పోతన తెలుగు భాగవతము/అష్ఠమ స్కంధము/వామనుని బిక్షా గమనము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

వామనునిబిక్షాగమనము

తెలుగు భాగవతము (మూస:పోతన తెలుగు భాగవతము/అష్ఠమ స్కంధము/)
రచయిత: పోతన


(తెభా-8-525-క.)[మార్చు]

ప్ర క్షీణ దివిజ వల్లభ
క్షాపరతంత్రుఁ డగుచు రాజీవాక్షుం
డా క్షణమున బలి యింటికి
బి క్షాగమనంబు జేసెఁ బేదఱికముతోన్.

(తెభా-8-526-క.)[మార్చు]

రిహరి; సిరి యురమునఁ గల
రి హరిహయుకొఱకు దనుజు డుగం జనియెన్;
హితరత మతియుతులగు
దొ లకు నడుగుటయు నొడలి తొడవగుఁ బుడమిన్.

(తెభా-8-527-క.)[మార్చు]

ర్వప్రపంచ గురుభర
ని ర్వాహకుఁ డగుటఁజేసి నెఱిఁ జనుదేరన్
ర్వుని వ్రేఁగు సహింపక
ను ర్వీస్థలి గ్రుంగె; మ్రొగ్గె నురగేంద్రుండున్.

(తెభా-8-528-వ.)[మార్చు]

ఇట్లు చనిచని

(తెభా-8-529-క.)[మార్చు]

ర్మద, యమదండక్షత
ర్మద, నతి కఠిన ముక్తి నితాచేతో
ర్మద, నంబునివారిత
దు ర్మద, నర్మదఁ దరించెఁ ద్రోవన్ వటుఁడున్.

(తెభా-8-530-వ.)[మార్చు]

దాటి తత్ప్రవాహంబున కుత్తరతటంబు నందు.

(తెభా-8-531-శా.)[మార్చు]

చం స్ఫూర్తి వటుండుఁ గాంచె బహుధాల్పన్నిశాటంబు, ను
ద్దం డాహూత మునీభ్యబిభ్యదమృతాంస్సిద్ధకూటంబు, వే
దం డాశ్వధ్వజనీ కవాటము, మహోద్యద్ధూమ సంఛన్న మా
ర్తాం స్యందన ఘోటమున్, బలిమఖాంర్వేది కావాటమున్.
 : : 21-05-2016: : గణనాధ్యాయి 16:12, 22 సెప్టెంబరు 2016 (UTC)