పోతన తెలుగు భాగవతము/అష్ఠమ స్కంధము/త్రివిక్రమ స్ఫురణంబు

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

త్రివిక్రమస్ఫురణంబు

తెలుగు భాగవతము (మూస:పోతన తెలుగు భాగవతము/అష్ఠమ స్కంధము/)
రచయిత: పోతన


(తెభా-8-622-శా.)[మార్చు]

ఇం తింతై, వటుఁడింతయై మఱియుఁ దా నింతై నభోవీథిపై
నం తై తోయదమండలాగ్రమున కల్లంతై ప్రభారాశిపై
నం తై చంద్రుని కంతయై ధ్రువునిపై నంతై మహర్వాటిపై
నం తై సత్యపదోన్నతుం డగుచు బ్రహ్మాండాంత సంవర్ధియై.

(తెభా-8-623-మ.)[మార్చు]

విబింబం బుపమింపఁ బాత్రమగు ఛత్రంబై శిరోరత్నమై
శ్ర ణాలంకృతియై గళాభరణమై సౌవర్ణకేయూరమై
విమత్కంకణమై కటిస్థలి నుదంద్ఘంటయై నూపుర
ప్ర రంబై పదపీఠమై వటుఁడు దా బ్రహ్మాండమున్ నిండుచోన్.

(తెభా-8-624-వ.)[మార్చు]

ఇట్లు విష్ణుండు గుణత్రయాత్మకంబగు విశ్వరూపంబు ధరియించి భువియును, నభంబును, దివంబును, దిశలును, దిశాఛిద్రంబు లును, సముద్రంబులునుఁ, జలదచల దఖిల భూతనివహంబులుం దానయై యేకీభవించి, క్రమక్రమంబున భూలోకంబునకుం బొడవై భువర్లో కంబు నతిక్రమించి, సువర్లోకంబును దలకడచి, మహర్లోకంబు దాఁటి, జనలోకంబునకు మీఁదై, తపంబునకు నుచ్ఛ్రితుండై, సత్యలోకంబు కంటె నౌన్నత్యంబు వహించి, యెడ లిఱుములు సందులు రంధ్ర ములు లేకుండ నిండి, మహాదేహ మహితుండై చరణతలంబున రసాతలంబునుఁ, బాదంబుల మహియును, జంఘల మహీధ్రంబు లును, జానువులఁ బతత్త్ర్రిసముదయంబులును, నూరువుల నింద్రసేన మరుద్గణంబులును, వాసస్థ్సలంబున సంధ్యయు, గుహ్యంబునఁ బ్రజాపతులును, జఘనంబున దనుజులును, నాభిని నభంబును, నుదరంబున నుదధిసప్తకంబును, నురంబున దారకానికరంబును, హృదయంబున ధర్మంబును, నురోజంబుల ఋతసత్యంబులును, మనంబునఁ జంద్రుండును, వక్షంబున గమలహస్త యగు లక్ష్మియుఁ, గంఠంబున సామాది సమస్త వేదంబులును, భుజంబులఁ బురంద రాది దేవతలునుఁ, గర్ణంబుల దిశలును, శిరంబున నాకంబును, శిరో జంబుల మేఘంబులును, నాసాపుటంబున వాయువును, నయ నంబుల సూర్యుండును, వదనంబున వహ్నియు, వాణి నఖిలచ్ఛంద స్సముదయంబును, రసనంబున జలేశుండును, భ్రూయుగళం బున విధినిషేధంబులును, ఱెప్పల నహోరాత్రంబులును, లలాటం బునఁ గోపంబును, నధరంబున లోభంబును, స్పర్శంబునఁ గామం బును, రేతంబున జలంబును, బృష్ఠంబున నధర్మంబును, గ్రమణం బుల యజ్ఞంబులును, ఛాయల మృత్యువును, నగవులవలన ననేక మాయావిశేషంబులును, రోమంబుల నోషధులును, నాడీప్రదేశం బుల నదులును, నఖంబుల శిలలును, బుద్ధి నజుండును, బ్రాణం బుల దేవర్షిగణంబులును, గాత్రంబున జంగమ స్థావర జంతు సంఘం బులును గలవాఁడయి, జలధరనినద శంఖ శార్ఙ సుదర్శన గదాదండ ఖ డ్గాక్షయ బాణతూణీర విభ్రాజితుండును, మకరకుండల కిరీట కే యూర హార కటక కంకణ కౌస్తుభమణి మేఖలాంబర వనమాలికా విరాజితుండును, సునంద నంద జయ విజయ ప్రముఖ పరిచర వాహినీ సందోహ పరివృతుండును, నమేయ తేజోవిరాజితుండును, నై బ్రహ్మాండంబు దన మేనికప్పు తెఱంగున నుండ విజృంభించి.

(తెభా-8-625-మ.)[మార్చు]

పాదంబున భూమి గప్పి దివి వే ఱొంటన్ నిరోధించి యొం
డొ టన్ మీఁది జగంబు లెల్లఁ దొడి, నొండొంటిన్ విలంఘించి. ప
ట్ట బ్రహ్మాండకటాహముం బెటిలి వేండ్రంబై పరుల్ గానరా
కొ కఁడై వాగ్దృగలభ్యుఁడై హరి విభుం డొప్పారె విశ్వాకృతిన్.

(తెభా-8-626-ఆ.)[మార్చు]

క పదంబు క్రింద నుర్వి పద్మము నంటి
కొన్న పంకలవము కొమరుఁ దాల్చె;
నొకటి మీఁదఁ దమ్మి కొదిఁగిన తేఁటినా
వెలసె మిన్ను నృప! త్రివిక్రమమున.

(తెభా-8-627-వ.)[మార్చు]

తత్సమయంబున.

(తెభా-8-628-ఆ.)[మార్చు]

గము లెల్ల దాఁటి నిన త్రివిక్రము
రణనఖర చంద్ర చంద్రికలను
బొనుఁగు పడియె సత్యమున బ్రహ్మతేజంబు
దివసకరుని రుచుల దివియ బోలె.

(తెభా-8-629-సీ.)[మార్చు]

వబంధములఁ బాసి బ్రహ్మలోకంబునఁ;
గాపురంబులు చేయు నులు రాజు
లా మరీచ్యాదులు, నా సనందాదులు;
నా దివ్యయోగీంద్రు చట నెపుడు
మూర్తిమంతంబులై మ్రోయు పురాణ త;
ర్కామ్నాయ నియమేతిహాస ధర్మ
సంహితాదులు గురుజ్ఞానాగ్నినిర్దగ్ద;
ర్ములై మఱియును లుగునట్టి

(తెభా-8-629.1-తే.)[మార్చు]

వార లెల్లఁ జొచ్చి చ్చి సర్వాధిపు
నంఘ్రిఁ జూచి మ్రొక్కి ధిక భక్తిఁ
మ మనంబు లందుఁ లచు నిధానంబుఁ
గంటి మనుచు నేఁడు మంటి మనుచు.

(తెభా-8-630-మ.)[మార్చు]

పుట్టిల్లిదె పొమ్మటంచు నజుఁడుం న్నాభిపంకేరుహం
బు నిరీక్షించి నటించి యున్నత పదంబుం జూచి తత్పాదసే
ముం జేసెఁ గమండలూదకములం ల్లించి; తత్తోయముల్
వి నువీథిం బ్రవహించె దేవనదినా విశ్వాత్ముకీర్తిప్రభన్.

(తెభా-8-631-వ.)[మార్చు]

తత్సమయంబున.

(తెభా-8-632-సీ.)[మార్చు]

యోగమార్గంబున నూహించి బహువిధ;
పుష్పదామంబులఁ బూజ చేసి
దివ్యగంధంబులుఁ దెచ్చి సమర్పించి;
ధూపదీపములఁ దోడ్తోడ నిచ్చి
భూరి లాజాక్షతంబులు జల్లి ఫలములుఁ;
గానిక లిచ్చి రాములఁ బొగడి
శంఖాదిరవములు యఘోషములుఁ జేసి;
రుణాంబునిధి! త్రివిక్రమ! యటంచు

(తెభా-8-632.1-ఆ.)[మార్చు]

బ్రహ్మ మొదలు లోకపాలురుఁ గొనియాడి;
రెల్ల దిశల వనచరేశ్వరుండు
జాంబవంతుఁ డరిగి చాటె భేరిధ్వని
వెలయఁ జేసి విష్ణు విజయ మనుచు.

(తెభా-8-633-క.)[మార్చు]

న్నిజగంబులఁ దానై
యు న్న జగన్నాథుఁ జూడ నొగి భావింపం
న్నందక మన మందక
న్నుతులం జేసి రపుడు భ్యులు బలియున్.
 : : 21-05-2016: : గణనాధ్యాయి 10:59, 23 సెప్టెంబరు 2016 (UTC)