పోతన తెలుగు భాగవతము/ఏకాదశ స్కంధము/వసుదేవ ప్రశ్నంబు

వికీసోర్స్ నుండి

వసుదేవ ప్రశ్నంబు

తెలుగు భాగవతము (పోతన తెలుగు భాగవతము/ఏకాదశ స్కంధము)
రచయిత: పోతన


తెభా-11-28-వ.
అని యడిగిన రాజునకు శుకుం డిట్లనియె.
టీక:- అని = అని; అడిగినన్ = అడుగగా; రాజున్ = రాజున; కున్ = కు; శుకుండు = శుకుడు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- ఇలా అడిగిన మహారాజుతో శుకమహర్షి ఈ విధంగా అన్నాడు.

తెభా-11-29-క.
"వినుము నృపాలక! సెప్పెద
మై విలసిల్లు పూర్వథ గల దదియున్‌
మును ద్వారక కేతెంచియు
నొరఁగ నారదుఁడు గృష్ణు నొయ్యనఁ గాంచెన్‌.

టీక:- వినుము = వినుము; నృపాలక = రాజా; చెప్పెదన్ = తెలియజెప్పెదను; ఘనము = గొప్పది; ఐ = అయ్యి; విలసిల్లు = ప్రసిద్ధమైన; పూర్వకథ = పాతగాథ; కలదు = ఉన్నది; అదియున్ = దానిని; మును = పూర్వము; ద్వారక = ద్వారకానగరమున; కున్ = కు; ఏతెంచి = వచ్చి; ఒనరగన్ = చక్కగ; నారదుడు = నారదుడు; కృష్ణున్ = శ్రీకృష్ణుని; ఒయ్యనన్ = చక్కగా; కాంచెన్ = సందర్శించెను.
భావము:- “ఓ మహారాజా! శ్రద్ధగా వినవయ్యా! దీనికి ఒక గొప్ప పూర్వగాథ ఉన్నది. ఒకప్పుడు నారదుడు ద్వారకకు వచ్చి ముకుందుడిని దర్శించాడు.

తెభా-11-30-వ.
అట్లు దేవముని కృష్ణసందర్శనార్థం బరుగుదెంచి తద్గృహాభ్యంతరమున కరిగిన, వసుదేవుం డమ్మునీంద్రుని నర్ఘ్యపాద్యాదివిధులం బూజించి, కనకాసనాసీనుం గావించి, యుచిత కథావినోదంబులం బ్రొద్దుపుచ్చుచు నిట్లనియె; “యే నరుండు నారాయణచరణసరసీరుహ భజనపరాయణత్వంబు నిరంతరంబు నొందం; డట్టివానికి మృత్యువు సన్నిహితంబై యుండు; నీ దర్శనంబునం గృతార్థుండ నైతి; నచ్యుతానంత గోవింద నామస్మరణైకాగ్రచిత్తులైన మీవంటి పుణ్యపురుషుల సమాగమంబున లోకులు సుఖాశ్రయులయి యుండుదురు; దేవతాభజనంబు సేయువారిని గీర్వాణులు ననుగ్రహింతు; రట్లు సజ్జనులును దీనవత్సలులు నగు వారలు పూజనాది క్రియలచే నా దేవతలను భక్తి సేయుదురు; కావున శ్రీ మహా భాగవత కథాసమూహంబులఁ గల ధర్మంబు లడిగెద; నేయే ధర్మంబులు శ్రవణ సుఖంబులుగా వినిన దండధరకింకర తాడనంబులం బడక, ముకుందచరణారవింద వందనాభిలాషులయి పరమపదప్రాప్తు లగుదు; రా ధర్మంబు లానతిమ్ము; తొల్లి గోవిందునిం బుత్రుఁగాఁ గోరి ముక్తిమార్గం బెఱుంగలేక దేవతామాయం జేసి చిక్కి చిత్తవ్యసనాంధకారం బగు సంసారంబునం దగులువడి యున్నవాఁడ; హరికథామృతంబు వెల్లిగొల్పు; మట్లయిన సుఖంబు గలుగు"ననిన వసుదేవ కృతప్రశ్నుండైన నారదుండు వాసుదేవ కథా ప్రసంగ సల్లాపహర్ష సమేతుండై సంతసంబంద నిట్లనియె.
టీక:- అట్లు = ఆ విధముగ; దేవముని = నారదుడు; కృష్ణ = కృష్ణుని; సందర్శన = చూచుటకు; అరుగుదెంచి = వచ్చి; తత్ = అతని; గృహ = ఇంటి; అభ్యంతరమున్ = లోని; కిన్ = కి; అరిగిన = వెళ్ళగా; వసుదేవుండు = వసుదేవుడు; ఆ = ఆ ప్రసిద్ధమైన; ముని = మునులలో; ఇంద్రున్ = శ్రేష్ఠుని; అర్ఘ్య = చేతులుకడుగుట; పాద్య = కాళ్ళు కడుగుట; ఆది = మున్నగు; విధులన్ = మర్యాదలతో; పూజించి = గౌరవించి; కనక = బంగారపు; ఆసన = పీఠముపై; ఆసీనున్ = కూర్చున్నవానిగా; కావించి = చేసి; ఉచిత = తగిన; కథా = వృత్తాంతములుచెప్పు; వినోదంబులన్ = వినోదములతో; ప్రొద్దుపుచ్చుచున్ = కాలముగడుపుతు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను; ఏ = ఏ; నరుండు = మానవుడు; నారాయణ = విష్ణుమూర్తి; చరణ = పాదములనెడి; సరసీరుహ = పద్మముల; భజన = భజనచేయుటను; నిరంతరంబు = ఎల్లప్పుడు; ఒందండు = పొందడో; అట్టి = అటువంటి; వాని = అతని; కిన్ = కి; మృత్యువు = మరణము; సన్నిహితంబు = సమీపములోనున్నది; ఐ = అయ్యి; ఉండున్ = ఉండును; నీ = నీ యొక్క; దర్శనంబునన్ = సందర్శించుటచేత; కృతార్థుండను = ధన్యుడను; ఐతిన్ = అయ్యాను; అచ్యుత = కృష్ణ {అచ్యుతుడు - చ్యుతము లేనివాడు, విష్ణువు}; అనంత = కృష్ణ {అనంతుడు - అంతములేని శాశ్వతుడు, విష్ణువు}; గోవింద = కృష్ణ {గోవిందుడు - గోవులకు ఒడయుడు, విష్ణువు}; నామ = అనెడి పేర్లను; స్మరణ = మననము చేయుటందు; ఏకాగ్ర = లగ్నమైన; చిత్తలు = మనసులు కలవారు; ఐన = అయిన; మీ = మీ; వంటి = లాంటి; పుణ్య = సుకృత; పురుషులు = ఆత్ములుతో; సమాగమంబునన్ = కలిసి యుండుటచేత; లోకులు = ప్రజలు; సుఖా = సుఖము, ఆనందము; ఆశ్రయులు = కలవారు; అయి = ఐ; ఉండుదురు = ఉంటారు; దేవతా = దేవతలను; భజనంబు = పూజించుట; చేయు = చేసెడి; వారిని = జనులను; గీర్వాణులునున్ = దేవతలు; అనుగ్రహింతురు = అనుగ్రహిస్తారు; అట్లు = అలా; సజ్జనులును = మంచివారు; దీన = దీనుల ఎడ; వత్సలులును = వాత్సల్యము కలవారు; అగు = ఐన; వారలు = వారు; పూజన = పూజించుట; ఆది = మున్నగు; క్రియల = సత్కార్యాల; చేన్ = తో; ఆ = ఆ యొక్క; దేవతలను = దేవతలను; భక్తి = భక్తి; చేయుదురు = చూపించెదరు; కావున = కనుక; శ్రీ = శుభకరమైన; మహాభాగవత = మహాభాగవతములోని; కథా = కథల; సమూహంబులన్ = అన్నిటిలోను; కల = ఉన్నట్టి; ధర్మంబులు = సధర్మములను; అడిగెదన్ = అడుగుతాను; ఏయే = ఏయే; ధర్మంబులు = ధర్మకార్యములు; శ్రవణ = చెవులకు; సుఖంబులు = సౌఖ్యమైనవి; కాన్ = అగునట్లు; వినిన = ఆలకించినచో; దండధర = యముని; కింకర = భటులచేత; తాడనంబులన్ = దెబ్బలబారిని; పడక = పడకుండా; ముకుంద = నారాయణుని; చరణ = పాదములనెడి; అరవింద = పద్మముల; వందనా = సేవించెడి; అభిలాషులు = ఆసక్తి కలవారు; అయి = ఐ; పరమపద = మోక్షమును; ప్రాప్తులు = పొందినవారు; అగుదురు = అగుదురో; ఆ = ఆ యొక్క; ధర్మంబులున్ = ధర్మములను; ఆనతిమ్ము = చెప్పుము; తొల్లి = పూర్వము; గోవిందునిన్ = నారాయణుని; పుత్రున్ = కుమారునిగా; కాన్ = అగుటను; కోరి = వరముకోరి; ముక్తిమార్గంబున్ = మోక్షమార్గమును; ఎఱుంగ = తెలిసికొన; లేక = లేకుండా; దేవతా = భగవంతుని; మాయన్ = మాయ; చేసి = వలన; చిక్కి = చిక్కుకొని; చిత్త = మానసు యొక్క; వ్యసన = వ్యసనములు అనెడి; అంధకారంబు = చీకటి; అగు = ఐన; సంసారంబునన్ = సంసారంలో; తగులుపడి = చిక్కుకొని; ఉన్న = ఉన్నట్టి; వాడన్ = వాడిని; హరి = నారాయణుని; కథా = కథల సారము అనెడి; అమృతంబు = అమృతమును; వెల్లిగొల్పుము = ప్రవహింపజేయుము; అట్లు = అలా; అయిన = అయినచో; సుఖంబున్ = సుఖములు; కలుగును = లభించును; అనిన = అనగా; వసుదేవ = వసుదేవునిచే; కృతప్రశ్నుండు = అడగబడినవాడు; ఐన = అయిన; నారదుండు = నారదుడు; వాసుదేవ = విష్ణుమూర్తి; కథా = గాథల; ప్రసంగ = గురించి; సల్లాప = చెప్పెడి; హర్ష = సంతోషముతో; సమేతుండు = కూడినవాడు; ఐ = అయ్యి; సంతసంబు = ఆనందమును; అంది = పొంది; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- అలా శ్రీకృష్ణ దర్శనం కోసం వచ్చిన దేవమునీంద్రుని వసుదేవుడు ఆర్ఘ్యం పాద్యం ఆదులతో యథావిథిగా పూజించి, బంగారపు ఆసనం మీద కూర్చుండపెట్టి సముచిత కథా వినోదాలతో ప్రొద్దుపుచ్చుతూ ఇలా అన్నాడు. “మునీంద్రా! నిరంతరం నారాయణ పాదపద్మాలను భజించని వానికి చావు సమీపంలోనే ఉంటుంది. నీ దర్శనంవలన కృతార్ధుడనైనాను. అచ్యుత, అనంత ఆది గోవిందనామాలను నిత్యం స్మరించే ఏకాగ్ర చిత్తం గల మీవంటి సుకృతాత్ములను కలియుట వలన లోకులు సుఖాశ్రయులై ఉంటారు. దేవతలను భజించే వారిని వేల్పులు అనుగ్రహిస్తారు. అటువంటి సజ్జనులు దీనవత్సలలు పూజలు మున్నగు సత్కార్యాలతో దేవతల యందు భక్తి చూపిస్తూ ఉంటారు. కనుక, శ్రీ మహా భాగవతం అందలి కథలలో ఉన్న ధర్మాలను అడుగుతాను.
వీనులవిందుగా వింటే, యమభటులచేత దెబ్బలు తినకుండా ముకుందుని పాదపద్మాలకు నమస్కరించే కోరిక కలిగి, పరమపదాన్ని పొందగల ధర్మాలను ఆనతీయండి. పూర్వము గోవిందుడిని కుమారునిగా కోరినప్పటికి మోక్షమార్గం తెలియలేక దైవమాయలో చిక్కి వ్యసనాల చీకటితో నిండిన సంసారంలో చిక్కుకుని ఉన్నాను. హరికథాసుధారసాన్ని ప్రవహింప చేయండి. అలా అయితే నాకు సుఖం కలుగుతుంది.” అని వసుదేవుడు ప్రార్థించగా నారదుడు వాసుదేవుని కథల ప్రస్తావన వచ్చినందుకు ఎంతో సంతోషించి ఇలా అన్నాడు.

తెభా-11-31-క.
"నను నీవు సేయు ప్రశ్నము
సన్నుత! వేదశాస్త్రసారాంశంబై
మగు హరిగుణకథనము
విను" మని, వినిపింపఁ దొడఁగె వేడ్క దలిర్పన్‌.

టీక:- ననున్ = నన్ను; నీవు = నీవు; చేయు = వేసెడి; ప్రశ్నము = ప్రశ్న; జన = లోకులచే; సన్నుత = కీర్తింపబడువాడ; వేద = వేదములు; శాస్త్ర = శాస్త్రముల; సారాంశంబు = ముఖ్య సారము; ఐ = అయ్యి; ఘనము = గొప్పది; అగు = ఐనట్టి; హరి = విష్ణుమూర్తి; గుణ = గుణముల; కథనము = వృత్తాంతము; వినుము = వినుము; అని = అని; వినిపింపన్ = చెప్ప; తొడంగె = మొదలిడెను; వేడ్కన్ = వేడుక; తలిర్పన్ = చిగురించుచుండగా.
భావము:- “సచ్చరిత్ర! నీవు వేసిన ప్రశ్న వేదశాస్త్రముల సారాంశమైనది. ఘనమైన ఆ శ్రీహరి గుణకథనాలను వినవలసింది.” అని వేడుక చిగురించగా వినిపించడం మొదలు పెట్టాడు.

తెభా-11-32-క.
"అతిపాపకర్ములైనను
తము నారాయణాఖ్యబ్దము మదిలో
వితంబుగఁ బఠియించిన
తురులఁ గొనియాడఁ గమలసంభవు వశమే?

టీక:- అతి = మిక్కిలి; పాప = పాపపు; కర్ములు = పనులు చేయువారు; ఐనను = అయినప్పటికి; సతతము = ఎల్లప్పుడు; నారాయణ = నారాయణ; ఆఖ్య = అనెడి; శబ్దమున్ = నామమును; మది = మనస్సు; లోన్ = అందు; వితతంబుగన్ = ఎడతెగకుండ; పఠియించిన = స్మరించెడి; చతురులన్ = తెలివికలవారిని; కొనియాడన్ = స్తుతించుటకు; కమలసంభవు = బ్రహ్మదేవునికి; వశమే = శక్యమా, కాదు.
భావము:- ఎంతటి పాపంచేసిన వారైనా సరే నారాయణుని నామాన్ని విడువక నిత్యం మనస్సులో స్మరించేవాళ్ళు పరమ ధన్యులు. అట్టి వారిని పొగడుట బ్రహ్మదేవుడికి సైతం సాధ్యం కాదు.