Jump to content

పోతన తెలుగు భాగవతము/తృతీయ స్కంధము/కపిల దేవహూతి సంవాదంబు

వికీసోర్స్ నుండి


తెభా-3-867-క.
"అదింద్రియ ఘర్షణమున
సుమతి నిర్విణ్ణ నగుచు నరెడి నా కీ
దృశమోహతమో విని
నం బనఘాత్మ! యే వెవున ఘటించున్.

టీక:- అసత్ = చెడ్డవి యైన; ఇంద్రియ = ఇంద్రియముల; ఘర్షణమునన్ = ఒరిపిడిచే; వసుమతిన్ = భూమిపై; నిర్విణ్ణన్ = నిర్వేదము పొందినదానను; అగుచున్ = అవుతూ; వనరెడి = విలపించునట్టి; నాకు = నాకు; ఈ = ఈ; అసదృశ = తగని, వశముకాని; మోహ = మోహము అనెడి; తమస్ = చీకటిని; వినిరసనంబున్ = వదలుట; అనఘాత్మ = పుణ్యాత్ముడ; ఏ = ఏ; వెరవున్ = విధమున, ఉపాయమున; ఘటించున్ = కలుగును.
భావము:- “ఓ పుణ్యాత్మా! అసత్యలైన ఇంద్రియాల సంఘర్షణం వల్ల ఖిన్నురాలినై విచారిస్తున్న నాకు ఈ సాటిలేని మోహాంధకారంలోనుంచి బయటపడే అవకాశం ఏ ఉపాయం వల్ల కలుగుతుంది?

తెభా-3-868-క.
టు ఘననీరంధ్ర తమః
ల పరీవృత జగత్ప్రపంచమునకు నె
క్కటి లోచనమై మహితో
త్కరుచి వెలుగుదువు భానుకైవడి ననఘా!

టీక:- పటు = దట్టమైన; ఘన = మేఘముల యొక్క; నీరంధ్ర = సందు లేనట్టి; తమస్ = చీకట్ల; పటల = ముసుర్లు; పరీవృత = కమ్ముకొని; జగత్ = తిరుగుతున్న; ప్రపంచమున్ = ప్రపంచమున; కున్ = కు; ఎక్కటి = ఏకైక; లోచనము = కన్ను; ఐ = అయ్యి; మహిత = గొప్ప; ఉత్కట = మహోజ్వలమైన; రుచిన్ = కాంతితో; వెలుగుదువు = ప్రకాశింతువు; భానుని = సూర్యుని; కైవడిన్ = వలె; అనఘా = పుణ్యుడా.
భావము:- ఓ పుణ్యాత్మా! దట్టమైన కారుమేఘాల చీకట్లతో ఆవరింపబడిన ఈ మహాప్రపంచానికి నీవు ఒక్కడివే ఏకైక నేత్రమై సూర్యునివలె వెలుగుతూ ఉంటావు.

తెభా-3-869-ఉ.
భూరి మదీయ మోహతమముం బెడఁబాప సమర్థు లన్యు లె
వ్వాలు నీవకాక నిరద్య! నిరంజన! నిర్వికార! సం
సాలతాలవిత్ర! బుధత్తమ! సర్వశరణ్య! ధర్మవి
స్తాక! సర్వలోకశుభదాయక! నిత్యవిభూతినాయకా!

టీక:- భూరి = అత్యధికమైన {భూరి - 1 తరవాత 34 సున్నాలు ఉండు సంఖ్య అదే కోటి అయితే 7 సున్నాలే}; మదీయ = నా యొక్క; మోహ = మోహము అనెడి; తమమున్ = చీకటిని; ఎడబాప = దూరము చేయుట; సమర్థులు = చేయగలవారు; అన్యులు = ఇతరులు; ఎవ్వారలు = ఎవ రున్నారు; నీవ = నీవు; కాక = కాకుండగ; నిరవద్య = లోపములు లేనివాడ; నిరంజన = అసహాయ దర్శనుడ; నిర్వికార = మనోవికారములు లేనివాడ; సంసారలతాలవిత్ర = సంసారమను లతలకు కొడవలి వంటివాడ; బుధసత్తమ = జ్ఞానులలో ఉత్తమ; సర్వశరణ్య = సర్వులకును శరణ్యమైనవాడ; ధర్మవిస్తారక = ధర్మమును విస్తరించువాడ; సర్వలోకశుభదాయక = సమస్త లోకములకు శుభములు కలిగించువాడ; నిత్యవిభూతినాయకా = శాశ్వతమైన వైభవములను నడపువాడ.
భావము:- లోపాలు లేనివాడవు, అసహాయ దర్శనం కలవాడవు, మనోవికారాలు లేనివాడవు, సంసారమనే తీగలకు కొడవలి వంటివాడవు, జ్ఞానులలో ఉత్తముడవు, అందరికి శరణు కోరదగినవాడవు, ధర్మమును విస్తరించేవాడవు, శాశ్వతమైన వైభవములకు అధినాయకుడవు అయిన ఓ కపిలా! నా అంతులేని వ్యామోహమనే చీకటిని దూరం చేయడానికి నీవు కాక ఇతరు లెవరున్నారు?

తెభా-3-870-చ.
నిను శరణంబు జొచ్చెద ననింద్యతపోనిధి! నన్నుఁ గావవే"
ని తను దేవహూతి వినయంబున సన్నుతిసేసి వేడఁగా
నుపమసత్కృపాకలితుఁ డై కపిలుం డనురాగ మొప్ప స
జ్జ నిచయాపవర్గ ఫలసాధనమై తగు తల్లివాక్యమున్.

టీక:- నినున్ = నిన్ను; శరణంబున్ = శరణు; చొచ్చెదన్ = వేడెదను; అనింద్య = నిందలేని; తపోనిధి = తపస్సునకు నివాసమా; నన్నున్ = నన్ను; కావవే = కాపాడుము; అని = అని; తను = తనను; దేవహూతి = దేవహూతి; వినయంబునన్ = వినమ్రమముగ; సన్నుతి = చక్కటి స్తోత్రము; చేసి = చేసి; వేడగా = వేడుకొనగా; అనుపమ = సాటిలేని; సత్ = మంచి; కృపా = దయ; కలితుడు = కలవాడు; ఐ = అయ్యి; కపిలుండు = కపిలుడు; అనురాగము = స్నేహభావము; ఒప్పన్ = ఒప్పునట్లు; సత్ = మంచి; జన = వారి; నిచయ = సమూహమునకు; అపవర్గ = మోక్ష; ఫల = ఫలితమును ఇచ్చు; సాధనము = సాధనము; ఐ = అయ్యి; తగు = తగినట్టి; తల్లి = తల్లి యొక్క; వాక్యమున్ = మాటలను.
భావము:- ఓ మహాతపస్సంపన్నా! నిన్ను శరణు వేడుచున్నాను. నన్ను కాపాడు” అని దేవహూతి వినయంగా ప్రార్థించగా కపిలుడు సాటిలేని మేటి దయతో సజ్జనులకు మోక్షాన్ని ఇవ్వడానికి తగిన సాధనమైన తల్లి మాటలను అనురాగ పూర్వకంగా...

తెభా-3-871-క.
విని మందస్మిత లలితా
కమలుం డగుచు నెమ్మమునఁ బ్రమోదం
యంబు గడలుకొన నిజ
నికి నిట్లనియెఁ బరమశాంతుం డగుచున్.

టీక:- విని = విని; మందస్మిత = చిరునవ్వుతో; లలితా = అందమైన; ఆనన = మోము అనెడి; కమలుండు = కమలము కలవాడు; అగుచున్ = అవుతూ; నెఱి = నిండైన; మనంబునన్ = మనసులో; ప్రమోదంబున్ = సంతోషము; అనయంబున్ = మిక్కిలిగ; కడలుకొనన్ = అతిశయింపగా; నిజ = తన; జనని = తల్లి; కిన్ = కి; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను; పరమ = అత్యంత; శాంతుడున్ = శాంతము కలవాడు; అగుచున్ = అవుతూ.
భావము:- విని, మందహాస సుందర వదనారవిందుడై మనస్సులో సంతోషం అతిశయించగా పరమశాంతుడై కన్నతల్లితో ఇలా అన్నాడు.

తెభా-3-872-క.
"విను జీవుని చిత్తము దా
భవబంధాపవర్గకారణ మది యే
చినఁ ద్రిగుణాసక్తం బయి
ను సంసృతిబంధకారణం బగు మఱియున్.

టీక:- విను = వినుము; జీవుని = ప్రాణి యొక్క; చిత్తము = మనసు; తాన్ = అది; ఘన = గొప్ప; భవ = సంసార; బంధ = బంధములకును; అపవర్గ = మోక్షమునకు; కారణమున్ = కారణము; అది = అది; యేచిన = ఉద్రేకించినట్టి; త్రి = మూడు; గుణ = గుణములచే; ఆసక్తంబున్ = తగలమున పడుట; అయినను = జరిగినను; సంసృతి = సంసార; బంధ = బంధములకు; కారణంబు = కారణము; అగు = అవును; మఱియును = మరియు.
భావము:- “విను. గాఢమైన సంసారబంధానికీ మోక్షానికీ జీవుని చిత్తమే కారణం. అది సత్త్వరజస్తమోగుణాలతో సమ్మేళనం పొందినప్పుడు సంసారబంధానికి హేతువవుతుంది. ఇంకా...

తెభా-3-873-తే.
దియు నారాయణాసక్త య్యెనేని
మోక్షకారణ మగు"నని మునికులాబ్ధి
చంద్రుఁ డన నొప్పు కపిలుండు ననితోడ
ర్థి వినఁ జెప్పి మఱియు నిట్లనియెఁ బ్రీతి.

టీక:- అదియున్ = అదే; నారాయణ = గోవిందుని యందు {నారాయణుడు - నారములు (నీరు) అందు నివసించువాడు, విష్ణువు}; ఆసక్తము = తగులుకొనినది; అయ్యెన్ = అయినట్లు; ఏని = అయితే; మోక్ష = మోక్షమునకు; కారణమున్ = కారణము; అగున్ = అగును; అని = అని; ముని = మునుల; కుల = సమూహము అను; అబ్ధి = సముద్రమునకు; చంద్రుడు = చంద్రుని వంటివాడు, ఉప్పొంగించువాడు; అనన్ = అనుటకు; ఒప్పు = తగినవాడు; కపిలుండు = కపిలుడు; జనని = తల్లి; తోడన్ = తోటి; అర్థిన్ = కుతూహలముతో; వినన్ = వినునట్లు; చెప్పి = చెప్పి; మఱియును = ఇంకను; ఇట్లు = ఈ విధముగా; అనియెన్ = పలికెను; ప్రీతిన్ = ప్రేమతో.
భావము:- ఆ చిత్తం శ్రీమన్నారాయణుని మీద సంసక్తమైనపుడు మోక్షానికి హేతువవుతుంది” అని మునికుల సాగరానికి చంద్రుని వంటివాడైన కపిలుడు తల్లికి కోరికతో వినిపించి, మళ్ళీ ఆప్యాయంగా ఇలా అన్నాడు.

తెభా-3-874-వ.
"మఱియుఁ, జిత్తం బహంకార మమకార రూపాభిమానజాతంబు లగు గామలోభాది కలుష వ్రాతంబులచేత నెప్పుడు విముక్తంబై పరిశుద్ధం బగు; నప్పుడు సుఖదుఃఖ వివర్జితంబు నేకరూపంబు నై ప్రకృతి కంటెఁ బరుండును, బరమ పురుషుండును, నిర్భేదనుండును, స్వయంజ్యోతియు, సూక్ష్మస్వరూపుండును, నితరవస్త్వంతరా పరిచ్ఛిన్నుండును, నుదాసీనుండును నైన పరమాత్మునిం దన్మయంబును హతౌజస్కంబు నైన ప్రపంచంబును జ్ఞాన వైరాగ్య భక్తి యుక్తం బగు మనంబుచేఁ బొడగాంచి; యోగిజనులు పరతత్త్వసిద్ధికొఱకు నిఖిలాత్మకుం డైన నారాయణు నందు నియుజ్యమానం బయిన భక్తిభావంబువలన నుదయించిన మార్గంబునకు నితరమార్గంబులు సరి గావండ్రు; విద్వాంసులు సంగం బింద్రియా ర్థాద్యసద్విషయంబుగ నొనరింపబడి జీవునకు నశిధిలం బగు బంధంబునకుఁ గారణం బగు ననియు; నదియె సద్విషయం బైన నంతఃకరణ సంయమన హేతుభూతం బగుచు సాధుజనులకు ననర్గళ మోక్షద్వారం బగు ననియుఁ దెలియుదురు; సహనశీలురు సమస్త శరీరధారులకు సుహృత్తులును బరమశాంతులును గారుణికులును నై పరిత్యక్త కర్మఫల స్వభావులును విసృష్ట స్వజన బంధుజనులును నై మత్పదాశ్రయులును, మద్గుణధ్యానపారీణులును, మత్కథాప్రసంగ సంభరిత శ్రవణానందులును నగుచు మదీయ కథల నొడువుచు వినుచునుండు పరమ భాగవతోత్తముల నాధ్యాత్మికాది తాపత్రయంబు దపింప జాల; దట్టి సర్వసంగవివర్జితు లగు పరమభాగవతజనుల సంగం బపేక్షణీయం; బది సకలదోష నివారకం బగు; నట్టి సత్సంగంబున సర్వప్రాణి హృత్కర్ణరసాయనంబు లగు మదీయ కథా ప్రసంగంబులు గలుగు; మద్గుణాకర్ణనంబునం జేసి శ్రీఘ్రంబుగఁ గ్రమంబునం గైవల్య మార్గదంబు లగు శ్రద్ధాభక్తు లుదయించు; నదియునుం గాక యే పురుషుం డైననేమి మద్విరచిత జగత్కల్పనాది విహారచింతచే నుదయించిన భక్తింజేసి యింద్రియసుఖంబు వలనను దృష్ట శ్రుతంబు లైన యైహి కాముష్మికంబుల వలనను విముక్తుం డగుచుఁ జిత్తగ్రహణార్థంబు ఋజువు లైన యోగమార్గంబులచే సంయుక్తుం డగునట్టి యోగి ప్రకృతిగుణ సేవనంబుచేత వైరాగ్యగుణ విజృంభితం బైన జ్ఞానయోగంబుచేతను మదర్పిత భక్తియోగంబుచేతను బ్రత్యగాత్మకుండ నైన నన్ను నంతఃకరణ నియుక్తునిం గావించు"నని చెప్పిన విని దేవహూతి గపిలున కిట్లనియె.
టీక:- మఱియున్ = ఇంకను; చిత్తంబు = చిత్తము; అహంకార = నేను; మమకార = నాది; రూప = అనెడి రూపములైన; అభిమాన = అభిమానించుటచే; జాతంబులున్ = పుట్టినవి; అగు = అయిన; కామ = కామము; లోభ = లోభము; ఆది = మొదలగు; కలుష = దోషముల; వ్రాతంబుల్ = సమూహముల; చేతన్ = చేత; ఎప్పుడున్ = ఎప్పుడైతే; విముక్తంబు = విడిచిపెట్టబడినది; ఐ = అయ్యి; పరిశుద్ధంబు = పరిశుద్ధము; అగున్ = అగునో; అప్పుడు = అప్పుడు; సుఖ = సుఖమును; దుఃఖ = దుఃఖములచే; వివర్జితంబున్ = విడువబడినదియును; ఏక = ఒకే; రూపంబునున్ = రూపమును; ప్రకృతికంటెఁబరుండునున్ = భగవంతుడు {ప్రకృతి కంటెఁ బరుండు - పకృతికంటెను ఇతరమైనవాడు, విష్ణువు}; పరమపురుషుండునున్ = భగవంతుడు {పరమపురుషుడు - ఉత్తమమైన ఫురుషుడు, విష్ణువు}; నిర్భేదనుండునున్ = భగవంతుడు {నిర్భేదనుండు - ముక్కలుచేయుటకు వీలుకానివాడు, విష్ణువు}; స్వయంజ్యోతియున్ = భగవంతుడు {స్వయం జ్యోతి - స్వయం ప్రకాశుడు, విష్ణువు}; సూక్ష్మస్వరూపుండనున్ = భగవంతుడు {సూక్ష్మస్వరూపుడు - సూక్షమమైన రూపము కలవాడు, విష్ణువు}; ఇతరవస్త్వంతరాపరిచ్ఛిన్నుండునున్ = భగవంతుడు {ఇతరవస్త్వంతరాపరిచ్ఛిన్నుండు - ఇతరమైన వస్తువులుగా అపరిచ్ఛిన్నుడు (విడదీసితెలిసి కొనలేనివాడు), విష్ణువు}; ఉదాసీనుండనున్ = భగవంతుడు {ఉదాసీనుండు - దేని యందును జోక్యము చేసికొననివాడు, విష్ణువు}; ఐన = అయినట్టి; పరమాత్మునిన్ = భగవంతున్ {పరమాత్ముడు - అత్యున్నతమైన ఆత్మ యైనవాడు, విష్ణువు}; తత్ = అతనిచే; మయంబునున్ = నిండినదియును; హత = నిస్తేజమైన; ఓజస్కంబునున్ = ఓజస్సు కలదియును; ఐన = అయిన; ప్రపంచంబునున్ = ప్రపంచమును; జ్ఞాన = జ్ఞానమును; వైరాగ్య = వైరాగ్యమును; భక్తి = భక్తులచే; యుక్తంబున్ = కూడినది; అగు = అయిన; మనంబున్ = మనసు; చేన్ = చేత; పొడగాంచి = చూసి; యోగి = యోగులైన; జనులు = జనములు; పరతత్త్వ = పరత్త్వము; సిద్ధి = సిద్ధించుట; కొఱకు = కోసము; నిఖిలాత్మకుండు = సమస్తమందును ఆత్మగ ఉన్నవాడు; ఐన = అయినట్టి; నారాయణున్ = విష్ణుమూర్తి; అందున్ = అందు; నియుజ్యమానంబున్ = నియమింపబడినది; అయినన్ = అయినచో; భక్తి = భక్తిఅను; భావంబున్ = భావము; ఉదయించినన్ = కలిగినట్టి; మార్గంబున్ = మార్గమున; కున్ = కు; ఇతర = ఇతరమైన; మార్గంబులున్ = మార్గములు; సరి = సమానము; కావు = కావు; అండ్రు = అందురు; విద్వాంసులు = పండితులు; సంగంబున్ = తగులము; ఇంద్రియ = ఇంద్రియములకు; అర్థా = గోచరమగునవి; ఆది = మొదలగునవి; అసత్ = చెడ్డ; విషయంబుగన్ = విషయములుగ; ఒనరింపబడి = చేయబడి; జీవున్ = ప్రాణి; కున్ = కి; అశిధిలంబు = నాశనముకానిది; అగు = అయిన; బంధంబున్ = బంధమున; కున్ = కు; కారణంబున్ = కారణము; అగున్ = అగును; అనియున్ = అనియు; అదియె = అదే; సత్ = సత్యమగు; విషయంబున్ = విషయము; ఐన = అయిన; అంతఃకరణ = మనసును; సంయమన = సంయమనము చేసుకొనుటకు; హేతు = కారణ; భూతంబున్ = అంశము; అగుచున్ = అవతూ; సాధు = సాధువులు అయిన; జనుల్ = జలముల; కున్ = కు; అనర్గళ = ఆటంకములేని; మోక్ష = ముక్తికి; ద్వారంబున్ = మార్గము; అగున్ = అగును; అని = అని; తెలియుదురు = తెలిసి ఉందురు; సహన = ఓర్పు; శీలురున్ = కలవారును; సమస్త = సమస్తమైన; శరీరధారుల్ = దేహము కలవారి; కున్ = కిని; సుహృత్తులునున్ = మంచికోరువారును; పరమ = మిక్కిలి; శాంతులునున్ = శాంతి కలవారును; కారుణికులునున్ = కరుణ కలవారును; ఐన = అయిన; పరిత్యక్త = వదలిన; కర్మ = కర్మముల; ఫల = ఫలితములు కల; స్వభావులునున్ = స్వభావము కలవారును; విసృష్ట = విడిచిపెట్టిన; స్వ = స్వంత; జన = జనములు; బంధు = బంధువులైన; జనులునున్ = జనములును అనుభావములు కలవారును; ఐన = అయిన; మత్ = నన్ను; ఆశ్రయులునున్ = ఆశ్రయించినవారునున్; మత్ = నా యొక్క; గుణ = గుణములను; ధ్యాన = ధ్యానించుటలో; పారీణులునున్ = నేర్పరులును; మత్ = నా యొక్క; కథా = కథలను; ప్రసంగ = ప్రసంగములతో; సంభరిత = మిక్కిలి సంతృప్తి చెందిన; శ్రవణ = విని; ఆనందులు = ఆనందించువారు; అగుచున్ = అవుతూ; మదీయ = నా యొక్క; కథలన్ = కథలను; నుడువుచున్ = చెప్పుతును; వినుచున్ = వినుచును; ఉండు = ఉండెడి; పరమ = అత్యున్నత; భాగవత = భాగవతులలో; ఉత్తములన్ = ఉత్తములను; ఆధ్యాత్మిక = ఆధ్యాత్మకము; ఆది = మొదలైన; తాపత్రయంబు = తాపత్రయము {తాపత్రయము - 1ఆధ్యాత్మికతాపము 2ఆధిభౌతికతాపము 3ఆధిదైవికతాపము అను మూడు బాధలు}; తపింపన్ = బాధలను పొందించుటను; చాలదు = చేయలేదు; అట్టి = అటువంటి; సర్వ = సమస్తమైన; సంగ = సంగములను; వివర్జితులు = వదలినవారు; అగు = అయిన; పరమ = గొప్ప; భాగవత = భాగవతులతో; సంగంబున్ = సంబంధము; అభిలషనీయంబు = కోరదగినది; అది = అది; సకల = సమస్తమైన; దోష = దోషములను; నివారకంబున్ = పోగొట్టునది; అగున్ = అగును; అట్టి = అటువంటి; సత్ = మంచి; సంగంబునన్ = సంగమువలన; సర్వ = సమస్తమైన; ప్రాణి = జీవుల; హృత్ = హృదయములకును; కర్ణ = చెవులకును; రసాయనంబులు = రుచికరంబులు; అగున్ = అగును; మదీయ = నా యొక్క; కథా = కథల; ప్రసంగబులున్ = చెప్పబడుటయును; కలుగున్ = కలుగును; మత్ = నా యొక్క; గుణ = గుణములను; ఆకర్ణనంబున్ = వినుట; చేసి = వలన; శ్రీఘ్రంబుగన్ = శ్రీఘ్రముగను; క్రమంబునన్ = క్రమముగను; కైవల్య = మోక్షమునకు; మార్గదంబులున్ = మార్గమును ఇచ్చునవి; అగున్ = అయిన; శ్రద్ధా = శ్రద్ధయును; భక్తులున్ = భక్తులును; ఉదయించున్ = కలుగును; అదియునన్ = అంతే; కాక = కాకుండగ; ఏ = ఏ; పురుషుండు = పురుషుడు; ఐననేమి = అయినను; మత్ = నాచేత; విరచిత = రచింపబడిన; జగత్ = విశ్వ; కల్పన = సృష్టి; ఆదిన్ = మొదలైనవాని యందు; విహార = వ్యాప్తులను; చింత = స్మరించుట; చేన్ = చేత; ఉదయించినన్ = కలిగినట్టి; భక్తిన్ = భక్తి; చేసి = వలన; ఇంద్రియ = ఇంద్రియముల యొక్క; సుఖంబు = సుఖమును పొందుట; వలనను = వలనను; దృష్ట = చూడబడినవి; శ్రుతంబులున్ = వినబడినవి; ఐన = అయినట్టి; ఐహిక = ఇహలోకమునకు సంబంధించినవి; ఆముష్మికంబుల = పరలోకమునకు సంబంధించినవి; వలననున్ = వలనను; విముక్తుండు = విముక్తి పొందినవాడు; అగుచున్ = అవుతూ; చిత్త = మనసును; గ్రహణ = నిగ్రహించుకొనుట; అర్థంబున్ = కొరకు; ఋజువులు = సూటి; ఐన = అయిన; యోగమార్గంబుల = యోగమార్గముల; చేన్ = చేత; సంయుక్తుండు = చక్కగ కూడినవాడు; అగునట్టి = అయినట్టి; యోగి = యోగి; ప్రకృతి = ప్రకృతి యొక్క; గుణ = గుణములను; సేవించుట = సేవించుట; చేతన్ = చేత; వైరాగ్య = వైరాగ్యమైన; గుణ = గుణములచే; విజృంభితంబు = అతిశయించిదైన; ఐన = అయిన; జ్ఞానయోగంబు = జ్ఞానయోగము; చేతను = చేతను; మత్ = నాకు; అర్పిత = అర్పంచబడిన; భక్తియోగంబున్ = భక్తియోగము; చేతనున్ = చేతను; ప్రత్యగాత్మ = సాక్షాత్కరించిన ఆత్మస్వరూపుడను; ఐన = అయిన; నన్నున్ = నన్ను; అంతఃకరణ = మనసున; నియుక్తుండను = ప్రతిష్ఠిం బడిన వానినిగ; కావించును = చేయును; అని = అని; చెప్పిన = చెప్పగ; విని = విని; దేవహూతి = దేవహూతి; కపిలున్ = కపిలుని; కిన్ = కి; ఇట్లు = ఈ విధముగా; అనియెన్ = పలికెను.
భావము:- “ఇంకా నేను నాది అనే అహంకార మమకార రూపమైన అభిమానంవల్ల కామం, క్రోధం, లోభం మొదలైన దోష సమూహాలు ఆవిర్భవిస్తాయి. చిత్తం వానికి లోనుగాకుండ వానినుండి విడివడినప్పుడు పరిశుద్ధ మవుతుంది. చిత్తం పరిశుద్ధమైనప్పుడు సుఖం, దుఃఖం అనేవి ఉండక ఒకే రూపంగా వెలుగొందుతుంది. ఏకరూపమైన అటువంటి చిత్తంలోనే పరమాత్మ సాక్షాత్కరిస్తాడు. ఆ పరమాత్మ ప్రకృతికంటె అతీతుడు, స్వయంప్రకాశుడు, సూక్ష్మస్వరూపుడు, అపరిచ్ఛిన్నుడు, ఉదాసీనుడు. అటువంటి పరమాత్మనూ, ఆ పరమాత్మ తేజస్సువల్ల నిస్తేజమైన ప్రపంచాన్నీ యోగివరేణ్యులు భక్తిజ్ఞానవైరాగ్యాలతో కూడిన చిత్తంతో దర్శించినవారై మోక్షప్రాప్తికి సర్వాంతర్యామి అయిన శ్రీమన్నారాయణునియందు సమర్పింపబడిన భక్తి మార్గమే ఉత్తమోత్తమ మైనదని, తక్కిన మార్గాలు దానికి సాటిరావని చాటిచెప్పారు. ఇంద్రియార్థాలైన శబ్దస్పర్శరూపరసగంధాలతో కలయిక అసద్విషయమై, దృఢమైన బంధానికి కారణం అవుతుంది. ఆ సంగమమే భగవంతుని సంబంధమై సద్విషయమైనపుడు మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం అనే అంతఃకరణాల సంయమనానికి హేతుభూతమై సత్పురుషులకు తెరిచిన మోక్షద్వారం అవుతుంది అని విద్వాంసుల అభిప్రాయం. సహన స్వభావం కలిగి, సమస్త జీవులకు ఆప్తబంధువులై, శాంతమూర్తులై, కరుణార్ద్రహృదయులై, కర్మఫలాలను పరిత్యజించి, తనవారు, బంధువులు అనే అభిమానం విడిచి, నన్ను చక్కగా ఆశ్రయించినవారై, నా గుణగణాలను ధ్యానిస్తూ, నా చరిత్రను వీనులవిందుగా ఆలకించి ఆనందిస్తూ, నా కథలే చెప్పుకొంటూ, నా కథలే వింటూ ఉండేవారు పరమ భాగవతోత్తములు. అటువంటి వారిని ఆధ్యాత్మికం, ఆధిదైవికం, ఆధిభౌతికం అనే తాపత్రయాలు ఏమీ చేయలేవు. అటువంటి సర్వసంగ పరిత్యాగులైన పరమభాగవతుల సాంగత్యం మాత్రమే కోరదగినది. అదే సకల దోషాలను నివారిస్తుంది. అటువంటివారి స్నేహంవల్ల సర్వప్రాణుల హృదయాలలో చెవులలో సుధారసం చిందించే నా కథాప్రసంగాలు ప్రాప్తిస్తాయి. నా గుణాలను వినడంవల్ల సక్రమమైన మార్గంలో శీఘ్రంగా మోక్షాన్ని ప్రసాదించే శ్రద్ధాభక్తులు ఉద్భవిస్తాయి. ఎవడు నేను చేసిన ఈ విశ్వసృష్టినీ, నా లీలావిహారాలనూ తలపోస్తూ అందువల్ల ప్రభవించిన భక్తిచేత ఇంద్రియ సుఖాలకూ, కనిపించేవీ వినిపించేవీ అయిన ఇహలోక పరలోక సుఖాలకూ లోనుకాకుండా, మనోనిశ్చలత్వం కోసం చక్కని యోగమార్గాన్ని అవలంబిస్తాడో అతడు యోగి అని చెప్పబడతాడు. అటువంటి యోగి ప్రకృతిగుణాలను అనుసరించటం వల్లనూ, వైరాగ్యాన్ని పెంపొందించే జ్ఞానయోగం వల్లనూ, ఆత్మార్పణ రూపమైన భక్తియోగం వల్లనూ సాక్షాత్కరించిన ఆత్మస్వరూపం గల నన్ను తన హృదయాంతరంలో నిలుపుకొంటాడు” అని కపిలుడు చెప్పగా విని దేవహూతి అతనితో ఇలా అన్నది.

తెభా-3-875-క.
"ఏ క్తి భవద్గుణపర
మై వపాపప్రణాశమై ముక్తిశ్రీ
లాము రయమునఁ జేయునొ
యా క్తివిధంబుఁ దెలియ నానతి యీవే.

టీక:- ఏ = ఏ; భక్తి = భక్తి; భవత్ = నీ యొక్క; గుణ = గుణములే; పరము = గమ్యముగా కలది; ఐ = అయ్యి; భవ = సంసారమందల; పాప = పాపములను; ప్రణాశము = పూర్తిగా నశింపజేయునది; ఐ = అయ్యి; ముక్తి = ముక్తి అనెడి; శ్రీ = సంపద; లాభమున్ = లభించుటను; రయమునన్ = శ్రీఘ్రముగ; చేయునో = చేయునో; ఆ = ఆ; భక్తిన్ = భక్తి యొక్క; విధంబున్ = విధమును; తెలియన్ = తెలియునట్లు; ఆనతిన్ = దయచేయుటను; ఈవే = ఇమ్ము.
భావము:- “ఏ భక్తి నీ గుణగణాలకు అంకితమై సంసారపాపాలను పోగొట్టి శీఘ్రంగా మోక్షలక్ష్మిని చేకూరుస్తుందో ఆ భక్తి స్వరూపాన్ని నాకు బాగా తెలిసేటట్లు దయచేసి చెప్పు.

తెభా-3-876-వ.
అదియునుం గాక భవదుదితం బయిన యోగంబును దదంగంబులును దద్గత తత్త్వావబోధంబును సాకల్యంబుగ మందబుద్ధి నైన నాకు స్ఫుటంబుగాఁ దెలియ నానతి"మ్మనినఁ గపిలుం డిట్లనియె.
టీక:- అదియునన్ = అంతే; కాక = కాకుండగ; భవత్ = నీచేత; ఉదితంబున్ = చెప్పబడినది; అయిన = అయినట్టి; యోగంబున్ = యోగమును; తత్ = దాని; అంగంబులున్ = విభాగములును; తత్ = దానిలో; గత = ఉన్న; తత్త్వ = ఆత్మ జ్ఞానమును; అవబోధంబునున్ = చక్కగ బోధించునవియును; సాకల్యంబుగన్ = సంపూర్ణంగా, సకలమునూ; మంద = మందమైన; బుద్ధిని = బుద్ధి కలదానను; ఐన = అయిన; నాకున్ = నాకు; స్ఫుటంబు = స్పష్టము; కాన్ = అగునట్లు; తెలియన్ = తెలియునట్లు; ఆనతిన్ = దయచేయుటను; ఇమ్ము = ఇమ్ము; అనినన్ = అనగ; కపిలుండు = కపిలుడు; ఇట్లు = ఈ విధముగా; అనియెన్ = పలికెను.
భావము:- అంతేకాక నీచేత పేర్కొనబడిన యోగవిద్యనూ, అందలి విభాగాలనూ, అందులోగల తత్త్వార్థాలనూ సంపూర్ణంగా, సుస్పష్టంగా మందబుద్ధినైన నాకు తెలిసేలా వెల్లడించు” అనగా కపిలుడు ఇలా అన్నాడు.

తెభా-3-877-సీ.
"నయిత్రి! విను మఱి కల పదార్థప-
రిజ్ఞానతత్త్వపారీణ మైన
యామ్నాయ విహితకర్మాచారములు గల్గి-
తివుటమై వర్తించు దేవగణము
పూని నైసర్గికంబై నిర్హేతుక-
గు భగవత్సేవ మిగుల ముక్తి
కంటె గరిష్ఠంబు గావున నదియు భు-
క్తాన్నంబు జీర్ణంబు నందఁ జేయు

తెభా-3-877.1-తే.
దీప్త జఠరాగ్నిగతి లింగదేహనాశ
కంబు గావించు నదియునుగాక విష్ణు
క్తి వైభవములఁ దేటఱతు వినుము
ద్గుణవ్రాత యోగలక్షణసమేత

టీక:- జనయిత్రి = అమ్మా; విను = వినుము; మఱి = మరి; సకల = సమస్తమైన; పదార్థ = పదార్థములగురించిన; పరిజ్ఞాన = చక్కటి జ్ఞానము; తత్త్వము = లక్షణములు యందు; పారీణము = బాగుగా తెలియునవి; ఐన = అయినట్టి; ఆమ్నాయ = వేదశాస్త్రములందు; విహిత = నిర్ణయించబడిన; కర్మ = కర్మల; ఆచారములు = ఆచరించు విధానములు; కల్గి = కలిగి; తివుటమై = సంతృప్తులై; వర్తించు = నడచు; దేవ = దేవతల; గణము = సమూహము; పూని = పూని; నైసర్గికంబున్ = సహజము; ఐన = అయినట్టి; నిర్హేతుకము = కారణరహితము; అగు = అయిన; భగవత్ = భగవంతుని; సేవ = భక్తి; మిగుల = మిక్కిలి; ముక్తి = ముక్తి; కంటెన్ = కంటెను; గరిష్టంబున్ = ఎక్కువ గొప్పది; కావునన్ = అందుచేత; అదియున్ = అదికూడ; భుక్త = తినిన; అన్నంబున్ = ఆహారమును; జీర్ణంబున్ = జీర్ణించుటను; అంద = కలుగ; చేయు = చేయు;
దీప్త = జ్వలించు; జఠరాగ్ని = జఠరాగ్ని; గతిన్ = వలె; లింగదేహ = లింగశరీరమును; నాశకంబు = నశింపజేయుటను; కావించున్ = కలుగజేయును; అదియునున్ = అంతే; కాక = కాకుండగ; విష్ణు = విష్ణుమూర్తి యందలి; భక్తిన్ = భక్తియొక్క; వైభవములన్ = వైభవములను; తేటపఱతున్ = తెలియజేయుదును; వినుము = వినము; సత్ = మంచి; గుణ = గుణముల; వ్రాత = సమూహములు కలదాన; యోగలక్షణ = యోగలక్షణములతో; సమేత = కూడిఉన్నదాన.
భావము:- “అమ్మా! సద్గుణసమూహం, యోగలక్షణాలు కలదానా! విను. సకలపదార్థాలకూ సంబంధించిన యథార్థస్వరూపాన్ని పూర్తిగా తెలియజేసేవి వేదాలు. వేదసంబంధమైన సత్కర్మలకూ సదాచారాలకూ దేవతలు సంతృప్తులౌతారు. సహజమూ నిర్హేతుకమూ అయిన భగవంతుని సేవారూపమైన భక్తి ముక్తికంటె గొప్పది. జీర్ణాశయమందలి జఠరాగ్ని తిన్న అన్నాన్ని జీర్ణం చేసినట్లుగా భగవద్భక్తి జీవులు కావించిన కర్మలనూ కర్మఫలాలనూ లోగొంటుంది. అందువల్ల జీవుని లింగమయ శరీరం నశిస్తుంది. విష్ణుభక్తి విశేషాలను వివరిస్తాను విను.

తెభా-3-878-చ.
లినభక్తిఁ గొందఱు మహాత్ములు మచ్చరణారవింద యు
గ్మము హృదయంబునన్ నిలిపి కౌతుకులై యితరేత రానులా
ముల మదీయ దివ్యతనుపౌరుషముల్ కొనియాడుచుండి మో
క్షము మదిఁ గోర నొల్ల రనిశంబు మదర్పిత సర్వకర్ములై.

టీక:- అమలిన = స్వచ్ఛమైన; భక్తిన్ = భక్తితో; కొందఱు = కొంతమంది; మహాత్ములు = గొప్పవారు; మత్ = నా యొక్క; చరణ = పాదములు అనెడి; అరవింద = పద్మముల; యుగ్మమున్ = జంటను; హృదయంబునన్ = మనసులో; నిలిపి = విలుపుకొని; కౌతుకులు = కుతూహములు కలవారు; ఐ = అయ్యి; ఇతరేతర = తమలో తాము చేసుకొను; అనులాపములన్ = సంభాషణములలో; మదీయ = నా యొక్క; దివ్య = దివ్యమైన; తను = స్వరూపమును; పౌరుషముల్ = లీలలను; కొనియాడుచున్ = స్తుతించుతూ; ఉండి = ఉండి; మోక్షమున్ = మోక్షమును; మదిన్ = మనసులోనైన; కోరన్ = కోరుటను; ఒల్లరు = ఒప్పుకొనరు; అనిశంబున్ = ఎప్పుడైనను; మత్ = నాకు; అర్పిత = అర్పంచబడిన; సర్వ = సమస్తమైన; కర్ములు = కర్మలు కలవారు; ఐ = అయ్యి.
భావము:- కొందరు మహాత్ములు నిర్మలమైన భక్తిభావంతో నా పాదపద్మాలను తమ హృదయపద్మాలలో పదిలపరచుకొని ఎంతో కుతూహలంతో పరస్పరం సంభాషించుకుంటూ ఆ సంభాషణలలో నా దివ్యస్వరూపాన్నీ, నా లీలావిశేషాలనూ కొనియాడుతూ ఉంటారు. వారు సర్వదా తమ సమస్త కర్మఫలాలనూ నాకే అర్పించి భక్తి పరవశులై ముక్తిని కూడా వాంఛింపరు.

తెభా-3-879-సీ.
రికింపఁ గొందఱు భాగవతోత్తముల్-
నత కెక్కిన పురానము లైన
చారు ప్రసన్న వక్త్రారుణలోచన-
ములు గల్గి వరదాన లితములుగఁ
నరు మద్దివ్యావతార వైభవములు-
దినొప్పఁ దమ యోగహిమఁ జేసి
నుభవించుచుఁ దదీయాలాపములు సన్ను-
తించుచుఁ దివుటఁ దద్దివ్య విలస

తెభా-3-879.1-తే.
వయవోదార సుందర వవిలాస
మందహాస మనోహర ధుర వచన
చనచే నపహృత మనఃప్రాణు లగుచు
నెలమి నుందురు నిశ్శ్రేయసేచ్ఛ లేక.

టీక:- పరికింపన్ = పరికించి చూడగ; కొందఱు = కొంతమంది; భాగవత = భాగవతులలో; ఉత్తముల్ = ఉత్తములు; ఘనతన్ = ప్రసిద్ధికి; ఎక్కిన = ఎక్కినట్టి; పురాతనములు = పురాణ స్వరూపములు; ఐన = అయినట్టి; చారు = అందమైన; ప్రసన్న = అనుగ్రహము కలిగిన; వక్త్ర = మోములు; అరుణ = ఎఱ్ఱని; లోచనములు = కన్నులు; కల్గి = కలిగి; వర = వరములను; దాన = ప్రసాదించుటలతో; కలితములుగన్ = కూడినవిగ; తనరు = అతిశయించు; మత్ = నా యొక్క; దివ్య = దివ్యమైన; అవతార = అవతారముల; వైభవములు = వైభవములు; మదిన్ = మనసున; ఒప్పన్ = ఒప్పియుండగ; తమ = తమ; యోగ = యోగము యొక్క; మహిమన్ = మహిమ; చేసి = వలన; అనుభవించుచున్ = అనుభవిస్తూ; తదీయ = వానికిసంబంధించిన; ఆలాపములు = మాటలు; సన్నుతించుచున్ = స్తుతించుతూ; తివుటన్ = తృప్తితో; తత్ = ఆ; దివ్య = దివ్యమైన; విలసత్ = ప్రకాశించుచున్న;
అవయవ = అవయవములును; ఉదార = ఉత్తమలక్షణములుకల; సుందర = అందమైన; నవ = సరికొత్త; విలాస = సొగసులు కల; మందహాస = చిరునవ్వులు; మనోహర = మనోహరమైన; మధుర = మధురమైన; వచన = మాటల; రచన = రచనలు; చేన్ = చేత; అపహృత = దొంగిలిపబడిన; మనస్ = మనసులు; ప్రాణులు = ప్రాణములు కలవారు; అగుచున్ = అవుతూ; ఎలమిన్ = సంతోషముతో; ఉందురు = ఉంటారు; నిశ్శ్రేయస = ముక్తి యందు; ఇచ్చ = కోరిక; లేకన్ = లేకుండగ.
భావము:- కొందరు భాగవతోత్తములు ప్రసిద్ధికెక్కిన నా పురాణ స్వరూపాలను స్మరిస్తూ ఉంటారు. అందాలు చిందే ముఖమూ, కరుణారసం విరజిమ్మే అరుణనేత్రాలూ కలిగి భక్తులకు వరాలను ప్రసాదించే నా దివ్యావతారాలనూ వాని వైభవవిశేషాలనూ మనస్సులో నిలుపుకుంటారు. తమ భక్తియోగ మహత్త్వంవల్ల అలనాటి నా సంలాపాలను స్మరించుకొని కొనియాడుతుంటారు. నవనవోన్మేషమైన నా అవయవ సౌభాగ్యాన్నీ, సుందరమైన నా మందహాసాన్నీ, మనోహరాలైన నా మధురవాక్కులనూ మాటిమాటికీ మననం చేసుకుంటూ మనస్సూ, ప్రాణమూ పరవశింపగా మోక్షంమీద అపేక్ష లేకుండా ఉంటారు.

తెభా-3-880-మ.
ణఁకన్ వారలు వెండి మోక్షనిరపేక్షస్వాంతులై యుండి తా
ణిమాద్యష్టవిభూతి సేవితము నిత్యానంద సంధాయియున్
నాతీతము నప్రమేయము సమగ్రశ్రీకమున్ సర్వల
క్షయుక్తంబును నైన మోక్షపదవిం గైకొందు రత్యున్నతిన్.

టీక:- కణకన్ = పూని; వారలు = వారు; వెండి = మరియు; మోక్ష = మోక్షమును; నిరపేక్ష = కోరని; స్వాంతులు = స్వాంతన చెందిన మనసు కలవారు; ఐ = అయ్యి; ఉండి = ఉండి; తాము = తాము; అణిమ = అణిమ; ఆది = మొదలైన; అష్టవిభూతి = అష్ట విభూతులచే {అష్ట విభూతులు - 1అణిమ 2మహిమ 3గరిమ 4లఘిమ 5ప్రాప్తి 6ప్రాకామ్యము 7ఈశత్వము 8నశిత్వము}; సేవితము = సేవింపబడునది; నిత్య = శాశ్వతమైన; ఆనంద = ఆనందమును; సంధాయియున్ = కలిగించునదియున్; గణన = ఎంచుటకు, లెక్కించుటకు; అతీతమున్ = అందనిదియును; అప్రమేయమున్ = ప్రమాణములకు అందనిదియును; సమగ్ర = పరిపూర్ణమైన; శ్రీకమున్ = సంపదయును; సర్వ = సమస్తమైన; లక్షణ = లక్షణములతోను; సంయుక్తంబున్ = కూడినదియును; మోక్ష = మోక్షము అను; పదవిన్ = స్థితిని; కైకొందురు = పొందుదురు; అతి = మిక్కిలి; ఉన్నతిన్ = గొప్పదనముతో.
భావము:- ఆ విధంగా మోక్షాసక్తి లేనివారై కూడా వారు అణిమాది అష్టసిద్ధి సంసేవితమూ, శాశ్వతానంద సంధాయకమూ, వర్ణనాతీతమూ, మహనీయమూ, సంపూర్ణ వైభవోపేతమూ, సకలలక్షణ సమేతమూ, మహోన్నతమూ అయిన వైకుంఠధామాన్ని పొందుతారు.

తెభా-3-881-వ.
ఇట్లువొంది.
టీక:- ఇట్లు = ఈ విధముగా; పొంది = పొంది.
భావము:- ఈవిధంగా పొంది...

తెభా-3-882-క.
రుదు రప్పుణ్యాత్ములు
యిత్రి! మదీయ కాలక్రగ్రసనం
బును నొందక నిత్యం బగు
నుపమ సుఖవృత్తి నుందు ది యెట్లన్నన్.

టీక:- తనరుదురు = అతిశయించెదరు; ఆ = ఆ; పుణ్యాత్ములు = పుణ్యాత్ములు; జనయిత్రి = అమ్మా; మదీయ = నా యొక్క; కాల = కాలము అను; చక్రంబున్ = చక్రముచే; గ్రసనంబున్ = మింగబడుటను; పొందక = పొందకుండ; నిత్యంబున్ = శాశ్వతము; అగు = అయిన; అనుపమ = సాటిలేని; సుఖ = సుఖవంతమైన; వృత్తిన్ = విధానమున; ఉందురు = ఉంటారు; అది = అది; ఎట్లు = ఏ విధము; అన్నన్ = అనినచో.
భావము:- అమ్మా! ఆ పుణ్యాత్ములు నా కాలచక్రానికి మ్రింగుడు పడనివారై నిరుపమానమైన నిత్య సౌఖ్యాలతో అలరారుతుంటారు. అది ఎలాగంటే...

తెభా-3-883-మ.
ముఁడై స్నేహముచే సుతత్వమును విశ్వాసంబుచేతన్ సఖి
త్వముఁ జాలన్ హితవృత్తిచేతను సుహృత్త్వంబున్ సుమంత్రోపదే
ముచేతన్ నిజదేశికుం డనఁగ నిచ్చల్ పూజ్యుఁ డౌ నిష్ఠదై
మునై వారికిఁ గాలచక్రభయముల్ వారింపుదుం గావునన్."

టీక:- సముడున్ = (వారితో) సమాన మైనవాడను; ఐ = అయ్యి; స్నేహము = స్నేహము; చేన్ = వలన; సుతత్వమునున్ = పుత్రునిగ ఉండుటను; విశ్వాసంబున్ = నమ్మదగి యుండుట; చేతన్ = వలన; సఖిత్వమున్ = మిత్రుడుగ నుండుటను; చాలన్ = మిక్కిలి; హిత = మేలుకోరు; వృత్తి = ప్రవర్తన; చేతను = వలన; సుహృత్త్వంబున్ = సుహృత్తు - చెలికాడు, మిత్రుడు, , వ్యు. సు+హృదము , అస్య (హృదాదేశం,) బ.వ్రీ., ఆంధ్రభారతి; సు = మంచి; మంత్ర = మంత్రమును; ఉపదేశము = ఉపదేశించుట; చేతన్ = వలన; నిజ = స్వంత; దేశికుండు = గురువు; అనగన్ = అనునట్లును; నిచ్చల్ = నిత్యము; పూజ్యుడు = పూజింప దగినవాడు; ఔ = అగుటకు; ఇష్ట = ఇష్ట; దైవమున్ = దైవమును; ఐ = అయ్యి; వారి = వారి; కిన్ = కి; కాల = కాలము అను; చక్ర = చక్రమువలన; భయముల్ = భయములను; వారింపుదున్ = తొలగింతును; కావునన్ = కనుక.
భావము:- సర్వసముడనైన నేను స్నేహంవల్ల కుమారుని వలెనూ, విశ్వాసంవల్ల చెలికాని వలెనూ, హితం కూర్చడంవల్ల ఆత్మీయుని వలెనూ, మంత్రం ఉపదేశించడంవల్ల ఆచార్యునివలెనూ ఉంటూ వారికి నిత్యమూ పూజింపదగిన ఇష్టదైవాన్నై, కాలచక్రం వల్ల భయం కలుగకుండా వారిని కాపాడుతూ ఉంటాను.”

తెభా-3-884-వ.
అని యిట్లు దెలుపుచు మఱియు నిట్లనియె.
టీక:- అని = అని; ఇట్లు = ఈ విధముగా; తెలుపుచున్ = తెలియజేయుచు; మఱియున్ = ఇంకను; ఇట్లు = ఈ విధముగా; అనియెన్ = పలికెను.
భావము:- అని ఈవిధంగా చెప్తూ మళ్ళీ ఇలా అన్నాడు.

తెభా-3-885-చ.
"విను మదిగాక యీ భువిఁ దివిం బలుమాఱుఁ జరించు నాత్మ దా
పశు పుత్ర మిత్ర వనితాతతిపైఁ దగులంబు మాని న
న్నఘుని విశ్వతోముఖు నన్యగతిన్ భజియించెనేని వా
నిని ఘనమృత్యురూప భవనీరథి నేఁ దరియింపఁ జేయుదున్.

టీక:- వినుము = వినుము; అది = అంతే; కాక = కాకుండగ; ఈ = ఈ; భువిన్ = భూమి మీద; దివిన్ = దేవలోకము లందు; పలు = అనేక; మాఱు = సార్లు; చరించు = తిరుగు; ఆత్మ = ఆత్మ; తాన్ = తాను; ధన = సంపదలును; పశు = పశుసంపదలును; పుత్ర = సంతానమును; మిత్ర = మిత్రులయును; వనితా = భార్య మొదలైన; తతిన్ = సమూహముల; పైన్ = మీద; తగులంబున్ = సంగమును, వ్యామోహమును; మాని = వదలివేసి; నన్ = నన్ను; అనఘునిన్ = పుణ్యుని; విశ్వతః = లోక మంతటికిని; ముఖున్ = ముఖ్యుని; అనన్య = ఇతర మెరుగని; గతిన్ = విధముగ; భజియించెన్ = కొలిచినను; ఏని = అట్లయితే; వానిని = వానిని; ఘన = మహా; మృత్యు = మృత్యువు యొక్క; రూప = స్వరూపమైన; భవ = సంసార; నీరధిన్ = సముద్రమును; నేన్ = నేను; తరియింపన్ = దాటునట్లు; చేయుదున్ = చేయుదును.
భావము:- “ఇంకా విను. ఈ భువికీ దివికీ నడుమ పలుసారులు తిరుగుతూ ఉండే ఆత్మ ధనం, పశువులు, పుత్రులు, మిత్రులు, స్త్రీలు మొదలైన తగులాలపై వ్యామోహం విడిచిపెట్టి పాపాలను సంహరించేవాడనూ, ప్రపంచమంతటా వ్యాపించినవాడనూ అయిన నన్ను ఏకాగ్రచిత్రంతో ఆరాధించినట్లైతే ఆ మానవుని మృత్యుమయమైన సంసారసముద్రం నుండి తరింపజేస్తాను.

తెభా-3-886-సీ.
రూఢిఁ బ్రధానపూరుషనాయకుండను-
గవంతుఁడను జగత్ప్రభుఁడ నైన
నాకంటె నన్యులఁ గైకొని తగిలిన-
యాత్మలు భవభయం బందుదు రది
గావున నా యాజ్ఞఁ డవంగ నోడుట-
జేసి వాయువు వీచు శిఖి వెలుంగు
నినుఁడు దపించుఁ దా నింద్రుఁడు వర్షించు-
య మంది మృత్యువు రువు పెట్టుఁ

తెభా-3-886.1-తే.
గాన విజ్ఞాన వైరాగ్యలిత మైన
క్తియోగంబునం జేసి రమపదము
కొకు నయ్యోగివరులు మచ్చణభజను
గుచుఁ జరియింపుదురు నిర్భయాత్ము లగుచు.

టీక:- రూఢిన్ = నిశ్చయముగ; ప్రధాన = మూలప్రకృతులకిని {ప్రధానము - మూలప్రకృతులు ఇరవైనాలుగు ఇరవైయైదోవాడు పురుషుడు}; పూరుష = పురుషునకును; నాయకుండను = నాయకుడను; భగవంతుడను = ఐశ్వర్యములు అనెడి మహిమలతో కూడినవాడు; జగత్ = విశ్వము (అంతటి)కి; ప్రభుండను = ప్రభువును; ఐన = అయిన; నా = నాకు; కంటెన్ = కంటెను; అన్యులన్ = ఇతరులను; కైకొని = చేకొని; తగిలిన = సంగముకల; ఆత్మలు = జీవులు; భవ = సంసార; భయంబున్ = భయమును; అందుదురు = చెందదరు; అదిగావున = అందుచేత; నా = నా యొక్క; ఆజ్ఞన్ = ఆజ్ఞను; గడవంగన్ = దాటుటకు; ఓడుటన్ = శక్తిలేకపోవుట; చేసి = వలన; వాయువు = గాలి; వీచున్ = వీచును; శిఖి = అగ్ని; వెలుంగు = ప్రకాశించును; ఇనుడు = సూర్యుడు; తపించున్ = వేడిపుట్టించును; తాన్ = తను; ఇంద్రుడు = ఇంద్రుడు; వర్షించున్ = వర్షము కురిపించును; భయమున్ = భయమును; అంది = చెంది; మృత్యువు = మరణము; పరువున్ = పరుగులు; పెట్టున్ = పెడుతుంది; కాన = కావున;
విజ్ఞాన = విజ్ఞానము; వైరాగ్యమున్ = వైరాగ్యముతోను; కలితము = కూడినది; ఐన = అయిన; భక్తియోగంబునన్ = భక్తియోగము; చేసి = వలన; పరమపదము = అత్యుత్తమ స్థితి; కొఱకున్ = కోసమై; మత్ = నా యొక్క; చరణ = పాదములకు; భజనులు = కొలుచువారు; అగుచున్ = అవుతూ; చరియింపుదురు = చరింతురు; నిర్భయ = భయములేని; ఆత్ములు = మనసులు కలవారు; అగుచున్ = అవుతూ.
భావము:- ప్రధానమనే మూలప్రకృతికీ, పురుషునకూ అధీశ్వరుడనూ, భగవంతుడనూ అయిన నన్ను కాకుండా ఇతరులను ఎన్నుకొన్నవారు సంసారభయంలో పడిపోతారు. కనుక నా ఆజ్ఞ జవదాటలేక భయంతో గాలి వీస్తుంది. అగ్ని మండుతుంది. సూర్యుడు ఎండ కాస్తాడు. ఇంద్రుడు వర్షిస్తాడు. మృత్యువు భయపడి పారిపోతుంది. అందువల్ల ఈ సృష్టి విజ్ఞానంతో పాటు వైరాగ్యంతో కూడిన భక్తియోగంతో యోగివరులైనవారు వైకుంఠాన్ని ఆశించి నా చరణాలను సంస్మరిస్తూ ఏ భయమూ లేకుండా ఉంటారు.

తెభా-3-887-క.
గురుభక్తిం జిత్తము మ
త్పమై విలసిల్లు నంతర్యంతము స
త్పురుషుల కిహలోకంబునఁ
జితర మోక్షోదయంబు సేకుఱుచుండున్."

టీక:- గురు = గొప్ప; భక్తిన్ = భక్తితో; చిత్తమున్ = మనసును; మత్ = నా యందు; పరము = అర్పింబడినది; ఐ = అయ్యి; విలసిల్లు = ఒప్పుతుండునో; అంత = అంత; పర్యంతము = వరకు; సత్ = మంచి; పురుషుల్ = పురుషుల; కున్ = కు; ఇహ = ఈ; లోకంబునన్ = లోకములో; చిరతర = మిక్కిలి చిరమైన {చిరము - చిరతరము - చిరతమము}; మోక్ష = మోక్షము; ఉదయంబున్ = పుట్టుట; చేకూరుచున్ = జరుగుతూ; ఉండున్ = ఉండును.
భావము:- అత్యంత భక్తితో చిత్తాన్ని ఎంతవరకు నాయందే లగ్నంచేసి ఉంచుతారో అంతవరకు ఆ సత్పురుషులకు ఈలోకంలోనే మోక్షం సంప్రాప్తిస్తుంది."

తెభా-3-888-క.
ని యిట్లు సన్మునీంద్రుఁడు
నికి హరిభక్తియోగ సంగతి నెల్లన్
వినిపించుచు వెండియు ని
ట్లనియెన్ సమ్మోదచిత్తుఁ గుచుఁ గడంకన్.

టీక:- అని = అని; ఇట్లు = ఈ విధముగా; సత్ = మంచి; ముని = మునులలో; ఇంద్రుడు = శ్రేష్ఠుడు; జనని = తల్లి; కిన్ = కి; హరి = విష్ణుమూర్తి యందలి; భక్తియోగ = భక్తియోగము యొక్క; సంగతిన్ = వివరములను; ఎల్లన్ = సమస్తమును; వినిపించుచున్ = వినిపిస్తూ; వెండియున్ = మరియు; ఇట్లు = ఈ విధముగా; అనియెన్ = పలికెను; సమ్మోద = సంతోషించిన; చిత్తుండున్ = మనసు కలవాడు; అగుచున్ = అవుతూ; కడకన్ = చివరకు.
భావము:- అని కపిలాచార్యుడు విష్ణుసంబంధమైన భక్తియోగ స్వరూపాన్ని తల్లికి వినిపించి ఎంతో సంతోషంతో మళ్ళీ ఇలా అన్నాడు.

తెభా-3-889-వ.
"అవ్వా! యివ్విధంబున భక్తియోగప్రకారంబు సెప్పితి; నింక దత్త్వలక్షణంబు వేఱువేఱ యెఱింగింతు నే తత్త్వగుణంబుల నెఱింగి నరులు ప్రకృతి గుణంబులవలన విముక్తు లగుదురు; హృదయగ్రంథి విచ్ఛేదకంబు నాత్మదర్శనరూపంబు నగు నా జ్ఞానం బాత్మనిశ్శ్రేయస కారణంబు కావున దాని నెఱింగింతు;నందు నాత్మస్వరూపం బెట్టి దనిన; ననాదియుఁ, బురుషుండును, సత్త్త్వాది గుణశూన్యుండును, బ్రకృతిగుణ విలక్షణుండును, బ్రత్యక్స్వరూపుండును, స్వయంప్రకాశుండును మఱియు నెవ్వనితోడ నీ విశ్వంబు సమన్వితం బగు నతండు గుణత్రయాత్మత్వంబు నవ్యక్తంబును భగవత్సంబంధియు నగు ప్రకృతి యందు యదృచ్ఛచే లీలావశంబునం బ్రవేశించిన నా ప్రకృతి గుణత్రయమయంబైన స్వరూపం బయిన ప్రజాసర్గంబుఁ జేయం గనుంగొని; యప్పుడు మోహితుం డయి విజ్ఞాన తిరోధానంబునం జేసి గుణత్రయాత్మకం బయిన ప్రకృత్యధ్యాసంబున నన్యోన్యమేళనం బగుటయు నంతం బ్రకృతిగుణంబుఁ దన యందు నారోపించుకొని క్రియామాణంబు లగు కార్యంబులవలనం గర్తృత్వంబు గలిగి సంసార బద్ధుండై పారతంత్ర్యంబు గలిగి యుండు; కర్తృత్వశూన్యుం డగు నీశ్వరుండు సాక్షి యగుటం జేసి యాత్మకుం గార్యకారణ కర్తృత్వంబులు ప్రకృత్యధీనంబు లనియు; సుఖదుఃఖ భోక్తృత్వంబులు ప్రకృతి విలక్షణుం డయిన పురుషుని వనియు నెఱుంగుదు"రని చెప్పిన విని దేవహూతి కపిలున కిట్లనియె "బురుషోత్తమా! ప్రకృతి పురుషులు సదసదాత్మక ప్రపంచంబునకుఁ గారణభూతులు గావున వాని లక్షణంబు సదసద్వివేక పూర్వకంబుగా నానతిమ్ము;"ననిన భగవంతుం డిట్లనియె.
టీక:- అవ్వా = తల్లీ; ఇవ్విధంబునన్ = ఈ విధముగా; భక్తియోగ = భక్తియోగము యొక్క; ప్రకారంబున్ = క్రమమును; చెప్పితిన్ = చెప్పితిని; ఇంక = ఇంక; తత్త్వ = తత్త్వము యొక్క; లక్షణంబున్ = లక్షణములను; వేఱువేఱన్ = దేనికి అది వేరువేరుగ; యెఱింగింతున్ = తెలిపెదను; ఏ = ఏ; తత్త్వ = తత్త్వము యొక్క; గుణంబులన్ = గుణములను; ఎఱింగి = తెలిసి; నరులు = మానవులు; ప్రకృతి = ప్రకృతి యొక్క; గుణంబుల = బంధముల; వలన = వలన; విముక్తులు = విడువబడినవారు; అగుదురు = అవుతారు; హృదయగ్రంధి = సందేహము {హృదయగ్రంధి - హృదయమున ఉండు గ్రంధి (ముడి, సంధి), సందేహము, హృత్+అయమ్-ఇదిగో ఇక్కడున్నా}; విచ్చేదకంబునున్ = తెగగొట్టునదియును; ఆత్మ = ఆత్మ (తన నిజరూపము); దర్శన = చూపునట్టి; రూపంబున్ = విధానమును; అగు = అయినట్టి; ఆ = ఆ; ఆత్మ = ఆత్మకు; నిశ్శ్రేయస = ముక్తికి; కారణంబున్ = కారణము; కావునన్ = అందుచేత; దానిన్ = దానిని; ఎఱిగింతున్ = తెలిపెదను; అందున్ = దానిలో; ఆ = ఆ; ఆత్మ = ఆత్మ యొక్క; స్వరూపంబున్ = స్వరూపము; ఎట్టిది = ఎలాంటిది; అనినన్ = అనినచో; అనాదియున్ = మొదలు లేనిదియును; పురుషుండునున్ = పురములు అను దేహములను నిర్మించుకొను స్వభావము కలవాడు; సత్త్వాది = సత్త్వము మొదలగు {సత్త్వాది - గుణత్రయము, సత్త్వ రజస్ తమోగుణములు మూడు}; గుణ = గుణములు; శూన్యుండును = లేనివాడును; ప్రకృతి = ప్రకృతిలోని; గుణ = గుణములకు; విలక్షణుండును = వేరు లక్షణములు కలవాడును; ప్రత్యక్ = ప్రత్యక్షమైన; స్వరూపుండును = తన రూపము కలవాడును; స్వయంప్రకాశుండునున్ = స్వయముగా ప్రకాశమే తానైన వాడును; మఱియున్ = ఇంకను; ఎవ్వని = ఎవని; తోడన్ = తో; ఈ = ఈ; విశ్వంబున్ = విశ్వము; సమన్వితంబున్ = కూడుకొన్నది; అగున్ = అగునో; అతండు = అతడు; గుణత్రయ = మూడు గుణములతోను; ఆత్మకత్వంబునన్ = కూడి ఉండుటలో; వ్యక్తంబును = తెలియబడునదియు; భగవత్ = భగవంతునితో; సంబంధియున్ = చక్కగ సంబంధము కలదియును; అగు = అగును; ప్రకృతి = ప్రకృతి; అందున్ = అందు; అదృచ్చ = అప్రయత్నగ జరుగుట; చేన్ = చేత; లీలా = లీల యొక్క; వశంబునన్ = విధమున; ప్రవేశించిన = ప్రవేశించిన; ఆ = ఆ; ప్రకృతి = ప్రకృతి; గుణ = గుణములు; త్రయ = మూటితోను; మయ = కూడినది; ఐన = అయినట్టి; స్వరూపంబున్ = రూపముతో కనడినది; అయిన = అయిన; ప్రజా = సంతతిని; సర్గంబున్ = పుట్టించుట; చేయన్ = చేయుటను; కనుంగొని = చూసి; అప్పుడు = అప్పుడు; మోహితుండు = మోహమునకు చెందినవాడు; అయి = అయ్యి; విజ్ఞాన = విజ్ఞానము; తిరోధానంబునన్ = మరుగుపడుట; చేసి = వలన; గుణత్రయ = త్రిగుణముల; ఆత్మకంబున్ = కలిసినది; అయిన = అయిన; ప్రకృతి = ప్రకృతి; అధ్యాసంబునన్ = ఆక్రమించుటచే; అన్యోన్య = ఒక దాని కింకొటి; మేళనంబున్ = కలియుట; అగుటయున్ = జరుగుటను; అంతన్ = అంతట; ప్రకృతి = ప్రకృతి; గుణంబున్ = గుణమును; తన = తన; అందున్ = అందు; ఆరోపించుకొని = ఆరోపించుకొని; క్రియామాణంబులున్ = జరుగుచున్నవి; అగు = అయిన; కార్యంబుల = కార్యముల; వలనన్ = వలన; కర్తృత్వంబు = కర్తృత్వము; కలిగి = కలిగి; సంసార = సంసారము అందు; బద్దుండు = కట్టబడినవాడును; ఐ = అయ్యి; పారతంత్ర్యంబునన్ = ఇతరమైన దానిపై ఆధారపడుట; కలిగి = కలిగి; ఉండున్ = ఉండును; కర్తృత్వ = కర్తృత్వము; శూన్యుండు = లేనివాడు; అగు = అయిన; ఈశ్వరుండు = భగవంతుడు; సాక్షి = సాక్షి; అగుటన్ = అగుట; చేసి = వలన; ఆత్మ = ఆత్మ; కున్ = కు; కార్య = కార్యములు; కారణ = కారణమును; కర్తృత్వంబులు = కర్తృత్వములు; ప్రకృతి = ప్రకృతికి; అధీనంబులు = ఆధీనమైనవి; అనియున్ = అనియు; సుఖ = సుఖము; దుఃఖ = దుఃఖముల; బోక్తృత్వంబులు = అనుభవించుటలు; ప్రకృతి = ప్రకృతికి; విలక్షణుడు = వేరైన లక్షణములు కలవాడు; అయిన = అయిన; పురుషునివి = పురుషునివి; అనియున్ = అనియును; ఎఱుగుదురు = తెలియుదురు; అని = అని; చెప్పిన = చెప్పిన; విని = విని; దేవహూతి = దేవహూతి; కపిలున్ = కపిలుని; కిన్ = కి; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను; ప్రకృతి = ప్రకృతి; పురుషులు = పురుషులు; సత్ = సత్తు; అసత్ = అసత్తు; ఆత్మక = కూడినదైన; ప్రపంచంబున్ = ప్రపంచమున; కున్ = కు; కారణ = కారణ; భూతులు = అంశములు; కావునన్ = కావున; వాని = వాని యొక్క; లక్షణంబున్ = లక్షణములు; సత్ = సత్తు; అసత్ = అసత్తు; వివేక = విడమరచబడిన జ్ఞానముతో; పూర్వకముగన్ = కూడినదిగ; ఆనతిమ్ము = చెప్పుము; అనినన్ = అనగ; భగవంతుడు = భగవంతు(డగు కపిలుడు); ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను;
భావము:- “అమ్మా! ఈవిధంగా భక్తియోగ స్వరూపం నీకు తెలిపాను. ఇక తత్త్వజ్ఞాన లక్షణాలను వేరువేరుగా తెలుపుతాను. ఏ తత్త్వజ్ఞాన లక్షణాలను తెలుసుకొన్న మానవులు ప్రకృతి గుణాలనుండి విముక్తు లవుతారో, మనస్సులోని సందేహాలు విడిపోయి స్వస్వరూపాన్ని తెలుసుకుంటారో, అటువంటి తత్త్వజ్ఞానం కైవల్యప్రాప్తికి కారణం అవుతుంది. అందువల్ల ఆత్మస్వరూపం ఎలాంటిదో చెపుతాను. అనాది యైనవాడూ, పురుషశబ్ద వాచ్యుడూ, సత్త్వరజస్తమోగుణాలు లేనివాడూ , ప్రకృతి గుణాలకంటె విలక్షణమైన గుణాలు కలవాడూ, ప్రత్యక్షస్వరూపం కలవాడూ, తనంతతాను వెలిగేవాడూ, విశ్వమంతటా ఉన్నవాడూ అయిన పరమాత్మ గుణత్రయాత్మకమూ, అవ్యక్తమూ, భగవంతుని అంటిపెట్టుకున్నదీ అయిన ప్రకృతిలో అప్రయత్నంగా అలవోకగా లీలగా ప్రవేశించాడు. ఆ ప్రకృతి గుణత్రయ మయమైన స్వరూపంతో సాకారమైన ప్రజాసృష్టి చేయటం ప్రారంభించింది. అది చూచి పురుషుడు వెంటనే మోహాన్ని పొంది విజ్ఞానం మరుగుపడగా, గుణత్రయాత్మకమైన ప్రకృతిని ఆశ్రయించి, పరస్పరం మేళనం పొందారు. అప్పుడు పురుషుడు ప్రకృతి గుణాలను తనయందే ఆరోపించుకొని జరుగుతున్న కార్యాలన్నింటికీ తానే కర్తగా భావించుకొని సంసారబంధంలో కట్టుబడి పరాధీనతకు లోనవుతాడు. ఈశ్వరుడు కర్త కాకున్నా జరుగుతున్న కర్మలకు సాక్షీభూతుడు కావటంవల్ల ఆత్మకు కార్యకారణ కర్తృతాలు లేవనీ, అవి ప్రకృతికి అధీనమైనవనీ, సుఖదుఃఖాలు అనుభవించడం ప్రకృతికంటె విలక్షణుడైన పురుషునిదనీ అనుభజ్ఞులు తెలుసుకుంటారు” అని చెప్పగా విని దేవహూతి కపిలునితో “మహాత్మా! ప్రకృతి పురుషులు అస్తిత్వం కలదీ, అస్తిత్వం లేనిదీ అయిన ప్రపంచానికి కారణభూతులు. కాబట్టి ఆ ప్రకృతి పురుషుల లక్షణాలు సదసద్వివేక పురస్సరంగా సెలవీయ కోరుతున్నాను” అన్నది. అప్పుడు భగవంతుడైన కపిలుడు దేవహూతితో ఇలా అన్నాడు.

తెభా-3-890-క.
"క్రమునఁ ద్రిగుణము నవ్య
క్తము నిత్యము సదసదాత్మము మఱియుఁ బ్రధా
ము ననఁగాఁ బ్రకృతివిశే
ము లదియు విశిష్ట మనిరి ద్విదు లెలమిన్.

టీక:- క్రమమున = క్రమముగ; త్రిగుణమున్ = త్రిగుణములు; అవ్యక్తమున్ = అవ్యక్తము; నిత్యమున్ = నిత్యము; సత్ = సత్తు; అసత్ = అసత్తు; ఆత్మకమున్ = కూడినది; మఱియున్ = మరియు; ప్రధానమున్ = ప్రధానము {ప్రధానము - (ముందు చెప్పిన లక్షణములకు) ఆధారమైనది, వేదములలో అదితి అనబడును}; అనగా = అను వీనిని; ప్రకృతి = ప్రకృతి యొక్క; విశేషములు = విశేషములు; అదియు = అదియు; విశిష్టము = విశిష్టమైనవి; అనిరి = అన్నారు; సత్ = మంచిగ; విదులు = తెలిసినవారు; ఎలమిన్ = వ్యక్తముగ.
భావము:- “త్రిగుణాత్మకం, అవ్యక్తం, నిత్యం, సదసదాత్మకం, ప్రధానం అనేవి ప్రకృతి విశేషాలు. ఈ విశేషాలతో కూడి ఉన్నది కనుక ప్రకృతిని విశిష్టం అని ప్రాజ్ఞులు పేర్కొన్నారు.

తెభా-3-891-వ.
అందుఁ బ్రకృతి చతుర్వింశతితత్త్వాత్మకంబై యుండు;నది యెట్లనినం బంచమహాభూతంబులును, బంచతన్మాత్రలును, జ్ఞానకర్మాత్మకంబు లయిన త్వక్చక్షుశ్శ్రోత్ర జిహ్వాఘ్రాణంబులు వాక్పాణి పాదపాయూపస్థంబులు నను దశేంద్రియంబులును, మనోబుద్ధి చిత్తాహంకారంబు లను నంతఃకరణచతుష్టయంబును నను చతుర్వింశతి తత్త్వాత్మకం బైన సగుణబ్రహ్మ సంస్థానంబు సెప్పితి; నిటమీఁదఁ గాలం బను పంచవింశకతత్త్వంబుసెప్పెద;నది గొందఱు పురుషశబ్దవాచ్యుం డైన యీశ్వరుని పౌరుషంబు గాలశబ్దంబునఁ జెప్పబడు నందురు; యందు నహంకార మోహితుండై ప్రకృతి వొంది జీవుండు భయంబుఁ జెందు; ప్రకృతిగుణసామ్యంబునం జేసి వర్తించి నిర్విశేషుం డగు భగవంతుని చేష్టా విశేషంబు దేనివలన నుత్పన్నం బగు నదియ కాలం బని చెప్పంబడు; నదియు జీవరాశ్యంతర్గతం బగుటంజేసి పురుషుండనియు వాని బహిర్భాగ వ్యాప్తిం జేసి కాలం బనియుఁ జెప్పం బడు;నాత్మ మాయం జేసి తత్త్వాంతర్గతుం డయిన జీవునివలన క్షుభితం బయి జగత్కారణం బగు ప్రకృతి యందు పరమపురుషుడు దన వీర్యంబు పెట్టిన నా ప్రకృతి హిరణ్మయం బైన మహత్తత్త్వంబు పుట్టించె;నంత సకల ప్రపంచబీజభూతుడును లయవిక్షేప శూన్యుండును నగు నీశ్వరుండు దన సూక్ష్మవిగ్రహంబు నందు నాత్మ గతం బైన మహదాది ప్రపంచంబుల వెలిగించుచు స్వతేజోవిపత్తిం జేసి యాత్మప్రస్వాపనంబు సేయు నట్టి తమంబును గ్రసించె"నని చెప్పి; వెండియు నిట్లనియె.
టీక:- అందున్ = అందులో {ప్రకృతి చతుర్వింశతి తత్త్వములు – పంచ భూతములు (1పృథివి 2జలము 3అగ్ని 4వాయువు 5ఆకాశము) పంచ తన్మాత్రలు (6శబ్దము 7స్పర్శము 8రూపము 9రుచి 10వాసన) పంచ జ్ఞానేంద్రియములు (11చర్మము 12కన్ను 13ముక్కు 14చెవి 15నాలుక) పంచ కర్మేంద్రియములు (16వాక్కు 17చేతులు 18కాళ్ళు 19గుదము 20ఉపస్థు) అంతఃకరణ చతుష్టయము (21మనస్సు 22బుద్ధి 23చిత్తము 24అహంకారము)}; ప్రకృతి = ప్రకృతి; చతుర్వింశతి = ఇరవైనాలుగు; తత్త్వ = తత్త్వములు; ఆత్మకంబున్ = కలిగినది; ఐ = అయ్యి; ఉండున్ = ఉండును; అది = అది; ఎట్లు = ఏ విధముగ; అనినన్ = అనగ; జ్ఞాన = జ్ఞానమునకు; కర్మ = కర్మమునకు; ఆత్మకంబుల్ = సంబంధించినవి; అయిన = అయినట్టి; త్వక్ = చర్మము; చక్షు = కన్ను; శోత్ర = చెవి; జిహ్వ = నాలుక; ఘ్రాణంబులు = ముక్కులును; వాక్ = వాక్కు; పాణి = చేతులు; పాద = కాళ్ళు; పాయు = గుదము (మలావయవము); ఉపస్థు = ఉపస్థు (జననేంద్రియము) లు; అను = అనెడి; దశేంద్రియంబులును = పదిఇంద్రియములును; మనస్ = మనస్సు; బుద్ధి = బుద్ధి; చిత్త = చిత్తము; అహంకారంబులు = అహంకారములు; అను = అనెడి; అంతఃకరణచతుష్టయంబును = చతురాంతఃకరణములును {అంతఃకరణ చతుష్టయంబులు - 1మనస్సు 2బుద్ధి 3చిత్తము 4 అహంకారము}; అను = అనెడి; చతుర్వింశతి = ఇరవైనాలుగు {చతుర్వింశతి తత్త్వములు - అష్టప్రకృతులు (1అవ్యకత్తము 2బుద్ధి 3అహంకారము పంచ తన్మాత్రలు అను 4శబ్దము 5స్పర్శము 6దృక్కు 7ఘ్రాణము 8రసనము) మరియును షోడశ వికృతులును (పంచ భూతములు (1పృథివి 2జలము 3అగ్ని 4వాయువు 5ఆకాశము) పంచ జ్ఞానేంద్రియములు (6చర్మము 7కన్ను 8ముక్కు 9చెవి 10నాలుక) పంచ కర్మేంద్రియములు (11వాక్కు 12చేతులు 13కాళ్ళు 14గుదము 15ఉపస్థు) మరియు16మనస్సు) పంచ వింశకము (25వది) కాలము (పురుషుడు)}; తత్త్వ = తత్త్వముల; ఆత్మకంబున్ = కలిగినది; ఐన = అయినట్టి; సగుణ = గుణములతో కూడిన; బ్రహ్మ = బ్రహ్మ యొక్క; సంస్థానంబున్ = నివాసమైనది; చెప్పితిన్ = తెలిపితిని; ఇటమీద = తరువాత; కాలంబు = కాలము; అను = అనెడి; పంచవింశక = ఇరవైయైదవ; తత్త్త్వంబున్ = తత్త్త్వమును; చెప్పెదన్ = చెప్తాను; అది = దానిని; కొందఱు = కొంతమంది; పురుష = పురుషుడు అను; శబ్ద = శబ్దముచేత; వాచ్యుండు = చెప్పబడువాడు; ఐన = అయినట్టి; ఈశ్వరుని = భగవంతుని; పౌరుషంబున్ = పురుషుని లక్షణము; కాల = కాలము అను; శబ్దంబునన్ = శబ్దముచేత; చెప్పబడును = చెప్పబడును; అందురు = అందురు; అందున్ = అందులో; అహంకార = అహంకారముచే; మోహితుండు = మోహింపబడువాడు; ఐ = అయ్యి; ప్రకృతిన్ = ప్రకృతిని; పొంది = చెంది; జీవుండు = జీవి; భయంబున్ = భయమును; చెందు = చెందును; ప్రకృతి = ప్రకృతి; గుణ = గుణముల; సామ్యంబునన్ = సమత్వము; చేసి = వలన; వర్తించి = ప్రవర్తించి; నిర్విశేషుండు = ఏమియును మిగలనివాడు; అగు = అయిన; భగవంతుని = భగవంతుని; చేష్టా = ప్రవర్తనల; విశేషంబున్ = ప్రత్యేకతలు; దేని = దేని; వలనన్ = వలననైతే; ఉత్పన్నంబున్ = పుట్టునది; అగున్ = అగునో; అది = దానిని; కాలంబున్ = కాలము; అని = అని; చెప్పంబడున్ = చెప్పబడును; అదియున్ = అదియు; జీవ = జీవ; రాశి = జాలము; అంతర్గతంబు = లోపలిది; అగుటన్ = అగుట; చేసి = వలన; పురుషుండు = పురుషుడు; అనియున్ = అనియు; వాని = వాని; బహిర్ = బయటి; భాగ = భాగములలో; వ్యాప్తిన్ = వ్యాపించుట; చేసి = వలన; కాలంబున్ = కాలము; అనియున్ = అనియును; చెప్పంబడున్ = చెప్పబడును; ఆత్మ = ఆత్మయొక్క; మాయన్ = మాయ; చేసి = వలన; తత్త్వ = (24)తత్త్వములలో; అంతర్గతుండు = చిక్కుకొన్నవాడు; అయిన = అయిన; జీవుని = జీవుని; వలనన్ = వలన; క్షుబితంబున్ = మిక్కిలి కదలించబడినది; అయి = అయ్యి; జగత్ = విశ్వమునకు; కారణంబున్ = కారణము; అగు = అయిన; ప్రకృతి = ప్రకృతి; అందున్ = అందు; పరమపురుషుండు = పరమపురుషుడు; తన = తన యొక్క; వీర్యంబున్ = వీర్యమును; పెట్టిన = పెట్టగా; ప్రకృతి = ప్రకృతి; హిరణ్ = బంగారు రంగుతో; మయంబున్ = కూడినది; ఐన = అయినట్టి; మహత్ = మహత్తు అనెడి; తత్త్వంబున్ = తత్త్వమును; పుట్టించెన్ = పుట్టించెను; అంతన్ = అంతట; సకల = సమస్తమైన; ప్రపంచ = ప్రపంచమునకు; బీజ = విత్తన; భూతుండును = అంశైనవాడును; లయ = లయమగుట; విక్షేప = కదలుటలు; శూన్యుండును = లేనివాడును; అగు = అయిన; ఈశ్వరుండు = భగవంతుడు; తన = తన యొక్క; సూక్ష్మ = సూక్ష్మ; విగ్రహంబున్ = రూపము; అందున్ = అందు; ఆత్మ = తనయందు; గతంబున్ = చేరినది; ఐన = అయిన; మహత్ = మహత్తు; ఆది = మొదలైన; ప్రపంచంబులన్ = ప్రపంచములను; వెలిగించుచున్ = వెలిగిస్తూ; స్వ = స్వంత; తేజస్ = తేజస్సు; విపత్తిన్ = ప్రసారము; చేసి = వలన; ఆత్మన్ = తనను; ప్రస్వాపనంబున్ = నిద్రింప; చేయునట్టి = చేసెడి; తమంబునున్ = తమమును; గ్రసించెన్ = మ్రింగెను; అని = అని; చెప్పి = చెప్పి; వెండియున్ = మరల; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను.
భావము:- ఆ ప్రకృతి ఇరవై నాలుగు తత్త్వాలు కలదై ఉంటుంది. ఎలాగంటే పృథివి, జలం, అగ్ని, వాయువు, ఆకాశం అనే పంచభూతాలూ; శబ్దం, స్పర్శం, రూపం, రసం, గంధం అనే పంచ తన్మాత్రలూ; చర్మం, కన్ను, ముక్కు, చెవి, నాలుక అనే పంచ జ్ఞానేంద్రియాలూ; వాక్కు, చేతులు, కాళ్ళు, మలావయవం, మూత్రావయవం అనే పంచ కర్మేంద్రియాలూ; మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం అనే అంతఃకరణ చతుష్టయమూ కలిసి ఇరవైనాలుగు తత్త్వాలు కలిగి సగుణబ్రహ్మకు సంస్థానం అయిన ప్రకృతిని వివరించాను. ఇక కాలం అనే ఇరవై ఐదవ తత్త్వాన్ని గురించి చెబుతాను. కొందరు పురుష శబ్ద వాచ్యుడైన ఈశ్వరుని స్వరూపమే కాలంగా చెప్పబడుతున్నదంటారు. అహంకార మోహితుడై ప్రకృతితో సంబంధం పెట్టుకున్న పురుషుడు జీవుడై భయాదులను అనుభవిస్తాడు. ప్రకృతి గుణాలన్నింటిలో సమానంగా అంతర్యామియై నిర్విశేషుడై ప్రవర్తించే భగవంతుని చేష్టా విశేషాలను కలుగచేసేదే కాలం అనబడుతుంది. అదికూడా జీవరాసులలో అంతర్యామిగా ఉన్నప్పుడు పురుషుడు అనీ, వానికి వెలుపల వ్యాపించి ఉన్నపుడు కాలం అనీ అనబడుతుంది. ఆత్మమాయ కారణంగా ప్రకృతి తత్త్వాలలో విలీనమైన జీవునివల్ల కదిలింపబడినదీ, జగత్తుకు కారణమైనదీ అయిన ప్రకృతియందు భగవంతుడు సృజనాత్మకమైన తన వీర్యాన్ని ఉంచగా ఆ ప్రకృతి తనలోనుంచి హిరణ్మయమైన మహత్త్వాన్ని పుట్టించింది. అనంతరం సకల ప్రపంచానికి మూలమైనవాడూ, లయవిక్షేప శూన్యుడూ అయిన ఈశ్వరుడు తన సూక్ష్మవిగ్రహంలో ఆత్మగతమైన మహదాది ప్రపంచాన్ని వెలిగిస్తూ, తన తేజఃప్రసారం చేత తనను నిద్రింపజేసే తమస్సును హరించి వేశాడు” అని చెప్పి కపిలుడు మళ్ళీ ఇలా అన్నాడు.

తెభా-3-892-క.
"దివ్యమగు వాసుదేవా
దివ్యూహచతుష్టయంబు త్రిజగము లందున్
సేవ్యం బని చెప్పంబడు
వ్యగుణా! దాని నెఱుఁగ లికెద నీకున్.

టీక:- దివ్యము = దివ్యము; అగు = అయిన; వాసుదేవ = వాసుదేవ; ఆది = మొదలగు; వ్యూహ = వ్యూహములు, రచనలు {చతుర్వ్యూహములు, వ్యూహచతుష్టయములు - 1వాసుదేవ 2సంకర్షణ 3ప్రద్యుమ్న 4అనిరుద్ధ అనబడు నాలుగు}; చతుష్టయంబున్ = నాలుగింటిని; త్రిజగములు = ముల్లోకములు {ముల్లోకములు - భూః భువః సువః అను మూడు లోకములు, 1భూలోకము - ఉన్నలోకము (తను) 2భువర్లోకము - పైన (ఇతరమైన) లోకము 3సువర్లోకము- కింద (అంతర) లోకము}; అందున్ = అందును; సేవ్యంబున్ = కొలువ తగినవి; అని = అని; చెప్పంబడున్ = చెప్పబడును; భవ్య = శుభ మగు; గుణా = గుణములు కలదాన; దానిన్ = వానిని; ఎఱుగన్ = తెలియునట్లు; పలికెద = చెప్పెద; నీకున్ = నీకు.
భావము:- “వాసుదేవం, సంకర్షణం, ప్రద్యుమ్నం, అనిరుద్ధం అనే దివ్యమైన ఈ నాలుగు వ్యూహాలూ ముల్లోకాలలోనూ సేవింపదగినవి. సుగుణవతీ! వాటిని నీకు వివరించి చెబుతాను.

తెభా-3-893-సీ.
త్త్వప్రధానమై స్వచ్ఛమై శాంతమై-
యూర్మిషట్కంబుల నోసరించి
సురుచిర షాడ్గుణ్య రిపూర్ణమై నిత్య-
మై భక్తజన సేవ్యమై తనర్చి
లనొప్పుచుండు నవ్వాసుదేవవ్యూహ-
మంత మహత్తత్త్వ మందు నోలి
రూఢిఁ గ్రియాశక్తిరూపంబు గల్గు న-
హంకార ముత్పన్న య్యె నదియ

తెభా-3-893.1-తే.
రవి వైకారికంబుఁ దైసముఁ దామ
సంబు నా మూఁడు దెఱఁగుల రగు నందుఁ
రు వైకారికము మనస్సుకు నింద్రి
ములకును గగనముఖ భూముల కరయ

టీక:- సత్త్వ = సత్వగుణము; ప్రధానమున్ = మూలాధారముగ కలది; ఐ = అయ్యి; స్వచ్ఛము = నిర్మలము; ఐ = అయ్యి; శాంతము = శాంతముకలది; ఐ = అయ్యి; ఊర్మిషట్కంబులున్ = ఆరు కలతలకును {ఊర్మిషట్కములు - 1ఆకలి 2దప్పిక 3శోకము 4మోహము 5ముసలితనము 6మరణము అను ఆరు కలతలు}; విడివడి = దూరమై; సు = మంచి; రుచిర = ప్రకాశవంతమై; షాడ్గుణ్య = షడ్గుణములతో కూడి {షడ్గుణములు - 1తపస్సు 2దానము 3శౌచము 4శమము 5దమము 6సత్యము ఇంకోవిధముగ 1ఐశ్వర్యము 2వీర్యము 3యశస్సు 4శ్రీ 5జ్ఞానము 6 వైరాగ్యము అను ఆరు సుగుణములు}; పరిపూర్ణము = సంపూర్ణత చెందినది; ఐ = అయ్యి; నిత్యమున్ = శాశ్వతము; ఐ = అయ్యి; భక్త = భక్తులైన; జన = జనములచే; సేవ్యము = కొలువబడునది; ఐ = అయ్యి; తనర్చి = అతిశయించి; వలను = యుక్తమై; ఒప్పుచున్ = చక్కనై; ఉండు = ఉండెడి; ఆ = ఆ; వాసుదేవ = వాసుదేవుని; వ్యూహమున్ = తత్త్వము; అంత = అంతట; మహత్ = మహత్తు అనెడి; తత్త్వము = తత్త్వము; అందున్ = లో; ఓలిన్ = క్రమముగా; రూఢిన్ = అవశ్యము; క్రియా = పనిచేయగల; శక్తి = శక్తి; రూపంబున్ = రూపము; కల్గు = కలిగిన; అహంకారము = అహంకారము; ఉత్పన్నము = పుట్టుట; అయ్యెన్ = జరిగెను; అదియ = అదే; సరవిన్ = వరుసగా; వైకారికంబున్ = సత్త్వమును; తైజసమున్ = రజస్సును; తామసంబున్ = తమస్సును;
నాన్ = అనబడు; మూడు = మూడు (3); తెఱంగులన్ = విధములుగ; పరగున్ = తెలియబడును; అందున్ = వానిలో; తనరు = ఉండు; వైకారికము = వైకారిక అహంకారము; మనస్సున్ = మనస్సున; కును = కును; ఇంద్రియముల్ = ఇంద్రియముల; కును = కును; గగన = గగనము {గగనముఖములు - పంచభూతములు, 1గగనము 2వాయు 3జలము 4తేజము 5పృథ్వి}; ముఖ = మొదలైన; భూతముల్ = భూతముల; కున్ = కు; అరయ = పరికించి చూడగ.
భావము:- వాసుదేవవ్యూహం ఆకలిదప్పులు, శోకమోహాలు, జరామరణాలు అనే ఆరు ఊర్ములనుండి విడివడినదై ఐశ్వర్యం, వీర్యం, యశస్సు, శ్రీ, జ్ఞానం, వైరాగ్యం అనే షడ్గుణాలతో పరిపూర్ణమై సత్త్వగుణ ప్రధానమై, నిర్మలమై, శాంతమై, నిత్యమై, భక్తజన సంసేవ్యమై అలరారుతూ ఉంటుంది. మహత్తత్త్వం నుండి క్రియాశక్తి రూపమైన అహంకారం పుట్టింది. ఆ అహంకారం వైకారికం, తైజసం, తామసం అని మూడు విధాలుగా విడివడింది. వానిలో వైకారికాహంకారం అనేది మనస్సుకూ, పంచేంద్రియాలకూ, అకాశాది పంచభూతాలకూ...

తెభా-3-894-వ.
అది దేవతారూపంబుల నుండు దైజసాహంకారంబు బుద్ధి ప్రాణంబులుం గలిగి యుండు తామసాహంకారం బింద్రియ మేళనంబున నర్థమాత్రం బై యుండు; మఱియును.
టీక:- అది = అది; దేవతా = దేవతల యొక్క; రూపంబులన్ = రూపములలో; ఉండున్ = ఉండును; తైజసాహంకారంబు = రజోహంకారము; బుద్ధి = బుద్ధి; ప్రాణంబులున్ = ప్రాణములు; కలిగి = కలిగి; ఉండున్ = ఉండును; తామసాహంకారంబున్ = తామసాహంకారము; ఇంద్రియ = ఇంద్రియముల; మేళనంబునన్ = కలియక యందు; అర్థ = పేరుకి; మాత్రంబు = మాత్రమే; ఐ = అయ్యి; ఉండున్ = ఉండును; మఱియును = ఇంకను.
భావము:- ఉత్పత్తి స్థానమై దేవతారూపమై ఉంటుంది. తైజసాహంకారం బుద్ధిరూపాన్నీ, ప్రాణరూపాన్నీ కలిగి ఉంటుంది. తామసాహంకారం ఇంద్రియార్థాలతో సమ్మేళనం పొంది ప్రయోజనమాత్రమై ఉంటుంది. ఇంకా...

తెభా-3-895-సీ.
ట్టి యహంకార మం దధిష్టించి సా-
స్రఫణామండలాభిరాముఁ
డై తనరారు ననంతుఁడు సంకర్ష-
ణుం డనఁ దగు పురుషుండు ఘనుఁడు
హిత భూతేంద్రియ మానస మయుఁడు నై-
ర్తృత్వ కార్యత్వ కారణత్వ
ప్రకట శాంతత్వ ఘోత్వ మూఢత్వాది-
క్షణ లక్షితోల్లాసి యగుచు

తెభా-3-895.1-తే.
నుండు నమ్మేటి రెండవ వ్యూహ మనఁగ
నవికారంబుఁ బొందు వైకారికంబు
న వినుము మనస్తత్వ మెమిఁ బుట్టె
ఱియు వైకారికంబును మాత! వినుము.

టీక:- అట్టి = అటువంటి; అహంకారమున్ = అహంకారము; అందున్ = లో; అధిష్టించి = ఆశ్రయించి; సాహస్ర = వెయ్యి (1000); ఫణా = పడగలతో; మండల = చుట్టబడి; అభిరాముండు = చక్కగనొప్పి యుండవాడు; ఐ = అయ్యి; తనరారున్ = అతిశయించెడి; అసంగతుడు = తగులములు లేనివాడు; సంకర్షణుండు = సంకర్షణుడు; అనన్ = అనుటకు; తగున్ = తగును; పురుషుండు = పురుషుడు; ఘనుడు = గొప్పవాడు; మహిత = గొప్పవియైన; భూత = (పంచ) భూతములు; ఇంద్రియ = (పంచ) ఇంద్రియములు; మానస = మనసులతో; మయుడున్ = నిండియున్నవాడు; ఐ = అయ్యి; కర్తృత్వ = కర్త తత్వము; కార్యత్వ = కార్యము తత్వము; కారణత్వ = కారణము తత్వము లని; ప్రకట = తెలియబడు; శాంతత్వ = శాంత లక్షణము; ఘోరత్వ = ఘోరమైన లక్షణము; మూఢత్వ = మూఢమైన లక్షణము; ఆది = మొదలైన; లక్షణ = లక్షణములకు; లక్షిత = చెంది; ఉల్లాసి = ప్రకాశించువాడు; అగుచున్ = అవుతూ; ఉండున్ = ఉండును; ఆ = ఆ; మేటి = సమర్థుడు;
రెండవ = రెండవదైన (సంకర్షణము); వ్యూహమున్ = తత్త్వము; అనగన్ = అనబడి; ఘన = మిక్కిలి; వికారంబున్ = మార్పులను; పొందున్ = పొండెడి; వైకారికంబున్ = సాత్వికము; వలన = వలన; వినుము = వినుము; మనస్తత్వము = మనస్తత్వము; ఎలమిన్ = కోరి; పుట్టెన్ = పుట్టెను; మఱియున్ = ఇంకను; వైకారికంబునున్ = సాత్వికమును; మాత = అమ్మ; వినుము = వినుము.
భావము:- వైకారికమైన సాత్త్వికాహంకారాన్ని అధిష్ఠించి సంకర్షణ వ్యూహం ఒప్పుతుంటుంది. వేయి పడగలతో ప్రకాశించేవాడూ, అనంతుడూ అయిన సంకర్షణ పురుషుడు మహానుభావుడై పంచభూతాలతో, పంచేంద్రియాలతో, మనస్సుతో నిండి ఉంటాడు. కర్త, కార్యం, కారణం అనే రూపభేదాలు కలిగి శాంతత్వం, ఘోరత్వం, మూఢత్వం మొదలైన లక్షణాలతో ఉల్లాసంగా ఉంటాడు. ఈ మేటి వ్యూహమే రెండవదైన సంకర్షణ వ్యూహం. దీనినుంచే మనస్తత్త్వం పుట్టింది.