పోతన తెలుగు భాగవతము/అష్ఠమ స్కంధము/జంభాసురుని వృత్తాంతము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

జంభాసురుని వృత్తాంతము

తెలుగు భాగవతము (మూస:పోతన తెలుగు భాగవతము/అష్ఠమ స్కంధము/)
రచయిత: పోతన


(తెభా-8-359-క.)[మార్చు]

చె లికాని పాటుఁ గనుఁగొని
లి సఖుఁడగు జంభుఁ డతుల బాహాశక్తిం
జె లితనము చాల నెఱపుచు
ని లునిలు మని వీఁకఁ దాఁకె నిర్జర నాథున్.

(తెభా-8-360-క.)[మార్చు]

పం చానన వాహనుఁడై
చం ద్గద జంభుఁ డెత్తి శైలారిని దాఁ
కిం చి సురేభంబును నొ
ప్పిం చి విజృంభించి యార్చిపేర్చెం గడిమిన్.

(తెభా-8-361-క.)[మార్చు]

వీఁ చెడి ఘనగదాహతిఁ
దోఁ యు గదలింపలేక దుస్సహపీడన్
మోఁ రిలఁ బడియె నేలను
సోఁ కోర్వక దిగ్గజంబు సుడిసుడి గొంచున్.

(తెభా-8-362-వ.)[మార్చు]

అయ్యెడ

(తెభా-8-363-క.)[మార్చు]

సా థి వేయు హయంబుల
తే రాయిత పఱచి తేర దేవేంద్రుఁడు దా
నా రోహించెను దైత్యుఁడు
దా త మాతలిని శూలధారం బొడిచెన్.

(తెభా-8-364-ఆ.)[మార్చు]

శూల నిహతి నొంది స్రుక్కక యార్చిన
సూతు వెఱకు మంచు సురవిభుండు
వాని శిరముఁ దునిమె జ్రఘాతంబున
దైత్య సేన లెల్ల ల్ల డిల్ల.

(తెభా-8-365-చ.)[మార్చు]

ని సురనాథుచేఁ గలన జంభుఁడు చచ్చుట నారదుండు చె
ప్పి విని వాని భ్రాతలు గభీర బలాధికుఁ డా బలుండు పా
ముచు లా పురందరునిఁ గాంచి ఖరోక్తులఁ దూలనాడుచున్
జలధారలన్ నగముఁ ప్పిన చాడ్పునఁ గప్పి రమ్ములన్.

(తెభా-8-366-సీ.)[మార్చు]

విబుధలోకేంద్రుని వేయుగుఱ్ఱంబుల;
న్ని కోలల బలుఁ దర నేసె
నిన్నూట మాతలి నిన్నూట రథమును;
నా రీతి నింద్రు ప్రత్యంగకమును
వేధించెఁ; బాకుండు వింట వాఁ డస్త్రంబు;
లేయుటఁ దొడుగుట యెఱుఁగరాదు;
నక పుంఖంబుల కాండంబు లొక పది;
యేనింట నముచియు నేసి యార్చె;

(తెభా-8-366.1-ఆ.)[మార్చు]

లిమి నిట్లు ముగురు గవాని రథ సూత
హితు ముంచి రస్త్ర జాలములను
నజలోక సఖుని వాన కాలంబున
మొగిలు గములు మునుఁగ మూఁగినట్లు.

(తెభా-8-367-వ.)[మార్చు]

అయ్యవసరంబున.

(తెభా-8-368-మ.)[మార్చు]

రారాతుల బాణజాలముల పాలై పోయితే చెల్లరే!
రాధీశ్వర! యంచు ఖిన్నతరులై యంభోధిలోఁ జంచల
త్వ మునం గ్రుంకు వణిగ్జనంబుల క్రియన్ దైత్యాధిపవ్యూహ మ
ధ్య మునం జిక్కిరి వేల్పు లందఱు విపద్ధ్వానంబులం జేయుచున్.

(తెభా-8-369-శా.)[మార్చు]

హో! దేవతలార! కుయ్యిడకుఁ; డే నున్నాఁడ "నం చంబుభృ
ద్వా హుం డా శరబద్ధ పంజరము నంతం జించి తేజంబునన్
వా హోపేత రథంబుతోడ వెలికిన్ చ్చెన్ నిశాంతోల్ల స
న్మా హాత్మ్యంబునఁ దూర్పునం బొడుచు నా మార్తాండు చందంబునన్.

(తెభా-8-370-వ.)[మార్చు]

ఇట్లు వెలువడి.

(తెభా-8-371-చ.)[మార్చు]

వి ఱిగిన సేనఁ గాంచి సురవీరుఁ డొహో యని బిట్టు చీరి క్ర
మ్మ ఱఁ బురికొల్పి పాకబల స్తకముల్ నిశితాస్త్రధారలన్
నె సిన తీక్ష్ణవజ్రమున నేలకు వ్రాల్చెను వాని చుట్టముల్
వె చిరి; తచ్చమూపతులు విహ్వలులై చెడి పాఱి రార్తితోన్.
 : : 21-05-2016: : గణనాధ్యాయి 12:58, 22 సెప్టెంబరు 2016 (UTC)