పోతన తెలుగు భాగవతము/అష్ఠమ స్కంధము/ప్రహ్లా దాగమనము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

ప్రహ్లాదాగమనము

తెలుగు భాగవతము (మూస:పోతన తెలుగు భాగవతము/అష్ఠమ స్కంధము/)
రచయిత: పోతన


(తెభా-8-651-వ.)[మార్చు]

ఇట్లు సమాగతుండైన తమ తాతం గనుఁగొని విరోచన నందనుండు వారుణపాశబద్ధుండుఁ గావునఁ దనకుం దగిన నమస్కారంబు జేయ రామింజేసి సంకులాశ్రువిలోల లోచనుండై సిగ్గుపడి నత శిరస్కుండై నమ్రభావంబున మ్రొక్కు చెల్లించె; నంతఁ బ్రహ్లాదుఁడు ముఖమండపంబున సునందాది పరిచర సమేతుండై కూర్చున్న వామనదేవునిం గని యానంద బాష్పజలంబులుఁ బులకాకుంరంబులున్ నెరయ దండప్రణామం బాచరించి యిట్లని విన్నవించె.

(తెభా-8-652-సీ.)[మార్చు]

తనికి మున్ను నీ వింద్రపదం బిచ్చి;
నేఁడు త్రిప్పుటయును నెఱయమేలు
మోహనా హంకృతి మూలంబు గర్వాంధ;
మస వికారంబు దాని మాన్పి
రుణ రక్షించుటఁగాక బంధించుటే? ;
త్త్వజ్ఞునకు మహేంద్రత్వమేల?
నీ పాదకమలంబు నియతిఁ గొల్చిన దాని;
బోలునే సురరాజ్య భోగపరత?

(తెభా-8-652.1-తే.)[మార్చు]

ర్వ మేపారఁ గన్నులు గానరావు;
చెవులు వినరావు; చిత్తంబు చిక్కుపడును;
ఱచు నీ సేవలన్నియు హిమ మాన్పి
మేలు చేసితి నీ మేటి మేర చూపి.

(తెభా-8-653-వ.)[మార్చు]

అని పలికి జగదీశ్వరుండును నిఖిలలోక సాక్షియు నగు నారాయణ దేవునకు నమస్కరించి, ప్రహ్లాదుండు పలుకుచున్న సమయంబున.

(తెభా-8-654-మ.)[మార్చు]

మత్తద్విపయాన యై కుచ నిరుంచ్ఛోళ సంవ్యానయై
ధృ భాష్పాంబు వితాన యై కరయుగాధీ నాలికస్థానయై
తిబిక్షాం మమ దేహి కోమలమతే! ద్మాపతే! యంచుఁ ద
త్స తి వింద్యావళి చేరవచ్చెఁ ద్రిజగద్రక్షామనున్ వామనున్.

(తెభా-8-655-వ.)[మార్చు]

వచ్చి యచ్చేడియ తచ్చరణ సమీపంబునం బ్రణతయై నిలువంబడి యిట్లనియె.

(తెభా-8-656-క.)[మార్చు]

నీ కుం గ్రీడార్థము లగు
లో కంబులఁ జూచి పరులు లోకులు కుమతుల్
లో కాధీశుల మందురు
లో ములకు రాజవీవ లోకస్తుత్యా!

(తెభా-8-657-క.)[మార్చు]

కా నఁడు పొమ్ము లే దీ
రా నఁడు జగత్త్ర యైక రాజ్యము నిచ్చెన్
నా యితుఁ గట్టనేటికి?
శ్రీ యితాచిత్తచోర! శ్రితమందారా!
 : : 21-05-2016: : గణనాధ్యాయి 11:04, 23 సెప్టెంబరు 2016 (UTC)