Jump to content

దశరథరాజనందనచరిత్ర/చతుర్థాశ్వాసము

వికీసోర్స్ నుండి

శ్రీ

దశరథరాజనందనచరిత్ర

చతుర్థాశ్వాసము

క.

శ్రీవేంకట పురుషోత్తమ
కావేరీమధ్య బదరికావనకాంచ్యా
ద్యావాస [1]విశ్రవణకరు
ణావిత కౌంతేయ కర్పరాద్రినృసింహా.

1


వ.

ఆతఁఱి గథాసరణి యెట్లంటేని.

2


సీ.

[2]నాకనాథజిధాది నందనాహంకార
             కలితగాథల కిచ్చ నలరియలరి
హితదండనాయకాహీననీతినిధాన
             చిత్రగాథల కిచ్చఁ జెలఁగిచెలఁగి
ఘనఖడ్గహన్తరాక్షసరాజ సాహస
             హృద్యగాథలకెల్ల హెచ్చిహెచ్చి
సకలశాస్త్రజ్ఞాన చణకళాధరజాల
             గణితగాథల కర్థిఁ గరఁగికరఁగి
హర్షి యై నిక్కినట్టిదశాస్యనిర్జ
రారి నీక్షించి రహితాగ్రహాగ్నిశాంతి
కాంతిసంసక్తిఁ జల్లార్చి కైకసీయ
నిష్టతనయ ఖగారాతి నిష్ఠ ననియె.

3


క.

కీడింత దెలియకే ని
న్నాడికె సేయంగ నిట్టి యందఱ లాహా

యాడంగ నట్టిజాడల
నీడేరెనె, కార్యసిద్ధు లిద్దచరిత్రా!

4


చ.

అలజడిఁ [3]జేసి శక్రదహనార్కజనైరృతకంధినాయకా
నిలధనదాంగజాద్యఖలనిర్జరకిన్నరసిద్ధసంతతిన్
గలన జయించినట్టి త్రిజగజ్జనరక్షణకర్త కాంచనా
చలధృతిశాలి చండతర[4]సాహసియైనఖరారి యన్నిటన్.

5


క.

సిరియే జానకి యయ్యెన్
హరియే దాశరథి యయ్యె నదిగాక నిశా
చరనాథ! త్రిదశఘటలే
గిరిచరకర్త లయి రిలను గీడాడంగన్.

6


సీ.

శృంగారకాననక్షితిజాతసంతతి
             యంతటఁ ద్రెళ్లిన ట్లాయెనేని
శిలలచే ఘనరజశ్శ్రేణిచేత నగడ్త
             లర్థి ధాత్రికి [5]చదు నాయెనేని
కేతనాయత్తగాంగేయరాజగృహాళి
             యక్కడక్కడ దిన్నె లాయెనేని
గంధగంధిలదంతికంఖాణరథరాజి
             యడరి చెల్లాచెద ర్లాయెనేని
యరయ నంగళ్ల ధనధాన్యహారణార్థ
హారసంహతి నలిగాసి యాయెనేని
నిలిచి నేనాడినట్టి యానీతిసరణి
యెదకె దృష్టాంతగతిగాదె యదితిజారి.

7


క.

ధరణీకన్యానాయక
చిరతరశితసాయకాగ్నిశిఖ దేర్చి నిశా
చరగహనస్థలియట్లై
సరఁగనె యార్చినది లెస్సజాగిక నేలా?

8

చ.

అకట నిశాచరాగ్రణి! దశాస్య! జగజ్జనయిత్రి రాజక
వ్యక నిట కేల తెచ్చితి రయక్రియ సంధిలఁ దెచ్చినట్టిదా
నికి నఘచింతచేఁ జెనక నేర్చెద, నేరఁగ రాదె ధాత్రిఁ గీ
లికిఁ జెద లంటురానిసరళిం దిలకించఁగ లెస్స యన్నిఁటన్.

9


చ.

శరధిఁ దృణాకృతిం దెగడి, చంగన చంగన దాటి సీత తీ
రరసి, యగచ్ఛటం దిరిగి, యక్షనిశాచరకర్తఁ జీఱిఁ య
క్షరతరశక్తి లంక శిఖికాక దహించి తరించినట్టి యా
హరి గనియైన సీతతెఱఁ గారయరాదె నిశాటశేఖరా!

10


సీ.

నీచేతఁ గదలని నీలకంధరుశరా
             సనయష్టిఁ దృణలీల గినియఁజేసె
నఖిలరాజశ్రేణి నణఁగఁగఁ దాచిన
             యగ్రజాగ్రణిశక్తి నిగ్రహించె
కంఠి లంఘించి లంక దహించి తిరిగిన
             హరికర్త నేలన నతని నేలె
రెల్లగట్టెక్కిన దిట్ట ని న్దెచ్చిన
             యాశాక్రి నేకాస్త్రహతి హరించె
ఖచరసంతతి యంతంత గణనఁజేయఁ
దాడిచెట్లెల్లఁ ద్రెళ్లంగఁ దఱిగినట్టి
దాశరథికి ధరాంగనాతనయ నిచ్చి
శర ణనిన నన్నిటన్ లెన్స చారణారి!

11


తే.

గణన జెక్కిన యాకారకళలచేతఁ
జక్కనై నట్టికన్నియల్ చాల గలఁగ
సీతఁ దేనేల యందఱఁ జెరచనేల
లంకఁ జెడ నేలఁ లేని కళంక యేల.

12


ఉ.

ఆతతశక్తి సంధిల రణాంగనధాత్రి నఖండరాక్షసా
రాతి హరీంద్రసారకరరాజితదీర్ఘ[6]కరాసనాంతని

ర్ఘాతదృఢాస్త్రధార లధికక్రియ నీతలలెల్లఁ ద్రెంచగా
నాతరి నానయస్థితి యహా! గణియించఁగ దాచనేర్చెదే.

13


క.

చింతఁ [7]దొలగించి సీతా
కాంతం దాశరథి కిచ్చి ఘననయగతి నీ
సంతతి హిత రాత్రించర
సంతతి రక్షించఁగదె నిశాచరనాథా!

14


తే.

అనిన తనదాయిఁ గని చంద్రహాళి కాలఁ
దన్నెఁ, దన్నినదానికి ధరణి జారి
లేచి యందఱ నార్తి యాలించనాడె
సాహసక్రియచే నీతి సడలనీక.

15


సీ.

సీత గా దిది దైత్యశేఖర నీ కేల
             సల్లిన యట్టి నీలాహి గాని
సీత గా దిది దైత్యశేఖర నీనెత్తి
             [8]కట్టెజారిన యట్టి యశని గాని
సీత గా దిది దైత్యశేఖర నీశాటి
             నంటిన యట్టి చండాగ్ని గాని
సీత గా దిది దైత్యశేఖర నీయింట
             నట నిల్చినట్టి రక్తాస్య గాని
సీత గా దిది నీయెడ ఘాతనాటి
నట్టి [9]హలహలతీక్ష్ణశాతాసి గాని
యైన నాగాథ లాలించి యతనిగృహిణి
నతని కిచ్చినఁ గాదె నీయంగరక్ష.

16


చ.

అని తృణలీలగాఁ దెలియనాడె ధృతిన్ [10]హితజాతసంతతిన్
దనజనయిత్రిఁ జేరఁజని తత్ స్థితి యంత నెఱుంగఁజేసి చ
య్యన జలరాశి దాటి సకలాద్రిచరేశిత లెన్న జెంత ని
ల్చిన ఖరహంతఁ గాంచి నతిఁ జేసి గణించిన హర్షశాలియై.

17

క.

చేరంగఁజీఱి యతనిని
నీరఫ్నాయిగ రచించి నిల్కడగా లం
కారాజ్యకర్త జేసెద
యారాశిఖరారి సాటి యరయఁగ గలరే.

18


వ.

అయ్యెడ.

19


క.

ఆరాజహేళి హితగతి
నారసనిధిస్నాయియై దినత్రయి తృణశ
య్యారస శయనించె నీరా
హారక్రియచేత నిష్ఠ యతిశయిలంగన్.

20


చ.

జలనిధి గాంచి దాశరథి చక్కఁగ సాగిలి లేచి నిల్చినన్
లలితతరంగనిర్గతఝళంఝళ లెల్లెడ హెచ్చ, తారకా
స్థలిఁ దెలియంగ నిక్క, దనసనంగడి చక్కనిదాయి కాస్థితిన్
తెలియఁగఁ జేసి హృజ్జనితతీక్ష్ణతరాగ్రహదృష్టిఁ బేరఁగన్.

21


క.

దాశరథి నింగి యంటిన
నాశరనిధి కెగసి కరశరాసనయష్టిం
దాశరథి శస్త్రిఁ దిగిచి ది
గీశరథికలేఖ లెన్న నెద సంధించెన్.

22


వ.

అంత.

23


క.

ఆనారాచక్రియఁ గని
దీనాకృతి జలధి జడసి ధృతి ధరణీజా
జానిచరణాగ్రసంస్థలి
కానతి రచియించి కీలితాంజలిచేతన్.

24


ఉ.

ఇంతనె నాతెఱం గరయ కీర్ష్య ఘటిల్లఁగ లేచి కేల న
త్యంతశరాసయష్టి నరిస ల్గెనయించఁగ నేల నాదినీ
సంతతి రాజసంతతి రసాస్థలి కార్యగతిన్ రచించ దై
త్యాంతక సాగరాఖ్యఁ దనరారితిఁ జిల్లరగాథ లేటికిన్.

25

ఆ.

జగతి నిట్టి సగరసంతతి సాక్షాత్క
రించి యాది హరి జనించె నన్న
కాంక్ష నలరినాడ కాక సేయఁగ [11]నెద్ది
దారి కీర్తిఛారి! తాటకారి!

26


క.

నీచరణదర్శనస్థితి
నీచరణ[12]క్షాలనాదినియతఖ్యాతిన్
నీచరణారాధనగతి
యాచరణశ్రీ ఘటిల్లెనయ్య నరేంద్రా!

27


ఆ.

అనిన ఖరనిశాచరారి యాగాథల
కలరి కినియకే శరాసయష్టిఁ
జిత్రశస్త్రఘటన జేసితి నిది రిత్తఁ
గాదటన్న జలధి [13]కలఁగనాడె.

28


క.

అనఘా! నీచే సంధిం
చిన సాయకధార రిత్త సేయఁగరాదే
గనక తెలియంగఁ జేసెద
ననతక్రియ దీనిలెస్స నాలించఁగదే.

29


క.

ధనదాశ, ననంతనరా
శనకర్తల్ గలరయా రసనాయక! త
ద్ఘనశస్త్రికచే నందఱ
గనియలు సేయంగరాదె గ్రచ్చఱ ననినన్.

30


చ.

శరనిధి యాజ్ఞ దాశరథి చండశరాసనయష్టిశింజినీ
ఖరతరశస్త్రి నేయఁ [14]దనకాంతి దిగంతనిశాటసంతతిన్
సరగ హరించి తాఁ దిరిగి చండశిఖల్ నెరయంగఁ జేరి త
చ్ఛరధి దనర్చె ఖేచరరసాచరకీర్తన లెచ్చ నయ్యెడన్.

31


క.

తనచెంగటి హరిసేనలఁ
గని, నీరధి గట్లచేత గట్టఁగ శాసిం

చిన దైత్యహంత యానతి
[15]ఘనతరక్రియఁ దాల్చి దిశల కరఁగిరి సరగన్.

32


క.

తతచక్రనదాంతరసం
స్థితధరణీశిఖరిఘటలఁ దెచ్చిన జలధిన్
ధృతిసంధిల [16]గట్టె నల
క్షితిధరచరనేత సాటి సేయఁగ గలరే.

33


శా.

ఆలంకాస్థలిఁదాక కంధినయచర్యం [17]గట్లగట్టించి తా
హాళిన్ రాక్షసహంత సద్గిరిచరాధ్యక్షచ్ఛటాసంగతిన్
జాలారాత్రిచరేశితల్ కలఁకచేఁ జల్లించఁగా నింగి జే
జేలెల్లన్ గణియించఁగా నడచె నక్షీణక్రియల్ దీరఁగాన్.

34


ఆ.

ఇట్టి సరణి గట్లకట్టదారి నిశాచ
రారి యర్కనందనాదికీశ
[18]ఘటల నెనసి శీఘ్రగతినంతనే, త్రిశృం
గాద్రి నెక్కి నిలచె హర్షశక్తి.

35


వ.

అంతట నసంఖ్యలైన హరిసేనలచేత త్రిశృంగగిరి నిలిచి దాశరథి గంధ
గజకంఖాణశతాంగశాలలచేతఁ గింజల్కరంజితకంజాతసంజాతరసా
క్రాంతకాసారతటాకదీర్ఘికలచేత సకలధరణిజలతాంతరసస్థగిత
దిగంతశృంగారకాంతారరేఖలచేత గాంగేయసాలహీరకలశకేతనాయత్త
రాజసదనఘటలచేతఁ జెంగలించి రత్నచ్ఛాయల నాకాశసరణి నలంక
రించెడి లంకానగరి దర్శించి, గణించి తలఁగదిలించెడి యారాజహేళిం
గైకసీకనిష్ఠనిశాచరనేత చేరంజని.

36


ఆ.

అనఘ లంకచిహ్న లరసితి నాచెంత
కైకసేయదితిజకర్త నిఖిల
హితనిశాటనేత లెంచ నాస్థానియై
తనరెఁ గాన నతని గనఁగరాదె.

37

క.

తెలియంగ సెలఁగకే, లర
సెలఁగ దలలచేతఁ దనర రత్నశిలా
కలితాలంకారస్థితి
నలరెన్ లంకాధినేత నల్లనఁ గంటే.

38


సీ.

కాలాగ్ని తీక్ష్ణఖడ్గలతల్ ధరించె రెం
             డెడల రాక్షసకర్త లెచ్చరించ
నయశాస్త్రచణదండనాయకచ్ఛటలకా
             ర్యాకార్యనర్తన లతిశయిల్ల
[19][20]జగతిరసాతలగగనచారేశిత
             లయ్యెడ జయలిడ హాస్యగతిని
నాకనాథజిదాదినందనరేఖల
             సాహసాలంక్రియల్ సందడిల్ల
నసదృశహిరణ్యఖచితసింహాసనాగ్ర
ధర నధిష్ఠించిన దశాస్యదైత్యనేత
కట్టె సాక్షాత్కరించిన కాలదండి
దండి దనరారె నంతంత ధరణినాథ.

39


వ.

అని యాడిన దాశరథి సంతసిల్ల లంకానేతం గాంచి.

40


తే.

ఎంతసిరి ఎంతయాకృతి యెంతశక్తి
యెంతతే జెంత నిల్కడ యెంతదండి
యట్టిసాహిసి గాంచిన యట్టితల్లి
సత్క్రియ గణించగలఁడె యాస్రష్టయైన.

41


చ.

అగజాజాని ననేకకంధరలచే [21]నర్థించె జన్యస్థలిన్
దిగధీశాదితినందనచ్ఛటల నర్థిం గెల్చి శంకించకే
తెగి కైలాసగిరిన్ దృణాకృతిగ నెంతేగాన నీతండహా
జగదారాధ్యత హెచ్చనేరఁడె సదాచారక్రియన్ జెందినన్.

42

క.

ఈ నరఖాదాగ్రణి నె
య్యాన [22]సదాచార నియతియలరి నడచె నా
నేనైనం నిర్జించం
గా నేర నటన్న నార్కికాక ఘటిల్లన్.

43


క.

నాతల్లి యైన ధరణీ
జాతం [23]దాశరథి చరణజలజధ్యాన
దశరథరాజనందన చరిత్ర
ఖ్యాతక, రక్షితజనసం
ఘాతన్, జెఱసాల నిడియె గాయని ఢాకన్.

44


సీ.

సింగిణియల్ల నా నింగికి నెగసిరా
             [24]సకలసంహారాతిశయతచేత
నాస్థానియై నిల్చినట్టి లంకానేతఁ
             జేరి చండతరాజి [25]జేసియంత,
దండనాయకరాజి దండించి కాంచన
             ఘటరత్నకేతనకలితరాజి
శాలలనన్నింట జగతి ద్రెళ్లఁగఁ దన్ని
             ఢాక లంకారాజధాని గలఁచి
దృఢజయానందసాహసశ్రీలఁ దనరి
తిరిగి యేతించి దాశరథిక్షితీశ
హేళిఁ గదియంగ జని కాళ్ల కెరఁగి కీశ
సేన లెన్నంగ దనరారెఁ జిత్రకళల.

45


వ.

అయ్యెడ లంకానేత కిరసారణాఖ్యాకచారనిశాచరకర్తలచే దాశరథి
శృంగగిరి శిఖరి ననంతసంఖ్యలైన గిరిచరసేనలచే నిలచిన జాడఁ దెలసి.

46


క.

హరసఖదిగ్రాజగృహా
గ్రరసాస్థలితాదశాస్యఖచరారి నిరం
తరహితసంగతి నిలిచెన్
సరగన [26]లెక్కించరాని ఛత్రచ్ఛాయన్.

47

ఆ.

నింగి గానరాని నీడ నిండిన గాంచి
దాశరథి దశాస్యదైత్యకర్త
శక్తి గాగఁ దెలిసి సకలఖచరధరి
త్రీచరాళి గనఁగ తీక్ష్ణసరణి.

48


చ.

క్షితితనయాధినేత తనచేతి శరాసనయష్టి నారి నం
చితిగతి నస్త్రసంఘటనఁ జేసి దశాస్యఖగారిఛత్రసం
తతి తృణలీల నేసిన యఛాయధలై జలరాశి నల్దిశల్
క్షితి గలయంగనిండె నహిసిద్ధఖగాండజరేఖ లెన్నగన్.

49


తే.

జానకీజాని శరహతిచే నిశాట
నేత ఛత్రాళి గండ్రలై నేలఁ ద్రెళ్లె;
[27]యల్లరాజగృహస్థలి యార్తి డిగ్గి
హితనిశాచరకర్తల నెనసినంత.

50


క.

తనతల్లి యగ్రజనయిత
గని చేరఁగ జీఱి రత్నకలితహిరణ్యా
సనధర నిల్కడ సేయిం
చి నితాంతస్నేహసరణి జెందఁగ నాడెన్.

51


తే.

ఎన్నిక నిశాటసంతతికెల్ల నాస
చేత కల్యాణసిద్ధిగా జేయనైన
యార్తి నడచంగ నన్నిఁట నలరినట్టి
నన్నిచటి కేగఁజేసితి నీతి దెలియ.

52


క.

జలధి ధరాధరతతిచే
నలరఁగ గట్టించి రాక్షసాదిత్రిశృంగా
చలధాత్రిన్ గిరిచరసే
[28]నలచేత న్నిలిచె నట్టి నడకలఁ దెలియన్.

53


వ.

అని యిట్లాడిన లంకానేతం గాంచి [29]కైకసజనకాగ్రజనిశాటకర్త
యాగ్రహించి.

54

సీ.

[30]శతధృతిచే నద్రిజాజానిచే చిత్త
             కాంక్షితార్ధస్థితి గాంచికాంచి
అష్టదిక్కర్తలనైన దృష్టికిఁ దేని
             నందనసంసిద్ధిఁ జెంది చెంది
అగణిత[31]రత్నాకరాంతరస్థలరాజ
             ధాని సంఘటిలంగఁ దనరితనరి
గంధనాగశతాంగకంఖాణసైనిక
             శ్రేణి రంజిల్లంగఁ జెలఁగి చెలఁగి
[32]అంచితస్థితిశ్రీలచే నతిశయిల్ల
లెస్సగా [33]సంచరించంగ లేక లేక
నిఖిలహితరాక్షసేశితల్ నిందఁ జేయ
జెడఁగ రరిగాఁగ సీతఁ దెచ్చితి దశాస్య!

55


క.

శ్రీనిధి ధరణీకన్యా
జానినడక నిఖిలదిశల సరిదాకఁగ [34]
జ్ఞానిగతిన్ నన్నడగం
గా నేటికి కైకసేయఖచరారాతీ!

56


చ.

జలనిధి నేయఁదాలిచిన చండశరాసనశస్త్రధారచే
నలయలకాధినాయక దిగంతఘనత్రిదశారి రాజితే
ఖలతృణలీల నర్థిఘటికం దెగటార్చిన [35]కోసలేశ స
ల్లలితకథాచ్ఛటల్ దెలియ లజ్జ ఘటిల్లదె రాక్షసాగ్రణీ.

57


క.

రాక్షససంతతి నెల్లన్
శిక్షించఁగ సకలదిశల శిష్టజనాళిన్
రక్షించగ శ్రీహరి దా
నీక్షితి జనియించె జానకీశాకృతిచేన్.

58


ఉ.

చాలదిగేశితల్ సకలచర్యల నర్చనచేయ నన్నిటన్
జాలినయట్టి నన్నధికసాహసభక్తి గ్రహించి తెచ్చి

రాలయధాత్రి డించిన నగాహితనందనకీశసేతఁ దా
లీల హరించె, నాతనికి లే రిక సాటి జగత్త్రయిం గనన్.

59


క.

నీసరిజేజేలెల్లన్
సీసీయనఁ జిన్నదాయిచెల్లెల్ గదియన్
నాసిక [36]గీలించె, ఖలా
గ్రేసరఖరచారణారి గీటణఁగించెన్.

60


ఆ.

ఏ నెఱింగినంత నెరుకగా జేసెద
నియతి నాలజించి నేర్చెదేని
జనకతనయ నిచ్చి శరణన్నదే లెస్స
గాని యన్యచింతఁ గనఁగ నేల.

61


క.

అని యాడినట్టి తాతన్
గనదాగ్రహదృష్టిచేత గడకనిచి, దశా
నననిర్జనారి నిజహిత
జనసంగతి నధికనీతి సంధిల నిలచెన్.

62


వ.

అంత నక్కడ.

63


ఉ.

[37]కంగక తా దయాజలధి గాన ధరాతనయాధినేత, యా
చెంగట నిల్చినట్టి హరిసేనల నేరల నడ్డసేయకే
[38]యంగదకీశక ర్త నతిహర్షగతిం గని చీఱి యన్నిఁటన్
సంగతి నాచరించి దృఢసాహసచర్య గణించి నీతిచేన్.

64


ఆ.

అనఘ లంక కేఁగి యాదశాస్యనిశాటకర్త కధికనీతికార్యచర్యఁ
దెలియఁజేయ లెస్స, తెలియని నాటికి
తిరిగిరాగరాదె తీక్ష్ణసరణి.

65


చ.

అని ఖరరాక్షసారి దయనాడినయాజ్ఞఁ దలన్ ధరించి, చ
య్యన హరి[39]కర్త లంక కతిహర్షరసస్థితి సంధిలంగ చే

ర నరిగె కాంచనాసన ధరన్ దనరారినయట్టి కైకనీసీ
తనయ నిశాచరాగ్రణి నధఃక్రియచే గని నిల్చె నిల్చినన్.

66


వ.

ఇట్లు నిలిచిన యంగదహరిం గాంచి లంకానేత యాగ్రహించి[40]

67


క.

నీ యాఖ్యన్ [41]నీజనయిత
నీ యేలిక, నీచరిత్ర, నీసంస్థలి, య
త్యాయతగతిచే దెలియం
జేయం గదరా! యటన్నఁ జెదరక యాడెన్.

68


ఉ.

ని న్నని గెల్చి తెచ్చి చెఱనించిన క్షత్రియకర్తఁ జేరి కే
లన్నిటిఁ జెండిరాల్చిన ధరాదితిజాగ్రణి, యడ్డకట్టనన్
జెన్నడగించినట్టి జగబెట్టి, రసాతనయాధినేతచే
నెన్నికఁగన్న దాసకరి నే నెఱిఁగించెద నాలకించరా.

69


క.

సారతరశక్తి నిన్నా
కారాగృహధాత్రి నడ్డకట్టిన ఘనశై
లారాతిజాతహరి దా
నారయ నాతండ్రి యంగదాఖ్య నలరితిన్.

70


క.

ఏ నెఱిఁగించిన జాడ, ద
శానన కాఁ జేసితేని యఖిలశ్రీసం
తానహితదైత్యసంతతి
కానందక్రీడ గాదె యది యెట్లన్నన్.

71


ఉ.

ఆనరనాథకేసరి దయానిధిగాన నిశాచరేంద్ర! నె
య్యాన గణించి ని న్నరయ నంచిన నీ కిట దేహరక్షగా
నే నెఱిఁగించి శీఘ్రగతి నేఁగితి నాచనినట్టిదానికిన్
జానకి నిచ్చి ధాత్రి సిరి సంధిల హెచ్చఁగరాదె యన్నిఁటన్.

72


క.

తెచ్చిన దానికి గ్రక్కున
నిచ్చిన యది లెస్స, సీత నీలేనియెడన్

జెచ్చెఱ సంగరధరణిం
గ్రచ్చఱ నిల్చిన నది నీతి గాదే తెలియన్.

73


సీ.

అల్క [42]తాటకఁ గెల్చి యతి యష్టి రక్షించె
             శిల నాతిగాఁ జేసె, చిత్తజారి
ఘనశరాసనయష్టి గండ్రించె, రాజారి
             దండి యడంగించెఁ, దల్లి యాజ్ఞ
కాన కేఁగి నిశాటకాంత నాసిక గీసె,
             నని ఖరాదిఖలసంహతి నడంచె
శాక్రి ఖండించె, హెచ్చఁగ నార్కిఁ దయనేలె,
             కంనిధి గట్టించె గట్లచేతఁ
దరలి నీచాయి యాతనిదండ జేరి
లంకచెంగట నిల్చె నేశంక లేక
యట్టి జగదేకకర్త [43]సీతాధినేత
జడత నరలీలఁగా దలంచంగ నేల.

74


చ.

ఘనఖరరాక్షసారికరకాండధృతాశనిచండసాయకా
సనదృఢశింజినీగళితసాయక కీలి దశాస్య ! నీ నరా
శనతతి కాననచ్ఛటలు స్రగ్గగజేయని యాది నేధరా
తనయను నీతి నిచ్చి సిరిఁ చాలిచి హెచ్చఁగరాదె యన్నిటన్.

75


అని యాడిన నంగదహరిఁ
గని దశకంధరనిశాటకర్త హృదయసం
జనితాగ్రహకాలానల
ఘనకీలన్ నింగి నిండఁగాఁ దెగి యాడెన్.

76


చ.

ధరచరహీన! నీజయితం [44]దెగటార్చగఁ జేసినట్టి
శరధి జయించలేని యది జాలదె, చాలక యాతనిగాని సి
గ్గరయఁగలేక నల్దిశల యంత దలార్చి హరించ దాసతం
దిరిగితి, యాశ్రయించ జగతీస్థలి లేరె నరేశితల్ గనన్.

77

మ.

నరనాగత్రిదశక్షితీశతతి దైన్యగ్లాని నేతెంచి కిం
కరలీలన్ జరియించి, చిత్రహయనాగశ్రేష్ఠగాంగేయర
త్నరథాలంకృతతారహారధనధాన్యశ్రీల రంజిల్లఁగా
సరిగా నాతని నెన్న నేల నహహా! చాలించరా యంగదా!

78


క.

[45]తనకట నేనఁట శరణని
యననఁట సీతఁ దనకడకు ననిచెదనట తా
ననిచిన నిజనగరికి హా
చనునట యీరీతి యెందు జరుగంగలదే!

79


క.

గట్లకడన్ నిల్కడలై
చెట్లంగల కాయలెల్ల చెడదీని యాహా
[46]కాట్లాడెడి హరిఘటల ని
కెట్లన్నరకీటనిరతి నేతెంచిరిరన్.

80


ఉ.

ఎన్నికచే నగస్త్య జటిలేశిత తా నరచేత దాల్చి యా
[47]కన్నిధి ద్రాగినట్ల, ఘటకర్ణనిశాచరకర్తకేచ, నా
యన్నరకీటకాగ్రణి సహాయత, నానగచారిరాజి న
చ్ఛిన్నగతిన్ హరించి కడజేసి, తినంగల డేల యంగదా!

81


ఆ.

తల్లి దండ్రి కెడసి, దాయాదిసంతతి
కెడసి, గహనఛాత్రి కేఁగినట్టి,
తా ననంగ నెంత, తాటకేయారి న
న్నేల రేచి యాడ నేరఁగలఁడె!

82


చ.

అనత కరీంద్రసైనికశతాంగహయస్థితి లేక, చండసా
ధనగతి లేక, దాయి తనదండయి రా, నలి నంఘ్రిచారియై
యని రచియించ నేఁగెనఁట, యానరకీటకకర్త కట్టయా
తనిసిరి నాజయక్రియ, నిదర్శనసిద్ధిగ గాంచి యాడరా!

83

సీ.

కాకచేఁ దాటకి ఖండించె నన నేల?
             నలినాతి నిర్జించినాఁ డ దెంత!
హరిశరాసనయష్టి హరియించె నన నేల?
             [48]యలకట్టె గండ్రించినాఁ డ దెంత!
క్షత్రియారి కడంక సడలించె నననేల?
             నల యగ్రజుని గెల్చినాఁ డ దెంత!
తాటకేయ[49]ఖరారి దండించె నననేల?
             [50]యల నిఱ్ఱి శాసించినాఁ డ దెంత!
యహహ! నీరథి గట్టించె ననఁగ నేల?
నీళ్లకడ జేసినట్టి యానీ ట దెంత!
తాననఁద నెంత నేనెంత ధరణిజాని
గీటడంచెదరా కీశకీటకేశ!

84


క.

ఖరరాక్షసకర్తన్ సం
గరధాత్రి జయించెఁ దాటకాహంత యటం
[51]చరయం గూకలు జేసెద
చిరకాలశరీరధారిఁ జెండిన దెచ్చే!

85


క.

చెట్టందె దాగి, శాక్రిన్
నెట్టన శితశస్త్రిఁ ద్రెళ్లనేసిన యది యే
కట్టడ? క్షితిధరచారిన్
[52]గిట్టించిననింద గాక కీర్తి కలిగెనే?

86


క.

తెలియంగ లంక చండా
నలకీలల నగ్గజేసినాఁ డని హరి ని
చ్చల గణియించఁగ నేలా
[53]యెలుకలఁ జర్చించరాదె యీలాటితరిన్.

87

క.

హరి లంకకె లంఘించిన
[54]సరణి గణించంగ నేల చాఱల్ జెల్లల్
శరనిధి కీతల కాతల
యరయఁగ [55]నీదె ననరాదె యంగదకీశా![56]

88


వ.

అని తెగనాడిన దశాననఖచరారి గంధకరటిపై లంఘించిన కేసరి
చందాన నేగసి దశశిరఃకిరీటశ్రేణి సడల్చి, హాటకశాటికల్ చించి,
గాత్రకీలితాలంక్రియల్ జార్చి, యాస్థానదండనాయకనేతల ఖండించి,
ధనధాన్యశాలల్ చెల్లాచెదరఁ జేసి, లంకారాజధానిఁ గలంచి, తిరిగి,
(త్రిశృంగాద్రి) స్థలి నిల్చి, దాశరథికి సాష్టాంగదండక్రియ లాచరించి,
యాద్యంతక్రియ లెఱింగించె నక్కడ.

89


క.

అనతాంగదహరి కరతా
డనచర్యన్ గాత్రయష్టి డస్సి కలకచేఁ
దనసదనాంతస్స్థలికిన్
జని దశగళనిర్జరారి జడియఁగ నంతన్.

90


శా.

ఆలంకానగరీస్థలిన్ జనకకన్యాజాని యాజ్ఞారతిన్
జాలా సందడి నర్కజాతహరి రాజశ్రేణి శంకించ కే
సాలస్యందనఖేయదంతిశకటిశస్త్రాస్త్రశాటీనటీ
శాలాహాటకదీర్ఘకల్ చెరచి యిచ్చన్ గన్నదేగా గతిన్.

91

తే.

గిరిచరశ్రేణి లగ్గకెక్కిన దశాన
నాదితేయారి, డిగ్గంగ నడచియల్కఁ
జింత హరిజిత్ఖగారాతిఁ జేఱఁజీఱి
యని రచించంగ ననిచిన నతిశయిల్లె.

92


చ.

ఘనదశకంధరాజ్ఞ నతిగాఢనగాహితజిత్ఖగారి రా
నని రచియించ నర్కతనయాది హరిచ్ఛటలెల్లఁ దాటి చె
ట్లనచఁ, ద్రిశృంగగండశిలలన్ నలినేయఁగ దాళలేక చ
య్యన నిజరాజధానికి నయక్రియచేఁ దిరిగెన్ దృఢార్తియై.

93


క.

[57]తనకేలన్ దారానం
దనహరిచే దెగినయట్టి దానికి [58]గిరిశా
సనజిత్సురారి యరిజన
హననేష్టి రచించదలఁచి యనదృశగతిచేన్.

94


తే.

ఆహితజనయజ్ఞకారియై యలరి యజ్ఞ
యం దధికచిత్రజయశరాంగాస్త్రశక్తి
గాంచి, రాత్రించరశ్రేణి గణనఁ జేయ
హెచ్చ లయకాలచండచండీశలీల.

95


సీ.

చండకాండాసనజ్యాటంక్రియలచేత
             గణితనిస్సాణధంధణలచేత
యధికదైతేయరాజాహంక్రియలచేత
             [59]చరణసుకటఝంఝణల చేత
గంధగంధిలదంతిగణఘీంక్రియలచేత
             [60]ఘంటికాయతఘణఘణలచేత
కరహేతిసంఘాతకషఖంక్రియలచేత
             [61]ఘనరథచక్రగర్ఝరలచేత
కదలె హరిజి న్నిశాచరకర్త ధాక
హరిశిఖకృతాంతనైరృతశరధినాథ

ఖగధనాదీశ కాళికాకాంత సకల
ఖచరనేతల కట్టెదల్ గానిఁ గలఁగ.[62]

96


తే.

అజి కేతెంచినట్టి శైలారిజి న్ని
శాటకర్త నదల్చి యేశంక లేక
నగచరశ్రేణి గదియ రంతయ్యె, దిశల
నింగిచారణసంతతి చెంగలించె.

97


చ.

కటచరణాధరాధరనఖస్తనకీకసకర్ణనాసికా
నిటలకరాస్యదంతకచనేత్రకటీర[63]గళాస్యజంఘికా
చ్ఛట లసిధారలన్ క్షితిజశాఖలచేఁ దెగి జన్యధాత్రి నం
తట కలయంగ ద్రెళ్లి రఁట దైత్యహరీశిత లేకచర్యలన్.

98


తే.

ఆరసాతలజలనిధి యచలకెగసి
కలియ దిశలెల్ల నిండినకరణి నధిక
సాంద్రరక్తతరంగిణీసలిలధార
[64]కేఁగె నాయాజి హరిసేన లెచ్చరించ.

99


క.

ధృతి నగచర[65]ధాత్రిచరే
శిత లితరేతరదృఢాజి సేయఁగ నెంతే
క్షితిచరఖేచరతతి యా
తతగతి గానంగసాగె నాయాయెడలన్.

100


తే.

అల్కచే నింద్రజిత్ఖచరారికలిత
హయధృతరథాంగసంగతి యంతరిక్ష
సరణి కెగసి, జలంధరచ్ఛాయ నిలిచి
చిరతరాదృశ్యగతి నాజి సేయసాగె.

101


క.

ఆ కటికరేయి నిండిన
చీఁకటికిన్ రెట్టియైన చీఁకటి సేయన్

నాకధరిత్రీతలదిశ
లేకాకృతియైన నాత డిద్ధక్రియచేన్.

102


క.

కాలానలచండశిఖా
జాలిక, సచ్ఛత్రికల దిశల్ తలకంగా,
లీలన్ గిరిచరనేతల
నేలన్ ద్రెళ్లంగనేసె నిశితక్రియలన్.

103


చ.

అనిదశకంఠనందనఖగాహితకర్తహృదంతరాళసం
జనితదృఢాగ్రహాగ్నికణసంతతి కన్గడలన్ దిగంగ ధా
రనగరిచారి రాడ్ఘటల రానెలలన్ హరిసాయకాహతిన్
ఘనతరశక్తి గట్టి తిరుగ న్నిజసంస్థలి కేఁగె నయ్యెడన్.[66]

104


తే.

కైకసేయాజ్ఞ త్రిజట దాఁ గగనయాన
సంస్థలక్షితనందన జక్క జేర్చి
[67]రనశరాహతి ద్రెళ్ళిన రాచనెలల
[68]గానగా జేసి తిరగయక్కానడించె.

105


వ.

అంత.

106


క.

తనజ్ఞానదృష్టిఁ దశరథ
తనయక్షితినేత లర్థి ధరణీస్థలి జా
రినజాడఁ దెలసి, కలహా
శన జటి యేతెంచె నింగి సరయక్రియచేన్.

107[69]


చ.

తదఘనదేహయష్టి ఘృణి ధాత్రిదిశల్ కలయంగ నిండఁగా
దనకలకంఠగాననినద క్రియ చక్కఁగఁ దేనె లీనఁగా

దన కెన యైనయట్టి జడదారి జతల్ గని సాగిలన్, రణా
శన జటికర్త, దాశరథి సన్నిధి నిల్చి గణించె నేడ్తెరన్.

108


తే.

అజ! జగన్నాథ! నిఖికేశ! యార్తరక్ష!
త్రిణయనారాధ్య! యనమ! నీతేజియైన
తార్క్ష్యఖగనేతఁ దలఁచినఢాక, నాగ
శరాహతి హరించగలదన్న చక్కఁదలఁచె.

109


వ.

ఇట్లుఁ దలంచిన.

110


సీ.

నిండిన ఢాకచే నెగసిన నింగిదా
             జిగి యజాండ [70]ఘటకట్ట గడయంట
రెక్కల్లార్చిన నిక్కిన గట్లెల్ల
             గెంటు గృధ్రాండజక్రియల నాడ
నచల కాళ్లానిన యహిరాజశీర్షసం
             తల్లి కండలగిలి కిందటికి దిగగ
ఘనశీఘ్రగతి దేరఁ జన దానిజాడల
             [71]ధరధరాద్రిచ్ఛటల్ తెరలి కదల
హరిశిఖికృతాంతనైరృతశరధిరాట్స
దాగతి, ధనేశకాళికాధ్యక్షసాధ్య
ఖచరకిన్నరచారణగణన లెసఁగ
నీడజాగ్రణి యేతెంచి నిశితచర్య.

111


చ.

అలయఁగ నింగిదారి జనినట్టి సితాస్యఖగాధినేతరె
క్కల నెఱిగాలి రానెలల గట్టిన [72]నీలగళాస్త్రరేఖలన్
గలయఁగ డాకినంతటనె [73]కంనిధిగాతుగనారసాతల
స్థలి కరిగెన్, దిగీశఖగసంతతి సంతసిలంగ నయ్యెడన్.

112


తే.

లేచి నిలిచినట్టి లేరాచనెలసర్ల
గాంచి కాళ్ల కెఱఁగి గణనఁ జేసి,

సరసశేషశాయిసన్నిధి కాయండ
జస్థిరాధినేత చనియె నకట.

113


క.

హరిహయదిశాద్రి చెంగట
హరిగానఁగనైన రాక్షసారాతి ధృతిన్
హరిసేనాసంగతి సం
గరధాత్రి న్నిలిచె సనయగతిచే నంతన్.

114


క.

తనహిత[74]సంతతి దశరథ
తనయక్షితినాథ కీశతతిచేతన ద్రె
ళ్లిన దానికి గలిగి దశకం
ఠనిశాచరకర్త సంకటక్రియ దేరన్.

116


వ.

ఇట్లు సంగరసన్నాహక్రియలఁ గఁదలం దలంచిన లంకానేతతెఱం
గాలించి శక్రజిజ్జనని [75]సకలశ్రీ లాచ్ఛాదించ నేతెంచినయాకె సింహాసన
స్థలి నధిష్ఠించఁజేసి సరసగాథ లాలించి యాననస్థితిఁ గాంచి.

117


క.

జలజాక్షీ నీహృదయ
స్థలి లెక్కించంగరాని జడయిక నిటరా
[76]దెలిసె, యహా! నరకీటక
తిలక హరిశ్రేణిచేత ధృతి చెడెగాదే.

118


క.

న న్నచటికి రా ననిఁచిన
కన్నియ [77]రాలేనె యలసగతి నేతేరన్
జన్నే యని లాలించఁగ
యన్నరహంతఁ గని యాడె యాదరసరణిన్.

119


చ.

తెలియక సీతఁ దస్కరత దెచ్చిన నీయెడ చెట్లచెంగటన్
నిలిచి దిగీశజాతహరి నేసినయట్టి నిశాటహంత గా
సిల నరి జేర నేఁగి నతి జేసిన కైకసిఁ గన్న చిన్నదా
గలిగిన యార్తి దాల్చఁ గనికం జడియెన్ దెఱఁ గెద్ది నా కిటన్.

120

క.

ఖరహంతయె సాక్షాత్క్రియ
హర యని తెలియంగలేక యాహా ధృతి సం
గరకరణదృష్టి నిలిచిన
సరణి కిచటి కరిఁగితిన్ నిశాచరనాథా.

121


చ.

అలయక నాకనాథదహనార్కజనైరృతకంధినాయకా
నిలధనదాంగబాద్వఖలనిర్జరసంహతి, యయ్యజియ్యలన్
గలఁత శతాందగంధగజకాండనటీనటరత్నశాటికల్
కలయఁగ [78]నిచ్చి నంతటనె, కానక నిక్కితె రాక్షసాగ్రణీ!

122


క.

అనిన యఘచింతన ని
న్నానందించంగఁజేయ నకట దశాస్యా
యేనెఱిఁగించిన హితగతి
గానక నేర్చెదె చెడంగఁ గడతఱి యయ్యెన్.

123


క.

కన్నిచ్చయైన చక్కని
కన్నెల్ నీసడన ధాత్రి గల్గగ సాక్షా
త్కన్నిధి కన్యక సీతన్
గ్రన్ననఁ దేనేల జాలిఁ గ్రందఁగ నేలా!

124


క.

ఏటికి జానకి దెచ్చితి,
యేటికి యారాక్షసారి కెడ జేసితి హా!
యేటికి కలిగిన యలజడి
యేటికి యంతరల జేర నిద్ధచరిత్రా!

125


క.

గట్టిగ జలనిధిగట్లం
గట్టించె, నసంఖ్యలైన ఘనహరిసేనల్
నెట్టన లంకానగరికి
కట్టై నిలిచె, నిక నెట్లు కడతేఱంగన్.

126


ఉ.

[79]శైలజిదాదిఖేచరనిశాచరసంతతి సంతసిల్ల నీ
యేలిక యద్రిజేశిత యహీనశరాసనయష్టి యంఘ్రిచేఁ

గేలధరించి యెక్కిడిన, గెంటినలన్గనెలయ్యె నాదయా
శీలి, నరాగ్రణిన్, గణన సేయఁగ నేర్చెద యెన్నిజాడలన్.

127


క.

కానక గిరీశస్రష్టల
హీనక్రియ నిచ్చినట్టి హేలాశక్తిన్
హాని దలంచక యెద నెం
తేని రచించంగ నేల దితిజాధ్యక్షా!

128


క.

ఆనరనాయకహేళి ద
యానీరధి గనుక, జనకజాంగన నయసం
ధానగతి నిచ్చి శరణన
గానే రక్షించగలఁ డికన్ జాగేలా.

129


క.

అని యాడి హేతిరీతిన్
తనకట్టెద గాఢనధికధైర్యస్థితి జా
రిన జారనీక చంద్రన
యన యలజడి యడఁగఁజేసి నయగతి దేరన్.

130


మ.

తరళాక్షీ! హితశక్తి నీసనయగాథల్ లెస్స యాలించ నా
కరయంగా సరిచాక నేనిక నరాహారాళికిన్ గర్తనై
నరకీటాకృతిఁ దాటకారి కతిదైన్యక్లేశసంక్రాంతిచే
ధరణీకన్యక నిచ్చినన్ నగరె దిగ్ధాత్రీశితల్ కేరికన్.

131


శా.

హాలాహాలధృతిం శిరశ్ఛటలచే నర్చించితిన్ జక్కఁగా
కైలాసాద్రిఁ దృణాకృతిన్ ధృతకరాగ్రశ్రేణిచే నెత్తితిన్
లీలన్ దిక్తలనేతలన్ గెలిచి జాలిం జెందఁగాఁ జేసినా
నేలా! నా కిక దైన్యచర్య యటగా యెగ్గించఁగా యందఱల్.

132


క.

తేఁదగ దంగన దెచ్చిన
నీఁదగ దిచ్చెదనటన్న హీనస్థితికిన్
రాఁదగ దెల్లెడ నాఱడి
గాఁదగ దీసరణి లెస్స గానఁగరాదే.

133

తే.

చెలియ! శక్రాదినిర్జరశ్రేణికైన
స్రష్టకైన నగేంద్రజాజానికైన
కాలగతి దాటఁగారాని కతనఁ జేసి
ధాత్రి నస్థిరదేహినై [80]తలడ నేల!

134


చ.

అతని రణాంగనస్థలి నయక్రియ సంధిల నేనె గెల్చినన్,
హితగతితో జగత్త్రితయి నేలెద రాక్షసకర్త లెన్నఁగా
నతఁడే రణాంగనస్థలి నయక్రియ సంధిల నన్నె గేల్చె నా
హితగతి నైక్యలీల ధరియించెలఁ జిల్లరగాథ లేటికిన్.

135


క.

అని చంద్రహాసి నిజగే
హినికిన్ హితశాస్త్రసరణి యెఱఁగంగాఁ జే
సి, నితాంతస్నేహక్రియ
ననిచెన్ రాజగృహధాత్రి కక్కడ నంతన్.

136


క.

కానంగా నీఁగె తెరల్
తేనియతట్టాగినట్టి తేటన్ ధృతి లం
కానగరస్థలి నిండిరి
యా నగచరసేనలెల్ల నాశ్చర్యగతిన్.

137


సీ.

సాలహింతాలరసాలహరీతకీ
             క్షితిజశాఖారాజిఁ జెలఁగి చెలఁగి
కలితరాజిగృహాగ్రగాంగేయకలశకే
             తనదండసంహతిఁ దఱిఁగి తఱిఁగి
రధ్యలధనధాన్యరత్నచిత్రికలచేఁ
             దారహారశ్రేణిఁ దార్చి తార్చి
దానరాజితనాగసైనికస్యందన
             కంఖాణసంతతిఁ గలఁచి కలఁచి
ఘనఘనాఘననిర్జాడ్యగర్జ లెసఁగఁ
జేసి, దితిజాంగనల గాసి చేసి చేసి,

యచట గాంచిన హరిసేన లచట నచట
లంక నిండంగ సాగి రేశంక లేక.

138


క.

[81]నగరీస్థలి నిండిన యా
యగచర[82]సేనాట్టహాస హాసక్రియలన్
జగడించి దిగ్గనడచిరి
జగతి చరించంగ రాత్రిచరఘట [83]లల్కన్.

139


మ.

ఘననిస్సాణఝణంఝణల్, కరటి ఘీంకారక్రియల్, శాతసా
ధననీరంధ్రతళత్తళల్, గతినటత్కంఖాణహేషల్, నరా
శననిర్ఘాతదృఢాట్టహాసరచనల్ సంధిల్ల ఢాకన్ దశా
స్యనిశాటక్షితినేత ధాటి గదలెన్ హర్షాతిరేకస్థితిన్.

140


క.

ఏతెంచినట్టి లంకా
నేతం గని యర్కజాదినిఖిలహరిఘటల్
సీతానాథాజ్ఞారతి
చేత నిలచి రాశలెల్ల జెదఱఁగ నంతన్.

141


చ.

[84]అనిలసఖాకృతిన్ గనలి, యాదశకంఠనిశాటనేత కాం
చనరథగంధనాగహయసైనికకర్తల హెచ్చరించఁగా
గని, హరిజాదికీళతతి గాఢరయక్రియచేత నేఁగి చె
ట్ల నచలశృంగగండశిలలన్ దిగియేయఁగ సాగి రయ్యెడన్.

142


సీ.

చెక్కలై గాండ్రలై చిద్రలై నలిఁగిన
             దిశలనిండినయట్టి తేర్లచేతఁ
గడరెక్క లెడలిన గట్లనాద్రెళ్లిన
             గంధగంధిలదంతిఘటలచేత
గాఢలంఘనల జంగల్గనెలై ధాత్రి
             తల్లక్రిందైన తత్తళ్లచేత
నాకారలేఖ లింతైన కానఁగరాఁగఁ
             జతికిన రాక్షసచ్ఛటలచేతఁ

గలిగి దశకంధరనిశాటకర్తసేన
లానఁగాలేక యంచితగ్లానిచేత
నందఱల్కన్నదే నాగనార్తి జనిరి
నింగి నిర్జరసంగతి నిచ్చగించ.

143


తే.

చెక్కలై నట్టి యరచాలఁ జిదికినట్టి
గంధనిజరాజిరేఖల గండ్రలైన
యట్టి తత్తళఁ గలిగి దశాస్యసైని
కచ్ఛటల్, గన్నదేగాట గదలెనంత.

144


ఉ.

ఆయెడ గైకసేయఖచరాహితకర్తఖరారిదాయి య
త్యాయతశక్తిఁ [85]దారసిల యచ్ఛశరాసనశింజినీగళ
త్సాయకరేఖలం గనల స్రగ్గఁగ జేయఁగ సాగి రష్టది
ఙ్నాయకసిద్ధసాధ్యఖగనాగఘటల్ గని దద్దరిల్లఁగన్.

145


క.

[86]అనిలాశననాథకళా
జనితధరాధీశహేళి సంగడియై ని
ల్చిన [87]దనదాయిని చక్కఁగ
గని, దాళకయంగయష్టిఁగా దగనచటన్.

146


చ.

ధృతి దశకంఠదైత్యకరి[88]దృగ్జనితాగ్నిశిఖాకణచ్ఛటల్
క్షితిగగనస్థలిన్ దిశలఁ జిత్రగతిన్ గలయంగ నిండఁగా
శతధృతి దత్తచండతరశక్తి రయక్రియ నెత్తి యేసి యం
చితదితిజాద్రిచారితతి చేష్టలడంగి కనంగ నయ్యెడన్.

147


తే.

దశగళత్రిదశారాతి దాయిదాని
రానరసి కాంచి రాక్షసారాతిదాయి
యతని యగ్రధరిత్రి తా నడ్డగించ
శక్తి దాక నిలాస్థలిఁ జారె నంత.

148

చ.

ఎంచఁగ ధాత్రి జారిన యహీనకళాజనితక్షితీశతన్
గాంచి దశాస్యరాత్రిచరకర్త రథస్థలిఁ డిగ్గజేరి య
త్యంచితశక్తిచేత, కదలాడఁగ జేయఁగలేక గానలన్
సంచలితాంగయష్టియయి చాలనదల్చె ఖరారిఢాకచేన్.

149


తే.

సారథిని డించి హయతతి సంహరించి
తేరిలం ద్రెళ్లనేయ [89]దద్దర్లి తరల
ఘనకిరీటచ్ఛటల్ రాలఁ గైకసేయ
రాక్షసాగ్రణి లంక జేరంగ నరిఁగి.

150


వ.

అంత.

151


చ.

ఎనయఁగ నేల ద్రెళ్లిన యహీశకళాజనిరాజహేళి, నా
యనిలజకీశనేత గదియం జని కేల గ్రహించి యాజినం
దననరకర్తచెంత నిడినన్, సనయక్రియ లేచి సాగె నిం
గి నిఖిలనిర్జరచ్ఛటలకీర్తన లెల్లెడ నిండి సాగఁగన్.

152


వ.

అయ్యెడ దశకంఠలేఖారి దద్ద(ర్లి)రిల్లి రాలిన కిరీటాద్యలంక్రియలు,
చినిగిన హాటక[90]నిశాటికలు, గండ్రలైన సారథిశకలాంగకంఖాణచ్ఛటల్
గలిగి యద్రిచరరేఖల్ హసించ, నిశాటసేనల్ నశించ లంకానగరిఁ జేరి
యంతస్స్థలి కఱిఁగి, హితసంతతి యాచ్ఛాదించ, సింహాసనస్థిర నధిష్ఠించి
తనయార్తి యందరల కెరింగించి కలశకర్ణరాక్షసనేత నిద్రదేర్చ హిత
దండనాయకకర్తల ననిచినయెడ.

153


సీ.

అధికనాసాకందరాయాతయాతాని
             లాహతి నింగి యట్టట్టె [91]యదర
నశనిసంకాశదంతాగ్రజకిటికిట
             నినదసంతతికి కంనిధి కలంగఁ
గఠినతంద్రాక్రాంతగాథల హరిహరి
             కర్తల కట్టెదల్ గాసిఁ జెందఁ

జిరతర కఠినాంఘ్రీకరదంతసంసర్గ
             ఛిద్రలై నల్దిశల్ చెదరిరాల
నిగిడి గాంగేయశిఖరి కెళ్లెగసి చాల
చండచండాకృతి ధరిత్రి సాగెననఁగ
శయ్యకడ నిద్రజెందెడి శస్తకలశ
కర్ణఖచరారి నీక్షించి కదియనేగి.

154


తే.

అఖిలకరతాడనక్రియ నశనినాద
హరణ కఠినాట్టహాససంసరణి దండ
దళితనిస్సాణధణంధణల నిద్రఁ
దెలియజేయంగనేరక తిరిగి తిరిగి.

155


సీ.

దహనతీక్ష్ణకటాహతైలధారల్ నాసి
             కాంతస్థలి దిగంగ నానియాని
కైలాససంకాశగండశిలల్ దెచ్చి
             డాసి నెత్తిఁ దటాన నేసియేసి
గంధగంధిలదంతి కఠినశృంగాగ్రస్థ
             సితహేతి లతికేలఁ జెలఁగి చెలఁగి
శక్తిసాయకగదాచక్రాసిరాజిసా
             ధనతతి క్షితిచేతఁ దరఁగి తరఁగి
ఝల్లరీతాళనిస్సాణశంఖకాహ
ళాట్టహాసక్రియలచేత నార్చి యార్చి
నిద్ర తెలియంగఁ జేసిరి నిలచి కలశ
కర్ణఖచరారి యత్యంతగాఢశక్తి.

156


క.

ఈరీతి నారగించిన
యారాక్షసకర్తఁ జేరి యతిరయగతి లం
కారా జచ్చటికిని ని
న్నారయ రా ననిచెనన్న నల్లన లేచెన్.

157

వ.

ఇట్ల లేచి నిలచిన.

158


ఉ.

కానక నింగి [92]నీరరథగజ్జెల తాళనిదానఁ జేసి గ
ర్జానినిశాకరచ్ఛటలఁ జక్కఁగ దెచ్చి ఖరారిఁ జేరఁగా
యానిజ జాడ నిల్చి చని యార్తి ఘటిల్లఁగఁ గీశసేన లా
హానినదక్రియన్ ఖర ఖరారి యదాటల డాగె నయ్యెడన్.

159


ఆ.

కలశకర్ణదైత్యకర్త యాయాస్థాని
యన్నకాళ్ల కెఱఁగి యతనియాజ్ఞఁ
దగిన గద్దె నిల్చి తహతహ నల్దిశల్
గాంచి యధికచిత్రగతి గణించి.

160


క.

నెలలేని రాత్రి జాడన్
గలయఁగ నాస్థానసరణి గానఁగ నయ్యెన్
దెలియఁగ గనిష్ఠసహజని
కలదా? లేదా? యెఱుంగఁగా జేయఁగదే.

161


వ.

అనినఁ గలశకర్ణఖచరారిఁ గాంచి యనేకచర్యల గణియించి దాశరథి
దండకారణ్యాని కేతెంచి సకలజటినేతల్ గీర్తించిన రాక్షససంతతి
సంహరించ శరతి(?) రచియించి లాలించిన, శక్తి చెల్లెలైన రక్కెస కర్ణ
నాసికల్ గీయించినసరణి ఖరాదిరాత్రించరకర్తల ఖండించిన దండి
యది గనక జనకతనయం జేరఁదెచ్చిన నడక, యాంజనేయహరి దాని
జాడ నేతెంచి యతని గేహిని నరసి, శృంగారకాంతారశాఖిరేఖలఁ
ద్రెళ్లన నడఁచి యక్షకహంతయై, లంకారాజధాని నగ్నిశిఖచే స్రగ్గించి
తిరిగి చనిన కరణి, కైకసికనిష్ఠనందననిశాటనేత యరాతి నాశ్రయిం
చిన దాశరథి గిరిచరసేనలచే గట్లకట్ట కట్టించి సాలాంగణస్థలి నాగిన
నాద్యంతస్థితి దశాననరాక్షసాగ్రణి యెఱిఁగించిన నర్థఘటిక చింతించి
యన్న కిట్లనియె.

162


మ.

అకటా! కాఁగల కీ డెఱుంగక నిశాటాధీశ నిరీతి జా
నికిఁ దేనేల! ధర న్నరేంద్రతనయల్ నాగాంగనల్ సారక

న్యక లత్యంతకళాధరల్ సరసయత్నశ్రీల రంజిల్లఁ గా
నక నిష్కారణఖేదదైన్యగతిఁ జెందన్ జాలకే యన్నిఁటన్.

163


క.

ఈ నేలకన్న కన్నియ
దేనేల దిశల్ చలించ ధృతి హరిసేనల్
రానేల లేని యలజడి
గా నేల నిరర్థనింద గా నేలనయా.

164


సీ.

చెలియలి కర్ణనాసిక లంటఁజెక్కె, ఖ
             రాదిరాక్షసరాజి నాజి నడఁచె
ననిలజహరికర్త నక్షకహంతయై
             తెగి లంక యగ్నికిఁ దిండి జేసె.
జానకిఁ దెచ్చినజాడఁ జక్కఁగ గాంచి
             యల కీశసంతతిఁ గలసి నిలచె
యల్క సంధిల డాయి యరి జేరఁగా నేఁగెఁ
             గట్టించె జలరాశి గట్లచేత
నర్థి సాలాంగణస్థలియాగి హెచ్చె
నని దశానన కాగల యత్నసరణి
తేలనాడిరి యింక నే దీర్చ నాచ
గలనె చాల్చాల దేటి కీగాథ లేల.

165


క.

కానక చేసినదానికి
దశరథరాజనందన చరిత్ర
జానకి దిరగంగ నిచ్చి శరణని యాడం
గానే రక్షించంగలఁ
డా నరనాథ హరి తా దయానిధి గాఁడే.

166


ఉ.

ఎంచ నిశాటసంతతి జయించగ, నాశ్రితదాసరాజి ర
క్షించఁగ శేషశాయి హరిక్రీడ ధరాతనయాధికర్తయై
నించినకీర్తి సంధిల జనించిన కట్టడి, యాది నా కెఱిం
గించె రణాశ నర్థి యడగించఁగ రిత్త చనంగ నేర్చనే.

167

తే.

అనిన యతనిగాథ లాలించనేరక
యల్క నడఁచి నీతి యతిశయిల్ల
దాయిఁ గాంచి కాంచి దశకంఠలేఖారి
యందఱ ల్గణించ నాడె నంత.

168


చ.

అసదృశశక్తి నెత్తితిఁ దృణాకృతి నాగిరికన్యకాగిరీ
శసహితతారకాద్రి హరశక్రధనంజయదండదైత్యనా
థ సరిదధీశ కార్థిగతి దాస్యగతిన్ జరియించ నన్నిటన్
నెసఁగితి, నాతగాని కిఁక నేల చలించ నిశాటశేఖరా!

169


తే.

ఆజి నీయంతదాయి నాయండ నిలచె
నన్న సత్కీర్తి కెంతె కా కధికశక్తి
కిన్కచే దాశరథిఖిని, గీశరథికి
జడసెనా, నీసడించరె జన్యధాత్రి.

170


క.

నిచ్చనిరాహారక్రియ
హెచ్చిన నేనని రచించ కీల్గితినేనిం
జెచ్చెఱ హరధాతల్ నా
కిచ్చిన కాంక్షాతిశయత లేగతి యయ్యెన్.

171


ఉ.

సీతయె కంధినందనగఁ, జెంత ఖరారియె శేషశాయిగా
నీతి ఘటిల్లగా నెఱుఁగనేరనె! దాచఁగ నేటి కాజి నే
నాతనిచేతఁ ద్రెళ్లీ సనకాదియతిచ్ఛట లందలేని యా
ఖ్యాతిఁ డనర్చి సద్గతికిఁ గాఁచితిఁ జిల్లరగాథ లేటికిన్.

172


ఆ.

శిష్టరక్ష నహితశిక్ష సేయంగ దై
త్యారి ధర జనించె నంటి గనక
సీత నిచ్చి లజ్జ చెడిన దింతియెగాక
తిరిగి చనఁగనేరఁ డరయరాదె.

173


వ.

అని యాడిన దశకంఠలేఖారిం గాంచి.

174


క.

ఆడదగినట్టి నయగతి
యాడినతెఱఁ గింతెగాక యకటా నే నీ

జాడల తిరగక నడచిన
యాడికగాదే నిశాచరాళి తెగడరే!

175

ఆశ్వాసాంతము

క.

చండద్విపతుండ[93]నిభో
ద్దండభుజాదండపరశుదండితరిపురా
ట్కాండశిరో[94]మకుటమణీ
మండితమహితాహవక్షమాదిగ్భాగా!

176

ముక్తపదగ్రస్తము

చ.

అమలవిచార చారణనగాపహవిక్రమసంగ సంగర
క్రమఘనదక్ష దక్షజనకస్ఫుటమానసధామ ధామవి
భ్రమజితమిత్త్ర మిత్త్రపరిపాలననీతినిదాన దానవా
గమసురరాజ రాజకులఖండనఘోరకుఠారభృత్కరా.

177


స్రగ్విణీవృత్తము.

దీనచింతామణీ, దేవతాగ్రామణీ
భానుకోటిద్యుతీ, భార్గవీహృత్పతీ
గాననాదక్రియా, గర్భలీలోదయా
దానవీభంజనా, ధర్మబోధాంజనా.

178

గద్య
ఇది శ్రీమత్కర్పరాచల లక్ష్మీనృసింహ వేంకటేశ్వర వరప్రసాదలబ్ధ సకలై
శ్వర్య ధురీణ శారదాప్రశ్నవివరణ శతఘంటావధాన వినయధునీ
తరంగవిజృంభణాజృంభిత సలలితమృదుమధురవాగ్వైఖరీఝరీధురీణ
స్థాపిత శేష విశేషప్రసిద్ధ సాహిత్య సారస్వతాశుకవితాష్ట
భాషావిశేష సంస్కృతాంధ్ర నిరోష్ఠ్యోష్ఠ్యాది వింశతి
ప్రబంధనిర్మాణధురీణ మౌద్గల్యమహర్షి గోత్ర పవిత్ర
తిరుమలదేశికేంద్ర పౌత్ర తిరువేంగళాచార్య పుత్ర
మఱింగంటి సింగరాచార్య కవిరాజప్రణీతంబయిన
దశరథరాజనందనచరిత్రయను నిరోష్ఠ్య
మహాప్రబంధంబునందు జతుర్థాశ్వాసము.

This work was published before January 1, 1929, and is in the public domain worldwide because the author died at least 100 years ago.

 
  1. విశ్రగుణ (శి)
  2. నాకనాథజదాది (ము)
  3. చేసె (శి)
  4. సాహసితమై
  5. చెద (ము)
  6. శరాసనార్త (ము) శరాసనాంత (శి)
  7. దలఁగించి (ము)
  8. కట్టి (ము)
  9. హాహాల (ము)
  10. హితజాలసంగతిన్ (శి)
  11. నద్ది (ము)
  12. క్షారనాథినయతఖ్యాతిన్ (ము)
  13. కనఁగనాడె (ము)
  14. ధనకాంత (శి)
  15. అనతిక్రియ (గ)
  16. గట్టిరల (శి)
  17. గట్టగట్టించి
  18. ఘటల నెనసి లంక గదియంగ జనియె శృంగాద్రి యెక్కి నిలిచె హర్షశక్తి (శి)
  19. ఈపాదము సగమే యుండఁ దక్కినదాని బూర్తి గావించితి - ఇట్లు లేఖనకర్త (ము)
  20. జగతిరసాతలఁగగనచారిత లయ్యెడను నెదలందు జంకును ధరించి (ము)
    జగతిరసాతలగగనచారేశిత లయ్యెడిం జయలిడి హాస్యగతిని(శి)
  21. నర్చించి జన్యస్థలిన్ (శి)
  22. సదాచారనియతి (శి)
  23. దాశరథి చరణధూపఖ్యాతన్ (శి) దాశరథి...దాన (ము)
  24. సకలసన్నాహాతి
  25. చేసిచెంత
  26. లెక్కించరాని (శి)
  27. అల్క (గ)
  28. నల చేదిన్నిలసెనట్టి నడక దెలియఁగన్ (ము)
  29. కైకసిజనతాగ్రజనిశాటకర్త (శి)
  30. శరధృతి (గ) కానిపాఠము సరసముగాలేదు.
  31. రత్నాకరాంతర (శి)
  32. అంచితశ్రీలీలచే చాల నతిశయిల్లి (శి)
  33. సంచలించంగ లేక కాక (శి)
  34. అజ్ఞానగతిం నన్నడగంగా నేటికి (శి)
  35. చక్రహస్త (వ్రా) శాకలేశ (ము)
  36. గోయించె (శి.గ)
  37. కంగదతా(ము)
  38. అంగదకీశకర్త (ము)
  39. లంకకర్త కతి (శి)
  40. .... గ్రహించి నల్దిశల్ గలయ నిరీక్షించి (శి)
  41. నిన్జనయిత (ము)
  42. తాటక దెల్చి(ము)
  43. సీతాధినేత(శి) నరాధినేత (ము)
  44. దెగటారగ (ము)
  45. ఈపద్యము కొంత శిథిలమగుటచే పూర్తిగావించితి (ము) ఇట్లు లేఖనకర్త.
  46. కొట్లాడెడి
  47. కంనిధి: సముద్రము
  48. నలికట్టె నిర్జించె నాతఁడెంత? (శి) నాడదెంత? బదులు నాతఁ డెంత? (శి)
  49. ఖగారి (శి)
  50. నలినర్థి (ము)
  51. అరయక గణనల్ చేసెద
  52. గెట్టించిన నిందగాక కీర్తి గలిగెనే (ము)
  53. యలికల యర్చించరాదె యింటింటకడన్ (శి)
  54. (శి) లో లేదు... జెల్లెల్ (గ)
  55. నీదంగరాదె (శి)
  56. 88 పద్యము తరువాత 'శి' ప్రతిలోగల పద్యములు:
    వ. అదిగాక నాయంతఃకరణస్థితిం దెలియఁజేసెద.
    ఉ. కానఁగ నేరకే యలృతగాథ లికేటికి నాడ నక్కటా
        కానఁ జగజ్జనిత్రి తనకీర్తిన దెచ్చిన (యట్టి) జానకీ
        జాని కరాస్త్రధారఁ దెగి సద్గతి గాంచెదనన్న కాంక్షచే
        నే నిట నింతఁ జేసితి గ్రహించర నాతెఱఁగెల్ల చల్లఁగన్.
    క. జనకజ సాక్షాత్త్రిజగ
        జ్జననీయతి సాదరచరయా...
        యన.....
  57. తనసేనల్
  58. గిరిశాసనజిచ్ఖగారి (ము)
  59. చరణకటకఝళఝళలచేత (శి)
  60. కలితనిస్సాణఘణంఘణలచేత (శి)
  61. ఈచరణము శి.గ. ప్రతిలో లేదు.
  62. 96 నెం. పద్యము 3 వ చరణము 2 వ చరణముగా, 2 వ చరణము 4 వ చరణముగా, 4 వ చరణము మూడవ చరణముగా గలవు. (శి}
  63. గళాస్త్ర(శి)
  64. లెసఁగె (శి)
  65. రాత్రి (శి)
  66. 104 తర్వాత 'శి' ప్రతిలోగల పద్యము.
    క. తనతండ్రి కాజయక్రియ
        యనతస్థితిఁ దెలియఁజేయ హర్షించి దశా
        నననిర్జరారి నయగతి
        తనయాగ్రణిఁ గౌఁగిలించె దయచే నంతన్.
    (5 ఆశ్వాసము 30 పద్యమునకు దీనికి పోలిక గలదు.)
  67. కర (శి)
  68. కనగ శాసించి....
  69. 106, 107 సంఖ్యకు గలభాగములు శి.గ.లలో లేవు.
  70. ఘటికోట్ల కడనయంట (శి. గ.)
  71. ధరాధరచ్ఛటల్ (శి)
  72. నీలగశాస్త్ర (ము)
  73. కన్నిధిగాతగయా (ము)
  74. సంహృతి
  75. కలగ (ము)
  76. తెలిసెన్ హా నరకీటక (శి)
  77. నేరానె (శి.గ)
  78. నిల్చి (ము)
  79. శైలజిదారి (శి)
  80. తలఁగ
  81. నగరస్థలి (శి)
  82. సేనలఘనాట్టహాస (శి)
  83. లంతన్ (శి)
  84. అనలస ఆకృతిం (శి)
  85. దారసిలి (శి)
  86. అనిలాశదాథకళా (ము)
  87. తనదాయిం జయ్యన (శి)
  88. దృగ్జనితాగ్ని (శి)
  89. (దద్దరిల) పై పాఠమే (శి)
  90. శాటికల్ (శి)
  91. యరయ (ము)
  92. నీరధర (శి. గ.)
  93. నమో (ము)
  94. మణిమకుట (ము)