పోతన తెలుగు భాగవతము/తృతీయ స్కంధము/ఉపోద్ఘాతము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search


పోతన తెలుగు భాగవతము
తృతీయ స్కంధము

ఉపోద్ఘాతము

తెభా-3-1-క.
శ్రీహిత వినుత దివిజ
స్తో! యశస్సీమ! రాజసోమ! సుమేరు
స్థే! వినిర్జితభార్గవ
రా! దశాననవిరామ! ఘుకులరామా!

టీక:- శ్రీ = శుభకరమైన; మహిత = మహిమకలవాడ; వినుత = పొగిడిన; దివిజ = దేవతల {దివిజులు - స్వర్గమున ఉండువారు, దేవతలు}; స్తోమ = సమూహము కలవాడ; యశః = కీర్తికి; సీమ = హద్దు ఐనవాడ; రాజ = రాజులలో; సోమ = చంద్రుడా; సుమేరు = మేరుపర్వతము వలె; స్థేమ = స్థిరమైన స్వభావము కలవాడ; వినిర్జిత = చక్కగా జయింపబడిన; భార్గవరామ = పరశురాముడు కలవాడ {భార్గవరాముడ - భర్గుని యొక్క రాముడు}; దశానన = రావణుని {దశానన - పది తలలు కలవాడు, రావణుడు}; విరామ = సంహరించినవాడ; రఘుకులరామ = రఘురామ {రఘుకులరాముడు - రఘు వంశపు రాముడు}.
భావము:- శ్రీరామా! శ్రీకరమైన మహిమ కలవాడా! దేవతలుచే సంస్తుతింపబడు వాడా! దిగ్దిగంతాల వరకు వ్యాపించే యశస్సు కలవాడా! చంద్రుని వలె చల్లని పరిపాలన చేయువాడా! మేరునగ ధీరుడా! పరశురాము డంతటి వాని భంగపరచిన శూరుడా! పది తలల రావణాసురుని తుదముట్టించిన వీరాధివీరుడా! రఘువంశోద్ధారక రామా! . . . అవధరించు.

తెభా-3-2-వ.
మహనీయగుణగరిష్ఠులగు నమ్మునిశ్రేష్ఠులకు నిఖిలపురాణ వ్యాఖ్యాన వైఖరీసమేతుండైన సూతుం డిట్లనియె: "అట్లు పరీక్షిన్నరేంద్రునకు శుకయోగీంద్రుం డిట్లనియె.
టీక:- మహనీయ = గొప్ప; గుణ = గుణములు గల వారిలో; గరిష్ఠులు = ఉత్తములు; అగు = అయినట్టి; ఆ = ఆ; ముని = యోగులలో; శ్రేష్ఠులు = గొప్పవారల, శౌనకాదుల; కున్ = కు; నిఖిల = సమస్తమైన; పురాణ = పురాణములను; వ్యాఖ్యాన = సవివరముగ చెప్పు; వైఖరీ = నేర్పు; సమేతుండు = కలిగినవాడు; ఐన = అయినట్టి; సూతుండు = సూతుడు; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను; అట్లు = ఆ విధముగ; పరీక్షిత్ = పరీక్షత్తు అను; నర = మానవులకు; ఇంద్రుడు = ప్రభువు, మహారాజు; కున్ = కి; శుక = శుకుడు అను; యోగి = యోగులలో; ఇంద్రుడు = శ్రేష్ఠుడు; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను.
భావము:- పురాణాలు సమస్తము చక్కగా వివరించడంలో విశిష్ఠమైన నేర్పు గల సూతమహర్షి ఉత్తమ గుణసమేతులైన శౌనకాది మునీశ్వరులకు “శుకముని పరీక్షిన్నరేంద్రునికి ఇలా చెప్పసాగాడు” అంటూ ఇలా చెప్పసాగాడు.