Jump to content

తెలుగు భాషాచరిత్ర/ప్రకరణం 2

వికీసోర్స్ నుండి

ప్రకరణం 2

తెలుగు : మిగిలిన ద్రావిడ భాషలు

పి. ఎస్. సుబ్రహ్మణ్యం


     2.0. తెలుగు ద్రావిడ భాషా కుటుంబానికి చెందినది. ద్రావిడ భాషా కుటుంలో 1. తమిళం (త.), 2. మళయాళం (మ.), 3. కోత, 4. తొద (తో), 5. తొడగు(కొ.). 6. కన్నడం (క.), (మాండలికం :బడగ), 7. తుళు (తు). 8. తెలుగు (తె.), 9. గోండీ (గోం) (మాండలికం : కోయ), 10. కొండ (లేక) కూబీ (కొం.), 11. పెంగొ (సం.), 12. మండ (మం.) 18. కూయి (కూ.). 14. కువి (కువి), 15. కోలామీ (కో.) (మాండలికం : నాయక్డి,) 19. నాయకీ (నా), 17. పర్డీ (ప.), 18. గదబ (గ.) (ఒల్లారీ, సాలూరు మాండలికాలు), 18. కూడుఖ్ (కూ.), 20. మాల్తో (మా.), 21. బ్రాహుయీ (బ్రా.) అనే ఈ ఇరవై యొక్క భాషలు ఉన్నట్లు ప్రస్తుతం లెక్కల ప్రకారం తేలింది. వీటిలో తమిళం నుంచి తుళుదాకా ఉన్న భాషల్ని ఒక ఉపభాషా కుటుంబంగానూ (దక్షిణ ద్రావిడం), తెలుగు నించి గదబదాకా ఉన్న భాషల్ని మరొక ఉపభాషా కుటుంబంగానూ (మధ్య ద్రావిడం) కూడుఖ్, మాల్తో, బ్రాహుయీ అనే మూడు భాషలూ ఇంకొక ఉపభాషా కుటుంబంగానూ (ఉత్తర ద్రావిడం) పరిగణించవచ్చు. (నీలగిరులలో ఉన్న ఇరుళ, కురుంబ జాతుల వారీ భాషల్నీ, కర్ణాటకంలో దక్షిణ కన్నడ జిల్లాలో ఉన్న కొరగజాతివారి భాషనీ కొందరు పండితులు ప్రత్యేకభాషలుగా పరిగణిస్తున్నారు. ప్రస్తుతం వీటి మీద పరిశోధన పూర్తి కాలేదు.) తెలుగులో ధ్వనులు, వ్యాకరణ నిర్మాణం మిగిలిన ద్రావిడ భాషలతో పోల్చిచూస్తే తెలుగు మధ్య ద్రావిడ భాష అనీ, దానికి మధ్య ద్రావిడ భాషలైన గోండి, కొండ, పెంగొ, మండ, కూయి, కువి భాషలతో అతి సన్నిహిత సంబంధం ఉందని స్పష్టమవుతుంది. తెలుగు మధ్య ద్రావిడోపకుటుంబానికి చెందినదని మొదట చెప్పినవారు భద్రిరాజు కృష్ణమూర్తి 1981, ఆధ్యాయం 4). మూలద్రావిడ భాష (మూ. ద్రా.) కాలంనించి తెలుగు ఎలా పరిణామం చెందిందో ఈ క్రిందస్థూలంగా చర్చిద్దాం. (కుండలీకరణాల్లో ఇచ్చిన సంఖ్యలు DED లోని ఆరోపాల్ని సూచిస్తాయి.) ==ధ్వనులు ==

2.1 తె. అ < * అ

తె. అక్క : త. అక్కా, మ. క. తు. అక్క (24)
తె. కన్ను : త. మ. కణ్, కో. గో. గోం. కన్ (973)
తె. పల్లు : త. మ. కోత. క. కో. గోం. పల్ (3288)

2.2 తె. ఆ < * ఆ

తె. ఆవు : త. మ. ఆ, అవ్, క. ఆ, ఆవు. (233)
తె. కాలు : త. మ, కోత, క. కో. గోం. కాల్ (1238)
తె. పాట : త. మ. పాట్టు, కోత పాట్, క. పాట (3348)

2.3 తె. ఇ < * ఇ

తె ఇల్లు : త. మ. ఇల్, కొం. ఇలు, కూ. ఇడు (420)
తె. చిన్న : త. మ. క. చిన్న (2135)
తె విల్లు : త. మ. విల్, క. బిల్, కో, ప. గోం. విల్, బ్రా. బిల్ (4449)

2.4 తె. ఈ < * ఈ

తె. ఈఁగ : త. ఈ, మ. ఈచ్చు, కోత ఈవ్, కో, నా. నీంగ్ (453)
తె. చీము : త. చీ, చీఱ్. క. కీము, కీవు, కూ. సివెండి, బ్రా. కీష్ (1337)
తె. నీరు : త. మ. కోత, తొ. క. నీర్, కో. నా. ఈర్, బ్రా. దీర్ (3057)

2.5 తె. ఉ < * ఉ

తె. ఉల్లి : త. మ. క. తు. ఉళ్ళి (605)
తె. గుడి : త. మ. కుటి 'ఇల్లు', క. తు. గుడి (1379)
తె. పురుగు : త. మ. క. పుఱు, గోం. పుడి, కో. నా. పుర్రె (3537) 2.6 తె. ఊ < * ఊ
తె. ఊరు : త. మ. కోత, తొ. క. కో. నా. ఊర్ (643).
తె. నూఱు : త. మ. క. నూఱు, తో. నూఱ్, గోం. నూర్ (3090).
తె. పూవు : త. మ. కోత, క. కొ. తు. ప. గ. పూ (3564).

2.7 తె. ఎ < * ఎ

తె. ఎలుక : త. మ. ఎలి, క. ఎలి, ఇలి, గోం. ఎల్లీ (710).
తె. చిఱుత, చెఱ : త. చిఱై, మ. చిఱ, కోత కెర్, క. కెఱె (1648).
తె. వెఱ, వెఱపు : త. విఱ్ఱప్పు, క. బెర్చు, గోం. వెరే (4519).


2.8 (i) తె. ఏ < * ఏ

తె. ఏడు : త. మ. క. ఏఱు, గోం. ఏడూజ్ (772).
తె. తేలు : త. మ. క. తేళ్, మా. తేలె, బ్రా. తేల్హ్ (2355).
తె. వేరు : త. మ. కోత వేర్, క. బేర్, క. బేర్, కో. నా. వేర్, ప. వార్ (4554).
(ii) తెలుగులో పదాది ఏకారం మూల. ద్రా * యా‌-నించి కూడా వస్తుంది.
ఏది : త. మ. యాతు, ఏతు (4228).
ఏడిక : త. యాటు, ఆటు, మ. ఆటు, క. ఆడు, గోం. ఏటీ (4229).
ఏడు : త, యాంటు, ఆంటు, మ. ఆంటు, క. ఏడు, గోం. ఏండ్ (4230).
ఏఱు : త. యాఱు, ఆఱు, మ. ఆఱు, గోం. ఏర్ 'నీళ్ళు', కొం. ఏఱు 'నీళ్లు', కూ. ఏజు 'నీళ్ళు' (4233).
తె. ఏనుగు : త. యానై, ఆనై, మ. ఆన, క. ఆనె, గోం. ఏనీ (4235).

2.9. తె. ఒ <* ఒ

తె. ఒండు : త. ఒన్డు, మ. ఒన్ను, క. ఒందు, తు. ఒఁజి, గోం. ఉందీ, కొం. ఉన్ఱి (334).
తె. బొట్టు : త. మ. పొట్టు, క. బొట్టు (3676).
తె. దొండ : త. తొంటై, మ. తొంటి, క. తొండె, దొండె (2380).

2.10. తె. ఓ <* ఓ

తె. ఓడ : త. మ. ఓటం, క. తు. ఓడ (876).
తె. కోడి : త. మ. క. కోఱి, తు. కోరి (1862).
తె. తోఁట : త. మ. తోట్టం, క. తోట, తోంట (2927).

2.11. ద్రావిడభాషా ధాతువుల్లో దీర్ఘాచ్చు, ధాతువు తరవాత నిష్పాదక ప్రత్యయం లేనప్పుడూ, లేక హల్లుతో మొదలయ్యే నిష్పాదక ప్రత్యయం ఉన్నప్పుడూ దీర్ఘాచ్చుగానే ఉంటుంది. కాని ధాతువు తరవాత అచ్చుతో మొదలయ్యే నిష్పాదక ప్రత్యయం వచ్చినప్పుడు మాత్రం ధతువులో దీర్ఘాచ్చు హ్రస్వంగా మారుతుంది (కృష్ణమూర్తీ 1955, 1961, pp. 1.288-94). ఇటువంటి మార్పు కొన్ని పదసముదాయాల్లో చాలా ద్రావిడ భాషల్లో కనబడతూ ఉండడం వల్ల ఇది మూలద్రావిడ భాషలోనే మొదలై ఉండాలి. అందువల్ల కొన్ని పదసముదాయాల్లో ఒకే భాషలో దీర్ఘాచ్చుగల ధాతురూపమూ (అచ్చుతో మొదలయ్యే నిష్పాదక ప్రత్యయంతో) మనకు కనిపిస్తూ ఉంటాయి. మిగిలిన భాషల్లో దీర్ఘాచ్చు ఉండి తెలుగులో అచ్చుతో మొదలయ్యే నిష్పాదక ప్రత్యయం లేక పోయినా ధాతువులో హ్రస్వాచ్చు ఉంటే ఈ హ్రస్వానికి కారణమైన అచ్చు నిష్పాదక ప్రత్యయం మొదట ఒక కాలంలో (అంటే ముందు తెలుగులో) ఉండేదని అది తెలుగులో తరవాత నశించిందనీ మనం ఊహించాలి (కింద 5, 6 ఉదాహరణలు చూడండి).

  1. తె. అఱువది, అఱు : త. మ. అఱుపత్తు, ఆఱు, క. అఱువత్తు, ఆఱు (2051). (ఆఱులో ఉకారం ఉచ్చారణార్థం.)
  2. తె. కొడుకు: కోడలు : త. కుఱంతై “పిల్ల(వాడు)”, కూ. కోడు 'లేతకొమ్మ, మొగ్గ' కు. ఖోర్‌ 'చిగురు. చిగుర్చూ', మా. ఖోరో 'పిల్ల(వాడు)' (1787).
  3. తె. చెరుగు చేట : మ. చేఱు; క. కేఱు, కో. ప. కేద్‌, క., మా. కేన్‌-(1679).
  4. తె. పఱచు, పాఱు :త. మ. పఱ, పఱి, పాఱు, క. పాఱు (3311).
  5. తె. ప్రొద్దు : త. పొఱుతు, పోఱ్తు, మ. పొఱుతు, పోతు క. పొఱ్తు, గోం. పోడ్ ద్ (3724),
  6. తె. బ్రుంగు : త. మూఱు, మూఱ్కు, ముఱుకు,క. ముఱుంగు,ప. బూ డ్‌ (5096).

2.12 తె. ఎ, ఒ <* ఇ, ఉ (అకారం ముందు).

     సాధారణంగా తెలుగుపదాల్లో రెండో అచ్చు (అంటే నిష్పాదక ప్రత్యయం మొదటి అచ్చు) అకారమైతే మొదటి అచ్చు స్థానంలో అ, ఎ, ఒ లే గాని ఇ,ఉ లు ఉండవు. కన్నడంలో కూడా ఇంతే. కాని ప్రాచీన తమిళంలోనూ, మలయాళంనూ ఆటువంటి ఆకారం ముందు అ, ఇ, ఉ లే గాని ఎ, ఒ లు ఉండవు. కాబట్టి కొన్ని సమాన పదాల్లో (cognates) అకారంముందు ధాతువులో తమిళ, మలయాళాల్లో ఇ, ఉ లు ఉంటే. తెలుగు, కన్నడాల్లో ఎ, ఒ లు ఉంటాయి. ఇటువంటి పదాలు కొన్నింటిలో ప్రాచీనమైన ఎ. ఒ లు తమిళ, మలయాళాల్లో ఇ,ఉ లు గా మారితే మరికొన్నింటిలో ప్రాచీనమైన ఇ, ఉ లు తెలుగు, కన్నడాల్లో  ఎ.ఒ లుగా మారేయి. ఇటువంటి పరిస్థితిలో ప్రాచీనమైన అచ్చు ఏదో తెలుసుకోడానికి అకారంతో మొదలయ్యే నిష్పాదక ప్రత్యయం లేకుండా ఉన్న సమాన పదాలు సహాయపడతాయి. ఇటువంటి సమానపదాలు రెండు రకాలుగా ఉండవచ్చు: (1) దీర్ఘాచ్చుగాని, హ్రస్వాచ్చుగాని ఉన్న ధాతువుమాత్రమే ఉన్నవి; (2) ధాతువు తరవాత ఇ, ఉ లతో గాని, హల్లుతోగాని మొదలయ్యే నిష్పాదక ప్రత్యయం ఉన్నవి(బరో 1968 : 22), ఇటువంటిచోట్ల మూలద్రావిడంలో ఇ/ ఎ, ఉ/ఒ లు మూల దక్షిణద్రావిడంలో ఎ, ఒ లుగా మారి అవి తెలుగు, కన్నడాల్లో అలాగే నిలిచి ఉండగా ప్రాచీన తమిళ, మలయాళాల్లో ఇ,ఉ లుగా మారేయని చెప్పడానికి ఆధారాలు ఉన్నాయి. (కృష్ణమూర్తి 1958 b.) ఈ కింద. ఇచ్చిన ఉదాహరణల్లో మూలద్రావిడంలో ఇ, ఉ లు తెలుగులో ఎ, ఒ లుగా మారేయి.
  1. తె. కెలఁకు : త. కిళై, కిళ్ళు 'తవ్వు' (1321)
  2. తె. కొఱ, కొఱఁత (క. కొఱె) : త. కుఱు, 'పొట్టి', కున్ఱు 'తగ్గు', తె. కుఱు, కుఱచు, కుందు (1537)
  3. తె. తొఱఁగు (క. తొఱె) : కొం. తుఱ్హ్-కూ. తుహ్ (2768)
  4. తె. దొరలు . త .చురి, చూర్ 'చుట్టూ తిరుగు', చురుళ్ 'చుట్టుకొను', చురుట్టు 'చుట్టు', తె చుట్ట (2211)
  5. తె. నెఱయు, నెరయు (క. నెఱె): తె. నిండు, గోం. నింద్, కొం. నిన్ఱ్, కు. నీంద్, నూ. నింద్ (3049)
  6. తె. నెల, నెలవు (క. నెలె) : త. మ. క. నిల్, తె. నిలుచు, నిల్చు, గోం. నిల్ (3048)
  7. తె. మొదలు (క. మొదల్) : త. ముతల్ 'మొదలు', ముతిర్ - 'ఎక్కువ అగు' (4053)
  8. తె. మొన (క. మొనె) : త. మున్, మున్పు, ముంతి 'ముందు', తె. మున్, మునుపు, ముందు (4119)
  9. తె. మొరయు (క. మొరే, మొరళ్): ప. ముర్-'అరచు', కు. ముర్ర్-'ఉరుము, భయపెట్టు' మా. ముర్-'మాట్లాడు' (4076).
  10. తె. వెల (క. బెలె) : త. మ. విల్ 'అమ్ము', క. బిల్, బిలి 'అమ్ము', తె. విలుచు, విల్చు, విలువ (4448).

2.13 వర్ణవ్యత్యయం. కొన్ని మూలద్రావిడధాతువులలో అచ్చూ దాని తరవాత హల్లు పరస్పరం తెలుగులో స్థానం మార్చుకొంటాయి. అంటే అవి వర్ణవ్యత్యయం పొందుతాయి (ఈ మార్పుని వర్ణవ్యత్యయమని గుర్తించి దానిని మొట్ట మొదట చర్చించినవారు కృష్ణమూర్తి 1955,247-252: 1961, pp. 1.121-59). తెలుగులో ఈ వర్ణవ్యత్యయం ధాతువు మొదట హాల్లు ఉన్న పదాలలోనూ లేని పదాలలోనూ కూడా కనిపిస్తుంది. ధాతువు మొదట హల్లు లేకపోతే వర్ణవ్యత్యయం పొందే హల్లు *ట (డ), *ఱ, *ళ, *ల,*ర; *ఱ లలో ఒకటి అయి ఉంటుంది / (సర్వనామాల్లో మరికొన్ని హల్లులున్నపటికీ కూడా వర్ణ వ్యత్యయం జరిగింది.). దీనివల్ల పదాదికి వచ్చిన * ళ కారం ల కారంగానూ (తరవాత అది ద కారంగానూ), * ళ కారం ల కారంగానూ తెలుగులో మారతాయి. ధాతువు మొదట హాల్లు ఉంటే వర్ణవ్యత్యయం పొందే రెండోహల్లు ఱ' ,*ఱ, *ర లలో ఒకటిగా ఉంటుంది. ఈ మూడూ వర్ణవ్యత్యయం తరవాత కావ్యభాషలో ఈ స్థానంలో ర గా మారుతాయి. ఈ రేఫ వ్యావవోరికభాషలో తరవాత నశించింది. వర్ణవ్యత్యయం జరిగిన పదాల్లో ధాతువు మొదట ఉండే హల్టు క, గ, త, ద, ప, బ, మ, వ, స లలో ఒకటి అయి ఉంటుంది. వర్ణవ్యత్యయం జరిగిన తరవాత ధాత్వచ్చూ, నిష్పాదక ప్రత్యయంలో మొదట ఉన్న అచ్చూ మధ్య వ్యవధానం లేకుండా ఉంటాయి కాబట్టి వాటీలో ఈ కింద ఇచ్చిన మార్పులు జరుగుతాయి. నిష్పాదక ప్రత్యయంలో మొదటి అచ్చు ఇ కాని, ఉ కాని అయితే అది పోతుంది. అది అకారం అయితే ధాత్వచ్చూ అదీ ఈ విధంగా మారతాయి :

అ + ఆ → ఆ
ఏ + ఆ → ఏ
ఒ + ఆ → ఓ

ఈ సందర్భంలో మూభలద్రావిడంలోని ఇ, ఉ లు అకారం ముందు తెలుగులో ఎ, ఒ లు గా మారతాయనే విషయం గుర్తుంచుకోవాలి. ఈ మార్పు జరిగిన తరవాతనే వర్ణవ్యత్యయం జరిగింది.

వర్ణవ్యత్యయం తెలుగులోనే కాక పెంగొ, మండ, కూయి, కువిలలో కూడా చాలా ప్రచురంగా కనపడుతుంది. గోండీ, కొండలలో కూడా మొదట్లో ఆజుదులై, కొన్ని పదాల్లో వర్ణవ్యత్యయం జరిగింది. కాబట్టి ఈ మార్పు ఈ భాషలన్నీ ఏక భషగా ఉన్న కాలంలో జరిగి ఉండాలి. ఇది. తెలుగు గోండీ, కొండ, పెంగొ, మండ, కూయి, కువి భాషలతో ఆతి సన్నిహితసంబంధం గలది అని చెప్పడానికి ఒక ప్రబలాధారం. వర్ణవ్యత్యయానికి ఉదాహరణలు :

  1. తె. క్రింద, క్రీ : త. మ. క. కీఱ్ (1348).
  2. తె. క్రొవ్వు : త. మ. కోఱు, క. కొర్వు (1784).
  3. తె. క్రోఁతి : త. కురంకు, మ. కురఙ్ఙు (1373).
  4. తె. గ్రుడ్డి : త. మ. కురుటు, క. కురుడు (1487).
  5. తె. గ్రుద్దు : త. కుఱు, కుఱ్ఱు 'దంపు, కొట్టు' (1536).
  6. తె. గ్రొచ్చు. క్రొచ్చు (శాస : క్ఱొచ్చె): త. కుఱి ('తవ్వు') (1511).
  7. తె. డాఁగు, దాఁగు : త. అటంకు, క. అడంగు, కూ. డా (58).
  8. తె. డిగు, డిగ్గి, దిగు : త. మ. ఇఱి, కూ. డీ__(426).
  9. తె. డెబ్బది, డెబ్బయ్ : త. మ. ఎఱు-పతు, క. ఎఱుపత్తు, ఎప్పత్తు (772)
  10. తె. త్రంపి : త. తఱల్ 'మండు, నిప్పు', గో. తడ్ మీ (2542).
  11. తె. త్రాచు : త. అర, అరా, అరవం, మ. అరవు, గో. తరాస్, పెం. రాచ్,మం. త్రెహె, కూ. స్రాసు, కువి. రాచు (1949)
  12. తె. దతున్ను : త. మ. ఉఱు, క. ఉఱు, కొం. డూ,-.కూ.డూ-(592)
  13. తె. దతెుప్పి  : త. ఉఱై, కో. డుప్పి, ప. ఉడుప్ (598)
  14. తె. ప్రా-, ప్రాఁత : త. మ. క. పఱ, కూ. ప్డాడి, కువి. ప్డాఇ (3296).
  15. తె. ప్రేఁగు : ప. ఫిడు ల్, గ. పుడు గ్, గోం. పీర్ (3445).
  16. తె. ప్రొద్దు : త. పొఱుతు, పోఱ్తు క. పోఱ్తు (3724).
  17. తె. ప్రొయ్యి : త. మ. పోరి 'వేగు, ఎండు', కూ. ప్రోంద్ (మండు) (3705).
  18. తె. ప్రోలు (శాస. ప్ఱోల్) క. పొఱల్ (ఊరు). (3721)
  19. తె. బ్రదుకు, బ్రతుకు : త. వాఱు, క. బాఱు, బఱ్ దుంకు. (4402)
  20. తె. మ్రాను, మ్రాఁకు : త. మ. మరమ్, గోం. మరా, మార, కూ. మ్రహ్ను, కువి. మ్ఱూను (8856). 23. తెలుగు : మిగిలిన ద్రావిడభాషలు
21. తె. మ్రోఁగు : త. ముఱంకు, మ.ముఱజ్జు, క. మొఱగు (4092)
22. తె. రాలు : కో. నా. రాల్‌-, గోం. కొం. ఆర్‌- (197).
23. తె. రేయి, రే- : త. మ. ఇర, ఇరా, కి. ఇరుళ్ (2102).
24. తె. రోలు : త. మ. ఉరల్‌, క. ఒరల్‌ (560).
25. తె. ఱెక్క : త. చిఱై, చిఱకు, ఇఱై, ఇఱక్కై, క. ఎఱకె, కొం. ఱెక (2138).
26. తె. ఱేఁడు : త, ఇఱై, మ. ఇఱాన్‌, క, ఎఱె (448).
27. లే-, లేఁత : త. ఇళ, ఇళం, ఇళై, మ. ఇళ, క. ఎళ, ఎళె,                    
         గోం. రై యోల్/లెయొర్‌ 'యువకుడు' (436).
28. తె. లొంగు, లోఁగు, లో, లోపల : త. ఉళ్, 'లోపలి', ఉళ్,
        ఒళ్‌ 'లోపల', గోం, రోన్‌/లోన్‌ 'ఇల్లు' (600).
29. తె. వ్రాయు : త. వరై, క. బరె, బరి, కూయి వ్రీస్- బీన్‌ (4304)
30. తె. వ్రేలు : త. విరల్‌, మ. విరల్‌, క. బెరల్‌, కో. నా. వెందె (4438).
31. తె. స్రుక్కు : త. నురుంకు 'ముడుచుకొను, తగ్గు', సురుక్కు 'తగ్గించు'.                             
        క. నుర్కు 'ముడుచుకొను, తగ్గు, ప. చుర్క్‌- (2213).
                                                                         
2.14. (i) తె. క- < * క - (ఇ ఈ ఎ ఏ లు కాక మిగిలిన
              అచ్చుల ముందు)
          తె. కట్టు: త. క. కట్టు (961).
          తె. కాయ : త. మ. క. కాయ్‌, గోం. కాయా (1220).
          తె. కుప్ప : త. కుప్పై, మ. కుప్ప, క. కుప్పె (1440). 
          తె. కూడు : 'అన్నం' : త. మ. క. కూఱు (1592).
          తె. కొడుకు : త, కుఱంతై 'పిల్ల, పిల్లవాడు', క. కొణసు
              'చిన్న క్రూరజంతువు' (1787).
          తె. కోల : త. మ. క. కోల్‌ (1852).                                                                            
                                                                          

24 తెలుగు భాషా చరిత్ర

     ii) తె. -క-/-క్క- <  -క్క-                                                                                                     
              (తెలుగులో ద్విత్వాక్షరాలు సాధారణంగా పదాదినున్న హ్రస్వాచ్చు తరవాతనే ఉంటాయి; మిగిలిన చోట్ల మూలభాషలో ఉన్న ద్విత్వాక్షరాలలో ద్విత్వం నశిస్తుంది.)                                                                    
         తె. అక్క : త. అక్కా, మ. క. తు.  అక్క  (24).
         తె. ఉక్కు : త. మ. ఉరుక్కు, క. ఉర్కు, ఉక్కు (569). 
         తె. కాకి : త. కాక్కై, మ. కాక్క, క. కాకె, కాకి (1197).
         తె. పితుకు, పిదుకు : త, మ. పితుక్కు, క, హిదుకు  (3426).
         తె. ముక్కు : త. మ, మూక్కు, క. మూగు, తు. మూకు (4122). 
                                                                 
 2.15. (i) తె. చ- <*క - (ఇ ఈ  ఎ ఏ ల  ముందు)
    మూలద్రావిడంలో ఇ ఈ ఎ ఏ ల ముందు ఉండే పదాది కకారం తెలుగులో చకారంగా మారుతుంది. దీన్ని తాలవ్యీకరణం (Palatalization) అంటారు. తెలుగు పదాల్లో మూ. ద్రా. *అయ్‌ నించి వచ్చిన ఏ కారానికి ముందు ఉన్న కకారం కూడా తాలవ్యీకరణాన్ని పొందుతుంది. (కింద 10, 12 చూడండి).                                         
                                                                           
1. తె. చిఱు, చిఱుత: త. మ, చిఱు, చిఱ్ఱు, కోత కిర్‌, క. కిఱు, తు. కిరి,                  
       కిరు (1326). 
2. తె. చిలుక : త. మ. కిళి, క. తు, గిళి, గిణి, ప. కిల్‌ (1318).
3. తె. చీము : త. మ. చీ,  కీల్, క. గీళు (1337).
4. తె. చీలు : త. కీళ్, కీల్‌, క. గీళు (1351).
5. తె. చెడు : త. మ. కెటు, క. కెడు, కిడు (1614). 
6. తె. చెదరు, చిండు : త. చితర్‌, చింతు, మ. చింతు, క. కెదఱు               
       (1294). 
7. తె. చెఱువు : త. చిఱై, మ. చిఱ, కోత కెర్‌, క, కెఱె (1648).
8. తె. చెవి, చెవుడు : త. మ. చెవి, చెవిటు, క, కివి, కివుడు, కో. నా. కెవ్‌     
       (1645).                                                                        
 తెలుగు : మిగిలిన ద్రావిడభాషలు                                25                                                                              
                                                                               
 9. తె. చేను : త. చెయ్‌, మ. చెయి, క. కయ్‌, కో.ప. కేన్‌ (1629).             
10. తె. చేఁదు : త. మ. కయ, కచ 'చేదుగా ఉండు', క. కయ్‌, కయ్సు 
       'చేదు'(1047).                                                                   
11. తె. చేయ :త. మ, చెయ్‌, క, కెయ్‌, గెయ్‌, గోం. కీ-(1628).                 
12. తె. చేయి : త. మ. కై, క. కయ్‌, ప. కెయ్‌, గోం. కయ్‌ (1683).                                                                        
                                                                    
     తెలుగులో కిట్టు, కినియు, కెడయు, కెంపు, కెలయు మొదలైన కొన్ని పదాల్లో తాలవ్యాచ్చు ముందున్న కకారం చకారంగా మారలేదు. కాబట్టి ఇటువంటి పదాలు తెలుగులో తాలవ్యీకరణం జరిగి ఆగిపోయిన తరవాత కన్నడం నించి ఎరువు తెచ్చుకున్నవి అయి ఉండాలి.                                                                   
   పై ఉదాహరణల వల్ల తెలుగులో లాగే తమిళ, మలయాళాల్లో కూడా తాలవ్యీకరణం జరిగిందని తెలుస్తుంది. కాని తమిళ, మలయాళాల్లో తాలవ్యాచ్చు తరవాత మూర్ధన్యాక్షరం ఉంటే తాలవ్యీకరణం జరగదు. తెలుగులో ఇటువంటి నిబంధన లేకపోవడమే కాకుండా దానిలో *అయ్‌ నించి వచ్చిన ఏకారం ముందు కూడా తాలవ్యీకరణం జరుగుతుంది. ఈ రెండు భేదాలవల్లా తెలుగులో తాలవ్యీకరణం - తమిళ, మలయాళాల్లో తాలవ్యీకరణం వేరువేరుగా జరిగినవే! కాని యీ మూడు భాషలూ ఒక భాషగా ఉన్న కాలంలో జరిగినవి కావు అని బరో (1968:45) చేప్పేరు.                                                                                                                                       
                                                                        
  (ii)  తె. చ - < * చ -                                                   
        తె. చను : త. మ. చెల్, క. సల్‌, ప. చెన్‌, కూ. సల్‌ (2286).         
        తె. చావు : త. మ. చావు, క. సావు (2002).
        తె. చిక్కు : త. మ. చిక్కు, క. సిక్కు, క. సిల్కు, సిర్కు (2060).       
        తె. చుక్క : త. చుక్కై, క. చుక్కె, గోం. సుక్కుం (2175).             
        తె. చూలు : త. మ. క. చూల్‌ (2255).                            
        తె. చేరు : త. మ. చేర్‌, క. సేర్‌ (2312).  26.                               తెలుగు భాషా చరిత్ర
   (iii)  మూలద్రావిడ పదాది చకారం పై పదాలవంటి వాటిలో తెలుగులో నిలిచి ఉన్న మరికొన్ని పదాల్లో ఆది లోపించింది. చకార లోపం తెలుగులోనే కాక అన్ని దక్షిణ ద్రావిడ భాషల్లోనూ కొన్ని కొన్ని పదాల్లో ఏర్పడింది. కాని పదాది చ కారం లోపించడానికీ, లోపించకుండా ఉండడానికి కారణం ఏమీ కనపడదు. తెలుగు తప్ప మిగిలిన అన్ని మధ్య ద్రావిడ భాషల్లోనూ, ఉత్తర ద్రావిడ భాషల్లోనూ పదాది చకారం లోపించదు. కాబట్టి ఈ భాషలు మూలభాషలో పదాది చకారం ఉండేదని నిర్ణయించడానికి ఉపయోగిస్తాయి. తెలుగులో కొన్ని మాటల్లో వదాది చకారం ఉన్నరూపం, లేనిరూపం కూడా ఉన్నాయి.                                                                    
     
    1. తె. అందము, చందము : త. మ. అంతం, చంతం, క. తు.                                  
           అంద, చంద (1921).
    2. తె. అల్లుడు : క. తు. అళియ, ప. చల్‌ ఇిద్‌, కో. నా. సాంజిన్‌,         
           గోం. సడే (256, 1970).
    3. తె. ఆఱు : త. మ. క. ఆఱు, గోం. సారూంగ్‌, కూ.                   
           సజ్‌గి (2051).
    4. తె. ఇచ్చు : త. క. ఈ, ప, చీ-, కో. నా. గోం. కూ. సీ-, కు,             
           చి ?. మా. చియ్‌-(2138).
    5. తె. ఉప్పు : త. మ. క. తు. ఉప్పు, కో. నా. గ. సుప్, ప.             
           చుప్ (2201).
    6. తె. ఏరు : త. మ. కోత, తొడ ఏర్‌, క. ఏరు, గోం. సేర్‌, కూ.                                 
           సేరు (2313)                                                        
    7. తె. ఐదు, ఏను : త. ఐంతు, మ. అంచు, క. అయిదు, ప. చేదు       
          (క్), గోం. సై యూంగ్‌, కూ. సింగి (2318).                                                          
                                                                             
  (iv)  తె. -చ-/-చ్చ- < * -చ్చ-
        తె. ఎఱచి : త. ఇఱైచ్చి, మ. ఇఱ్దచ్చి. కొడ. ఎరచి (450).
        తె. నచ్చు : త. నచ్చు, క. నచ్చు, నర్చు (2951).                   
        తె. పచ్చ : త. పచ్చై, మ. పచ్చ, క. పచ్చ, పచ్చె (3161).      
        తె. మెచ్చు : త. మెచ్చు. క. మచ్చు, మెచ్చు, మర్చు (3865). 27.                              తెలుగు : మిగిలిన ద్రావిడభాషలు     
                                                                 

2.16. (i) పదాది టకారం తెలుగులో టెంకాయ (త. తేంకాయ్‌ 2306)- టేకు (త. మ. తేక్కు, 2842), టెక్కియము మొదలైన చాలా కొద్ది మాటల్లోనే ఉంది. పై మాటల్లో మొదటి రెండింటిలోనూ ఈ టకారం, తకారం నించి వచ్చినట్లు స్పష్టం.

         (ii) తె. -ట-/-ట్ట- <* ట్ట
              తె. ఆట : త. మ. అట్టం, క. ఆట, ఆటు (290). 
              తె. తిట్టు : త. క. తిట్టు (2632).
              తె. పాట : త. మ. పొట్టు, క. పాట (3348).                    
                                                                       
      (iii) -ట-/-ట్ట- <* -ఱ్ఱ-
             తె. చాటు (క్రియ) : త. మ. చాఱ్ఱు, క. సాఱు (2052).
             తె. చుట్టము : త. మ. చుఱ్ఱo (2233).
             తె. పుట్ట : త,మ. పుఱ్ఱు, క. పుత్తు, పుత్త, గోం. పత్తీ, కొం.         
                 పుఱ్హి, కు. పుత్తా, మా. పుతె (3556).
             తె. మాట : త. మ. మాఱ్ఱo, క. మాతు, మాత (3960).    
                                                                 
 2.17. (i) తె. త- <* త-
             తె. తప్పు : త. మ. క. తప్పు (2498).
             తె. తల : త. తలై, మ. తల, క. తలె, తల, కూ.              
                 త్లఉ (2529).
             తె. తిను : త. మ. క. తు. గోం, కూ, కో. ప. తిన్‌ (2670).
             తె. తేనె : త. మ. తేన్‌, క. తేను, కో. నా. తేనె (2574).
                                                                                  
     తెలుగు త్రాడు (త. మ. చరటు 1947), త్రాచు (త. అర, ఆరా, కూ. ప్రాసు,  (1949), దురద (త. మ. చొఱి, క. తుఱి, (2343) మొదలైన కొద్దిమాటల్లో మూలద్రావిడం లో పదాది చకారం తెలుగులో త/దలుగా మారుతుంది. (బరో 1968 : 167).          
                                                                        
        (ii) తె. -త-/-త్త-< * త్త-
             తె. అత్త : త. అత్తై, క. ఆతై, అత్తి, గోం. అతీ (121).  28                                     తెలుగు భాషా చరిత్ర                                
                                                                          
       తె. తాత : త. తాత్తా. క. తాత, తు, తాతె (2580).
       తె. సుతై : త. మ. చుత్తి, క. సుత్తిగె, తు. సుత్తి (2197).               
                                                                       
 2.18. (i) తె. ప- < *ప-
       తె. పని : త, మ. కొ. పణి (3209).
       తె. పాడు :త,  మం పాటు, క. పొడు, కో, ప. పాడ్-, గోం.             
           పార్- (3348).
       తె. పేరు : త. మ. పెయర్‌, పేర్ల్, క. పెసర్‌, కో, నా. పేర్‌,              
           ప. పిదిర్‌ (3612).
                                                                                                            
  (ii) తె. -ప-/-ప్ప-<* -ప్ప-
       తె. చెప్పు (నా.) : త. చెరుప్పు, మ. చెరిప్పు, క. కెర్సు, కో.             
           నా. కెర్రి, గోం. సెర్పూం (1698).
       తె. తోపు తమ, తోప్పు, క. తు, తోపు (20290).
       తె. త్రిప్పు : త. కిరుప్పు మ. తిరిప్పు, క. తిరుపు (2655),
       తె. వేంప (చెట్టు) : త. వేప్ప (4551).                              
                                                                       
 2.19. తెలుగులో నాదస్పర్శాలైన గ,జ,డ,ద,బ లు కూడా పదాదిని ఉంటాయి. తమిళం, మలయాళం తప్ప మిగిలిన అన్ని ద్రావిడ భాషల్లోనూ కూడా ఇవి పదాదిని ఉన్నా ఇవి మూల ద్రావిడభాషలో ఉండేని కావని పండితుల అభ్మిప్రాయం. తమిళ మలయాళాల్లో ఇవి లేకపోవడం వల్లా, ఇవి ఉండే భాషల్లో కూడా ఒక పదంలో కొన్ని భాషల్లో నాదస్సర్శముంటే - మరికొన్నిటిలో శ్వాసస్పర్శం ఉండి, దీనికేమీ నియమం లేకపోవడం వల్లా మూల ద్రావిడంలో శ్వాసస్పర్శాలు కొన్ని కొన్ని భాషల్లో కొన్ని పదాల్లో తరవాత కాలంలో నాదాలుగా మారడం వల్ల ఇవి ఏర్పడ్డాయని కాల్డ్‌ వెల్‌ చేసిన సిద్ధాంతాన్ని బరో (Dravidian studies I 1963 : 1-17) సోపపత్తికంగా నిరూపించారు. అద్విరుక్తంగా ఉండే స్పర్మాలు అచ్చుల మధ్య, అనునానికం తరవాత అన్ని (ద్రావిడ భాషల్లోనూ నాదాలుగానే ఉంటాయి. కాని శ్వాసాలుగా ఉండవు. (తెలుగులో ఈ స్థానాల్లో ఉండే శ్వాస స్పర్శాల మొదట్లో ద్విరుక్తాలని గమనించాలి). కాబట్టి అచ్చుల మధ్యా, అనునాసికం తరవాతా వచ్చే అద్విరుక్తస్పర్శాలు మూల భాషల్లోనే నాదాలుగా మారి  29                       తెలుగు : మిగిలిన ద్రావిడ భాషలు

ఉంటాయనీ, వాటి ప్రభావం వల్లా, నాదాలైన స్పర్శేత హాల్లుల ప్రభావం వల్లా పదాది శ్వాస స్పర్శాలు కొన్ని కొన్ని పదాల్లో తమిళం, మలయాళం తప్ప మిగిలిన ద్రావిడభాషల్లో నాదాలుగా మారి ఉంటాయనీ కృష్ణమూర్తి (1961, 1. 55-78) నిర్ణయించారు.

2.20. (i) తె. గ- < * క-                                                   
          తె. గిల్లు : త. మ. కిళ్ళు, క. గిండు, తు. కిణ్కు          
              (1322).                            
          తె. గీఱు : త. మ. కీఱు, తు. కీరు (1353)                          
          తె. గూడు : త. మ. కూటు, క. తు. గూడు, ప. గూడు,                                    
              గోం, గూడా (1563)                                                    
                                                                       
     (ii) తె. -గ- < * -క-
          తె. పగలు : త. మ. పకల్‌, క. పగల్‌, తు. పగెలు, గోం.         
              పియ్యాల్‌ (315).
          తె. పొగడు : త. మ. పుకఱ్న్, క. పొగట్ (3478)                   
                                                                       
    (iii) తె. -Oగ- < *- Oక -
          తె. కలఁగు : త. కలంకు, మ. కలజ్జు-, కొ. కలంగ్‌-(1906).
          తె. పొంగు : త. పొంకు, మ. పొజ్జు, క. పొంగు (3658). 
                                                                         
     (iv) తె. -గ్గ- < * ఱు-గ, * -ఱ్ -గ-
          తె. తగ్గు : త. మ. తాఱ్, క. తఱ్ గు, తర్గు, తగ్గు (2597).
          తె. నుగ్గు : త. మ. నూఱు, నుఱుక్కు, క. నుఱుగు, నుర్గు,                     
              నుగ్గు (3089). 
                                                                       
2.21. (i) తె. జ - < * చ-                                               
          తె. జారు : త. మ. చాఱ్ఱు, క. జాఱు (2048).
          తె. జొన్న : త. మ. చోళం, క. తు. జోళ (2359).
                                                                      
     (ii) తె. -ంజ- < *-ంచ-
          తె. అంజు 'భయపడు' : త. మ. అంచు, క. తు.                                 
              అంజు (51).  30.                                   తెలుగు భాషా చరిత్ర
2.22. (i) తె. డ- < * -ట-, *-లు-
      మూలభాషలో మూర్థన్యాక్షరాలు పదాదిని ఉండవు. తెలుగులో పదాది డకారం మొదట అచ్చుల మధ్యనే ఉండి తరవాత వర్ణవ్యత్యయం వల్ల పదాదికి వచ్చినదై ఉంటుంది (చూ. 2. 13). ఈ స్థానంలో ఇది * టనించి గాని, ఴ నించిగాని వస్తుంది. పదాది డకారం తెలుగు సాహిత్యంలోనే తరవాత కాలంలో ద గా మారుతుంది.                        
                                                                          
         తె. డాఁగు, దాఁగు : త. ఆటంకు, క. ఆడంగు, కూ. డా- (56).
         తె. డెబ్బది. డెబ్బయ్‌ : త, మ. ఎఱు-పతు, క. ఏఱ్-పత్తు,                 
             ఎప్పత్తు (772).
                                                                      
    (ii) తె. -డ- < * -ట-
         తె. ఆడు : త. మ. అటు, క. తు. ఆడు (290).
         తె. పడు : త. మ. పటు , క. పడు (3190).                                    
   (iii) తే. -డ- > * -ఱ-
         తే. ఏడు : త. మ. క. ఏఴు (772).                                
         తె. కోడి : త. మ. క. కోఴి (1862).
         తె. సుడి : త. మ. చుఴి, క. సుఴి (2223).
                                                                           
     ఱ కారం తెలుగు శాసనాల్లో ప్రత్యేక వర్ణంగా తొమ్మదో శతాబ్దం మధ్య భాగం దాకా ఉంది. ఆ తరవాత అది అచ్చుల మధ్యా, వర్ణవ్యత్యయం వల్ల పదాదికి వచ్చినప్పుడూ డ కారంగా మారింది. (పదాది డకారం తరవాత ద కారంగా మారింది). వర్ణవ్యత్యయం వల్ల పదాది హల్లుకి తరవాత వచ్చినప్పుడు ఆది రేఫగా మారింది. (కృష్ణమూర్తి 1958 a.)
                                                                         
 (iv) తె. -ండ- < * - న్ఱ-, * -ం-ట-
      తె. ఎండ : త. ఎన్ఱు, గోం, ఎద్ది (738).
      తె. మూఁడు : త, మూన్ఱు, మ. మూన్ను, క. మూఱు (4147).
      తె. బఁడి : త. పంటి, వంటి, మ. వంటి, క. తు. బండి (3219).  31.               తెలుగు : మిగిలిన ద్రావిడభాషలు                           
                                                                         
      (v) తె. -డ్డ- < * - ట్ట
          తె. చెడ్ద : త. మ. క. తు. కెట్ట (1614).
          తె. పడ్డ 'పడిన' : త. మ. క పట్ట (3190).                       
                                                                       
2.23. (i) తె. ద- < * త -
          తె. దిద్దు : త. మ. తిరత్తు, క. తిర్దు, తిద్దు (2659). 
          తె. తొండ : త. తొంటై, మ. తొంటి, క. తొండె, దొండె (2880)      
                                                                      
     తెలుగు దాఁగు, దాఁచు, దిగు, దున్ను, దుప్పిలలో పదాది ద కారం డ కారం (< * ట, * ఴ) నించి వచ్చినది (చూ. 2.22). దురద (త. చొఱి, 2343), దొరలు (త. చురుళ్, 2211)లలో పదాది ద కారం చకారం నించి వచ్చినది (చూ. 2.17).
                                                                         
     (ii) తె. -ద-<*-త-
          తె. అది : త. మ. అతు, క. అదు, అతు (1).
          తె. చెదరు : త. చితర్‌, చితై, క. కెదఱు (1294).
                                                                    
    (iii) తె. -ంద- < * -ంత-, * -న్ఱ -                                                 
          తె. పంది : త. కొం. పన్ఱి, మ. పన్ని, క. తు. పంది,                                  
              కొం. పన్ఱి (3326).
          తె. మందు : త. మరుంతు, మ. మరున్ను, క. మర్దు,                      
              మద్దు (3863)
          తె. విందు : త. విరుంతు, మ. విరున్ను, క. బిర్దు,                 
              బిద్దు (4442)
                                                                         
    (iv)  తె. -ద్ద - < * -ర్ద-, * - ఱ్ఱ -
          తె. అద్ధు : త. మ. అఴుత్తు, క. అఴ్దు, (244).
          తె. ఎద్దు : త. మ. ఎరుతు, క. ఎత్తు, ఎద్దు (698).
          తె. దిద్దు : త. మ. తిరుత్తు, క. తిర్దు, తిద్దు (2699).              
                                                                       
2.24. (i) తె. బ - < * ప -, * ప - 
           తె. బీర : త. మ. పీర్‌, పీరం, క. హీరె, హీరి (3467). 
           తె. బెల్లము : త. మ. వెల్లం, క. తు. బెల్ల (4523). 32.                    తెలుగు భాషా చరిత్ర
                                                                                        
         తె. బొమ్మ : త, పొమ్మై, మ. బొమ్మ, క. బొంబె (3701).
         తె. బ్రతుకు : త. మ. వాఴ్, క. బాఴ్, బఴ్ దుంకు (4402)
                                                                       
     (i) తె. -ంబ- < * -ంప -
         తె. చెంబు : త. మ. చెంపు, క. తు. చెంబు (2282).
                                                                                    
    (ii) తె. -బ్బ- < * -ప్బ-, * ర్‌ ప్ప -
         తె. ఉబ్బు : త. ఉప్పు, క. ఉర్వు, ఉర్బు, ఉబ్బు {573(a)}. 
         తె. మ్రబ్బు, మబ్బు : త. మప్పు, క. మర్వు, మర్బు, మబ్బు       
             (3348).                                                   
                                                                       
2.25. (i) తె. న - < * ఞ -                                            
           తె. నరము : త. నరంపు, మ. ఞరంపు, క. నర, నరవు         
               (2364).
           తె. నాఁగలి : త. ఞొంచిల్‌, నాంచిల్‌, మ. ఞేజ్జోల్‌, క.                                          
               నేగల్‌, గోం. నాంగేల్‌ (2368).
           తె. నాఱు : త. మ. ఞొఱు, కూ, నేడ (2380).
           తె. నేల : త. మ. ఞొలం, గోం. నేలీ (2374).
           తె. నిప్పు : త. నెరుప్పు, మ. ఞెరుప్పు, మ.                                       
               నిర్‌-'మండు' (2389).
                                                                    
     (ii) తె. న - > * న -
          తె. నక్క :త.మ.క.తు. నరి (2081).
          తె. నేయి, నెయ్యి : త. మ. క. తు. కో. ప. నేయ్‌ (3104).
          తె. తిను : త. మ. క. తు. గోం. కో. ప. కూ, తిన్‌ - (2670).
                                                                         
    (iii) తె. -న- < * - ణ -    
          తె. అన్న : త. అణ్ణా, అణ్ణన్, మ. అణ్ణన్, క. అణ్ణ,                 
              అణ్ణె (112).
          తె. కన్ను : త. మ. కోత, కణ్, తు, కణ్ణు, గ. కొం. కణ్,                                
              గోం, కడ్ (973)
          తె. పని : త. మ. కొ. కొం. పణి (3209).  33.      తెలుగు : మిగిలిన ద్రావిడభాషలు 
    తెలుగు ఈఁదు (త,. నీంతు. 3304), ఈవు (త. నీ, క. నీను, 5051). ఈరు (త. నీరు, 3055) మొదలైన కొద్ది మాటల్లో పదాది నకారం లోపిస్తుంది. ఈ మార్పు మిగిలిన భాషల్లో కూడా అక్కడక్కడ కనిపిస్తుంది.                                        
                                                                       
2.26. (i) తె. మ < * మ
          తె. మన్ను : త. మ. క. మణ్‌ (3817).
          తె. మేయు : త. మ. క. తు. గోం. ప. మేయ్‌ (4179).              
                                                                        
     (ii) తె. మ < * మ, * -ంబ -                                                       
          తె. ఇనుము : త. మ. ఇరుంపు (411).
          తె. ఎడము : త, మ. ఇటం, క, ఎడ (368).
          తె. కొమ్ము, కొమ్మ : త. మ. కొంపు, క. తు. కొంబు (1759).
          తె. నమ్ము : త. మ. నంపు, క. నంబు (2975).
          తె. పాము : త. మ. పాంపు, క. పావు, తు, హావు (3361).       
                                                                       
2.27. (i) తె. య < * య 
          తె. కోయు : తు. మ. క. కొ. కొండ, ప. కొయ్- (1763).  
          తె. మేయు : త. మ. క. తు. గోం. ప. మేయ్- (4179).   
              తెలుగులో పదాదిన య కారం ఉండదు.                         
                                                                       
2.28. (i) తె. ర < * ర 
          తె. రెండు : త. ఇరంటు, మ. రంటు, క. ఎరడు, ప.               
              ఇర్డు (401)
          తె. పేరు : త. మ. పెయర్‌, పేర్‌, క. పెసర్‌, కో. నా. పేర్‌
              (3612).
          తె. వేరు :త. మ. కోత. వేర్‌, క. బేర్‌, కో. నా. వేర్‌ (4554).
      తెలుగులో పదాది రేఫం ఎప్పుడూ వర్ణవ్యత్యయం వల్ల పదాదికి వచ్చినదై ఉంటుంది.
                                                                          
    (ii) తె. ర < * ఱ
    ఈ మార్పు వర్ణవ్యత్యయం వల్ల ఱ కారం పదాది హల్లుకి తరవాత వచ్చినపుడే జరుగుతుంది (చూ. 2.13).
  (3)

34. తెలుగు భాషా చరిత

          తె. క్రింద, క్రీ :- త. మ. క. కీఱ్ (1348).
          తె. ప్రొద్దు : త. పొఴుతు, పోఴ్తు, క. పొఴ్తు (3724). 
                                                                       
2.29.    తె. ఱ < * ఱ
          తె. తెఱచు : త. తిఱ, మ. తుఱ, క. తెఱ (2678).
          తె. నూజు :త, మ, క. నూజు, గోం. నూర్‌ (3090).
          తె. ఱెక్క, ఎఱక : త. చిఱై, చిఱకు, ఇఱై, ఇఱకు, క.               
              ఎఱకె (2133).
                                                                    
     తెలుగులో పదాది ఱకారం ఎప్పుడూ వర్జవ్యత్యయం వల్ల పదాదికి వచ్చినదై ఉంటుంది. వ్యావహారిక భాషలో ఱ కారం రేఫ తో కలిసీ పోతుంది.
                                                                       
2.30. (i)  తె. ల < * ల
           తె. తల : త. తలై, మ. తల. క. తలె, కో. నా. తల్‌,
               గోం. తల్లా (2529).
           తె. నెల : త. మ. నిలవు, నిలా, ప. నెలిజ్‌, గోం. నెల్లేంజ్‌
               (3113).
           తే. లే-, లేదు : త. ఇల్‌, మ. క. ఇల్ల, ప. చిల్‌, గోం, సిల్,
               కూయి సిడ్ - (2106).                                      
                                                                        
      (ii) తె. ల < * ళ
           తె. ఉల్లము, లో, లోపల : త. మ. ఉళ్‌, ఉళ్ళం, క. ఉళ్,        
               ఒళ్, గోం. రోన్‌ (600).
           తె. ఉలి : త. మ. క. ఉళి (601),
           తె. పల్లము : త. మ. పళ్ళం, క. తు. పళ్ల (3307),
                                                                    
    తెలుగులో పదాది ల కారం ఎప్పుడూ వర్ణవ్యత్యయం వల్ల పదాదికి వచ్చినదై ఉంటుంది.
                                                                       
2.23.    తె. వ < * వ
          తె. వల : త. వలై, మ. వల. క. బలె (4326).
          తె. వెన్న : త. వెణ్ణెయ్‌, మ. వెణ్ణ, కోత, వెణ్, క.                                 
              బెణ్ణె (4511)  35.                    తెలుగు : మిగిలిన ద్రావిడభాషలు 
        తె. చెవి, చెవుడు : త. మ. చెవి, చెవిటు, క. కివి, కివుడు, కో.             
            నా. కెవ్‌ (1645).                                      
                                                                 
    పదమధ్యంలో మూలభాషలో అసంయుక్తమైన మూల *కకారం తెలుగులో కొన్ని పదాల్లో వైకల్పికంగా వకార మవుతుంది. (బా. వ్యా. ఆచ్ఛిక. 27). 
                                                                          
       తె. పగలు/పవలు (త. మ. పకల్, 3151),                             
       తె. నగు, నవ్వు (త. మ. నకు, క. నగు, 2944).                                   
    మరికొన్ని పదాల్లో మూల *వ కారం గకారంగా మారడం కూడా ఉంది.                            
       తె. మూవురు/ముగ్గురు (త. మ. మూవర్‌, 4147).                             
           నలువురు/నలుగురు (త. మ. నాల్‌వర్‌, 3024)                    
                                                                       
2.32.  తె. స < * చ 
       తె. సుడి : త. మ. చుఱి, క. సుఱి, తు. సుళి (2223).
       తె. సొఱ, చొఱ : త. మ. చుఱా, క. చొఱ (2234)
                                                                     
2.33. హత్తు (త. మ. పఱ్ఱు, క. పత్తు, హత్తు, (3320),హెచ్చు (క. పెర్చు, పెచ్చు, హెచ్చు, (3613) వీటిలో కన్నడంలో లాగా * ప కారం హ కారంగా మారింది  కాబట్టి ఇవి కన్నడం నించి ఎరువు తెచ్చుకున్నవి అయి ఉండాలి. తెలుగు దేశ్యపదాలల్లో హ కారం వీటిల్లో తప్న ఇంకెక్కడా లేదు.                                                               
                                                                
                           నామవాచకాలు
2.34.  లింగభేదం. తెలుగులో లింగభేదం ఏకవచనంలో మహత్తు (వాఁడు).   అమహత్తు (ఆది), బహువచనంలో మనుష్యవాచకాలు (వారు), అమనువ్యవాచకాలు (ఆవి) -- ఇలా ఉంటుంది. తెలుగుతో దగ్గిర సంబంధం లేని కూడుఖ్‌ -- మాల్తో భాషలలో కూడా ఇటువంటి లింగభేదమే ఉండటం వల్లా, దక్షిణ ద్రావిడభాషలలో స్త్రీ వాచక ప్రత్యయమైన-ఆళ్ మొదట్లో ప్రత్యేక శబ్దమైనందు వల్లా (కృష్ణమూర్తి, 1961, 4.32) తెలుగు, కురఖ్-మాల్తోలలో ఉన్న లింగభేదమే మూలద్రావిడంలో ఉండేదని పండితుల అభిప్రాయం.  (ఎమెనో 1955, - 10.17). కాబట్టి ఈ విషయంలో తెలుగు మూల ద్రావిడంలో స్థితిని యథాతథంగా నిలుపుకుంది అని చెప్పాలి. మిగిలిన మధ్య ద్రావిడభాషలలో బహువచనంలో కూడా ఏకనచనంలో లాగా మహదమహద్భేదమే ఊంది. ఇది ఆ భాషలలో అర్వాచీన పరిణామం కావచ్చు. ఈ సందర్భంలో ఆమె/ఆవిడ అనే స్త్రీ వాచక పదాలు ఆర్వాచీనాలని గమనించాలి. 36.                         తెలుగు భాషా చరిత్ర

2.35. బహువచన ప్రత్యయాలు. ప్రాచీనాంధ్రంలో కొన్ని మహన్మహతీ వాచకాలలో రు (ఱు) బహువచన ప్రత్యయంగా ఉంది. (బా. వ్యా, అచ్ఛిక. -7, 10-11), ఉదా : పగతురు, అల్లురు, విలుకాండ్రు/విలుకాఱు, కోడండ్రు, మీరు, వారు, అందఱు, కొందఱు ఎవ్వరు. ఇది ఇప్పటి వ్యవహారిక భాషలో సర్వనామాల్లోనూ, ఇద్దరు, ముగ్గురు మొదలైన సంఖ్యా వాచకాల్లోనూ మాత్రమే మిగిలి ఉంది. ఇది మూ. ద్రా. లో మనుష్య వాచక శబ్దాలలో బహువచన ప్రత్యయమైన * - (అ)ర్‌ నించి వచ్చినది. మిగిలిన అన్ని నామవాచకాలలోనూ బహువచన ప్రత్యయం 'లు' (ప్రాచీన శాసనాలలో 'సంవత్సరంబుళ్' మొదలైన పదాల వల్ల ఇది మొదట్లో మూర్ధన్య ళ కారమని తెలుస్తుంది.) తుళులోనూ, కోలామీ, నాయకీ, పర్జీ, గ, ద, బ, లలోనూ *కళ్‌, *ళ్ అనే రెండు ప్రత్యయాల నించి వచ్చిన ప్రత్యయాలు ఉండటం వల్ల మూ. ద్రా. లో కొన్నింటిలో *కళ్‌, మరి కొన్నింటిలో *ళ్ ఉండేనని మనం చెప్పవచ్చు. తెలుగులో కూడా ఏనుగు-లు (త. యానై-కళ్‌), మ్రాకులు (త. మరం-కళ్‌). చిలుక-లు (త. కిళి-కళ్‌), ఎలుక-లు (త. ఎలి-కళ్‌) మొదలైన పదాల్లో బహువవచన ప్రత్యయం *లు' గానే కనిపిస్తున్నప్పటికీ వీటిని తమిళంలో సమాన రూపాలతో పోల్చి చూస్తే వీటితో మొదట్లో బహువచన ప్రత్యయం 'లు' గానే కనిపిస్తున్నప్పటికీ వీటిని తమిళంలో సమాన రూపాలతో పోల్చి చూస్తే వీటితో మొదట్లో బహువచన ప్రత్యయం 'కళ్' ఏనని 'లు' బహువచన ప్రత్యయమని భ్రమించి, దీని ముందున్న క,గ లు ప్రాతిపదికతో చేర్చబడడమనే అనుచిత విభాగం జరిగి ఉంటుందని కాల్డ్ వెల్‌ (1956 : 245) చేప్పేరు.

     తెలుగులోనూ మిగిలిన మధ్య ద్రావిడ భాషలలోనూ బహువచన ప్రత్యయం నిత్యమైనది. అంటే బహుత్వాన్ని ఉద్దేశించినప్పడు. బహువచన ప్రత్యయాన్ని తప్పకుండా వాడాలి. కాని దక్షిణ ద్రావిడ భాషల్లోనూ, ఉత్తర ద్రావిడ భాషల్లోనూ అలా కాదు. “రెండు చెట్లు” అనడానికి తమిళంలో “ఇరంటు మరం”, కన్నడంలో “ఎరడు మర” అని బహువచన పత్యయం (త, కళ్, క. గళు) లేకుండానే అనవచ్చు. కూడుఖ్‌, మాల్తోలలో అసలు బహువచన ప్రత్యయమనేదే లేదు. బ్రాహుయీలో - క్‌ (-ఆక్‌) అనే బహువచన ప్రత్యయం ఉన్నా దీనిని సందేహం కలిగే చోట్ల తప్ప మిగతాచోట్ల వాడరు. కాబట్టి దకిణ ద్రావిడభాషల్లోనూ, ఉత్తర ద్రావిడ భాషల్లోనూ బహువచన ప్రత్యయం వైకల్పికం. అందుచేత మూ.ద్రా. లో వైకల్పికమైన బహువచన ప్రత్యయం తెలుగులోనూ మిగిలిన 37.                                     తెలుగు : మిగిలిన ద్రావిడభాషలు

మధ్య ద్రావిడ భాషలలోనూ నిత్యమైనదిగా మారిందని చెప్పవచ్చు. ఈ మార్పు తెలుగు మధ్య ద్రావిడోపకుటుంబానికి చెందినదని నిర్ణయించడానికి ఒక ప్రబల హేతువు (చూ. సుబ్రహ్మణ్యం 1969 b).

2.36. ఔపవిభక్తికాలు. తెలుగులో -ఇ-, -టి-, -తి- ఈ మూడూ ఔప విభక్తిక ప్రత్యయాలు (బా. వ్యా, అచ్ఛిక., 28-38). -ఇ మూ. ద్రా * ఇన్‌ నించి వచ్చినది : ఊరికి (త. ఊరి- ఱ్కు < ఊర్‌ - ఇన్‌ - కు). కాలికి (త, కాలిఱ్కు < కాల్‌-ఇన్‌-కు). -టి లో ట కారం కొన్ని మాటల్లో మూ. ద్రా * ఱ్ఱ నించీ : ఏఱు. ఏటికి (త. యాఱు, యాఱ్ఱిఱ్కు), నూఱు, నూటికి (త. నూఱు, నూఱ్ఱిఱ్కు), మరికొన్ని మాటల్లో * ట్ట నించీ : కాడు, కాటికి (త. కాటు. కాటిఱ్కు), నాడు, నాటన్ (త. నాటు, నాట్టిల్ ). వచ్చినది (చూ. - 2.16).  -తి, దక్షిణ ద్రావిడభాషల్లో మకారాంత పదాలలో ఉండే -త్త్‌- ప్రత్యయానికి (త. మరం. చెట్టు : మర-త్త్‌-), గోండీలో -త్‌, -ద్‌ -లకీ, తె. చే-తి (-లో) : గోం. కయ్‌-దే (సుబ్రహ్మణ్యం 1968, -- 3, 7, 7.3.7) సంబంధించినది.      
                                                                    
2.37. ద్వితీయాది విభక్తి ప్రత్యయాలు. తెలుగులో ద్వితీయా విభక్తి ప్రత్యయం-ను-ని మూ. ద్రా. * న్‌ నించి వచ్చింది. దీని సమాన రూపాలు తమిళ, మలయాళాలు తప్ప మిగిలిన అన్ని భాషల్లోనూ ఉన్నాయి. అలాగే తెలుగులో షష్టీ (చతుర్ధీ) విభక్తి ప్రత్యయం - -కు (-కి) మూ. ద్రా. * క్క్‌ నించి వచ్చింది. దీని సమాన రూపాలు అన్ని భాషల్లోనూ ఉన్నాయి. తృతీయా విభక్తి ప్రత్యయమైన తోడన్, తోన్‌, తమిళం తృతీయా విభక్తి ప్రత్యయమైన -ఓటు/-ఒటు, -ఉటన్‌తో సంబంధించినది కావచ్చు. ఇంతకన్నా ఇది తోడు 'సహాయం' (మూ. ద్రా. * తోఱ్ - (2939) అనే శబ్దానికి సంబంధించినది అని చెప్పడం సమంజసమని తోస్తుంది.గోరన్‌, ఊరన్‌ మొదలైన పదాల్లో -ఆన్‌ (బా. వ్యా, అచ్ఛిక. 38) తమిళంలో తృతీయా విభక్తి ప్రత్యయమైన -ఆన్‌ (ప్రాచీనం)/-ఆల్‌ (ఆర్వాచీనం)కి సంబంధించినది. ఇవి తప్ప మిగిలిన ప్రత్యయాలుగా పరిగణించబడేవి అన్నీ ప్రత్యేక శబ్దాలు అనడానికి ఆధారాలు ఉన్నాయి, 'చేతన్‌' చేయి అనే పదం తృతీయా సప్తమైక్యవచన రూపం. 'కొఱకు' 'కొఱ' 'ప్రయోజనం' అనే దానికి 'కు' ప్రత్యయం చేర్చడం వల్ల ఏర్పడింది. 'కయి' 'కు' ప్రత్యయానికి ఆయి (ఆగు ధాతువు క్త్వార్ధకం) చేరిస్తే ఏర్భడినది. 'కంటె' 'కన్న' - ఇవి 'కు' ప్రత్యయానికి ఆనుధాతువు నించి వచ్చిన అంటె, అన్న, చేర్చడం వల్ల ఏర్పడినవి. 

33. తెలుగు భాషా చరిత్ర

కావచ్చు. 'వలన' 'వలను' 'ప్రయోజనం, దిక్కు' సప్తమ్యైకవచన రూపం. పొంటె తమిళం 'పొరుట్టు' (పొరుళ్ 'వస్తువు, ప్రయోజనం, నిమిత్తం' + తు) తో సంబంధించినది. పట్టి (త, తఱ్ఱి), కూర్చి, గుఱించు (త. కుఱిత్తు) - ఈ మూడు పట్టు (త. పఱ్ఱు), కూర్చు, గుఱించు (త. కుఱి) - ఈ క్రియల క్త్వార్థకరూపాలు. అందు లో, (త. ఉళ్, క. ఒళ్), లోపల, ప్రత్యేక శబ్దాలుగా కూడా వ్యాప్తిలో ఉన్నాయి.

  2.38.  అస్మదర్థక నర్వనామాలు. ఏను, నేను, మూ. ద్రా. * యాన్‌ నించి వచ్చినవి. ఏము, మేము, మూ. ద్రా * యామ్‌ నించి వచ్చినవి. (మూ, ద్రా. * యా- < తె. ఏ : చూ, - 2.8), వీటి ఔప విభక్తిక రూపాలు నన్‌-/నా-, మమ్‌-/మా- (వీటిలో మొదటిది ద్వితీయా విభక్తి ఆయిన = ఉన్‌ ముందు, రెండోది మిగిలిన విభక్తుల ముందు వస్తాయి). వీటి మూ. ద్రా. రూపాలు వరసగా * యన్‌-,. * యమ్‌-; ఇవి ఈ సర్వనామాల తరవాత అజాది విభక్తి ప్రత్యయం చేరడం వల్ల ధాత్వచ్చు హ్రస్వమవడం వల్ల ఏర్పడినవి (చూ. 2.11. మూల ద్రావిడంలో పదాది యకారం తరవాత దీర్ఘ ఆకారమే గాని మరి ఏ అచ్చూ ఉండదు. కాబట్టి * యన్‌-, *యమ్‌- లలో య కారం లోపించి ఇవి మూలమధ్య ద్రావిడ భాషలో *అన్‌-, *అమ్‌- లుగా మారాయి. కోలామీ, పర్జీ, భాషలలో ఈ రూపాలు నేటికి ఇలాగే నిలిచి ఉన్నాయి. వీటికి చతుర్ధీ ప్రత్యయం -అక్కు. షష్టీ ప్రత్యయం -అ(దు) చేరగా వచ్చిన *అనక్కు, *అనదు, *అమక్కు, *అమదు అనే రూపాలు వర్ణవ్యత్యయం పొంది నాకు, నాదు, మాకు, మాదుగా మారాయి. ఈ రెండు విభక్తులలోనూ వర్ణవ్యత్యయం వల్ల సిద్ధించిన నా-, మా-, అనే రూపాలే ద్వితీయ తప్ప అన్ని విభక్తులలోనూ ప్రాతిపదికలుగా స్థిరపడ్డాయి. ద్వితీయలో అన్‌-, ఆమ్‌- ల మొదట నకార మకారాలు చేరి అవి నన్‌-, మమ్‌- లుగా మారడం నా-, మా-ల ప్రభావం వల్లనే కావచ్చు. ఇక ఏను, ఏము ప్రాచీన రూపాలనీ, నేను, మేము అర్వాచీన రూపాలనీ తులనాత్మక వ్యాకరణ దృష్ట్యానే కాకుండా నన్నయ భారతం వల్ల కూడా సృష్టమవుతుంది. నన్నయ భారతంలో ఏను, ఏము అతి ప్రచురంగా ఉండగా నేను నాలుగు చోట్ల, 'మేము' ఆరు చోట్ల మాత్రమే కనబడుతుంది. (చూ. నన్నయ పద ప్రయోగ కోశము). అలాగే నన్నెచోడుని కుమార సంభవంలో కూడా (చూ. నన్నెచోడ ప్రయోగ సూచిక) 'ఏను' చాలా చోట్ల ఉండగా 'నేను' నాలుగు చోట్ల మాత్రమే ఉంది. ఇందులో 'ఏము' అనే రూపమే 39.                               తెలుగు : మిగిలిన ద్రావిడభాషలు

తప్ప మేము ఆనే రూపం అసలే లేదు. కాబట్టి ఏను, ఏము-, వీటి ఔపవిభక్తిక రూపాలైన నా-, మా-, ల ప్రభావం వల్ల న కార మ కారాలు వీటి ముందు చేరడం వల్ల ఇవి నేను, మేముగా తరవాత కాలంలో మారాయని ఊహించవచ్చు.

2.39. యుష్మదర్ధక సర్వనామాలు. నీవు, ఈవు, మూ. ద్రా. *నీన్‌ నించి వచ్చినవి. ఈరు, మీరు, ఈరలు, మీరలు, మూ. ద్రా. * నీమ్‌/* సీర్‌ నించి వచ్చినవి. వీటి ఔపవిభక్తిక రూపాలు నిన్‌-/నీ-, మిమ్‌-/మీ- (వీటిలో మొదటిది ద్వితీయా విభక్తి అయిన -ఉన్‌, ముందు, రెండోది మిగిలిన విభక్తుల ముందు వస్తాయి). వీటి మూ. ద్రా. రూపాలు *నిన్‌-, *నిమ్‌-, వీటిలో పదాది న కారం మూలమధ్య ద్రావిడంలోనే లోపించి ఇవి *ఇన్‌-, *ఇమ్‌-గా మారాయి. ఈ రూపాలు కోలామీ-పర్జీ భాషలలో నేటికి ఇలాగే నిలిచి ఉన్నాయి. అస్మదర్థక రూపాలకి మల్లేనే ఇవి కూడా చతుర్ధీ, షష్టీ విభక్తులలో వర్ణవ్యత్యయం పొందడం వల్ల నీకు, నీదు, మీకు, మీదు, అనే రూపాలు ఏర్పడ్డాయి. వీటిలో ఉన్న నీ-, మీ-, ల ప్రభావం వల్ల ద్వితీయా విభక్తి ముందు ఉన్న ఇన్‌-, ఇమ్‌-, లు నిన్‌-, మిమ్‌-, లుగా మారాయి.

    *నీన్‌ లో పదాది న కారం అన్ని మధ్య ద్రావిడ భాషల్లోనూ, అంత్య న కారం తమిళం, మళయాళం, కోత, తొద, తెలుగు, బ్రాహుయీలలోనూ లోపించాయి. ఈ రెండు నకారాలూ పోగా మిగిలిన 'ఈ' చివర హల్లు లేని ఏకాక్ష పదం కాబట్టి దీని చివర 'వు' చేరి ఈవు గా మారింది. ఆవు (< *ఆ), పూవు (*పూ) మొదలైన పదాల్లో కూడా ఇటువంటి మార్పే  జరిగింది. ఔపవిభక్తికమైన నీ- ప్రభావం వల్ల పదాదిని న కారం చేరి ఈవు నీవుగా మారింది. 
                                                              
      మూలద్రావిడంలో యుష్మదర్ధక బహువచన రూపం *నీమ్‌. దానిలో బహువచన ప్రత్యయమైన మకారం స్థానాన్ని దాని కన్న విశేషవ్యాప్తిలో ఉన్న మనుష్య వాచక బహువచన ప్రత్యయమైన రేఫ ఆక్రమించుకోడం వలన ఏర్పడిన *నీర్‌ అనే మరొక రూపం మూల ద్రావిడ భాష కాలంలోనే సృష్టించబడింది. తమిళంలో నీర్‌, నీయిర్‌, తుళు, ఈరు, తెలుగులో ఈరు, కూయి, ఈరు, నీర్‌, అనే రూపం నించి వచ్చినవే. తుళు, తెలుగు, కూయి, ఈరు, *నీర్‌ అనే రూపం నుంచి వచ్చినవే. తుళు, తెలుగు, కూయి, ఈరు, *నీర్ లో పదాది న కారం లోపించడం వల్ల ఏర్పడింది. తెలుగులో దీనికి ఔపవిభక్తికమైన మీ- ప్రభావం వల్ల పదాదిని మకారం చేరి మీరు ఏర్పడింది. ఈరలు, మీరలు, ఈరు, మీరులకు మళ్ళీ బహువచన ప్రత్యయమై 'లు' చేరగా ఏర్పడినవి.  40.                                               తెలుగు భాషా చరిత్ర 
                                                                 
     వర్ణవ్యత్యయం వల్ల ఏర్పడిన నా-, మా-, నీ-, మీ-, అనే యుష్మదస్మదర్థ కాల ఔపవిభక్తిక రూపాలు తెలుగు, గోండీ, కొండ, పెంగొ, మండ, కూయి, కువి అనే భాషలు అన్నింటిలోనూ సమానంగా ఉన్నాయి. కాబట్టి వీటిలో ఈ వర్ణవ్యత్యయం ఈ భాషలన్నీ ఒకే భాషగా ఉన్న కాలంలో జరిగి ఉంటుందని ఊహించవచ్చు. గోండీ, కూయిలలో కొన్ని మాండలికాల్లోనూ కొండ, కువిలలోనూ కూడా తెలుగులో లాగా ఔపవిభక్తిక రూపాల ప్రభావం వల్ల నామవాచక రూపాల మొదట న కార మ కారాలు చేరడమనే మార్చు కనపడుతోంది. (యుష్మదస్మ దీర్ఘకాల పరిణామం సమగ్ర చర్చకి (చూ. కృష్ణమూర్తి 1968 a, సుబ్రహ్మణ్యం 1969 a). [(కృష్ణమూర్తి (1961 : 268)] *అవన్ఱ్  ఏ మూల ద్రావిడ రూపమని చెప్పారు. బరో కూడా *అవన్ట్‌ ఏ మూల ద్రావిడ రూవమని *అవన్‌- దాని ఔపవిభక్తిక రూపమనీ, ఈ ఔపవిభక్తిక రూపమే దక్షిణ భాషలలో ప్రథమా విభక్తిలో కూడా సామ్యం వల్ల ప్రవేశించిందనీ వివరించారు. ఈ రెండో అభిప్రాయమే ఎక్కువ యుక్తి యుక్తగా ఉంది.            
                                                                    
 2.40.  ఉభయార్థకం. మూల ద్రావిడంలో ఉభయార్థక సర్వనామం *నామ్‌, దీని ఔపవిభక్తిక రూపం *నమ్‌-, తెలుగులో మా-, మీ-, అనే మ కారాదులై న యుషస్మద్మ దీర్ఘకాల ఔపవిభక్తిక రూపాల ప్రభావం వల్ల దీనిలో కూడా వర్ణవ్యత్యయం సంభవించి *నమ, మనగా మారి ఉండవచ్చు. తెలుగు 'మనకు' ని తమిళం 'నమక్కు' తో పోలిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. దీని చివర బహుత్వ సూచకమైన 'ము' చేరి 'మనము' అనే ప్రథమా రూపం సిద్ధించి ఉండవచ్చు.                                                                                       
                                                                       
2.41. మహదేకవచన సర్వనామం. తెలుగు వాఁడు, కో. అమ్డ్/అవ్‌న్ద్, ప. ఓద్‌/ఓడ్‌, కొండ వాన్ఱు, కూయి, అఅంజు. కువి అఅసి-వీటికి మూలమధ్య ద్రావిడంలో మూలరూపం *ఆవన్ఱ్, దక్షిణ ద్రావిడభాషల్లో దానికి సమానపదం *అవన్‌. ఇదే మూల ద్రావిడ రూపం కూడా అయి ఉండవచ్చు: మూలమధ్య ద్రావిడభాష కాలంలో మూ. ద్రా.  *అవన్‌ చివర ఒక తకారం చేరి అది *అవన్ఱ్ గా మారింది. (దంత్య తకారం దంతమూలీయన కారం తరవాత దంతమూలీయ ఱ కారంగా మారుతుంది.) అమహదేకవచన సర్వనామమైన *అత్‌ (తె. అది) చివర తకార ముండడం వల్ల మధ్య ద్రావిడంలో *ఆవన్‌కి కూడ చివర తకారం చేరి అది *అవన్ఱ్ గా మారి ఉండవచ్చునని ఎమెనో (1955, $ 10.15) ఊహించేరు. ఈ పరిణామం  41.                                   తెలుగు : మిగిలిన ద్రావిడ భాషలు

తెలుగులోనూ ఇతర మధ్య ద్రావిడ భాషల్లోనూ కూడా జరిగింది. కాబట్టి ఇది తెలుగు మధ్య ద్రావిడ భాష అని నిర్ణయించడానికి ఒక ముఖ్యాధారం.

2.42.  సంఖ్యాపదాలు. ద్రావిడ భాషలలో ఒకటి నించి పది వరకూ, 100 కీ. 1000 కీ. (తెలుగులో మాత్రం) ప్రత్యేక సంఖ్యలు ఉన్నాయి. 20,30 మొదలైన దశగుణ సంఖ్యలకి పదాలు 10 రూపానికి 2,3,4 మొదలైన వాటి విశేషణ రూపాలు ముందు చేర్చడం వల్ల ఏర్పడతాయి. పది పైన ఉండే అంకెలు (సున్న ఉన్నవి కాక మిగిలినవి) సున్న ఉన్న అంకె తరవాత 1,2,3 మొదలైన వాటి పదాలు చేర్చడం వల్ల ఏర్పడతాయి. త. మ. ఆయిరం, క. సావిర. సాసిర, తా. సోఫెర్‌ సంస్కృతం సహస్ర '1000' నించి వచ్చినవి కాని తెలుగు 'వేయి, వెయ్యి' మాత్రం ద్రావిడ పదమే. లక్ష, కోటి అనే సంస్కృత పదాలే నాలుగు సాహిత్యవంతమైన భాషలలోనూ ఆ సంఖ్యలని సూచించడానికి ఉపయోగిస్తారు. 
                                                                    
   తెలుగులో ప్రాథమిక సంఖ్యాపదాలూ, వాటి మూలరూపాలూ 1. ఒండు < * ఒన్ఱ్, ఒక్కండు, ఒకండు, ఒకటి య < * ఒర్‌-, 2. రెండు < * ఇరంట్‌, 3. మూడు < మూన్ఱ్, 4. నాలుగు < * నాల్‌, 5. ఏను, ఐదు (<క.) < * చయ్‌- (న్‌త్), 6. ఆఱు, < * చాఱ్ఱ్, 7. ఏడు < * ఏఱ్, 8. ఎనిమిది (శా. ఎణుంబొది) < * ఎణ్, 9. తొమ్మిది < * తొణ్‌ (8,9లలో మిది < పది), 10. పది < * పత్త్‌ (* పతిన్ -దీని ఔపవిభకిక రూపం-ఇదే తెలుగులో ప్రథమా రూపంగా మారింది. 100. నూఱు < * నూఱ్ (వంద సం. బృందశబ్దభవమని అంటారు) 1000. వేయి, వెయ్యి < * వయ్‌- (దీనిపై వివరాలకి చూ. సుబ్రహ్మణ్యం 1977; 220-231).                                       
                                                                 
    తెలుగులోనూ. ఇతర భాషలలోనూ మనుష్య వాచక సంఖ్యా పదాలు ప్రాథమిక సంఖ్యా పదధాతువుకి ప్రత్యయం చేర్చడం వల్ల ఏర్పడతాయి. తెలుగులో ఈ ప్రత్యయ రూపాలు- రు (ఒకరు, ఒక్కరు, ఎనమండ్రు, -తొమ్మండ్రు, పదుండ్రు- దఱు (ఇద్దఱులో మాత్రం), -వురు/- గురు (మూవురు, మువ్వురు, ముగ్గుకు, నలువురు, నల్వురు, నలుగురు, మొ) -వురు/-గురు త. మ. క. - వర్‌కు సంబంధించినది - త. మ. మూవర్‌, క. మూవరు, ముగ్గురు, మొ. ఆధునిక భాషలో 'ఎనిమిది' కీ ఆపై సంఖ్యలకీ మనుష్యార్థంలో 'మంది' (క. మంది) చేరుతుంది; ఎనిమిదిమంది/ ఎనమండుగురు, తొమ్మిది మంది/ 

తొమ్మండుగురు దీనిబదులు - గురు కూడా ఉంటుంది. కాని దశగుణ సంఖ్యలలోనూ, పధ్నాలుగు తరవాతా - గురు ఇప్పటి భాషలో ఉండదు (ప్రాచీన భాషలో 'పదుగురు' ఉంది), రాయలసీమ మాండలికంలో ఐదు, ఆరు, ఏడులకి కూడా “మంది” చేర్చి వ్యవహరిస్తారు.

పూరణ సంఖ్యలు ప్రాథమిక సంఖ్యా పదాలకి - అగున్‌/-అ వున్‌/- ఆవ (వ్యా -ఓ) చేర్చడంవల్ల ఏర్పడతాయి: రెండగున్‌/రెండో. ఇది నిజానికి 'అగు' ధాతువు తద్ధర్మార్థక ధాతుజవిశేషణ రూపమే. ఇది త.మ. - ఆవతు/- ఆం (ఇరంటాం), క.తు - అనెయ (క. ఎరడనెయ) 'రెండో' ప్రత్యయాలకి సంబంధించినదే.

                         క్రియలు             
                                                               
    2.43. ప్రేరణ ప్రత్యయాలు. తెలుగులో 'చు', 'పు', 'ఇందు'- ఈ మూడూ ప్రేరణ ప్రత్యయాలు, '-చు' కన్నడం -చు (-ఇసు)-, గోండీ ఊన్‌-, కూయి -న్‌ మొదలైన వాటికి సంబంధించినది. ఈ ప్రత్యయం తమిళమలయాళాలు తప్ప మిగిలిన అన్ని భాషల్లోనూ ఉంది. -పు ప్రత్యయం కూడా చాలా ద్రావిడ భాషల్లో ఉంది. (తె. త్రిప్పు : త. తిరుప్పు). - ఇంచు ప్రత్యయం ఇ. చు అనే రెండు ప్రేరణార్థకాల సముదాయం కావచ్చు. ఇకారం ప్రేరణార్థకంగా తమిళం “వి” (చెయ్‌వి “చేయించు”, “ప్పి” (నటప్పి. 'నడపు”) లలో వకార పకారాలతో కలిసి ఉంది.                       
                                                              
      మూలద్రావిడంలో అద్విరుక్తస్పర్శంతో (దాని మందు అనునాసికం ఉన్నా లేకపోయినా) అంతమయ్యే కొన్నిక్రియలలో దాని స్థానంలో ద్విరుక్తస్పర్శాన్ని (దీనిముందు అనునాసికం నశిస్తుంది), ఆదేశం చెయ్యడంవల్ల కూడా ప్రేరణ క్రియలు ఏర్పడేవి (త. ఆటు 'ఆడు"-ఆట్టు "ఆడించు : కలంకు “కలఁగు" : కలక్కు- కలఁచు”). ఈ ప్రక్రియ నేటికీ తమిళం, మళయాళం, కోత, తొద, కొడగు, కొండ, కూయి, కువి, పెంగొ, మండ భాషల్లో నిలిచి ఉంది. తెలుగులోనూ ఇతర భాషల్లోనూ ఇది నశించింది (దీనిపై వివరాలకి చూ. సుబ్రహ్మణ్యం 1965, 1977, 300-331).                          
                                                               
      2.44. భూతకాలిక ప్రత్యయాలు.మూలద్రావిడంలో “-త్-,-న్త్-,-త్త్-,-ఇ-/-ఇన్‌-” అనే నాలుగు భూతకాలిక ప్రత్యయాలు ఉన్నట్లు తమిళం-కొడగు 43.                         తెలుగు : మిగిలిన ద్రావిడ భాషలు                                 
                                                           
    భాషా సముదాయం వల్ల తెలుస్తుంది. వీటిలో-ఇ-/-ఇన్‌- హ్రస్వాచ్చు గల ఏకాచ్చ క్రియలు కాకుండా ఉండి స్పర్శంతో అంతమయ్యే క్రియల తరవాత, మిగిలిన మూడు ప్రత్యయాలూ మిగిలిన క్రియల తరవాతా వచ్చేవి. తెలుగులో ఈ నాలుగు ప్రత్యయాలూ ఐక్యం పొంది -ఇతి- ఏర్పడింది. దీని సపదాంశమైన -టి- నకారాంత ధాతువుల తరవాత వస్తుంది. తెలుగులో తిం-టి-ని, కౌం-టి-ని తమిళంలో తిన్‌-ఱ్-ఏన్‌, కొణ్-ట్‌-ఏన్‌తో పోలిస్తే వీటిలో -౦ట్‌- *-న్ఱ్, *-ణ్ట్ - అనే- రెండింటి నించి వచ్చిందని తెలుస్తుంది. మూల ద్రావిడంలో                                                                
                                                                              /  \    /   \
                                                                              |     |    |  న్  |
                                                                              | ఱ్ |     |      |-
                                                                              |     |    |  ల్  | 
                                             త్                →             |     | / |      |      
                                                                              |     |     | ణ్  |
                                                                              |ట్   |    |      |-
                                                                               \  /    |  ళ్  |
                                                                                         \   /
                                                                         
                                                                         
                                                                         
                                                                         
                                                                         
                                                                         
                                                                         

అనే సంధిసూత్రం ఉండడం వల్ల వీటిలో ఱ్, ట్‌లు -త్‌- రూపాంతరాలే. *-న్ఱ్-, * -ణ్ట్-తెలుగులో -ండ్‌- అవ్వాలి (2.22). కాబట్టి పై వాటిలో ఉండవలసిన డ కారం ట కారంగా -ఇతి-లో శ్వాసమైన తకారం ప్రభావం వల్ల మారిందనిఎమెనో(1967 : 388) అభిప్రాయం

     తెలుగులో -ఇతి-, -టి-ఉత్తమ మధ్యమ పురుష ప్రత్యయాల ముందే వస్తాయి. ప్రథమ పురుషలో మహత్‌ ప్రత్యయమైన రి ముందు ఇ, మిగిలిన చోట్ల ఎను ఉంటాయి. ఎనుకి కొన్ని క్రియల్లో ఇయెను అనే రూపాంతరం కూడా ఉంది. (బా. వ్యా. క్రియా. 50). కాబట్టి ఇది ఇ, అన్‌ అనే రెండు భూతకాలిక ప్రత్యయాల సముదాయమని ఊహించవచ్చు. అనియెను, అనెను మొదలైన వాటిలో 'ఇయెను' ఏ ప్రాచీనమైన మల్లియ < మల్లె, కన్నియ < కన్నెలోలాగా అది 'ఎను' గా తరవాత కాలంలో మారి ఉండవచ్చు. మూలద్రావిడంలో నాలుగు ప్రత్యయాలకి బదులు ఒకే ప్రత్యయం ప్రచురంగా ఉండడం తెలుగులోనూ, గోండీ కోలామీ మొదలైన కొన్ని మధ్య ద్రావిడ భాషల్లోనూ తుల్యంగా ఉంది.
                                                                      
2.45. భావికాలిక ప్రత్యయాలు. తెలుగులో -దు-/-ఎద-.. ఉత్తమ మధ్యమ పురుష ప్రత్యయాల ముందూ, ప్రథమ పురుషలో మహత్‌ బహువచన ప్రత్యయం ముందూ వస్తుంది. ప్రాచీన తమిళంలో -త్‌- అనే భావికాలిక 44.                                            తెలుగు భాషా చరిత్ర.

ప్రత్యయం ఉత్తమ పురుష బహువచనం ముందూ, మధ్యకు పురుష ఏకవచన, బహువచనాల ముందూ మాత్రమే వస్తుంది. ఉదా, అఱితుమ్‌ (తె. ఎఱుఁగుదుము). పోకతి (తె. పోవుదు (వు), కాంటిర్‌ (తె. (మీరు) కందురు). ప్రాచీన తమిళంలో ఊన్న ఇటువంటి రూపాలు తప్పితే దక్షిణ ద్రావిడ భాషల్లో పకారవకారాలే భావికాలిక ప్రత్యయాలుగా ప్రచురంగా ఊన్నాయి. కాని అన్ని మధ్య ద్రావిడ భాషలలోనూ తకార దకారాలు వర్తమాన భావికాలిక ప్రత్యయాలుగా చాలా వ్యాప్తిలో ఉన్నాయి. కాబట్టి తెలుగు మధ్య ద్రావిడభాష అనడానికి దీనిని కూడా ఒక ముఖ్యాధారంగా గ్రహించవచ్చు.

     ప్రధమ పురుషలో మహద్భహువచనం తప్ప మిగిలిన చోట్ల భావికాలిక ప్రత్యయం -ఉను. దీని తరవాత పురుష ప్రత్యయాలు లోపించి ఈ రూపం మహదమహదేకవచన, అమవాద్బహువచనాల్లో తుల్యంగా ఉంటుంది. తమిళంలో దీనికి సమమైన ప్రత్యయం -ఉమ్‌. అది కూడా (ప్రాచీన తమిళంలో మహద్బహు వచనం తప్ప మిగిలిన అన్ని లింగవచనాల్లోనూ ఉండేది. ఉదా. త, పాటుమ్‌ (తె. పాడును, నకుమ్‌ (తె. నగును, నవ్వును). త. ఉమ్‌. తె. ఉను. మూ. ద్రా. * - ఉమ్‌ నించి వచ్చినవి. మ్రాను (త. మరమ్‌), కొలను (త. కుళమ్‌) వంటి పదాల్లో ఆంత్యమకారం తెలుగులో నకారంగా మారినట్టు ఈ *-ఉమ్‌ లో మకారం కూడా నకారంగా మారింది                       
                                                                        
    2.46.వ్యతిరేక ప్రత్యయాలు. తెలుగులో -అ-వ్యతిరేక ప్రత్యయంగా అన్ని పురుష ప్రత్యయాల ముందూ ఉంటుంది. కాని తమిళం, కన్నడం మొదలైన దక్షిణ ద్రావిడభాషల్లో మాత్రం వ్యతిరేక ప్రత్యయమైన -ఆ- అమహదేకవచన బహువచనాల ముందే ఉండి, మిగిలిన పురుష ప్రత్యయాల ముందు దీని లొపరూపం ఉంటుంది. మధ్య ద్రావిడభాషల్లోనూ బ్రాహుయీలోనూ తెలుగులోలాగా వ్యతిరేక ప్రత్యయం అన్ని పురుష ప్రత్యయాల ముందూ ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో కూడా తెలుగు మధ్య ద్రావిడభాషలతోనే సన్నిహితంగా ఉన్నట్లు తేలుతుంది. ఈ వ్యతిరేక ప్రత్యయం మూ. ద్రా. రూపం * -ఆ-. ఇది తమిళంలో దీర్ఘ ఆకారంగానే ఉండగా తెలుగులో అవదాద్యక్షరంలో దీర్ఘాచ్చు హ్రస్వమవుతుంది. (ఆరయ : త. అరాయ్‌ : ఏమఱు, త. ఏమాఱు). కాబట్టి ఇది హ్రస్వ ఆకారంగా మారింది. ఉదా. చేయదు/చెయ్యదు (త. చెయ్యాతు). (అవి) చేయవు- చెయ్యవు (త. చెయ్యా).  45.                        తెలుగు : మిగిలిన ద్రావిడ భాషలు
2.47. క్త్వార్ధకం. తెలుగులో క్త్వార్థక ప్రత్యయం -ఇ. దీని ముందు ధాతువులో యకారం నకారంగా మారుతుంది. కాని తెలుగులో కొన్ని క్త్వార్ధక రూపాల్ని మిగిలిన మధ్య ద్రావిడభాషల్లో క్త్వార్ధకరూపాలతో పోల్చి చూస్తే ఇకారం ముందున్న సకార, చకారాలు కూడా మొదట్లో క్వ్వార్ధక ప్రత్యయానికి చెందినవే అని తెలుస్తుంది. (చూ. కృష్ణమూర్తి 1961, 4.47) 

తెలుగు గోండీ కొండ కుయి కువి పర్జీ గదబ
1. వచ్చి వాసీ వాజి వాజు వాహ వెరి వరి
2. తెచ్చి తచ్చీ తసి తస
3. ఇచ్చి సీసీ సీఅ హీహ
4. చూచి సూడ్‌సీ సుడ్ జి సూడ చూడి సూడి
5. చేసి కీసీ కిజి గిఅ
6. నిల్చి నిల్‌సీ నీల్‌జ నిల్ చి


   పై ఉదాహరణల్లో గోండీ మొదలైన భాషలన్నింటిలో సకార చకారాలు స్పష్టంగా క్త్వార్థక ప్రత్యయానికి సంబంధించినవే. తెలుగులో కూడా మొదట్లో ఇటువంటి క్రియల్లో క్త్వార్ధక ప్రత్యయం -చి/-సి. కాని ఆడి, పాడి, చెప్పి మొదలైన అనేక క్రియలలో ఇకారం మాత్రమే క్వార్ధక ప్రత్యయం కాబట్టి వీటిలో కూడా అనుచిత విభాగం వల్ల ఇకారం మాత్రమే క్త్వార్ధక ప్రత్యయంగా గ్రహించబడి చకారం క్రియలో భాగంగా కలిపివేయబడింది              
                                                                       
     కోలామీ తప్ప మిగిలిన మధ్య ద్రావిడ భాషలన్నిటిలోనూ ఇకారంతో పాటు సి/చి కూడా క్త్వార్ధక ప్రత్యయాలుగా ఉన్నాయి. కోయ తప్ప మిగిలిన గొండీ మాండలికాల్లోనూ, కొండలోనూ ఇ నశించి సి/చి ఏ అన్ని క్రియలకీ క్త్వార్ధక ప్రత్యయంగా వ్యాపించింది. ఇకారం స్పర్శంతో అంతమయ్యే క్రియల్లో క్త్వార్ధకంగా మూలద్రావిడం లోనే ఉంది. సి/చి మాత్రం మూలమధ్య ద్రావిడభాష కాలంలో మిగిలిన క్రియల్లో క్త్వార్ధకంగా సృష్టించబడింది. ఈ నూతనపరిణామం తెలుగులోనూ, కోలామీ తప్ప మిగిలిన మధ్య ద్రావిడభాషలు అన్నిటిలోనూ కనబడుతోంది. కాబట్టి తెలుగు మధ్య ద్రావిడోప కుటుంబానికి చెందినది అనడానికి ఇది ఒక ప్రబలాధారంగా మనం పరిగణించవచ్చు (చూ. సుబ్రహ్మణ్యం 1969, & 6)  46.                                                          తెలుగు భాషా చరిత్ర       
                                                                      
2.48. భూతధాతుజ విశేషణం. తెలుగులో క్రియకి - ఇన చేర్చటం వల్ల ఇది ఏర్పడుతుంది. ఇందులో -ఇన్‌- భూత్యప్రత్యయం, -అకారం విశేషణ ప్రత్యయం తమిళ, మలయాళాల్లో స్పర్శంతో అంతమయ్యే క్రియల్లో భూతధాతుజ విశేషణం -ఇన (ప్రాచీన తమిళం -ఇయ) చేర్చడం వల్ల ఏర్పడుతుంది. త. మ. పాటిన : తె. పాసిన, కలంకిన : తె. కలఁగిన ఆభాషల్లో మిగిలిన క్రియల్లో -త్‌-, -న్త్‌-, -త్త్‌- ప్రత్యయాల తరవాత అకారం చేరడం వల్ల ఈ రూపం ఏర్పడుతుంది : త. మ చెయ్‌త: తె. చేసిన, త. మ. వంత : తె. వచ్చిన. కాబట్టి తెలుగులో ఈ రూపంలో -ఇన్‌- అనే భూత ప్రత్యయం అన్ని క్రియల్లోకి వ్యాపించిందని తెలుస్తుంది.                                                  
                                                                        
     పడిన, చెడిన - తగిన అనే వాటికి పర్యాయాలైన పడ్డ (త. మ. క. పట్ట) చెడ్డ (త. మ. క. కెట్ట), తగ్గ (త. మ. క. తక్క) అనే రూపాల్లో (బా. వ్యా. క్రియా. 51) -త్‌- అనే భూతప్రత్యయం ధాతువు చివరి హల్లుతో సమీకృతమై నేటికీ నిలిచి ఉంది. వీటిలో -ఇన్‌- లేదు. కాబట్టి ఇవే ప్రాచీన రూపాలనీ, పడిన, చెడిన, తగిన అనేవి -ఇన్‌- సర్వత్రా వ్యాపించడం వల్ల ఏర్పడిన అర్వాచీన రూపాలనీ చెప్పవచ్చు. అన్న, కొన్న, తిన్న, మొదలైన నకారాంతధాతువుల భూతధాతుజ విశేషణ రూపాలు అనిన, కొనిన, తినిన మొదలైన వాటిలో రెండు నకారాలమధ్య ఇకారం లోపించడం వల్ల ఏర్పడినవి. 
                                                                    
 2.49.  తద్థర్మధాతుజ విశేషణం. ఇది ధాతువుకి ఎడి, ఎడు చేర్చడం వల్లగాని ఏమీ చేర్చక పోవడం వల్లగాని ఏర్పడుతుంది : వండు, వండెడి, వండెడు. -ఎడి, ఎడులకి మిగిలిన భాషల్లో సమాన రూపాలు ఇంతవరకూ దొరకలేదు. ఇక చేయు (వాఁడు) మొదలైన వాటిలో ఉకారం భావికాలిక ప్రత్యయమైన *-ఉమ్‌ నించి వచ్చినది. వీటి తరవాత అచ్చుతో మొదలయ్యే పదం వస్తే ఈ ఉకారం తరవాత నకారం వస్తుంది : చేయనతఁడు. ఈ నకారం ప్రాచీనమైన మకారం నించి వచ్చినది (చూ. 2.45). ఇది తెలుగులో హల్లుపరమైనప్పుడు నశిస్తుంది. తమిళ, మలయాళాల్లో - ఉమ్‌తద్ధర్మధాతుజ విశేషణంగా ఉంది; తె, చేయు (న్‌); త. మ. చెయ్యుమ్‌, తె. పాడు (న్‌) ; త. మ. పాటుమ్‌.               
                                                                    
 2.50.  వ్యతిరేక క్త్వార్థకం.  తెలుగులో ఇది ధాతువుకి - అక చేర్చడం వల్ల  ఏర్పడుతుంది. పర్జీలో కూడా దీనికి ప్రత్యయం -అక. గోండీలో దీనికి ప్రత్యయం - వాక్‌ (సుబ్రహ్మణ్యం 1968 & 4.16).  47.                                      తెలుగు : మిగిలిన ద్రావిడ భాషలు



తెలుగు పర్జీ గోండీ
చూడక చూడక సూఢ్‌ వాక్‌
రాక వెరక వాయ్‌వాక్‌
ఈ(య)క చియక సియ్‌వాక్‌
తినక తినక తిన్‌వాక్‌



     మూలద్రావిడంలో వ్యతిరేక క్త్వార్ధకం క్రియకి వ్యతిరేక ప్రత్యయమైన *-ఆ చేర్చడం వల్లనే ఏర్పడేది. ఈ పద్ధతి ప్రాచీన తమిళంలోనూ, కోతలోనూ నిలిచి ఉంది : ఉదా. త. చెయ్యా. 'చెయ్యక', చొల్లా 'చెప్పక'. ఈ వ్యతిరేక క్త్వార్ధకం సాధారణంగా భూతకాలంలో వ్యతిరేకతని సూచిస్తుంది. కాబట్టి అన్ని దక్షిణ ద్రావిడభాషల్లోనూ దీని చివర భూత ప్రత్యయమైన తకారం చేరింది. ఊదా. త. చెయ్యాతు 'చెయ్యక' చొల్లాతు, 'చెప్పక', క. ఎన్నడె 'అనక', ఈయదె 'ఇయ్యక'. తెలుగు, పర్జీ, గోండీ ప్రత్యయాలలో అకారం మూ. ద్రా. వ్యతిరేక ప్రత్యయమైన *-ఆ నించి వచ్చినదే; దాని తరవాత ఉన్న కకారం దక్షిణ ద్రావిడభాషల్లో తకారంలాగా భూతప్రత్యయమై ఉండవచ్చు. కకారం భూతప్రత్యయంగా మూడు ఉత్తర ద్రావిడ భాషల్లోనూ ప్రచురంగా ఉంది. తెలుగు వ్యతిరేక క్త్వార్ధకం పర్జీ, గోండీ వ్యతిరేక క్త్వార్ధక రూపాలతో సన్నిహితంగా ఉంది. కాబట్టి. తెలుగు మధ్య ద్రావిడభాష అని చెప్పడానికి ఇది ఒక ప్రబలాధారం. (చూ. కృష్టమూర్తి 1961, & 4.49., సుబ్రహ్మణ్యం 1969, & 8.) 
                                                                    
2.51. వ్యతిరేకధాతుజ విశేషణం. తెలుగులో ఇది క్రియకి-అని చేర్చడం వల్ల ఏర్పడుతుంది. మూలద్రావిడంలో వ్యతిరేకధాతుజ విశేషణం కూడా వ్యతిరేక క్త్వార్ధకానికిలాగా వ్యతిరేక ప్రత్యయమైన *-ఆ చేర్చడం వల్లనే ఏర్పడేది. ఈ పద్ధతి ప్రాచీన తమిళంలోనూ, గోండీ, కువ, కోలామీ, పర్జీ, గదబల్లో నేటికీ నిలిచి ఉంది. కాని దక్షిణ ద్రావిడ భాషల్లో తరవాత కాలంలో వ్యతిరేక ప్రత్యయం తరవాత భూతకాలిక ప్రత్యయమైన తకారమూ దాని తరవాత విశేషణ ప్రత్యయమైన అకారమూ చేరేయి. ఉదా : త. చెయ్యా, చెయ్యాత, మ. చెయ్యాత్త, క. గెయ్యద 'చేయని'. ఈ దక్షిణ ద్రావిడ రూపాలతో తెలుగు రూపాల్ని పోలిస్తే వీటిలో అకారం వ్యతిరేక ప్రత్యయమనీ దాని తరవాత నకారం భూత ప్రత్యయమని తెలుస్తుంది.  48.                                   తెలుగు భాషా చరిత్ర
    కూయిలో భూతవ్యతిరేక ధాతుజవిశేషణు, భవిష్యత్‌ వ్యతిరేకధాతుజవిశేషణం అని రెండు వ్యతిరేక ధాతుజవిశేషణాలు ఉన్నాయి. వీటిలో మొదటిది క్రియకి-? అతి- చేర్చడం వల్లా, రెండవది -? అని చేర్చడం వల్లా ఏర్పడతాయి. తెలుగు - అని ప్రత్యయానికి  కూయి -? అని ప్రత్యయానికి కూయిలో కంఠమూల స్పర్శం తప్ప వేరే భేదం లేదు. ఉదా: కూయి తిన్‌? అని? తె. తినని, కూయి సూడ్ ? అని: తె. చూడని. ఈ ధాతుజ విశేషణంలో విశేషణ ప్రత్యయంగా మిగిలిన భాషల్లో అకారం ఉండగా తెలుగు, కూయిలలో  ఇకారం- ఉండడం కూడా ఈ రెండు భాషల మధ్య సన్నిహితత్వాన్ని నిరూపిస్తుంది            
                                                                       
2.52. చేదర్థకం. తెలుగులో క్రియకి - ఇనన్‌ చేర్చడం వల్ల చేదర్థకం ఏర్పడుతుంది. ఇందులో -ఇన్‌- భూతప్రత్యయం, -అన్‌ చేదర్థక ప్రత్యయం. -ఇన్‌- తమిళంలో స్పర్శంతో అంతమయ్యే క్రియలలో భూత ప్రత్యయమైన -ఇన్‌- (చూ. 2.48) కి సంబంధించినది. తెలుగులో ఇది *-త్‌-* -న్త్-, * -త్త్‌- అనే మూడు ప్రత్యయాల్ని తొలగించి వాటి స్థానాలకి కూడా వ్యాపించినట్టు ఇంతకుముందే చూశాం. చేదర్థక ప్రత్యయమైన -ఆన్‌ మూ. ద్రా. *అవ్‌ (త. మ. *-ఆల్‌) నించి వచ్చింది. ఉదా. త. పాటినాల్‌ : తె. పాడినన్‌, త. నంపినాల్‌ : నమ్మినన్‌. వ్యావహారిక భాషల్లో ఈ రూపాల్లో అంత్య నకారం లోపించి, దానిముందు అచ్చు దీర్ఘమై ఏర్పడిన పాడినా, నమ్మినా మొదలైన రూపాలు (Concessive meaning) నేటికి నిలిచి ఉన్నాయి. వ్యావహారిక భాషలో -ఇతే/-తే/-టే అనే ప్రత్యయంలో ఏర్పడే చేదర్థక రూపాలు ప్రాచీనాంధ్రంలో మధ్యమ పురుషైకవచన భూతకాల రూపంలో ఏని (త. ఏల్‌ < * ఆకిల్‌ 'అయితే') అనే శబ్దం చేరగా ఏర్పడిన రూపాల నించి వచ్చినవి. ఉదా. వ్యా. అంటే < ప్రా. ఆంటి(వి) + ఏని.            
                                                                       
2.53. విధ్యర్ధకాలు (మధ్యమపురుషైకవచన, బహువచనాలు). తెలుగులో విధ్యర్థక మధ్యమపురుషైకవచన ప్రత్యయం - ము. అనేకాచ్క ధాతువులలో అచ్చు పరమైనప్పుడు తప్ప మిగిలిన చోట్ల ఇది వైభాషికంగా లోపించవచ్చు. విధ్యర్థక బహువచన ప్రత్యయం -ఉండు. విధ్యర్థక రూపనిర్మాణంలో తెలుగుకీ గోండీ, కొండ, కూయి, కువిలకీ ఎంత సన్నిహిత సంబంధముందో ఈ కింది పట్టిక నిరూపిస్తుంది.  49.                                     తెలుగు : మిగిలిన ద్రావిడ భాషలు

ఏ.వ. బ.ప.
తెలుగు -(ము) -ఉండు
గోండీ -ఆ (~-మ్‌-) -ఆ(-~-మ్‌-) + ట్‌
కోయ -అ (~-ము) -అ(~మూ-)+ టి(~-టు)
కొండ -? అ -దు (~-డు~-ఱు)
కూయి -ము(-అము- ఉము) -అటు - దు (~-డు~-డు)
కువి -ము(- -అము) అదు*దు (~-జు)


    పై భాషలన్నిటిలోనూ మకారం (కొండలో తప్ప) ఏకవచన ప్రత్యయం గానూ, టకార దకారాలు బహువచన ప్రత్యయంగానూ ఉన్నాయి. కాని మిగిలిన ద్రావిడ భాషల్ని పరిశీలిస్తే విధ్యర్థకైకవచనరూపంలో ప్రత్యయమేమీ లేకుండా క్రియ మాత్రమే ఉండి, బహువచన రూపంలో మకారం ప్రత్యయంగా ఉంటుంది. ఉదా. త చెయ్‌ 'చెయ్యి' చెయ్యుమ్‌ (కళ్‌) 'చెయ్యండి', కోత తిన్‌, 'తిను', తిన్ మ్, 'తినండి'. ప్రాచీన కన్నడం గెయ్‌ 'చెయ్యి', గెయ్యిమ్‌ 'చెయ్యండి”, తిన్‌ 'తిను', తిన్నిమ్‌ 'తినండి'. బ్రాహుయీలో విధ్యర్థక బహువచన ప్రత్యయమైన-బొలో ఐకారం కూడా ఈ మకారం నించి వచ్చినదే కావచ్చు. దీని వల్ల మొదట్లో మకారం బహువచన ప్రత్యయమే. అని తేలుతుంది. ద్రావిడ భాషల్లో అత్మార్థక యుష్మదస్మదర్థక సర్వనామాల్లో (చూ. 2.38-40) బహువచన ప్రత్యయం మకారమే కావడం కూడా ఈ ఊహని బలపరుస్తుంది. తెలుగు, గోండీ, కూయి మొదలైన భాషల్లో మొదట్లో బహువచన ప్రత్యయమైన మకారం ఈ భాషల్లో ట/ద అనే ఒక కొత్త బహువచన ప్రత్యయం వచ్చి చేరడం వల్ల ఏకవచన ప్రత్యయంగా మారిపోయింది. ప్రాచీనాంధ్రంలోనూ కువిలో కొన్ని మాండలికాల్లోనూ మకారం వైకల్పికం కావడం కూడా ఇది మొదట్లో ఏకవచన ప్రత్యయం కాదు అనే విషయాన్ని ధ్రువపరుస్తుంది.                               
                                                                        
                 ఏ.వ.          బ.వ. 
  (i) గోండి       సీమ్‌          సీమ్‌ట్‌
      కోయ       ఈము         ఈమూటు
      తెలుగు     ఇమ్ము          ఇండు                                  
                                                                       
(4)  50.                                    తెలుగు భాషా చరిత్ర 
   (ii)  గోండీ       కీమ్‌          కీమ్‌ట్‌
        తెలుగు     చేయము      చేయండు                                 
                                                                          
      పై ఉదాహరణలని పరిశీలిస్తే తెలుగులో బహువచన ప్రత్యయమైన -(ఉ)oడు *-(ఉ) మ్‌-ట్‌ నించి మకారం పరంగా ఉన్న టకారం వల్ల మూర్థన్యణకారంగా మారి అనునాసికం తరవాత ఉన్న టకారం నాదమైన డకారంగా మారడంవల్ల ఏర్పడిందని స్పష్టమవుతుంది. గోండీలో-మ్‌ట్‌ అచ్చుతో ఆంతమయ్యే ఏకాచ్క ధాతువుల తరవాత మాత్రమే ఉంటుంది. కాని కోయలో-మూటు అచ్చుతోనూ, అద్విరుక్త హల్లుతోనూ అంతమయ్యే అన్ని ధాతువుల తరవాతా ఉంటుంది. (సుబ్రహ్మణ్యం 1968, && 4, 9, 7, 4, 8.) దీని వల్ల తెలుగు, తమిళం, కోత, కన్నడంలో లాగా మొదట్లో మకారమే బహువచన ప్రత్యయంగా ఉండేదనీ తరవాత కాలంలో దానికి టకారం చేరిందనీ మనం ఊహించవచ్చు. మొదట్లో బహువచన ప్రత్యయమైన మకారం ఏకవచన ప్రత్యయంగా మారడం, బహువచన రూపంలో ట కారం కొత్తగా చేరడం-ఈ రెండు మార్పులు తెలుగు, గోండీ, కొండ, కూయి, కువిలలో తుల్యంగా ఉండడం వల్ల ఈ భాషలన్నీ పూర్వకాలంలో ఒకే భాషగా ఉండేవని మనం నిర్ణయించవచ్చు.      
                                                                  
                           ఉపసంహారం                                                             
                                                                 
     2.54. మూలద్రావిడ భాషకాలం నించి తెలుగు ప్రత్యేకభావగా రూపొందే వరకూ ఎటువంటి మార్పులు పొందుతూ వచ్చిందో మనం ఇంతవరకూ చూశాం. తెలుగు పొందిన ఈ పరిణామాలు చాలా వరకు మధ్య ద్రావిడభాషలలో కూడా ఏర్పడి ఉండడం వల్ల తెలుగు మధ్య దావిడోపకుటుంచానికి చెందినదని తెలుస్తుంది. ఇక మధ్య ద్రావిడోపకుటుంబంలో కోలామీ, నాయకీ, పర్జీ, గదబ - ఈ నాలుగు భాషలూ పరస్పర సన్నిహితత్వంలో ఒక చిన్న ఉపకుటుంబం (కోలామీ-పర్జీ) గానూ (చూ. ఎమెనో 1955, అధ్యాయం 10), తెలుగు, గోండి, కొండ, పెంగొ, మండ- కూయి, కువి భాషలు ఇంకొక చిన్న ఉపకుటుంబం (తెలుగు - కూయి) గానూ ఉన్నాయి. తెలుగుకీ *గోండీ, కూయి మొదలైన భాషలకి 1. వర్ణవ్యత్యయం (2.13). 2. యుష్మదస్మదర్థక సర్వనామాల ఔపవిభక్తిక రూపాల పరిణామం (2.38-39.), 3. విధ్యర్థక రూపాల పరిణామం (2.53) ఆనే మూడు ముఖ్యపరిణామాలు తుల్యంగా ఉండడంవల్ల ఇవి ఏర్పడిన కాలంలో ఈ భాషలన్నీ ఒకేభాషగా ఉండేవని మనం నిర్ణయించాలి. గోండీ, కొండ, పెంగొ, మండ, కూయి, కువిలలో తెలుగులో లేని కొన్ని పరిణామాలు తుల్యంగా ఉండడం వల్ల పై మూడు పరిణామాలూ ఏర్పడిన తరవాత వీటి మూలభాష నించి మొట్టమొదట తెలుగు విడిపోయిందనీ, ఆ తరవాత కొంతకాలం పైన పేర్కొన్న భాషలు ఒకే భాషగా ఉండి మరికొన్ని పరిణామాలు పొందిన తరవాత వేరువేరు భాషలుగా విడిపోయాయనీ మనం ఊహించాలి.             
                                                                         
     ఇక తెలుగు దక్షిణ ద్రావిడభాషలలో తుల్యంగా పొందిన పరిణామాలు రెండే రెండు ఉన్నాయి. ఆవి 1. ఇ, ఉలు అకారం ముందు ఎ, ఒలుగా మారడం (2.12), 2. పదాది చకార లోపం (2.15). తెలుగులో ఏర్పడిన మిగిలిన పరిణామాలన్నీ తెలుగు మధ్య ద్రావిడోపకుటుంబానికి చెందినదని నిరూపిస్తూ ఉండడం వలన తెలుగు ప్రత్యేక భాషగా రూపొందిన తరవాత దాని ఇరుగు పొరుగు భాషలైన తమిళం, కన్నడం మొదలైన దక్షిణ ద్రావిడభాషల సాహచర్యం వల్ల అవి పొందిన ఈ  రెండు పరిణామాలూ తెలుగు కూడా పొందిందని మనం ఊహించవచ్చు. ఇటువంటి ధ్వని పరిణామాలు ఒక భాషలో ఇరుగు పొరుగు భాషల ప్రభావం వల్ల (అవి దానికి సోదర భాషలయినా కాకపోయినా కూడా) ఏర్పడుతూ ఉండడం ప్రపంచ భాషలలో సర్వసామాన్యమే. కాబట్టి ఈ ధ్వని పరిణామాలు తెలుగుకి దక్షిణ ద్రావిడభాషలకి ఆతి సన్నిహిత నంబంధాన్ని స్థాపించడానికి ఆధారాలు కాలేవు.                                                                     
                                                                          
    పై చర్చ వల్ల తేలిన సారాంశం : మూల ద్రావిడభాష మొట్టమొదట మూల దక్షిణ ద్రావిడభాష, మూల మధ్య ద్రావిడభాష, మూలోత్తర ద్రావిడభాష అనే మూడు భాగాలుగా విడిపోయింది, ఆ కాలంలో తెలుగు మూలమధ్య ద్రావిడ భాషలో ఆంతర్లీనమై ఉండేది. మూలమధ్య ద్రావిడభాష తరవాత మూలతెలుగు - కూయి, మూల కోలామీ-పర్జి అనే రెండు భాగాలుగా విడిపోయింది. మూల తెలుగు - కూయి నించి మొట్టమొదట తెలుగు ప్రత్యేక భాషగా విడిపోయింది. తరవాత కొంతకాలం వరకూ గోండీ, కూయి మొదలైన మిగిలిన భాషలు ఒకే భాషగా ఉండి తరవాత అవి ప్రత్యేక భాషలుగా విడిపోయాయి. ద్రావిడభాషలలో ఉపకుటుంబ విభజన మీద సమగ్ర చర్చకి చూ. సుబ్రహ్మణ్యం 1977, పేజీలు 454-472).