పోతన తెలుగు భాగవతము/తృతీయ స్కంధము/బ్రహ్మ జన్మ ప్రకారము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search


తెభా-3-271-వ.
ఇట్లు భగవత్ప్రోక్తంబును, ఋషిసంప్రదాయానుగతంబునుఁ, బురుషోత్తమ స్తోత్రంబునుఁ, బరమపవిత్రంబును, భవలతాలవిత్రంబును నయిన భాగవతకథాప్రపంచంబు శ్రద్ధాళుండవు భక్తుండవు నగు నీకు నుపన్యసించెద; వినుము.
టీక:- ఇట్లు = ఈవిధముగ; భగవత్ = భగవంతునిచే; ప్రోక్తంబును = చెప్పబడినదియును; ఋషి = ఋషుల; సంప్రదాయ = సంప్రదాయమును {సంప్రదాయము - తరతరములుగా ఇవ్వబడుచున్నది}; అనుగతంబునున్ = అనుసరించునదియును; పురుషోత్తమ = విష్ణుని {పురుషోత్తముడు - పురుషులలో ఉత్తముడు, విష్ణువు}; స్తోత్రంబునున్ = స్తుతించునదియును; పరమ = మిక్కిలి; పవిత్రంబునున్ = పవిత్రమైనదియును; భవ = సంసారము అను; లతా = తీగలకు; లవిత్రంబునున్ = కొడవలి వంటిదియును; అయిన = అయినట్టి; భాగవత = భాగవతము అను; కథా = కథల యొక్క; ప్రపంచమున్ = మిక్కిలి విస్తార రచనను; శ్రద్ధా ళుండవు = శ్రద్ధ కలవాడవు; భక్తుండవు = భక్తుడవు; అగు = అయినట్టి; నీకున్ = నీకు; ఉపన్యసించెద = వివరముగా చెప్పెదను; వినుము = వినుము.
భావము:- ఇలా భగవంతునిచే చెప్పబడినదీ, ఋషుల సంప్రదాయానుసారంగా అందుబాటులోకి వచ్చినదీ, పురుషోత్తముడైన పుండరీకాక్షుని స్తోత్రం కలదీ, పరమపావన మైనదీ, భవబంధాలను తెగటార్చేదీ ఐన భాగవత కథావిధానాన్ని భక్తుడవూ ఆసక్తుడవూ అయిన నీకు విశదీకరించుతాను. విను.

తెభా-3-272-సీ.
నఘ! యేకోదకమై యున్నవేళ నం-
ర్నిరుద్ధానల దారు వితతి
భాతిఁ జిచ్ఛక్తి సమేతుఁడై కపట ని-
ద్రాలోలుఁ డగుచు నిమీలితాక్షుఁ
డైన నారాయణుం డంబు మధ్యమున భా-
సుర సుధాఫేన పాండుర శరీర
రుచులు సహస్ర శిరోరత్నరుచులతోఁ-
జెలమిసేయఁగ నొప్పు శేషభోగ

తెభా-3-272.1-తే.
ల్పమునఁ బవ్వళించి యల్ప తత్త్వ
దీప్తిఁ జెన్నొందఁగా నద్వితీయుఁ డగుచు
భిరతుం డయ్యుఁ గోర్కుల యందుఁ బాసి
ప్రవిమలాకృతి నానందరితుఁ డగుచు.

టీక:- అనఘ = పుణ్యుడా; ఏకో = ఒకే; ఉదకము = జలమయము; ఐ = అయ్యి; ఉన్న = ఉన్న; వేళ = సమయమున; అంతర్ = లోపల; నిరుద్ధ = అడ్డగించబడిన; అనిల = అగ్ని; దారు = కట్టెల; వితతి = మోపు; భాతిన్ = వలె; చిత్ = చైతన్య; శక్తిన్ = శక్తితో; సమేతుడు = కూడినవాడు; ఐ = అయ్యి; కపట = కపట; నిద్రా = విద్రతో; లోలుడు = మునిగినవాడు; అగుచున్ = అవుతూ; నిమీలిత = మూసిన; ఆక్షుడు = కన్నులు కలవాడు; ఐన = అయినట్టి; నారాయణుండు = నారాయణుడు {నారాయణుడు - నారములు (నీళ్ళు) నందు వసించువాడు, విష్ణువు}; అంబు = నీటి; మధ్యంబునన్ = మధ్యలో; భాసుర = ప్రకాశించుచున్న; సుధా = అమృతము; ఫేన = నురగ వలె; పాండు = తెల్లని; శరీర = దేహ; రుచులు = ఛాయ; సహస్ర = వేయి; శిరస్ = తలలపై నున్న; రత్న = రత్నముల; రుచుల = కాంతుల; తోన్ = తో; చెలిమి = స్నేహము; చేయగన్ = చేస్తున్నట్లు; ఒప్పు = ఒప్పిఉండే; శేష = ఆదిశేషుని; భోగ = శరీరపు; తల్పమున = పాన్పున; పవ్వళించి = శయనించి;
అనల్ప = అధికమైవ; తత్త్వ = తత్త్వము యొక్క; దీప్తిన్ = ప్రకాశముతో; చెన్నొందగ = అందము అతిశయించగా; అద్వితీయుండు = అసమానుడు {అద్వితీయుడు - ఇంకొకరు (పోల్చతగ్గవారు) లేనివాడు, అసమానుడు}; అగుచున్ = అవుతూ; అభిరతుడు = మిక్కిలి కుతూహలము (విష్ణుభక్తి యందు) కలవాడు; అయ్యు = అయినప్పటికిని; కోర్కులన్ = కోరికల; అందు = ఎడల; పాసి = తొలగి; ప్రవిమల = మిక్కిలి నిర్మలమైన; ఆకృతిన్ = ఆకారముతో; ఆనంద = ఆనందము; భరితుడు = నిండినవాడు; అగుచున్ = అవుతూ.
భావము:- ఓ విదురా! పూర్వం ప్రళయనమయంలో విశ్వమంతా జలమయంగా ఉన్నప్పుడు శ్రీమన్నారాయణుడు ఆదిశేషుణ్ణి పాన్పుగా చేనుకొని సముద్రమధ్యంలో పవ్వళించాడు. ఆ ఆదిశేషుడు స్వచ్ఛమైన అమృతపు నురుగులవంటి తెల్లనైన శరీరం కలవాడు. అతని తెల్లని శరీర కాంతులు అతని వేయి తలలపై తళతళలాడే రత్నాల కాంతులతో చెలిమి చేస్తున్నట్లుగా వెలుగొందాయి. నారాయణుడు తన కడుపులో అగ్నిని దాచుకొన్న కట్టెలా లోపల చైతన్యశక్తి కలవాడై ఉన్నాడు. అనంతమైన తత్త్వదీప్తితో అద్వితీయుడై ఆనందమయుడై కపటనిద్ర నభినయిస్తూ కన్నులు మూసుకొని ఉన్నాడు. కుతూహలం కలిగి కూడా కోర్కెలు లేనివానిలా నిష్కళంకమైన స్వరూపంతో విరాజిల్లాడు.

తెభా-3-273-తే.
యోగమాయా విదూరుఁడై యుగ సహస్ర
కాలపర్యంత మఖిల లోములు మ్రింగి
పేర్చి మఱి కాలశక్త్యుపబృంహితమున
మత సృష్టిక్రియాకలాములఁ దగిలి.

టీక:- యోగమాయా = యోగమాయ; విదూరుడు = దగ్గర దూరములు లేనివాడు {విదూరుడు - వ్యతిరిక్తమైన దూరము కలవాడు, దూరము దగ్గరలు లేనివాడు}; ఐ = అయి; యుగ = యుగముల; సహస్ర = వేయింటి; కాల = సమయము; పర్యంతము = అవధి వరకు; అఖిల = సమస్తమైన; లోకములున్ = భువనములను; మ్రింగి = మింగేసి; పేర్చి = అతిశయించి; మఱి = ఇంకను; కాల = కాలము యొక్క; శక్తి = శక్తి; ఉపబృంహితమున = సంవృద్దివలన; సమతన్ = చక్కగా; సృష్టి = సృష్టించుట అను; క్రియా = పనులు; కలాపంబులు = సమూహములలో; తగిలి = నిమగ్నుడై, ఆసక్తుడై.
భావము:- అలా యోగమాయకు కూడా దూరంగా వెయ్యి యుగాల పర్యంతం సమస్త లోకాలను తన కడుపులో దాచుకొని వెలుగొందుతూ ఆ పైన కాలమూ శక్తీ చక్కగా అభివ్యక్తం కాగా సమత్వం వహించి సృష్టికార్యం నిర్వహించటానికి ఆసక్తు డైనాడు.

తెభా-3-274-క.
జఠరములోపలఁ దాఁ
చి లోకనికాయముల సృజించుటకును సా
మగు సూక్ష్మార్థము మన
సునఁ గని కాలానుగత రజోగుణ మంతన్.

టీక:- తన = తన యొక్క; జఠరము = ఉదరము, పొట్ట; లోపలన్ = లోపల; దాచిన = దాచినట్టి; లోక = భువనముల; నికాయములన్ = సమూహములను; సృజించుటకు = సృష్టించుటకు; సాధనము = సాధనము; అగు = అయిన; సూక్ష్మ = సూక్ష్మమైన; అర్థమున్ = మార్గమును; మనసునన్ = మనసులో; కని = చూసి; కాలా = కాలమునకు; అనుగత = అనుసరించి; రజస్ = రజస్సు; గుణము = గుణము; అంతన్ = అంతట.
భావము:- అలా తన కడుపులో దాచుకున్న లోకాలన్నింటిని తిరిగి సృష్టించడానికి ఉపకరణాలైన సూక్ష్మ పదార్థాలను మనస్సులో భావించి, కాలానుగుణంగా రజోగుణాన్ని సృష్టించాడు.

తెభా-3-275-సీ.
పుట్టించెఁ దద్గుణంబునఁ బరమేశ్వరు-
నాభిదేశము నందు ళిననాళ
ముదయించె మఱి య ప్పయోరుహముకుళంబు-
ర్మబోధితమైన కాల మందుఁ
న తేజమునఁ బ్రవృద్ధంబైన జలముచే-
లజాప్తుగతిఁ బ్రకాశంబు నొందఁ
జేసి లోకాశ్రయస్థితి సర్వగుణవిభా-
సితగతి నొప్పు రాజీవ మందు

తెభా-3-275.1-తే.
నిజ కళాకలితాంశంబు నిలిపి దాని
లన నామ్నాయమయుఁడును రగుణుండు
నాత్మయోనియు నైన తోజభవుండు
రవిఁ జతురాననుండునా నన మయ్యె.

టీక:- పుట్టించెన్ = పుట్టించెను; తత్ = ఆ; గుణంబునన్ = గుణమునందు; పరమేశ్వరుని = విష్ణుని; నాభి = బొడ్డు; దేశమున్ = ప్రదేశము; అందున్ = అందు; నళిన = పద్మముయొక్క; నాళము = కాడ; ఉదయించెన్ = పుట్టినది; మఱి = మరి; ఆ = ఆ; పయోరుహ = తామర {పయోరుహము - పయస్ (నీట) పుట్టినది, పద్మము}; ముకుళంబు = మొగ్గ; కర్మ = కర్మముచే; బోధితము = చెప్పబడినది; ఐన = అయిన; కాలము = సమయము; అందున్ = అందు; తన = తనయొక్క; తేజమునన్ = తేజస్సుచే; ప్రవృద్ధంబు = బాగుగా పెరిగినది; ఐన = అయిన; జలము = నీరు; చేన్ = చేత; జలజాప్తున్ = సూర్యుని {జలజాప్తుడు - జలజ (పద్మము) నకు ఆప్తుడు, సూర్యుడు}; గతిన్ = వలె; ప్రకాశమున్ = ప్రకాశమును; ఒందన్ = పొందునట్లు; చేసి = చేసి; లోక = లోకములకు; ఆశ్రయ = నివాసమగుటకు; స్థితి = స్థితికలిగినదియు; సర్వ = సమస్తమైన; గుణ = గుణములతోను; విభాసిత = వెలుగొందు; గతిన్ = విధముగ; ఒప్పు = ఒప్పుచున్న; రాజీవము = పద్మము; అందున్ = అందు;
నిజ = తనయొక్క; కళా = కళతో; కలిత = కూడిన; అంశంబు = బాగము; నిలిపి = ఉంచి; దాని = దాని; వలన = వలన; ఆమ్నాయ = వేదముల; మయుండును = నిండినవాడును; వర = శ్రేష్ఠమైన; గుణుండు = గుణములుకలవాడును; ఆత్మ = స్వయం, తనకుతానే; యోనియున్ = భూతుడు, పుట్టినవాడు; ఐన = అయిన; తోయజసంభవుండు = బ్రహ్మదేవుడు {తోయజసంభవుడు - తోయజము (నీటపుట్టినది, పద్మము)న పుట్టినవాడు, బ్రహ్మదేవుడు}; సరవిన్ = క్రమముగ; చతురాననుండు = చతురాననుడు {చతురాననుడు - వ్యు. చత్వారి ఆననాని అస్య, బ.వ్రీ. నాలుగు ముఖములు కలవాడు, చతుర్ముఖబ్రహ్మ}; నా = అనగా; జననము = పుట్టుట; అయ్యెన్ = జరిగెను.
భావము:- ఆ విధంగా పుట్టించిన రజోగుణంవల్ల నారాయణుని నాభిలో నుండి మొగ్గతో కూడీన ఒక తామరతూడు జన్మించింది. సృష్టికార్యప్రభావితమైన కాలాన్ని అనుసరించి భగవంతుడు తన తేజస్సుచేత వృద్ధిపొందిన నీటినడుమ ఆ తామరమొగ్గను సూర్యునిలాగా వికసింపజేశాడు. లోకాలకు ఆశ్రయం ఇచ్చే స్థితినీ, సకలగూణాలతో ప్రకాశించే ప్రకృతినీ కలిగిఉన్న ఆ కమలంలో పరాత్పరుడు తన కళతోకూడిన అంశాన్ని ప్రసరింప జేశాడు. అప్పుడు ఆ పద్మంలో నుంచి సంపన్నుడూ, స్వయంభువుడూ, చతుర్ముఖుడూ అయిన బ్రహ్మదేవుడు ఉద్భవించాడు.

తెభా-3-276-తే.
తఁడు దత్పద్మకర్ణిక యందు నిలిచి
వికచలోచనుడై లోకవితతి దిశలు
నంబరంబును నిజ చతురాననములఁ
లయఁ బరికించి చూచుచుఁ మలభవుఁడు.

టీక:- అతడు = అతడు; తత్ = ఆ; పద్మ = పద్మము యొక్క; కర్ణిక = బొడ్డు; అందున్ = అందు; నిలిచి = ఉండి; వికచ = విచ్చుకొన్న; లోచనుండు = కన్నులు కలవాడు; ఐన = అయి; లోక = భువన; వితతిన్ = సమూహములను; దిశలున్ = దిక్కులును; అంబరమున్ = ఆకాశమును; నిజ = స్వంత; చతుర = నాలుగు; ఆననములన్ = ముఖములతోను; కలయన్ = వెతకి; పరికించి = పరిశీలనగా; చూచుచున్ = చూసి; కమలసంభవుండు = బ్రహ్మదేవుడు {కమలసంభవుడు - పద్మమున పుట్టువాడు, బ్రహ్మదేవుడు}.
భావము:- పద్మంలోనుంచి ప్రభవించిన ఆ బ్రహ్మ పద్మం పైభాగన నిలబడి, కన్నులు బాగా తెరచి లోకాలనూ, దిక్కులనూ, ఆకాశాన్ని తన నాల్గుమోములతో పరికించి చూడసాగాడు.

తెభా-3-277-చ.
ఘు యుగాంతకాలపవనాహత సంచల దూర్మిజాల సం
లిత జలప్రభూత మగు కంజముఁ దద్వనజాత కర్ణికా
మున నున్న తన్ను విశక్రియఁ గల్గిన లోకతత్త్వమున్
లిఁ దెలియంగనోపక మనంబునఁ జాల విచార మొందుచున్.

టీక:- అలఘు = గొప్ప; యుగ = యుగము; అంత = అంతమగు; కాల = సమయ మందలి; పవన = వాయువులచే; ఆహత = కొట్టబడుట వలన; సంచలత్ = మిక్కిలి కదిలిపోతున్న; ఊర్మి = అలల; జాల = సమూహములను; సంకలిత = బాగా కలిగి ఉన్న; జల = నీటి యందు; ప్రభూతము = పుట్టినది; అగు = అయిన; కంజమున్ = పద్మమును {కంజము - కం నందు(నీట) పుట్టినది}; తత్ = ఆ; వనజాత = పద్మము యొక్క {వనజాతము - వనమున (నీట) పుట్టినది, పద్మము}; కర్ణిక = బొడ్డు; తలమునన్ = ప్రదేశమున; ఉన్న = అన్నట్టి; తన్నున్ = తనను; విశద = స్పష్టమైన; క్రియన్ = విధముగ; కలిగిన = ఉన్న; లోక = భువన; తత్త్వమున్ = తత్త్వమును; నలిన్ = స్వల్పముగనైన; తెలియంగ = తెలిసికొన; ఓపక = లేక; మనంబునన్ = మనసులో; చాలన్ = చాలా; విచారమున్ = విచారమును; ఒందుచున్ = పొందుతూ.
భావము:- అంతులేని ప్రళయకాలం. చుట్టూ మహాజలం. ప్రచండమైన గాలులు వీస్తున్నాయి. అలలు లేచిపడుతున్నాయి ఆ జలమధ్యంలో ఒక పద్మం ఆ పద్మంమధ్య దుద్దుపై తాను స్పష్టమవుతూ ఉన్న లోకాల స్వరూపం ఇదంతా ఏమిటో అర్థంకాక. తెలుసుకోలేక చతుర్ముఖుడు తన మనస్సులో చాలా విచారాన్ని పొంది ఇలా వితర్కించాడు.

తెభా-3-278-వ.
ఇట్లని వితర్కించె.
టీక:- ఇట్లు = ఈవిధముగ; అని = అని; వితర్కించెన్ = మిక్కిలి తర్కించుకొనెను.
భావము:- ఇలా తర్కించుకుని.

తెభా-3-279-ఉ.
" లమందు నీ కమల మేగతి నుద్భవ మయ్యె నొంటి యే
నీ లజాతపీఠమున నేగతి నుంటి మదాఖ్య మెద్ది నా
కీ ననంబు నొందుటకు నెయ్యది హేతువు బుద్ధిఁ జూడ నే
యో నెఱుంగలే"నని పయోరుహగర్భుఁడు విస్మితాత్ముడై.

టీక:- ఈ = ఈ; జలము = నీటి; అందున్ = లో; ఈ = ఈ; కమలము = పద్మము; ఏ = ఏ; గతిన్ = విధముగ; ఉద్భవము = పుట్టుట; అయ్యెన్ = జరిగెను; ఒంటిన్ = ఒంటరిగ; ఏన్ = నేను; ఈ = ఈ; జలజాత = పద్మము యొక్క; పీఠమున = కర్ణికనందు, బొడ్డున; ఏ = ఏ; గతిన్ = విధముగ; ఉంటి = ఉన్నాను; మత్ = నాయొక్క; ఆఖ్యము = పేరు; ఎద్ది = ఏమిటి; నాకు = నాకు; ఈ = ఈ; జననంబున్ = పుట్టుకను; ఒందుట = పొందుట; కున్ = కు; ఎయ్యది = ఏది; హేతువు = కారణము; బుద్ధిన్ = ఆలోచించి; చూడన్ = చూడగా; ఏ = ఏ; ఓజన్ = విధముగను; ఎఱుంగలేను = తెలియలేను; అని = అని; పయోరుహగర్భుఁడు = బ్రహ్మదేవుడు {పయోరుహగర్భుఁడు - పయోరుహము (నీటపుట్టునది, పద్మము)న పుట్టినవాడు, బ్రహ్మదేవుడు}; విస్మిత = ఆశ్చర్యముతో; ఆత్ముడు = కూడినవాడు; ఐ = అయి.
భావము:- “ఈ నీటపై ఈ పద్మం ఏ విధంగా పుట్టింది? ఒంటరిగా నేను ఈ తామర గద్దెపై ఎలా ఉంటున్నాను? నా పేరు ఏమిటి? నాకు ఈ పుట్టుక రావడానికి కారణం ఏమిటి? ఎంత ఆలోచించినా ఈ క్రమం ఏమిటో తెలుసుకోలేక పోతున్నాను” అని బ్రహ్మదేవుడు ఆశ్చర్యచకితు డైనాడు.

తెభా-3-280-క.
నజనాళమూలం
బా నములలోన నర్థిఁ రయుటకొఱకై
యానజాతప్రభవుం
డా నరుహనాళవివర మందభిముఖుఁడై.

టీక:- ఆ = ఆ; వనజ = పద్మము యొక్క {వనజ - వనమున (నీట) పుట్టినది}; నాళ = గొట్టము, కాడ; మూలంబున్ = మొదలును, మూలమును; ఆ = ఆ; వనములు = నీళ్ళ; లోనన్ = లో; అర్థిన్ = కోరి; అరయుట = వెదకుట; కొఱకై = కోసము; ఆ = ఆ; వనజాతప్రభవుండు = బ్రహ్మదేవుడు {వనజాతప్రభవుడు - పద్మమున ప్రభవించినవాడు, బ్రహ్మదేవుడు}; ఆ = ఆ; వనరుహ = పద్మము యొక్క; నాళ = కాడ; వివరము = కన్నము; అందున్ = లోపల; అభిముఖుండు = వైపునకు తిరిగినవాడు, సంసిద్ధుడు; ఐ = అయి.
భావము:- ఆ తామరతూడు ఎక్కడ నుంచి పుట్టిందో, దాని మొదలు ఎక్కడో తెలుసుకోవాలని ఆ నీటిలో వెదకడంకోసం బ్రహ్మదేవుడు పద్మనాళం వెంట లోపలికి ప్రవేశించాడు.