పోతన తెలుగు భాగవతము/అష్ఠమ స్కంధము/సముద్రమథన కథా ప్రారంభం

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

సముద్రమథనకథాప్రారంభం

తెలుగు భాగవతము (మూస:పోతన తెలుగు భాగవతము/అష్ఠమ స్కంధము/)
రచయిత: పోతన


(తెభా-8-142-వ.)[మార్చు]

అని పలికినం బరీక్షిన్నరేంద్రుండు మునీంద్రున కిట్లనియె.

(తెభా-8-143-మ.)[మార్చు]

వి ను ము న్నేటికిఁ ద్రచ్చె పాలకడలిన్ విష్ణుండు? కూర్మాకృతిన్
ధిం జొచ్చి య దెట్లు మోచె బలుకవ్వంబైన శైలంబు? దే
నికాయం బమృతంబు నెట్లు పడసెన్? వారాశి నేమేమి సం
నితం బయ్యె? మునీంద్ర! చోద్యము గదా ర్వంబుఁ జెప్పంగదే.

(తెభా-8-144-క.)[మార్చు]

ప్పటినుండి బుధోత్తమ!
చె ప్పెడు భగవత్కథా విశేషంబులు నా
కె ప్పుడుఁ దనవి జనింపదు
చె ప్పఁగదే చెవులు నిండ శ్రీహరికథలున్.

(తెభా-8-145-వ.)[మార్చు]

అని మఱియు నడుగం బడినవాఁడై యతని నభినందించి హరి ప్రసంగంబు జెప్ప నుపక్రమించె" నని సూతుండు ద్విజుల కిట్లనియె "నట్లు శుకుండు రాజుం జూచి.
 : : 21-05-2016: : గణనాధ్యాయి 12:33, 19 సెప్టెంబరు 2016 (UTC)