Jump to content

పోతన తెలుగు భాగవతము/ఏకాదశ స్కంధము/వైకుంఠం మరలగోరుట

వికీసోర్స్ నుండి

వైకుంఠం మరలగోరుట

తెలుగు భాగవతము (పోతన తెలుగు భాగవతము/ఏకాదశ స్కంధము)
రచయిత: పోతన


తెభా-11-83-క.
సు గరుడ ఖచర విద్యా
హర పరమేష్ఠి ముఖ సుధాశనులు మునుల్‌
సిజనయనునిఁ గనుఁగొన
రుదెంచిరి ద్వారవతికి తిమోదమునన్‌.

టీక:- సుర = దేవతలు; గరుడ = గరుడులు; ఖచర = దేవయోనిజనితులు {ఖచరులు - ఖ (ఆకాశమున) చరులు (గమనముగలవావారు), దేవతలు}; విద్యాధర = విద్యాధరులు; హర = పరమశివుడు; పరమేష్ఠి = బ్రహ్మదేవుడు {పరమేష్ఠి - శ్రేష్ఠమైన స్థానమగు సత్యలోకమున ఉండువాడు, బ్రహ్మ}; ముఖ = మున్నగు; సుధాశనులు = దేవతలు; మునుల్ = మునులు; సరసిజనయనునిన్ = పద్మాక్షుని, కృష్ణుని; కనుగొన = చూచుటకు; అరుగుదెంచిరి = వచ్చిరి; ద్వారవతి = ద్వారకానగరమున; కిన్ = కు; అతి = మిక్కిలి; మోదమునన్ = సంతేషముతో.
భావము:- “ఓ రాజా! శ్రద్ధగా విను. సురలు, గరుడులు, విద్యాధరులు, రుద్రుడు, బ్రహ్మదేవుడు మొదలైన దేవతలు మునులు పద్మాక్షుడు శ్రీకృష్ణుని చూడడానికి మిక్కిలి సంతోషంగా ద్వారకా పట్టణానికి వచ్చారు.

తెభా-11-84-క.
ని పరమేశుని యాదవ
శోభిత పారిజాతు నరుహనేత్రున్‌
కామిత ఫలదాయకు
వినుతించిరి దివిజు లపుడు వేదోక్తములన్‌.

టీక:- కని = చూసి; పరమేశ్వరుని = కృష్ణుని; యాదవ = యదు వంశము అను; వన = ఉద్యానవములో; పారిజాతున్ = పారిజాతంలాంటివాని; వనరుహనేత్రున్ = పద్మాక్షుని, కృష్ణుని; జన = జనులు; కామిత = కోరిన; ఫల = ఫలాలను; దాయకున్ = ఇచ్చువానిని; వినుతించిరి = స్తుతించారు; దివిజులు = దేవతలు; అపుడు = ఆ సమయమునందు; వేద = వేదములలోని; ఉక్తములన్ = సూక్తులతో.
భావము:- అలా వచ్చి దర్శించుకుని, యాదవవంశం అనే ఉద్యానవనంలో ప్రకాశించే పారిజాతం వంటివాడు, జనులు కోరిన ఫలాలను ఇచ్చేవాడు అయిన పద్మాక్షుని దేవతలు వేదసూక్తాలతో వినుతించారు.

తెభా-11-85-తే.
ఖిలలోకేశ! సర్వేశ! భవ! నీవు
నుదయ మందుట భూభార ముడుపుకొఱకుఁ
బంచవింశోత్తర శతాబ్దరిమితంబు
య్యె విచ్చేయు వైకుంఠ ర్మ్యమునకు.

టీక:- అఖిలలోకేశ = శ్రీకృష్ణ {అఖిలలోకేశుడు - సర్వ జగత్తులకు ఈశుడు, విష్ణువు}; సర్వేశ = శ్రీకృష్ణ {సర్వేశుడు - సర్వ నియామకుడు, విష్ణువు}; అభవ = శ్రీకృష్ణ {అభవుడు - పుట్టుక లేనివాడు, విష్ణువు}; నీవునున్ = నీవు; ఉదయము = అవతారము; అందుట = పొందుట; భూభారమున్ = భూమిభారమును; ఉడుపు = తగ్గించుట; కొఱకున్ = కోసము; పంచవింశోత్తరశతా = నూటఇరవైయైదు (125); అబ్ద = సంవత్సరముల; పరిమితంబు = పాటి కాలము; అయ్యెన్ = అయినది; విచ్చేయు = రమ్ము; వైకుంఠహర్మ్యమున్ = వైకుంఠనగరమున; కున్ = కు.
భావము:- “సర్వలోకాధినాథ! సర్వేశ్వర! పుట్టుక లేని వాడ! నీవు భూలోకంలో పుట్టడము, భూభారం తగ్గించటం కోసం కదా. నీవు జన్మించి ఇప్పటికి నూటఇరవైఐదు సంవత్సరములు గడిచాయి. ఇక చాలు వైకుంఠభవనానికి వేంచేయి.”

తెభా-11-86-వ.
అనినఁ గమలభవ భవ ముఖ నిఖిల సురగణంబుల వచనంబు లియ్యకొని కృష్ణుండు వారితోడ “యాదవుల కన్యోన్య వైరానుబంధంబులు గల్పించి వారల హతంబు గావించి భూభారం బడంచి యిదె వచ్చెదం బొం” డని చెప్పి వీడ్కొలిపినఁ గమలాసనాదిబృందారకులు నిజస్థానంబులకుం జని రంత.
టీక:- అనినన్ = అని పలికిన; కమలభవ = బ్రహ్మదేవుడు; భవ = శివుడు; ముఖ = మొదలగు; నిఖిల = సర్వ; సురగణంబుల - సుర = దేవతా; గణంబులన్ = సమూహముల; వచనంబులున్ = ప్రార్థనలకు; ఇయ్యకొని = అంగీకరించి; కృష్ణుండు = కృష్ణుడు; వారితోడ - వారి = వారి; తోడన్ = తోటి; యాదవుల్ = యాదవవీరుల; కిన్ = కు; అన్యోన్య = వారిలోవారికి; వైరానుబంధంబులు = శత్రుత్వభావనలు; కల్పించి = ఏర్పపరచి; వారలన్ = వారిని; హతంబున్ = సంహరించుట; కావించి = చేసి; భూభారంబున్ = భూముభారమును; అడంచి = అణచి; యిదె - ఇదె = ఇదిగో, శీఘ్రమే; వచ్చెదన్ = వస్తాను; పొండు = వెళ్ళండి; అని = అని; చెప్పి = చెప్పి; వీడ్కొల్పినన్ = సెలవు ఈయగా; కమలాసన = బ్రహ్మదేవుడు; ఆది = మొదలగు; బృందారకులు = దేవతలు; నిజ = తమ; స్థానంబుల్ = నివాసముల; కున్ = కు; చనిరి = వెళ్ళిరి; అంత = పిమ్మట.
భావము:- అంటూ బ్రహ్మదేవుడు, రుద్రుడు మొదలగు సమస్త దేవతలు శ్రీకృష్ణుడిని ప్రార్థించారు. వారి ప్రార్థన అంగీకరించిన హరి, వాళ్ళతో “యాదవులకు పరస్పరం శత్రుత్వాలు కల్పించి వారిని రూపుమాపి భూభారం తగ్గించి యిదే వస్తాను. మీరు వెళ్ళండి” అని చెప్పి వాళ్ళందరికి వీడ్కొలు ఇచ్చాడు. ఆ బ్రహ్మాదేవుడు మున్నగు దేవతలు తమతమ స్థానాలకు వెళ్ళారు. అటుపిమ్మట...