పోతన తెలుగు భాగవతము/అష్ఠమ స్కంధము/వామనునికి దాన మిచ్చుట

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

వామనునికిదానమిచ్చుట

తెలుగు భాగవతము (మూస:పోతన తెలుగు భాగవతము/అష్ఠమ స్కంధము/)
రచయిత: పోతన


(తెభా-8-599-వ.)[మార్చు]

అ య్యవసరంబున.

(తెభా-8-600-ఆ.)[మార్చు]

'నుజలోకనాథు యిత వింధ్యావళి
'రాజవదన మదమరాళ గమన
'టుని కాళ్ళుఁ గడుగ రహేమ ఘటమున
'లముఁ దెచ్చె భర్త న్న యెఱిఁగి.

(తెభా-8-601-వ.)[మార్చు]

అయ్యవసరంబునఁ గపటవటునకు న ద్దానవేంద్రుం డిట్లనియె.

(తెభా-8-602-క.)[మార్చు]

మ్మా మాణవకోత్తమ!
'లె మ్మా నీ వాంఛితంబు లే దన కిత్తుం
దె మ్మా యడుగుల నిటు రా
'ని మ్మా కడుగంగవలయు నేటికిఁ దడయన్?

(తెభా-8-603-వ.)[మార్చు]

అనిన విని

(తెభా-8-604-మ.)[మార్చు]

' లి దైత్యేంద్ర కరద్వయీ కృత జలప్రక్షాళనవ్యాప్తికిన్
' జాతాక్షుఁడు చాఁచె యోగి సుమనస్సంప్రార్థితశ్రీదముం
' లితానమ్ర రమా లలాటపదవీ స్తూరికా శాదమున్
' లినామోదము రత్ననూపురిత నానావేదముం బాదమున్.

(తెభా-8-605-క.)[మార్చు]

సు లోక సముద్ధరణము
'ని తశ్రీకరణ మఖిల నిగమాంతాలం
ణము భవసంహరణము
' రిచరణము నీఁటఁ గడిగె సురోత్తముడున్.

(తెభా-8-606-వ.)[మార్చు]

ఇట్లు ధరణీసుర దక్షిణ చరణ ప్రక్షాళనంబు చేసి వామపాదంబు గడిగి తత్పావన జలంబు శిరంబునం జల్లుకొని వార్చి దేశ కాలాది పరిగణ నంబు చేసి.

(తెభా-8-607-శా.)[మార్చు]

'వి ప్రాయ ప్రకటవ్రతాయ భవతే విష్ణుస్వరూపాయ వే
' ప్రామాణ్యవిదే త్రిపాద ధరణిం దాస్యామి! యంచుం గ్రియా
'క్షి ప్రుండై దనుజేశ్వరుండు వడుగుం జే సాఁచి పూజించి "బ్ర
'హ్మ ప్రీత"మ్మని ధారపోసె భువనం బాశ్చర్యముం బొందగన్.

(తెభా-8-608-వ.)[మార్చు]

తత్కాలంబున.

(తెభా-8-609-ఆ.)[మార్చు]

'నీరధారఁ బడఁగ నీక యడ్డంబుగాఁ
'లశరంధ్ర మాఁపగాను దెలిసి
'రియుఁ గావ్యు నేత్ర టఁ గుశాగ్రంబున
'డువ నేకనేత్రుఁ య్యె నతఁడు.

(తెభా-8-610-వ.)[మార్చు]

అంత

(తెభా-8-611-మ.)[మార్చు]

' రారాతి కరాక్షతోజ్ఝిత పవిత్రాంభః కణశ్రేణికిం
' లాధీశ్వరుఁ డొడ్డె ఖండిత దివౌస్స్వామిజిన్మస్తముం
' లాకర్షణ సుప్రశస్తము రమాకాంతాకుచోపాస్తమున్
'వి లశ్రీ కుచశాత చూచుక తటీవిన్యస్తమున్ హస్తమున్.

(తెభా-8-612-క.)[మార్చు]

ము నిజన నియమాధారను
' నితాసుర యువతి నేత్రలకణ ధారన్
నుజేంద్ర నిరాధారను
' జాక్షుఁడు గొనియె బలివిర్జితధారన్.

(తెభా-8-613-ఆ.)[మార్చు]

'మలనాభు నెఱిఁగి కాలంబు దేశంబు
'నెఱిఁగి శుక్రు మాట లెఱిగి నాశ
'మెఱిఁగి పాత్ర మనుచు నిచ్చె దానము బలి
'హి వదాన్యుఁ డొరుఁడు ఱియుఁ గలఁడె.

(తెభా-8-614-క.)[మార్చు]

లి చేసిన దానమునకు
ళినాక్షుఁడు నిఖిలభూత నాయకుఁ డగుటం
కల మని దశదిక్కులు
ళిబళి యని పొగడె భూతపంచక మనఘా!

(తెభా-8-615-క.)[మార్చు]

క్షి తి దానమిచ్చు నతఁడును
తికాంక్షఁ బరిగ్రహించు తఁడును దురిత
చ్యు తులై శతవత్సరములు
మఖ లోకమునఁ గ్రీడ లుపుదు రెలమిన్.

(తెభా-8-616-వ.)[మార్చు]

అట్లుగావున నే దానంబును భూదానంబునకు సదృశంబు గానేరదు; గావున వసుంధరా దానం బిచ్చితి; వుభయలోకంబులం గీర్తి సుకృతం బులు పడయు" మని పలికి య మ్మాయావటుం డిట్లనియె.

(తెభా-8-617-క.)[మార్చు]

ది యేమి వేఁడితని నీ
ది' వగవక ధారపోయుమా'''''; సత్యము పెం
పొ వఁగ గోరిన యర్థం
బి ది యిచ్చుట ముజ్జగంబు లిచ్చుట మాకున్.

(తెభా-8-618-వ.)[మార్చు]

అని పలికిన వటుని పలుకులకు హర్ష నిర్భర చేతస్కుండై వైరోచ నుండు.

(తెభా-8-619-ఆ.)[మార్చు]

పుట్టి నేర్చుకొనెనొ పుట్టక నేర్చెనో
చిట్టి బుద్ధు లిట్టి పొట్టివడుగు
పొట్ట నున్న వెల్ల బూమెలు నని నవ్వి
యెలమి ధరణి దాన మిచ్చె నపుడు.

(తెభా-8-620-ఆ.)[మార్చు]

గ్రహ మునీంద్ర సిద్ధ గంధర్వ కిన్నర
క్ష పక్షి దేవతాహి పతులు
పొగడి రతని పెంపుఁ; బుష్పవర్షంబులు
గురిసె దేవతూర్యకోటి మొరసె.

(తెభా-8-621-వ.)[మార్చు]

ఇట్లు ధారా పరిగ్రహంబు చేసి.
 : : 21-05-2016: : గణనాధ్యాయి 10:57, 23 సెప్టెంబరు 2016 (UTC)