పోతన తెలుగు భాగవతము/ఏకాదశ స్కంధము/కృష్ణసందర్శనంబు

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

కృష్ణ సందర్శనంబు

తెలుగు భాగవతము (పోతన తెలుగు భాగవతము/ఏకాదశ స్కంధము)
రచయిత: పోతన


(తెభా-11-11-వ.)[మార్చు]

నిరుపమసుందరం బయిన శరీరంబు ధరియించి సమస్త కర్మ తత్పరుండై పరమేశ్వరుండు యదువుల నడంగింపఁ దలఁచు సమయంబున జటావల్కల కమండలుధారులును, రుద్రాక్షభూతిభూషణ ముద్రాముద్రితులును, గృష్ణాజినాంబరులును నగు విశ్వామిత్రాసిత దుర్వాసోభృగ్వంగిరః కశ్యప వామదేవ వాలఖిల్యాత్రి వసిష్ఠ నారదాది మునివరులు స్వేచ్ఛావిహారంబున ద్వారకానగరంబున కరుదెంచి యందు.

(తెభా-11-12-సీ.)[మార్చు]

నుని శ్రీకృష్ణునిఁ గౌస్తుభాభరణునిఁ;
ర్ణకుండలయుగ్మనకపోలుఁ
బుండరీకాక్షు నంభోధరశ్యామునిఁ;
లిత నానారత్న న కిరీటు
నాజానుబాహు నిర్గళాయుధహస్తు;
శ్రీకరపీతకౌశేయవాసు
రుక్మిణీనయన సరోజ దివాకరు;
బ్రహ్మాదిసుర సేవ్యపాదపద్ము

(తెభా-11-12.1-తే.)[మార్చు]

దుష్టనిగ్రహ శిష్టసంతోషకరణుఁ
గోటిమన్మథలావణ్యకోమలాంగు
నార్తజనరక్షణైకవిఖ్యాతచరితుఁ
నిరి కరుణాసముద్రుని నులు మునులు.

(తెభా-11-13-క.)[మార్చు]

చ్చిన మునిసంఘములకు
'వి చ్చలవిడి నర్ఘ్యపాద్యవిధు లొనరింపన్‌
మె చ్చగు కనకాసనముల
' చ్చుగఁ గూర్చుండి వనరుహాక్షునితోడన్‌.

(తెభా-11-14-క.)[మార్చు]

ములు నిను సేవింపని
'ది ములు వ్యర్థంబు లగుచుఁ దిరుగుచు నుండుం
నువులు నిలుకడ గావఁట
' ములలో నున్ననైన నరుహనాభా!

(తెభా-11-15-క.)[మార్చు]

ణంబులు భవజలధికి
' ణంబులు దురితలతల కాగమముల కా
ణంబు లార్తజనులకు
' ణంబులు, నీదు దివ్యరణంబు లిలన్‌.

(తెభా-11-16-మత్త.)[మార్చు]

' క్క వేళను సూక్ష్మరూపము నొందు దీ వణుమాత్రమై
'యొ క్క వేళను స్థూలరూపము నొందు దంతయు నీవయై
'పె క్కురూపులు దాల్తు నీ దగు పెంపు మాకు నుతింపఁగా
' క్కజం బగుచున్న దేమన? నంబుజాక్ష! రమాపతీ!

(తెభా-11-17-క.)[మార్చు]

శ్రీ నాయక! నీ నామము
'నా నాభవరోగకర్మనాశమునకు వి
న్నా ణం బగు నౌషధ మిది
'కా రు దుష్టాత్ము లకట! కంజదళాక్షా!

(తెభా-11-18-వ.)[మార్చు]

అని యనేకవిధంబులం బ్రస్తుతించిన మునివరులం గరుణాకటాక్ష వీక్షణంబుల నిరీక్షించి, పుండరీకాక్షుం డిట్లనియె; “మదీయధ్యాన నామస్మరణంబులు భవరోగహరణంబులును, బ్రహ్మరుద్రాదిక శరణంబులును, మంగళకరణంబులును నగు” ననియును, “నా రూపంబులైన మేదినీసురుల పరితాపంబులఁ బరిహరించు పురుషుల నైశ్వర్యసమేతులంగాఁ జేయుదు” ననియును, యోగీశ్వరేశ్వరుం డయిన యీశ్వరుం డానతిచ్చి యనంతరంబ “మీర లిచ్చటికివచ్చిన ప్రయోజనంబేమి?” యనిన వారలు “భవదీయ పాదారవింద సందర్శనార్థంబు కంటె మిక్కిలి విశేషం బొండెద్ది?” యని వాసుదేవవదనచంద్రామృతంబు నిజనేత్రచకోరంబులం గ్రోలి యథేచ్ఛా విహారులై ద్వారకానగరంబున కనతి దూరంబున నుండు పిండారకం బను నొక్క పుణ్యతీర్థంబున కరిగి; రంత.

(తెభా-11-19-క.)[మార్చు]

ర్పించి యాదవులు తమ
'నే ర్పునఁ గొమరారు సాంబు నెలఁతుకరూపం
బే ర్పడ శృంగారించియుఁ
' ర్పూర సుగంధి పోల్కిఁ గావించి యొగిన్‌.

(తెభా-11-20-ఉ.)[మార్చు]

'మూఁ లుగూడి యాదవులు ముందటఁ బెట్టుక యార్చి నవ్వుచుం
'బో లఁ బోవుచున్‌ మునిసమూహము కొయ్యన సాఁగి మ్రొక్కుచుం
'బ్రా టమైన యీ సుదతి భారపుగర్భమునందుఁ బుత్త్రుఁడో
'యే త మందు బాలికయొ యేర్పడఁ జెప్పు డటన్న నుగ్రులై.

(తెభా-11-21-క.)[మార్చు]

దుడింభకులను గనుఁగొని
' యుతులై వచ్చి రనుచు దిలో రోషం
బొ వఁ గనుఁగొనల నిప్పులు
'సె రఁగ హాస్యంబు సనునె చేయఁగ ననుచున్‌.

(తెభా-11-22-క.)[మార్చు]

వా లాయము యదుకుల ని
'ర్మూ కరం బైన యట్టి ముసలం బొక టీ
బా లిక కుదయించును బొం
'డా స్యము లే దటంచు టఁబల్కుటయున్‌.

(తెభా-11-23-వ.)[మార్చు]

మదోద్రేకులైన యాదవబాలకులు మునిశాపభీతులై వడవడ వడంకుచు సాంబకుక్షినిబద్ధ చేల గ్రంథివిమోచనంబు సేయు సమయంబున ముసలం బొక్కటి భూతలపతితం బయిన విస్మయంబు నొంది దానిం గొనిచని దేవకీనందను సన్నిధానంబునం బెట్టి యెఱింగించిన నతం డాత్మకల్పిత మాయారూపం బగుట యెఱింగియు, నెఱుంగని తెఱంగున వారలం జూచి యిట్లనియె.

(తెభా-11-24-క.)[మార్చు]

ది సెడి కన్నులుగానక
' యుతులై మునులఁ గల్లమాటలఁ జెనయం
దిసి కులక్షయకారణ
'వి దితం బగు శాప మొందు వెఱ్ఱులుఁ గలరే?

(తెభా-11-25-క.)[మార్చు]

ణీసురశాపమునకు
' రిహర బ్రహ్మాదులైన డ్డము గలరే?
రు లనఁగ నెంత వారలు
' మరుదుగఁ బూర్వజన్మర్మముఁ ద్రోవన్‌?

(తెభా-11-26-వ.)[మార్చు]

అది గావున యతి నిందాపరత్వంబున యదువంశనాశం బగు; సందియంబులే” దని పరమేశ్వరుండు వారలం జూచి “సముద్రతీరంబున నొక్క మహాపర్వతం బున్నది; యందు నుండు నత్యుచ్ఛ్రయ విశాలభీషణం బగు పాషాణంబున మీ భుజాబలంబుచేత నీ ముసలంబు దివిచి దీని చూర్ణంబు సింధు కబంధంబులఁ గలిపి రండు; పొండ”ని జగద్విభుండైన కృష్ణుం డానతిచ్చిన, వారు నట్ల చేసి తత్కీలితం బయిన లోహఖండంబును సరకుగొనక సాగరంబునఁ బడవైచిన నొక్క ఝషంబు గ్రసించిన, దాని నొక్క లుబ్ధకుండు జాలమార్గంబునఁ బట్టికొని, తదుదరగతంబయిన లోహఖండంబు దెచ్చి బాణాగ్రంబున ముల్కిగా నొనర్చె” నని తత్కథావృత్తాంతంబు సెప్పిన బాదరాయణిం గనుంగొని రాజేంద్రుం డిట్లనియె.

(తెభా-11-27-క.)[మార్చు]

చి త్తం బే క్రియ నిలుచుం?
'జి త్తజగురు పాదపద్మ సేవ సదా య
త్యు త్తమ మని వసుదేవుఁడు
'చి త్తముఁ దగ నిల్పి యెట్లు సెందె మునీంద్రా!

21-05-2016: :

గణనాధ్యాయి 12:42, 12 డిసెంబరు 2016 (UTC)