పోతన తెలుగు భాగవతము/చతుర్ధ స్కంధము/ప్రాచీనబర్హి యఙ్ఞములు

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search


(తెభా- 4-679-వ. )[మార్చు]

అంత విజితాశ్వుండు పరలోకగతుం డయిన హవిర్ధానుండు హవిర్ధాని యను భార్యవలన బర్హిష్మదుండు గయుండు శుక్లుండుఁ గృష్ణుండు సత్యుండు జితవ్రతుండు నను పుత్రుల నార్వురం గాంచె; నందు బర్హిష్మదుండు.

(తెభా- 4-680-సీ. )[మార్చు]

సంతత సవన దీక్షాశాలి యగుచు ధ;
రాతలం బెల్లను గ్రతువులకును
విలసిల్లు యజనశాలలు వేఱువేఱ క;
ల్పించి యజ్ఞములు గావించుచుండి
చిరకీర్తి యతఁడు ప్రాచీనాగ్రకుశలచే;
క్షితితలం బెల్ల నా స్తృతము చేయ
సుధ యెల్లను యజ్ఞవాటమై విలసిల్ల;
త్క్రియాకాండ నిష్ణాఁతు డగుచు

(తెభా- 4-680.1-తే. )[మార్చు]

సుభగయోగ సమాధి నిష్ఠుఁడు ప్రజాప
తి యగునని తన్ను జనము నుతింప వెలయు
ట్టి ఘనుఁడు హవిర్ధాని ఖిల జగతిఁ
ఱపి కుశలను బ్రాచీనర్హి యయ్యె.

(తెభా- 4-681-వ. )[మార్చు]

మఱియు నతండు.

(తెభా- 4-682-చ. )[మార్చు]

వడ నే సతీమణి సమంచితలీల వివాహవేళ ను
త్క లికఁ బ్రదక్షిణంబు లిడఁగాఁ గని హవ్యవహుండు దొల్లి యి
మ్ము శుకిఁ జూచి మోహమును బొందినరీతి విమోహియయ్యె నా
లిత వినూత్న భూషణ యలంకృత చారు శుభాంగి వెండియున్.

(తెభా- 4-683-చ. )[మార్చు]

సు రుచిర భంగి నా సతి కిశోర వయఃపరిపాకయై రణ
ద్వ మణి హేమనూపురరవంబు చెలంగఁగ నాడుచున్ దివా
రుచి రేఖ నొప్పెసఁగఁ గాంచి వినిర్జితు లైరి దేవ కి
న్న నర సిద్ధ సాధ్య ముని నాగ నభశ్చర ముఖ్యు లందఱున్.

(తెభా- 4-684-వ. )[మార్చు]

అట్టి సౌందర్యఖనియు సముద్రపుత్రియు నయిన శతధృతి యను కన్యం బ్రహ్మాదేశంబునం బాణిగ్రహణంబు చేసె; నా శతధృతి వలనం బ్రాచీనబర్హికిఁ బదుగురు కొడుకులు జనియించిరి; వారలు తుల్యనామ వ్రతులును ధర్మపారగులును నయిన ప్రచేతసులు; వారు ప్రజాసర్గంబు నందుఁ దండ్రిచేత నాజ్ఞాపితులయి తపంబు గావింప వనంబునకుం జను సమయంబునం దన్మార్గంబునఁ బ్రసన్నుం డగుచు దృశ్యమానుండైన రుద్రునిచేత నేది యుపదేశింపబడె దాని జపధ్యాన పూజా నియమంబుల సేవించుచుఁ దపఃపతి యైన నారాయణుం బదివేల దివ్యవత్సరంబులు పూజించి;" రని చెప్పిన విని విదురుండు మైత్రేయున కిట్లనియె.

(తెభా- 4-685-సీ. )[మార్చు]

తాపసోత్తమ! ప్రచేసులకు నా వన;
మార్గంబునందు నా ర్గుతోడ
సంగ మెట్లయ్యెఁ? బ్రన్నుఁడై హరుఁ డెద్ధి;
తివుట వారల కుపదేశ మిచ్చె?
జీవరాశులకు నా శివుతోడి సంగంబు;
డు దుర్లభం; బీ జగంబు నందుఁ
ర్చింప నమ్మేటి న్మునీంద్రులకును;
సంచితధ్యానగోరుఁడు గాని

(తెభా- 4-685.1-తే. )[మార్చు]

పుడమిఁ బ్రత్యక్షమునఁ గానఁబడఁడు; మఱియు
నంచితాత్మ సదారాముఁ ఖిల లోక
క్షణార్థంబుగా విరూపాక్షుఁ డాత్మ
క్తితోఁ గూడి జగతిపై సంచరించు.

(తెభా- 4-686-క. )[మార్చు]

కా వున భగవంతుండును
దే వాధీశుండు నయిన దేవుని సంగం
బే వెరవున ఘటియించెనొ
యా విధ మంతయును దెలియ నానతి యీవే.

(తెభా- 4-687-క. )[మార్చు]

వుడు విదురున కమ్ముని
నాయకుఁ డనియె నట్టి సాధుమనీషం
రు ప్రచేతసులును నిజ
కుని సద్భాషణములు మ్మతి తోడన్

(తెభా- 4-688-క. )[మార్చు]

శి మున వహించి ప్రాగ్దిశ
రిగెడి సమయమున నెదుర నంబుధికంటెం
పగు నొక సరసి మనో
నిర్మల సలిల పూర్ణయై యది మఱియున్.

(తెభా- 4-689-సీ. )[మార్చు]

క్తోత్పలేందీవప్రఫుల్లాంభోజ;
మనీయ కహ్లార లితమగుచుఁ
గంజాత కింజల్క పుంజ విక్షేపక;
మందగంధా నిలానంద మగుచు
మణీయ హంస సాస చక్రవాక కా;
రండవ నినదాభిరామ మగుచు
రమత్త మధుప సుస్వర మోద పల్లవాం;
కురిత లతా తరు రిత మగుచు

(తెభా- 4-689.1-తే. )[మార్చు]

సిద్ధచారణ గంధర్వ సేవ్య మగుచుఁ
బుణ్యముల కాలయం బయి పొలుపు మిగిలి
లితమై చూడ నొప్పగు క్షణములఁ
రగి శుచి లఘు మధురాంబు వ్య మగుచు.

(తెభా- 4-690-తే. )[మార్చు]

జ్జనుని హృదయముఁ బోలి స్వచ్ఛ మగుచు
రిపదాకృతి దివిజవిహార మగుచు
నుని సిరి భంగి నర్హజీనము నగుచు
మానవతి వృత్తి గతిని నిమ్నంబు నగుచు.

(తెభా- 4-691-తే. )[మార్చు]

శికరంబులుఁ బోలి విదము లగుచు
రికథలఁ బోలి కల్మషరము లగుచు
హ్నులును బోలి భువన పానము లగుచుఁ
బొగడఁ దగు నీరములచేఁ బ్రపూర్ణ మగుచు.

(తెభా- 4-692-వ. )[మార్చు]

ఒప్పునట్టి సరోవరంబుఁ బొడగని యందు నొక్క దివ్యపురుషునిం గనిరి; అతండును వారు.

(తెభా- 4-693-మ. )[మార్చు]

దశ్రీక మృదంగ వేణుముఖ భాస్వన్నాదమై దివ్య మా
ర్గ నోరంజకమై తనర్చు విలసద్గాంధర్వగానంబు నె
య్య ము సంధిల్లఁగ వించుఁ దన్మహిమ కత్యాశ్చర్యముం బొంది వే
మునం దత్కమలాకరంబు వెడలెం గౌతూహలోల్లాసియై.

(తెభా- 4-694-వ. )[మార్చు]

ఇట్లు వెడలి వచ్చిన.

(తెభా- 4-695-మ. )[మార్చు]

ని రా తాపస పుంగవుల్ దివిజలోశ్రేష్ఠునిం దప్తకాం
వర్ణున్ సనకాది యోగిజన భాస్వద్గీయమానుం ద్రిలో
ను భక్తానుగుణానుగున్ సుమహితైశ్వర్యుం బ్రసాదాభిశో
వక్త్రున్ నిహతాఘకర్తృజనసంద్భద్రునిన్ రుద్రునిన్.

(తెభా- 4-696-క. )[మార్చు]

ని వారలు దమ మనముల
నురాగము నద్భుతంబు నయముఁ బొడమన్
వి యము దోఁపగఁ దత్పద
జములకు మ్రొక్కి భక్తి శగతు లగుచున్.

(తెభా- 4-697-వ. )[మార్చు]

భగవంతుండును నఖిల ధర్ముండును గృపాళుండును భక్తవత్సలుం డును నఖిల పాపహరుండును నయిన హరుండు ప్రీతుం డగుచుం బ్రసన్నాంతఃకరణులు ధర్మజ్ఞులు శీలసంపన్నులు సంప్రీతులు నయిన వారల కిట్లనియె.

(తెభా- 4-698-సీ. )[మార్చు]

వినుఁడు నృపాల నందనులార! మీ మదిఁ;
ల తలం పెల్లను గానవచ్చె;
మీకు భద్రం బగు; మీ యెడ నే నను;
గ్రహబుద్ధిచే నిటు గానఁబడితిఁ;
గైకొని యిపుడు సూక్ష్మముఁ ద్రిగుణాత్మక;
ము గు నా ప్రకృతికంటెను ధరణిని
రఁగు జీవుని కంటెఁ రుఁడైన వాసుదే;
వుని చరణాబ్జముల్ దనరు భక్తి

(తెభా- 4-698.1-తే. )[మార్చు]

ర్థి నెవ్వరు భజియింతు ట్టివారు
నాకుఁ బ్రియతముల్; వారికి యచరిత్రు
లార! యేను బ్రియుండనై భూరిమహిమ
వెలయు చుండుదు; నది గాక వినుఁడు మీరు.

(తెభా- 4-699-వ. )[మార్చు]

స్వధర్మ నిరతుండైన పురుషుం డనేక జన్మాంతర సుకృతవిశేషంబులం జతుర్ముఖత్వంబు నొంది, తదనంతరంబునం బుణ్యాతిరేకంబున నన్నుం బొంది యధికారాంతంబున నేనును దేవతాగణంబులును నవ్యాకృతంబైన యే హరిపదంబును బొందుదు; మట్టి పదంబు భాగవతుండు దనంతనె పొందుం; గావున మీరు భాగవతత్త్వంబు నొందుటం జేసి నాకుం బ్రియులై యుండుదురు; భాగవత జనంబులకు నాకంటె నధిక ప్రియుండు లేఁడు; గాన వివిక్తంబును జప్యంబును బవిత్రంబును మంగళంబును నిశ్శ్రేయస కరంబును నైన నా వచనంబు నాకర్ణింపుఁడు; సర్గాదిని బ్రహ్మ నిజనందనుల కెఱింగించిన శ్రీహరి స్తోత్రంబు మీకు నెఱింగింతు; వినుడు; అది యెట్టిదనిన.

(తెభా- 4-700-క. )[మార్చు]

జాసనుఁ డాత్మజు లగు
కాదులఁ జూచి పలికె మ్మతితోడన్
వి నుఁడు కుమారకులారా!
జోదరు మంగళస్తవం బెఱిఁగింతున్.

(తెభా- 4-701-వ. )[మార్చు]

అని హరి నుద్దేశించి వారలు విన నిట్లనియె "నో! యీశా! యాత్మవేదు లైన వారలకు భవదీయోత్కర్షంబు స్వానందలాభకరంబు గావున నట్టి స్వానందలాభంబు మాకుం గలుగ వలయు; నీవు పరిపూర్ణానంద స్వరూపుండవు; ఇట్టి సర్వాత్మకుండవైన నీకు నమస్కరింతు" నని వెండియు నిట్లనియె.

(తెభా- 4-702-సీ. )[మార్చు]

పంకజనాభాయ సంకర్షణాయ శాం;
తాయ విశ్వప్రభోధాయ భూత
సూక్ష్మేంద్రియాత్మనే సూక్ష్మాయ వాసుదే;
వాయ పూర్ణాయ పుణ్యాయ నిర్వి
కారాయ కర్మవిస్తారకాయత్రయీ
పా'''''; లాయ త్రైలోక్యపాలకాయ
సోమరూపాయ తేజోబలాఢ్యాయ స్వ;
యం జ్యోతిషే దురన్త్యాయ కర్మ

(తెభా- 4-702.1-తే. )[మార్చు]

సాధనాయ పురాపురుషాయ యజ్ఞ
రేతసే జీవతృప్తాయ పృథ్విరూప
కాయ లోకాయ నభసే న్తకాయ విశ్వ
యోనయే విష్ణవే జిష్ణవే మోస్తు.

(తెభా- 4-703-సీ. )[మార్చు]

స్వర్గాపవర్గ సుద్వారాయ సర్వ ర;
సాత్మనే పరమహంసాయ ధర్మ
పాలాయ సద్ధిత లరూపకాయ కృ;
ష్ణాయ ధర్మాత్మనే ర్వశక్తి
యుక్తాయ ఘన సాంఖ్య యోగీశ్వరాయ హి;
ణ్య వీర్యాయ రుద్రాయ శిష్ట
నాథాయ దుష్ట వినాశాయ శూన్య ప్ర;
వృత్తాయ కర్మణే మృత్యవే వి

(తెభా- 4-703.1-తే. )[మార్చు]

రాట్ఛరీరాయ నిఖిల ధర్మాయ వాగ్వి
భూతయే నివృత్తాయ సత్పుణ్య భూరి
ర్చ సేఖిల ధర్మదేహాయ చాత్మ
నే నిరుద్ధాయ నిభృతాత్మనే నమోస్తు.

(తెభా- 4-704-తే. )[మార్చు]

ర్వ సత్త్వాయ దేవాయ న్నియామ
కాయ బహిరన్తరాత్మనే కారణాత్మ
నే సమస్తార్థ లిఙ్గాయ నిర్గుణాయ
వేధసే జితాత్మక సాధవే నమోస్తు.

(తెభా- 4-705-వ. )[మార్చు]

అని మఱియుఁ "బ్రద్యుమ్నుండవును నంతరాత్మవును సమస్త శేష కారణుండవును చాతుర్హోత్రరూపుండవును నంతకుండవును సర్వజ్ఞుండవును జ్ఞానక్రియారూపుండవును నంతఃకరణవాసివియును నైన నీకు నమస్కరింతు" నని.

(తెభా- 4-706-క. )[మార్చు]

ఘా! దేవ! భవత్పద
రుహ సందర్శనేచ్ఛ ఱలిన మాకున్
వి ను వైష్ణవ సత్కృతమై
యె యు భవర్దర్శనంబు నీవె మహాత్మా!

(తెభా- 4-707-వ. )[మార్చు]

అది యెట్టి దనిన.

(తెభా- 4-708-క. )[మార్చు]

ఘ! సకలేంద్రియగుణాం
మును భక్తప్రియంబు లదశ్యామం
బు ను సౌందర్య సమగ్రము
నుపమమును నిఖిల మంగళావహ మగుచున్.

(తెభా- 4-709-వ. )[మార్చు]

మఱియును.

(తెభా- 4-710-సీ. )[మార్చు]

ళికులోపమ లసలక శోభిత మగు;
మృతాంశు రేఖానిభాననమును
మకర్ణ దివ్య భూషా ప్రభా కలితంబు;
సుందర భ్రూనాస సురుచిరంబు
లలిత కుంద కుట్మల సన్నిభద్విజ;
పూరిత స్నిగ్ద కపోల యుగము
ద్మ పలాశ శోన లోచనంబును;
మందస్మితాపాంగ సుందరమును

(తెభా- 4-710.1-తే. )[మార్చు]

స్మితాలోక సతత ప్రన్న ముఖముఁ
గంబు సుందర రుచిర మంళ గళంబు
హారమణి కుండలప్రభాపూర కలిత
చారు మృగరాజ సన్నిభ స్కంధ యుతము.

(తెభా- 4-711-వ. )[మార్చు]

వెండియు, శంఖ చక్ర గదా పద్మ కలితాయత బాహు చతుష్టయంబును, వైజయంతీ వనమాలికా కౌస్తుభమణి శ్రీవిరాజితంబును, నిత్యానపాయిని యయిన యిందిరాసుందరీరత్న పరిస్పందంబునం దనరి తిరస్కృత నికషోపలం బైన వక్షస్థ్సలంబును, యుచ్ఛ్వాస నిశ్శ్వాసంబులం జంచలంబులైన వళిత్రయ రుచిర ప్రకాశమాన దళోదరంబును, పూర్వ వినిర్గత నిఖిల విశ్వంబునుం బ్రవిష్టంబుఁజేయురీతి నొందు సలిలావర్త సన్నిభ గంభీర నాభివివరంబును, పంకజ కింజల్క విభా సిత దుకూలనిబద్ధ కనక మేఖాలా కలాప శోభితశ్యామ పృథు నితంబ బింబంబును, నీలకదళీస్తంభరుచి రోరు యుగళంబును, సమచారు జంఘంబును, నిమ్నజాను యుగళంబును, బద్మపత్ర భాసుర పాదద్వయంబును, మదీయాంతరంగ తమోనివారక నిర్మల చంద్రశకల సన్నిభనఖంబును, గిరీట కుండల గ్రైవేయహార కేయూర వలయ ముద్రికా మణినూపురాది వివిధ భూషణ భూషితంబును, నిరస్త సమస్త నతజన సాధ్వంసంబును, భక్తజన మనోహరంబును, సర్వ మంగళాకరంబును నైన భగవద్దివ్య రూపంబుఁ దామస జన సన్మార్గ ప్రదర్శకుండవైన నీవు మాకుం జూపి మమ్ముఁ గృతార్థులం జేయు” మని వెండియు నిట్లనియె.

(తెభా- 4-712-సీ. )[మార్చు]

త్మకుఁ బరిశుద్ధి ర్థించు వారికి;
ధ్యేయ వస్తువు భవద్దివ్యమూర్తి;
యంచిత స్వర్గరాజ్యాభిషిక్తున కైన;
మధిక స్పృహణీయముఁడ వీవు;
ద్భక్తియుత భక్త న సులభుండవు;
దుష్టాత్ములకుఁ గడు దుర్లభుండ;
వాత్మదర్శనులకు రయ గమ్యుండవు;
నై యర్థి విలసిల్లు నఘచరిత!

(తెభా- 4-712.1-తే. )[మార్చు]

యిట్టి నిఖిల దురారాధ్యు నీశు నిన్ను
నెఱయ సుజనుల కైన వర్ణింపరాదు;
ఱల నెవ్వఁడు పూజించు వాఁడు విడువఁ
జాలునే? పద్మదళనేత్ర! చ్ఛరిత్ర!

(తెభా- 4-713-చ. )[మార్చు]

సిన భక్తియోగమున నే భవదీయపదాబ్జ మొందఁగా
యముఁ గోరువాఁడు చటులాగ్రహ భీషణ వీర్యశౌర్య త
ర్జ ములచే ననూనగతి ర్వజగంబులు సంహరించు న
య్య నుపముఁడైన కాలునిభయంబును బొందఁడు సుమ్ము కావునన్.

(తెభా- 4-714-తే. )[మార్చు]

ట్టి నీ పాదమూలంబు లెవ్వఁడేని
బొంది ధన్యాత్ముఁడౌ నట్టి పుణ్యుఁ డొండు
నము లోపలఁ గోరునే ఱచియైన?
వ్యయానంద! గోవింద! రి! ముకుంద!

(తెభా- 4-715-క. )[మార్చు]

రి! నీ భక్తులతోడను
ని రుపమగతిఁ జెలిమిచేయు నిమిషార్థముతో
రిగాదు మోక్ష మనిన న
చి శుభ మగు మర్త్య సుఖముఁ జెప్పఁగ నేలా.

(తెభా- 4-716-క. )[మార్చు]

దు రిత వినాశక పదపం
రుహ! భవత్కీర్తి తీర్థణచయ బాహ్యాం
సేక ధూత కల్మష
పు రుషులు ధరమీఁదఁ దీర్థభూతులు గారే?

(తెభా- 4-717-వ. )[మార్చు]

అట్టి భూతదయా సమేతులును రాగాది విరహిత చిత్తులును నార్జవాది గుణ యుక్తులును నయిన భాగవత జనుల సంగంబు మాకుం గలుగఁ జేయుము; ఇదియ మ మ్మనుగ్రహించుట" యని వెండియు నిట్లనియె.

(తెభా- 4-718-చ. )[మార్చు]

సిజనాభ! సత్పురుష సంగసమంచిత భక్తి యోగ వి
స్ఫు ణ ననుగ్రహింపబడి శుద్ధము నొందినవాని చిత్తమ
స్థి బహిరంగముం గనదు; చెందదు భూరితమస్స్వరూప సం
ణ గుహం జిరంబు గనఁజాలు భవన్మహనీయ తత్త్వమున్.

(తెభా- 4-719-వ. )[మార్చు]

అది యెట్టి దనిన.

(తెభా- 4-720-సీ. )[మార్చు]

రయంగ నేమిటి యందు నీ విశ్వంబు;
విదితమై యుండు? నీ విశ్వమందు
నేది ప్రకాశించు? నెప్పుడు నట్టి స్వ;
యంజ్యోతి నిత్యంబు వ్యయంబు
నాకాశమును బోలి విరళ వ్యాపక;
గు నాత్మతత్త్వంబు ధిక మహిమ
మరు పరబ్రహ్మ గు నని పల్కి యి;
ట్లనియె నవిక్రియుండైన వాఁడు

(తెభా- 4-720.1-తే. )[మార్చు]

నెవ్వఁ డాతఁడు దనయందు నెపుడు నాత్మ
కార్యకరణ సమర్థంబు గాని భేద
బుద్ధి జనకంబు నాఁదగు భూరిమాయఁ
జేసి విశ్వంబు సత్యంబుగా సృజించె.

(తెభా- 4-721-ఆ. )[మార్చు]

రలఁమరలఁ బెక్కుమాఱు లీ విశ్వంబు
నన వృద్ధి విలయ సంగతులను
నందఁ జేయుచుండు ట్టి యీశ్వరుఁడవై
నరు నిన్ను నాత్మ త్త్వముగను.

(తెభా- 4-722-వ. )[మార్చు]

తెలియుదు” మని వెండియు నిట్లనియె “యోగపరాయణు లగువారు శ్రద్ధా సమన్వితులై క్రియాకలాపంబుల నంతఃకరణోపలక్షితం బయిన భవదీయ రూపంబు యజింతురు; వారు వేదాగమతత్త్వ జ్ఞానులు; నీ వాద్యుండవును ననాదియు నద్వితీయుండవును మాయాశక్తి యుక్తుండవును నై విలసిల్లు చుండుదు; వట్టి మాయాశక్తి చేత.

(తెభా-4-723-సీ. )[మార్చు]

తురాత్మ! సత్త్వరస్తమోగుణములు;
రుస జనించెను; వానివలన
హదహంకార తన్మాత్ర నభోమరు;
దనల జలావని ముని సుపర్వ
భూతగణాత్మక స్ఫురణ నీ విశ్వంబు;
భిన్న రూపమున నుత్పన్న మయ్యె;
దేవ! యీ గతి భవదీయ మాయను జేసి;
రూఢిఁ జతుర్విధ రూపమైన

(తెభా- 4-723.1-తే. )[మార్చు]

పురము నాత్మాంశమునఁ జెందు పురుషుఁ డింద్రి
ములచే విషయ సుఖము నుభవించు;
హిని మధుమక్షికాకృత ధువుఁ బోలి
తనిఁ బురవర్తి యగు జీవుఁ డండ్రు మఱియు.

(తెభా- 4-724-వ. )[మార్చు]

ఇట్టి జగత్సర్జకుండవైన నీవు.

(తెభా- 4-725-క. )[మార్చు]

భూ గణంబుల చేతనె
భూ గణంబు లను మేఘపుంజంబుల ని
ర్ధూ ముగఁ జేయు ననిలుని
భా తిని జరియింపఁ జేసి పౌరుష మొప్పన్.

(తెభా- 4-726-తే. )[మార్చు]

రూఢిఁ దత్తత్క్రియాలబ్ద రూపుడవును
సుమహితస్ఫురదమిత తేజుఁడవుఁ జండ
వేగుఁడవు నయి ఘన భుజా విపుల మహిమ
విశ్వసంహార మర్థిఁగావింతు వీశ!

(తెభా- 4-727-వ. )[మార్చు]

అది యెట్లనిన.

(తెభా- 4-728-క. )[మార్చు]

తి కర్తవ్య విచారక
తిచేఁ దగ నెప్పుడుం బ్రత్తంబును సం
చి విషయ లాలసము నూ
ర్జి లోభము నైన యట్టి సృష్టి గడంకన్.

(తెభా- 4-729-తే. )[మార్చు]

ప్రమత్తుండ వగుచుఁ బద్మాక్ష! నీవు
మ్రింగుదువు చాల నాఁకట మ్రేఁగు చుండి
నాలుకలు గ్రోయు భూరిపన్నగము వాతఁ
డిన యెలుకను భక్షించు గిది ననఘ!

(తెభా- 4-730-చ. )[మార్చు]

నిశము నస్మదీయగురుఁడైన సరోరుహ సంభవుండు న
మ్మ నువులు నాత్మసంశయము మాని భజించు భవత్పదాబ్జముల్
మున నిల్పి యుష్మదవమాన మహావ్యధఁ జెందునట్టి స
జ్జ నుఁడు పరిత్యజించునె? భుజంగమతల్పక! భక్తకల్పకా!

(తెభా- 4-731-క. )[మార్చు]

కా వున నాకును సూరి జ
నా ళికిని సర్వసంశయంబులు వాపం
గా ను బ్రోవను దగు గతి
నీ ని వినుతించి నట్టి యీ స్తవ మెలమిన్.

(తెభా- 4-732-వ. )[మార్చు]

రుద్రుండు ప్రచేతసుల కెఱిగించి వెండియు నిట్లనియె “ప్రచేతసులారా! యిట్టి యోగాదేశ నామకంబైన యీ స్తోత్రంబు బహువారావృత్తిచేఁ బఠించి మనంబున ధరియించి సమాహిత చిత్తులై మీరందఱు నాదరంబున విశ్వాసయుక్తులును, స్వధర్మాచారవంతులును, భగవదర్పితాశయులును నై జపియించుచు సర్వభూతావస్థితుండు నాత్మారాముండు నైన సర్వేశ్వరుని నుతించుచు ధ్యానంబు చేయుచుఁ బూజించుచుండుఁడు; తొల్లి యీ స్తోత్రంబు భగవంతుండైన పద్మసంభవుండు సిసృక్షు వగుచు నాత్మజులమైన మాకును సృజియింప నిచ్ఛగించు భృగ్వాదులకును నెఱింగించె; మేము నా భృగ్వాదులును బ్రజాసర్గంబు నందు బ్రహ్మచోదితులమై యీ స్తోత్రంబునం జేసి విధ్వస్త సమస్త తమోగుణులమై వివిధ ప్రజాసర్గంబు గావించితిమి; కావున నీ స్తోత్రంబు నెల్లప్పుడు నేకాగ్రచిత్తుండును వాసుదేవ పరాయణుండు నై యెవ్వండు జపియించు, వాఁడు వేగంబె శ్రేయస్సును బొంది తదీయ జ్ఞాన ప్లవంబున వ్యసనార్ణవ రూపంబయిన సంసారంబును సుఖతరంబుగఁ దరియించు; అట్టి మదుపదిష్టం బయిన యీ శ్రీహరి స్తవంబు నెవ్వండు చదువుచు దురారాధ్యుం డైన శ్రీహరిం బూజించు, వాఁడు మదుక్త స్తోత్ర గాన సంతుష్టుండును శ్రేయస్సులకు నేకాశ్రయ భూతుం డును నగు; శ్రీమన్నారాయణుని వలన సమస్తాభీష్టంబులం బొందు; ఎవ్వండేనిఁ బ్రభాతంబున లేచి ప్రాంజలియు శ్రద్ధాసమన్వితుండు నై యీ మంగళస్తవరాజంబును వినిన వినిపించినం గర్మబంధ విముక్తుం డగును;” అని మఱియు నిట్లనియె.

(తెభా- 4-733-క. )[మార్చు]

దేవతనయులారా!
పు రుషాధీశుండు పరమ పురుషుఁడు నగు నీ
శ్వ రు సుస్తోత్రము మీ కా
మునఁ దెలిపితిని; మీరుఁ ద్దయు భక్తిన్.

(తెభా- 4-734-క. )[మార్చు]

కాగ్రచిత్తులును సు
శ్లో కులునై జపము చేయుచును ఘనతపముం
గై కొని చేసిన మీకును
జే కుఱు మహితేప్సితార్థ సిద్ధి గడంకన్.

(తెభా-4-735-క. )[మార్చు]

ని యీ గతి నుపదేశం
బొ రించి సదాశివుండు నొగి వారలచే
ను బూజితుఁడై వారలు
నంతర్ధానుఁ డయ్యెఁ గౌతుక మొప్పన్.

(తెభా- 4-736-వ. )[మార్చు]

అంత.

(తెభా- 4-737-తే. )[మార్చు]

తివుట వారలు రుద్రోపదిష్టమైన
చ్యుతస్తవము జపించు యుత సంఖ్య
త్సరము లుగ్ర తపము దుర్వార వారి
ధ్యమునఁ జేయుచున్న సయమునందు.

(తెభా- 4-738-వ. )[మార్చు]

ఘనకర్మాసక్త చిత్తుండై యున్న ప్రాచీనబర్హి కడకు నధ్యాత్మవేదియుం గృపాళువు నైన నారదుండు చనుదెంచి యా రాజునకు జ్ఞానబోధంబు చేయు కొఱకు నతనితో నిట్లనియె “రాజా! యీ కర్మంబునం జేసి యెట్టి శ్రేయస్సు నభిలషించుచున్నవాఁడ వట్టి యనిష్ట నిరసనంబు నభీష్ట ప్రాప్తి కరంబు నయిన శ్రేయం బీ కర్మంబు వలన లభింప” దనినం బ్రాచీనబర్హి నారదున కిట్లనియె.

(తెభా- 4-739-సీ. )[మార్చు]

నఘ! మునీంద్ర! మహాభాగ! యేను గ;
ర్మాపహతజ్ఞాని గుచు మోక్ష
మెఱుఁగంగ లే నైతి నిట్టి నా కిప్పుడు;
డు విమలంబును ర్మబంధ
నాశకంబును నగు జ్ఞానోపదేశంబు;
గావింపు మతిదయాకార! కూట
ర్మంబులగు గేహతులందుఁ జెంది జా;
యా తనూజాత ధనాదికములె

(తెభా- 4-739.1-తే. )[మార్చు]

భూరి పురుషార్థములు గాఁగ బుద్ధిఁ దలఁచు
తివిహీనుండు సంసార మార్గములను
దగఁ బరిభ్రామ్యమాణుఁడై యొగిని మోక్ష
దము నొందగఁజాలఁడు వ్యచరిత!

(తెభా- 4-740-క. )[మార్చు]

వుఁడు నతనికి నతఁ డను
ఘా! యీ యధ్వరంబులందును గృపమా
లి నీచే విశసింపం
ని కూలిన పశుల వేల సంఖ్యలఁ గనుమా

(తెభా- 4-741-వ. )[మార్చు]

కావునం బశువ్రాతంబులు త్వదీయ వైశసంబును స్మరించుచున్నవై లోహయంత్రమయ శృంగంబులచేత నెప్పుడు నీవు పరలోకంబు నొందెద వప్పుడు నిన్ను హింసింతు మని భవదీయ మృతికి నెదురు చూచుచున్న; విట్టి సంకటంబు నొందంగల నీకు నిస్తారకం బయిన యొక్క యితిహాసంబు గల దెఱింగింతు విను” మని యిట్లనియె.

21-05-2016: :