పోతన తెలుగు భాగవతము/అష్ఠమ స్కంధము/హరి హర సల్లాపాది

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

హరిహరసల్లాపాది

తెలుగు భాగవతము (మూస:పోతన తెలుగు భాగవతము/అష్ఠమ స్కంధము/)
రచయిత: పోతన


(తెభా-8-384-సీ.)[మార్చు]

కైలాసగిరి మీఁద ఖండేందు భూషణుం;
డొకనాఁడు గొలువున నున్న వేళ
నంగన యై విష్ణుఁ సురుల వంచించి;
సురలకు నమృతంబు సూఱ లిడుట
విని దేవియును దాను వృషభేంద్ర గమనుఁడై;
డు వేడ్క భూత సంములు గొలువ
ధుసూదనుం డున్న మందిరంబున కేగి;
పురుషోత్తమునిచేతఁ బూజ పడసి

(తెభా-8-384.1-తే.)[మార్చు]

తానుఁ గూర్చుండి పూజించె నుజ వైరిఁ
గుశలమే మీకు మాకునుఁ గుశల మనుచు
ధురభాషల హరిమీఁద మైత్రి నెఱపి
రుఁడు పద్మాక్షుఁజూచి యిట్లనియెఁ బ్రీతి.

(తెభా-8-385-సీ.)[మార్చు]

దేవ! జగన్మయ! దేవేశ! జగదీశ! ;
కాలజగద్వ్యాపస్వరూప!
ఖిల భావములకు నాత్మయు హేతువు;
నైన యీశ్వరుఁడ వాద్యంతములకు
ధ్యంబు బహియును ఱి లోపలయు లేక;
పూర్ణమై యమృతమై భూరిసత్య
మానంద చిన్మాత్ర వికార మాద్య మ;
న్య మశోకంబు గుణ మఖిల

(తెభా-8-385.1-తే.)[మార్చు]

సంభవస్థితిలయముల దంభకంబు
నైన బ్రహ్మంబు నీవ; నీ యంఘ్రియుగము
నుభయ సంగ విసృష్టులై యున్నమునులు
గోరి కైవల్యకాములై కొల్తు రెపుడు.

(తెభా-8-386-సీ.)[మార్చు]

భావించి కొందఱు బ్రహ్మంబు నీ వని;
లపోసి కొందఱు ర్మ మనియుఁ
ర్చించి కొందఱు దసదీశ్వరుఁడని;
రవిఁ గొందఱు శక్తి హితుఁ డనియుఁ
జింతించి కొందఱు చిరతరుం డవ్యయుఁ;
డాత్మతంత్రుఁడు పరుం ధికుఁ డనియు
దొడరి యూహింతురు తుది నద్వయద్వయ;
దసద్విశిష్ట సంశ్రయుఁడ వీవు;

(తెభా-8-386.1-తే.)[మార్చు]

లఁప నొక్కింత వస్తుభేదంబుఁ గలదె
కంకణాదులు బసిఁడి యొక్కటియ కాదె?
డలు పెక్కైన వార్థి యొక్కటియ కాదె?
భేద మంచును నిను వికల్పింప వలదు.

(తెభా-8-387-సీ.)[మార్చు]

ద్విలాసము మరీచ్యాదు లెఱుంగరు;
నిత్యుఁడ నై యున్న నేను నెఱుఁగ
న్మాయ నంధులై మరాసురాదులు;
నరెద రఁట! యున్నవారలెంత?
యే రూపమునఁ బొంద కేపారుదువు నీవు;
రూపివై సకలంబు రూపుచేయ
క్షింపఁ జెఱుపఁ గాణమైన సచరాచ;
రాఖ్యమై విలసిల్లు దంబరమున

(తెభా-8-387.1-తే.)[మార్చు]

నిలుఁ డే రీతి విహరించు ట్ల నీవు
లసి వర్తింతు సర్వాత్మత్వ మొప్ప;
గములకు నెల్ల బంధమోక్షములు నీవ
నీవ సర్వంబుఁ దలపోయ నీరజాక్ష!

(తెభా-8-388-మ.)[మార్చు]

తన్ నీ మగపోఁడుముల్ పలుమఱుం న్నారఁ గన్నార; మే
ని ను విన్నారము చూడమెన్నఁడును మున్ నీయాఁడుఁజందంబు మో
హి నివై దైత్యులఁ గన్నుఁ బ్రామి యమృతం బింద్రాది దేవాళి కి
చ్ఛి నీ రూపముఁ జూపుమా! కుతుకముం జిత్తంబునం బుట్టెడిన్.

(తెభా-8-389-క.)[మార్చు]

వాఁడ వై జగంబులఁ
గిలిఁచి చిక్కులను బెట్టు దంటకు నీకున్
గువ తనంబున జగములఁ
గులము బొందింప నెంతడవు ముకుందా!

(తెభా-8-390-వ.)[మార్చు]

అని పలుకుచున్న శూలపాణిచే నపేక్షితుండై విష్ణుండు భావ గంభీరంబగు నవ్వు నివ్వటిల్ల న వ్వామదేవున కిట్లనియె.

(తెభా-8-391-శా.)[మార్చు]

శ్రీ కంఠా! నిను నీవ యేమఱకు మీ చిత్తంబు రంజించెదన్;
నా ద్వేషుల డాఁగురించుటకునై నాఁ డేను గైకొన్న కాం
తా కారంబు జగద్విమోహనము నీకై చూచెదేఁ జూపెదం;
గై కో నర్హము లండ్రు కాముకులు సంల్పప్రభావంబులన్.

(తెభా-8-392-వ.)[మార్చు]

అని పలికి కమలలోచనుం డంతర్హితుండయ్యె; అ య్యుమాసహితుండైన భవుండు విష్ణుఁ డెటు పోయెనో యెందుఁ జొచ్చెనో యని దశదిశలం గలయ నవలోకించుచుండం దన పురోభాగంబున.
 : : 21-05-2016: : గణనాధ్యాయి 13:04, 22 సెప్టెంబరు 2016 (UTC)