పోతన తెలుగు భాగవతము/అష్ఠమ స్కంధము/ఇంద్రసావర్ణిమనువుచరిత్ర

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

14ఇంద్రసావర్ణిమనువుచరిత్ర

తెలుగు భాగవతము (మూస:పోతన తెలుగు భాగవతము/అష్ఠమ స్కంధము/)
రచయిత: పోతన


(తెభా-8-427-వ.)[మార్చు]

మఱియు నట వచ్చు కాలంబున నింద్రసావర్ణి పదునాలవ మను వయ్యెడి; మను నందనులు గభీరవస్వాదులు రాజులును; బవిత్ర చాక్షుషు లనువారు దేవగణంబులును; శుచి యనువాఁ డింద్రుండును; నగ్ని బాహు శుచి శుక్ర మాగధాదులు ఋషులును నయ్యెదరు; అందు.

(తెభా-8-428-తే.)[మార్చు]

నర సత్రాయణునకు వితాన యందు
వము నొందెడి హరి బృహద్భానుఁ డనఁగ
విస్తరించుం గ్రియాతంతు విసరములను
నాకవాసులు ముదమంద రవరేణ్య!

(తెభా-8-429-క.)[మార్చు]

తీశ! త్రికాలములనుఁ
బొ డొందు మనుప్రకారములు చెప్పఁబడెం;
గఁ బదునలువురు మనువులుఁ
దె యుగములు వేయు నడవ దివ మజున కగున్.

(తెభా-8-430-వ.)[మార్చు]

అనినఁ బరీక్షిన్నరేంద్రుండు శుకయోగీంద్రున కిట్లనియె.

(తెభా-8-431-ఆ.)[మార్చు]

పదంబులందు నీ మను ప్రముఖుల
నెవ్వఁ డునుచు? వార లేమి కతన
ధిక విభవులైరి? రి యేల జనియించె?
నెఱుఁగఁ బలుకు నాకు నిద్ధచరిత!

(తెభా-8-432-వ.)[మార్చు]

అనినం బారాశర్య కుమారుం డిట్లనియె.

(తెభా-8-433-సీ.)[మార్చు]

నువులు మునులును నుసుతు లింద్రులు;
మరులు హరి యాజ్ఞ డఁగువారు
యాజ్ఞాదు లందఱు రిపౌరుషాకృతు;
లా మనువులు దత్సహాయశక్తి
జగముల నడుపుదు రొగి నాల్గుయుగముల;
డపటఁ గాల సంగ్రస్తమైన
నిగమచయంబును నిజతపోబలముల;
రలఁ గాంతురు ఋషిరులు; దొంటి

(తెభా-8-433.1-తే.)[మార్చు]

గిది ధర్మంబు నాలుగు పాదములను
లిగి వర్తిల్లు; మనువులు మల నేత్రు
నాజ్ఞఁ దిరుగుదు; రేలుదు వని పతులు
గతి భాగించి తమతమ మయములను.

(తెభా-8-434-వ.)[మార్చు]

మఱియుం బ్రాప్తులయిన వారల నింద్రపదంబులను, బహుప్రకారంబుల దేవపదంబులను, హరి ప్రతిష్ఠించుచుండు; వారలు విహిత కర్మంబుల జగత్త్రయంబునుం బరిపాలింతురు; లోకంబులు సువృష్టులై యుండు.

(తెభా-8-435-సీ.)[మార్చు]

యోగీశరూపుఁడై యోగంబుఁ జూపుచు;
మౌని రూపమునఁ గర్మంబుఁ దాల్చు
ర్గంబు చేయుఁ బ్రజాపతి రూపుఁడై;
యింద్రుఁడై దైత్యుల నేపడంచు
జ్ఞానంబు నెఱిఁగించుఁ తుర సిద్ధాకృతిఁ;
గాలరూపమునఁ బాకంబు చేయు
నానావిధములైన నామరూపంబులఁ;
ర్మలోచనులకుఁ గానఁబడఁడు

(తెభా-8-435.1-ఆ.)[మార్చు]

నిన రూపములనుఁ నురూపముల నింక
నఁగనున్న రూపయము నతఁడు
వివిధుఁడై యనేక వృత్తుల వెలిఁగించు
విష్ణుఁ డవ్యయుండు విమలచరిత!

(తెభా-8-436-వ.)[మార్చు]

అనిన భూవరుం డిట్లనియె.

(తెభా-8-437-మ.)[మార్చు]

లి నంభోరుహ నేత్రుఁ డేమిటికినై పాదత్రయిన్ వేఁడె? ని
శ్చ లుఁడున్ బూర్ణుఁడు లబ్దకాముఁడు రమా సంపన్నుఁడై తాఁ బర
స్థ లికిన్ దీనునిమాడ్కి నేల చనియెం? ప్పేమియున్ లేక ని
ష్క లుషున్ బంధన మేల చేసెను? వినం గౌతూహలం బయ్యెడిన్.
 : : 21-05-2016: : గణనాధ్యాయి 15:29, 22 సెప్టెంబరు 2016 (UTC)