సుథా రసాన్ని చెవులనే దోసిళ్ళతో ఆస్వాదించకపోతే మానవుల సంసార తాపాలు తీరవు కదా.

తెభా-3-446-వ.
కావున.
టీక:- కావునన్ = అందుచేత.
భావము:- అందుకని అడుగుతున్నాను.

తెభా-3-447-సీ.
శ్రీరి యజ్ఞవరా రూపముఁ దాల్చి-
మించి హిరణ్యాక్షుఁ ద్రుంచె ననుచు
ప్పుడు మునినాథ చెప్పితి నాతోడ-
వ్వరాహంబు దంష్ట్రాగ్రమునను
రణి నెబ్భంగిని రియించె హరికి హి-
ణ్యాక్షుతోడ వైమున కేమి
కారణ మసుర నే తి సంహరించెఁ దా-
నింతయు నెఱిఁగింపు మిద్ధచరిత!"

తెభా-3-447.1-తే.
నిన మైత్రేయముని విదురుకు ననియె
"రికథాకర్ణనమునఁ బెంపార నీకు
న్మఫలసిద్ధి యగుటకు సందియంబు
లదు హరిమాయ విధికైన శమె తెలియ?

టీక:- శ్రీహరి = విష్ణుమూర్తి {శ్రీహరి - శోభనకరమైన హరి, విష్ణువు}; యజ్ఞవరాహ = యజ్ఞవరాహ; రూపము = అవతారము; తాల్చి = ధరించి; మించి = అతిశయించి; హిరణ్యాక్షున్ = హిరణ్యాక్షుని {హిరణ్యాక్షుడు - హిరణ్య (బంగారము) వంటి కన్నులు ఉన్నవాడు, హిరణ్యాక్షుడు అను రాక్షసుడు}; త్రుంచెన్ = సంహరించెను; అనుచున్ = అంటూ; అప్పుడు = అప్పుడు; ముని = మునులకు; నాథ = నాయకుడా; చెప్పితి = తెలియజేసితివి; నా = నా; తోడన్ = తోటి; ఆ = ఆ; వరాహంబున్ = ఆదివరాహమూర్తి; దంష్ట్తా = కోరల; అగ్రముననున్ = చివరలయందు; ధరణిన్ = భూమండలమును; ఎబ్బంగిన్ = ఏ విధముగా; ధరియించెన్ = ధరించెను; హరి = ఆదివరాహమూర్తి {హరి - భరించువాడు, విష్ణువు}; హిరణ్యాక్షున్ = హిరణ్యాక్షుని; తోడన్ = తోటి; వైరమున్ = శత్రుత్వమున; కున్ = కి; ఏమి = ఏమిటి; కారణము = కారణము; అసురున్ = రాక్షసుని; ఏ = ఏ; గతిన్ = విధముగా; సంహరించెన్ = సంహరించెను; తాన్ = అతను; ఇంతయున్ = ఇదంతా; ఎఱింగింపుము = తెలుపుము; ఇద్ద = ప్రసిద్దమైన; చరిత = వర్తనకలవాడ;
అనినన్ = అనగా; మైత్రేయ = మైత్రేయడు అను; ముని = ముని; విదురున్ = విదురుని; కున్ = కి; అనియెన్ = చెప్పెను; హరి = విష్ణుమూర్తి; కథా = కథలను; ఆకర్ణనమునన్ = వినుటచేత; పెంపార = అతిశయించిన; నీకున్ = నీకు; జన్మ = జననము; ఫలసిద్ధి = సార్థకము; అగుట = అగుట; కున్ = కి; సందియంబు = అనుమానము; వలదు = లేదు; హరి = విష్ణుమూర్తి; మాయన్ = మాయను; విధి = బ్రహ్మదేవుని {విధి - జీవుల విధిని నిర్ణయించువాడు (నుదుట వ్రాయువాడు), బ్రహ్మదేవుడు}; కిన్ = కి; ఐనన్ = అయినప్పటికిని; వశమే = సాధ్యమగునాఏమి; తెలియన్ = తెలిసికొనుట.
భావము:- శ్రీమహావిష్ణువు యజ్ఞవరాహ రూపం ధరించి విజృంభించి హిరణ్యాక్షుడనే రాక్షసుణ్ణి సంహరించాడని చెప్పావు కదా! ఓ మునీశ్వరా! ఓ పవిత్ర చరిత్రుడా! ఆ వరాహం తన కోర చివర ఈ ధరణీ మండలాన్ని ఎలా ధరించింది? హిరణ్యాక్షునికి, విష్ణువునకూ విరోధం రావడానికి కారణం ఏమిటి? ఆ రాక్షసుణ్ణి శ్రీహరి ఏవిధంగా సంహరించాడు? సవిస్తరంగా ఇదంతా నాకు చెప్పు” అనగా, మైత్రేయుడు విదురునితో ఇట్లా అన్నాడు. నాయనా, ఆ శ్రీహరి కధలు వినాలి అనే ఆసక్తి గల నీకు జన్మ సాఫల్యం సిద్ధించింది. ఇందుకు సందేహం లేదు. ఆ శ్రీమన్నారాయణుని మాయ తెలుసుకోవడానికి బ్రహ్మకైనా తరం కాదు.

తెభా-3-448-క.
ఘాత్మ నన్ను నీ వడి
గి యీ కథ ధ్రువుఁడు విష్ణుకీర్తనపరతం
రిన నారదు నడుగ న
ని కతఁ డెఱిఁగింప హరికథాశ్రవణమునన్

టీక:- అనఘాత్మ = పుణ్యాత్ముడా; నన్నున్ = నన్ను; నీవున్ = నీవు; అడిగిన = అడిగినట్టి; ఈ = ఈ; కథ = కథ; ధ్రువుడు = ధ్రువుడు {ధ్రువుడు - విష్ణువును గూర్చి బాలునిగనే తపస్సుచేసి ధ్రువతారగా ధ్రువపదమును పొందిన చిరంజీవి}; విష్ణు = విష్ణుని {విష్ణువు - ప్రకాశించు లక్షణము కలవాడు, భగవంతుడు}; కీర్తన = కీర్తించుట యందు; పరతన్ = ఆసక్తితో; తనరిన = విలసిల్లిన; నారదున్ = నారదుని; అడుగన్ = అడగగా; అతడు = అతడు; అతని = అతని; కిన్ = కి; ఎఱింగింపన్ = తెలుపగా; హరి = విష్ణుని; కథా = కథలను; శ్రవణమునన్ = వినుటవలన.
భావము:- ఓ పుణ్యపురుషుడా! నీవు అడిగిన ఈ కథను పూర్వం ధ్రువుడు పరమ విష్ణు భక్తుడు అయిన నారదుణ్ణి అడిగి తెలుసుకున్నాడు. హరికథా శ్రవణం వల్ల అతడెంతో మహిమాన్వితుడైనాడు.

తెభా-3-449-తే.
దండధరుఁ బెల్చ డాకాలఁ న్ని ధ్రువుఁడు
నిందు నందును వాసికి నెక్కె నట్టి
విష్ణుసంకీర్తనం బరవిందభవుఁడు
దివిజులకుఁ జెప్పె నది నీకుఁ దేటపఱతు.

టీక:- దండధరున్ = యముని {దండధరుడు - దండించు బాధ్యతను ధరించిన (స్వీకరించిన) వాడు, యముడు}; పెల్చ = అతిశయముతో; డాకాలన్ = ఎడమ కాలితో; తన్ని = తన్ని; ధ్రువుడు = ధ్రువుడు; ఇందున్ = ఇహము నందును; అందునన్ = పరము నందును; వాసి = ప్రసిద్ధ; కిన్ = కి; ఎక్కెన్ = ఎక్కెను; అట్టి = అటువంటి; విష్ణున్ = విష్ణుని; సంకీర్తనంబున్ = చక్కటిస్తుతిని; అరవిందభవుడు = బ్రహ్మదేవుడు {అరవిందభవుడు - అరవిందము (పద్మము)న భవుడు (పుట్టినవాడు), విష్ణువు}; దివిజుల్ = దేవతల; కున్ = కు; చెప్పెన్ = చెప్పెను; అది = అది; నీకున్ = నీకు; తేటపఱతున్ = అర్థమగునట్లు తెలిపెదను.
భావము:- అటువంటి ప్రభావాన్ని సంపాదించిన ధ్రువుడు యమధర్మరాజును ఎడమకాలితో తన్ని ఈ లోకంలోనూ, పర లోకంలోనూ కూడా ప్రసిద్ధికెక్కి ఉన్నతపదాన్ని అందుకున్నాడు. అటువంటి వాసుదేవుని లీలావిశేషాలను బ్రహ్మదేవుడు దేవతలకు చెప్పాడు. అదంతా నీకు విశదంగా చెప్తాను.