పోతన తెలుగు భాగవతము/ఏకాదశ స్కంధము/యాదవులహతంబు

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

యాదవుల హతంబు

తెలుగు భాగవతము (పోతన తెలుగు భాగవతము/ఏకాదశ స్కంధము)
రచయిత: పోతన


(తెభా-11-8-వ.)[మార్చు]

అని వితర్కించి జగదీశ్వరుం “డత్యున్నత వేణుకాననంబు వాయువశంబున నొరసికొన ననలం బుద్భవంబయి దహించు చందంబున యదుబలంబుల కన్యోన్య వైరానుబంధంబులు గల్పించి హతం బొనర్చెద” నని విప్రశాపంబు మూలకారణంబుగాఁ దలంచి యదుబలంబుల నడంచె నని పలికిన మునివరునకు రాజేంద్రుం డిట్లనియె.

(తెభా-11-9-క.)[మార్చు]

రిపాదకమల సేవా
రులగు యాదవుల కెట్లు బ్రాహ్మణశాప
స్ఫు ణంబు సంభవించెనొ
యఁగ సంయమివరేణ్య! యానతి యీవే!

(తెభా-11-10-క.)[మార్చు]

నిన జనపాలునకు ని
ట్ల ని సంయమికులవరేణ్యుఁ తి మోదముతో
వి ను మని చెప్పఁగఁ దొడఁగెను
తర గంభీర వాక్ప్రకాశస్ఫురణన్‌.

21-05-2016: :

గణనాధ్యాయి 12:41, 12 డిసెంబరు 2016 (UTC)