పోతన తెలుగు భాగవతము/అష్ఠమ స్కంధము/మత్స్యావతార కథా ప్రారంభం

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

మత్స్యావతారకథాప్రారంభం

తెలుగు భాగవతము (మూస:పోతన తెలుగు భాగవతము/అష్ఠమ స్కంధము/)
రచయిత: పోతన


(తెభా-8-692-సీ.)[మార్చు]

విమలాత్మ! విన మాకు వేడ్క యయ్యెడి; మున్ను;
రి మత్స్యమైన వృత్తాంతమెల్లఁ;
ర్మబద్ధుని భంగి నుఁ డీశ్వరుఁడు లోక;
నిందితంబై తమోనిలయమైన
మీనరూపము నేల మే లని ధరియించె? ;
నెక్కడ వర్తించె? నేమి చేసె?
నాద్యమై వెలయు న య్యవతారమునకు నె;
య్యది కారణంబు? గార్యాంశ మెట్లు?

(తెభా-8-692.1-ఆ.)[మార్చు]

నీవు దగుదు మాకు నిఖిలంబు నెఱిఁగింపఁ
దెలియఁ జెప్పవలయు, దేవదేవు
రిత మఖిలలోక సౌభాగ్య కరణంబు
గాదె? విస్తరింపు క్రమముతోడ.

(తెభా-8-693-వ.)[మార్చు]

అని మునిజనంబులు సూతు నడిగిన నతం డిట్లనియె మీర లడిగిన యీ యర్థంబుఁ బరీక్షిన్నరేంద్రుం డడిగిన భగవంతుం డగు బాదరా యణి యిట్లనియె.

(తెభా-8-694-సీ.)[మార్చు]

విభుఁ డీశ్వరుఁడు వేదవిప్రగోసురసాధు;
ర్మార్థములఁ గావఁ నువుఁ దాల్చి,
గాలిచందంబున నరూపములయందుఁ;
నురూపములయందుఁ గిలియుండు;
నెక్కువఁ దక్కువ లెన్నఁడు నొందక;
నిర్గుణత్వంబున నెఱియు ఘనుఁడు;
గురుతయుఁ గొఱఁతయు గుణసంగతివహించు;
నుజేశ! చోద్యమే త్స్య మగుట?

(తెభా-8-694.1-తే.)[మార్చు]

వినుము పోయిన కల్పాంతవేళఁ దొల్లి
ద్రవిళదేశపురాజు సత్యవ్రతుండు
నీరు ద్రావుచు హరిఁగూర్చి నిష్ఠతోడఁ
పముఁ గావించె నొకయేటి టము నందు.

(తెభా-8-695-వ.)[మార్చు]

మఱియు, నొక్కనాఁ డమ్మేదినీ కాంతుండు గృతమాలిక యను నేటి పొంత హరిసమర్పణంబుగా జలతర్పణంబు జేయు చున్న సమ యంబున నా రాజు దోసిట నొక్క మీనుపిల్ల దవిలివచ్చిన నులికిపడి, మరలం దరంగిణీ జలంబు నందు శకుల శాబకంబు విడిచె; నట్లు విడి వడి నీటిలో నుండి జలచరపోతంబు భూతలేశ్వరున కి ట్లనియె.

(తెభా-8-696-మత్త.)[మార్చు]

పా టువచ్చిన జ్ఞాతి ఘాతులు పాపజాతి ఝషంబు లీ
యే టఁ గొండొక మీనుపిల్లల నేఱి పట్టి వధింప న
చ్ఛో టు నుండక నీదు దోసిలి చొచ్చి వచ్చిన నన్ను న
ట్టే టఁ ద్రోవఁగఁ బాడియే? కృప యింత లేక దయానిధీ!

(తెభా-8-697-ఆ.)[మార్చు]

లలు దారు నింక చ్చి జాలరి వేఁట
కాఱు నేఱు గలఁచి కారపెట్టి
మిడిసి పోవనీక మెడఁ బట్టుకొనియెద;
ప్పు డెందుఁ జొత్తు? నఘచరిత!

(తెభా-8-698-క.)[మార్చు]

క్షించు నొండె ఝషములు
శి క్షింతురు ధూర్తు లొండెఁ; జెడకుండ ననున్
క్షింపు దీనవత్సల!
ప్ర క్షీణులఁ గాచుకంటె భాగ్యము గలదే?

(తెభా-8-699-వ.)[మార్చు]

అనిన విని కరుణాకరుండగు న వ్విభుండు మెల్లన య య్యంభశ్చర డింభకంబునుఁ గమండలు జలంబునం బెట్టి తన నెలవునకుం గొని పోయె, నదియు నొక్క రాత్రంబునం గుండిక నిండి తనకు నుండ నిమ్ము చాలక రాజన్యున కి ట్లనియె.

(తెభా-8-700-క.)[మార్చు]

ఉం నిదిఁ గొంచె మెంతయు
నొం డొకటిం దెమ్ము భూవరోత్తమ! యనుడున్
గం కముఁ దెచ్చి విడిచెను
మం లపతి సలిల కలశ ధ్యమున నృపా!

(తెభా-8-701-వ.)[మార్చు]

అదియును ముహూర్తమాత్రంబునకు మూఁడు చేతుల నిడుపై యుదంచంబు నిండి పట్టు చాలక వేఱొండుఁ దె మ్మనవుడు నా రాచ పట్టి కరుణాగుణంబునకు నాటపట్టుఁ గావున గండకంబు నొండొక్క చిఱుతమడుఁగున నునిచె; నదియు నా సరోవర జలంబునకు నగ్గలం బై తనకు సంచరింప నది గొంచెం బని పలికినం బుడమిఱేడు మంచి వాఁడగుటం జేసి యా కంచరంబు నుదంచిత జలాస్పదంబైన హ్రదం బునందు నిడియె; నదియు నా సలిలాశయంబునకును నధికంబై పెరుఁగ నిమ్ము చాలదని చెప్పికొనిన నప్పుణ్యుం డొప్పెడి నడవడిం దప్పని వాఁడైన కతంబున న మ్మహామీనంబును మహార్ణవంబున విడిచె; నదియును మకరాకరంబునం బడి రాజున కిట్లను "పెను మొ సళ్ళు ముసరికొని కసిమసంగి మ్రింగెడి; నింతకాలంబు నడపి కడ పట దిగవిడువకు వెడలఁ దిగువు" మని యెలింగింప దెలిసి కడపట యన్నీటితిరుగుడు ప్రోడకుం బుడమిఱేఁ డిట్లనియె.

(తెభా-8-702-సీ.)[మార్చు]

క దినంబున శతయోజనమాత్రము;
విస్తరించెదు నీవు; వినము చూడ
మిటువంటి ఝషముల నెన్నఁడు నెఱుఁగము;
మీనజాతుల కిట్టి మేను గలదె?
యేమిటి కెవ్వఁడ? వీ లీలఁ ద్రిప్పెదు;
రుణ నా పన్నులఁ గావ వేఁడి
యంభశ్చరంబైన రివి నే నెఱిఁగితి;
వ్యయ నారాయణాభిధాన

(తెభా-8-702.1-తే.)[మార్చు]

నన సంస్థితి సంహార తురచిత్త!
దీనులకు భక్తులకు మాకు దిక్కు నీవ;
నీదు లీలావతారముల్ నిఖిలభూత
భూతి హేతువుల్ మ్రొక్కెదఁ బురుషవర్య!

(తెభా-8-703-క.)[మార్చు]

రులముఁ గాము చిత్సం
తులము మా పాలి నీవుఁ లిగితి భక్త
స్థి తుఁడవగు నిన్ను నెప్పుడు
తి చేసినవాని కేల నాశముఁ గలుగున్.

(తెభా-8-704-క.)[మార్చు]

శ్రీ లనాకుచవేదికఁ
గే ళీపరతంత్రబుద్ధిఁ గ్రీడించు సుఖా
లో లుఁడవు దామసాకృతి
నే లా మత్స్యంబ వైతి వెఱిఁగింపు హరీ!
 : : 21-05-2016: : గణనాధ్యాయి 11:11, 23 సెప్టెంబరు 2016 (UTC)