Jump to content

తెలుగు భాషాచరిత్ర

వికీసోర్స్ నుండి

తెలుగు భాషా చరిత్ర

సంపాదకుడు
భద్రిరాజు కృష్ణమూర్తి
భాషాశాస్త్ర శాఖ
ఉస్మానియా విశ్వవిద్యాలయం, హైదరాబాదు.

ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి
కళా భవన్, సైఫాబాదు.
హైదరాబాదు – 500 004
1979

ప్రథమ ముద్రణ 1974
ప్రతులు 1500
రెండవ ముద్రణ జనవరి 1979
ప్రతులు 5,000

వెల రూ. 16-00

Paper used for the Printing fo this book was
made available by the Government of India at concessional rate. (Partly)

ముద్రణ :
శివాజి ప్రెస్,
సికింద్రాబాదు.

ఎమ్. కందప్పచెట్టి స్మృతికి

తొలిపలుకు

డా. భద్రిరాజు కృష్ణమూర్తిగారి సంపాదకత్వంలో వెలువడుతున్న 'తెలుగు భాషాచరిత్ర' తెలుగులో ఇటువంటి గ్రంథాలలో మొదటిది. ఇంతవరకు తెలుగు సాహిత్య చరిత్రలేగాని సమగ్రమైన తెలుగు భాషా చరిత్ర రాలేదు. తెలుగుభాషపై భిన్నకాలాల, భిన్నాంశాలనుగూర్చి పరిశోధనలు జరిపిన పండితులు ఈ గ్రంథంలోని వివిధ ప్రకరణాలను రచించినారు. ఇటువంటి గ్రంథాన్ని ప్రకటిస్తున్నందుకు సాహిత్య అకాడమీ సంతోషిస్తున్నది.

అకాడమీ గత పదిహేడు సంవత్సరాలలో ఏ సంస్థలూ, ప్రచురణ కర్తలు చేయని ముఖ్యమైన ప్రచురణలు చేసినది, 'మాండలికవృత్తిపదకోశం' మొత్తం భారతీయ భాషలలోనే తొలిప్రయత్నము. మహాకవుల పదప్రయోగకోశాలు భావిలో తెలుగుభాషపై పరిశోధనలు చేసేవారికి కల్పతరువులు. ఈ కోవలో చెప్పుకోదగ్గ పనులలో 'తెలుగుభాషా చరిత్ర' ప్రచురణ ఒకటి.

తెలుగు భారతరాజ్యాంగము గుర్తించిన నాలుగు ద్రావిడ భాషలలో ఒకటి. భారతదేశంలో ద్రావిడభాషలను మాట్లాడేవారిలో తెలుగు మాట్లాడేవారి సంఖ్య అన్నిటికంటే ఎక్కువ. మొత్తం భారతదేశంలో హిందీ తరువాత ఈ విషయంలో తెలుగు రెండవస్థానం ఆక్రమిస్తుంది. దీనికి చాలా ప్రాచీనమైన సాహిత్యము, చరిత్ర ఉన్నది. నన్నయకు ముందు వెయ్యిసంవత్సరాలనాటికే తెలుగు స్వతంత్ర భాషగా స్థిరపడినట్లు కనిపిస్తున్నది. ఆనాటి తెలుగుభాషాస్వరూపాన్ని తెలుసుకోవటానికి శాసనాలే ఆధారం. నన్నయ తర్వాతకూడా తెలుగులో వచ్చిన మార్పులను తెలుసుకోవాలెనంటే శాసనాలే ప్రధానాధారాలవుతున్నాయి. సమకాలీన వ్యావహారిక భాషాస్వరూపం కొంతవరకైనా శాసనాల్లో కనిపిస్తున్నది. ఈ గ్రంథంతో నన్నయకు ముందునుంచి 18వ శతాబ్దివరకు సుమారు రెండువేల సంవత్సరాల శాసన భాషాచరిత్ర సమగ్రంగా దర్శన మిస్తున్నది, కావ్యభాషాచరిత్రకూడా ఇందులో ఉన్నది. అట్లాగే తెలుగులో ఇతర భాషాపదజాలం, తెలుగులిపి పరిణామం, అర్థపరిణామం, మాండలిక భేదాలు మొదలైన విషయాలు ఇందులో చర్చింపబడినవి. ఆధునిక భాషాస్వరూపం సంగ్రహంగానే అయినా సమగ్రంగా మొదటిసారి చర్చింపబడింది ఈ గ్రంథంలోనే తెలుగుకు ఇతర ద్రావిడ భాషలతోగల సంబంధం స్పష్టంగా ఈ గ్రంథంలో కనిపిస్తున్నది. మొత్తంమీద ఈ గ్రంథం సమగ్రమైన, ప్రామాణికమైన తెలుగుభాషాచరిత్ర లేని లోటును తీరుస్తున్నదని నమ్మకము. తెలుగును. ప్రధానవిషయంగా అధ్యయనం చేసే విద్యార్థులకే కాక, అంతకంటె ఎక్కువగా తెలుగుభాషపై పరిశోధనలు చేసే పండితులకు గూడా ఇది సహాయకగ్రంథంగా ఉపకరించగలదని ఆశిస్తున్నాము.

కోరినంతనే ఈ గ్రంథానికి సంపాదకత్వం వహించటానికి అంగీకరించి, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, కొంత ఆలస్యమే అయినా గ్రంథాన్ని సమగ్రంగా వెలువరించిన ఉస్మానియా విశ్వవిద్యాలయ భాషాశాస్త్రశాఖాధ్యక్షులు భద్రిరాజు కృష్ణమూర్తిగారికి, ఆయా అధ్యాయాలను రచించిన వ్యాసకర్తలకు, సంపాదక సహాయకులకు సాహిత్య అకాడమీ పక్షాన కృతజ్ఞతలు.

హైదరాబాదు

దేవులపల్లి రామానుజరావు

2-9-75

కార్యదర్శి     

తొలిపలుకు

(రెండవ ముద్రణము)

డా. భద్రిరాజు కృష్ణమూర్తిగారి సంపాదకత్వాన వెలువడిన ఈ 'తెలుగు భాషాచరిత్ర' మొదటి ముద్రణకు సంబంధించిన ప్రతులన్నీ సంవత్సరంలోనే చెల్లిపోయి ద్వితీయ ముద్రణావశ్యకత ఏర్పడినది. దీనివలన ఈ గ్రంథం ఆవశ్యకత స్పష్టంగా తెలుస్తున్నది. అన్ని విశ్వవిద్యాలయాల్లోని తెలుగు ఎమ్. ఏ. పరీక్షలకు ఇది పాఠ్యగ్రంథంగా ఉన్నది. ఈ విధంగా ఈ గ్రంథం ఆధ్యాపకుల, విద్యార్థుల అవసరాన్ని తీర్చగలిగినందుకు ఆంధ్రప్రదేశ్ సాహిత్యఅకాడమీ సంతోషిస్తున్నది.

ఈ ద్వితీయ ముద్రణలో ఆయా ప్రకరణాల రచయితలు అనేకమైన మార్పులు, చేర్పులు చేసినారు. ఒకరిద్దరు తమ ప్రకరణలను నూతన పరిశోధితాంశాలు ఆధారంగా పూర్తిగా తిరిగి వ్రాసినారు. కాబట్టి మొదటి ముద్రణ తరువాత జరిగిన పరిశోధనా ఫలితాలుకూడా చేరటంవల్ల ఇది మరింత ఉపయోగకారి కాగలదని చెప్పవచ్చును. ఆ యా ప్రకరణాల రచయితలందరికీ అకాడమీ పక్షాన కృతజ్ఞతలు. త్వరలోనే ఈ గ్రంథం ఆంగ్లంలో కూడా వెలువడనున్నది.

ఈ గ్రంథాన్ని రెండవ ముద్రణకుగాను సవరించి అందించిన సంపాదకులు ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి గారికి కృతజ్ఞతలు. ప్రూపులు చూడడం మొదలుకొని ఈ గ్రంథం ముద్రణలో అన్నివిధాల సహకరించిన డా. కె. కె. రంగనాథాచార్యులుగారికి, ముద్రణను నిర్వహించిన శివాజీప్రెస్ వారికి అకాడమీ పక్షానకృతజ్ఞతలు.

హైదరాబాదు

28 - 1 - 1979

దేవులపల్లి రామానుజరావు

కార్యదర్శి

విషయసూచిక

పేజీలు

సంపాదకీయం (మొదటి ముద్రణ)… x

పీఠిక (రెండవ ముద్రణ)… xii

సంకేత వివరణం…xiii

ప్రకరణం

. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . .
1

15

52

103

143

173

206

8. కావ్యభాషా పరిణామం(క్రీ. శ. 1600 - 1899) - బి. రామరాజు…239
9. ఆధునిక యుగం : గ్రాంథిక వ్యావహారిక వాదాలు-బూదరాజు రాధాకృష్ణ…268
10. తెలుగులోని వైకృత పదాలు-తూమాటి దోణప్ప…300
11. తెలుగులో అన్య దేశ్యాలు-వి. స్వరాజ్యలక్ష్మి…326
12. తెలుగు లిపి పరిణామం-తిరుమల రామచంద్ర…343
13. ఆధునికభాష : సంగ్రహ వర్ణనం-చేకూరి రామారావు…357
14. తెలుగు మాండలికాలు : ప్రమాణభాష-భద్రిరాజు కృష్ణమూర్తి…397
15. అర్థపరిణామం-జి. ఎన్. రెడ్డి…427
16. తెలుగుభాషా చరిత్ర : సింహావలోకనం- భద్రిరాజు కృష్ణమూర్తి..452
17. ఉపయుక్త గ్రంథాలు…476
18. ముఖ్యపదసూచి…481

సంపాదకీయం

1971 జనాభాలెక్కల ప్రకారం తెలుగు మాట్లాడే వాళ్ళసంఖ్య 4.3 కోట్లు. తెలుగు భాషకు సుమారు రెండువేల ఏండ్ల చరిత్ర ఉంది. తెలుగులో బహుశా క్రీ. శ. 5, 6 శతాబ్దులకే కావ్య సాహిత్యం ఏర్పడి ఉంటుంది. ఏ భాషలోనైనా మొట్టమొదటిసారిగా సృష్టించిన సాహిత్యంలో ఉన్న బాష సమకాలీన విద్యావంతుల భాషకు అత్యంత సన్నిహితంగా ఉండి ఉంటుంది. నన్నయకాల నికే కావ్యభాష వ్యవహారభాష పరస్పరం దూరమౌతున్నట్టు మనకు స్పష్టంగా తెలుస్తుంది. కావ్య భాషకు పూర్వకవి రచనలు ఒరవడి అవుతాయి. వాడుకభాష సామాజిక వ్యవస్థలో వచ్చే మార్పులనుబట్టి ప్రజోచ్చారణ పరిణామాలనుబట్టి నియంతగా మారుతూ వస్తుంది. వ్యవహారభాషపై కావ్యభాషా ప్రభావం అన్ని శతాబ్దుల్లోనూ కనిపిస్తుంది. సమకాలీన వ్యవహారభాష ప్రభావం 15 వ శతాబ్దిదాకా కావ్యభాషలో కొద్దిగాను, ఆ తరవాత ఎక్కువగాను కనిపిస్తుంది. ఈ రెండు శాఖల క్రమపరిణామాన్ని పరస్పర సంబంధాన్ని నిరూపించటమే తెలుగుభాషాచరిత్ర లక్ష్యం. అసమగ్రమైనా తెలుగుభాషకు శాస్త్రీయమైన పద్ధతుల్లో రచించిన మొదటి చరిత్ర ఇదే అనటంలో అత్యుక్తిఏమీలేదు. జరిగిన రెండు మూడు దశాబ్దుల్లో వెలువడ్డ పరిశోధనవల్ల ఇది సాధ్యమైంది.

భాషా చరిత్రకు చెందిన ప్రత్యేక విషయాలపై పరిశోధనచేసి నిష్ణాతులైన, పన్నెండు మంది పండితులను ఆహ్వానించి ఈ గ్రంథం కూర్చటం జరిగింది. దీని ప్రణాళిక 1968 లో తయారైనా పుస్తకరూపంలో వెలువడడానికి ఏడేండ్లుపట్టింది. ఈ ప్రయత్నం ఫలించటంలో తోడ్పడ్డ ప్రకరణ రచయితలందరికి నా హృదయపూర్వకాభివందనలు.

ప్రూపులు దిద్దటంలోను, ఒకటి రెండు వ్యాసాలు తిరిగి రాయటంలోను, పదసూచి, ఉపయుక్తగ్రంథపట్టిక . సంకేత వివరణం మొ. వి. తయారు చేయించటంలో నాకు మొదటినుంచీ సహకరించిన మిత్రుడు రంగనాథాచార్యులకు నా కృతజ్ఞత. మాకీ అవకాశం ఇచ్చి తెలుగు దేశానికి మొదటిసారిగా ప్రామాణిక భాషా చరిత్ర అందించటానికి పూనుకొన్న ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీవారిని నేను అభినందిస్తున్నాను. మెత్తగాఒత్తిడిచేస్తూ ఇప్పటికైనా పుస్తకం వెలువడటానికి కావలసిన సంపూర్ణసహకారం ఇచ్చిన ఆకాడమీ కార్యదర్శి శ్రీ దేవులపల్లి రామానుజరావుగారికి మా వినతి.

మా ఆలస్యాన్ని సహించి ముచ్చటగా అచ్చువేసిన శివాజీ ప్రెస్సు వారు ప్రశంసార్హులు.

తెలుగుశాసనభాషలో అనన్యమైన కృషిచేసినవాడు కందప్పచెట్టి. అడిగిన వెంటనే ఈ గ్రంథానికి రెండు వ్యాసాలు పంపించాడు. పాపం ! అనుకోకుండా అకాలమరణం సంభవించింది. తెలుగుభాషా శాస్త్రాధ్యయనానికి తెలుగుదేశానికి అతని మృతి తీరని నష్టం. అతని దివ్యస్మృతికి ఈ సంకలనం అంకితం చేస్తున్నాము.

ఈ గ్రంథంలో వచ్చిన. చిన్న చిన్న పొరపాట్లను, తప్పులను పునర్ముద్రణలో దిద్దుకోగలమని పాఠకులకు మనవి చేసుకొంటున్నాను.

-భ. కృ

పీఠిక

(రెండవ ముద్రణ)

అచ్చువేసిన రెండేళ్ళలోపలే తెలుగు భాషా చరిత్ర కాపీలన్నీ అమ్ముడు పోయాయి. అన్ని విశ్వవిద్యాలయాల్లోను తెలుగు ఎమ్. ఏ. పరీక్షకు, ఓరియంటల్ పరీక్షలకు, కేంద్ర, రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ పరీక్షలకుకూడా దీన్ని పాఠ్యగ్రంథంగా నిర్ణయించటం ఈ గ్రంథం ఆవసరాన్ని, ప్రాముఖ్యాన్ని తెలుపుతున్నది. ద్వితీయముద్రణలో మొదటి ప్రతిలో వచ్చిన అచ్చుతప్పులను చాలావరకు సరిదిద్దే ప్రయత్నం జరిగింది. 2, 9, 13 ప్రకరణాల రచయితలు కొన్ని మార్పులు, చేర్పులు చేశారు. 6 వ ప్రకరణం పూర్తిగా తిరిగి రాయడం జరిగింది.

ఈ గ్రంథం ప్రధానంగా పరిశోధకవ్యాస సంకలనం. సామాన్య పాఠ్యగ్రంథాలకంటే ఎక్కువ వివరాలు, పరిశోధనగురుత్వం ప్రతి వ్యాసంలోను కనిపిస్తాయి. అందువల్ల ప్రధానంగా ఇది ఆధ్యాపకులకు సహాయగ్రంథంగా ఉపయోగిస్తుంది. ఈ వివరాలన్నీ సాధారణ విద్యార్థులు గుర్తు పెట్టుకోవటానికి ప్రయత్నించటం అనవసరం. నామ విభక్తులు, సర్వనామాలు, సంఖ్యావాచకాలు మొదలైనవి రెండువేల యేండ్ల చరిత్రలో ఏయే మార్పులు పొందినదీ భిన్న ప్రకరణాలనుంచి సేకరించి సమన్వయించుకోవలసి ఉంటుంది. నిజానికి ఈ మౌలిక గ్రంథం ఆధారంగా ఇలాంటి సమన్వయంతో మరోక పుస్తకం రావలసిన అవసరం ఉన్నది.

ఈ పుస్తకం కాపీలు అయిపోయి రెండేళ్ళకు పైచిలుకు అయింది. ఇది ఆంగ్లంలోకూడా రావలసి ఉన్నది. పునర్ముద్రణలో అయిన జాప్యాన్ని మన్నిస్తూ దీన్ని ఇతోధికంగా ఉపకరించటానికి సూచనలు చేస్తే సంతోషిస్తాను.

హైదరాబాదు

28 - 1 - 1979

భద్రిరాజు కృష్ణమూర్తి

సంపాదకుడు

సంకేత వివరణం

(ABBREVIATIONS)

గ్రంథాలూ--పత్రికలు

తెలుగు

అప్ప. - అప్పకవీయము

ఆం. ప. - ఆంధ్ర పత్రిక

ఆం భా. చ - ఆంధ్రభాషా చరిత్ర

ఆం. భా. భూ - ఆంధ్ర భాషా భూషణము

ఆం. భా. వి - ఆంధ్రభాషా వికాసము

ఆము. - ఆముక్త మాల్యద

ఆం. సా. ప. ప - అంధ్ర సాహిత్య పరిషత్పత్రిక

ఉద్యో - ఉద్యోగపర్వము

ఉ. హరి. - ఉత్తర హరివంశము

కళా. - కళాపూర్ణోదయము

కాళ. - కాళహస్తీశ్వర శతకము

కు. సం. - కుమార సంభవము

తి. తి. దే. శా. - తిరుమల తిరుపతి దేవస్థానం శాసనాలు

తె. శా. - తెలంగాణా శాసనాలు

నిర్వ. రామా. - నిర్వచనోత్తర రామాయణము

పం. చ. - పండితారాధ్య చరిత్ర

పాండు. - పాండురంగమహాత్మ్యము

ప్రౌ. వ్యా. - ప్రౌఢవ్యాకరణము

బ. పు. - బసవపురాణము

బా. వ్యా. - బాలవ్యాకరణము

భార. - భారతము

మను. - మనుచరిత్ర

మాం. వృ. కో. - మాండలిక వృత్తిపదకోశం

రా. ప. సం. - రాజరాజనరేంద్ర పట్టాభిషేక సంచిక వ్యా. సం. - వ్యాస సంగ్రహము

శా. ప. మం. - శాసనపద్య మంజరి

శృ. నై. - శృంగార నైషధము

సం. - సంస్కృతం

సూ. ఆం. ని. - సూర్యరాయాంధ్ర నిఘంటువు

హర. - హరవిలాసము

English

BSOAS - Bulletin of the School of Oriental (and African) Studies.

CII - Corpus Inscriptions Indicorum

CIT - A Corpus of Inscriptions in the Telingana Districts of H. E. H. the Nizam's Dominion

CP - Copper plates

DED - Dravidian Etymological Dictionary

EI - Epigraphia Indica

ESIP - Elements of South Indian Paleography

HGT - Historical Grammar of Telugu

HTL - History of the the Telugu Language

IA - Indian Antiquary

IP - Indian Paleography

JAHC ‌- Journal of Andhra History and Culture

JAHRS - Journal of Andhra Historical Research Society

JVOI - Journal of Sri Venkateshwara Oriental Institute

KI - Kareemnagar Inscriptions.

Lg - Language

NI - Nellore Inscriptions QJMS - Quarterly Journal of Mythic Society

RPS - RajaRaja narendra Pattabhisheka Sanchika

SII - South Indian Inscriptions

SIP - South Indian Paleography

TTDES - Tirumala Tirupati Devasthanam Ephigraphical Series

VS - Vyasa, Sangraham

భాషలు

ఉ. ద్రా. - ఉత్తర ద్రావిడ భాషలు

ఒ. - ఒల్లారీ

క. - కన్నడం

కూ. - కుడుఖ్

కువి. - కువి

కూ. - కూయి

కొం. - కొండ

కొ. - కొడగు

కో. - కోలామీ

గ. - గదబ

గోం. - గోండి

త. - తమిళం

తు. - తుళు

తె. - తెలుగు

తొ. - తొద

ద. ద్రా. - దక్షిణ ద్రావిడ భాషలు

నా. - నాయికీ

ప. - పర్జీ

పెం. - పెంగో

ప్రా. - పాకృతం

ప్రా. ద్రా. భా. - ప్రాచీన ద్రావిడ భాషలు బ్రా. - బ్రాహుయీ

మం. - మండ

మ. - మలయాళం

మ. ద్రా. - మధ్య ద్రావిడభాషలు

మా. - మాల్తో

మూ. ద్రా. - మూలద్రావిడ భాష

సం. - సంస్కృతం

మిగిలిన గుర్తులు

  • = కొన్నిసూత్రాలు ఆధారంగా నిరూపించిన పునర్నిర్మిత రూపానికి గుర్తు; వ్యాకరణ సిద్ధంకాని కృతకవాక్యానికి గుర్తు.

A > B = చారిత్రకంగా 'A', 'B' గా మారింది.

A→B = వర్ణనాత్మకంగా 'A' 'B' గా మారింది (సంధివశంగా)

/ / = వర్ణవిధేయ లిపిని ఈ గుర్తుల మధ్యరాస్తారు.

[ ] = ధ్వని విధేయలిపిని ఈ గుర్తులమధ్య రాస్తారు.

/ = ఈ గుర్తుకు ఇరువైపులా ఉన్న రూపాలు రెండూ సాధ్యం.

~ = ఈ గుర్తుకు ఇరువైపులా ఉన్న రూపాలు సపదాంశాలు, వాటి భేదం పూర్వాపర వర్గాలను ఆశ్రయించి ఉంటుంది.

∞ = ఇరువైపులా ఉన్న రూపాలు సపదాంశాలు, వాటి భేదం పూర్వాపరపదరూపాలను బట్టి ఉంటుంది. .

Φ = అభావం; ఒక రూపం ఉండవలసినచోట దాని లోపాన్ని సూచించే గుర్తు.

సూచన : శాసనరూపాల కుండలీకరణాలలో ఇచ్చిన వివరాల వరుస : ఆకర గ్రంథం. సంవుటసంఖ్య. శాసన సంఖ్య, శాసనంలో ఆ పదం వచ్చిన పంక్తి, సంవత్సరం. ఉదా : డేరా. (SII. 6. 1216.6, 1314)