Jump to content

పోతన తెలుగు భాగవతము/తృతీయ స్కంధము/కపిలుని జన్మంబు

వికీసోర్స్ నుండి


తెభా-3-825-క.
మునివరుఁ డొకనాఁ డిమ్ములఁ
నిజదేహంబు నవవిధంబులు గావిం
చి యంబునఁ దద్వీర్యముఁ
సతిగర్భమున నవవిధంబుగ నిలిపెన్.

టీక:- ముని = మునులలో; వరుడు = ఉత్తముడు; ఒక = ఒక; నాడు = దినమున; ఇమ్ములన్ = అనుకూల్యముగ; తన = తన యొక్క; నిజ = స్వంత; దేహంబున్ = దేహమును; నవ = తొమ్మిది (9); విధంబులన్ = విధములుగ; కావించి = చేసి; నయంబునన్ = చక్కగా; తత్ = అతని; వీర్యమున్ = వీర్యమును; తన = తన; సతి = భార్య యొక్క; గర్భమునన్ = గర్భములో; నవ = తొమ్మిది (9); విధంబుగ = విధములుగ; నిలిపెన్ = నిలిపెను.
భావము:- మునిశ్రేష్ఠుడైన కర్దముడు ఒకనాడు కుతూహలంతో తొమ్మిది విధాలైన వేరువేరు దేహాలను ధరించి క్రమంగా తన వీర్యాన్ని తన భార్య అయిన దేవహూతి గర్భంలో తొమ్మిది విధాలుగా నిలిపాడు.

తెభా-3-826-క.
ది కారణంబుగాఁ బెం
పొవిన మునివలన దేవహూతియుఁ గూఁతుల్
ముమునఁ గనెఁ దొమ్మండ్రన్
ముదితయు మది సంతసించె మునివరుఁ డంతన్.

టీక:- అది = ఆ; కారణంబుగాన్ = కారణముచే; పెంపొదవిన = మహిమ చెందిన; ముని = ముని; వలనన్ = వలన; దేవహూతియున్ = దేవహూతి కూడ; కూతుల్ = పుత్రికలను; ముదమునన్ = సంతోషముతో; కనెన్ = కనినది; తొమ్మండ్రను = తొమ్మిదిమందిని (9); ముదితయున్ = ఆమెకూడ; మదిన్ = మనసున; సంతసించెన్ = సంతోషించినది; ముని = మునులలో; వరుడు = ఉత్తముడు; అంతన్ = అంతట.
భావము:- ఆ కారణంగా కర్దమునివల్ల దేవహూతి తొమ్మిదిమంది కుమార్తెలను కన్నది. ఆమె తన మనస్సులో ఎంతో సంతోషించింది. అప్పుడా ముని (సన్యసింప దలిచాడు).

తెభా-3-827-తే.
న్యసింపగగోరిన తి యెఱింగి
యాత్మఁ బొడమిన సంతాప గ్గలింపఁ
జింత వాటిల్లఁ జెక్కిటఁ జేయిసేర్చి
దములను నేల వ్రాయుచుఁ లికెఁ బతికి.

టీక:- సన్యసింపన్ = సన్యాసింపవలెనని; కోరిన = అనుకొనుచుండ; సతి = భార్య; ఎఱింగి = తెలిసికొని; ఆత్మన్ = మనసున; పొడమిన = ఉదయించిన; సంతాపమున్ = వ్యధ; అగ్గలింపన్ = అధికమై; చింత = బాధ, బెంగ; వాటిల్లన్ = కలుగగా; చెక్కిటన్ = చెంపకు; చేయి = చెయ్యి; చేర్చి = చేర్చి; పదములను = పాదములను; నేలన్ = నేల మీద; వ్రాయుచున్ = రాస్తూ; పలికెన్ = పలికెను; పతి = భర్త; కిన్ = కు.
భావము:- (కర్దముడు) సన్యసింప దలిచాడు. ఆ విషయం అతని భార్య దేవహూతి తెలిసికొని మనస్సులో పుట్టిన ఆవేదన అధికం కాగా, చింతతో చెక్కిలిమీద చేయి చేర్చి, కాలివ్రేలితో నేలపై వ్రాస్తూ తన భర్తతో ఇలా అన్నది.

తెభా-3-828-సీ.
"నఘ! సంతాన పర్యంతంబు ననుఁ గూడి-
ర్తింతు ననుచుఁ బూర్వమునఁ బలికి
కూఁతుల నిచ్చితి కొమరార నిప్పు డీ-
రుణులు పతులును మకుఁ దార
రసి వర్తింతురో ని భీతినొందెదఁ-
గావున నీ పుత్రిలకుఁ దగిన
రుల సంపాదించి రిణయంబులు సేసి-
త్త్వసంహిత నాకుఁ విలి తెలుపు

తెభా-3-828.1-తే.
సుతునిఁ గృపసేసి ననుఁ గావు సుజనవినుత!
ర్థి సంసార దుఃఖంబు పనయింప
ర్హుఁడవు నీవ కావె మోమున నింత
కాల మూరకపోయె నే తియు లేక.

టీక:- అనఘ = పుణ్యుడ; సంతాన = సంతానము కలుగు; పర్యంతంబున్ = వరకు; ననున్ = నన్ను; కూడి = కలిసే; వర్తింతును = నడచుదును; అనుచున్ = అని; పూర్వమునన్ = ఇంతకు పూర్వము; పలికి = పలికి; కూతులన్ = కుమార్తెలను; ఇచ్చితి = ఇచ్చితివి; కొమరార = మనోజ్ఞమగనట్లు; ఇప్పుడు = ఇప్పుడు; ఈ = ఈ; తరుణులు = స్త్రీలు; పతులును = భర్తలును; తమకున్ = తమంతట; తార = తామే; అరసి = చూసుకొని; వర్తింతురో = పోతారేమో; అని = అని; భీతిన్ = భయమున్; పొందెదన్ = పడుతున్నాను; కావున = అందుచేత; ఈ = ఈ; పుత్రికల్ = కూతుర్ల; కున్ = కి; వరులన్ = భర్తలను; సంపాదించి = తీసుకొని వచ్చి; పరిణయంబున్ = వివాహమును; చేసి = చేసి; తత్త్వసంహితన్ = ఆత్మవిద్యను; నాకున్ = నాకు; తవిలి = పూని; తెలుపు = తెలిపెడి;
సుతునిన్ = పుత్రుని; కృపసేసి = దయచేసి; ననున్ = నన్ను; కావు = కాపాడు; సుజన = మంచివారిచే; వినుత = చక్కగ స్తుతింపబడువాడ; అర్థిన్ = కోరి; సంసార = సంసారము అను; దుఃఖంబున్ = దుఃఖమును; అపనయంబున్ = పోగొట్టుటకు; అర్హుండవు = చాలినవాడవు; నీవ = నీవే; కావె = కదా; మోహమునన్ = వ్యామోహమువలన; ఇంత = ఇంత; కాలమున్ = కాలమును; ఊరకన్ = ఉత్తినే; పోయెన్ = గడచిపోయినది; ఏ = ఏ విధమైన; గతియున్ = మార్గమును; లేక = లేకనే.
భావము:- “ఓ పుణ్యాత్ముడా! సంతానం కలిగే వరకు నాతో ఉంటానని పూర్వం చెప్పి పుత్రికలను అనుగ్రహించావు. ఈ యువతులు తమకు తామే భర్తలను ఎలా వెదుక్కోగలరనే భయం నాకు కలుగుతున్నది. అందుకని కుమార్తెలకు తగిన వరులను వెదకి వారికి వివాహం చేసి, నాకు వేదాంత విషయాలను తెలియజెప్పగల కుమారుని ప్రసాదించి నన్ను కటాక్షించు. సాధుజన సంస్తవనీయా! సంసార దుఃఖాన్ని తొలగించడానికి అన్ని విధాల సమర్థుడవు నీవు. ముక్తి మార్గాన్ని తెలిపేవారు లేక మోహం వల్ల ఇంతకాలం వ్యర్థంగా గడిచిపోయింది.

తెభా-3-829-చ.
రతి పుట్టె నైహిక సుఖోపగతానుభవంబు లందు మున్
లతఁ గామభోగరతిసంగముఁ గోరి మహాత్మ! నిన్ను న
చ్చఁపుఁ దలపొప్పగాఁ దెలియఁజాలక యేవరియించుటన్ భవ
త్కృ ఫలియించె ముక్తి నినుఁ గేవలభక్తి భజింపఁ గల్గదే.

టీక:- ఉపరతి = విరక్తి; పుట్టెన్ = కలిగినది; ఐహిక = ఇహ లోక సంబంధపు; సుఖ = సుఖములను; ఉపగత = పొందెడి; అనుభవములు = అనుభవముల; అందున్ = అందు; మున్ = పూర్వము; చపలతన్ = చపలత వలన; కామ = కోరికలు; భోగ = భోగములు; రతిన్ = సంభోగమందు; సంగమున్ = కలయుటను; కోరిన్ = కోరి; మహాత్మా = గొప్పవాడ; నిన్నున్ = నిన్ను; అచ్చపు = అసలైన; తలపున్ = జ్ఞానము; ఒప్పగన్ = ఒప్పి ఉన్నట్లు; తెలియన్ = తెలిసికొన; చాలక = లేక; ఏన్ = నేను; వరించుటన్ = వివాహము చేసికొనుట; భవత్ = నీ యొక్క; కృపన్ = దయవలన; ఫలియించెన్ = ఫలించినది; ముక్తి = ముక్తి; నినున్ = నిన్ను; కేవల = ఏకాగ్రమైన; భక్తిన్ = భక్తితో; భజింపన్ = కొలిచిన; కల్గదే = కలగదా ఏమి.
భావము:- ఓ మహాత్మా! నాకు ఈ లోక సంబంధాలైన సుఖాలను అనుభవించాలనే ఆసక్తి నశించింది. భోగాలపై విరక్తి కలిగింది. ఇంతకు ముందు చంచలభావంతో కామోపభోగాలను కోరిన దానినై, స్వచ్ఛమైన నీ భావాన్ని తెలుసుకోలేక ఏవేవో అర్థించాను. నా పట్ల నీ అనుగ్రహం ఫలించింది. నిన్ను నిర్మల భక్తితో సేవించడం చేత ముక్తి లభిస్తుంది కదా!

తెభా-3-830-వ.
అదియునుంగాక.
టీక:- అదియునున్ = అంతే; కాక = కాకుండగ.
భావము:- అంతేకాక...

తెభా-3-831-చ.
మతినొప్పు సత్పురుషఖ్యము సద్గతి కారణంబు నీ
తి విలోలదుష్పురుష ఖ్యము దుర్గతిహేతు వంచుఁ జి
త్తమునఁ దలంచి యోగిజనతానుత! మిమ్ము భజింతుఁ బ్రాణిసం
మునఁ బుణ్యపాపములు గైకొని పొందవె యెట్టివారలన్."

టీక:- సమ = సరి యగు; మతిన్ = విధముగ; ఒప్పు = చక్కగ ఉండు; సత్ = మంచి; పురుష = పురుషులతోడి; సఖ్యము = స్నేహము; సద్గత్ = ముక్తిని; కారణంబున్ = కలిగించునది; నీచమున్ = అధమమైనది; అతి = మిక్కిలి; విలోలన్ = చంచలమైనది; దుష్ = చెడ్డ; పురుష = పురుషులతోడి; సఖ్యము = స్నేహము; దుర్గతి = నరకమునకు; హేతువు = కారణము; అంచున్ = అని; చిత్తమునన్ = మనసులో; తలంచి = అనుకొని; యోగి = యోగులైన; జనత = జనులచే; నుత = స్తుతింపబడువాడ; మిమ్మున్ = మిమ్ములను; భజింతున్ = కొలచెదను; ప్రాణి = జీవులతో; సంగమునన్ = సహవాసము వలన; పుణ్య = పుణ్యమును; పాపములున్ = పాపములును; కైకొని = చేకొని; పొందవె = కలగవా ఏమిటి; ఎట్టి = ఎటువంటి; వారలన్ = వారినైనా సరే.
భావము:- అందరిపట్ల సమానబుద్ధి కలిగినట్టి సజ్జనుల మైత్రి ఉత్తమగతికి కారణమౌతుంది. నీచమైన బుద్ధి కలిగి, చంచలచిత్తులైనట్టి దుర్జనుల స్నేహం వలన దుర్గతి కలుగుతుంది. ఈ సంగతి మనస్సులో భావించి, యోగిజన సన్నుతుడవైన నిన్ను నేను సేవిస్తాను. ప్రాణుల సాంగత్యం వల్లనే ఎట్టివారికైనా పుణ్యాలో లేక పాపాలో ప్రాప్తిస్తాయి”.

తెభా-3-832-క.
ని యిట్లు వేదనాభర
ము మునుకుచుఁ బలుకఁ గర్దముఁడు మనుపుత్రిం
నుఁగొని సరసిజనయను వ
ములు మది సంస్మరించి తి కిట్లనియెన్.

టీక:- అని = అని; ఇట్లు = ఈ విధముగ; వేదనా = బాధ యొక్క; భరమునన్ = భారము నలవ; మునుకుచున్ = సంతాపము చెందుతూ; పలుకన్ = అనగా; కర్దముండు = కర్దముడు; కనుగొని = చూసి; సరసిజనయను = గోవిందుని {సరసిజ నయనుడు - సరసిజము (పద్మము) వంటి నయనుడు (కన్నులు ఉన్నవాడు), విష్ణువు}; వచనములున్ = ఆదేశములను; మదిన్ = మనసులో; సంస్మరించి = తలచుకొని; సతి = భార్య; కిన్ = కి; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను.
భావము:- అని ఈ విధంగా దేవహూతి మిక్కిలి వేదనతో పరితపిస్తూ పలుకగా, కర్దముడు విష్ణుదేవుని వాక్యాలు స్మరించుకొని మనుపుత్రి అయిన దేవహూతిని చూచి ఇలా అన్నాడు.

తెభా-3-833-క.
"మనుసుత! నీ మది దుఃఖం
బును బొందకు మచిరకాలమున భగవంతుం
ఘుం డక్షరుఁడు జనా
ర్దనుఁడు భవద్గర్భమందు గ వసియించున్.

టీక:- మను = మనువు యొక్క; సుత = కూతురా; నీ = నీ యొక్క; మదిన్ = మనసులో; దుఃఖంబున్ = దుఃఖమును; పొందకుము = చెంద వలదు; అచిర = కొద్ది; కాలమునన్ = కాలములోనే; భగవంతుండు = నారాయణుడు {భగవంతుడు – వ్యు. (భగ + మతుప్ + మస్య వః) త. ప్ర. 1) సమగ్రములైన ఐశ్వర్యముఱ్ఱ, వీర్యము, సిరి, యశస్సు, జ్ఞానము, వైరాగ్యముఅను ఆరును కలవాడు, 2) విశ్వమునకు భగము (పుట్టుకకు స్థానము) అయినవాడు, విష్ణువు}; అనఘుండు = నారాయణుడు {అనఘుడు - అఘము (పాపము) లేనివాడు, విష్ణువు}; అక్షరుండు = నారాయణుడు {అక్షరుడు - క్షరము (నాశము) లేనివాడు, విష్ణువు}; జనార్దనుడు = నారాయణుడు {జనార్దనుడు -– 1.సం.విణ.లోక హింసకరుడు, వ్యు. 2. (జనైః అర్ద్యతే -యాచ్యతే – జన + అర్ద + ల్యూట్) కృ. ప్ర. జనులచే పురుషార్థ విషయమై కోరబడువాడు. 3. వ్యు. (జనాన్ అర్దయతి - (సమస్త)జనులకును అర్దనుడు (గమ్యమైన వాడు), విష్ణువు}; భవత్ = నీ యొక్క; గర్భమున్ = కడుపు; అందున్ = లో; తగన్ = అవశ్యము; వసియించున్ = నిలుచును.
భావము:- “ఓ మనుసుతా! నీవు మనస్సులో దుఃఖించవద్దు. అనఘుడూ అక్షరుడూ అయిన విష్ణుభగవానుడు కొద్ది కాలంలోనే నీ గర్భంలో ప్రవేశిస్తాడు.

తెభా-3-834-క.
నియమవ్రత నిష్ఠా
ణ నియుక్తాంతరంగ మధిక వై సం
రిత తపోధన దాన
స్ఫురితశ్రద్ధాను భక్తిపూర్వము గాఁగన్.

టీక:- వర = ఉత్తమమైన; నియమ = నియమములు కల; వ్రత = వ్రతములును; నిష్ఠన్ = శ్రద్ధగా; ఆచరణ = ఆచరించుట యందు; నియుక్త = నియమింపబడిన; అంతరంగ = అంతరంగము; సమధికవు = అతిశయించిన దానవు; ఐ = అయ్యి; సంభరిత = నిండైన; తపస్ = తపస్సు అను; ధన = సంపద; దానన్ = దాని వలన; స్ఫురిత = కలిగిన; శ్రద్ధానుభక్తిన్ = శ్రద్ధానుభక్తుల; పూర్వమున్ = నిండైనది; కాగన్ = అగునట్లు.
భావము:- నీవు ఉత్తమ నియమాలతో వ్రతాలతో నిష్ఠతో చరించు. నిగ్రహంతో కూడిన మనస్సు కలదానివై నిండైన తపస్సును, శ్రద్ధాభక్తులతో కూడిన దానధర్మాలను ఆచరించు.

తెభా-3-835-మ.
రి నారాయణు పాదపద్మములు సమ్యగ్భక్తిఁ బూజింపు త
త్పురుషశ్రేష్ఠుఁడు మానసంబున భవత్పూజా సుసంప్రీతుడై
మర్థిం దరుణీశిరోమణి! భవద్గర్భస్థుఁడై యుండి తాఁ
రుణం జేయు భవన్మనోజనిత శంకాగ్రంథి విచ్ఛేదమున్."

టీక:- హరి = గోవిందుని; నారాయణు = నారాయణుని; పాద = పాదములు అనెడి; పద్మములున్ = పద్మములను; సమ్యక్ = చక్కని; భక్తిన్ = భక్తితో; పూజింపు = కొలువుము; తత్ = ఆ; పురుషశ్రేష్ఠుడు = గోవిందుడు {పురుషశ్రేష్ఠుడు - పురుషులలో శ్రేష్ఠుడు, విష్ణువు}; మానసంబునన్ = మనసులో; భవత్ = నీ యొక్క; పూజన్ = సేవకు; సు = మంచిగా; సంప్రీతుండు = సంతోషించినవాడు; ఐ = అయ్యి; కరము = మిక్కిలి; అర్థిన్ = వేడుకగా; తరుణీ = వనితలలో {తరుణి - తరణమైన వయసులో ఉన్న ఆమె, స్త్రీ}; శిరోమణి = ఉత్తమురాల {శిరోమణి - శిరసున ధరించు రత్నాభరణము వంటిది, ఉత్తమురాలు}; భవత్ = నీ యొక్క; గర్భస్తుడు = కడుపునపడ్డవాడు; ఐ = అయ్యి; ఉండి = ఉండి; తాన్ = తను; కరుణన్ = దయతో; చేయున్ = చేయును; భవత్ = నీ యొక్క; మనస్ = మనసులో; జనిత = పుట్టిన; శంకా = సందేహముల; గ్రంథిన్ = ముడుల; విచ్ఛేదమున్ = తొలగించుటను.
భావము:- నారాయణుని పాదపద్మాలను నిండైన భక్తితో పూజించు. పురుషోత్తముడైన ఆ విష్ణువు నీ పూజలకు సంతృప్తి చెంది నీ గర్భంలో నివసిస్తాడు. నీ మనస్సులో పుట్టే సందేహాల ముడులను విడదీస్తాడు”.

తెభా-3-836-చ.
వుడు దేవహూతి హృదయంబున సంతస మంది యమ్మునీం
ద్రుని వచనక్రమంబునఁ బరున్ భగవంతు ననంతుఁ బద్మలో
ను హరి విష్ణు నర్చనము ల్పుచు నుండగఁ గొన్ని యబ్దముల్
నునెడ దానవాంతకుఁడు మ్మతిఁ గార్దమ మైన తేజమున్.

టీక:- అనవుడు = అనగా; దేవహూతి = దేవహూతి; హృదయంబునన్ = మనసులో; సంతసమున్ = సంతోషమును; అంది = పొంది; ఆ = ఆ; ముని = మునులలో; ఇంద్రునిన్ = శ్రేష్ఠుని; వచన = మాటల; క్రమమునన్ = ప్రకారము; పరున్ = గోవిందుని {పరుడు - సర్వమునకును పరమము (ఇతరము) అయిన వాడు, విష్ణువు}; భగవంతున్ = గోవిందుని {భగవంతుడు - విశ్వమునకు భగము (సృష్టి స్థానము) అయిన వాడు, విష్ణువు}; అనంతున్ = గోవిందుని {అనంతుడు - అంతము లేనివాడు, విష్ణువు}; పద్మలోచనున్ = గోవిందుని {పద్మలోచనుడు - పద్మముల వంటి లోచనములు (కన్నులు) ఉన్నవాడు, విష్ణువు}; హరిన్ = గోవిందుని {హరి - విష్ణువు}; విష్ణున్ = గోవిందుని; అర్చనముల్ = పూజలు; సల్పుచున్ = చేయుచూ; ఉండగన్ = ఉండగ; కొన్ని = కొద్ది; అబ్దముల్ = సంవత్సరములు; చనునెడన్ = గడవగా; దానవాంతకుడు = గోవిందుడు {దాన వాంతకుడు - దానవుల (రాక్షసుల)ను అంతకుడు (సంహరించినవాడు), విష్ణువు}; సమ్మతిన్ = అంగీకరించి; కార్దమము = కర్దమునిది; ఐన = అయిన; తేజమున్ = వీర్యమును.
భావము:- అని కర్దముడు చెప్పగా దేవహూతి తన మనస్సులో సంతోషించి, అతని మాటల ననుసరించి పరాత్పరుడు, భగవంతుడు, అనంతుడు, కమలాక్షుడు, పాపమోచనుడు అయిన విష్ణువును పూజిస్తూ ఉండగా కొన్నేండ్లు గడిచాయి. అప్పుడు రాక్షససంహారి అయిన విష్ణువు కర్దమ మునీశ్వరుని తేజస్సును (ధరించాడు).

తెభా-3-837-క.
రియించి యమ్మునీంద్రుని
రుణీగర్భంబువలన నుజారి శమీ
రుకోటరమున వైశ్వా
రుఁ డుదయించిన విధంబునన్ జనియించెన్.

టీక:- ధరియించి = తాల్చి; ఆ = ఆ; ముని = మునులలో; ఇంద్రునిన్ = శ్రేష్ఠుని; తరుణీ = భార్య యొక్క; గర్భంబున్ = గర్భము; వలన = అందు; దనుజారి = హరి {దనుజారి - దనుజుల (రాక్షసుల)కు అరి (శత్రువు), విష్ణువు}; శమీ = జమ్మి; తరు = చెట్టు; కోటరమునన్ = తొఱ్ఱలో; వైశ్వానరుడు = అగ్నిహోత్రుడు; ఉదయించిన = పుట్టిన; విధంబునన్ = విధముగ; జనియించెన్ = పుట్టెను.
భావము:- (విష్ణువు కర్దముని తేజస్సును) ధరించి జమ్మిచెట్టు తొఱ్ఱలో నుంచి అగ్ని పుట్టినట్లుగా దేవహూతి గర్భంలోనుండి జన్మించాడు.

తెభా-3-838-సీ.
య్యవసరమున నాకాశమున దేవ-
తూర్యఘోషంబులు దుముల మయ్యె
నందిత దేవతాబృందంబు లందంద-
కురిసిరి మందారకుసుమ వృష్టి
గంధర్వ కిన్నర గానంబు వీతెంచె-
ప్సరోగణముల యాటలొప్పె
వావిరి దిక్కులఁ గావిరి విరిసెను-
విలి వార్ధుల కలంలును మానె

తెభా-3-838.1-తే.
సాధుజనముల మనములు సంతసిల్లె
హోమవహ్నులు ప్రభలఁజెన్నొంది వెలిఁగెఁ
గుసుమఫలభరములనొప్పెఁగుజములెల్ల
ర్వసస్యాళి చెన్నొందె గతిలోన

టీక:- ఆ = ఆ; అవసరంబునన్ = సమయములో; ఆకాశమునన్ = ఆకాశములో; దేవ = దేవతల; తూర్య = బాజాల; ఘోషంబులు = ధ్వనులు; తుములము = విజృంభించినవి; అయ్యెన్ = అయినవి; నందిత = అనందించిన; దేవతా = దేవతల; బృందములు = సమూహములు; అందంద = అక్కడక్కడ; కురిసిరి = కురిపించిరి; మందార = మందార; కుసుమ = పూల; వృష్టి = వాన; గంధర్వ = గంధర్వుల; కిన్నర = కిన్నరల; గానంబున్ = గానములు; వీతెంచెన్ = వినిపించెను; అప్సర = అప్సరసల; గణమున్ = సమూహముల; ఆటలన్ = నాట్యములతో; ఒప్పెను = ఒప్పినవి; వావిరిన్ = మిక్కిలిగా; దిక్కులన్ = దిక్కులను; కావిరి = నలుపు, చీకటి; విరిసెను = విరిగిపోయినది; తవిలి = పూని; వార్థులన్ = సముద్రములలో; కలంతలున్ = కలవరపాటులు; మానెన్ = మానినవి;
సాధు = సాదువులైన; జనముల = జనుల; మనములున్ = మనసులును; సంతసిల్లెన్ = సంతోషించినవి; హోమ = హోమములందలి; వహ్నులు = అగ్నులు; ప్రభలన్ = కాంతులతో; చెన్నొంది = చక్కగ; వెలిగెన్ = వెలిగినవి; కుసుమ = పువ్వులు; ఫల = పండ్లు యొక్క; భరములన్ = బరువులతో; ఒప్పెన్ = చక్కగా ఉన్నవి; కుజములు = చెట్లు {కుజములు - కు (భూమి) అందు జములు (పుట్టినవి), వృక్షములు}; ఎల్లన్ = అన్నీ; సర్వ = సమస్తమైన; సస్య = ధాన్యముల; ఆవళి = రాసులు; చెన్నొందెన్ = అందము సంతరించుకొన్నవి; జగతి = లోకము; లోనన్ = లో.
భావము:- ఆ సమయంలో ఆకాశంలో దివ్యమంగళ వాద్యాలు ధ్వనించాయి. దేవతలందరూ సంతోషంతో మందారపుష్పాల వర్షాన్ని కురిపించారు. గంధర్వులూ, కిన్నరులూ పాటలు పాడారు. అప్సరసలు నాట్యం చేశారు. దిక్కుల్లో క్రమ్మిన పొగమంచు మాయమయింది. సముద్రాలు ప్రశాంతాలైనాయి. సజ్జనుల మనస్సులకు సంతోషం కలిగింది. హోమాగ్నులు మిక్కిలి తేజస్సుతో వెలిగాయి. వృక్షాలన్నీ ఫలపుష్పాలతో నిండిపోయాయి. పొలాలలో నానావిధాలైన పైరులు ప్రకాశించాయి.

తెభా-3-839-వ.
ఇట్టి మహోత్సవంబున దేవహూతికిం దత్త్వబోధంబుఁ గావించు కొఱకుఁ దదీయ గర్భంబున నుదయించిన పరబ్రహ్మస్వరూపుం డైన నారాయణుని దర్శించుకొఱకు మరీచి ప్రముఖ మునిగణ సమేతుం డై చతుర్ముఖుఁడు సనుదెంచి యమ్మహాత్ముని దర్శించి కర్దమ దేవహూతులం గనుంగొని యిట్లనియె.
టీక:- ఇట్టి = ఇటువంటి; మహా = గొప్ప; ఉత్సవంబునన్ = ఉత్సవములో; దేవహూతి = దేవహూతి; కిన్ = కి; తత్వ = తత్వమును; బోధంబున్ = బోధించుట; కావించు = చేయుట; కొఱకున్ = కోసమై; తదీయ = ఆమె; గర్భంబునన్ = కడుపున; ఉదయించిన = పుట్టిన; పరబ్రహ్మస్వరూపుడు = గోవిందుడు {పరబ్రహ్మస్వరూపుడు - పరబ్రహ్మ యొక్క స్వరూపము అయినవాడు, విష్ణువు}; ఐన = అయినట్టి; నారాయణునిన్ = హరిని {నారాయణుడు - నారములు (నీరు) అందు వసించువాడు, విష్ణువు}; దర్శించు = దర్శించుకొనుట; కొఱకున్ = కోసమై; మరీచి = మరీచి; ప్రముఖ = మొదలగు ప్రముఖమైన; ముని = మునుల; గణ = సమూహముతో; సమేతుండు = కూడినవాడు; ఐ = అయ్యి; చతుర్ముఖుడు = బ్రహ్మదేవుడు {చతుర్ముఖుడు - చతుః (నాలుగు, 4) ముఖములు కలవాడు, బ్రహ్మదేవుడు}; చనుదెంచి = వచ్చి; ఆ = ఆ; మహాత్మునిన్ = గొప్పవానిని {మహాత్ముడు - గొప్పవాడు. విష్ణువు}; దర్శించి = దర్శించుకొని; కర్దమ = కర్దముడు; దేవహూతులన్ = దేవహూతులను; కనుంగొని = చూసి; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను.
భావము:- ఇటువంటి మహోత్సవ సమయంలో దేవహూతికి తత్త్వజ్ఞానాన్ని బోధించడానికి ఆమె గర్భంలో పుట్టిన పరబ్రహ్మ స్వరూపుడైన నారాయణుని దర్శించడానికి మరీచి మొదలైన మునులతో కూడి బ్రహ్మదేవుడు వచ్చి, ఆ మహాత్ముని దర్శనం చేసికొని కర్దమ దేవహూతులను చూచి ఇలా అన్నాడు.

తెభా-3-840-క.
"నుచరితులార! మీరలు
కృకృత్యులు విష్ణుపూజఁ గేవలభక్తిన్
తి నిష్కపటులరై చే
సితిరి తదర్చన ఫలంబు సేకుఱె మీకున్.

టీక:- నుత = స్తుతింపబడిన; చరితులార = నడవడిక కలవారులార; మీరలున్ = మీరు; కృతకృత్యులు = సార్థకజన్మలు; విష్ణు = హరి యొక్క; పూజన్ = పూజలను; కేవల = స్వచ్ఛమైన, ఇతరములేని; భక్తిన్ = అర్చించుటలు; మతిన్ = మనసులలో; నిష్కపటులు = కపటముల లేనివారు; ఐ = అయ్యి; చేసితిరి = చేసారు; తత్ = ఆ; అర్చన = పూజల; ఫలంబున్ = ఫలితము; చేకూఱెన్ = సమకూరినది; మీకున్ = మీకు.
భావము:- “ధన్యచరితులైన ఓ దంపతులారా! మీరు కృతార్థులు. నిజమైన భక్తితో, నిష్కపటమైన మనస్సుతో విష్ణుదేవుని సేవించారు. మీ పూజకు తగిన ఫలం మీకు లభించింది.

తెభా-3-841-క.
శ్రిభయహరణుఁడు మునిజన
నుచరితుఁడు పరుఁడు మీ మనోరథసిద్ధిన్
వితంబుగఁ గావించుటఁ
తురత మీ జన్మ మింక ఫలతఁ బొందెన్.

టీక:- శ్రితభయహరణుడు = నారాయణుడు {శ్రిత భయ హరణుడు - శ్రిత (ఆశ్రయించినవారి) భయ (భయమును) హరణుడు (హరించువాడు), విష్ణువు}; మునిజననుతచరితుఁడు = నారాయణుడు {ముని జన నుత చరితుడు - మునులగు జనములచే నుత (స్తుతింబడిన) చరితుడు (నడవడిక కలవాడు), విష్ణువు}; పరుఁడు = నారాయణుడు {పరుఁడు - అతీతుడు, విష్ణువు}; మీ = మీ యొక్క; మనోరథ = కోరికలు; సిద్ధిన్ = తీరుట; వితతమున్ = విస్తారముగ; కావించుటన్ = చేయుటచే; చతురతన్ = చక్కగ; మీ = మీ యొక్క; జన్మము = జన్మము; ఇంకన్ = మరి; సఫలతన్ = సాఫల్యమును; పొందెన్ = చెందినది.
భావము:- ఆశ్రితుల భయాన్ని పోగొట్టేవాడు, మునీశ్వరులు కీర్తించే చరిత్ర గలవాడు అయిన పరాత్పరుడు మీ కోర్కెను చక్కగా నెరవేర్చాడు. అందువల్ల మీ జన్మ సార్థకం అయింది.

తెభా-3-842-క.
వినుడు సకాములునై హరి
నుపమభక్తిన్ భజించు దె ముక్తికిఁ జా
లును మీ పుణ్యం బే మని
కొనియాడఁగ వచ్చు నీతికోవిదులారా!"

టీక:- వినుడు = వినండి; సకాములున్ = కోరికలు కలవారు; ఐ = అయ్యి; హరిన్ = విష్ణుని; అనుపమ = సాటిలేని; భక్తిన్ = భక్తితో; భజించినన్ = పూజించిన; అదె = అది మాత్రమే; ముక్తి = మోక్షము పొందుట; కిన్ = కు; చాలున్ = సరిపోవును; మీ = మీ యొక్క; పుణ్యంబున్ = పుణ్యమును; ఏమని = ఏమని; కొనియాడగన్ = స్తుతించ; వచ్చున్ = వచ్చును; నీతి = నీతి యందు; కోవిదులార = మంచి నేర్పరులులార.
భావము:- నీతికోవిదులైన ఓ దంపతులారా! వినండి. ఆసక్తితో, అద్వితీయమైన భక్తితో విష్ణువును పూజిస్తే అదే ముక్తిని ప్రసాదిస్తుంది. మీ పుణ్యాన్ని ఏమని పొగడగలను?”

తెభా-3-843-వ.
అని వెండియుం గర్దముని గనుంగొని యిట్లను "భవదీయ తనూభవలం బ్రకటశీలవ్రతాచారసంపన్ను లైన మునివరేణ్యులకుం బెండ్లిసేయుము; నట్లయిన వారి వలన బ్రజాసృష్టి బహువిధంబుల వృద్ధిం బొందు"నని చెప్పి మఱియు నిట్లనియె.
టీక:- అని = అని; వెండియున్ = మరల; కర్ధమునిన్ = కర్దమునిని; కనుగొని = చూసి; ఇట్లు = ఈ విధముగ; భవదీయ = నీ యొక్క; తనూభవలన్ = కూతురులను; ప్రకట = ప్రసిద్ధమైన; శీల = మంచి నడవడిక; వ్రత = నియమములు; ఆచార = ఆచారములు; సంపన్నులు = అధికముగా కలవారు; ఐన = అయినట్టి; ముని = మునులలో; వరేణ్యుల్ = ఉత్తముల; కున్ = కు; పెండ్లి = వివాహము; చేయుము = జరిపించుము; అట్లు = ఆ విధముగ; అయినన్ = అయినచో; వారి = వారి; వలనన్ = వలన; ప్రజా = సంతాన; సృష్టి = సృష్టి; బహు = అనేక; విధంబులన్ = విధములుగ; వృద్ధిన్ = పెరుగుటను; పొందున్ = చెందును; అని = అని; చెప్పి = చెప్పి; మఱియున్ = ఇంకనూ; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను.
భావము:- అని చెప్పి మళ్ళీ కర్దముని చూచి ఇలా అన్నాడు “నీ కుమార్తెలను ఉత్తమ స్వభావం కలిగివారు, సదాచార సంపన్నులూ అయిన మునిశ్రేష్ఠుల కిచ్చి వివాహం చెయ్యి. అలా అయితే వారివల్ల ప్రజాసృష్టి అనేక విధాలుగా అభివృద్ధి చెందుతుంది” అని చెప్పి ఇంకా ఇలా అన్నాడు.

తెభా-3-844-చ.
"ఘ! భవత్సుతుండు సముదంచిత తేజుఁడు నైన యిమ్మహా
త్మునిఁ బరమేశు నీశు నజితున్ నలినాక్షు నమేయు నచ్యుతున్
నుని ననంతు నాద్యు నవికారుని నక్షరుఁగాఁ దలంపుమీ
నుఁడు సమస్త చేతన నికాయ హృదీప్సితదాయి గావునన్.

టీక:- అనఘ = పుణ్యుడ; భవత్ = నీ యొక్క; సుతుండు = కొడుకును; సముత్ = మిక్కిలి; అంచిత = శోభిల్లుతున్న; తేజుండునున్ = తేజస్సు కలవాడును; ఐన = అయినట్టి; ఈ = ఈ; మహాత్మునిన్ = మహాత్ముడిని; పరమేశున్ = భగవంతుడు {పర మేశుడు - పరమ (అత్యున్నతమైన) ఈశుడు (ప్రభువు), విష్ణువు}; ఈశున్ = భగవంతుడు {ఈశుడు - ప్రభావము చూపకలవాడు, విష్ణువు}; అజితున్ = భగవంతుడు {అజితుడు – జయింపబడుటకు రానివాడు, విష్ణుసహస్రనామాలు 459వ నామం}; నలినాక్షున్ = భగవంతుడు {నలి నాక్షుడు - నలినము (పద్మము)లవంటి అక్షుడు (కన్నులు ఉన్నవాడు), విష్ణువు}; అమేయున్ = భగవంతుడు {అమేయుడు -మేయము (మేర, ఇంతని చెప్పుటకు) లేనివాడు, విష్ణువు}; అచ్యుతున్ = భగవంతుడు {అచ్యుతు - చ్యుతము (పడుట) లేనివాడు, విష్ణువు}; ఘనునిన్ = భగవంతుడు {ఘనుడు - గొప్పవాడు, విష్ణువు}; అనంతున్ = భగవంతుడు {అనంతుడు - అంతము లేనివాడు, విష్ణువు}; ఆద్యున్ = భగవంతుడు {ఆద్యుడు - ఆది (మొదటి) నుండి ఉన్నవాడు, విష్ణువు}; అవికారున్ = భగవంతుడు {అవికారుడు - వికారములు (మార్పులు) లేని వాడు, విష్ణువు}; అక్షరున్ = భగవంతుడు {అక్షరుడు - క్షరము (నాశము) లేనివాడు, విష్ణువు}; కాన్ = అగునట్లు; తలంపుమీ = తెలుసుకొనుము; ఘనుడున్ = భగవంతుడు {ఘనుడు - గొప్పవాడు, విష్ణువు}; సమస్తచేతననికాయహృదీప్సితదాయి = భగవంతుడు {సమస్త చేతన నికాయ హృదీప్సిత దాయి - సమస్తమైన చేతనుల (జీవుల) నికాయము (సమూహము)లకును హృద (హృదయములకు) దీప్సిత (కోరికను) దాయి (ఇచ్చువాడు), విష్ణువు}; కావునన్ = అగుటవలన.
భావము:- “ఓ పుణ్యాత్ముడా! మహాత్ముడు, మహా తేజోవంతుడు అయిన ఈ నీ కుమారుడు సమస్త ప్రాణుల హృదయాలలోని మనోరథాలను నెరవేర్చే ఘనుడు. కనుక ఇతనిని ఈశుడు, పరమేశ్వరుడు, అపరాజితుడు, అమేయుడు, అచ్యుతుడు, అనంతుడు, ఆద్యుడు, అవికారుడు, అక్షరుడు అయిన పుండరీకాక్షునిగా భావించు.

తెభా-3-845-సీ.
మానిత జ్ఞాన విజ్ఞాన యోగంబులు-
ను నుపాయంబుల నొరఁజేసి
వుమైఁ గర్మజీవు నుద్ధరించుట-
కొఱకు నమ్మహితాత్మకుఁడు సమగ్ర
హాకరుచిజటాజూటుండు సత్ఫుల్ల-
పంకజనేత్రుండు ద్మ వజ్ర
ల కులిశాంకుశ లిత రేఖాంకిత-
రణ తలుండును త్త్వగుణుఁడు

తెభా-3-845.1-తే.
గుచు నిప్పుడు సరసీరుహాక్షి నీదు
ర్భ మం దుదయించెను నుఁడు నీకుఁ
త్త్వబోధంబుఁ గావించుఁ దావకీన
హృదయ సంగత సంశయ మెల్లఁ బాపు.

టీక:- మానిత = గౌరవింపదగిన; జ్ఞాన = జ్ఞానము {జ్ఞానము - పరవిద్య, ఆధ్యాత్మికమైన విషయములను తెలుపునది}; విజ్ఞానము = విజ్ఞానము {విజ్ఞానము - అపరవిద్య, అవిద్య, లౌకిక విషయములను తెలుపునది}; యోగంబులున్ = యోగములును; అను = అనెడి; ఉపాయంబులన్ = ఉపాయములను; ఒనరన్ = కలుగునట్లు; చేసి = చేసి; అలవుమై = సామర్థ్యముచేత; కర్మజీవులన్ = మానవులను {కర్మజీవులు - కర్మబద్ధులైన జీవులు, మానవులు}; ఉద్ధరించుట = ఉద్ధరించుట; కొఱకున్ = కోసము; ఆ = ఆ; మహిత = గొప్ప; ఆత్మకుడు = ఆత్మకలవాడు; సమగ్ర = చక్కటి; హాటక = బంగారు; రుచి = రంగు కల; జటాజూటుండు = జటలు చుట్టుకుపోయి ఉన్నవాడు; సత్ = మంచిగ; ఫుల్ల = వికసించిన; పంకజ = పద్మము వంటి {పంకజము - పంక (నీటి) లో జము (పుట్టినది), పద్మము}; నేత్రుడు = కన్నులు కలవాడు; పద్మ = పద్మము; వజ్ర = వజ్రము; హల = నాగలి; కులిశ = అంకుశ; లలిత = చక్కటి; రేఖా = గీతలచే; అంకిత = అలంకరింపబడిన; చరణతలుండును = అరికాలు కలవాడును; సత్త్వగుణుడును = సత్త్వగుణము కలవాడును; అగుచున్ = అవుతూ; ఇప్పుడు = ఇప్పుడు;
సరసీరుహాక్షి = నారాయణుడు {సరసీరుహాక్షి - సరసీరుహము (పద్మముల) వంటి అక్షి (కన్నులుకలవాడు), విష్ణువు}; నీదు = నీ యొక్క; గర్భమున్ = కడుపు; అందున్ = లో; ఉదయించెను = పడెను; ఘనుడు = గొప్పవాడు; నీకున్ = నీకు; తత్త్వ = తత్త్వ జ్ఞానమును; బోధంబున్ = బోధించుటను; కావించున్ = చేయును; తావకీన = నీ యొక్క; హృదయ = మనసున; సంగత = ఉన్నట్టి; సంశయము = సందేహము; ఎల్లన్ = సమస్తమును; పాపు = తొలగించును;
భావము:- ఓ దేవహూతీ! మాననీయాలైన జ్ఞానవిజ్ఞాన యోగాలు అనబడే ఉపాయాలచే కర్మజీవుల్ని ఉద్ధరించడానికై కమలాక్షుడు నీ కడుపున జన్మించాడు. బంగారు రంగు కలిగిన జటాజూటం కలవాడు, వికసించిన కమలాల వంటి కన్నులు కలవాడు, పద్మం, హలం, వజ్రం, అంకుశం మొదలైన రేఖలతో విరాజిల్లే అరికాళ్ళు కలవాడు, సత్త్వగుణ సంపన్నుడు అయి ఇప్పుడు నీ గర్భంలో జన్మించిన ఈ మహాత్ముడు నీకు తత్త్వబోధ చేస్తాడు. దానితో నీ హృదయంలోని సంశయాలన్నీ తీరిపోతాయి.

తెభా-3-846-వ.
మఱియును.
టీక:- మఱియును = ఇంకనూ.
భావము:- ఇంకా...

తెభా-3-847-క.
నుతికెక్కి సిద్ధగణ సే
వితుఁడై ఘనసాంఖ్యయోగవిలసిత తత్త్వ
స్థితినిరతుఁ డగుచుఁ గపిలా
ఖ్యతఁ దనరి చరించు నీ జత్రయ మెల్లన్."

టీక:- నుతికెక్కి = పేరుపొంది; సిద్ధ = సిద్ధుల; గణ = సమూహముచే; సేవితుండు = కొలువబడినవాడు; ఐ = అయ్యి; ఘన = మహనీయమైన; సాంఖ్యయోగ = సాంఖ్యయోగముచే; విలసిత = ప్రకాశించే; తత్త్వస్థితిన్ = తత్త్వస్థితిలో; నిరతుడు = నిష్ఠకలవాడు; అగుచున్ = అవుతూ; కపిల = కపిలుడు అను; ఆఖ్యాతన్ = పేరుతో; తనరి = ప్రసిద్ధుడై; చరించున్ = వర్తించును; ఈ = ఈ; జగత్రయమున్ = ముల్లోకములు {ముల్లోకములు - 1భూలోకము 2భువర్లోకము 3సువర్లోకము}; ఎల్లన్ = అంతటను.
భావము:- (నీ కుమారుడు) పేరెన్నిక గన్నవాడై, ప్రసిద్ధులైన సిద్ధపురుషులచేత సేవింప బడుతూ మహనీయమైన సాంఖ్యయోగంతో ప్రకాశించే పరతత్త్వమందు సుస్థిరుడై ‘కపిలుడు’ అనే పేరుతో ఈ మూడు లోకాలలోను సంచరిస్తాడు” అని బ్రహ్మదేవుడు తెలిపాడు.