పోతన తెలుగు భాగవతము/అష్ఠమ స్కంధము/లక్ష్మీదేవి పుట్టుట

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

లక్ష్మీదేవి పుట్టుట

తెలుగు భాగవతము (మూస:పోతన తెలుగు భాగవతము/అష్ఠమ స్కంధము/)
రచయిత: పోతన


(తెభా-8-265-క.)[మార్చు]

తొ లుకారు మెఱుఁగు కైవడి
తళ మని మేను మెఱవ గధగ మనుచున్
లుముల నీనెడు చూపులఁ
జె లువంబుల మొదలి టెంకి సిరి పుట్టె నృపా!

(తెభా-8-266-సీ.)[మార్చు]

పాలమున్నీటి లోలి మీఁది మీఁగడ;
మిసిమి జిడ్డునఁ జేసి మేను పడసి
క్రొక్కారు మెఱుఁగుల కొనల క్రొత్తళుకుల;
మేనిచే గలనిగ్గు మెఱుఁగు జేసి
నాఁటి నాఁటికిఁ బ్రోది వకంపుఁదీవల;
నునుఁ బోద నెయ్యంబు నూలుకొలిపి
క్రొవ్వారు కెందమ్మి కొలఁకునఁ బ్రొద్దునఁ;
బొలసిన వలపులఁ బ్రోది పెట్టి

(తెభా-8-266.1-తే.)[మార్చు]

సిడి చంపక దామంబు బాగుఁగూర్చి
వాలు క్రొన్నెల చెలువున వాడిఁ దీర్చి
జాణతనమునఁ జేతుల డ్డు విడిచి
లువ యీ కొమ్మ నొగిఁ జేసినాఁడు నేఁడు.

(తెభా-8-267-క.)[మార్చు]

కెం పారెడు నధరంబును
జం పారెడి నడుము సతికి శంపారుచులన్
సొం పారు మోముఁ గన్నులుఁ
బెం పారుచు నొప్పుగొప్పు పిఱుఁదును గుచముల్.

(తెభా-8-268-వ.)[మార్చు]

అని జనులు పొగడుచుండ

(తెభా-8-269-సీ.)[మార్చు]

రుణికి మంగళస్నానంబు చేయింత;
ని పెట్టె నింద్రుఁ డర్ఘమైన
ణిమయ పీఠంబు; మంగళవతులైన;
వేలుపు గరితలు విమల తోయ
పూర్ణంబులై యున్న పుణ్యాహ కలశంబు;
లిడిరి; పల్లవముల నిచ్చె భూమిఁ;
డిమి గోవులు పంచవ్యంబులను నిచ్చె;
లసి వసంతుండు ధు వొసంగె;

(తెభా-8-269.1-తే.)[మార్చు]

మునులు గల్పంబుఁ జెప్పిరి; మొగిలుగములు
ణవ గోముఖ కాహళ టహ మురజ
శంఖ వల్లకీ వేణు నిస్వనము లిచ్చెఁ;
బాడి రాడిరి గంధర్వ తులు సతులు.

(తెభా-8-270-క.)[మార్చు]

పం డిత సూక్తుల తోడుతఁ
దుం డంబులు చాఁచి తీర్థ తోయములెల్లం
దుం ముల ముంచి దిగ్వే
దం డంబులు జలక మార్చెఁ రుణీ మణికిన్.

(తెభా-8-271-సీ.)[మార్చు]

ట్టంగఁ బచ్చని ట్టుఁబుట్టపు దోయి;
ముదితకుఁ దెచ్చి సముద్రుఁ డిచ్చె;
త్తాళి నికరంబు ధ్వాశ మూఁగిన;
వైజయంతీమాల రుణుఁ డిచ్చెఁ;
గాంచన కేయూర కంకణ కింకిణీ;
టకాదులను విశ్వర్మ యిచ్చె;
భారతి యొక మంచి తారహారము నిచ్చె;
బాణిపద్మము నిచ్చెఁ ద్మభవుఁడు;

(తెభా-8-271.1-ఆ.)[మార్చు]

కుండలివ్రజంబు గుండలముల నిచ్చె;
శ్రుతులు భద్రమైన నుతులు జేసె;
నెల్ల లోకములకు నేలిక సానివై
బ్రతికె దనుచు దిశలు లికె నధిప!

(తెభా-8-272-వ.)[మార్చు]

మఱియును

(తెభా-8-273-సీ.)[మార్చు]

పలుకుల నమృతంబు చిలుక నెవ్వానితో;
భాషించె వాఁడెపో బ్రహ్మ యనఁగ
నెలయించి కెంగేల నెవ్వని వరియించె;
వాఁడె లోకములకు ల్లభుండు
మెయిదీఁగ నెవ్వని మేనితోఁ గదియించె;
వాఁడెపో పరమ సర్వజ్ఞమూర్తి
నెలతుక యెప్పుడు నివసించు నేయింట;
నాయిల్లు పరమగు మృత పదము

(తెభా-8-273.1-ఆ.)[మార్చు]

నింతి చూపు వాఱె నెచ్చోటి కచ్చోటు
జిష్ణుధనద ధర్మ జీవితంబు
గొమ్మ చిన్న నగవు గురుతర దుఃఖ ని
వారణంబు సృష్టి కారణంబు.

(తెభా-8-274-వ.)[మార్చు]

మఱియు నక్కొమ్మ నెమ్మనంబున.

(తెభా-8-275-సీ.)[మార్చు]

భావించి యొకమాటు బ్రహ్మాండ మంతయు;
నాటల బొమ్మరిల్లని తలంచుఁ
బోలించి యొకమాటు భువనంబు లన్నియుఁ;
న యింటిలో దొంతుని తలంచుఁ
బాటించి యొకమాటు బ్రహ్మాది సురులను;
న యింటిలో బొమ్మని తలంచు
గొనకొని యొకమాటు కుంభినీచక్రంబు;
లవడ బొమ్మపీఁని తలంచు

(తెభా-8-275.1-ఆ.)[మార్చు]

సొలసి యొక్కమాటు సూర్యేందురోచుల
చటి దీపకళిక ని తలంచు
భామ యొక్క మాటు భారతీదుర్గల
నాత్మసఖు లటంచు నాదరించు.

(తెభా-8-276-వ.)[మార్చు]

తదనంతరంబ.

(తెభా-8-277-ఆ.)[మార్చు]

చంచరీకనికర ఝంకార నినదంబు
నరు నుత్పలముల దండ పెట్టి
మేఘకోటి నడిమి మెఱుఁగుఁ బుత్తడి మాడ్కి
సురల నడుమ నిల్చె సుందరాంగి.

(తెభా-8-278-క.)[మార్చు]

న్నులు నా చన్నులు
నా కురు లా పిఱుఁదు నడుము నా ముఖమా న
వ్యా కారముఁ గని వేల్పులు
చీ కాకునఁ బడిరి కలఁగి శ్రీహరి దక్కన్.
 : : 21-05-2016: : గణనాధ్యాయి 13:41, 19 సెప్టెంబరు 2016 (UTC)