పోతన తెలుగు భాగవతము/అష్ఠమ స్కంధము/గర్భస్థ వామనుని స్తుతించుట

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

గర్భస్థవామనునిస్తుతించుట

తెలుగు భాగవతము (మూస:పోతన తెలుగు భాగవతము/అష్ఠమ స్కంధము/)
రచయిత: పోతన


(తెభా-8-502-వ.)[మార్చు]

తదనంతరంబునం జతురాననుం డరుగుదెంచి యదితిగర్భపరిభ్రమ విభ్రముం డగు నప్పరమేశ్వరు నుద్దేశించి యిట్లని స్తుతియించె.

(తెభా-8-503-సీ.)[మార్చు]

త్రిభువన జయరూఢ! దేవ! త్రివిక్రమ! ;
పృథులాత్మ! శిపివిష్ట! పృశ్నిగర్భ;
ప్రీత త్రినాభ! త్రిపృష్ఠ! జగంబుల;
కాద్యంత మధ్యంబు రయ నీవ;
జంగమ స్థావర ననాది హేతువు;
నీవ; కాలంబవై నిఖిల మాత్మ
లోపల ధరియింతు లోని జంతుల నెల్ల;
స్రోతంబులోఁ గొను చొప్పు దోఁప;

(తెభా-8-503.1-తే.)[మార్చు]

బ్రహ్మలకు నెల్ల సంభవ వన మీవ;
దివమునకుఁ బాసి దుర్దశ దిక్కులేక
శోకవార్ధి మునింగిన సురలకెల్లఁ
దేల నాధార మగుచున్న తెప్ప నీవ.

(తెభా-8-504-క.)[మార్చు]

వి చ్చేయు మదితి గర్భము
చె చ్చెర వెలువడి మహాత్మ! చిరకాలంబున్
వి చ్చలవిడి లే కమరులు
ము చ్చటపడి యున్నవారు ముద మందింపన్.

(తెభా-8-505-వ.)[మార్చు]

అని యిట్లు కమలసంభవుండు వినుతిచేయు నయ్యవసరంబున.
 : : 21-05-2016: : గణనాధ్యాయి 15:45, 22 సెప్టెంబరు 2016 (UTC)