పోతన తెలుగు భాగవతము/అష్ఠమ స్కంధము/గజేంద్రమోక్ష కథా ప్రారంభము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

గజేంద్రమోక్షకథాప్రారంభము

తెలుగు భాగవతము (మూస:పోతన తెలుగు భాగవతము/అష్ఠమ స్కంధము/గజేంద్రమోక్షకథాప్రారంభము)
రచయిత: పోతన


(తెభా-8-19-క.)[మార్చు]

నీ రాట వనాటములకుఁ
బో రాటం బెట్లు కలిగెఁ? బురుషోత్తముచే
నా రాట మెట్లు మానెను
ఘో రాటవిలోని భద్ర కుంజరమునకున్.

(తెభా-8-20-క.)[మార్చు]

ము నినాథ! యీ కథాస్థితి
వి నిపింపుము వినఁగఁ నాకు వేడుక పుట్టెన్;
వి నియెదఁ గర్ణేంద్రియముల
బె నుఁబండువు చేయ మనముఁ బ్రీతిం బొందన్.

(తెభా-8-21-క.)[మార్చు]

థల యందుఁ బుణ్య
శ్లో కుఁడు హరి చెప్పఁబడును సూరిజనముచే
నా థలు పుణ్యకథలని
యా ర్ణింపుదురు పెద్ద తి హర్షమునన్.

(తెభా-8-22-వ.)[మార్చు]

ఇవ్విధంబునఁ బ్రాయోపవిష్టుండైన పరీక్షిన్నరేంద్రుండు బాదరాయణి నడిగె" నని చెప్పి సభాసదులైన మునుల నవలోకించి సూతుండు పరమహర్ష సమేతుండై చెప్పె; "నట్లు శుకుండు రాజున కిట్లనియె.

21-05-2016: :
గణనాధ్యాయి 16:45, 16 సెప్టెంబరు 2016 (UTC)