Jump to content

పోతన తెలుగు భాగవతము/అష్ఠమ స్కంధము/వామనునికి దాన మిచ్చుట

వికీసోర్స్ నుండి

వామనునికిదానమిచ్చుట

తెలుగు భాగవతము (మూస:పోతన తెలుగు భాగవతము/అష్ఠమ స్కంధము/)
రచయిత: పోతన


తెభా-8-599-వ.
అ య్యవసరంబున .
టీక:- ఆ = ఆ; అవసరంబునన్ = సమయమునందు.
భావము:- ఆ సమయంలో. . . .

తెభా-8-600-ఆ.
నుజలోకనాథు యిత వింధ్యావళి
రాజవదన మదమరాళ గమన
టుని కాళ్ళుఁ గడుగ రహేమ ఘటమున
లముఁ దెచ్చె భర్త న్న యెఱిఁగి
.
టీక:- దనుజలోక = రాక్షసులందరికి; నాథు = రాజుయొక్క; దయిత = భార్య; వింధ్యావళి = వింధ్యావళి; రాజవదన = చంద్రముఖి; మదమరాళ = రాయంచలవంటి; గమన = నడకలు కలామె; వటుని = బ్రహ్మచారి; కాళ్ళు = పాదములు; కడుగ = కడుగుటకు; వర = శ్రేష్ఠమైన; హేమ = బంగారు; ఘటమునన్ = కలశముతో; జలమున్ = నీటిని; తెచ్చెన్ = తీసుకువచ్చెను; భర్త = పతి; సన్న = సైగను; ఎఱిగి = అర్థముచేసికొని.
భావము:- బలిచక్రవర్తి ఇల్లాలు వింధ్యావళి. ఆమె ముఖము చందమామ వంటిది. ఆమె నడకలు రాజహంస నడకలు. ఆ సందర్భంలో ఆమె భర్త సైగ గమనించింది. బ్రహ్మచారి కాళ్ళు కడగడానికి బంగారు కలశంతో నీళ్ళు తెచ్చింది.

తెభా-8-601-వ.
అయ్యవసరంబునఁ గపటవటునకు న ద్దానవేంద్రుం డిట్లనియె .
టీక:- ఆ = ఆ; అవసరంబునన్ = సమయమునందు; కపట = మాయా; వటున్ = బ్రహ్మచారి; కున్ = కి; ఆ = ఆ; దానవేంద్రుడు = రాక్షసరాజు; ఇట్లు = ఇలా; అనియె = పలికెను.
భావము:- అప్పుడు మాయా బ్రహ్మచారి వామనుడితో, ఆ రాక్షసేంద్రుడు బలిచక్రవర్తి ఇలా అన్నాడు.

తెభా-8-602-క.
"రమ్మా మాణవకోత్తమ!
లెమ్మా నీ వాంఛితంబు లే దన కిత్తుం
దెమ్మా యడుగుల నిటు రా
నిమ్మా కడుగంగవలయు నేటికిఁ దడయన్?"

టీక:- రమ్మా = రమ్ము; మాణవక = బాలక; ఉత్తమ = శ్రేష్ఠుడ; లెమ్మా = లెమ్ము; నీ = నీ యొక్క; వాంఛితంబున్ = కోరికను; లేదు = లేదు; అనకన్ = అనకుండగా; ఇత్తున్ = ఇచ్చెదను; తెమ్మా = తెమ్ము; అడుగులన్ = పాదములను; ఇటు = ఇటుపక్కకి; రానిమ్మా = రానిమ్ము; కడుగంగ = కడుగుట; వలయున్ = చేయవలెను; ఏటికి = దేనికి; తడయన్ = ఆలస్యముచేయుట.
భావము:- “ఓ బాలకా! లేవయ్యా! ఇలా రావయ్యా! నీవు అడిగింది ఇస్తాను. నీ పాదాలు కడగనియ్యి. ఇంకా ఆలస్యం చేయటం దేనికి.”

తెభా-8-603-వ.
అనిన విని .
టీక:- అనిన = అనగా; విని = విని.
భావము:- బలిచక్రవర్తి పిలుపును విని. . .

తెభా-8-604-మ.
లిదైత్యేంద్ర కరద్వయీ కృత జలప్రక్షాళనవ్యాప్తికిన్
జాతాక్షుఁడు చాఁచె యోగి సుమనస్సంప్రార్థితశ్రీదముం
లితానమ్ర రమా లలాటపదవీ స్తూరికా శాదమున్
లినామోదము రత్ననూపురిత నానావేదముం బాదమున్
.
టీక:- బలిదైత్యేంద్ర = బలిచక్రవర్తి; కర = చేతులు; ద్వయీ = రెంటి (2) తోను; కృత = చేయు; జల = నీటితో; ప్రక్షాళన = కడుగుట; వ్యాప్తికిన్ = జరుగుటకు; జలజాతాక్షుడు = విష్ణువు {జలజాతాక్షుడు - జలజాత (పద్మములవంటి) అక్షుడు (కన్నులు కలవాడు), విష్ణువు}; చాచెన్ = చాచెను; యోగి = యోగులచేత; సుమనస్ = దేవతలచేత; సంప్రార్థిత = చక్కగా సేవింపబడెడి; శ్రీ = శుభములను; దమున్ = కలిగించెడిది; కలిత = కలిగిన; ఆనమ్ర = వంగినట్టి; రమా = లక్ష్మీదేవి; లలాట = నుదుట; పదవీ = ఉన్న; కస్తూరికా = కస్తూరితిలకము; శాదము = పంకముకలది; నలిన = పద్మముల; ఆమోదమున్ = పరిమళము కలది; రత్న = మణులుపొదిగిన; నూపురిత = అందెలు కలగిన; నానా = సమస్త; వేదమున్ = వేదములునునైనది; పాదమున్ = పాదమును.
భావము:- బలిచక్రవర్తి తన రెండు చేతులతోనూ కడగడానికి అనువుగా వామనుడు తన పాదాన్ని సాచాడు. ఆ పాదం యోగులూ, దేవతలూ సేవించునది, వారు కోరుకొనే సంపదలను సమకూర్చునది; భక్తితో వంగిన లక్ష్మిదేవి నొసటి మీది కస్తూరి కుంకుమతో కూడినది; పద్మాల పరిమళం గుబాళించునది; ఆ పాదం వేదాలరాశి అనే మణిమంజీరాలు అలంకరించుకున్నది.

తెభా-8-605-క.
సులోక సముద్ధరణము
నితశ్రీకరణ మఖిల నిగమాంతాలం
ణము భవసంహరణము
రిచరణము నీఁటఁ గడిగె సురోత్తముడున్
.
టీక:- సురలోక = దేవతలు అందఱిని; సముద్ధరణమున్ = చక్కగా కాపాడెడిది; నిరత = కలకాలము; శ్రీకరణ = మేలుకలిగించెడిది; అఖిల = సర్వ; నిగమాంత = వేదాంతములకు; అలంకరణమున్ = అలంకారమైనది; భవ = పునర్జన్మప్రాప్తి; హరణమున్ = పోగొట్టునది; హరి = విష్ణునియొక్క; చరణమున్ = పాదమును; నీటన్ = నీటితో; కడిగెన్ = శుభ్రపరచెను; అసుర = రాక్షసులలో; ఉత్తముడున్ = శ్రేష్ఠుడు.
భావము:- దేవతలను కష్టాలనుండి కాపాడేది, కలకాలమూ మేలుకలిగించేది, సమస్త ఉపనిషత్తులకూ అలంకారం అయినది, భవబంధాలను పోకార్చి మోక్షాన్ని సమకూర్చెడిది, అయిన వామనావతారుడు విష్ణువు యొక్క కుడిపాదమును బలిచక్రవర్తి నీటితో కడిగాడు.

తెభా-8-606-వ.
ఇట్లు ధరణీసుర దక్షిణ చరణ ప్రక్షాళనంబు చేసి వామపాదంబు గడిగి తత్పావన జలంబు శిరంబునం జల్లుకొని వార్చి దేశ కాలాది పరిగణనంబు చేసి .
టీక:- ఇట్లు = ఈ విధముగ; ధరణీసుర = బ్రాహ్మణుని {ధరణీసురుడు - భూమిపైదేవత, విప్రుడు}; దక్షిణ = కుడి; చరణ = పాదమును; ప్రక్షాళనము = కడుగుట; చేసి = చేసి; వామ = ఎడమ; పాదంబున్ = పాదమును; కడిగి = కడిగి; తత్ = ఆ; పావన = పవిత్రమైన; జలంబున్ = నీటిని; శిరంబునన్ = తలపైన; చల్లుకొని = ప్రోక్షించుకొని; వార్చి = ఆచమనముచేసి; దేశ = ప్రదేశము; కాల = కాలము; ఆది = మున్నగువాని; పరిగణన = ఎంచిపలుకుట; చేసి = చేసి.
భావము:- అదేవిధంగా ఆ చక్రవర్తి వామనుని కుడి పాదాన్ని పిమ్మట ఎడమ పాదాన్ని కడిగాడు. పవిత్రమైన ఆ జలాలను నెత్తి మీద చల్లుకున్నాడు. ఆచమనం చేసాడు. దేశమూ కాలమూ మొదలైన వాటిని లెక్కించి (సంకల్పం చెప్పుకుని). . .

తెభా-8-607-శా.
"విప్రాయ ప్రకటవ్రతాయ భవతే విష్ణుస్వరూపాయ వే
ప్రామాణ్యవిదే త్రిపాద ధరణిం దాస్యామి!"యంచుం గ్రియా
క్షిప్రుండై దనుజేశ్వరుండు వడుగుం జే సాఁచి పూజించి "బ్ర
హ్మప్రీత"మ్మని ధారపోసె భువనం బాశ్చర్యముం బొందగన్
.
టీక:- విప్రాయ = బ్రాహ్మణుడవు; ప్రకట = ప్రసిద్ధమైన; వ్రతాయ = నిష్ఠ కలవాడవు; భవతే = నీకు; విష్ణు = విష్ణుమూర్తి యొక్క; స్వరూపాయ = స్వరూపము ఐనవాడవు; వేద = వేదములందలి; ప్రామాణ్య = ప్రమాణములను; విదే = తెలిసివాడవు; త్రి = మూడు (3); పాద = అడుగుల; ధరణిన్ = భూమిని; దాస్యామి = దానముచేయుచుంటిని; అంచున్ = అనుచు; క్రియాక్షిప్రుండు = పనియందు త్వరకలవాడు; ఐ = అయ్యి; దనుజేశ్వరుండు = రాక్షసరాజు; వడుగున్ = బ్రహ్మచారిని; చేన్ = చేయి; చాచి = చాచి; పూజించి = పూజచేసి; బ్రహ్మ = పరబ్రహ్మకి; ప్రీతమ్ము = ప్రీతికలుగగాక; అని = అని; ధారపోసె = ధారపోసెను {ధారపోయు - దానముచేసెడి క్రియలో నీటిధారను దాత చేతినుండి గ్రహీత చేతిలో పడునట్లు పోసెడి విధి}; భువనంబు = జగత్తంతా; ఆశ్చర్యంబున్ = ఆశ్చర్యము; పొందగన్ = పడునట్లుగా.
భావము:- బలిచక్రవర్తి చేతులు సాచి వామనుడిని పూజించాడు. “బ్రాహ్మణుడవూ; ప్రసిద్ధమైన వ్రతం కలవాడవు; విష్ణు స్వరూపుడవూ; వేదాల నియమాలు తెలిసినవాడవూ; అయిన నీకు మూడడుగుల నేల దానం చేస్తున్నాను.” అని పలికి “పరమాత్మునకు ప్రీతి కలుగుగాక.” అంటూ వెనువెంటనే ధారపోసాడు. అదిచూసి విశ్వం అంతా ఆశ్చర్యపోయింది.

తెభా-8-608-వ.
తత్కాలంబున .
టీక:- తత్ = ఆ; కాలంబునన్ = సమయమునందు.
భావము:- ఆసమయంలో. . . .

తెభా-8-609-ఆ.
నీరధారఁ బడఁగ నీక యడ్డంబుగాఁ
లశరంధ్ర మాఁపగాను దెలిసి
రియుఁ గావ్యు నేత్ర టఁ గుశాగ్రంబున
డువ నేకనేత్రుఁ య్యె నతఁడు
.
టీక:- నీరన్ = నీటిని; ధారన్ = ధారగా; పడనీక = పడనీయకుండ; అడ్డంబుగాన్ = అడ్డముగా; కలశ = కలశముయొక్క; రంధ్రమున్ = కన్నమును; ఆపగాను = ఆపివేయగా; తెలిసి = తెలిసికొని; హరియున్ = విష్ణువు; కావ్యు = శుక్రాచార్యుని {కావ్యుడు - భృగువు పుత్రుడైన కవి యొక్క పుత్రుడు, శుక్రుడు}; నేత్రమున్ = కంటిని; అటన్ = అక్కడ; కుశ = దర్భ; అగ్రమునన్ = కొనతో; నడువన్ = పొడువగా; ఏకనేత్రుడు = ఒంటికన్నువాడు; అయ్యెన్ = అయ్యెను; అతడు = అతను.
భావము:- నీళ్ళధార పడకుండా శుక్రాచార్యుడు కలశ రంధ్రానికి అడ్డుపడి ఆపేసాడు. సాక్షాత్తు విష్ణువు అయిన వామనుడు ఆ సంగతి తెలుసుకుని దర్భకొనతో పొడిచాడు. దానివలన శుక్రుడు ఒంటి కన్ను వాడు అయ్యాడు.

తెభా-8-610-వ.
అంత .
టీక:- అంత = అంతట.
భావము:- అలా ఒంటి కన్నువాడై శుక్రాచార్యుడు అడ్డు తప్పుకున్న పిమ్మట. . .

తెభా-8-611-మ.
రారాతి కరాక్షతోజ్ఝిత పవిత్రాంభః కణశ్రేణికిం
లాధీశ్వరుఁ డొడ్డె ఖండిత దివౌస్స్వామిజిన్మస్తముం
లాకర్షణ సుప్రశస్తము రమాకాంతాకచోపాస్తమున్
విలశ్రీ కుచశాత చూచుక తటీవిన్యస్తమున్ హస్తమున్
.
టీక:- అమరారాతి = బలిచక్రవర్తి {అమర + అరాతి (సవర్ణదీర్ఘ సంధి) - దేవతల శత్రువు (బలి)}; కరా = చేతిలోని; అక్షత = క్షయము లేకుండా (ఆటంకము లేకుండా); ఉజ్జిత = విడువబడిన; పవిత్ర = పవిత్రమైన; అంభః = నీటి; కణ = బిందువుల; శ్రేణి = వరుస; కిన్ = కు; కమలాధీశుడు = విష్ణువు {కమలాధీశుడు - కమలా (లక్ష్మీదేవి) అధీశుడు (భర్త), విష్ణువు}; ఒడ్డె = పట్టెను; ఖండిత = తెగగొట్టబడిన; దివౌకస్స్వామి = ఇంద్రుని {దివౌకః+స్వామి - దివౌకః (స్వర్గవాసుల) స్వామి (ప్రభువు), ఇంద్రుడు}; జిత్ = జయించువాని; మస్తమున్ = తల కలదానిని; కమల = లక్ష్మీదేవిని; ఆకర్షణ = ఆకర్షించుటలో; సుప్రశస్తమున్ = మిక్కిలి ప్రసిద్ధమైనదానిని; రమాకాంత = లక్ష్మీదేవి; కచ = శిరోజములకు; ఉపాస్తమున్ = ఉపాస్తి (సేవ) చేయుదానిని; విమల = నిర్మలమైన; శ్రీ = లక్ష్మీదేవి; కుచ = స్తనముల; చూచుక = అగ్రముల; తటీ = ప్రదేశమున; విన్యస్తమున్ = కదలెడి దానిని; హస్తమున్ = చేతిని.
భావము:- ఆటంకం లేకుండా దైవవిద్వేషి బలిచక్రవర్తి చేతిలోనుండి నిరాటంకంగా పవిత్రమైన జలం ధారపోసాడు. పవిత్రమైన ఆ నీటిబిందువులకు ఆ లక్ష్మీపతి వామనుడు తన చెయ్యి ఒడ్డాడు. ఆ చెయ్యి ఎలాంటిది అంటే. రాక్షసుల శిరస్సులు ఖండించునది. లక్ష్మీదేవిని ఆకర్షించడంలో మేలైనది. లక్ష్మీదేవి శిరోజాలను సేవించునది. నిర్మలమైన ఆమె కుచాగ్రముల మీద మర్యాదలు అనుభవించేది.

తెభా-8-612-క.
మునిజన నియమాధారను
నితాసుర యువతి నేత్రలకణ ధారన్
నుజేంద్ర నిరాధారను
జాక్షుఁడు గొనియె బలివిర్జితధారన్
.
టీక:- ముని = మునుల; జన = సమూహముయొక్క; నియమ = నిష్ఠలకు; ఆధారను = ఆధారభూతమైనదానిని; జనిత = కలిగించబడిన; అసుర = రాక్షస; యువతి = స్త్రీల; నేత్రజల = కన్నీటి; కణ = బిందువుల; ధారన్ = ధారకలదానిని; దనుజేంద్ర = బలిచక్రవర్తిని; నిరాధారను = నిరాధారుని చేసెడిదానిని; వనజాక్షుడు = విష్ణువు; కొనియె = గ్రహించెను; బలి = బలిచేత; వివర్జిత = విడువబడిన; ధారన్ = దానజలధారను.
భావము:- బలిచక్రవర్తి అందించిన దానధారను పద్మాలవంటి కన్నులు గలస్వామి వామనుడు స్వీకరించాడు. ఆ జలధార మునుల నియమాలకు ఆధారమైనది. రాక్షసస్త్రీలను కన్నీటి పాలుచేసేది. రాక్షసరాజులను నిరాధారులుగా మార్చేది.

తెభా-8-613-ఆ.
మలనాభు నెఱిఁగి కాలంబు దేశంబు
నెఱిఁగి శుక్రు మాట లెఱిగి నాశ
మెఱిఁగి పాత్ర మనుచు నిచ్చె దానము బలి
హి వదాన్యుఁ డొరుఁడు ఱియుఁ గలఁడె
.
టీక:- కమలనాభున్ = విష్ణుడని; ఎఱిగి = తెలిసి; కాలంబు = కాలప్రభావము; దేశంబు = ప్రదేశప్రభావములను; ఎఱిగి = తెలిసి; శుక్రు = శుక్రుని; మాటలు = మాటలను; ఎఱిగి = తెలిసి; నాశమున్ = కలిగెడిచేటు; ఎఱిగి = తెలిసి; పాత్రము = యోగ్యమైనది; అనుచున్ = అనుచు; ఇచ్చెన్ = ఇచ్చెను; దానమున్ = దానమును; బలి = బలి; మహిన్ = భూమిమీద; వదాన్యుడు = దాత; ఒరుడు = ఇంకొకడు; మఱియున్ = మఱి; కలడె = ఉండగలడా, లేడు.
భావము:- బలిచక్రవర్తి విష్ణుమూర్తిని తెలుసుకున్నాడు. దేశకాలాలు తెలుసుకున్నాడు. శుక్రుని మాటలు అర్థం చేసుకున్నాడు. తనకు చేటువాటిల్లుతుందని తెలుసుకున్నాడు. అయినప్పటికి యోగ్యమైనదిగా భావించి ఆ దాన మిచ్చాడు. లోకంలో అటువంటి మహాదాత మరొకడుంటాడా?

తెభా-8-614-క.
లిచేసిన దానమునకు
ళినాక్షుఁడు నిఖిలభూత నాయకుఁ డగుటం
కల మని దశదిక్కులు
ళిబళి యని పొగడె భూతపంచక మనఘా!

టీక:- బలి = బలి; చేసిన = చేసినట్టి; దానమున్ = దానమున; కున్ = కు; నళినాక్షుండు = విష్ణువు; నిఖిల = సమస్తమైన; భూత = జీవుల; నాయకుడు = ప్రభువు; అగుటన్ = అగుటవలన; కలకలము = కలకల; అని = అని; దశ = పది; దిక్కులు = దిశలు {దశదిక్కులు - 4దిక్కులు 4మూలలు పైన కింద మొత్తం 10వైపులు}; భళిభళి = ఓహో ఓహో; అని = అని; పొగడె = శ్లాఘించెను; భూతపంచకము = పంచభూతములును {పంచభూతములు - 1పృథివి 2అప్పు 3తేజస్సు 4వాయువు 5ఆకాశము}; అనఘా = పుణ్యుడా.
భావము:- ఓ పరీక్షన్మహారాజా! సర్వ భూతాలకూ విష్ణువు అధిపతి కదా. కనుక, ఆయనకు బలిచక్రవర్తి దానం చేయగానే దిక్కులు అన్నీ కళకళలాడాయి. పంచభూతాలూ “భళి భళి” అని పొగిడాయి.

తెభా-8-615-క.
"క్షితిదానమిచ్చు నతఁడును
తికాంక్షఁ బరిగ్రహించు తఁడును దురిత
చ్యుతులై శతవత్సరములు
మఖ లోకమునఁ గ్రీడ లుపుదు రెలమిన్
.
టీక:- క్షితిదానము = భూదానమును; ఇచ్చు = ఇచ్చెడి; అతడున్ = వాడు; అతి = మిక్కిలి; కాంక్షన్ = కోరికతో; పరిగ్రహించు = తీసుకొనెడి; అతడున్ = వాడు; దురిత = పాపములు; చ్యుతులు = నశించినవి; ఐ = అయ్యి; శత = నూరు (100); వత్సరములు = సంవత్సరములు; శతమఖ = ఇంద్రుని; లోకమునన్ = లోకమునందు; క్రీడన్ = విహరించుట; సలుపుదురు = చేసెదరు; ఎలమిన్ = సంతోషముతో.
భావము:- అంతట మాయాబ్రహ్మచారి బలిచక్రవర్తి తో ఇలాఅన్నాడు. “భూమిని దానం ఇచ్చినవాడికి; దానిని ప్రీతితో తీసుకున్నవాడికి పాపాలు నశించిపోతాయి. వారు సంతోషంగా నూరు యాగాలు చేస్తే దక్కే స్వర్గలోకంలో నూరేండ్లు విహరిస్తారు.

తెభా-8-616-వ.
అట్లుగావున నే దానంబును భూదానంబునకు సదృశంబు గానేరదు; గావున వసుంధరా దానం బిచ్చితి; వుభయలోకంబులం గీర్తి సుకృతంబులు పడయు"మని పలికి య మ్మాయావటుం డిట్లనియె .
టీక:- అట్లుగావున = అందుచేత; ఏ = ఎట్టి; దానంబును = దానముకూడ; భూదానంబున్ = భూదానమున; కున్ = కు; సదృశంబున్ = సమానమైనది; కానేరదు = కాలేదు; కావున = అందుచేత; వసుంధరాదానంబు = భూదానము; ఇచ్చితివి = ఇచ్చినావు; ఉభయ = ఇహపరరెండు; లోకంబులన్ = లోకములలోను; కీర్తి = యశము; సుకృతంబులు = పుణ్యములు; పడయుము = పొందుదువుగాక; అని = అని; పలికి = చెప్పి; ఆ = ఆ; మాయా = కపట; వటుండు = బ్రహ్మచారి; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- అందుచేత, ఏదానమూ భూదానానికి సమానంకాదు. భూదానం ఇచ్చిన నీకు ఇహ పర లోకాలు రెంటిలోనూ కీర్తీ, పుణ్యమూ కలుగుతుంది.” అని పలికి మాయాబ్రహ్మచారి మళ్లీ ఇలా అన్నాడు.

తెభా-8-617-క.
"ఇదియేమి వేఁడితని నీ
దివగవక ధారపోయుమా; సత్యము పెం
పొవఁగ గోరిన యర్థం
బిది యిచ్చుట ముజ్జగంబు లిచ్చుట మాకున్."

టీక:- ఇది = దీనిని; ఏమి = దేనికి; వేడితి = అడిగితిని; అని = అని; నీ = నీ యొక్క; మదిన్ = మనసున; వగవక = చితించకుండ; ధారపోయుమా = దానమిమ్ము; సత్యమున్ = సత్యము; పెంపొదవన్ = పెంపొందేవిధముగ; కోరిన = అడిగిన; అర్థంబు = కోరిక; ఇది = ఇది; ఇచ్చుట = ఇచ్చుట; ముజ్జగంబులున్ = ముల్లోకములను; ఇచ్చుట = ఇచ్చుట; మాకున్ = మాకు.
భావము:- “నేనెందుకు దీనిని అడిగానని నీ మనస్సులో చింతించకుండా దానమియ్యి. సత్యం పెంపొందే విధంగా దాన మియ్యి. ఈ మూడడుగులూ ఇస్తే మాకు మూడు లోకాలూ ఇచ్చినట్లే.”

తెభా-8-618-వ.
అని పలికిన వటుని పలుకులకు హర్ష నిర్భర చేతస్కుండై వైరోచనుండు .
టీక:- అని = అని; పలికిన = అనిన; వటుని = బ్రహ్మచారి; పలుకుల = మాటల; కున్ = కు; హర్ష = సంతోషముతో; నిర్భర = మిక్కిలి నిండిన; చేతస్కుండు = మనసు కలవాడు; ఐ = అయ్యి; వైరోచనుండు = బలిచక్రవర్తి {వైరోచనుడు - విరోచనునిపుత్రుడు, బలి};
భావము:- ఇలా పలికిన వామనుడి పలుకలకు విరోచనుడి కొడుకు అయిన బలి మనస్సు ఎంతగానో సంతోషంతో నిండిపోయింది.

తెభా-8-619-ఆ.
పుట్టి నేర్చుకొనెనొ పుట్టక నేర్చెనో
చిట్టి బుద్ధు లిట్టి పొట్టివడుగు
పొట్ట నున్న వెల్ల బూమెలు” నని నవ్వి
యెలమి ధరణి దాన మిచ్చె నపుడు
.
టీక:- పుట్టి = పుట్టినతరవాత; నేర్చుకొనెనొ = నేర్చుకొన్నాడో లేక; పుట్టక = పుట్టుటకుముందే; నేర్చెనో = నేర్చుకొన్నాడో; చిట్టి = లీలా, ముద్దుల {చిట్టి - చిట్టకము కలవి, లీలమాత్రపు}; బుద్ధులు = బుద్ధులు; ఇట్టి = ఇటువంటి; పొట్టి = పొట్టివాడైన; వడుగు = బ్రహ్మచారి; పొట్టన్ = కడుపునిండా; ఉన్నవి = ఉన్నట్టివి; ఎల్ల = అన్ని; బూమెలున్ = మాయలు; అని = అని; నవ్వి = నవ్వి; ఎలమిన్ = సంతోషముతో; ధరణిదానమున్ = భూదానమును; ఇచ్చెన్ = ఇచ్చెను; అపుడు = అప్పుడు.
భావము:- ఈ పొట్టి బ్రహ్మచారి ఈ చిట్టి బుద్ధులు పుట్టేకా నేర్చుకున్నాడా? పుట్టకముందే నేర్చుకున్నాడా? ఇతని పొట్ట నిండా మాయలే అంటు నవ్వి సంతోషంగా భూదానం యిచ్చాడు.

తెభా-8-620-ఆ.
గ్రహ మునీంద్ర సిద్ధ గంధర్వ కిన్నర
క్ష పక్షి దేవతాహి పతులు
పొగడి రతని పెంపుఁ; బుష్పవర్షంబులు
గురిసె దేవతూర్యకోటి మొరసె
.
టీక:- గ్రహ = గ్రహములు; ముని = మునులలో; ఇంద్ర = శ్రేష్ఠులు; సిద్ధ = సిద్ధులు; గంధర్వ = గంధర్వులు; కిన్నర = కిన్నరలు; యక్ష = యక్షులు; పక్షి = గరుడులు; దేవత = దేవతలు; అహిపతులు = సర్పరాజులు; పొగిడిరి = శ్లాఘించిరి; అతని = అతని యొక్క; పెంపున్ = ఔదార్యమును; పుష్ప = పూల; వర్షంబులున్ = వానలు; కురిసె = కురిసెను; దేవ = దివ్య; తూర్య = వాద్య; కోటి = సమూహములు; మొరసెన్ = మోగినవి.
భావము:- బలిచక్రవర్తి ఔదార్యాన్ని గ్రహాలూ, మునీశ్వరులూ. సిద్ధులూ, గంధర్వులూ, కిన్నరులూ, యక్షులూ, గరుడులూ, దేవతలూ, సర్పరాజులూ అందరూ అతని గొప్పదనాన్ని పొగిడారు. పూలవానలు కురిపించారు. దేవతల విజయ దుందుభులు మారుమ్రోగాయి.

తెభా-8-621-వ.
ఇట్లు ధారా పరిగ్రహంబు చేసి .
టీక:- ఇట్లు = ఈ విధముగ; ధారా = దానజలధారను; పరిగ్రహంబు = తీసుకొనుట; చేసి = చేసి.
భావము:- ఈ విధంగా వామనుడు దానాన్ని గ్రహించి. . . .