Jump to content

తెలుగు భాషాచరిత్ర/ప్రకరణం 7

వికీసోర్స్ నుండి

ప్రకరణం 7

కావ్యభాషా పరిణానుం

(క్రీ.శ. 1000-1599)

_కోరాడమహాదేవశాస్త్రి


పూర్వరంగం

7.0. నన్నయ ఆంధ్ర మహాభారత రచనకు ఉపక్రమించేసరికి తెలుగులో కావ్యశైలి అన్నది అప్పటికప్పుడే ఏర్పడి ఉంది. పాజ్నన్నయ యుగంలోని కొన్ని తెలుగు శాసనాలు పరిశీలించి చూస్తే ఈ విషయం స్పష్టమౌతుంది.

వచనరూపంలో తెలుగుభాష మనకు శాసనాల్లో ఆరోశతాబ్దం చివరి ప్రాంతంనుంచి లభిస్తున్నది. ఆరు, ఎనిమిది శతాబ్దాల నాటి శాసనాలు, రేనాటిచోళులు, తూర్పు పశ్చిమ చాళుక్యులు, చాణరాజులు వేయించినవి -అన్నీ గద్యలోనే ఉన్నాయి. తొమ్మిదో శతాబ్దంనుంచి గద్యశాసనాలతోపొటు పద్యశాసనాలుకూడా లభిస్తు న్నాయి. పద్యశాసనాల్లో ఎక్కువభాగం తూర్పు చాళుక్యరాజులకు చెందినవి. ఇంతవరకు కనబడిన వాటిలో మొట్టమొదటి పద్యశాసనం గుణగ విజయాదిత్యుని సేనాపతి పండరంగని అద్దంకి (గుంటూరుజిల్దా) శాసనం (EI 13,271-5). తెలుగు మహా భారతంలాగానే ఇదీకూడ గద్యపద్యోభయమైన చంపువులోఉంది : తరువోజ ఛందస్సులో ఒక పద్యం, తరువాత నాలుగు పంక్తుల గద్య. పద్య భాగంలో పండరంగని పరాక్రమోపేతాల్తైన విజయాలూ, గద్యభాగంలో పరమ మాహేశ్వరుడైన అతడు ఆదిత్యభటారనికి చేసిన దానాలూ తెలుపుతుంది. ఇతర పద్యశాసనాలు అక్కర, సీసం మొ.న దేశీయ చ్ఛ౦దస్సుల్లో రచించబడి ఉన్నాయి.

పద్యశాసనాల్లోని భాష అంతా చక్కని కావ్యశైలిలో ఉంది. యుద్ధమల్లునీ బెజవాడ శాసనం (EI15.150-9).

కావ్యభాషా పరిణామం

207

"స్వస్తి నృపాంకుశాత్యంత వత్సల సత్యత్రిణేత్ర! విస్తర శ్రీయుద్ధమల్లుణ్డనవిద్య విఖ్యాత కీర్తి! ప్రస్తుత రాజాశ్రయుణ్డు ద్రిభువనాభరణుణ్జు సకల వస్తుసమేతుణ్జు రాజసల్కి భూవల్లభుణ్డత్తి౯న్‌ ...”

ఈ తత్సమ బహుళమైన భాష పద్యశాసనాల్లోనే కాదు, గద్యశాసనాల్లోనూ కనబడుతుంది. తొమ్మిదో శతాబ్దంనాటి విజయాదిత్యుని ధర్మవరం (నెల్లూరుజిల్లా) శాసన (భారతి 5, 613-20) భాష ఎంత సరళగంభీరమైన శైలిలో ఉన్నదో చదివి చూడండి. ఏవో కొన్ని ఆకాలానికి విహితమైన ధ్వనులు రూపాలు మాత్రం మనకిప్పుడు విలక్షణంగా తోచవచ్చు. కాని ఇది మొత్తం మీద భారత శైలికి సన్నిహితంగా ఉంది.

“విజయాదిత్య పాదపద్మ బ్రమరాయమాన శ్రీమత్‌ కడెయ రాజు దనకెని ఈశ్వరునకుం గాత్తి౯ కేయండుంబోలె చౌషష్టికల విసార దుణ్డయ్న ఆయ్యపయ్యయు సకలశాస్త్రాద్ధ౯ పారగులయ్న పెద్దపణ్డరంగులు అయమ పెగ్గ౯డలుంగరనమ్మున పణ్డరంగును ఈధమ్మ౯నివ్వ౯హనోద్యోగమ్మునకు బృహస్పతి సమానులయ్న పెగ్గ౯డ కడెయగారి కొడుకు బెజెయరాజు సమర్థుణ్డని ఆత్మాన్మతంబునం బన్చిన ప్రసాదంబని సమస్త రాజ్యభిర నిరూపిత మహామంత్రాధిపతి మహేశ్వర పక్షపాతి దేవబ్రాహ్మణగురుభక్తపరుణ్ణు సక్తిత్రయ సంపన్నుణ్ణు మయ బెజయరాజు బెజయేశ్వరంబుగల పని విద్య౯హానంబు సేసి...”

ఇట్టిదే, ఇంకా రాటుదేరిన శైలి క్రీ. శ. 892-922 నాటి కొరవి (వరంగల్‌ జిల్లా) గద్యశాసనం (శ్రీ నేలటూరి వేంకట రమణయ్య గారి పాఠము) లో కనిపిస్తూంది.

“శ్రీ వికమాదిత్య నృపాగ్రతనయుణ్ఞయ్న చాళుక్య భీమునకు శౌచకందప్పు౯నకు వేంగీశ్వరునకు రసమద్ద౯న్వయ కులతిలకుణ్ణయ్న గన్నర బల్లహునిక స్తప్రాసంబయ్న రణమద్ధ౯ కంఠియందన భుజవీయ్య౯ బలపర్మాకమంబునందెచ్చి కంఠియంగట్టి పట్టంబెత్తి ఖఱ్గసహాయుండైై వేల యెల్లంగావంబూని మంచికొకణ్డనాణ్డాందిగ వెంగిదేసము విష్ణువద్ధ౯నుతో సద్ధ౯ రాజ్యంబు సేయుచున్న కుసుమాయుధు పెద్దకొడుకు...”

పద్యశాసన కాలానికి పూర్వం తెలుగుభాషా లేఖనాలు లభించిన ప్రారంభదశలోనే పై పద్యగద్యశాసనాల్లోని శైలిని పోలిన శైలిలో రచింపదడ్డ గద్యశాసనం లభించడం విశేషం. పశ్చిమ చాళుక్య చక్రవర్తి మొదటి విక్రమాదిత్యుని తురిమెళ్ల (కర్నూల్‌ జిల్లా) శాసనం (AI 29, 160.164) 657 సంవత్సరంలో వేయబడింది.

ఈ శాసన పాఠం ఇది.

208

తెలుగు భాషా చరిత్ర

“ఓం: స్వస్తి శ్రీమత్‌ సత్యాశ్రయ శ్రీప్రిథివీ వల్లభ మహారాజాధిరాజు విక్రమాదిత్య; పరమేశ్వరభటారులాకున్‌ శ్రీమదున్నత ప్రవద్ధ౯మాన విజయరాజ్య సంవత్సరంబుళ్- ఆ చంద్రతారపురస్సరం ద్వితీయవర్షం ప్రవర్తమానం కానగొగ్గి భటారళ దక్షిణ భుజాయ మానుంఱయిన అలకుమర ప్రియతనయింఱయిన ఉజేనీ పిశాచ నామధేయింఱు తుఱుతటాక నామాభిధాన నగర ధిష్టానుంఱయి ఏఱువ విషయంబేళన్‌ తస్యమాతా దత్తం గోవృషాణ భట్టారహౌ శతపంచాశత్‌ క్షేత్రం,”

ఈ గద్యకూడా కావ్యశైలిలో రచించబడిందని వేరే చెప్పనవసరం లేదు. పైన నిరూపించిన గద్యశాసనాల్లోని భాషకూ, ఇతర గద్యశాసనాల్లోని భాషకూ స్పష్టమైన భేదం కనబడుతుంది. కావ్యశ్తై లిలో ఉన్నభాష సంధి సూత్రాలకు నియత ప్రవృత్తి, తత్సమ పదబాహుళ్యం, అన్వయ సౌష్టవంతో కూడిన వాక్యరచనా విధానం, ఈ లక్షణాలతో కనబడుతుంది. వ్యావహారిక భాషలో సంధి ఐచ్చికం. తత్సమ పదాలు విశేషంగా ఉండవు. వాక్యరచనకూడా కొంత అసాధారణంగాను, అసహజంగాను కనబడుతుంది. ఉదా : చోటి మహారాజు ఇందుకూరు (కడపజిల్లా) శాసనం (7వ శతాబ్దం ప్రధమపాదం) (AI 27,229-230).

“స్వస్త్రిశ్రీ” చోఱమహారాజు ల్లేళన్‌ ఎరిగల్‌ దుగరాజుల్‌ ఇచ్చిన పన్నస కొచ్చియ పాఱ రెవ సమ్మా౯రికిన్‌ | తేనిలచ్చిన న్ఱు పఞ్చ మహాపాతక సంయుక్తున్ఱుగు.

మొదటివాక్యంలో కర్మపదం చివరకు రావడం, రెండవ దానిలో 'దీనిని' అనడానికి బదులు తేని ( = దేని(ని ) అని - సంస్కృతంలో యత్‌-తత్‌ వాక్య నిర్మాణ ప్రభావంచేత కాబోలు - వాడడం విలక్షణం.

మరొక ఉదాహరణం : ఇదీ రేనాటిచోళుల శాసనమే. ఎర్రగుడిపాడు (కడప జిల్లా). 6 వ శతాబ్ది చతుర్ధపాదం. (AI2 7,225-8). ఒక వ్యాసవాక్యంలో చెప్పదగిన భావాన్ని మూడు చిన్నవాక్యాల్లో విరిచి చెప్పడం.

“స్వస్త్రిశ్రీ” ఎరికిల్ముత్తురాజుల్ల కుణ్ణి కాళ్ళు నివబుకాను ఇచ్చిన పన్నస దుజయరాజుల ముత్తురాజులు నవప్రియముత్తురాజులు పల్లవదుకరణాలు శక్షికాషు ఇచ్చిన పన్నస ఇరవది యాదినాల్కు మఱునుఱ్లు నేల.

చిన్న చిన్న వాక్యాల్లో, పునరుక్తితో ఈ విధ౦గా చెప్పడం వ్యావహారిక భాషలోనే కాని కావ్యభావలో ఒప్పదు, పై శాసనపంక్తులే కావ్యశైలిలో నడుస్తే వాక్యనిర్మాణం ఎలాఉండేదో మార్చిచూపవచ్చును. 'ఎఱికల్ముత్తు రాజల్లకుణ్డికాళ్ళు నివబుకాను దుజయరాజుల ముత్తురాజులు నవప్రియ ముత్తురాజులు వల్లవదుకరజులు

కావ్య భాషా పరిణామం

209

శక్షికాను కొట్టంబున పాఱకుఇచ్చిన పన్నన ఇరవది యాదినాల్కు మఱున్తుఱ్లునేల'. పండితుని రచనలో అలా ఉండేది వాక్యం.

పై చర్చకు సారాంశమేమంటే ప్రాఙ్నన్నయ యుగంలోనే కావ్యశైలి ఏర్పడింది. దానికాధారాలు ఏడో శతాబ్ధంనుంచి కనబడు తున్నాయి.

చారిత్రక వ్యాకరణం

7.1. కావ్యశైలి రూపొందిందంటే కవితా వ్యవసాయం చాలాకాలంగా జరుగుతూ ఉందన్నమాట, కాని నాటి వాఙ్మయ మెలాంటిదో, దాని స్వభావమేమిటో తెలుసుకోవటానికి మన కిప్పుడు ఆధారాలు లేవు. ప్రాఙ్నన్నయ యుగం పద్య శాసనాలు ఇంతవరకు దొరికినవన్నీ దేశీయ ఛందస్సులోనే ఉన్నాయి. దేశ వాఙ్మయం ఆనాడు విశేష ప్రచారం పొందిఉండినది అనడానికి సందేహంలేదు. పాల్కురికి సోమనాథుని రచనలనుబట్టి, ఆ వాఙ్మయం విసృతి వైవిధ్యాలను కొంతవరకు ఊహించుకోవచ్చు. శిష్టులెవరూ ఆ దేశిని ఆచరించక పోవటం చేతను, అది శిష్టకవి ప్రయుక్తం కాకపోవటం చేతను, లాక్షణికులు దాని లక్షణ నిర్దేశంలో శ్రద్ధ వహించలేదు. నన్నయమార్గ కవితా ఫక్కి ఏర్పడిన తర్వాత దేశిమార్గం క్రమంగా మాసిపోయింది. దేశి కవులు లాక్షణిక కవులుగా పరిగణింపబడలేదు. లేకపోతే నన్నిచోడ, పాల్కురికి సోమనాథులు అంతకాలం అజ్ఞాతంగా ఉండి పోవటం ఎలా సంభవిస్తుంది ?

నన్నయ మూలాన వెనుకటినుంచి వస్తూన్న కావ్య భాషకు పుష్టి చేకూరింది. అతడు గ్రంథస్థం చేసిన భారతభావ గ్రాంథికమై తరువాతి వారికి అనుసరణీయమై రాచబాట అయింది. ఆ మాన్యుడు ఆ మూడు కృతులలో “నుడువు తెఱగు' లరసి కొనియే తరువాతి మార్గకవులందరూ తమ రచనలను సాగించారు.

7.2. కవిత్రయ యుగానికి సంబంధించిన భాషా చరిత్ర వ్రాయటానికి అవసరమైన సామాగ్రి అంతా మన కిప్పటికీ సమకూడిందనటానికి వీలులేదు. ఇటీవల బయలు వెడలిన నన్నయ, నన్నిచోడుల పదప్రయోగ సూచిక లాధారంగా వారి భాషాస్వరూపాన్ని గురించి పరిశోధన జరిగింది. పాల్కురికి సోనునాథాది శివకవుల భాషా విశేషాలను పండితులు కొందరు పరిశ్రమించి ఆయా గ్రంథాలకు ఉపోద్ఘాతంలో తెలిపి ఉన్నారు. కాని ప్రధానుడు తిక్కన భాషకు పర్యాప్తమైన పరిశీలన జరగలేదు, తరువాతి కవుల భాషాస్వరూపాన్ని గురించి కూడా మనకు

(14)

210

తెలుగు భాషా చరిత్ర

సమగ్రంగా తెలియలేదు. నిజానికి ఆ యా కాలపు కవుల రచనలు సూక్షంగా పరిశీలించి సమగ్రమైన వర్ణనాత్మక వ్యాకరణాలు వరసక్రమంలో వస్తేనేగాని శాస్త్రీయంగా భాషాచరిత్ర చెప్పలేము. ఉన్నంతలో మనకు లభించే భాషాసామగ్రిని ఆధారంగా చేసుకొని కవిత్రయయుగం భాషను చారిత్రక దృష్టితో అన్వయించటానికి ప్రయత్నం చేద్దాం.

7.3. పదకొండు - పధ్నాలుగు శతాబ్దాల కాలం కవిత్రయ యుగం, శ్రీనాథుడు పదిహేనో శతాబ్ధానికి చెందినవాడు. కావ్య భాషలో 14-15 శతాబ్దాల మధ్య ఎక్కువ భేదం కనబడదు. కాబట్టి తెలుగుభాషా చరిత్రలో 1000 నుండి 1500 వరకు కవిత్రయ (పురాణ) భాషా యగం అని వ్యవహరించవచ్చు.. దీనికి ముందు ప్రాఙ్నన్నయ యుగం, దీని తరువాత ప్రబంధ (ఆధునిక) యుగం ఉన్నాయి. ఇలా ఆంధ్రభాషా చరిత్రను ప్రధానంగా మూడు యుగాలుగా విభజించవచ్చు. వీటిలో మళ్ళీ కొన్ని అవాంతర దశలు ఉన్నాయి ప్రాఙ్నన్నయ యుగంలో తొమ్మిదో శతాబ్దంలో కొన్ని ప్రధానాలైన మార్పులు జరిగాయి. కవిత్రయ యుగంలో పదమూడో శతాబ్ది తిరిగిన కాలం చాల ముఖ్యమైంది. ఎందుక౦టే పదకొండు, పన్నెండు శతాబ్దాల్లో లేదా అంతకుముందు బయలుదేరిన భాషా స౦ప్రదాయాలు ఈ కాలానికి స్థిరపడ్డాయి. ఉదాహరణకు : పదమధ్య/పదాంత వర్ణ౦ లోపించి పూర్వస్వరానికి దీర్ఘ౦ కలగడం ప్రాఙ్నన్నయ యుగంలో ప్రారంభమైంది. ఆ పరిణామం క్రమంగా వ్యాపించి అనేక రూపాల్ని మార్చివేసింది. ఇది ఉచ్చస్థితిని అందుకొన్నది పదమూడో శతాబ్దంలో. మళ్ళీ పదహారో శతాబ్దం భాషా చరిత్రలో ప్రధాన ఘట్టం ఆధునికాంధ్రభాషా రూపేర్పడుతున్న కాలమది.

ఈ కింది. శీర్షికల్లో చెప్పబడే చార్మితక వ్యాకరణాంశాలు 1000-1500 కాలానికి చెందినవని గ్రహించాలి.

కవిత్రయ యుగంనాటి కావ్యభాషా స్వరూపం

ధ్వనులు :

7.4. 11-15 శతాబ్ధాల మధ్యకాలంలో ఈ కింది భాషాధ్వనులు కనబడుతున్నాయి.

అచ్చులు: అ ఆ ఇ ఈ ఉ ఊ ఋ ౠ ఌ ఎ ఏ ఒ ఓ ౦. కావ్య భాషా పరిణామం 211

హల్లులు : :క ఖ గ ఘ జ
చ ఛ జ ఝ ఞ
ట ఠ డ ఢ
త థ ద ధ న
ప ఫ బ భ మ
య ర ల ళ వ శ ష స హ.

1. అచ్చుల్లో ఋ ౠ ఌ లు హల్లులలో మహా ప్రాణవర్ణాలు ఖ ఛ ఠ ధ ఫ ఘ ఝ ఢ ధ భ శ ష లు సంస్కృత సమాల ద్వారా తెలుగున ప్రవేశించాయి.

2. దేశ్యాల్లో 'అఇ' లు 'అఉ' లు సన్నిహితంగా ఏకవర్ణస్ఫూర్తి కలిగేట్టు ఉచ్చరించబడగా ఏ, ఔ లు ఏర్పడ్డాయి. ఉదా : అయిదు>ఐదు : అవును>ఔను. అంతేకాని ఇవి ఈ భాషకు సహజ ధ్వనులు కావు. సంస్కృతాని కివి సహజాలు : ఐరావతము; ఔషధము.

3. ఙ ఞ లు వాని వర్గాక్షరాలకు ముందే వస్తాయి. సంయుక్తంలోనే కాని వ్యస్తంగా వానికి ప్రయోగం లేదు.

4. వర్గాక్షరానికి ముందు వచ్చే వర్గానునాసికం అనుస్వారంగా వ్రాయటం సంస్కృత భాషా ప్రభావంవల్ల కలిగింది. కాబట్టే దేశ్య శబ్దాల్లో అనుస్వారానికి వర్గానునాసికం విలువయే ఉన్నది. తద్భిన్నోచ్చారణం సంస్కృత శబ్దాల్లో కానవస్తుంది. ఉదా : సంయమి; సంహారము.

5. (:) విసర్గ - అనగా శ్వాసహకారం. తెలుగున పదమధ్యంలోనే వస్తుంది. ఉదా : దుఃఖము, ఆంతఃకరణము, తపఃఫలము. దీనిని వర్ణాంతరంగా కాక హకారానికి సవర్ణంగా చెప్పుకుంటే సరిపోతుంది. హకారం అఙ్మధ్యస్థంగాను, విసర్గ హల్పూర్వంగాను ఉంటాయి.

వర్ణోచ్చారణ విశేషాలు :

7.5. (1) ఋ, ఌ: వీనికి తెలుగున లేఖన చిహ్నా లేర్పడి ఉన్నవి గనుక ఈ ధ్వనులు తత్సమాల ద్వారా ఈ భాషలోనికి ప్రవేశించాయని తలంచ 212 తెలుగు భాషా చరిత్ర

వచ్చును. సామాన్య వ్యవహారంలో మాత్రం ఇవి ప్రాచీన కాలంలో రి,లి లు గాను ఆధునిక కాలంలో రు, లు లుగాను ఉచ్చరించ బడుతున్నాయి. నన్నయ-భారతంలో ఋ-రి యతి రికారోచ్చారణాన్ని సూచిస్తుంది. తరువాతి కవులు నన్నయ ననుసరించి ఋ-రి యతిని పాటించారు. కాని శాసనభాషనుబట్టి కవి ప్రయోగాల్లో అప్రయత్నంగా దొర్లిన ఋ-రు యతిని బట్టి 12 వ శతాబ్ధంనుండి రుకారోచ్చారణము ఈ ధ్వనికి కలిగిందని ఊహించవచ్చు. ఉదా. పాల్కురికి సోమన : రు రు వర్ణదేహంబు ఋగ్వేదమునకు (పండితారాధ్య చరిత్రము). తిక్కన: సప్తఋషలైరి వారు మరుద్గణంబునకు (భార, శల్య, 2-160).

2. ర-ఱ; రేఫ శకట రేఫలు నన్నయ భాషలో భిన్న వర్ణాలుగానే ఉండినవి. అంటే వాటికి భిన్నోచ్చారణము ఉండినదని అర్ధము. ర కంటే ఱ అధిక కంపనము కలది. నన్నయ నన్నిచోడుల గ్రంధాల్లో ఈ ధ్వనులకు సాంకర్యం లేదు. కాని కాలక్రమాన ఱ కారం తన విలక్షణోచ్చారణమును కోల్పోయి సాధు రేఫగానే పలుకబడుతూ వచ్చింది. ర-ఱ ల కలయిక క్రమంగా అధికంగా కనబడు తుంది. 15 వ శతాబ్దానికి ఱ కారం పూర్తిగా భాషలో లోపించి పోయిందని చెప్పవచ్చు. అప్పటినుంచి లాక్షణికులు రేఫ, ఱకార నిర్ణయ పట్టికలు వ్రాయటానికి పూనుకోవటమే దీనికి నిదర్శనం. నన్నయాది ప్రాచీన గ్రంథాలు పరిశీలించగా పదాల్లో ర-ఱ ల ద్వైరూప్యం కానవస్తుంది. ఒకేపదం ఒకప్పుడు సాధురేఫతోను, మరొకప్పుడు శకటరేఫతోను వ్రాయబడి ఉండటం. ఉదా : నన్నయ : అరుదు/అఱుదు; ఊరార్చు/ఊఱార్చు; కురంగలి/కుఱంగలి; క్రుమ్మరియెదు/క్రుమ్మఱియెదు; చీరు/చీఱు; చెదరు/చెదఱు; తూరు/తూఱు; దరికొను/దఱికొను; నెఱయు/నెరయు; పఱగు/పరగు; పెఱుగు/ పెరుగు; ముందఱ/ముందర - ఇత్యాదులు. తరువాతి కాలపు వ్రాయసకాండ్రు తమ కాలంలోని వర్ణక్రమాన్ని ప్రాచీన గ్రంథాల్లో వ్రాయటం వల్ల ఈ పరిస్థితి ఏర్పడి ఉంటుంది. కూతురు శబ్దము సాధు రేఫతోనే నన్నయ నన్నిఛోడుల ముద్రిత గ్రంథాల్లో కానవస్తూండగా, 11-12 శతాబ్దాల శాసనాల్లో ఈ పదం నియంతగా శకటరేఫతోనే వ్రాయబడి ఉంది.

8. క్ష: క్ష కారాన్ని నన్నయ భారతంలో క ఖ గ ఘ లతోనే మైత్రి కల్పించబడిందిగాని షకారము, దాని మిత్ర వర్ణాలతోకాదు. అంటే ఈ సంయుక్తాక్షరంలో క్షకారోచ్చారణానికే ప్రాముఖ్యం ఉందన్నమాట, నన్నెచోడుని గ్రంథంలో క ష లు- రెండింటికీ మైత్రి కలదు. ఇలాగే తక్కిన గ్రంథాల్లోనూ ఉంది. నన్నయకూ కావ్యభాషా పరిణామం 213

తరవాత కవులకూ ఈ విషయంలో ఉన్న భేదం క్షకారోచ్చారణంలో గలిగిన మార్పుకు సూచకం కావచ్చు.

4. ఙ్ఞ: పై దానిలోలాగ ఙ్ఞ వర్ణోచ్చారణములోనూ కాలక్రమాన భేదమేర్పడింది. నన్నయ దీన్ని చ ఛ జ ఝ లతో కలపగా తిక్కన కకారంతో యతి కలిపినాడు. ఆధునిక వ్యవహారంలోను ఈ రెండు భిన్నోచ్చారణలు మాండలికంగా ఉన్నాయి.

5. దేశ్యశబ్దాల్లో దీర్ఘంమీద అనుస్వారాన్ని తేల్చి పలుకుతూ ఉండేవారు. ఇలా తేల్చి పలకడం సంస్కృత శబ్దాల్లో లేదు. ఉదా : వాcడు; భాండము. కనుకనే నన్నయ దేశ్యాలను సంస్కృతాలను ప్రాసలో కలపడు. కాని కొన్ని మండలాల్లో దీర్ఘంమీది అనుస్వారాన్ని పలుకుతూ ఉండేవారు. నన్నిచోడుడు ఈ మాండలికోచ్చారణని అనుసరించి దేశ్య సంస్కృత శబ్దాలకు దీర్ఘ పూర్వక బిందుప్రాస కలిపినాడు. (కు.సం 1-4; 2-82). పూర్ణబిందువు ఉచ్చారణలో భ్రష్టమైన కారణంచేత తిక్కనాదులు సబిందు, నిర్బిందు ప్రాస నుపయోగించారు. (ప్రా. వ్యా. భా. పుట 233), దీర్ఘంమీది అనుస్వారాన్ని తేల్చి పలకడం, ఊది పలకడం అనే ఈ రెండు మాండలిక సంప్రదాయాలు ప్రాఙ్నన్నయయుగం నుండి ఆధునిక యుగం వరకు వస్తూనే ఉంది. ఉదా : ఆండది-ఆడది; . తోంక- తోక; కోంతి-కోతి,

ధ్వనుల మార్పులు:

7.6. లోపదీర్ఘత : ఇది ప్రాఙ్నన్నయ యుగంలోనే ప్రారంభమై వ్యవహారంలో క్రమంగా వ్యాప్తి చెందినట్టు శాననాలనుబట్టి తెలుస్తూంది. మొదట్లో ఈ రూపాలు కేవల వ్యావహారికాలై శిష్ట భాషలో ప్రవేశం లేకపోవడంచేత నన్నయ వీటిని వాడలేదు. వ్యవహార ప్రాచుర్యాన్ని బట్టి తిక్కనాదులు క్వాచిత్కంగా వాడారు. ఉదా : మరాకుము>మరువకుము (భార. ఉద్యో); కళ్యాలన్‌ >కళ్యములన్‌. (విరాట. 1-65); నమ్మీనమ్మక < నమ్మియు నమ్మక (శా౦తి. 2-35). ఛాతుజ విశేషణాలమీది తచ్చబ్ద వకార లోపంతో కారకక్రియ లేర్పడ్డంలో ఈ ధ్వని పరిణామమే కనబడుతుంది. నన్నయ కాలంలో 'వండినవాడు' వంటి రూపం తిక్కన కాలానికి. 'వండినాcడు' అయి కావ్యభాషలో అంగీకరించ బడింది. ద్రుతలోపం వల్ల కలిగిన ధీర్ఘా౦తాలు చాలా (<చాలన్‌), కూడా (కూడన్‌), 214 తెలుగు భాషా చరిత్ర

బాగా (<బాగుగన్), దాకా (<తనుకన్‌) ఇత్యాదులు అప్పటికీ ఇప్పటికీ వ్యాస హారికాలుగానే నిలిచిపోయాయి. లాక్షణికుల దృష్టిలో కేతన గ్రామ్యాలని నిషేధించిన రూపాల్లో ఈ విధంగా కలిగినవి ఉన్నాయి : వాటీ. మమ్ము, గొంటూ, మోసేటి, పంపేరు-ఇత్యాదులు, దేశినాదరించిన శివకవుల రచనల్లో ఇవి ఎక్కువగా కనబడ్డంలో ఆశ్చ్యర్యంలేదు. ఉదా : నన్నిచోడుడు సాము (<సగము; కు.సం 4-53 గ్రాము<గ్రహము (పై.10-17), మోము<మొగము.(పై. 6-13). ప్రత్యయ ము వర్ణలోపం : వైరాన<వైరమున (కు.సం. 4-61). పాల్కురికి సోమన: మాజనము< మహాజనము; మరాకు<మరువకు (బసవ పురాణం). మార్గకవుల గ్రంథాల్లో ఈ రూపాలు ప్రబంధ యుగం నుండి విశేషంగా ప్రవేశించాయి. (చూ. బాలకవి శరణ్యం).

7.7. ఇయ<ఎ : నన్నయ నన్నిచోడుల గ్రంథాల్లో ఇయాంతాలు, ఎత్వరూపాలు వాడబడినయి. ఉదా: భార: గద్దియ > గద్దె, పల్లియ>పల్లె, కన్నియ, పక్కియ, లొట్టియ. నన్నిచోడుడు : ఎడకత్తియ, చెలికత్తెలు, తేనియ తేనె ఉట్టియ, మల్లియ ఇత్యాదులు. కేతన ఆంద్రభాషా భూషణంలో ఇయాంతాలను ప్రస్తావిస్తూ మల్లియ-మల్లె, గద్దియ-గద్దె, లంజియ-లంజె ఇత్యాదులలో ఇయాంతాలనే కావ్యాల్లో ప్రయోగించాలని చెప్పాడు. అంటే అతని కాలానికి ఇంకా ఎత్వరూపాలకు వ్యావహారిక వాసన వదలలేదని అర్థం. తరువాతి కాలంలో ఎత్వరూపాలు శిష్టవ్యవహారంలో బాహాటంగా వాడబడడంచేత పూర్వకవి గ్రంథాల్లో క్వాచిత్కంగా నైనా ప్రయోగించబడి ఉండటంచేత అర్వాచీన లాక్షణికులైన అహోబలుడు, కూచిమంచి తిమ్మకవి వీటిని అంగీకరించారు.

7.8. డ->ద- : దేశ్యశబ్ధాల్లో పదాది డకారం చాల తక్కువ. నిజానికి ద్రావిడ భాషల్లో ఎక్కడా పదాదిని మూర్థన్యాక్షరం ఉండదు. ఉట్టిది తెలుగున వర్ణవ్యత్యయంవల్ల ప్రాఙ్నన్నయ యుగంలోనే ఏర్పడింది.* అఱచు>*ఱఅచు>ఱచ్చు > డచ్చు. ఇట్లే అడంగు > డాంగు > డాcగు. ఈ పదాది డకారం నన్నయ కాలంనుండి దకారంగా మారడం సంభవించింది. కావ్యాల్లో డ/ద ద్వై రూప్యం కనబడుతుంది. నన్నయ : డప్పి-దప్పి, డాcచు-దాచు; నన్నిచోడుడు : డాcగి-దాcపక, డాయన్‌-దాయన్‌ మొ.వి.

7.9. పదమధ్యాజ్లోపము : పదమధ్యాజ్లోపంతో కూడిన మార్పులు కావ్యభాషా పరిణామం 215

నన్నయనాటినుండి కావ్యభాషలో కనబడుతూనే ఉన్నాయి. ఉదా : నన్నయ: తొడుగు-తొడ్డు, పొలతి-పొల్తి, ఉనికి-ఉన్కి. నన్నిచోడుడు : కుడిచి-కుడ్చి, మఱిగి-మర్గి.. కాని ఇట్టి రూపాలకు దేశికవులల్లోను, శాసన భాషలోను వాడుక హెచ్చుగా కనబడుతుంది. పాల్కురికి సోమన ; పెరుగు-పెర్గు, కసవు-కస్వు ఇత్యాదులు.

వ్యవహారంలో ఊతలేని అక్షరంలో ఆఙ్లోపం సహజమే. వ్యావహారిక భాషా ప్రభావం చేతనే ఇలాంటి స౦గ్రహ రూపాలు తరువాతి కవుల గ్రంధాల్లోనూ, అనేక విధాలైన శబ్దాల్లో ఏర్పడ్డాయి. తిక్కన : వాలింగీలియు. (<వాలియును. నిర్వ,రామా. 7-93); భావనామాలు : అంట (<అనుట), కొంట (<కొనుట). 'పాండు నృపాలు పాలు గైకొంటయె చాలు' నని తిక్కన ప్రయోగము (భార-ఉద్యో). పొలతి-పొల్తిలో జరిగినటువంటి మార్పే కొనుట-కొంట లోనూ జరిగింది. అయినా 'కొంట' వంటి భావనామాలు నన్నయలో లేవని కాబోలు పరిహరింపదగినవని అధర్వణ అహోబలులన్నారు. పొల్తి, కొంట అనే రూపాలేర్చడినట్లే పదాంత వర్ణంలో ఉత్వలోపం వలన అన్నం, సున్నం, సముద్రం వంటి రూపాలేర్పడ్డాయి. అయినా ఇవి వ్యావహారికాలుగానే నిలిచి పోయాయి. మహాకవి ప్రయోగాలనుబట్టి, వాని బాహుళ్యాన్ని బట్టి లాక్షణికులు శబ్దాల సాధుత్వా సాధుత్వాలను నిర్ణయిస్తారు.

పదాంతము వర్ణంలో ఉత్వలోపానికి ఉదాహరణాలు 11 వ శతాబ్దం నుండి లభిస్తున్నాయి. ఆదివారంనాణ్డు (SII 10-75), ఆచంద్రతారకం (పై. 4-1364, 1356, 1213), శతాబ్ధం (పై. 10-660), బాణపురం (పై. 5-1313). 15వ శతాబ్దానికి వ్యావహారికభాష సర్వత్రా వ్యాపించింది. కాని పైన చెప్పినట్టు దీనివల్ల కావ్యభాషలో కలిగినరూపాలు చాల తక్కువ.

వ్యావహారిక భాషా రీతులు ;

7.10. కావ్యభాష వీటివల్ల ప్రభావిత౦ కాకపోయినా సమకాలంలో జరుగుతూ ఉన్న వ్యావహారిక భాషాపరిణామాలు కొన్ని మనం ఇక్కడ గుర్తించవలసి ఉంది. పదాంత ఉత్వలోపం ఒకటి పైన చెప్పబడింది. ఇతరాలు.

1. యాదృచ్చిక మహాప్రాణత్వము : అల్పప్రాణ వర్ణాలు కొన్ని మహా ప్రాణవర్ణాలుగా ఉచ్చరించ బడుతూ ఉండినట్టు లేఖనాన్నిబట్టి ఊహించుకోవచ్చు. 216 తెలుగు భాషా చరిత్ర

మహాప్రాణత్వం ఎక్కడ కలుగుతున్నదో చెప్పడానికి ఆస్కారం కనబడదు. కనుకనే యాదృచ్చిక మనడం. శాసనాల్లో ఇలాంటి ఉదాహరణలు విశేషంగా ఉన్నాయి. సుఖము, వంచన. సంక్రాంథి, పాధిక, అప్పము, భండి, భెల్లము - ఇత్యాదులు. బసవ పురాణంలో ఒకచోట 'భావి' అనే ప్రయోగం ముద్రిత ప్రతులలో ఉన్నది. ఇది తప్ప ఇటువంటి రూపాలు శివకవులలోనూ కానరావు. సంఖ్యా వాచక సమస్త పదాల్లో మహాప్రాణత్వం స్థిరపడి ఆధునిక యగంలో శిష్టరూపాలైనవి : ముప్పై, నలభై, ఏబై , డెబ్బై, ఏనభైై, తొంభై, ఇరవై, అరవై - రూపాలకు ఇరబై, అరబై మాండలికాలు ఇప్పటికీ వ్యవహారంలో ఉన్నాయి. అనంతపురం జిల్లాలో ఈ రూపాలు వినబడతాయి.

2. ఆది సంధ్యక్షరంగా ఇ ఈ, ఎ ఏ లు యకారాన్ని, ఉఊ, ఒఓలు సకారాన్ని గ్రహిస్తాయి. ఉదా. యింద్రుండు, యెఱుగు, యేగు, పుదధి, వోపిక, కావ్యభాషలో ఈ రూపా లెవరూ వాడకపోయినా లాక్షణికులందరూ ఈ ప్రమాదం వుందని గుర్తి౦చి కవుల్ని హెచ్చరించారు. అధర్వణు డంటాడు : “ఆద్యవర్ణాస్తు హల్త్వేన నగృహ్య౦తే కదాపిచ” అని, "యకారంబును వువూ వొవోలును తెలుగు మాటలకు మొదటలేవు” అన్న సూత్రంలో సూరి ఈవిషయాన్నే జ్ఞాపకం చేస్తున్నాడు.

3. సంయుక్తమధ్య సంధ్యక్షరాలు : న, మలు రేఫ సంయుక్తాలైనప్పుడు ఆ సంయుక్తాక్షరంమధ్య వరసగా దకార బకారాలు సంధ్యక్షరాలుగా చేరడం శాసనోదాహరణాలనుబట్టి తెలుస్తూంది. బుద్దన్దృిపాలి సామబ్రాజ్య, ఏకామ్బ్రనాథ ఇత్యాదులు. HGT. P. 57). ఇలాంటి రూపాలు కావ్యభాషలో కెక్కలేదు.

4. శ-స లు: వ్యవహారంలో తాలవ్య, దంతోష్మ ధ్వనులు -శ -స లు తారుమారవడం అతి ప్రాచీన శాసనకాలం నుండి కానవస్తూంది. సాధారణంగా తాలవ్యాచ్చుతో కూడినప్పుడు సకారం శకారోచ్చారణం పొందుతున్నది. ఉదా: వేంచేసిన, శేయించిన, శేవలు. తద్భవాల్లో శకారం సకారంగా మారడం మరొక ధ్వనిపరిణామం. ఉదా: సిరస్సు, సుభము, సివరాత్రి-రూపాలు పామరజన వ్యవహారంలో ఉన్నవి. వీటి ఫలితంగా భాషలో ఫల ఉచ్చారణలో విశేషమైన వ్యత్యయం కలిగింది. ఇటువంటిరూపాలు కావ్యభాషలో చేరకపోయినా. అప్పకవ్యాదులు హేచ్చరిస్తారు. సకలము, సకృత్తు శబ్దాలను శకలము, శకృత్తు అని వ్రాయవద్దని కావ్యభాషా పరిణామం 217

5. వ్యవహారంలో తాలవ్యాచ్చుకు ముందున్న వకారానికి బదులు యకారం పలకడం తరచు కనబడుతుంది. గోయింద (<గోవింద) శబ్దము 7వ శతాబ్ది శాసనంలో ప్రయోగింపబడి ఉన్నది. ఈ రూపాలు వ్యావహారికాలని కేతన హెచ్చరించాడు, గ్రామ్యాలకు ఉదాహరణాలుగా ఇచ్చిన వాటిలో యేగ, యేదాలు, యీడు- రూపాలున్నాయి. తరిచిచూస్తే ఇటువంటివి కావ్యాల్లో కనబడతాయిగాని (కు. సం. కోయిలలు 8.153; కోవిల 4-107) తక్కువ.

6. అయి>ఐ, అవు>ఔ; మార్పులు వ్యవహారంలో పరిపాటి. కావ్యభాషలోను ఈరీతి అంగీకరించ బడింది. కయిత (<కవిత) >కైత. అవురా>ఔర. ఈమార్పు స్థిరపడగానే విపర్యాస రీతిని ఐ>అయ్‌, ఔ>అవ్‌ మార్పు సంభవించింది. యౌవన > యవ్వన. యవ్వన శబ్దం నన్నెచోడడు వాడినాడు. (కుమా. 8-157). కవిత్రయం వారిలో ఈ రూపాలు లేవుగాని తదితరుల్లో కొంత ప్రవేశించినాయి. అప్పకవ్యాదులు ఈ రూపాలను గూర్చి హెచ్చరిస్తారు.

7. దేశ్య శబ్దాల్లో రేఫ సంయుక్తాక్షరాలు ప్రాఙ్నన్నయ కాలానికే వర్ణ వ్యత్యయం మూలంగా ఏర్పడ్డాయి. ప్రాచీన ద్రావిడ భాషలో వర్గానునాసికంతో కూడిన స్పర్శం తప్ప అన్యసంయుక్త వర్ణాలులేవు. రేఫ సంయుక్తాలలో. రేఫ క్రమంగా లోపిస్తుంది. ప్రాఙ్నన్నయ యుగంలో కొన్ని ఉదాహరణా లున్నాయి. కాని ఈ ధ్వని స౦ప్రదాయం వ్యాప్తి జెంది రూఢమై౦ది. కవిత్రయ యుగంలోనే, 15 వ శతాబ్దికి రేఫ సంయుక్తాలలో రేఫలోపించి పోయిందని చెప్పవచ్చు. కేతన గ్రామ్యానికి చూపిన ఉదాహరణాలలో బామ్మడు, తవ్వు, గద్ద, గుద్దు-ఇలాంటివే. కావ్యభాషలో ఈ రూపాలు ప్రవేశించలేదు.

8. థ-ధ ; మార్పుప్రాఙ్నన్నయ యుగంలో ప్రారంభమైంది. శాసనభాషలో మన్మధ + రధ, సమర్థ, పృధివి, మిధిల వంటి రూపాలు తరుచుగ కనబడుతాయి. ఇవి కావ్యభాష కెక్కలేదు. కాని తిక్కన కృష్ణదేవరాయలు మొదలైన కవులు వాడిన థ-ధ ప్రాసకు ఆధారం ప్రజావ్యవహారంలోని ఈ రూపాలై ఉంటాయి. అప్పకవ్యాదులు ఈ రూపాలను గూర్చి హెచ్చరిస్తారు.

9. అటు-ఇటు-ఏటు ; శబ్దాల్లో టకారానికి షకారోచ్చారణ వైదిక - ఛాందసుల మాండలికంలో ఉండి ఉంటుంది. కేతన గ్రామ్యపదాల కిచ్చిన 218 తెలుగు భాషా చరిత్ర

ఉదాహరణల్లో అషువలె, ఇషువలె అనేవి ఉన్నాయి. దక్షిణాంద్ర యుగంలో అహల్యా సంక్రందనం, మన్నారు దాసవిలాస నాటకంవ౦టి కావ్యాల్లో ఈ రూపాలు వాడబడ్డాయి. కవిత్రయ యుగపు కావ్యాల్లో కానరావు.

కొన్ని- ధ్వని పరిణామ రీతులు :

7.11. 1. వర్ణసమీకరణం : స్వరసామ్యం : సంస్కృత అకారాంత ప్రాతిపదికలకు -డుజ్‌ ప్రత్యయం చేరినపుడు సర్వసామ్యంవల్ల అత్వం ఉత్వం కావటం సర్వసాధారణం. దీనికి నన్నయ భారతభాగంలో 'గరుడcడు' శబ్దము అపవాదము (1-2-76). తరువాతి కాలంలో 'గరుడుcడు' అయింది.

2. వర్ణవ్యత్యయం : తెలుగు మూలభాషనుండి విడివడి ప్రత్యేక భాషగా ఏర్పడిన కాలంలో వర్ణవ్యత్యయం కొన్ని సన్నివేశాల్లో నియతంగా వర్తించినది. తత్ఫలితంగానే దేశ్యాలలో అంతకు ముందులేని లకార రకారాది శబ్దాలు, రేఫ సంయుక్తాక్షరాలతో కూడినవి బయలుదేరాయి. కొన్ని శబ్దాల విషయంలో. రెండు రూపాలూ నిలిచి ఉన్నవి. ఎఱక-ఱెక్క, అనన్‌-నాన్‌, అనవుడు-నావుడు, అనక-నాక, ఎల-లే ఇత్యాదులు.

తాత్కాలికంగా ఉచ్చారణంలో తడబాటువల్ల కలిగినవని చెప్పదగిన రూపాలు కావ్యభాషలోని కెక్కినవి గలవు ఉదా: ఆలరన్‌ (_ఆలరన్‌, కు. సం. 11-34), నవుటాల (-నవ్వులాట, భార, ఉద్యో. 3-116).

3. వర్ణవినిమయం : భాషలో ప్రత్యేక వర్ణాలుగా వ్యవహరించే వాటిలో కొన్నింటి వినిమయం (free variation) కానవస్తూంది. నన్నయ నన్నె చోడుల గ్రంధాలనుంచి పద ప్రయోగ సూచిక లాధారంగా గ్రహించబడ్డవి.

క/గ: కొనకొని_గొనకొని

గ/వ : పగలు/పవలు

చ/స : చుమ్ము/సుమ్ము

డ/ట; ఆడదాన-ఆటదాన

డ/ణ: అడcగు-అణcగు

త/ద: తందడి/దందడి కావ్యభాషా పరిణామం 219

త/ట; తెంకాయ-టెంకాయ

ద/డ : అరువదేను-ఇరువడేను

ద/జ: జాజి-జాదులు

వ/మ: నివురు-నిమురు

ల/ర: బత్తలించు-బత్తరించు

ల/న: తెలుఁగు-తెనుఁగు

ఆ/ఇ; అదరిపడు-అదిరిపడు

అ/ఉ; మెలపౌరు- మెలుపారు

అ/ఎ; తీఁగ-తీఁగె

అ/ఒ: అందఱు-అందొఱు

ఇ/ఉ: ఎఱింగించు-ఎఱుంగించు

ఇ/ఎ: కోరికి-కోరికె

ఉ/ఒ: డుల్లెన్‌-డొల్లెన్‌

దీర్ఘాచ్చు/ హ్రస్వాచ్చు : పలుమారు-పలుమరు.

(4) పదాది హల్లోపం : దీనివల్ల ఓకేరూపం హలాదిగాను, అజాదిగాను కానవస్తుంది. ఉదా , నెగయు వ.నం. 5-110) -ఎగయు (2-42), నీల్గి (11-90), -ఈల్గె (7-112).

సంధి

7 12. కావ్యభాషకు వర్తించే సం ధి విధానం వైయాకరుణులచే సవివరంగా చెప్పబడింది. కావ్యభాష సంధి సూత్రాలకు నియత ప్రవృత్తి, వ్యవహార భాషలో ఐచ్చికత. కావ్యభాషలో అచ్చులమధ్య ప్రకృతిభావం ఉండదు. శాసనాలలో తరచు ప్రకృతిభావం కనబడుతుంది. ఇదిగాక తత్సమ అకార సంధి సంస్కృత పద బంధాల్లో పరస్పరైైకాదేశ రూపమైన అచ్సంధి. ఆచ్‌ సంధిలో వకారాగమం, ద్రుతద్విత్వసంధి ఇత్యాదులకు ఉదాహరణలు విరివిగా కనబడతాయి.

అచ్సంధి : కావ్యభాషలో రెండచ్చులు పక్కపక్కన వచ్చినప్పుడు.

1. పూర్వస్వరమైనా లోపించాలి (-పరస్వరై కాదేశం), లేదా220 తెలుగు భాషా చరిత్ర

1. పూర్వస్వరం శబ్దానికి ఆవయవికంగా గాని వ్యాకరణ ప్రక్రియను బోధించేదిగాగాని ఉన్నప్పుడు ఆ అచ్చుపై సంధ్యక్షరం ఒక్కటి చేరుతుంది. కావ్యభాషలో యకారం మాత్రమే సంధ్యక్షరంగా వస్తుంది.

7.13. పూర్వ పదాంతస్వరం ఉత్వమైతే దానికి నిత్యలోపం. అది ఇత్వ మైనపుడు 1. మధ్యమ పురుష క్రియలలోని ఇత్వం నిత్యంగా లోపిస్తుంది, 'నిత్యమ నుత్తమ పురుష క్రియాస్వితః' అని ఆంద్ర శబ్దచింతామణి సూత్రము, “అనుత్తమ” పురుష శబ్దానికి 'మధ్యిమపురుష' యని కొందరు; ప్రథమ మధ్యమ పురుషలని కొందరు భిన్నరీతుల్లో అర్థం చెప్పారు. నన్నయలో మధ్యమపురుష ఇకారానికి నిత్యంగా, ప్రథమోత్తమ పురుషల్లోని ఇకారానికి వైకల్పికంగా లోపం కలుగుతున్నది. తరువాతి గ్రంథాల్లో మధ్యమపురుషలోను లోపించని ప్రయోగాలు కనబడుతున్నాయి. మొత్తంమీద ప్రాచీన గ్రంథాల్లో సర్వనామ ప్రత్యయ ఇకారం నిత్యంగానూ, వైకల్పికంగానూ లోపిస్తూన్నదనీ, లోపంకలిగిన రూపాలే ప్రాచుర్యమనీ గ్రహించాలి. సర్వనామ ప్రత్యయాలలోని అచ్చు ఉచ్చారణవశాన ఏర్పడ్డది. కాబట్టే అది లోపించడం సహజం. ఇకారాంతాల్లో చాల సందర్భాల్లో ఈ అచ్చు ఆవయవికం గనుక ఆ సామ్యంచేత. అచ్చు లోపించని రూపాలు క్రియాపదాల్లో ఉంటాయి.

ఏమ్యాది గణంలోని ఇకారానికి వైయాకరణులు వైకల్పిక లోపం చెప్పారు. కాని నన్నయలో అచ్చు లోపించడంలేదని ఆంధ్రభాషా చరిత్రకారులు సూచించారు (ఆం. భా వ. పుట. 1342). వైకల్పిక సంధి తరువాతి కాలంలో కలిగిందన్న మాట.

నామాల్లో ఇకారం లోపించిన రూపాలు విరళంగాఉన్నాయి. కవిత్రయంలో కన్నా శివకవుల్లో ఈ రూపాలు అధికం. ఉదా : రాతిరెల్ల (భార. 1-6-160). కంచేడు వాడల (బస. పురా), వావెఱు౦గని (పం, చ). చెఱొక్క (భార. ఉద్యో 1-219), తెలివెందునున్‌ గలదె (భార. ఉద్యో. 2)

క్త్వార్ధక ఇకారం, షష్ట్యర్థ ఇకారం వ్యాకరణార్జాన్ని బోధించేవి కాబట్టి ఇవి లోపించకుండడమే సహజం, సామాన్యవిధి. లోపం జరిగిన రూపాలు నన్నయలో లేవుగాని దేశి కవులలోను తిక్క నాదులలోను కనబడుతున్నాయి. పొంగెఱగెడు (కు. సం 11-72), వెఱచుండుము, ఏతెంచారగించె. (బస. పురా), అందిమ్ము కావ్య భాషా పరిణామం 221

(భార. వి. 4-112) (ఇది శబ్దపల్లవమని కొందరు), వెఱచిట్లు (నిర్వ. 5-88), ఎఱి:గెఱి౦గి (భాగ. 9-515). షష్టీ ఇకారం లోపించినదాని కుాదాహరణలు : నరునునికి (భార. 1-8-167), జమనిల్లు (భార. 2-209), కృష్ణునల్లుడు (ద్రో. 2-248), దీనంఘ్రులు (శృ౦.నై.) .

తత్సమ శబ్దగత ఇకారం కూడా సామాన్యంగా లోపించదుకాని లోపించిన ప్రయోగాలు లేకపోలేదు. వ్యవహార భాషలో ఇలాంటి సందర్భాల్లో అర్థభంగం నివారించడానికి ఊత మొదలైనవి ఉంటాయి. వ్యవహార బలాన్ని బట్టి కావ్యభాషలో ఈ ప్రయోగాలను గ్రహించారని చెప్పాలి.

7.14. అత్వసంధి : ఆర్యాంబాద్యర్థక శబ్దాల విషయంలో అత్వసంధి కలుగటానికి కారణం ఇవి కేవలం లింగబోధకాలుగానో, ఆదరార్థకములుగానో శబ్దంపై చేరుతుండటం. అపుడు దీనిని అపదాది స్వరసంధికింద పరిగణించాల్సి ఉంటుంది.

అత్వలోపంతో కూడిన మరొకసన్నివేశం : చింతాకు, తనంత, చేయకుండెను వంటి రూపాలు నన్నయాది ప్రాచీన గ్రంథాల్లో యడాగమంతో కూడిన రూపాలే ప్రచురంగా ఉండగా కాలక్రమాన సంధికలిగిన రూపాలు వ్యవహారబలంచే కావ్యభాషలో ప్రవేశించాయి. స్త్రీవాచక శబ్దాల్లోను, షష్టీరూపాలలోను అత్వం లోపించకుండటం సామాన్య విధి, లోపించిన ఉదాహరణలు కవిత్రయయుగం నుంచి ఉన్నవి. ముందరిందద్రు పంచిన (భార. 1-8-238), అంతవమానము (భార.సభా. 3-203), ఉర్వీశులొద్ద (భార, 1-7-221), దేహే౦ద్రియంబు లిచ్చలు (కు. సం. 6-65), భక్తులిండ్లు (బ.వు)

సంబోధన అకారం లోపించదు. బసవ వురాణంలో దీనికి అపవాదాలైన ప్రయోగాలు విలక్షణాలు : అమ్మలా రక్కలారని; జైనులారెన్నడు.

7.15. అచ్చు + హల్లు : ప్రథమమీది పరుషం-అనగా పూర్వపదాంత సర్వానికి పరపదాది శ్వాస స్పర్శం పరమైనప్పుడు అది అజ్మధ్యస్థమగుట సంభవించగా అప్పుడది వర్ణ సమీకరణంవల్ల నాదస్పర్శం/శ్వాసోష్మంగా మారుతుంది. కచటతపలు వరసగా గనడదవలుగా మారుతుంటాయి. ఈ సంధికార్యం ప్రాచీన కాలంలో సర్వసాధారణంగా జరుగుతూ ఉండేది. భారత ప్రయోగాలు : ఏమి సేయుదు, ఏమిసెప్పుదు, పెద్దవోయె, ధారుణివాలింతె, ధర్మజుండు దపంబు సేసిన, 222 తెలుగు భాషా చరిత్ర

కు. సం. : అహాపుట్టింపదే. కాని క్రమంగా దీనికి వ్యాప్తితగ్గి సాంస్కృతిక శబ్దాలపైన ప్రవర్తి౦చడం పోయింది.

తిక్కన కాలంనుంచి చతపలకు సదవలు ఆదేశంగారాని రూపాలు కొన్ని కావ్యభాషలో ప్రవేశించాయి. అప్పా చెల్లె౦డ్రు (నిర్వ. 3-96), రాకపోకలు (భాగ.) అవ్యయాలమీద, క్రియాపదాలమీద ఇతర నామపదాలమీద వస్తూండే గసడదవాదేశం తరవాతి కాలంలో తగ్గిపోయింది.

7.16. హల్లు + అచ్చు : తెలుగు శబ్దాల్లో ద్రుత నకారం ఒక్కటే చివర వుండే హల్వర్ణ౦, ఈద్రుతానికి గల విశేషమేమంటే ఇది లోపించినా శబ్దార్థానికి భంగం కలుగదు. ద్రుతాంతాలైన పదాలు ద్రుతపకృతికాలు. ఇతరాలు కళలు.

నన్నయ కళలుగా ప్రయోగించిన శబ్దాలు కొన్ని తరువాతి కాలంలో ద్రుత ప్రకృతికాలైనవి. ఏను, నేను, తాను ఎల్ల. ఉదా : ఏను విదపడిగియెద - (భార. శల్య- 2-833), ఏనువోయెద (బస. పు.), ఎల్లయందు (భార. 1-2-157), ఇందు ప్రత్యక్ష౦బయన్నన్‌ -అని యుద్ధమల్లుని బెజవాడ శాసన ప్రయోగం. ఇలాగే ప్రాచీన కాలంలో ద్రుతప్రకృతికాలుగా ఉన్నవి కొన్ని అర్వాచీనభాషలో కళలుగా మారి పోయాయి. కొన్ని ఏక కాలంలోనే ద్రుతప్రకృతికంగానూ, కళగను వాడబడ్డవి కలవు. ఉదా : ఏనిప్రత్యయం : ఎందేనినుండి (భార. 1-8-181), ఎయ్యేనియు నొక్క (భార 1-4-128).

పదాంత హల్లుకు అచ్చుపరమైతే హల్లు ద్విత్వంకావటానికి ఉదాహరణాలు ప్రాచీచ కావ్యాలలో చాలా ఉన్నాయి. ద్రుతద్విత్వసంధి దీని కిందికే వస్తుంది. ఉదా : పరిచర్య లౌనర్చుచున్న పరిమిత నిష్టా, అన్నిష్టసఖి (భార్ 1-3.140), నవ్వులన్నలరులకిచ్చె (కు.సం. 9-108). ఇలాంటి సంధి విధానంచేతనే మన్నాస/-పల్లఱవు, కన్నాకు మొదలైన సమాసాల్లోను, ఝుమ్మని, గ్రక్కని మొదలైన ధ్వన్యనుకరణశబ్దాల్లోను ద్విత్వవాల్లేర్పడి ఉంటుంది.

పదాంతంలోని విసర్గరేఫగా మారడం పాల్కురికి సోమనాథుని రచనల్లో ఒక విశేషం. ఉదా : ధేనురనె, విష్ణురనcగ, వాయురన (పం. చ.)

7.17. హల్లు + హల్లు : ద్రుత నకారానికి పరుషం పరమైతే నకారం తన నాదత్వాన్ని ఆ పరుషానికి ఆపాదించి దానిని నాదస్పర్శంగా మార్చివేస్తుంది. కచటతప ఇలా గజడదబలుగా మారుతుంది. కావ్యభాషలో ఇది సర్వసాధారణం. కావ్య భాషా పరిణామం 223

ద్రుతానికి మకారం పరమైనపుడు దానితో సమీకరించబడవచ్చును. ఉదా : కమ్మని లతాంతములకున్‌ + మొనసి > కు మ్మొనసి. ఇలాగే రెన్నాళ్లు, మున్నాళ్ళు ఇత్యాదుల్లో వర్ణసమీకరణం ( < రెండ్‌ + నాళ్ళు, మూడ్‌ + నాళ్ళు).

నామం (విశేష్యం)

7.18. ప్రాఙ్నన్నయయుగం నుంచి నన్నయయుగానికి ప్రవేశించేటప్పుడు నామపదాల్లో కలిగిన స్వరూపపరిణామాలను కొన్ని గుర్తించవచ్చు.

(1) కొన్ని శబ్దాల్లో వెనుకటి యుగంలో లేని లింగబోధక ప్రత్యయం చేరింది : ప్రాఙ్నన్నయయుగం : పాఱ: నన్నయ : పాఱుఁడు (భార. 1-5-203).

(2) కొన్ని శబ్దాల్టో ఇ-ఉ ల ఉ-అ ల వినిమయం కన్పిస్తోంది. ఉదా : చేయు (కు. సం. 8-175) చేయి: నేయు (SII IV--1263 గోదావరి జిల్లా క్రీ. శ. 1100) నేయి: ముందఱు (కు. సం. 2-12) ముందఱుమఱ౦ది. (SII VI-667) ముందఱ; వలువు వలువ.

(3) శబ్దస్వరూపంలో కలిగిన మార్పు : పొదరు - (భార. వి. 3-82). అర్వాచీనరూపం పొద.

తెలుగులోని శబ్దజాలమంతా దేశ్యం, అన్యదేశ్యం అని రెండువిధాలు. అన్యదేశాల్లో తెలుగు భాషాసంప్రదాయానుసారంగా మారివచ్చిన పదాలు తద్భవాలు, అనాంధ్రవర్ణ సంప్రదాయాలతో యథాతథంగా గ్రహించబడ్డవి తత్సమాలు. ఇక దేశ్య శబ్దానుగుణంగా కొంతవరకే మారివచ్చిన శబ్దాలు కొన్ని వాడుకలో ఉండినవి. ఉదా. అద్దంకి శాసనంలో 'అస్వమేదంబు' అనేరూపం. కు.సం. లో అరుహున్‌ (2.80), కలహారగంధి (9-71), హరుషాశ్రుధారలన్‌ (12-213), బరిహికేశ భరంబు (4.102, మొ. వి. వీనిని అర్థతత్సమాలని వ్యవహరించవచ్చు. కవిత్రయంలో ఇట్టిరూపాలు లేవు.

తత్సమాలవిషయంలో నన్నయవాడుకలో వాకు, జగము మిత్రుఁడు, పాత్రుఁడు అనురూపాలేకాని వాక్కు, జగత్తు, మిత్రము, పాత్రమువంటివి లేవు. నన్నిచోడుడు వాక్కు, మిత్రము, పాత్రము రూపాలు వాడినాడు. ఇక ఈతని భాషలో కనిపించే తత్సమ విశేషరూపాలు అనేకం. ఉదా: దాసి (7-134) (= దాసుడు), వాల్మీకున్‌ (1-17) (ప్రథమ),వాల్మీకుఁడు (= వాల్మీకి), ద్రోహుఁడు (2-97) 224 తెలుగు భాషా చరిత్ర

(=ద్రోహి), బాలకి (5-17) (= బాలిక), ఉత్పలల్‌ (5-167) (= ఉత్పలములు), కరవాలు (5-28) (= కరవాలము), మాధర్యత (7-94) సౌభాగ్యత (1-162).

7.19. తత్సమరూపాల్లో సంధి సమాన విశేషాలు : నిజోషది (1-126) (== నిజౌషధి), చక్రుమదనే౦ద్రియములు (6-68) ( = చక్షుర్మదనేంద్రియములు).

సంస్కృత శబ్దాలోను. సమాసాల్లోను తెలుగు వ్యాకరణకార్యాలు ప్రవేశ పెట్టడం-వ్యావహారికభాషారీతి. నిజోషధి- (నిజౌషధి బదులు) అనేదానిలో పరస్పరైకాదేశం. శాసనోదాహరణాలు ఇలాంటివి చాలాఉన్నాయి. రమాస్వరదేవరకు (<రామేశ్వర-). కుమారసంభవం నుంచి మరికొన్ని ఉదాహరణలు గ్రహిద్దాం : హృద్దశికాంబుజాతున్‌ 11-56) ( = దళితహృదయాంబుజాతున్‌), సుఖప్రాప్తు౦డు (10-93) (= ప్రాప్తసుఖుండు, మనఃక్షుభితుండై (2-3)( = క్షుభితమనస్కుండై కుసుమకోమలి (4-78) ( = కుసుమకోమల). కవిత్రయం ఇట్టిరూపాలను వాడలేదు.

వ్యవహారభాషలో వైరిసమాసాలు అధికంగా ఉన్నాయనటానికి శాసనభాష సాక్ష్యమిస్తుంది. దేశిని పాటించిన నన్నెచోడునిలో ఇవి అధికంగా కనబడ్డం నహజమే. అమరలేమలు, నీలికుంచి, మంత్రకాటుక, రాగదీవియలు, వీరమద్దెలలు, సురగజ్జెలు, ఇతరవేల్పులు, భక్తకూటువలు, మజ్జనబావి, సర్వాంగకచ్చడము. శాసనోదాహరణాలు : దివసపడి, నిత్యపడి, దీపగంభం, ప్రసాదతల్యెలు, చాతుర్మాస్య నెలలు, చందనముద్ద, ప్రసాదకూడు ఇత్యాదులు 1207. 2. 127). కవిత్రయం వారి రచనలో వైరిసమాసాలు ఎక్కడో ఒకటిరెండు కనబడు తున్నాయి- ప్రాణగొడ్డము వండివి.

7.20. తత్సమశబ్దాలకి దేశ్యాలకి ప్రధానభేదం _ తత్సమాలు చాలావరకు లింగబోధకప్రత్యయాలతో కూడి ఉంటాయి. .-డుజ్‌మహత్‌బోధకము, ౦బు/ మ్ము/ము అమహాత్‌బోధకము. దేశ్యాల్లో బల్లిదాదులుకొద్దిశబ్దాలు తప్ప ఇతరాలకు డుజ్‌ ప్రత్యయంచేరదు. అమహత్‌ 'ము' అనేక శబ్దాలపై చేరుతుంది.

దేశ్యాల్లో 'కూఁతు' శబ్దం విలక్షణం. దీనికి ప్రథమైకవచనంలో కూతురు అని, తదితర విభక్తుల్లో కూతు-అనే రూపాలున్నాయి. ప్రథమా బహు. కూతు-లు ద్వి. ఏకవచ. కూతు-ను. ద్వి. బ వ. కూతులను. నన్నయనన్నెచోడులలో ఇదే కావ్య భాషా పరిణామం 225

పరిస్థితి. తిక్కనకాలానికి రువర్ణంతో ఉన్న కూతురు రూపం మీదనే బహువచన ప్రత్యయం, ప్రథమేతర విభక్తిప్రత్యయం చేర్చటం సంభవించింది. ఇట్టి కూఁతుండ్రు, కూఁతురులు, కూతురి- రూపాలు వాడుకలోకి వచ్చాయి. తిక్కన ఇలాంటి రూపాలు వాడినాడు.

బహువచనరూపాల్లో మువర్ణలోపం, పూర్వస్వరదీర్ఘం కలిగినవి నన్నయలో లేవని, తిక్కన, శ్రీనాథులు వాడారని గమనించాలి. కళ్యాలన్‌ (భార.), ముత్యాలు (భార), మీసలు (భాగ. 6-92), ఇక్కడ కావ్యభాషకు శాసనభాషకు ఉన్న భేదం ఒకటి గమనించాలి ఉంది. రు, లు అంతంలోగల శబ్దాలు బహువచ నలు ప్రత్యయంతోకూడి డ్లు-బహు. వ. రూపాలు సిద్ధిస్తున్నాయి. నీరు+లు> నీడ్లు, కాలు + లు > కాండ్లు, ఎంగిలి + లు > ఎంగిడ్లు. కావ్యభాషలో 'ళ్ళు' బహువచనాలే ఉన్నాయి : నీళ్ళు, కాళ్ళు, ఎంగిళ్ళు.

తెలుగులో నామమే ప్రథమైకవచనం. డుజ్‌, ములు మహదమహత్‌ ప్రత్య యాలేకాక, తరుచుగా దేశ్యాల్లో 'వు' కూడా అంతమందు కనబడుతూ ఉంటుంది. ఆ-వు, పూ-వు, చెఱు-వు ఇత్యాదులు. వీటిలో వువర్ణ విరహితరూపాలే ప్రాచీ నాలు, కాలక్రమాన హలంత శబ్దాల సామ్యాన వీటిపైనకూడా ఒక ఉకారము చేరగా సంధ్యక్షరంగా వకారం బయలుదేరి వుకారాం తాలయ్యాయి. ప్రాచీన పూ శబ్దము సమాసంలో మనకు లభిస్తుంది. 'కాలకంఠుని శిరసు వూ గగనగంగ' అని శ్రీనాథుని ప్రయోగం. తరువు, గోవు వంటితత్సమ శబ్దాల్లోను 'వు' ఉచ్చారణవశాన చేరిందనవచ్చు.

7.21. అనౌపవిభక్తిక శబ్ధాల్లో ప్రథమేతర విభక్త్యంగం ప్రథమారూప తుల్యం. ఔపవిభక్తికశబ్దాల్లో -ఇ, టి, తి ప్రత్యయాలు చేరతాయి. ఈ ప్రత్యయాల వాడుకలో కాలక్రమాన కొన్ని మార్పులువచ్చాయి. ఔపవిభక్తికశబ్ధాలు కొన్ని అనౌపవిభక్తికాలుగాను, అనౌపవిభక్తిక శబ్దాలుకొన్ని ఔపవిభక్తికాలుగాను వ్యవహ రించడం జరిగింది. ఉదా : కన్నీరుధారలు (కు. సం. 5-85 )/ కన్నీటిధారలు, పాతటికిన్‌ (ఉ. హరి.). అర్వాచీనరూపం : పాతరకున్‌. ఏకకాలంలో ఒకే శబ్దం రెండు భిన్నప్రత్యయాలతో వాడబడవచ్చు. నీరి (భార. 1-5-196)/ నీటి (భార. 1-3-201), మొదలి (పై. 2-2-144)/ మొదలింటి.

ఒక్కొక్కప్పుడు ఔపవిభక్తికాంతం ప్రథమాలోపంగా వాడుకలోనికి


(15) 226 తెలుగు భాషా చరిత్ర

రావచ్చును. 7వ శతాబ్ధంలో చీకుశబ్దం వాడుకలో ఉంది. (తిప్పలూరు శాస. AIXXVI. 231). దీని ఔపవిభక్తికలోపం చీకటి. ఇది నన్నయకాలానికి ప్రథమాంతంగా స్థిరపడపోయింది. నన్నయకాలంలో అమహత్సంఖ్యావచన విశేష్యం ఒకండు; దీని ఔపవిభక్తిక రూపం ఒకంటి అన్నది 13వ శతాబ్దానికి ప్రథమాం తంగా గ్రహింపబడి, ఒకండు కేవలం పుంలింగరూపమైంది. ఒకండు < ఒక + ఒన్ణు. దీనిలో “౦డు” పుంలింగప్రత్యయమనే భ్రాంతిచేత ఈ వాడుక కలిగింది.

7.22. విభక్తిప్రత్వయాలు : ద్వితీయ : నన్నయ గుఱించి రూపాన్ని వాడేడు. గుఱించి, గూర్చి తరువాతకవుల్లో ఉన్నాయి. తృతీయ : మెయిన్‌, తృతీయాంతంపై 'చేసి' నన్నయలోగలవు. ఉపయోగార్థంలో 'తోడ' వర్ణకం వాడేడు. చతుర్థి  : కై (< కు + అయి). ప్రత్యయం విషయంలో అచ్చుతోనే యతిని పాటించటాన్నిబట్టి అతడు దీన్ని సమస్తపదంగానే భావించినట్లు స్పష్టం. 'కొఱకు' నన్నయ, నన్నిచోడుల్లో లేదు. పదమూడో శతాబ్దంనుంచి వాడబడింది. 'పొంటె' ప్రాజ్నన్నయ-కొఱవిశాసనంలో వాడబడింది. నన్నయవాడినాడు. పంచమి: కన్నన్‌ అర్వాచీనరూపం. 'ఉండి' ప్రాచీనకావ్యాల్లో సప్తమ్యంత రూపాలపై వాడబడింది. అర్వాచీనగ్రంథాల్లో ప్రథమేతర ప్రాతిపదికపై - సామ్యాన - చేరింది. దాన-నుండి, దాని-నుండి. అనుచితవిభాగంవల్ల ఉండి > నుండి.

విభక్తిప్రత్యయం - కొన్ని ఉదాహరణలు

ప్రథమ : అజడంబు ద్వితీయకు : అనిలజవంబునన్‌ బఱచు నమ్మద నాగమెదిర్చి. (భార. 1-4-207), జడంబు తృతీయకు : విగతరోషుఁడవై సుఖముండు మింక (భార. 1-7-129).

చతుర్ధికి : కాలంబు వేచెదను. జయంబునకున్‌ (భార. ఉ. 1-175).

షష్టికి : దుష్టోరగ సంహారమిప్పుడొడఁబడవలనెన్‌ (భార.1-2-137).

సప్తమికి : భూతి సర్వాంగముల్‌ పూయుచో (బ.వు.)

షష్టి : ద్వితీయకు : చిరముగ బ్రహ్మకున్‌ దపముసేసి (భార 1-2-138).

తృతీయకు : యుద్ధముసేసిరి భటులు శౌర్యదర్పోన్నతికిన్‌ (కు. సం. 11-124). కావ్య భాషా పరిణామం 227


చతుర్ధికి : పిప్పికఱిగెడు నీగలపెల్లువోలె (కు. సం. 1-130).

పంచమికి : విలువిద్యనొరులు నీ కగ్గలముగ లేకుండునట్లు (భార. 1-5-289).

సప్తమి : కోమలి నీ కనురక్త (పై. 3-2-216).

సప్తమి:. తృతీయకు : సుస్వాగతాభిమత వాక్యములందభ్యాగ తోచిత సపర్యలఁదన్పెన్‌ (కు. సం. 7-5)

పంచమికి : జంగమమల్లయ వరమునందుఁ గనిన వస్తుకవిత

(కు. సం. 1-49), పూర్వాబ్ధిలో వెలువడి (పై. 10-111).

షష్టికి : అంతరంగగతి భేదము దెల్పె విదగ్ధముగ్ధలన్‌ (కు. సం. 5-151),

7.23. కారక విశేషాలు : కాలక్రమాన భాషలో కారక విధానంలో గూడా మార్పు కలుగుతుంది అనడానికి కొన్ని ఉదాహరణలు గ్రహిద్దాం. నన్నయ నన్నిచోడులు అలుగు, కరుణించు, అనుగ్రహి౦చు, సైచు మొదలైన క్రియలతో షష్టీకారకం ఉపయోగించారు. ఉదా : యయాతికి నలిగి (భార. 1.8.39), అరవిందంబుల కలిగి (కు. సం. 1-19), గిరిపతికి నమ్మునిపతి గరు ణించి (కు. సం), పౌష్యునకు ననుగ్రహించి (భార. 1-5-31), ఇతరోదాహర ణాలు : ఆక్షేపి౦చు : తద్గీర్వాణోరునదీ జితాఘముల కాకక్షేపించి (పై. 8-107); పరివేష్టించు : దాక్షాయణికిం శివగణికా సహస్రంబు పరివేష్టించి (పై. 2-16). తరువాత కాలములో ఇట్టి సందర్భాల్లో ద్వితీయాకారకం వాడబడింది.

ఈ కింది క్రియలతో షష్టీ , ద్వితీయలు రెండూ నన్నెచోడుడు వాడినాడు. తర్వాతి కాలంలో ద్వితీయకే వాడుక. ఉదా : రుద్రున కుఱక (4-67). విశ్వ సంహరు నుఱక (4-76). ఎయిదు : పరమేశ్వరున కెయిదనేరమికిన్‌ (6-145), ఉగ్రునెయిద౦దడవెద్ది (5-88).

అట, ఇటి, ఎట అను ప్రత్యయాలపై 'క' ప్రత్యయం చేరకుండటం నన్నయభాషలో విలక్షణంగా కనబడుతుంది. ఉదా : ఇటయేల వచ్చితి (భార. 1-2-210), ఇచ్చను పయెటవోయెడు. (పై. 3-2-107). ఇలాగే అక్కడ, ఇక్కడ, ఎక్కడ శబ్దములును కొన్నిచోట్ల ప్రయోగించబడ్డాయి : ఎక్కడం 228 తెలుగు భాషా చరిత్ర

గదలనేరకున్నవాడ (భార. 3-8-245). షష్టి ప్రత్యయానికి పూర్వం నగాగమం రాని రూపాలు నన్నిచోడుని రచనలో ఉన్నాయి. ఉదా : సభముకు (11-169). నన్నయలో ఒకచోట తాకు కు అనురూపం కనబడుతున్నది (భార. 3-4-12).

7.24. సర్వనామాలు : ఉత్తమ, మధ్యమపురుష సర్వనామాల్లో ఏక బహువచనాలు రెండింటను రెండేసి రూపాలు ప్రాచీన కావ్యాల్లో వాడబడ్డాయి.

ఏను-నేను; ఏము-మేము; ఈవు-నీవు; ఈరు-మీరు. క్రమంగా అజాది రూపాలకి కావ్యభాషలోనూ వాడుక తగ్గిపోయింది. ఉత్తమపురుష బహువచన రూపం నేము-(తమిళమున నామ్‌-అనుదాని సమానపదం) భారతంలో ఒకచోటను (3-5-200), అర్వాచీన కావ్యాల్లో ఒకటి రెండుచోట్ల వాడబడింది. శాసనాల్లో దీనికి ప్రయోగాలు కలవు (HGT. P. 179),

ప్రాచీనకాలంలో అత్మార్థక రూపం మూడుపురుషల్లోనూ. వాడబడుతూంది. ఉత్తమపురుషలో వాడుక కుదాహరణం : తన్ను బంపుదేవ (కు. సం. 4-45).

తచ్చబ్ద-వాడు, అది, ఇది రూపాలకు నన్నయ నన్నిచోడుల భాషలో నేటివలె నీచార్థస్పురణ మేమీలేదు, ఉదా : వీడు భీముడు, వాఁడు గవ్వడి (భార. 2-1-193). దమయంతిని గూర్చి చెబుతూ "అది సంతసించి" (భార. 3-2-202), వీడు సామాన్య పురుషుండుగాఁడు (కు. సం. 7-16) వరదుండు. దాని కోరిన వరంబు దయసేసి (పై. 7.72)

నన్నయ 'వారు' బహువచన రూపాన్ని వాడినాడు. సమకాలీన శాసనాల్లో వా౦డ్రు రూపమంది. వాఁడు శబ్దాన్నుంచి ఏర్పడ్డవాండ్రు నన్నయ అనంతర కవులు వాడినారు. వాండ్రు రూపంకన్నా అర్వాచీనం వాండ్లు > వాళ్ళు,

7.25. సంఖ్యావాచకాలు : నన్నయ, నన్నిచోడలు 'ఏను' రూపాన్నే వాడారు. అయిదు 12, 13 శతాబ్దాల నుండి శాసనాల్లో, కావ్యభాషలో కనబడుతూంది. ఉదా : తిక్కన : ఐదు శరంబులు (ద్రోణ 3-223),

మొదటి సంఖ్యావాచకానికి మహత్‌, మహతి, అమహత్‌ రూపాలు మూడూ ఉన్నాయి. అమహద్రూపమే సంఖ్యావాచక విశేష్య౦. ఉదా : అమరత్వ మొక్కండు. దక్క (భార. 1-8-88), ఉగ్రబాణసమూహ మొక్కండు దప్పక కావ్య భాషా పరిణామం 229

కు. సం. 11-106). దీని ఔపవిభక్తిక రూపం ఒక్కంటి, ఒకటి. ముద్రిత భారత ప్రతులలో ఒకటి, ఒక్కటి రూపాలు కనబడుతున్నా తాళపత్రప్రతుల్లో పాఠాంతరాలున్నాయనీ, వీటిని ప్రథమ రూపాలుగా వాడియుండడని ఆంధ్రభాషా చరిత్రకారు లూహించారు. కుమారసంభవంలో “ఒకటి” అనే దానికి ప్రథమలో ఒక్క ప్రయోగం కనబడుతోంది. 'మానుగ గూర్తు నొక్కటిగ మార్గణకౌశల భావమేర్పడన్‌ (4-69) పదో శతాబ్దంనాటి దొంగలసాని శాసనంలో 'నళ్పాద్యది యొకొటియగు నేణ్డు' అను ప్రయోగాన్ని బట్టి ఈవాడుక భాషలో ప్రాఙ్నన్నయ యుగంలోనే ఏర్పడిందని స్పష్టపడుతోంది.

మహద్వాచకం : నన్నయ-ఒకరుఁడు, ముద్రిత ప్రతుల్లో కనబడే ఒక్కఁడు. ఒకఁడు లోపానికి తాళపత్ర ప్రతుల్లో రేఫతోకూడిన వేరుపాఠాలు కన్పిస్తున్నాయని ఆంద్రభాషాచరిత్రకారులు (HTL.p. 1415). నన్నెచోడుడు ఒకఁడు/ఒక్కండు రూపాన్ని మహద వాదర్థములు రెండింటిలోను వాడిఉన్నాడు.. ఒకఁడు శబ్దం మొదట అమహద్రూపమైనా (< ఒక + ఒన్జు) దానిలోని-డుజ్‌ వర్ణం మహద్వాచకం అనే బ్రాంతి కల్సింపడంవల్ల ఈ అర్థంలో వాడుకలోకి వచ్చి ఉంటుంది. అప్పుడు ఆర్థసందిగ్ధతను నివారించడం కోసం దీని ఔపవిభక్తిక రూపమైన ఒకఁటి ప్రథమలో వాడుకలోకి వచ్చి స్థిరపడి ఉండవచ్చు. 12-13 శతాబ్దాలనుండి శాననాల్లో తరుచు 'ఒకటి' ప్రథమలో వాడబడింది.

మహతీ వాచకంగా నన్నయ ఒక్కత, ఒక్కటి, ఒక్కతె, ఒక్కర్తు అనే రూపాలను వాడినాడు, సూరి మహతిలో 'ఒకతి' శబ్దానికి 52 రూపాంతరాలు పేర్కొన్నాడు. చాలావరకివి సామ్యంవల్ల కూర్చబడ్డాయని తోస్తుంది. ఇవి ఎంతవరకు కవిప్రయుక్తాలో పరిశీలించవలసి ఉంది.

పూరణార్థకసంఖ్యా వాచకంలో వచ్చే ప్రత్యయం అగు > అవు. అవు నన్నయలో ఉంది. 'అగు' ప్రాఙ్నన్నయ శాసనభాషలో వాడబడింది. 'అవు' రూపమేర్పడ్డ తర్వాత దీనిపై విశేషణత్వ 'అ' కారంచేరి "అవ' ఐంది. కావ్య భాషలో తరచుగా కనబడే రూపమిదే. _అవ వ్యవహారంలో పన్నెండు శతాబ్దానికే 'ఓ' గా మారినట్టు శాసన ప్రయోగాలవల్ల తెలుస్తుంది. ప్రబంధ యుగంలోని కవులు 'ఓ' రూపం వాడిన వాళ్ళున్నారు. 230 తెలుగు భాషా చరిత్ర

7.26. క్రియావిభక్తులు : ప్రాచీన కావ్యాల్లో క్రియాధాతువులను గూర్చి ఈ కింది విశేషాలు గమనించ తగ్గవి.

1. ధాత్వనుబంధము చేరని ప్రాచీన ధాతువుల వాడుక. ఉదా : తొడు (భార. 1-8-174; కు. సం. 5-20) ఎదురు (కు. సం. 4-46). తెప్పిరు (10-10). తొడుగు, ఎదిరించు, తెప్పిరిల్లు అని తిక్కనాది అనంతర కవులు వాడారు.

2. చుకారాంత ధాతువులు కొన్ని తరువాతి కాలాన యకారాంతాలైనాయి. నన్నయ నన్నిచోడులు: వైచు, త్రోచు. అనంతర కవులు : వేయు, త్రోయు, ప్రాఙ్నన్నయ యగంలో ఴచ్చు ధాతువు ఇలాంటి పరిణామానికీ ఉదాహరణం. 7-8 శతాబ్దాల్లో ఴచ్చు-చుకారాంతము : ఴచ్చిన వాన్ఱు ఴచ్చువాన్ఱు (రేనాటి. చోళశాసనాలు), 9 వ శతాబ్ధంనుంచి ఴయ్యు : ఴస్సి (ఇయ్యొట్టు ఴస్సి) బెజవాడ శాసనం (HGT. 311, శాసన౦ పంక్తి 14). అఴసి : లింగంబఴసిన పాపంబు (పంక్తి 21). కొన్ని ధాతువుల్లో చుకారాంత, యకారాంతాలు రెండూ ఏకకాలంలో వాడుకలో కనబడుతున్నాయి. నన్నెచోడు : పాచు/పాయు, మెఱచు/మెఱయు, రాచు/రాయు.

3. మూలధాతువులుగా వాడబడ్డవి కొన్ని తరువాతి కాలంలో సహాయక క్రియలతో శబ్దపల్లవాలుగానే వాడబడ్డాయి. ఉదా : వ్రేలు (కు. సం. 11-127) ఉలుకు (2-14), వ్రేలాడు, ఉలికిపడు.

4 వలయు వంటి క్రియలు కవిత్రయం ప్రధానక్రియగా వాడారు. ప్రపంధయుగానికిది కేవలం సహాయ క్రియగా వాడబడింది. ఏమివలతు నీవడుగు మనిన (కు.సం. 1-70), పోయిరావలయు మాకు ( = పోయిరాన్‌ మాకువలయు) (భార. ఉద్యో. 1-42).

ఇక శబ్దదిస్వరూపంలో ప్రాచీనతాలక్షణం ఆ యుగంలోని రూపాల్లో తత్రాపి నన్నయ నన్నిచోడుల గ్రంథాల్లో కనబడటం ఆశ్చర్యంకాదు. ఉదా: తూర్పు (కు. సం. 8-94) > దూరు, నచ్చు (కు. సం. 10-189), (భార. ఉద్యో. 3) > నమ్ము, నఱకు (నఱుకు) మొ.వి.

నన్నయాది ప్రాచీన గ్రంధాల్లో కొన్ని ధాతువులు ఎలాంటి రూపభేదమూ లేకయే అకర్మక, సకర్మకాలుగా కూడా వాడబడ్డాయి. ఉదా : కురియు : అంగార కావ్య భాషా పరిణామం 231

వృష్టిగురియుచు (భార. 1-7-107) వాన..గురిసి, ఒలుకు: కమండలు జలంబు లొలికిన (1-7-126), రక్తధారలొలక (1-2-126), పూను : హయములు పూనిన రథమెక్కి. (3-1-164). ఇద్దరును వూనిరి సర్వము నిర్వహింపఁగన్‌, మెఱయు ; విభూతి మెఱసి (కు. సం. 2-8). తరువాత కాలమునకు ఈ ధాతువులలో సకర్మకాకర్మక భేదాన్ని తెలపడానికి ప్రత్యయాలు చేరాయి. కురియ కురియించు/కురిపించు, పూను-పూన్చు, అగు-అవు, మెఱయు-మెఱయించు.

సంస్కృత ధాతువులు ఒకప్పుడు మూలార్థంలో నన్నయ వాడటంచేత మనకిప్పుడవి విలక్షణంగా తోస్తాయి. విహరించు, సకర్మక ప్రయోగము : అగ్నులు విహరింపుమని పంచి (భార. 1-1-29). విహరించు = విభాగించు. ఈ అర్థంలో తరువాతి కవులు వాడినట్లు లేదు.

కొన్ని సకర్మక క్రియలు కర్మలేకుండానే కావ్యభాషలో వాడటం కద్దు. నన్నయ : పొలువుగఁ బూసి కట్టితొడి, భూరి విభూతిప్రకాశితంబుగా (భార. 1-8-174).

చు, వు, ఇంచు ప్రేరణ ప్రత్యయాల్లో పకార రూపాలకు కాలక్రమాన వ్యాప్తి కలిగింది. నిండు-నించు, నింపు, చినుగు-పించు/చింపు, ఉడుగు-ఉడిగించు/ఉడివించు, ఉడుపు, మాయు-మాయించు, మాపు. నన్నిచోడుడు : మెచ్చించు (కు.సం. 1-21), తరువాతి కాలంలో మెప్పించు.

7.27. క్రియలు సంపూర్ణాలు, అసంపూర్ణాలు అని రెండువిధాలు, సంపూర్ణ క్రియల్లో ధాతువు, దానిపై కాలభావద్యోతక ప్రత్యయం, దానిపై సర్వనామ ప్రత్యయం చేరుతుంది. అసంపూర్ణ క్రియల్లో సర్వనామ ప్రత్యయం ఉండదు.

భూత తద్ధర్మార్థక సంపూర్ణక్రియల్లో ఉత్తమ పురుషైకవచనంలో సర్వనామ ప్రత్యయాలు చేరనిరూపాలే నన్నయ, నన్నిచోడులలో తరచుగా కనిపిస్తున్నాయి. భూతార్థక క్రియ 34 ప్రయోగాల్లోనూ కు. సం. లో 'వి' ప్రత్యయం కానరాదు. ఉదా : జడుఁడవై తెట్లు బ్రాహ్మణజాతిఁబుట్టి (7-27); తద్ధర్మార్థంలో వైకల్పిక పరిస్థితి : భిక్షకుఁదగిలి తపంబుసేసెదటే (7-21).

వ్యవహారంలో భూతకాలిక క్రియల్లో కలిగిన మార్పులు : (1) చేయు - చేసితిమి వంటి వానిలో ఇత్వలోపం కలిగి చేస్తిమి వంటి రూపాలేర్పడ్డాయి. 232 తెలుగు భాషా చరిత్ర

శ్రీనాథుని చాటుపద్యాల్లో ఇట్టివి ప్రయుక్తాలు, యుకారాంతాల్లో లాగానే చుకారాంత ధాతువుల్లోను ఇలాంటి రూప పరిణామం జరిగింది. ఇచ్చి-ఇచ్చితిమి-ఇస్తిమి; మన్నించు-మన్నింస్తిమి. ఇలాంటి రూపాలు 11 వ శతాబ్ధ౦నుంచి శాసనాల్లో ప్రయో గించబడ్డాయి. కాని ఇవి వ్యావహారికరూపాలుగానే పరిగణించబడ్డాయి.

7.28. తద్ధర్మార్థకక్రియ వర్తమానం భవిష్యత్‌కాలాల్లోనేగాక ప్రాచీన కావ్యాల్లో భూతకాలానికి కూడా వాడబడటానికి ఉదాహరణాలు కలవు. ఉదా: ద్యూతక్రీడకు కొండొకనేతున్‌ (=నేర్చి యున్నాను); విజితే౦ద్రియుండనగ నిమ్మునిఁబాయకవిందు (భార. 1-4-80) (= వింటిని).

అన్వాదులకు దు ప్రత్యయం చేరినపుడు నన్నయలో ఆండ్రు, కొండ్రు ఇత్యాది మూర్థన్యయుతరూపాలు కనబడుతున్నాయి. తిక్కనలో అందురు, కొందురు రూపాలున్నాయి.

చువర్ణా౦త ధాతువుపైన వచ్చే తద్ధర్మార్థక దుప్రత్యయం తకారంగా మారుతుంది. ఉదా: చూచు+దు+రు > చూతురు. ఇలాంటి మార్పురాని రూపాలు వ్యావహారికాలు. పదోశతాబ్ధంనాటి గంగాధర శాసనంలో 'ఇచ్చుదువ్‌' రూపంఉంది. (HGT. p. 346). ఇలానే అడచుదురు, ఆకర్ణి౦చుదురు. వీనిలో ధాత్వంత చకారం పకారంగా మారటం వ్యావహారికంలో కనిపించే మరోమార్పు. కవిత్రయంలో ఇలాంటి రూపాలులేవు. తరవాతికాలపు కవుల గ్రంథాల్లో ప్రవేశించాయి. ఉదా : ఆకర్ణింపుదురు (భాగవతం). నన్నయ భారతంలో 'పూజింపుదుము' అని ముద్రితప్రతిలోని పాఠం (ఆర. 2-255). తాళపత్ర ప్రతుల్లో 'పూజింతుము' అనే ఉందని ఆంధ్రభాషా చరిత్రకారుల సూచన (ఆం. భా. చ. వు. 1494). చుకారాంత ధాతువుల్లోలాగే యుకారాంత ధాతువుల్లోనూ 'ధ' కు 'త' ఆదేశమవడం మరొక వ్యావహారికరీతి. చేయు-చేయుదురు/ చేతురు.. ఇట్టి రూపాలు కవిత్రయంలో లేవుగాని నన్నిచోడాది దేశికవుల్లోను, అర్వాచీనమార్గ కవుల్లోను కన్పిస్తుంది ఉదా: చేతున్‌ (కు.సం. 1-5). సూరిఈ కారణంచేతే 'చేతురు, కోతురు' -ఇత్యాదులు అసాధువు లన్నాడు.

తద్ధర్మక్రియ 'పొందుదురు' ఇత్యాదుల్లో ప్రత్యయస్వరూపం మారి 'పొందుతారు' వంటి రూపాలు శాసనాల్లో 18వ శతాబ్దంలో లభించాయి. ( NI.1.కందుకూరు, 8 క్రీ. 1551). కావ్య భాషా పరిణామం 233

తద్ధర్మ 'ద' ప్రత్యయలోపంతో పూర్వస్వరదీర్ఘం కలిగిన రూపాలు: పెట్టించెదను - పెట్టించేను (SII VI 16, కడపజిల్లా 1396), ధరించెదము - ధరించేము (SII V 52, కర్నూలుజిల్లా, క్రీ.శ. 1515) ఇత్యాదులు. తాళ్ళపాక అన్నమాచార్యుల కీర్తనల్లో ఇలాంటివి ప్రధానంగా ప్రథమపురుషలో వండేని, చేసేని అనేరీతి ప్రయోగింపబడ్డాయి. ఈ రూపాలన్నీ కవిత్రయయుగపు కావ్యభాషలో ఎక్కలేదు.

7.29. వ్యతిరేకార్థకక్రియ : ధాత్వంతమందలి చకారము వ్యతిరేకార్థకం పరమైనప్పుడు పకారం అవుతుంది : ఒనర్చు-ఒనర్పడు కవిత్రయయుగం తర్వాత ఇలా పకారం కాని రూపాలు వాడుకలోకివచ్చాయి.

వ్యతిరేకక్రియ అర్థత్రయబోధకమవుతుంది. ఉదా : భూతం : నలుగానమివ్వనమ్మున (భార. 3-2-107); వర్తమానము : పలుకదు సఖులతో లలితాంగి (భార. 3-2-26); భవిష్యత్తు: నలునకాని నలిదళనేేత్రవరియింప దట్టి (భార. 8-8-52). వ్యతిరేకక్రియల్లో కాలం సూచించదలచినప్పుడు అగు-సహాయకక్రియ రూపాలను చేర్చిచెప్పడం ఉంది. ఉదా : నన్నయ : ఎఱుగనయితిని, నమ్మనేర నయ్యెదను, లేదవు ఇత్యాది. ఈ అగుధాతువు అనుప్రయుక్తమైన రూపాలు క్రమంగా తరవాత యుగంలో తగ్గిపోయాయి.

7.30. ఉభయ ప్రార్థనార్థంలో కావించు, కావింతము; పుచ్చు-పు త్తము అనురీతినిగాక ఈ యుగాంతానికి కావించుదము వంటి రూపాలు వాడుకలోకి వచ్చాయి. వెదుకుదము, చెప్పుదము, చూతము అనుటకు పాల్కురికిసోమన ప్రయోగాలు వెదకుదండు, చెప్పుదండు, చూతండు (ఖ.వు. ఉపో. పు 120) వంటివి మాండలికాలు కావచ్చును. విధ్యర్థంలో ఉండకుండునది అనటానికి ఉండకున్నది అనురూపం నన్నయలో ప్రయుక్తమైంది : దుర్జనయోధవరులకడ నుండకున్నది (భార. 1-8-206).

7.31. నిషేధార్థకం: ఏకవచనంలో వండకు-వండకుము అని రెండు రూపాలున్నాయి. అమ్మాదులు చేరినప్పుడు సంధికలుగు సందర్భాల్లో సర్వనామ ప్రత్యయంతో కూడిన రూపాలే ఉండాలని సర్వనామరహితాలు నిషేధాలనీ అధర్వణకారికావళి అనుశాసనం : తలంపకమ్మ-అలాక్షణికము: తలంపకుమమ్మ అని ఉండాలి. 234 తెలుగు భాషా చరిత్ర

7.32. ఆగమచకరానికి 'ముత్తు' పరమైనప్పుడు వకారా దేశమవుతుందని బాలవ్యాకరణ సూత్రం. దీనికి వ్యత్యస్తమైన ప్రయోగాలు కవిత్రయేతర గ్రంథాల్లో కానవస్తున్నాయి. శాసనభాషలో వీనికుదాహరణాలు ఎక్కువగా ఉన్నాయి. పకారాదేశం రాదగిన సందర్భాల్లో రాకపోవటమేకాదు. పూర్వకవుల కావ్యాల్లో కనబడని చోట్ల అర్వాచీనకవుల కావ్యాల్లోరావడం వైయాకరణులు గుర్తించారు. ఉదా : శత్రర్థపరత “చు” వర్ణానికి: మోవి మోవిఁజేరుపుచు (ప్రౌ.వ్యా.క్రియ). ఆశీరర్థకాలైన ఎడున్‌, తన్‌ ప్రత్యయాల్లోని ద్రుతం అచ్చుపరమైతే మకారం అవుతుంది : నీకు మేలు కలిగెడు మనియె, కావుతమనియె. సంధిలో కనబడు ఈ మకారం నిజానికి చారిత్రక చిహ్నమే. ఆంధ్రశబ్ద చింతామణిలో ఈ ప్రత్యయం 'డుమ' అని చెప్పబడింది. ఉదా : శుభము ఘటియింపుడు. భారత ప్రయోగాలిలాంటివి కన్పడుతున్నాయి. వివేకమెడలి యుండెడును కప్పలు (భార. అను. 3-143); విష్ణుడు ఇష్టదాయి. ప్రసన్నుఁడయ్యెడుమనాకు (శాంతి. 1.41). _డుమ అశీరర్ధకాలు తర్వాత కవుల్లోలేవు.

7.33. మూల ద్రావిడ భాషనుంచి తెలుగునకు వచ్చిన సంపూర్ణ క్రియలు రెండు : భూతం, తద్ధర్మం. ఇవి తత్రదర్ధ బోధక ప్రత్యయాలలో కూడినవి. తెలుగున చారిత్రక యుగంలో ఏర్పడినవి. భూత, తద్ధర్మ, వర్తమాన భవిష్యక్కాలాలు, ఆయా క్రియాజన్య విశేషణాలకు తచ్చబ్ద౦ చేరిన రూపాలు- విశేష్యరూపాలే క్రియార్థాన్ని పొందాయి. వానిలో కాలక్రమాన కలిగిన శాబ్దకమైన మార్పుతో ఈ అర్థ విపరిణామం రూఢమైంది. వండినవాఁడు-విశేష్యము- క్రియ; రెండోదశలో వండినాడు - క్రియ. ఇలాగే వండుచున్న వాఁడు -వండుచున్నాఁడు, వండఁగలవాఁడు -వండగలఁడు, వండఁగలఁడు; వండెడు/వండెడివాఁడు > వండే వాఁడు (విశేషార్ధంలో). తచ్చబ్ధవకారం లోపించిన సంగ్రహరూపాలు తిక్కన కాలంనుంచి కావ్యభాషలో ప్రవేశించాయి. నన్నయలో ఇవిలేవు.

నన్నయకాలంలో 'కలుగు' ధాతువు సకర్మకంగాను, అకర్మకంగాను వాడబడింది. ఎఱుకగలవె అనేది సకర్మక ప్రయోగం. పధ్నాలుగో శతాబ్ధం నుంచి ఈ వాడుక లోపించి సహాయకక్రియగానే ప్రయోగించబడింధి. ఇతర సంయుక్తక్రియలకంటె భవిష్యద్రూపం అర్వాచీనం. నన్నయ నన్నిచోడులలో భవిష్యత్క్రియ అరుదు. నన్నిచోడునిలో ఒకే ఒక ప్రయోగము - కలబ్యను బంధంతో - కానవచ్చింది. మిమ్ము గౌల్వఁగల వాఁడన్‌ (కు. సం. 7-184). కావ్య భాషా పరిణామం 235

అన్నంత క్రియలమీద సహాయకక్రియలు చేరి భిన్నార్ధాల్లో సంయక్త క్రియ లేర్పడుతున్నాయి. ఆత్మార్థక, కర్మణ్యర్థక క్రియలు ఇలాంటివి. నన్నయ సంస్కృత భారతం అనువదించేటప్పుడు - పడు కర్మణ్యర్థకాలను విశేషంగా వాడాడు. నన్నిచోడునిలో రెండు ప్రయోగాలు మాత్రమే కలవు. (కు.సం. 9-67, 10-47). ఇతర కవుల్లోను విరళంగానే వాడబడింది. పడు కర్మణ్యర్థకరూపం సంస్కృత భాషా ప్రభావంవల్ల తెలుగున కలిగిందని చెప్పవచ్చు.

ప్రాచీన గ్రంథాల్లో - కొను సహాయకక్రియ లేకుండానే కొన్ని క్రియలు ఆత్మార్థంలో వాడబడ్డాయి. బబ్రుభార్య దనకు భార్యచేసె (భార. 2.2.6); పరమేశ్వరుఁ బ్రత్యక్షంబుసేసి (కు.సం. 1-7); పరిధానంబులు సవరించుచు (10-4).

పదకల్పాలు

7.34. (1) ఏవార్థకం : 11-12 శతాబ్దాల్లో ఏవార్థక ప్రత్యయం 'అ'. నన్నయలో ఇదే ఉన్నది. నన్నిచోడునిలో 'అ' తోపాటు కొన్ని ప్రయోగాల్లో ఏ ప్రత్యయంకూడ కనబడుతోంది. ఉదా: చేనంబండిన విత్తు చేనికె వెదవెట్టునట్లు (కు.సం. 1-49), సమకాలపు శాననాల్లోను అ/ఏ లు పక్క పక్కన వాడబడి ఉండటాన్ని బట్టి ఈ రెండూ ఆనాడు వ్యవహారంలో ఉన్నాయని తెలుస్తూంది. క్రమంగా ఏ కారానికి వ్యాప్తిహెచ్చి అకారం లోపించింది. ఏ వార్థకం నామాలశోనేగాక క్రియాపదాలతోనూ వాడబడింది. ఉదా: నీదానగాన (భార. 1-6-2, 250). తర్వాతికాలంలో ఈ ప్రత్యయం ఇలా క్రియాపదాలతో వాడే అలవాటు పోయింది.

(2) సముచ్చయార్థకం : ఉన్‌ ప్రత్యయము, ను, ని రూపాంతరాలు. ఉదా. తనకిష్టుడున్‌ (భార. అది.) ఒకప్పడీ ప్రత్యయంపై మరల ప్రత్యయం చేరవచ్చు. ఏమినిఁ జేయగలేక (భార. ఉద్యో. 2-108). సముచ్చయనకారం లోపించి పూర్వస్వరానికి దీర్ఘం రావడం శాసనాల్లో 11 వ శతాబ్దంనుంచి, కావ్య భాషలో 18 వ శతాబ్దంనుంచి కన్పిస్తోంది. తిక్కన ప్రయోగం : నమ్మీనమ్మని (భార. శా౦తి. 2-351) ; శ్రీనాథుడు చాటువుల్లో ; చల్లా యంబలి ద్రావితిన్‌.

వ్యవహారంలో (1) ద్విత్వయుక్తాలు న్ను / న్ని ప్రత్యయాలు. ఉదా. ప్రతి సంవత్సరమున్నూ (SII VI. 1198, విశాఖజిల్లా. క్రీ. శ 1242); 236 తెలుగు భాషా చరిత్ర

తూములు వదిన్ని (SII V 1052, గుంటూరు జిల్లా, క్రీ. శ. 1133), (2) సముచ్చయ ప్రత్యయం లోపించి (లోపించక) ప్రాతిపదికలోని చివరి అచ్చు దీర్ఘ౦ కావటం. ఉదా. అతని పుత్రాను పౌత్రికమూ ఎల్లప్పుడూను ఆరాధించువారు. (SII x, 4, గుంటూరుజిల్లా, క్రీ. శ. 1003) _ ఈ రెండు పరిణామాలు జరిగాయి. వీటికి కవిత్రయ యుగం కావ్యభాషలో ప్రవేశ౦ కలగలేదు.

(3) ప్రశ్నార్థకం : ఎ/ఏ ప్రత్యయాలు. రాజు సామాన్యునిగా వగచితే (భార. 1-1-176), కాముశక్తి నోర్వగలరె జనులు (కు.సం). ప్రశ్నార్థకాలైన ఉండునె, చనునె, కొనునె అనేవి సంయుక్త క్రియల్లో ఉన్నె, చన్నె, కొన్నెగా మారకాయి. 13 వ శతాబ్దం నుంచి 'ఎ' తో పాటు 'అ' ప్రత్యయం వాడుకలోకి వచ్చింది. క్రమంగా ఇది వ్యాప్తిచెంది 'ఎ' లోపించింది. నన్నయ నన్నిచోడులలో 'ఎ' ప్రత్యయమూ, తిక్క.నలో ఎ/ఎ తోపాటు 'ఆ' వాడబడింది.

7.35. విశేషణాలు : తెలుగులో ఇతర ద్రావిడభాషల్లోలాగానే, ఒకే రూపక విశేషణంగాను విశేష్యంగాను వాడే స౦ప్రదాయంకలదు. కనుకనే విశేషణ 'అ' ప్రత్యయంతో కూడిన 'నల్ల' రూపాన్ని నన్నయ 'నల్ల' విశేష్యంగా వాడాడు. నల్ల లేదయ్యెనేని (భార. ఆది). ఇట్లే చిఱ్/చిన్‌ ధాతువుమీద 'అ' చేరగా చిఱ్ ఱ్-అ > చిట్ట. 'చిట్ట వెదుళు' లని నన్నిచోడుని ప్రయోగం (కు. సం. 12.121): చిన్న; ఇ ప్రత్యయంతో 'చిట్టి', చిన్ని రూపాలు. సామ్యంవల్ల 'టి' ఇతర శబ్దాలపై చేర పిన్నటి, తక్కటి రూపాలేర్పడ్డాయి. పిన్నటి నవ్వు (కు. సం. 8.10), తక్కటి పుత్రులు (భార.) వండెడు/వండెడి ఇత్యాది తద్ధర్మక ధాతుǽ విశేషణం వ్యవహారంలో 'టి' ప్రత్యయం చేర్చుకొని 'వండేటి' 'చేసేటి' రూపాలేర్పడ్డాయి. వండే, చేసే మొ వి. కవిత్రయయుగం తర్వాత కావ్యభాషలోకి ఎక్కినాయి.

పేర్వాదులకు అచ్చు పరమైప్పుడు టుగాగమం విభాషగా అవుతుందని బాలవ్యాకరణ సూత్రం. పేరురము, 'పేరుటురము. ప్రాచీనకావ్యాల్లో టుగామం రాని రూపాలే అధికం. -ట్‌- సామ్యంవల్ల వీటిలో చేరిందని చెప్పబడిందికదా.

ఉదంతస్త్రీసమాలకు పరుష సరళాలు పరమయినప్పుడు నకారాగమం రావటం కావ్యభాషలో కంటే శాసనభాషలో ప్రచురంగా కనబడుతున్నది. కావ్య భాషా పరిణామం 237

(HGT, 132), ఉదా: పువ్వుంతోంట, పూందోంట, నల్లంజెఱ్వు, గొఱ్ఱెం గదుపులు.

మహద్వాచకాలపై కూడా ఈ ఆగమం చేరడం శాసనభాషలో కనబడు తూంది. ఉదా: గంగమారాణి కూతురుం చింగాసాని (SII VI 777, విశాఖజిల్లా, క్రీ.శ. 1461).

7.36. క్రియావిశేషణాలు : ఆ, ఈ, ఊ అనే సర్వనామ ప్రాతిపదకల నుంచి ఏర్పడ్డ క్రియా విశేషణ రూపాలు ఎన్నో, అక్కడ, ఇక్కడ, అప్పుడు, ఇప్పుడు ఇత్యాదులు వాడుకలో ఉన్నాయి. ఆ, ఈ, ఏ (త్రికం)తోపాటు ప్రాచీన ద్రావిడభాషలో మాధ్యస్థాన్ని బోధించే 'ఉ' ప్రాతిపదిక ఒకటి ఉండేది. దీని నుంచి ఏర్పడ్డ 'ఉల్ల' (అల్లదుగో,ఇల్లిదిగో -అనే వాటిలో స్థలవాచకాలైన అల్ల, ఇల్ల రూపాలవలె) రూపాలకు భారత ప్రయోగాలున్నాయి.

కావ్యభాషలో క్రియావిశేషణాలగు అవ్యయాలకు ఉదాహరణాలు : మొగి, ఒయ్య, నెమ్మి, ఓవి, క్రచ్చఱ, పరువడి. శాసనాల్లో ఇటువంటివి కనబడవు. వస్తు భేదం కారణం కావచ్చు.

ఔపమ్యాన్ని బోధించే అవ్యయాలు : కరణీ, భంగి, మాడ్కి, నడువు, పోలె-ఇత్యాదులు. రెండేసి రూపాలు కూర్చి చెప్పడంకూడ కావ్యాల్లో కనిపిస్తూంది. కుమారసంభవంలో ఉదాహరణాలు : అట్టువోలె, కరణిలోలె, చాడ్పునవోలే, తెఱగవోలె, పగిదివోలె, పొలుపువోలె, భంగివోలె, మాడ్కి వోలె, వడువువోలె,

సంస్కృత రూపాలు అనంతర యుగమందలి కావ్యాల్లో అధికంగా ప్రవేశిం చాయి; ఉదా : వృధా శపింతురే (మనువ.) శాసన భాషలో - ఈ యుగాని చెందిన దానిలో - ఉదాహరణాలు కలవు. నివేద్యానకు త్రివాదా ..... ఇస్తిమి (SII VI 46, కర్నూలు జిల్లా).

ఈ క్రింది రూపాల్లో కనబడే క్త్వార్ధకాల వాడుకవిధానం తెలుగు జాతీయ మనే చెప్పాలి. నన్నయ : వందురి వగచుచున్న (భార. 1-5-30), వ్రచ్చివధింతు గాక (పై. 1-6-201), వ్రచ్చి వంతఱలాడు (పై. 1-2-101), పట్టిపాలా ర్పగనేల, వగచి వనరుచుండె (పై. 7-209). 238 తెలుగు భాషా చరిత్ర

నామాల నుంచి క్రియా విశేషణాలను నిష్పన్నం చేయటానికి అగుధాతువు అన్నంత రూపం 'కాన్‌' చేర్చబడుతోంది. 'కాన్‌' > - గాన్, కన్‌, గన్‌. క్వాచిత్కంగా కావ్యభాషలో నామం ఈ సహాయక క్రియారూపం లేకుండానే క్రియావిశేషణంగా వాడటం కనబడుతోంది. నన్నయ : అమరభావంబున సుఖంబు జీవి౦తురటె. (భార. 1-4-151), అరుంధతి సహితంబు నిరంబరలయి (కు.సం. 10-31).

నన్నయాది ప్రాచీన గ్రంథాల్లో ధ్వన్యనుకరణ శబ్దాల.కొన్నిటి వాడుక జాతీయం అనాలి. మలమల మఱ౦గుచు (భార. 1-3-111); వడవడంకుచు (1-2-55); వడవడవడకుంచు (1-2-55). ఇట్టి వాడుక సర్వత్ర ఉంది. కొన్ని కొన్ని వాడుకలు మాత్రం ఇప్పుడు మారాయి. ప్రకరణం 8

కావ్యభాషాపరిణామం

(క్రీ. శ. 1600 - 1899)

-బి. రామరాజు

8.0. ఆంధ్రభాషా సాహిత్యాల చరిత్రలో క్రీ. శ. 1600-1800 సంవత్సరాల నడిమికాలం ఒక విధంగా పరిణామాత్మకమైనది. రాజకీయంగా ఒక మహా సామ్రాజ్యం అంతరించి చిన్నచిన్న రాజ్యాలు సంస్థానాలు స్వతంత్రించి తలయెత్తినట్లే సాహిత్యంలో అనుస్యూతంగా వస్తున్న మార్గాన్నివదలి ఈ కాలంలో నూతన ప్రక్రియలు వాటికి తగిన భాషకూడా తలయెత్తినవి. కొందరు సాహిత్య చరిత్రకారులు ఈ యుగాన్ని క్షీణయుగం అన్నారు. కాని ఈ యుగాన్ని ఇంత చిన్నచూపు చూడనవసరం లేదు. తెలుగువాడు తెలుగు పొలిమేరలు దాటి చాలా దూరంపోయి ప్రకియావైవిధ్యంతోను సరికొత్త నడతలతోను నుడులతోను సంగీతమూ నృత్యమూ తోడుగా వివిధ హావభావాలు ప్రదర్శించినది ఈ యుగంలోనే. ఇరుగుపొరుగు సాహిత్యాలను బాగా ఆకళించుకొన్నది ఈ కాలంలోనే. పూర్వం సాహిత్యవ్యాసంగం ఎక్కువగా ఏవో ఒక వర్గానికి పరిచితమై ఉండేది. కాని స్త్రీపుంస వివక్షలేకుండా కులమత వివక్షలే కుండా ప్రక్రియావైవిధ్యంతోపాటు భాషాచ్చందో వైవిధ్యమూ స్వాతంత్ర్యమూ ప్రకటించిన కవిపండితులు వర్థిల్లినకాలం ఇదే. ఈ కాలపు భాషా విశేషాలు పరిశీలించటానికి తెలుగుదేశంలోని కవుల రచనలేకాక మధుర, తంజావూరు మొదలైనచోట్ల, తెలుగుదేశం బయట వర్ధిల్లిన తెలుగుకవుల రచనలుకూడ గ్రహించటం జరిగింది. యక్షగానాలు, నాటకాలు, పదకవితలు, వచనకృతులు వేరొక ప్రకరణంగా విభజించటంవల్ల ఇందులో కేవలం పద్యకృతులను ద్విపదలను మాత్రమే పరిశీలించటం జరిగింది. ఈ ఇన్నూరేండ్లలో నూర్లకొలది కవులున్నూ ముఖ్యులైన కొందరిని మాత్రమే పరిశీలనకోసం ఎంపిక చేసుకొన్నాను. ఆంధ్ర దేశ౦లోని వివిధ ప్రాంతాలవారే కాక ఆంధ్రేతర ప్రాంతకవులు కూడ ఇందులో 240 తెలుగు భాషా చరిత్ర

ఉన్నారు. కాబట్టి వారి రచనలలో ఆయా ప్రాంతాల మాండలికాలు యాసలు చోటు చేసుకొన్నవి. ఈ కాలపు రచయితలు లాక్షణికులుగానీ, కేవలం కవులుగానీ తమ తమ రచనలలో గ్రామ్యమనీ పాత్రోచితభాష అనీ ఆనాటి శిష్టవ్యావహారీకాన్ని శిష్టేతర వ్యావహారికాన్ని ప్రయోగించినారు. ఇందువల్ల మనకు ఆనాటి వాడుకభాష ఎట్లాఉండేదో కొంత మచ్చుకైనా తెలుస్తుంది. ఆయా కవులు వాడిన అన్యదేశ్య పదాలలో మన భాషలోలేని వర్ణాలు కొన్ని కనుపడుతవి. ఆయా అన్యదేశ్య వర్ణాలకు సన్నిహితంగా ఉండే మన వర్ణాలనే వాళ్ళు వాడినారు. మరి ఆనాటి ఉచ్చారణ ఏ విధంగా ఉండేదో మనం ఊహించలేము.

వర్ణసమామ్నాయం

8.1. వర్ణాలలో అచ్చులకు సంబంధించినంత వరకు అ ఆలకు ఎ ఏ లకు నడిమి ఉచ్చారణం కలిగిన అ ఆ లు ఉన్నట్లు ప్రయోగాలవల్ల తెలుస్తున్నది. ఐతే వీటికి ప్రత్యేక వర్ణాలగుర్తులు మాత్రం మన వర్ణసమామ్నాయంలో కల్పించుకోవటం జరుగలేదు. ఇత్తునకు హ్రస్వ అకారంతో సంధిచేసినప్పుడు హ్రస్వ అకారము, దీర్ఘ అకారంతో సంధిచేసినప్పుడు దీర్ఘ అకారము వినబడుతవి. ఊదా : బంతి + అనున్‌ = బంతనున్‌ (చే. వెం. వి. I.102), అనవలసి + అంటి = అనవలనంటి (చే. వెం వి I 161), ఒసంగి + అని= ఒసంగని (చిం. ఛా రా. IV. 9), క్రుంకి + అడిగ = క్రుంకడిగె (పా. క. శు. II. 235), నాగవల్లి + అట = నాగవల్లట (పా. క. శు. II.168), ఇన్ని + అని = ఇన్నని (కా.మ.ష II.8), సవతి + అని = సవతని (అ. కా.I 203), సారథికుంటి + అని = సారథకుంటని (చి. సిం. బి.) కన్నతల్లి + అడిగిన = కన్నతల్లడిగిన (ప. రం. ఉ.I.40) మొదలైనవి. ఈ ప్రయోగాలన్నిటిలోను వినపడేది హ్రస్వ అకారం.

ఇక తాటాకువంటి పదాలలో వినబడే దీర్ఘ అకారానికి సంబంధించిన ప్రయోగాలుకూడ ఈ కావ్యాలలో చాలా లభిస్తున్నవి. ఉదా : మెంతి + ఆకు = మెంతాకు (అ.నా.హం. IV. 133), చెవులుపట్టి + ఆడించు = చెవులు పట్టాడించు (చే. వెం. వి.II. 106), ఎటి+ ఆవల = ఏటావల (చే. వెం. సా.), ఊడి + ఆడ = ఊడాడ (కూ. తి. న IV. 47), మోవి + ఆనవలదె = మోవానవలదే (ప. రం. ఉ. I 56), కిళ్ళి + ఆకు = కిళ్ళాకు (స. వెం. రా. I.67), చనుదెంచి + అనాదమాలించి = చనుదెంచానాదమాలించి (కా. అ. ఆ. పీఠిక. 5), కలికి+ కావ్యభాషా పరిణామం 241

అదిని = కలికాదిని (కా.ఆ.అ. పీఠిక.90), నీతండ్రి + ఆన = నీతండ్రాన (ఆ.కా. II. 71) మొదలైనవి. ముత్తేల హారములను (చెం. కా. రా. II 33), కడేలు (కూ. జ. చం. II-88) వంటి శబ్దాలలోని ఏ కారం ధ్వనికూడ ఇటువంటిదేకావచ్చు.

8.2. ఋకారం మనకు తత్సమశబ్దాలలో మాత్రంరావలె. ఇది, సంస్కృత వర్ణసమామ్నాయంనుండి తెలుగుకువచ్చిన అచ్చు. కాని అహోబలపతివంటి లాక్షణికుడే ఈ వర్ణాన్ని దేశ్యపదంలో వాడినాడు. బ్రుంగి అని రేఫతో చెప్పవలసిన మాటను యతికోసం కాబోలు 'బృ౦గి తపించి తత్తనువువీడిన' (అ. కా. I.291) అని ప్రయోగించినాడు. దీనిని విశేష ప్రయోగంగానే గ్రహించాలె, లేదా 'ఋ' కారానికి ఉండే విశిష్టమైన ఉచ్చారణ జారిపోయి 'రు' ఉచ్చారణతో సమానమై పోయిందనుకోవాలె.

అన్యదేశ్యాలలో వచ్చే వర్ణాలుతప్ప హల్లులగురించి ఈ యగంలో చెప్పుకోవలసిందేమీలేదు. సాధురేఫానికి శకటరేఫానికి ఉన్న భేదం ఉచ్చారణలో ఎన్నడో నశించిపోయింది. కనుక ఈ యుగానికంటె ప్రాచీనుల రచనలలోనే ఒక రేఫానికి మరొక రేఫం కనుపడుతవి. ఈ కాలపు కృతులలోకూడ ఇటువంటి తబ్బిబ్బులు చాలా ఉన్నవి.

8.3. తెలుగుపై ఫార్సీ, అరబీభాషల ప్రభావం కాకతీయ సామ్రాజ్య పతనానంతరం ప్రారంభమై బహ్మానీ రాజ్యస్థాపనతో బలపడి, ఖుతుబ్షాహి పాలనతో స్థిరపడింది. శ్రీనాథుని కాలంనుండి మన కావ్యాలలో ఈ భాషలపదాలు దినదినం పెరుగుతున్నవి. ఈ అన్యదేశ్యాలలో వచ్చే f, x, y, z వర్ణాలకు సామ్యంకలిగిన పఫ, కఖ, గ, జ వర్ణాలనే తెలుగుకవులు వాడినారుకాని మన వర్ణమాలలో ప్రత్యేకంగా వేరేగుర్తులు చేర్చలేదు. ఈ ధ్వనుల ఉచ్చారణలో వాటి మోలికతను మనవాళ్ళు కాపాడినారో లేదో తెలియదు. ఫార్సీ, అరబీ వర్ణమాలాధారం గల ఉర్దూ, రాజ భాషగా 1948 నాటి వరకూ తెలంగాణంమీద ప్రభుత్వం నెరపింది కనుక పైన పేర్కొన్న అన్యదేశ్య వర్ణలను ఉచ్చరించేటప్పుడు తెలంగాణంవారు ఇప్పటికీ వాటి మౌలికధ్వనులను కాపాడుతున్నారు కాని తెలంగాణం బయటమాత్రం ఆ వర్ణాలతో సామ్యంకలిగిన తెలుగువర్ణాలనే వాడుతున్నారు. చాళుక్యసీమ రాయలసీమలలో నూరు నూటయాబై యేండ్రుగా ఫార్సీ, అరబీ ప్రభావం తగ్గినదేకాని అంతకుపూర్వం ఆంధ్రదేశం అంతా ఆ ప్రభావానికి లోనైనదే. ఆ ప్రభావానికి లోనైన తరాలుగడచి

(16) 242 తెలుగు భాషా చరిత్ర

పోగా తరువాతి తరాలవారు మాత్రమే వాటితో సామ్య౦కల మన వర్ణాలను ఉచ్చరించినట్లు పలుకుతున్నారేకాని ఆయా విదేశీ భాషలను ఎరిగినవాళ్ళు ఉన్న దినాలలో వాటి మౌలికత ఉచ్చారణలో చెడిపోకుండా ఉండేదని మనం భావింపవచ్చు.

f (ڦ) వర్ణాన్ని ఈ యుగపు కవులు 'ఫ'తో గుర్తించినారు. ఇది దంత్యోష్ట్యమూ నాదవిరహితమూ ఐన ఊష్మ౦. తేలుగుకవులు మాత్రం దీనికి మారుగా ఓష్ట్యమూ నాదవిరహితమూ మహాప్రాణమూ ఐన స్పర్శం వాడినారు. ఉదా: జాఫరాజినుఁగు లేపునజెందు (అ. నా. హం. I. 240), కొలఁకు జక్కన ఫౌఁజు లెలసిరే య (కూ. తి. ర. III, 94), ఫిరంగీలు (స. వెం. అ. II. 95) మొదలైనవి.

x (ڂ) వర్ణాన్ని మనకవులు క, ఖ లతో సూచించినారు. ఇది కంఠ్యమూ నాదవిరహితమూ ఐన ఊష్మం. మనవాళ్ళు మాత్రం దీనికి మారుగా నాదవిరహితమైన మహాప్రాణ కంఠ్య స్పర్శాన్ని అల్పప్రాణ స్పర్శాన్ని ఉపయోగించినారు. అన్యదేశ్యాలలో ఈ ధ్వనిగలవి వ్రాతలో (ڂ) (ڧ) రెండు వర్ణాలన్నవి. అరబీ, ఫార్సీ మాతృభాషగా కలవాళ్ళు ఈ రెంటినీ వేరువేరుగా ఉచ్చరిస్తారేమో కాని మన దేశ౦లో ఉర్దూ మాతృభాషగా కలిగిన ముస్లి౦లు మాత్రం వ్రాతలో వేరువేరుగా గుర్తించినా ఉచ్చారణలో మాత్రం ఒకే విధంగా ఉచ్చరిస్తారు. మన పండితులు శకటరేఫను సాధురేఫను వేరువేరుగా వ్రాసి ఉచ్చారణలో భేదం పాటించనట్లే పై వర్దాలగురించి ముస్లింలు ఉర్దూభాషాపండితులు వ్రాతలో భేదం పాటించి ఉచ్చారణలో భేదం పాటించటంలేదు. ఈ ధ్వనులుగల అన్యదేశ్యపదాలను ఈ కాలపు కవులు చాలా వాడినారు. ఉదా. జాపత్రియను గురాసాని యోమంబు (వి. నా. రా. పుట. 57). ఇందులో ద్రుతం మూలంగా కు, గు గా మారింది. జమా ఖరుచుల్‌ గణించి (అ. నా. హం. I 142), కలయఁగ ఖుశాలు వచ్చు (అ. నా. హం. V. 182). ఖుశాలు పదంలోని శవర్ణానికి మారుగా షవర్ణం వాడవలసి ఉండె. మౌలికంగా అది మూర్దన్యమైన ఊష్మం. ఖరుచుసేయుచు (లిం. శ్రీ. స. I 104), బందిఖానా (లిం.శ్రీ.స. IV 118), ఖబురు (లిం.శ్రీ.స.IV. 14) ఇదే మాటను ఈ కవే మరొకచోట ప్రాసకోసం కపురు (IV. 180) గా వాడినాడు. నకసీపని (లిం. శ్రీ. స. I. 30), నకాసిగుడారు (లిం. శ్రీ. స. III 4) అన్నప్పుడు కూడా 'క' వర్ణమే వాడినాడు.

y (ݟ) వర్ణాన్ని మన కవులు 'గ' తో సూచించినారు. ఇది నాదాత్మకమైన కంఠ్యోష్మము. కాని మనవాళ్ళు నాదాత్మకమైన కంఠ్య స్పర్శంగా ఉచ్చరిస్తున్నారు. కావ్యభాషా పరిణామం 243

ఉదా. మొగలీ వజ్రీడు (లిం. శ్రీ. స. III 54). నిత్యవ్యవహారంలో వచ్చే అన్య దేశ్యాలు గరీబు, గలీజు, గలీబు మున్నగు పదాలలో వచ్చే వర్ణం ఇదే.

z (ں) వర్ణాన్ని తెలుగు 'జ' తో ముడిపెట్టినారు. ఇది నాదాత్మకమైన దంతమూలీయోష్మం. కాని మనవాళ్ళు నాదాత్మకమైన తాలవ్య స్పర్శంతోనే సరిపెట్టుకొన్నారు. ఫార్సీ, అరబీ భాషలలో ఈ ధ్వని సామ్యం కలవి (ڌ), (ڋ), (ڞ) (ڟ) నాలుగు వర్ణాలున్నవి. ఇందులో (ݬ), (ڟ), (ڞ) ఈ మూడు వర్ణాల ఉచ్చారణ మరీ సన్నిహితంగా ఉంటది. వాటిలోని సూక్మభేదాన్ని ఆ యా భాషలు మాతృభాషగా కలవాళ్ళు గుర్తిస్తారేకాని ఉర్దు మాట్లాడేవారు కూడ వ్రాతలో భేదం పాటించినట్లు ఉచ్చారణలో భేదం పాటించరు. (ݬ) వర్ణాన్ని మాత్రం కొంచెం భేదంగా ఉచ్చరిస్తారు. తెలుగువాళ్ళు మాత్రం ఈ నాల్గింటిని 'జ' లోనే కలిపినారు. ఈ యుగం కవులు ఈ వర్ణాలు వచ్చే అన్యదేశ్యాలను అధిక సంఖ్యలోనే వాడినారు. ఉదా. పంచదారను దిను బాబా వజీరు (వి.నా.ర.పుట. 45), కమ్మగేదగి నేజ గైకొని మరుడు (వి. నా. ర. పుట. 63). వాలుగల సవాలు (సు. మా. చం.II 58), పంచాంగములు చెప్పి బజారు లోపల (అ. నా. హం.II 153), ఉరుబాబు (చిం. ఛా. రా. IV 181), జులుముల సందడుల్‌ (స. వెం. రా. I 110), హుజురు పాటకు (లిం. శ్రీ. స. IV 60), రాచ వజీరు (లిం. శ్రీ. స. II 8).

నామ ప్రత్యయాలు

8.4. ప్రథమైకవచన ప్రత్యయం చేరటంలో ఈ యుగపు సాహిత్య భాషలో కొంత వైవిధ్యం కనుపిస్తున్నది. అవ్యాకృత రూపాలైన వీటికి నాటి మాండలిక వ్యవహారమే ఆధారమై ఉండవచ్చు. వ్యాకరణం ప్రకారంగా మహదేక వచన ప్రత్యయం డుజ్‌ రావలనిన చోట్లకూడ అది రాని సందర్భాలు కొన్ని ఈ కాలపు కావ్యాలలో ఉన్నవి. ఉదా. చండు మున్నగు గ్రహోచ్చయములు (కం. నా.వి. III 50). దీనికి విరుద్ధంగా డుజ్వర్థతం రాగూడని స్థలాలలో వచ్చిన నిదర్శనాలు ఉన్నవి. అందులోను ఇవి అన్యదేశ్యాలలో రావటం మరొక విశేషం. ఉదా. వజీరుండు (స.వెం.అ. I 52), మొగలీ వజ్రీడు (లిం. శ్రీ. స. III 54). నిజంగా ఇక్కడ ఉత్వమేచాలు. డుజ్వర్జకం కాప్రత్యయంతో కలిసి అనుద్ధిష్ట శబ్దాలలో కనుపించటం ఇంకొక ప్రత్యేకత. ఉదా. కైవల్యంబునకుం గాణాచి కాండ్లగు (పా. కా.శు. IV 162). తలారి కాండ్లు (కా. అ. అ.II 196). ఈ 244 తెలుగు భాషా చరిత్ర

కాలపు కావ్యాలలో అమహదేకవచన ప్రత్యయం 'ము' వైకల్పికంగా వచ్చే అసాధారణ పదాలు కొన్ని కనుపిస్తవి. ఉదా. క్రొత్తసూరెపుటంపుగుఱుచ గద్దిగము (వి. నా. ర. పుట. 30). చిన్నయసూరిగారిని (అచ్చిక. 2) అనుసరించి దీనిని క్లీబసమంగా ఎంచుకొని 'ము' వచ్చిందని సమర్థింపదలచుకొంటే ఈకవే మరొకచోట కటికవారలు పల్క గద్దిగ డిగ్గి (వి.నా.ర పుట. 307) అని ప్రయోగించినాడు. ఒకే పదాన్ని ఒకచోట స్త్రీసమంగాను మరొకచోట క్లీబసమంగాను చెప్పుకోవటం బాగుండదు. ఛందోనిర్బంధం మూలంగానో, నాటి వ్యవహార బలం చేతనో కవి ఆవిధంగా ప్రయోగించినాడనుకోవాలె. ఇదే విధంగా ప్రాచీన కావ్యాలలో 'సయ్యాట'గా ఉన్న మాటకు ప్రబంధకాలం నుండి 'సయ్యాటము' అనే రూపాంతరం కనుపిస్తున్నది. ప్రకృత పరిశీలనలో ఉన్న యుగంలోకూడ లాక్షణికులైన కవులే ఈ మాటను 'ము' ప్రత్యయంతో వాడినారు. ఉదా. సయ్యాటములను (అ. కా. II 89). 'ము' ప్రత్యయం లోపించిన పదాలు కూడ కనివిస్తవి. ఉదా. బలిమినైనను దీనిబట్టి భోగింప వలయుఁగా కిఁక డాఁప వశగాదు మమత (కం.నా.వి. IV పుట. 91). చందాల సంసర్గ సలిపినావు (కా.మ.ష IV 98). వశము, సంసర్గము అనవలసినచోట్ల వశ, నంసర్గ అనటం జరిగింది. చిన్నయ సూరిగారి "చరిత్రాదుల మువర్ణకంబునకు లోపంబు బహుళంబుగానగు” (తత్సమం-59) అనే సూత్రంతో వీటిని సవరించుక పోవచ్చునుగాని వీటికి అంత గొప్ప 'చరిత్ర' లేదేమో. పులకలు అనివలసినచోట పులకములు అని మువర్ణం చేరిన ప్రయోగాలుకూడ ఉన్నవి. ఉదా: మురుపున రూపుమై పులకముల్‌ మెఱసెన్‌... ద్విరేఫముల్‌ (ప. రం. ఉ. III 30). శబ్ద రత్నాకరకారుడు 'పులకము' అనే మాటకు వేరే అర్దాలిచ్చినాడు కాని గగుర్పాటు అనే అర్థం ఇయ్యలేదు. గగర్పాటు అనే అర్ధం 'పులకలు'కు ఇచ్చినాడు. మీదుమిక్కిలి "తెఁనుగున నిది స్త్రీసమముగాను బహువచనాంతముగాను బ్రయోగములం జూపట్టెడు” అన్నాడు. నాటి సాహిత్యభాషలో ఉదంత ఆమహచ్చబ్దానికి వు గా గమం వచ్చిన విశేషరూపమొకటి దొరుకుతున్నది. ఉదా: కల్గెను బోతువచ్చటన్‌ (అ.నా. హం.V 33). 'ము' ప్రత్యయం స్థానంలో వైకల్పికంగా వు గా గమం వచ్చిన రూపాంతరం మరొకటి లభిస్తున్నది. ఉదా. పుట్టువును కాలమును కర్మవును (క.వ. రా. vol. II పుట. 233). ధర్మువు వలె కర్మువుకూడా వ్యాకరణం ప్రకారంగా సాధువేకాని ప్రయోగబాహుళ్యంలేదు. తత్సమశబ్దాలలో నిత్యమైన వుగాగమం లోపించిన నిదర్శనాలుకూడ ఉన్నవి. ఉదా. అంబు మ్రింగిన తప్త కావ్యభాషా పరిణామం 245

లోహంబు కరణి (చి. సిం. బి. I 149), శ్రమాంబు చెక్కులన్‌ (అ.కా. II 48). 'అంబువు' అనవలసినచోట పై ఉదాహరణలలో చిత్రకవి సింగరార్యుడు, అహోబలపతి 'అంబు' అన్నారు. తత్సమ పదాంత వుగాగమం బహువచనానికి ముందు లోపించిన ఒక విశేష ప్రయోగం నాటి కావ్యభాషలో లభిస్తున్నది. ఉదా. వస్తు లెవ్వని యి౦ట విస్తరిల్లు (బి. తి. అ. I 78, 117). ఐతే "పునర్ణకేతర విభక్తి పరమగుచోనుకారాంతంబులకు బహుళంబుగా గోశబ్ధంబునకు నిత్యంబుగా వుగాగమంబగు" (తత్సమ-49) సూత్రంతో దీన్ని కూడ సరిపెట్టుకోవచ్చునేమో.

8.5. సమాసగతమై ఇకారాంతమైన 'తోడ' ప్రత్యయానికి రూపాంతర మైన 'తోడి'కి వ్యావహారిక రూపం 'తోటి' నాటి కావ్యభాషలో స్థానం సంపాదించుకొన్నది. ఉదా: హరియించును తోటి హాలహలముంబోలెన్‌(చిం.ఛా.రా. IV. 157).

8.6. పంచమ్యర్థంలో వాడే 'ఉండి'కి వ్యవహారంలో వినిపించే 'నుంచి' నాటి కావ్యభాషలో కనుపిస్తున్నది. 'పూని వదాన్యులంచు౦దమ భూముల నుంచి (చిం. ఛా. రా. III 64). చిన్నయ సూరిగారు దీనిని 'సాధుకవి ప్రయోగారూఢంబు గాదని యెఱుంగునది' (కారిక-11. కారిక) అన్నారు. పంచమీ విభక్తి ప్రత్యయం 'వలన'కు వ్యావహారిక రూపాంతరం 'వల్ల' ఈ యగంలో చాలామంది కవులు వాడినారు. ఉదా. 'కల్ద నావల్ల గోరంత గలిగెనేని' (చే. వెం. సా. II).

8.7. షష్టీ ప్రత్యయమైన 'కు' కు ముందు నగాగమం స౦ప్రదాయ వ్యాకరణ విధేయం. 'కువర్ణకంబు పరంబగునవుడు కార ఋకారంబులకు నగాగమంబగు' (తత్సమ-28) అని చిన్నయనూరిగారు. కాని నాటి కావ్యభాషాలో నగాగమం రాని రూపాలు అనేకం. ఉదా : 'నీ మనసుకె తోఁచివచ్చు ననుమానము లేదిక' (చిం. బా. రా. III. 168), 'ఆర్తరక్షణ బిరుదుకు హానివచ్చు' (గో.కూ.సిం.పద్యం. 16), 'శేషుకైన' (రె. మ. గం. II. 115). షష్టిప్రత్యయం 'లోపల' అనుదానికి 'లో' రూపాంతరం. దీని దీర్ఘానికి తెలంగాణం వ్యావహారికంలో హ్రస్వం రావటం హెచ్చు. ఈ హ్రస్వరూపం కూడి నాటి కావ్యభాషలో కనుపిస్తున్నది. ఉదా. 'వార్టిలొ' (రె. మ. గం. II 166).

8.8. 'ఒద్ద' అనే అర్ధంలోని 'కడ' అనుబంధానికి వ్యావహారిక రూపమైన -కాడ అప్పకవీయంలోనే దొరుకుతున్నది. ఉదా. నా కాడ (పుట 126). ఐతే 246 తెలుగు భాషా చరిత్ర

దీనిని అప్పకవి గ్రామ్యానికి ఉదాహరణంగా చెప్పినాడు. 'ఒద్ద' కు ఔపవిభక్తిక రూపం 'ఒద్ది' అనే మాటకూడ కావ్యాల కెక్కింది. ఉదా : 'నీరజనాభుఁడొద్ది తరుణీతతి' (ప. రం. ఉ. III. 118).

8.9. మహద్బహువచనంలో అదంత దీర్ఘ పూర్వలోపధం కాని శబ్దాల మీద కూడ 'రు' ప్రత్యయం నాటి కావ్యాలలో కనుపిస్తున్నది. ఉదా : 'సూతుర నదలింపుచు (చిం. ఛా. రా. VI. 103). ఇది ప్రాస స్థానంలో ఉన్నది. 'కూతు శబ్దము ప్రథమైక వచనంబునకు రు వర్ణ౦బగు (అచ్చిక-9) అని చిన్నయ సూరి గారి అనుశాసనం. సూరిగారు కుతురులు, కూతుళ్ళు, కూతురి అనేవి గ్రామ్యాలన్నారు. ఐనా వ్యవహారబలం మూలంగా మహాకవుల కృతులలోనే వాటికి ప్రయోగాలున్నవని కీ. శే. గిడుగు రామమూర్తి పంతులుగారు తమ బాలకవి శరణ్యంలో నిరూపించినారు. ఈ యుగంలో వర్ధిల్లిన లాక్షణికకవి అహోబలపతి కూడా 'సొంపుల కూఁతురి' (అ. కా. II. 104) అన్నాడు.

అమహద్బహువచన రూపాలలో నాటి కావ్యభాషలో ఈ కింది సంధిగత రూపాలు కనిపిస్తవి. ఇవి వ్యవహారభాషకు సన్నిహితంగా ఉంటవి.

-డ్ (అచ్చు) + లు >- ళ్ళు

'మూడు లక్షల మాళ్ళకు, నలభై యొకవేల మాళ్ళు' (వి. నా. ర. పుట.27). 'ఒళ్ళలోఁ గడితంబు లొప్పుగా మనిచి' (వి. నా. ర, పుట, 51), వంకలను, డొంకలను బీళ్ళ, వాళ్ళ, గుప్పలను, దిప్పలను, మళ్ళ, గుళ్ళ, నూళ్ళ (అ. నా. హం. I. 189), గుళ్ళు పంచల పసుల గాళ్ళను (రె. మ. గం. II. 177).

-ర్ (అచ్చు) + లు > - ళ్ళు దాసళ్ళు (మ. రె ష. V. 14)

పైళ్ళు (కా.మ. ష, 11. 42).

-(దీర్ఘాచ్చు) + లు > - ళ్ళు ఱాాళ్ళ (అ. నా. హం. I. 189),

దీర్ఘా౦తమైన అన్యదేశ్యాల తుది ఇకారానికీ బహువచంలో ఉకారాదేశం రాకపోవటం వ్యవహారభాషాపద్ధతి. దీనికి నాటి కావ్యభాషలో నిదర్శనం. దొరుకుతున్నది. ఉదా. ఫిరంగీలు (సం వె. అ. II. 95). సూరిగారు 'ఇత్తునకు బహువచనంబు పరంబగు నపుడుత్వంబగు' (తత్స. 45) అని తపరకరణం చేయటంతో శ్రీలు, స్రీలు, లకోరీలు మున్నగు వాటివలే ఫిరంగీలు కూడ సాధువే. కావ్యభాషా పరిణామం 247

8.10. సంప్రదాయ వ్యాకరణం ప్రకారంగా ఔపవిభక్తికాలైన వాటిని అనౌపవిభక్తికాలుగాను, అనౌపవిభక్తికాలను ఔపవిభక్తికాలుగాను నాటి కవులు ప్రయోగించినారు. దీనికి కవుల భ్రమప్రమాదాలే కాక నాటి వ్యవహారబలం కూడ కారణమై ఉండవచ్చును.

ఔపవిభక్తికాలు అనౌపవిభక్తికాలుగా :-

ఉదా : చేరంజని మఱుననాడు ( = మఱుసటినాడు) (అ.నా.హం. VI.202) నొసల మేల్సొగసులీల ( =నొసట) (కూ. తి. ర. I. 84) పదములెగయంగ వర్ణముల్మొదలికేగ (మొదటి)(కా.మ. ప.III. 45).

అనౌప విభక్తికాలు ఔప విభక్తికాలుగా :-

అవని చెంగట నామటిమేర (ఆమడ) (క. వ. రా. Vol. II.పుట. 35) పోలుగ వాతాపి పొట్టేటిఁజేసి (పొట్టేలు) (క. వ. రా. Vol. II. పుట. 37) అడుగిటి లోనబట్టు (అడుగులోన) (కా. మ. ష. II 66) నేతిడి నెఱ్ఱగా వేఁచిన వేఁపుడు (నేయిడి) (కా. మూ. పాం. IV.4) పనసపంటికి మంచి పసయోడఁ గూర్పక (పండుకు) (కూ.తి.న. III 40)

సంధి

8.11. త్వరిత సంభాషణలో వినిపించే అచ్సంధులూ హల్సంధులూ నాటి కావ్యభాషలో చాలా ఉన్నవి. వీటిలో లాక్షణికులు అంగీకరించని తత్సమాచ్సంధులూ, శృతర్థకసంధులూ, ద్రుతప్రకృతిక సంధులూ, క్త్వార్ధక సంధులూ ఉన్నవి. ఒక్కొకచోట తత్సమ శబ్దాలకు తెలుగుపద్ధతిలో సంధిచేసిన ఉదాహరణలు కూడా ఉన్నవి. లాక్షణికులు అంగీకరించని ఈ సంధులు చేసినవాళ్ళంతా సాధారణ కవులుకారు. కొందరు లాక్షణికులనిపించుకొన్నవారు మరికొందరు మహా కవులు అనిపించుకొన్నవారు కూడ ఇందులో ఉన్నారు.

8.12. అచ్సంధులు (1) - అ + అ-అ > - :- ఒక + అక్షర = ఒకక్షర. ఒకక్షరమైనను రాదు (పా. క. శు. II 438) 248 తెలుగు భాషా చరిత్ర

కాక + అపూర్వ = కాకపూర్వ, తబ్బిబోకాకపూర్వతనుబిబ్బోకా (చే. వెం. వి. II 191)

తమ + అమ్మ = తమమ్మ. తమమ్మ తామరమోమందలి (చే.వెం.సా. I) కాన + అందు = కానందు. (కానయందు) (చే. వెం. సా. I) వెన్నెల + అతివ = వెన్నెలతివ. వెన్నెలతివ కిచ్చినయట్లు (ప.రం.ఉ.II 45) కథ + అనుసరణ = కథనుసరణ, కలితమన్మథ కథాకథనుసరణ (చెం. కా.రా I 106).

(2) -అ + అ- > ఆ - :-

ఇంక + ఆదేవిని = ఇంకాదేవిని (చె. వె. సా II)

పిదప - అమ్ల = పిదపామ్ల ద్రవ్యముల్‌ (చిం. ఛా. రా II 2249)

(3)-అ + ఇ - > ఇ- :-

తన + ఇచ్చ = తనిచ్చ (ఆ. నాం వాం, గ7. 146)

కాక + ఇచ్చ = కాకిచ్చ. అనెగాకిచ్చవచ్చినది (చే. వె౦. వి.I 25)

ఇక + ఇవి = ఇకిలి వతియాసలికివి (గో. కూ.సిం.ప 41)

(4) -అ + ఈ -> ఈ - :-

కాక + ఈ = కాకీ. ఇదిగాకీచేయు (కం.పా.ఉ III 74)

తప్పక + ఈక్షించి = తప్పకీక్షించి (చే.వెం.సా. I)

(5) -అ + ఎ- > ఎ - :-

సరసత + ఎడలక = సరసతెడలక (అ.కా. I 73)

ఆపద + ఎదిసి = ఆపదెడసి (అ. కా. II 212)

తెల్ల +ఎఱ్ఱ = తెల్లెఱ్ఱజొన్నలు (అ. నా. హం. IV 126)

నరుల + ఎల్ల జ నరులెల్ల. చూచిన నరులెల్లవేడి (కూ.జ.చం.I 60)

(6) -అ + ఐ -> ఐ- :-

చిత్రరేఖ + ఐన = చిత్రరేఖై ననీవేళ (ప.రం.ఉ III 46) కావ్యభాషా పరిణామం 249

(7) -అ + ఒ-> ఒ- :-

చిత్రరేఖ + ఒక = చిత్ర రేఖొకవన్నె (లిం.శ్రీ.స.II 15)

(8) -అ + ఔ - > ఔ  :-

వ్యాకర్త + ఔ = వ్యాకర్తోముని (అ.కా. III 132)

(9) -ఇ + అ-> అ- (అ-) :-

వడఁకి + అటు = వడఁకటునిటు (క.వ.రా.vol.II పుట. 208)

ఈవి + అహిమరుక్‌ = ఎవని యీవహిమరుగ్భవ (అ.నా.హం.I 15 )

దీవించి + అక్షత = దీవించక్షతపుష్ప (అ.నా.హం. I 48)

తెచ్చి + అట = చూచితెచ్చట( గుమార్తె (అ.నా.హం. II 114)

జీవి + అటకు = జీయుధోపజీవటకు (అ.నా.హం. IV 148)

చూపి + అటు = అటుచూపిటు నిటుచూపటు (చే.వెం.వి.II 202)

ఒసంగి + అవి = ఒసంగవి (చిం. భా. రా. IV 9)

క్రుంకి + అడిగె = క్రుంకడిగె (పా. క. శు. I 285)

నిల్పితి + ఇంతవడి = నిల్పితింతవడి (అ.కా. II 230)

అందితి + అనంత = ఉదయమంది తనంత పదంబుగంటి (అ.కా. I 323)

పోయితి + అప్పుడు = పోయితప్పుడు (అ.కా. III 169)

లేచి + అటు = లేచటు (ఆ. వెం. గో. I 20)

తరుణి + అగు = తరుణగు (ఆ. వెం. గో. I 42)

అరుచి + అయ్యె = అన్నమరుచయ్యె (రె. మ. గం. II 257)

వచ్చి + అరవ్రాలి = వెన్కకువచ్చరవ్రాలి (లిం.శ్రీ.స. III 102)

నేర్చి + అన్వయము = అన్నియునేర్చన్వయమునకు (లిం.శ్రీ.స. IV (16))

(10) -ఇ + అ-> ఆ- (ఆ-) :-

మెంతి + ఆకు = మెంతాకు (అ. నా. హం. IV 183)

పట్టి + ఆడించు = చెవులుపట్టాడించు (చే.వెం.వి. II 106) 250 తెలుగు భాషా ఛరిత్ర

ఏటి + ఆవల = ఏటావల (చే.వెం.సా. II).

ఊపి + ఆడుచు = ఊపాడుచు (చిం.ఛా.రా V 135)

ఊడి + ఆడ = ఊడాడ (కూ.చి.స. IV 47)

త౦డ్రి + ఆన = తండ్రాన (అ.కా. II 71)

చనుదెంచి + అనాదము = చనుదెంచా నాదమాలించి(కా.ఆ.అ. పీఠిక. 5)

కలికి + ఆదీని = ఈ కలికాదిని (కా. అ. అ. పీఠిక. 90)

మనవి + ఆలకించి = మనవాలకించి (కూ. జ. చం. II 132)

మోవి + అనవలదె = మోవానవలదె (ప.రం. ఉ. I 56)

మాయింటి + అతడు = మాయింటాతడు (సం. వెం అ III 58)

కిళ్ళి + ఆకు = కిళ్ళాకు (స. వెం. రా. I 67)

(11) -ఇ + ఇ- > ఇ - :-

తెచ్చితి + ఇంటికి = తోడి తెచ్చితింటికి (అ.నా.హం V 195)

పట్టి + ఇచ్చి = పట్టిచ్చి (అ. నా. హం. V 249)

అడిగి + ఇచ్చునొ = అడిగిచ్చునొ (చే. వెం. వి. I 59)

ఒనర్చి + ఇటు = ఒనర్చిటు (చే. వెం. వి I 189)

బుద్ధి + ఇది = బుద్ధిది (పా.క.శు. III 112)

నీలవేణి + ఇదె = నీలవేణిదె (అ.కా. II 133)

నిల్పితి + ఇంతవడి = నిల్పితింతవడి (అ.కా. II 230)

చెప్పి + ఇడుము = చెప్పిడుము (కూ. జ. చం. I 23)

మోసపోతి + ఇక = మోసపోతిక (స. వెం. రా. 173)

'ఒకరి నననేల మోసపోతిఁక నదేల' ఇందులో ఉత్తమ పురుషైక వచన క్రియ ఇకార సంధి విలక్షణతతో పాటు నిర్బిందుక సబిందుక ప్రాస యతి గూడ గమనింప దగినదే.

తెచ్చి + ఇమ్ము = తెచ్చిమ్ము (లిం.శ్రీ. స I 71)

చింతిల్లి + ఇంత = చింతిల్లత (లిం. శ్రీ. స III 10)

చెయ్యి + ఇయ్యదాయోగా = చెయ్యియ్యదాయెగా (లిం.శ్రీ.స. IV 151) కావ్యభాషా పరిణామం 251


(12) -ఇ + ఉ- > ఉ- :-

విడిబడి + ఉన్న = విడిబడున్న (అ. నా. హ౦. II 149)

వెండి + ఉంగరము = వెండుంగరము (అ. నా. హం. IV 26)

పెట్టి + ఉసిరికాయలు = పెట్టుసిరకాయలు (చిం.ఛా.రా VI 224)

నివసించి + ఉండెడు = నివసించుండెడు (ఆ. వెం. గో.I 24)

జాఱి + ఉండంగ == జాఱు౦డంగ (చి.సిం.బి.III 188)

విక్రయించి + ఉదయ రాగంబు = విక్రయించుదయరాగంబు (చి.సిం.బి.III 198)

(13) - ఇ + ఎ- > ఎ- :-

కోర్కికి + ఎచ్చు = కోర్కికేచ్చిచ్చెనే (చే.వెం.ని. I 25)

పాడి + ఎంత = పాడేంత (కా.మ.ష. I 19)

పొంగి + ఎక్కు = పొంగెక్కు (అ.కా.II 44)

రాత్రి + ఎల్ల = రాత్రెల్ల (ప.రం.ఉ. III 56)

పెకలించి + ఎలగాడ్పు = పెకలింపలగాడ్పు (చి.సిం.బి. II 7)

(14) -ఇ + ఏ-> ఏ - :-

అది + ఏంది (ఏమిటి) = ఆదేంది. (ర.భూ.రా. II 145)

గ్రహంచి + ఏ + ఉన్నారు = గ్రహించేయన్నారు (చిం.చా.రా.IV 141)

అంతరీపమునుండి + ఏతెంచి = అంతరీపమునుండేతెంచి (చి.సిం. బి. II 20)

(15) -ఇ + ఐ -> ఐ- :-

కేళికి + ఐతేను = కేళికైతేను (అ.ణ.హం. II 166)

ఎన్ని + ఐన = ఎన్నైన (పా.క.శు. I 499)

ఇది + ఐనది = ఇదైనది (బి.తి.అ. I 218)

సమ్మతి + ఐన = సమ్మతైన (స.వెం.అ.III 105) 252 తెలుగు భాషా చరిత్ర


(16) -ఇ + ఒ-> ఒ- :-

తాల్చి + ఒగిన్‌ = తాల్చొగిన్‌ (అ. నా. హం. V 88)

ప్రణుతి + ఒనర్చి = ప్రణుతొనర్చి (అ. వెం. గో.I 12)

గణుతి + ఒనర్చ = గణుతొనర్చ (అ. వెం. గో. I 38)

(17) -ఉ + అ- > అ- :-

మిన్నుముట్టుచు + అహంకరించు - మిన్ను ముట్టు చహంకరించు (చే. వెం. వి. III 64)

అగుచు + అర్ధశ్రేణి = అగుచర్థశ్రేణి (ఎ. బా. మ. పద్యం. 36)

పిల్చుచు + అహల్యా = పిల్చుచహల్యా (స.వెం. అ.III 134)

అతిశయిల్లుచు + అవని = అతిశయిల్లచవని (చి.సిం.బి.I 46)

ఇందులో యడాగమం చేసిన ఉదాహరణం కూడ ఒకటి లభించినది.

'మదిరాక్షి బదులుకు బదులు యనుచు' (స.వెం.రా.I 18)

(18) -ఉ + అ- > అ- :-

మించు + అగు = మించాగు (చే.వెం.వి. II 73)

(19) -ఉ + ఇ-> ఇ- :-

దువ్వుచు + ఇట్లను = దువ్వుచిట్లను (అ.కా. I 286)

పగలు + ఇనుండు = పగలినుండు (కా.మ.ష. II 62)

(20) -ఉ + ఈ- > ఈ- :-

పల్కుమంచు + ఈ సమాచారంబు = పల్కుమంచీ సమాచారంబు (స.వెం. అ. I 50)

(21) -ఉ + ఎ-> ఎ- :-

పైయెత్తు + ఎన్నకే = పైయెత్తెన్నకే (చే.వెం.వి. III 163)

కల్గు + ఎనుబోతువు = కల్గెనుబోతువు (అ.నా.హం. V 38) కావ్యభాషా పరిణామం 253

(22) -ఉ + ఓ- > ఓ- ;-

పాడుచు + ఓడ = పాడుచోడగడపే (స. వెం. అ. I 95).

(23) -ఎ + అ- > అ- :- నూనె + అంటె = నూనంటె (ప. రం.మ V 18)

8.13. హల్సంధులు : అచ్సంధులకంటే హల్స౦ధులు వ్యవహారానికి మరీ దగ్గరగా ఉండేవి ఈ కాలపు కవులు చేసినారు. ఉదా :-

(1) -గ్‌ + క్‌- > క్క్- :-

అడుగు + కొని = అడుక్కొని (అ. నా. హం. III 142), అడుగు + కోలు = అడుక్కోలు సుంకము (అ.నా. హం. IV 84)

(2) -ట్‌ + ల్‌- > ట్ల్- :-

ఇంటి +- లోకి = రెడ్డినింట్లోకి బిలిచి (అ. నా. హం. III 91).

(3) -డ్‌ + ర్‌- > డ్ర్- :-

రెండు + రాగములు = ముప్పదిరె౦డ్రాగములు (కా.మ.ష II 181)

(4) -డ్‌ + న్‌- = న్న్ :-

రెండు + నెల్లు (నెలలు) = రెన్నెల్లు, మూన్నెల్లు, రెన్నాళ్ళు (క.వ.రా. vol. II పుట. 83 & 84)

(5) -డ్‌+ న్‌- > ణ్ణ్- "-

రెండు + నెల్లకు (నెలలకు) = నెలరెణ్ణెలకు (ఋ.వెం.చం.I 14)

మెడ + నూలు = మెణ్ణూలు (అ. నా. హం. III 91)

(6) -డ్‌ + న్- > ళ్న్- :-

ఏడు + నూరు = ఏళ్నూరును (చెం.కా.రా. I 26)

(7) -ల్‌ + న్‌- > ల్ల్‌- :-

నెల + నాళ్ళలో == నెల్ణాళ్ళలో (కూ. జ. చం. I 56) 254 తెలుగు భాషా చరిత్ర

8.14. యడాగమాలు : లాక్షణికులు అంగీకరించనివీ, వ్యవహారంలో ఎక్కువగా వాడేవీ ఐన యడాగమాలు కూడ నాటి కావ్యభాషలో కనువిస్తున్నవి. ఉదా. మదిరాక్షి బదులుకు బదులు యనుచు (స.వెం.రా. I 18), ఆనతియియ్యగ (కం.పా.ఉ.II 189).

'కర్మధారయంబులందు మువర్ణకంబునకుం బుంపులగు' (సంధి. 32) అని చిన్నయసూరిగారి అనుశాసనం. దీనికి విరుద్ధంగా కర్మధారయంలో మువర్ణకానికి పుంప్వాదేశం జరుగని ప్రయోగాలు నాటి కావ్యభాషలో లభిస్తున్నవి. ఉదా. 'బొక్కసమిండ్లు' (క. వ రా. vol. II పుట, 151), 'బాదం పలుకులు' (అ. నా. హం.I 105).

'కర్మధారయంబులం దుత్తున కచ్చు పరంబగునపుడు టుగాగమంబగు' (సంధి. 28) అని సూరిగారి మతం. దీనికి భిన్నంగా టుగాగమం జరుగవలసిన చోట జరుగని రూపాలు కూడ నాటి కవులు వాడినారు. ఉదా : 'పనసాకుపందిరి' (అ. నా. హం. I 151). 'కాపురవింటి లోపలికి' (కూ. జ. చం. II 127), 'పసరంపెమ్ము' (ఎ. బా. మ. పద్యం 22).

సమాసాలు :

8.15. వ్యహారంలో బహుళంగా ఉండి కావ్యభాషలో నిషిద్ధమైన వైరి సమాసాలు కూడ ఈ యుగపు కావ్యాలలో కొన్ని కనుపిస్తున్నవి. ఉదా : 'శూద్ర బిడ్డ' (అ. నా. హం. V. 124), 'బీగముద్రలు' (ప. రం. ఉ. II 97), 'మూల బొక్కసంబు' (స. వెం. అ. II 52), 'వీటీ సంబళులు' (చిం.చా.రా.II 249), 'చిక్కణ భాగముల్‌” (చిం. చా. రా. VI 295).

క్రియాపధాలు :

8.16. వ్యవహారబలం వలన కావ్యభావలో చేరిన క్రియారూపాలు రెండు విధాలు. (1) శిష్టవ్యవహార సాధారణరూపాలు (2) మాండలిక వ్యవహారసిద్ధాలు. ఇందులోనే లాక్షణికులు గ్రామ్యాలనీ కవులు పామరభాష అనీ పాత్రోచిత భాష అనీ ప్రయోగించినవి చేరుతవి.

8.17. వర్తమాన క్రియలు : 'మిసమిస మెఱచుచు లోపల' (ర. భూ.రా. I 101). ఇందులోని 'మెఱయు' ఛాతుపర్యాయ రూపం 'మెఱచు' దక్షి కావ్యభాషా పరిణామం 255

ణా౦ద్ర వ్యవహారంలోను రాయలసీమ పలుకుబడిలోను ఉన్నటువంటిదే కాని సాధారణ వ్యవహారంలోనిది కాదు. అప్పకవి 'మెఱుపులు మెఱుసుట' (కా.అ.అ. II 196) అన్నాడు. 'వెళ్ళగొట్టుచు' (కూ. జ. చం. I 64) అనేప్రయోగంలోని ధాతువు అంతస్సంధి వలన 'వెడలు' అనే ప్రాచీన ధాతురూపంనుంచి వర్ణ సమీకరణం ద్వారా ఏర్పడిన రూపమే. ఇది శిష్టవ్యవహార సాధారణమేకాని కావ్యభాషా సాధువుకాదు. 'వెళ్ళ గొట్టింప దలచి' (అ. నా. హం. II 100), 'రెండు దుక్కులు వెళ్ళదున్ని' (అ. నా. హం. V 35), 'వెళ్ళగనె' (కా. మ.ష VI.84), 'వెళ్ళదోలిన' (రె. మ. గం. II 164), “తలగడ సంచులవలె వెళ్ళి' (పా. క. శు. II 30), 'వెళ్ళె' (కా. మూ. పాం. V 47) మొదలైన వివిధ రూపాలన్నీ ఈ కాలవు కవులు వాడినవే.

సమాపక క్రియలు : తెలియు, విడుచు, చంపు అనే కావ్యభాషా రూపాలకు తెలుసు, విరును, సంపు అనేవి వ్యవహార రూపాలు. వీటిలో మొదటిది శిష్టవ్యవహారంలోను తక్కినవి పామర వ్యవహారంలోను ఉన్నవి. ఈ రెండు తీరుల రూపాలను ఈ యుగంలోని కవులు వాడినారు. ఉదా. తెలుసు (చిం. చా.రా. V 22). విరుసు, సంపు (కా. మ. ష. II 60) అనే మాటలు సూసివచ్చినారు, కఱసి, విడుసు మొదలైన మాటలు ఇందులోనే కవి బోయలనోట ఎరుకులనోట పలికించినాడు.

ద్విరుక్త అద్విరుక్త చకారాంత ధాతువులకు సవర్జాంతరూపాలు వ్యావ హారిక భాషలో బహుళ ప్రచారంలో ఉన్నవి. కావ్యభాషలో ఇవి నిషిద్ధాలు. కాని ఈ యుగపు కవులు వీటినికూడా ప్రయోగించినారు. వస్తాడా, తెస్తాడా, చూస్తుడా, ఇస్తాడా అనేవి అప్పకవి (I 125) గ్రామ్యోక్తులన్నాడు. కాని కూచి మంచి జగ్గకవి (కూ. జ. చం. II 83) నీలాద్రి రాజంతవాడు వస్తాడనీ, ధనం తెస్తాడనీ, చ౦ద్రరేఖకు ఇస్తాడనీ లేకపోతే విరహంతో చస్తాడా అనీ అన్నాము.

8.18. భవిష్యత్క్రియలు : 'లాట్టురుఞ్ఞ పరంబగునపుడెదగాగ మంబును, బ్రథమ సువర్షకంబు పరంబగునపుడెడుగెడిగాగమంబులును బహుళంబుగా నగు' (క్రియా-23) అని సూరిగారి సూత్రము. ఈ ఆగమాలకు మారుగా వ్యవహారంలో -ఏను/ -ఈని ; -ఏరు; -ఏవు ; -ఏము అనే రూపాలున్నవి. వీటిలో ఈకారఘటిత రూపాలు దక్షిణా౦ద్ర వ్యవవహారంలోనే బహుళంగా 256 తెలుగు భాషా చరిత్ర

ఉన్నవి. -ఎదను > - ఏఅన్‌ పరిణామం కూడా ఆ ప్రాంత వ్యవహారంలోనే వచ్చింది. ఆయా రూపాలన్నీ వ్యవహారబలంవలన నాటి కావ్యభావలో ప్రవేశించినవి. ఉదా. వినిపించేరు, ప్రశంసించీని (వి. నా. ర. పుట. 4), పెట్టేము, తెచ్చేము, ఇచ్చేము, చేసేము (కా. మ. ష. II 98), చచ్చేవే, చెడేవు (కూ. జ, చం.II 70, 141), ఇచ్చేను, ఎంగిలయ్యీని (స. వెం. అ. I 68, III 104), వెలకుఁగొనేరా. మొక్కేను, (ప.రం.మ. III 16, IV 12). గుండె యదరీని (లిం. శ్రీ. స. III 42), విషమాస్తుడేచీని వెఱ్ఱిపడుచ, ఇంద్రుడే మిచ్చీని (స.వెం.అ.I 69).

8 19. తద్ధర్మార్థక విశేషణాలు : -ఎడి/-ఎడు అనే తద్ధర్మార్థక ప్రత్యయాలకు వ్యవహారంలో _ఏ (టి) అనే రూపాలున్నవి. ఇవికూడ అనాటి కావ్య భాషలో కనుపిస్తున్నవి. ఉదా : ఎఱిగేటట్టయితే (అ. నా. హం. II 128), వచ్చుచ్చుఁబొయ్యేటి (అ. నా. హం. II 162), విటకోటి నెనసేటి (అ. నా. హం. III 74), వారిజాడల మెలగే (చెం. కా. రా. I 9), కృశియించేదెంచ (కా. మ. ష. III 140), అచ్చటనడచే వింతలు (స. వెం. రా.I 8), వేళలుగాచే (లిం.శ్రీ. స. IV 180), తిరి పెంబెత్తేవానికి (స. వెం.రా. I 65), మెలతలుచేసే (లిం.శ్రీ.స.IV 98).

8.20. ఉభయ ప్రార్ధనం : కావ్యభాషలో ఉభయ ప్రార్థనంలో వచ్చే దుగాగమానికి (క్రియా-30) మారుగా -(ఉ) దము, -(ఉ)దాము, -తము, -తాము మొదలైన ప్రత్యయరూపాలు గల ప్రార్థనాద్యర్థక క్రియలు భిన్నమండలాలలో భిన్నరూపాంతరాలలో ప్రచారంలో ఉన్నవి. వీటిలో కొన్ని నాతి కావ్యభాషలో స్థానం సంపాదించుకొన్న వి. ఉదా : 'చూతాముగా' (కా. మ.ష. V 107), చూతామా, కందమా, చందమా (చనుదమా). (కా. మ.ష.V. 115), వెదకు దాము (ప. రం. ఉ. III 107).

8.21. చేదాద్యర్థకాలు : -ఇన(న్‌) అనే కావ్యభాషా చేదర్ధక ప్రత్యయానికి -(ఇ)తే (ను) అనేది వ్యావహారిక రూపాంతరం. ఈ యుగపు కావ్యాలలో (ఇటువంటి వ్యావహరిక రూపాలు కొల్లలుగా కనుపిస్తవి. ఉదా : 'గట్టిగ నీమగడెఱిగేటట్లయితే' (అ నా. హం. II 128), కేశికైతేను (అ. నా. హం. II 166), అంపించితే (గో. కూ. సిం. పద్యం, 10), చూచితే, నొక్కితే, మీటితే, కూడితే, (ప.ర౦. కావ్యభాషా పరిణామం 257

ఉ III 15). ఇందులో చూచితే అనేది నేటిచూస్తే అనే రూపానికి మధ్యరూపం. మగవాడైతే (స. వెం. అ. I 104), ఆకర్షింపగలిగితే (స. వెం. అ. II 84), బాళినిజేరితే (చి.సిం. బి. II 128), వదరితే (లిం. శ్రీ.స. III 97), క్రోలగల్గితే, కదియింపగల్గితే, నఱుమంగగల్గితే (స. వెం. అ. II 84), అల్లితేనేసరా, పాడితేనే సరా, మీటితేనేసరా, ఆడితేనేసరా (స. వెం. రా. I 50), కన్నులైతేసరే, వదనమైతే సరే, రూపమైతేసరే (స. వెం. అ. II 8), మిమ్మంపితే (వి. సా. ర. పుటి 48).

8.22. విధ్యర్థకాలు : విధ్యర్థక క్రియారూపాలలో వ్యవహార స్వరూపం నిరూపించే కొన్ని ప్రయోగాలు నాటి కావ్యాలలో కనుపిస్తవి. ఇవి సంప్రదాయ వ్యాకరణ నియమాలకు విరుద్ధమైనవి. ఉదా: వాకిలిదీయని పిల్చెవల్లభన్‌ (అ.నా.హం. II 56). గడియదీయ్యని (అ. నా. హం. III 98), ఇందులోని తీయి + అని సంధిగమనార్హము. నా కియ్యమనిన = నాకు + ఈయుము + అనిన (అ. నా.హం. V 73), ఇటువంటి ప్రయోగాలు ఈనాడు సాగరసీమలో బహుళం. కాని తెలంగాణంలో ఇది అభిప్రేతార్థానికి విరుద్ధం. తేలంగాణంవారు దీన్ని నాకు + ఈయము + అనిన అని అర్థం చేసుకొంటారు. ఇటువంటిదే చూడమటన్న = చూడుము + అటన్న రూపం (కం. నా. వి. పుట. 21),

8.23. అకప్రత్యయాంతాలు : ఆత్మనే పదార్థంలో భూతకాలిక అస మాపక క్రియారూపాలలో వచ్చే '-కొని'కి -క/కు/కొ అనే పరిణతరూపాలు చాలా కాలంగా ప్రచారంలో ఉన్నవి. ఇందులో '-కు' మరీ ఆధునిక రూపం, ఈ మూడు రూపాలకూ ఈ యుగపుకావ్యాలలో ప్రయోగాలు లబిస్తవి. ఉదా: (1) ఎత్తుకపోయి, చేతఁబుచ్చుక, సంతరించుక, నిలుపుక, పట్టుక, చూచుక, అలముక, అందుక (క. వ. రా. vol. II పుటలు. 6,19,26,27,28,208,72), తోడుక (ర. భూ. రా. II 174), తప్పించుక, తప్పుక (సు. మా. చం. I 159, IV 86), పూనుక, పఱచుక, కఱచుక, కట్టుక (అ. నా. హం. I 45,182, 193,260), కాపెట్టుక (అ. నా. హం. II 111), తెచ్చుక, ఎత్తుక (కం. పా. ఉ. III 102, IV 200), ఊదుకపోవు, చూచుక, తప్పించుక, పట్టుక (చే. వెం.వి. I 34, II 31, 195, 198), ఉంచుక, కాచక (పా. క. శు. I 50, 128), తన పాదము బట్టుక (కా. అ. అ. పీఠిక. 21), వంచుక, ఎక్కుక, తాల్చుక (కా. అ. అ. I 107, IV 318), అందుక (బి. తి. అ. IV 11), కప్పుక, ఉంచుక

(17) 258 తెలుగు భాషా చరిత్ర

(లిం. శ్రీ. స. III 67, 68), తోడుక (చి. సిం. బి. III 169), అనుక (ప.రం.ఉ. III 92), (2) చూరుబట్టుకు, బుద్ధితెచ్చుకు (గో. కూ. సం. పద్యాలు 41,45). -కుతో వచ్చే ఈ రెండోతీరు రూపాలు ఒక్క గోగులపాటి కూర్మనాధుడే ప్రయోగించినాడు. తక్కినవాళ్ళెవరూ ప్రయోగించలేదు. (3) కాముడు కోపించి యిటకు గదుముకొ రాగా (కా. మ. ష. IV III )'. -కొ తో వచ్చే ఈ మూడోతీరు ప్రయోగంకూడ ఒక్క కామినేని మల్చారెడ్డి మాత్రమే వాడినాడు.

8.24. సందేహార్థక, నిశ్చయార్థక, సంభావనార్థత ప్రత్యయాలు చేరి నప్పుడు అజంతశబ్దాలమీద నిత్యసంధి చేయటంకూడా ఈ యుగపు కావ్యాలలో కనుపిస్తుంది. ఉదా : పొంగలో పొంగలి (చే. వెం. వి. III 41), అటో యిటో యెటో (చే.వెం.వి. III 84). ఎన్నగ పండోకాయో (ప. రం. మ III 77).

"బంతే చన్గవ నిగ్గుమేను రుచి పోల్పన్‌ జాళువా మేలుడాల్‌

దొంతే కన్నుల ధాశధశ్యరుచులెంతో కల్వకున్‌ జూడమేల్‌

బంతే కంతుని దంతినేలు నడలున్‌ బాగైన యీ భామకున్‌

ఎంతేలేదు సమానమెంచుటకుగా నీ రేడు లోకంబులన్‌"

(స. వెం. అ. II 29)

గ్రహించేయన్నారు (చి. ఛా. రా. IV 141), ఎంతోకరముప్పతిల్ల (చి. సిం. బి. II 77), కరికిన్‌ దొడ్డా (ఎ. బా. మ. పద్యం. 18), విజయరాఘవమేదినీవిభుని చెయ్యె మీదటంచును (ప. రం. మ. V 69), శశిరేఖ యందాన సకలకళా ఫ్రౌఢా (స. వెం. అ. III 35), అతనిమీదిదె బాశియగుచు నుండు (చెం. కా. రా. III 69), ప్రాకృతమునె అయినట్లాయెనా (కా. అ. అ. పుట. 30), నిదురామరి కంటికి రాదు. (కా. మ. ష. IV 103).

8.25. సముచ్చయార్థక ప్రత్యయస్థానంలో నేటివ్యవహారంలోవలె దీర్ఘాచ్చు రావటంకూడ నాటి కావ్యాలలో ఉన్నది. ఉదా: మఱీమించే (చిం. భా. రా. I 67). తోచియుండినా లేదనేటి (చిం. భా. రా. III 65), ఎగాదిగ సరసిచూచి (అ. నా. హం. V 73), లక్షాయాబై వేలు (వి. నా ర. పుట. 27), నోరునోరే తెఱచున్‌ (పా. క. శు. II 162), పదివేలయినా (స. వెం. అ. I 114), తగిలి నానుతగులు తప్పిన తప్పును (స. వెం. రా. I 60), బాపనికేమయినాను తెల్సునా (లిం. శ్రీ. స. III 90), పనియెడగల్గినా (లిం. శ్రీ. స. III 135), వనితలనిట్లా తలచుకొని (లిం. శ్రీ. స. III 62). కావ్యభాషా పరిణూమం 259

8.26. అతిశయమూ ఆథిక్యమూ చెప్పే సందర్భంలోకూడా ఇటువంటి దీర్ఘమే వస్తుంది. ఉదా: మిగులా నుప్పొంగెడిన్‌ (లిం. శ్రీ. స. III 55), చాలా నచ్చరల్‌ మెచ్చగన్‌ (లిం. శ్రీ. స. I 126), చాలా వంచకుడు (లిం. శ్రీ. స. IV 174), పొగరుచూపులతోఁబడాపగలఁజూచె. కప్పుగొప్ప బడాపగలజూడనిఘనుండు (అ. నా. హం. II 31, 146).

పూరణార్థకమైన-'అవ'కు మారుగా 'ఒ'అనే వ్యవవార సిద్ధరూపం కూడ నాటి గ్రంథాలలో ప్రవేశించినది. ఉదా. పందొమ్మిదో ఛందమునను (కా. అ. అ.పుట. 287).

8.27. స్త్రీజనవ్యవహారంలో వినిపించే వినే (= వినవే) అనే క్రియారూపం కూడ (స. వెం. రా. I 69) కావ్యభాషలో చేరిపోయినది. అదేవిధంగా సంభాషణలో జరిగే పురుష, వచన, కాలవ్యత్యయాలు కూడ ఆనాటి కావ్యాలలో ఉన్నవి. పురుషవ్యత్యయ. 'మీరెవ్వరు మేమెవ్వరు' (ర. భూ. వా. II 122). మేమెన్వరము అనవలసినచోట మేమెవ్వరు అన్నాడు. వచనవ్యత్యయం. 'ఈరసమే దోషుల్‌' (ఎ. బా. మ. పద్యం, 17). ఇందులో ఈరసము ఏకవచనం. దాని విశేషణమైన దోషుల్‌ బహువచనంలో ఉన్నది. కాలవ్యత్యయం. "చూచెదనని వచ్చినాను సుదతీ నిన్నున్‌” (పా. క. శు. I 83). ఇందులో భూతానికి వర్తమాన రూపం వాడినాడు.

8.28. “యకారంబును వువూ వొవోలును దెలుఁగుమాటలకు మొదట లేవు” (సంజ్ఞా-17) అని చిన్నయనూరిగారన్నా ప్రాచీన తాళపత్రగ్రంథాలలో ఇవి కొల్లలుగా కనుపిస్తున్నవి. వ్యవహారంలోను వినుపిస్తున్నవి. ఈయుగపు కావ్యాలలో కూడ ఇవి ఉన్నవి. ఉదా: తొట్లవూచి (పా. క. శు. IV. 285) 'ఉపరతి సేయనా వోరి జాణ" (ప.రం.ఉ. II 44).

8.29. ఎకార విశిష్టంగా ఉండవలసినమాటలు అకార విశిష్టంగా ఉండటం వ్యావహారికభాషాలక్షణం. ఇవి లాక్షణిక సమ్మతాలు కావు. కాని ఈ యుగపు కవులు వీటిని భాహాటంగా ప్రయోగించినారు. ఇందులో నామవాచకాలు క్రియలు ఉన్నవి. ఉదా: 'చఱకగు వింటి బల్మి" (అ. కా. III 86), చన్నయాచార్యు డాచార్య చక్రవర్తి (అ. వెం. గో. I 27), చాటంతమబ్బుదోఁచె (పా. క.శు. IV 124), చాయన్వలే (చిం. చా. రా. V 260), తటవాయ (ప.రం. ఉ. II 87), 260 తెలుగు భాషా చరిత్ర

మరచినకార్యమియ్యడను (ప. రం. ఉ. I 45), ఎక్కడబోయనో, ఎంతసేపాయ (కం. నా. వి. పుటలు 44,46). చాతకంబుల దయచాతఁగంబులొసంగి (చి. సిం.బి. III 67). దీనికి విపరీతంగా అకార విశిష్టంగా ఉండవలసిన మాటలు ఎకార విశిష్టంగా ఉండటం కూడ వ్యవహారభాషాలక్షణమే. ఇటువంటి మాటలు కూడ నాటీ కావ్యాలలో ఉన్నవి. ఉదా. చెరించేవిధము (ఆ.నా. హం V 195).

రెండుపదాలకు సంధి జరిగేటప్పుడు ఉత్తరపదం వకారాది ఐతే వ లోపించి సంధి జరుగటం కూడా వ్యవహార భాషాలక్షణమే. ఇటువంటి ప్రయోగాలు లక్షణ విరుద్ధమైనా నాటి కవులు వాడినారు. ఉదా. ముసుగు + వేసికొని = ముసుగేసుకొని (కం. పా ఉ. I 99), చేతి + వెంట = చేతెంట (బి. తి. అ. V 17).

8.30. లక్షణం అంగీకరించకపోయినా మహాకవులు ప్రాచీనకాలం నుండి కొన్ని ప్రయోగాలు చేస్తున్నారు. వీటికి వ్యవహారబలమో లేక ఛందో నిర్భంధమో కారణం కావచ్చు. అటువంటి వాటిని సాహిత్యప్రియులు నిరంకుశ ప్రయోగాలంటారు. ఈయుగకవులు కూడ కొన్ని ప్రయోగాలు ఇటువంటివి చేసినారు. ఉదా. ఉశిరమ్ములు = ఉశీరమ్ములు (చిం. చా. రా. VI 80), ఉడింగి = ఉడిగి (చిం. చా. రా. VI 296), పూటమ్ము = పూవుటమ్ము (కూ. తి. ర. V 5), కడానీబెత్తెము = కడానిబెత్తము (ఋ. వేం. చం III 97), మొగఱాతళ్కు = మగఱాతళ్కు (ఋ. వేం. చం. III 71), మద్దెలవాచియు = మద్దెల వాయించియు (ఋ. వెం. చం. I 98), ఆకంటం జెందకయుండ = ఆకఁటం జెందక యుండ (చెం. కా. రా IV 77), తన పత్ని సావిత్రి తానంబుసేసి = స్నానంబుసేసి. (కం. నా. వి. III పుట. 61), యవ్వనాథ్య = యౌవనాఢ్య (అ. కా. II 115). తమ్మిచే = తమిచే (చిం. ఛా. రా. VI 330), మఱుసనాడు = మఱుసటినాడు (అ. నా. హం. V 202), ప్రాణనాయకి (లిం. శ్రీ. స. IV 152), వలిపెపు దుప్పటి చెఱగ (చె. కా. రా. III 4), దుప్పటిచెఱగున (లిం. శ్రీ. స III 35).

8.31. మాండలిక శబ్ద ప్రయోగాలు : ఆంధ్రదేశం సువిశాలమైనది. ఈనాడు తెలంగాణం, రాయలసీమ, చాళుక్యసీమ అనే మూడు ప్రధాన మండలాలున్నవి. ఈ ప్రధాన మండలాలను భాషాదృష్టిలో మరికొన్ని ఉపమండలాలుగా విభజించవచ్చును. ఇదిగాక ఆయా మండలాలు పరభాషామండలాలతో కలిసే పొలిమేరలలో పరభాషల యాసల ప్రభావంకూడ మన భాషపైన గోచరిస్తున్నది. కావ్యభాషా పరిణామం 261

తెలుగుదేశం బయట అంటే తంజావూరు మధుర మొదలైనచోట్ల తెలుగుల వలసలు ఏర్పడినప్పుడు అక్కడి మాండలికాలు ఆ ప్రా౦తపుకవుల రచనలలో చోటు చేసుకోవటం సహజమే. ఈ మండలికాలను ప్రా౦తీయ మాండలికాలనీ (Regional dialect words), వర్గమాండలికాలనీ (Class dialect words) విభజించుకోవచ్చు. ఇవి ఆనాటి భాషా స్వరూపంతో పాటు వ్యవహారబలాన్ని కూడ నిరూపిస్తవి. ఈ యుగపు కవుల కావ్యాలలో కనబడే తీరుతీరుల మాండలికాలను ఈ దిగువన ఉదాహరిస్తున్నాను.

8.32. విశేష్యాలు : సర్వనామాలు : విశేషణాలు : గడె (పా. క. శు. I 247), పిడుక కుంపటులు (పై. I 254), ఎల్లుండి (పై. II 183), అతగానికి (పై. II 190), పదిమాళ్ళకు (పై. III 137), చేయప్పు = Hand Loan (పై. III 241) , గరికెవ్రేళ్ళు (క.వ. రా. vol. పుట 18), రేతిరి (కా.మ.ష.II 56), తొట్ల (పై. VI 37), అసలు = బురద (కా. మూ. పాం.I 73), కొమాళ్ళు (పై. III 28), కుమార్తె (అ. నా. హం. II 114), పోరి = (నింద్యార్థమున) బాలిక (రె. మ. గం. II 220), మంగళార్తులు (పై II 255), వెళుపు = వెడల్పు (కూ. జ. చం. I 90), కడేలు (పైది. II 88), ఊసుపోవక (పై. III 9). అఘాత్యము (ఋ. వెం. చం. I 85), ఫలహారము (కం. పా. ఉ. IV 198), చెల్లెలికట్ట (పై. III 24), బైట (పై. I 20), తునెలు (ప.రం. మ. I 64), చౌలు = చెవులు (లిం. శ్రీ. స IV 5), గద్దిగ (వి. నా. ర. పుట. 80), బంట్రోతు (అ. నా. హం. IV 84, 168), ఆడకు = అక్కడికి, (వి. నా. ర. పుట. 42), ఏడకు = ఎక్కడికి (అ. నా. హం. V 248), ఈడ = ఇక్కడ, ఆడాడ = అక్కడక్కడ (కం పా. ఉ. IV 115, 116), దూరమేడది =దూరమెక్కటడిది (ర. భూ. రా. II 174), ఆఁటది = స్త్రీ (పా.క. శు. II 279), కుండలు వెళ్ళవేయించే ననగ = వెల్ల (అ. నా. హం. II 100), ఓనమాలు = ఓనమాలు (పై. III 141), ముత్తేలు = ముత్యాలు (చెం. కా. రా. II 33, విడిద =విడిది (పా. క. శు. I 425), నాకాడ = నాకడ (కా. అ. ఆ. I 124), సోద్యవడి (ప. రం. ఉ. I 36), బంగారు పావాలు (పై. II 3), అచ్చుతునకు (పైది. III 102), కళావతెమ్మ (ప. రం. మ. I 46), అచ్చుతుకునితోడి తెమ్మని (స. వెం. రా. I 8), మేదించినట్టి ఈబూదియేంది = ఏమిటి (ర.భూ-రా. II 145), లక్షాయాభైై వేలు, ఎనబై వేలు, నలభై యొకవేలమాళ్ళు (వి. నా. ర. పుట. 27), ఈనచే 262 తెలుగు భాషా చరిత్ర

= ఈతనిచే (చిం. ఛా. రా. V 94), అతగానికి (పా.క.శు. II 190), ముసలామె (పై. III 48), వాటి వాని (చెం.కా.రా. IV 64), మతి నెంచి నీబిడ మహిమ లెట్టివియొ (కం. నా. వి. II 42), పనిలేంది (అ. నా. హం. V-78), ఈ వేల్పు వెలదిమంది (కం. పా. ఉ. IV 5౦), పెళ్ళికొడుకు (గో. కూ. సిం. పద్యం. 90), విళ్ళు = విండు (కా. మ. ష. II 102), ఒళ్ళు = ఒడలు (క.వ. రా. Vol. II పుట. 146), ఇంట్లోకి (అ.నా. హం. III 91), పనిలేంది = పనిలేనిది (పై.ది. V 73), అదేమే = అది + ఏమే. (చిం. ఛా.రా. IV 88), ఏందెలె = ఏమిటే + లే (పై.IV 98), మళ్ళిరాదొ(వి. నా. ర. పుట 42), వరస (అ. నా. హం. II 162).

8.33. అవ్యయాలు : వెనక (క. వ.రా. Vol. II పుట, 15). తరవాత (పై. పుట. 34), కనక (ప రం. ఉ. I 21). పై మూడుమాటలు ఉత్వ మధ్యాలుకాని ఉచ్చారణ విధేయంగా అత్వమధ్యాలై నవి. ఒకసారి, ఈ పారి (కం. పా. ఉ. III 54, VI 39), ఇంగితం బేరుగక యీలాగుబల్క (వి. నా. ర. పుట. 43), ఈలాగు మంత్రమారుత (అ. నా. హం. III 65), చిలుకలు నీలాగు పలుకనేర్చె (కం. పా. ఉ. IV 198), చాలా వేలాగుల బతిమాలిన (కూ. తి. ర. III 81), అలాగె (పా. క. శు. II 457), ప్రొద్దుగూఁకుదాఁక (కా. మ. ష. III 125), ఆతల = ఆవల (పై. VII 45), కొండ యెక్కెడు బ్రతిమాలు కొద్ది నీవు (గో. కూ. సిం. పద్యం. 17), వేళ్ళెగననైన బుద్ధి దిగసన వచ్చు (పై. పద్యం. 19), ఆనిక - ఆవెనక (ఋ. వేం,చం. III 86), కలిగె నూరికె నాకు కామాతురునకు = ఊరక (క. వ, రా. Vol. II పుట. 5), అషు ఇషు బోవకే = అటుఇటు (స.వెం. అ. I 69), వాజపేయ ఫలంబు నలదషే = వలదటే (పైది. I 69), నగరికి బోవకే నడుమ నెషులొ = ఎటులొ (పై. I 68), అవునషే (పా. క. షు. II 459), కాదషే (పై. II 477). పైన పేర్కొన్న ఐదు ప్రయోగాలు ఛాందసులై న వైదికుల మాటలు. ఇవి వర్గమాండలికాలకు (class dialects) ఉదాహరణాలు.

8.34. క్రియలు, భావార్థకాలు : చేసుట (క. వ. రా. Vol. II పుట. 80), మెఱుపులు మెఱుసుట (కా. అ. అ. II 196), దున్నకము = దున్నుట (బి. తి. అ. I 90). పైవానిలో చివరి ప్రయోగం పాలమూరు మండల౦ మాండలికం. కావ్యభాషా పరిణామం 263

ఆ మండలంలో వచ్చుకము, ఇచ్చుకము, పెట్టుకము, తినుకము వంటి మాటలు శిష్టజనవ్యవహారంలో ఉన్నవి. ఉండ్రా = ఉండుమురా (స. నా. అ. I 100).

8.35. కావ్యభాషలో సరళాదిగా సరళమధ్యంగా ఉండవలసిన కొన్ని మాటలు పరుషాదిగాను పరుషమధ్యంగాను ఈయుగపు కావ్యాలలో కనుపడుతున్నవి. ఇవికూడ నాటి ఆయా మండకాల ప్రత్యేకతలు కావచ్చును.

పరుషాది : పొడ చింక తోలు కచ్చడమదేంది = జింక (ర. భూ. రా. II 145). మన నిఘంటువులలో జింకశబ్దమే కనుపడుతది. ద్రావిడభాషాపరమైన దీని మూలరూపం పరుషాదిగానే ఉండేదేమో. ఇంత ప్రాచీనరూపం కావ్యాలలో ప్రవేశించిందంటే మాండలికంగా ఉన్న ప్రాచీనరూపానికి అప్పటికీ చాలినంత వ్యవహారబలం ఉండాలె.

పరుషమధ్యముం : ముసుక్తు = ముసుగు (పా. క. శు. IV 188). తెలంగాణంలోకూడ ఈనాడు దీనిని పరుషంతోనే వ్యవహరిస్తారు. తెకటార్చెను శౌరి యనుచు = తెగటార్చెను (లిం. శ్రీ. స. IV 126); వెకటున్‌ గరగరిక పుట్టు = వెగటున్‌ (పై. IV 170). పై రెండుదాహరణాలు ప్రాసఘటితంగాకూడ ఉన్నవి. ఆ, క్రాంత శరీరుడై యెదురుకట్లకు వచ్చినరెడ్డి (అ. నా. హం. IV 172], అటుకులు దిన్నట్లేనా (స. నా. రా. I 39).

8.36. ఇతర వ్యవహార భాషాలక్షణాలుగల ప్రయోగాలు కొన్ని ఈ యుగపు కావ్యాలలో ఉన్నవి.

(క) స్వరభక్తి (Anaptyxis) : సంయుక్తాక్షరాలనడుమ ఒక అచ్చును చేర్చి ఉచ్బారణం సులభంచేసుకోవటం. ఉదా : సమరత = సమర్త (పా.క.శు. I 452), గాఢముగా పరుషించె = వర్షించె. (ప. రం. ఉ. III 20).

(చ) దీర్ఘాచ్చుకు హ్రస్వాచ్చు : వీనులు ముయవచ్చి = మూయవచ్చి (అ.కా.II 104), కొప్పున నున్నగా నియదు = ఈయదు (అ. కా. II 220).

(ట) వర్ణనాశము (Syncope) : రెండు హల్లుల నడిమిఅచ్చు ఉచ్చారణ త్వరలో నశించి రెండు హల్లులుకలిసి వర్ణసమీకరణం ఏర్పడటం. ఉదా: ఉర్ల = ఉరల (కం. పా. ఉ. III 8), తెప్పిర్లి = తెప్పరిల్లి (పై. III 353), ఎర్కు = 264 తెలుగు భాషా చరిత్ర

ఎరుకు, సర్కు = సరుకు, గురు = గురుకు, ఉర్కు = ఉరుకు (కా. మ.వ. II 108), పొర్లు = పొరలు (పై. V 102), పర్వుతేరి = పరువు (సు. మా. చం. IV 86), ఉండ్రి = ఉండిరి, ముచ్చటలాడుచుండ్రో (గో. కూ. సిం. పద్యం. 22) కొల్ను = కొలను. తామరకొల్నురీతి (రె. మ. గం. II 146).

(త) లోపదీర్ఘత : (Compensatory Lengthening): ఉచ్చారణంలో ఒక అక్షరం లోపించి ఆ విధంగా లోపించినందున కలిగే హ్రస్వత పోవటానికి పక్కఅచ్చు దీర్ఘంకావటం. ఉదా : బైట = బయట (కం. పా. ఉ. I 20).

(ప) ద్విరుక్తహల్లుకు మారుగా అద్విరుక్తహల్లు : ఎట్టయిన గానిము = కానిమ్ము (అ. కా. I 238), బంగరుగినెలై = గిన్నెలై (ర. ఘ. గం. IV 28).

(గ) అద్విరుక్తహల్లుకుమారుగాద్విరుక్తహల్లు : అనతియియ్యగ నూర కుండరాదే (కం. పా. ఉ. II 189), చెయ్యియ్యదాయెగా (లిం. శ్రీ. స. IV 151), ఇయ్యగవలసెన్‌ (కా. మ. ష. III 79), చెంతకుఁ దియ్యంగఁజే విదుల్చు (ప.రం.మ. V 105), వచ్చుచుఁబొయ్యేటి వరసవారికి (అ. నా. హం. IV 162), పెనుతలపు గడియదీయ్యని (పైది. III 93) , నా కియ్యమనిన (పైది. V 73), చూపియ్యడు (కూ. జ. చం. II 69).

8.37. అన్యదేశ్యాలు : ప్రాణవంతమ్తైన ప్రతిభాషా అవసరం కొలది అన్యదేశ్యాలను ఎరవు తెచ్చుకొంటద్ది. వాణిజ్య వ్యాపారాల మూలంగా, సాంఘికమైన అవసరాల మూలంగా, సంస్కృతీ ప్రభావం మూలంగా, పరిపాలనమూలంగా భాషలలో ఇటువంటి ఆదాన ప్రదానాలు జరుగుతవి. ఒకప్పుడు ఈ యెరువు మాటలు, తెచ్చుకొన్నావాళ్ల భాషకు అలంకారాలై తుష్టినీ, పుష్టినీ కూర్చుతవి. మరొకప్పుడు ఈ ఎరువు సొమ్ములు బరువుచేటులై పోతవి. సంస్కృత ప్రాక్సృత శబ్దాలెన్నో తెలుగుభాషలో చేరిపోయి తెలుగులై పోయినవి. ముస్లింల ప్రభావంతో తెలుగులో అరబీ, ఫార్సీ పదాలు చాలా చేరిపోయినవి. ఈ విదేశీ భాషాపదాలు శ్రీనాథుని కాలంనుండే ఎక్కువసంఖ్యలో తెలుగులోనికి రావటం మొదలు పెట్టినవి. ఈ యుగంలో వర్ధిల్లిన కవులు కూడా ఇటువంటి అన్యదేశ్యాలను చాలా వాడినారు. ఉదా.

పంచదారనుదిను బాబానజీరు (వి. నా. ర. పుట 45)

కుళ్ళాయిపైఁబాగ కుదురుగాజుట్టి (పై. పుట. 51) కావ్యభాషా పరిణామం 265

జాపత్రియును గురాసాని యోమంబు (పై. పుట. 51)

కమ్మగేదఁగి నేడుఁ గైకొని మరుఁడు (పై. పుట. 68)

వాలుగల నతాలు వాలుఁగనులు (సు. మా. చం. III 58)

జమూ ఖరుచుల్గణించి (అ. నా. హం. I 142)

జాఫరా జినుఁగు లేపునజెందు వనలంగుపోషు తక్కిగల (పై.I 240)

పంచాంగములుచెప్పి బాజారు లోపల (పై. II 153)

జగతీజ్యోతులు కాగడాలు బలు బంజాయీలుమో౦బత్తులున్‌ (పై. III 27)

కలయుఁగ ఖువొలు వచ్చు నాక్షణమె (పై.V 182)

సెబాసు ఖూబు మేలను (పై.V 201)

తేజమౌ గేదంగి నేజఁ బూని (చిం. ఛా. రా. IV 15)

కులుకు సోయగపు రాచిలుక తేజీ నెక్కి (పై.IV 15)

కేరి విరహుల మీఁద శికాడ్‌ వెడలె (పై IV 15)

మెలిచి దువాళిదోలు చలిమేళము బాజ యొనర్ప (పై. IV 16)

చిలుక పఠాణీతోణి రవళింపుచు (పై. IV 16)

చిలుక పఠాణి గుఱ్ఱపు నజీరుడు (పై. IV 18)

మద్ద త్తిఁక నెవ్వరనుచు మాధవుఁడపుడే (పై. IV 28)

కప్పిన జిన్గు మేలీమి జగాసొగసౌ జరుబాబు దుప్పటిన్‌ (పై.IV 181)

కొలకు జక్కువ పౌఁజు లెలసిరేయ (కూ. తి. ర. III 94)

బురుసా హిజారు మీఁదను (ప. రం. మ. V 17)

బలిమి జులుముల సందడుల్‌ (స. నా. రా. I 110)

నును సరిగె నకసీపని (లిం. శ్రీ. స. I 80)

ఖరుచు సేయుచు (పై. I 104)

నకాసీగుడారు (పై. III 4)

మొగలీ వజ్రీడు (పై. III 54)

హుజురు పాటకు (పై. IV 60) 266 తెలుగు భాషా చరిత్ర

బందిఖానా (పై. IV 118)

ఖబురు (పై. IV 147)

కవురంత నీవెఱుంగవొ (పై. IV 180)

8. 38. స్థూలంగా ఇది నాటి కావ్యభాషా స్వరూపం. సజీవమైన భాష ప్రవహించే నదివంటిది. నదీ ప్రవాహం ఒకచోట వెడల్పుగా మరొకచోట సన్నగా, ఒకచోట లోతుగా, మరొకచోట లోతు తక్కువగా, ఒకచోట సమానంగా, మరొక చోట ఎగుడుదిగుడుగా, ఒకచోట స్వచ్చంగా, మరోకచోట మకిలెగా ఉన్నట్లే, భాషకూడ నానావిధాలుగా ఉంటది. ప్రాతనీటిలో క్రొత్తనీరు చేరినట్లే ప్రాతతరాల భాషలో క్రొత్తతరాల భాష కలిసి పోతది. ముక్కూ మొగమూ సంగాలేనిరాళ్ళు ప్రవాహవేగంతో అరిగి కరిగి సాలగ్రామాల స్వరూపం సంతరించుకొన్నట్లే ఒకప్పుడు ఆసాధువులు గ్రామ్యాలు ఐన పదాలు కాలక్రమాన జనవ్యవహారంలో నలిగి శిష్టజన పరిగ్రాహ్యము లౌతవి. అందుకొరకే 'ప్రవాహినీ దేశ్యా' అన్నారు పెద్దలు.

ఉదాహృతకృతులు

1. కట్టా వరదరాజు, రామాయణం Vol. II (క.వ.రా.)

2. రఘునాథ భూపాలుడు, వాల్మీకి చరిత్రము (ర. భూ. వా.).

3. రఘునాథ భూపాలుడు, రామాయణము (ర. భూ. రా.)

4. విజయరాఘవ నాయడు, రమునాథనాయకాబ్యుదయము. (వి. నా.ర.)

5. సురభి మాధవరాయలు, చంద్రికా పరిణయము (సు.మా.చం.)

6. అయ్యలరాజు నారాయణామాత్యుడు, హంస వింశతి (అ.నా.హం).

7. కంకంటి పాపరాజు, ఉత్తర రామాయణము (కం. పా. ఉ.)

8. చేమకూర వేంకటరాజు, విజియవిలాసము (చే. వెం. వి).

9. చేమకూర వేంకటరాజు, సారంగధర చరిత్రము (చే.వెం.సా.)

10. చింతలపల్లి ఛాయవతి, రాఘవాభ్యూదయము (చిం.ఛా.రా.)

11. కూచిమంచి తిమ్మకవి, రసికజన మనోభిరామము (కూ.తి.ర.)

12. చెంగల్వ కాశకవి, రాజగోపాల విలాసము (చెం. కా. రా.) కావ్యభాషా పరిణామం 267

13. కంకంటి నారసింహకవి, విష్ణుమాయావిలాసము (కం. నా. వి.)

14. పాలవేకరి కదిరీపతిరాజు, శుఖ సప్తతి (పా. క. శు.)

15. కామినేని మల్లారెడ్డి, షట్చక్రవర్తి చరిత్రము (కా. మ. స.)

16. గోగులపాటి కూర్మనాథుడు, సింహాద్రినార సింహచాశతకము (గో. కూ. సిం).

17. కాకమాని మూర్తి, పాంచాలీ పరిణయము (కా. మూ. పాం.).

18. రెడ్రెడ్డి మల్లారెడ్డి గంగాపుర మాహత్య్మము (రె. మ. గం)

19. అహోబలపతి, కాళింధీ కన్యాా పరిణయము (ఆ. కా.)

20. ఆసూరి మరింగంటి వేంకటనృసింహాచార్యులు, గోదావధూటీ పరిణయము (ఆ. వెం. గో.)

21. కాకునూరి అప్పకవి, అప్పకవీయము (కా.అ. అ.)

22. కూచిమంచి జగ్గకవి, చంద్ర రేఖ విలాపము (కూ. జ. చం).

23. ఎలకూచి బాలసరస్వతి, మల్ల భూపాలీయము (ఎ. బా. మ.)

24. బిజ్జుల తిమ్మారెడ్డి, అనర్ఘరాఘవము (బి. తి. అ.)

25. ఋగ్వేది వెంకటాచలపతి, చంపూ రామాయణము (ఋ. వెం. చం.)

26. పసుపులేటి రంగాజమ్మ, ఉషాపరిణయము (ప.రం. ఉ.)

27. పసుపులేటి రంగాజమ్మ, మన్నారుదాసవిలాసము (ప. రం. మ.)

28. సముఖం వెంకటకృష్ణప్పనాయకుడు, అహల్యా సంక్ర౦దనము (స. వెం. అ.)

29. సముఖం వెంకటకృష్ణప్పనాయకుడు, రాధికాసాంత్వనము (స. వెం. రా.)

30. లింగనమఖి శ్రీకామేశ్వరకవి, సత్య భామా సాంత్వనము. (లిం. శ్రీ. స.)

31. చిత్రకవి సింగరార్యుడు, బిల్హణీయము (చి. సిం. బి.) ప్రకరణం 9

ఆధునికయుగం : గ్రాంథిక వ్యావహారిక వాదాలు (క్రీ. శ. 1900 నుంచి నేటివరకు)

- బూదరాజు రాధాకృష్ణ

9.0. నన్నయకు పూర్వంనుంచీ దేనికదిగా మారుతూ వచ్చిన కావ్య వ్యవహార భాషాభేదాలు రెండూ ఇరవయ్యో శతాబ్దం అరంభంలో తీవ్ర వాదోప వాదాలకు దారితీశాయి. పూర్వ కావ్యభాష మారదనీ దాన్ని మార్చగూడదనీ ఒక వర్గమూ, శిష్టవ్యవహారంలో ఉన్న భాషారూపాన్నే గ్రంథరచనలో ఉపయోగించాలని మరో వర్గమూ వాదించటంతో కవిపండితలోకం రెండుగా చీలిపోయింది. ఈ వాదోపవాదాలకు ప్రధానకారణం ఇరవయ్యో శతాబ్దింనాటి ప్రత్యేకపరిస్థితే.

9.1. నన్నయ కాలానికీ నాయకరాజుల కాలానికీ మధ్య కావ్యరచన వినా మరో సాహితీ ప్రక్రియకు పండిత లోకంలో గౌరవం ఉండేదికాదు. అవి పురాణాలయినా ప్రబంధాలయినా శతకాలయినా వాటి ప్రయోజనం కావ్యానందం కలిగించటమే. తర్కవ్యాకారణాది శాస్త్రాలను రచించేటప్పుడు కూడా పద్యరచనకే మన కవులు ప్రాముఖ్య మిచ్చారు. సంస్కృత నాటకాలనుకూడా పద్యకావ్యాలు గానే అనువదించారు. కవులమీద లాక్షణికుల ప్రభావం విపరీతంగా ఉండేది. వచనరచనలు, యక్షగానాదులు నాయకరాజుల కాలంలో పెద్దయెత్తున రావటంతో లాక్షణికప్రభావం తగ్గుతూ వచ్చింది. ఫలితంగా నన్నయనాటి భాషలోనే రాయాలన్న పట్టుదల సడలిపోయింది. ఆ కాలంలోనే ఆంగ్లేయ పరిపాలన దేశంలో మొధలై, క్రమక్రమంగా వేరుదన్ని నిలదొక్కుకోవటంతో, ఆంగ్లభాషద్వారా విశ్వసాపితీ స్వరూపం తెలుగు వారికి తెలియరావటంతో, విద్యాధికుల దృక్సఖాల్లో రాజకీయ సామాజిక జీవితవిధానాల్లో మార్చు వచ్చింది. ఇరవయ్యో ఆధునికయుగం : గ్రా౦థికవ్యావహారికవాదాలు 269

శతాబ్దానికి ముందుగానే ముద్రణ సౌలభ్యం, సామాన్యులకు కూడా విద్యాసౌకర్యాలు అధునాతన విద్యాబోధనపద్ధతులు తెలుగువారికి సమకూడేయి. ఇన్ని కారణాల వల్ల కొందరు విద్వాంసుల్లో వచ్చిన భావపరిణామమో విప్లవమో ఈ వాదోపవాదాలకు ప్రధానహేతువై ఆంధ్రసాహితీస్వరూపంలో భాషాచరిత్రలో పరమాద్బుతమైన విజయాలు సాధించింది. వాటికి బీజాలు భాషాసాపాత్యచరిత్రలో శతాబ్దాలకు ముందే పడి ఉన్నందువల్ల జరిగిన మార్పులన్నీ క్రమపరిణామంలో వచ్చినవేనని చెప్పవచ్చు. అయితే ఈ పరిణామాలు త్వరత్వరగా రావటానికి మాత్రం ఆంగ్ల భాషా సాహిత్యాదుల పరిచయం చాలా తోడ్పడింది. స్థూలంగా చరిత్రగతమైన ఆ మార్పులను ఇక్కడ పరిశీలిద్దాం.

9. 2. సనాతనలాక్షణికు లెన్ని కఠోరనియమాలు పెట్టినా, కవిపండితులెంతగట్టిగా ప్రయత్నించి ఆ నియమాల ననుసరించినా, కావ్యభాషలో అన్యదేశ్య పదాలూ, మాండలికాలూ వ్యాకరణవిరుద్ధప్రయోగాలు చాలా ప్రాచీనకాలంనుంచే అక్కడక్కడ ప్రవేశించటం మొదలుపెట్టేయి. మొదట అన్యదేశ్యాలను పరిశీలిద్దాం. క్రీ శ. పద్నాలుగో శతాబ్దంనుంచి అన్య దేశ్యశబ్దాలు కావ్యభాషలో ప్రవేశిస్తూ వచ్చాయి. ( గోపాలకృష్ణారావు, 1968, పే. 12). మచ్చుకు, తిక్కన ప్రయోగించిన 'త్రాసు' శబ్దం 'తరాజు' నుంచి ఏర్పడ్డది (అదే పే. 18). ఖుసి, సురధాణ (హర. 1-22), మురాయించు (హర. 3-89), దివాణము (హర. 4.9), సామాను (హర. 1-27) మొదలై న పదాలను శ్రీనాథుడు ప్రయోగించాడు. అప్పకవిలాంటి సనాతన లాక్షణికుడు 'వ్యవహారహాని' కలుగుతుందన్న కారణంతో అన్యదేశ్య ప్రయోగాన్ని ఆమోదించి ఉదాహరించాడేగాని (అప్ప. 1-64 నుంచి 70) సంస్కృత ప్రాకృతసమాలకులాగా వీటినికూడా రూపనిష్పాదనక్రియను ఏర్పరచనూ లేదు; ఆర్వాచీనులు అదేవిధంగా ప్రయోగించవచ్చునని అనుమోదించనూ లేదు. తరువాతి లాక్షణికులు సరేసరి. ఈ విధానం కాలక్రమాన పండితమండలికి అధికామోదకరమై క్రీ. శ. పందొమ్మిదో శతాబ్దినాటి శిష్టు కృష్ణమూర్తి శాస్త్రి చాటువులనంటే వాటిలో వెర్రితలలు వేసింది. ఉదాహరణకు, 'వీరు తెలుంగు సాము లరబీ తరబీయతు నొప్పు గొప్ప సర్కారు వలే జమీలు దరఖాస్తుగ నేలిన రాజమాన్య హంవీరుల' ..వగైరా (పిచ్చయ్యశాస్త్రి, 1961, పే. 65). అలాగే ఆ శతాబ్ది తుది రోజుల్లో అచ్చైన 'కన్యాశుల్కం' లో (1896) గురజాడ అప్పారావుగారు ఆంగ్లభాషాపదాలను విశృంఖలంగా వాడేరు. 270 తెలుగు భాషా చరిత్ర

9. 3. ఇక మాండలికపదాల సంగతి. కావ్యవ్యవహారంలో మాండలికపద రూపాలుండవని ఈనాటికీ కొందరు పండితులు విశ్వసిస్తున్నా, నన్నయనాటినుంచీ అవి కనిపిస్తూనే ఉన్నాయి. నన్నయభాషలో 'దారుణం', 'నీతదర్థం' లాంటి గోదావరిమాండలికాలు కనిపిస్తున్నాయి. 'చల్లా యంబలిఁద్రావితిన్‌...” అనే శ్రీనాథ చాటువులోని (వీధి: పీఠిక, వేటూరి, పుట 57) 'చల్ల' మాండలికం ; ఇతర ప్రాంతాల్లో వాడుకలో ఉన్న మాట 'మజ్జిగ'. అలాగే ధూర్జటి శ్రీకాళహస్తి మాహాత్మ్యంలోని 'బిజమాడు దేవర నిజకృపామహిమఁ జెన్నారు నాయిల్లు బిడారు నీకు' (అప్ప. 1-70) మొ వీరశైవ గృహభాషాపదాలు, వీటిని వర్గమాండలికాలు (Class dialects) అనవచ్చు. ఇలాంటివి వేనవేలు.

9. 4. వ్యాకరణవిరుద్ధ్యప్రయోగా లన్నిటినీ మన లాక్షణికులూ సనాతన పండితులూ 'గ్రామ్య'మని కావ్యప్రయోగానికి అనర్హమని నిరాదరించినా, వాటికి ప్రాచీనకావ్యాలలో సైతం ప్రయోగాలు లభిస్తున్నాయి. 'వస్తూచూస్తిమి రోస్తిమిన్‌', చేస్తిమి లేస్తిమామె కుడిచేతికి దండము' లాంటి. వ్యావహారికరూపాలు శ్రీనాథుడి చాటువుల్లో ఉన్నాయి. 'ఇరవై' (కాశీ. 1-52), 'వినీవినని భంగి' (నైష.5-68), 'ముట్టడము' (కాశీ. 5-301), 'చీకిలించుక' (కాశీ. 3-195), 'చావడము' (భార. ఉద్యో. 8-61), 'అయినా' (ఉ. హరి. 5-198), 'ఏమీ' (ఉ. హరి. 5-195), 'ముళ్ళు' (భాగ. 6-81), 'నాటుక' (భాగ. 5-2, 145), 'చేతురు' (నైష. 5-68), 'ఎగాదిగ' (అము. 2-50), 'పట్టుక' (ఆము. 6-85), 'చూచినారు, డాసినారు' (మను. 1-68), 'చలపకారము' (మను. 5-58), 'వేఁటకరుల్' (మను. 4-50), 'అల్పదనము' (పాండు. 8-62), 'దాఁటేవానికిన్‌' (పాండు. 4. 275), 'రోసింది, పూసింది, మూసింది, చేసింది" (కాళ. 71), 'అంటే' (కాళ. 52), 'పోతే' (కాళ. 69) మొదలైన 'గ్రామ్య' శబ్దాలు ప్రామాణికగ్రంథాల్లోనే లభిస్తున్నాయి. సామాన్య రచనల సంగతి చెప్పనక్కరలేదు. గేయసాహిత్యం (పదకవిత) లో 'గ్రామ్య' పదాలు బాగా చోటుచేసుకొన్నాయి. తాళ్లపాక కృష్ణమాచార్యుల 'సంకీర్తన లక్షణం'లో నాటకాదుల్లో పదకవితలో 'గ్రామ్య'పదాలు పనికి వస్తాయన్నారు (ప్రభాకరశాస్త్రి, 1948, పే. 44).

9.5. క్రీ.శ. పదహారో శతాబ్ధంనుంచి కేవలం వచనరచనలు కొద్దికొద్దిగా బయలుదేరేయి. విశ్వనాథ సానాపతి 'రాయవాచకం' (1520 ప్రాంతం) ఆలాంటి ఆధునిక యుగం : గ్రాంథికవ్యావహారికవాదాలు 271

వాటిలో మొదటిది. నాయకరాజుల కాలంలోనూ ఆ తరవాతా ఈ రకం గ్రంథాల సంఖ్య క్రమంగా పెరుగుతూ వచ్చింది. వీటిలో లక్షణవిరుద్ధభాషకు స్థానం దొరికింది. మహాకావ్యాలకు, లక్షణగ్రంథాలకు, పండితులు రాసిన టీకావ్యాఖ్యానాల్లో శాస్త్ర రచనల్లో క్రమంగా వ్యావహారికానికి తావు లభిస్తూ వచ్చింది. శాసనాల్లోను, తాటేకు పుస్తకాల్లోను మొదటినుంచీ వ్యావహారికరూపాలు పూర్తిగాను, కొంతకు కొంతగాను ఉంటుండేవి. కావ్యరచన చాలావరకు గతానుగతిక మైన ప్రబంధ ధోరణిలోను, కొరవకు ద్వ్యర్థిత్ర్యర్థి కావ్యాలవంటి చిత్రవిస్తరాది కవితాఫక్కికల్లోను సాగుతుండేది. తెలుగుభాషా సాహిత్యాలు ఈ స్థితిలో ఉండగా ఆంగ్ల పభుత్వం ఏర్పడిన తరవాత కొంత భావపరివర్తనం వచ్చింది.

9.6. ఆంగ్ల ప్రభుత్వం ధర్మమా అని తెలుగువారికి లభించిన ముఖ్య సహాయం ముద్రణ సౌకర్యం, క్రీ. శ. 1720 నుంచి వ్యావహారికంలో ఉన్న క్రైస్తవ వాఙ్యయం తెలుగులో రావటం మొదలయింది (ని. వెంకటరావు, 1954, పే. 68). 1746 నుంచి అలాటి గ్రంథాలు సంఖ్యాధికంగా వస్తూండేవి (అదే. పే. 69). 1806 లో మద్రాసులో తెలుగు ముద్రణాలయం నెలకొన్నప్పటినుంచీ దేశభాషా గ్రంథ ప్రచురణ మూడుపూలు ఆరుకాయలుగా వర్జిల్లింది (రమణారెడ్డి. 1969, పే. 23). 1802 నుంచి ప్రభుత్వ ప్రకటనలు తెలుగులో వస్తుండేవి (రామమూర్తి, 1958, పే. 13). 1813 లో బ్రిటిష్‌ పార్లమెంటు 'చర్చి మిషనరీ సౌసైటి'ని స్థాపించాలని దేశభాషల్లో విద్యాబోధన జరపాలని, సంకల్పించి 'ఛార్టర్‌ ఆక్ట్‌' పాస్ చేసింది (రమణారెడ్డి 1969, పే. 21), తత్ఫలితంగా మద్రాసులోని 'సెయింట్‌. జార్జ్‌కోటలో ఆయేడే ఒక కళాశాల స్థాపించారు. అందులో పట్టాభిరామశాస్త్రిగారు సంస్కృతా౦ధ్రశాఖలకు ప్రధానులుగానూ, రావిపాటి గురుమూర్తి శాస్త్రిగారు ఉదయగిరి వెంకట నారాయణయ్యగారు అధ్యాపకులుగానూ ఉండేవారు. దీంతో కులమత విచక్షణ లేకుండా కోరిన వారందరికి విద్యాసౌకర్యాలు ఏర్పట్టమే కాకుండా ఆంగ్లభాషా, తద్వారా విశ్వసాహితీ విశేషాలూ తెలుగు విద్యార్థులకు అందుబాటులోకి వచ్చాయి. 1829 లో మద్రాసు మచిలీపట్టణాల్లో ఇంగ్లీషు (బోధన మాధ్యంగా) పాఠశాలలు ఏర్పడ్డాయి. 1841 లో మద్రాసులో ఉన్నత పాఠశాల నెలకొన్నది. మద్రాసులోనే 1855 లో రాజధాని కళాకాల, 1857 లో విశ్వవిద్యాలయమూ ఏర్పడ్డాయి. ఆధునికవిద్యార్దుల ఉపయోగార్థం ప్రాచీనగ్రంథాలను ముద్రించవలసివచ్చింది. దాంతో 'పరిష్కర్త' లేర్పడి పూర్వకవిప్రయోగాలను దిద్దటం మొదలుపెట్టేరు. ముద్రణ సౌకర్యాలవల్ల వచ్చిపడ్డ దౌర్భాగ్యం ఇదొకటి. 272 తెలుగు భాషా చరిత్ర

9.7. పాశ్చాత్యవిద్వాంసుల్లో పరిపాలకుల్లో కొందరు సంస్థృతాంద్రాలను, ద్రవిడభాషలనూ నేర్చి గ్రంథరచన సాగించటంతో నూతనసాహితీ ప్రకియలతో బాటు నూతన రచనాధోరణులు గూడా తెలుగువారికి పట్టుపడ్డాయి. కర్నల్‌ కాలిన్‌ మెకంజీ (1753-1821) అనే ప్రభుత్వోద్యోగి కావలి వెంకటబొర్రయ్య (1776-1803) గారనే విద్వాంనుడి సహాయంతో బహువ్యయప్రయాసలు పడి సేకరించిన 'కై ఫీయతులు' మనవాళ్ళకు తొలిసారిగా చారిత్రక దృక్పథం ప్రసాదించాయి. వీటన్నిటినీ పునారచింపజేసి ఛార్లెస్‌ ఫిలిప్‌ బ్రౌన్‌ 62 సంపుటాల స్థానికచరిత్రలను సిద్ధపరిచాడు. 1816లో కాంబెల్‌, 1817లో బ్రౌన్‌ తెలుగుభాషకు నవీనపద్ధతిలో వ్యాకరణాలు రాశాడు. 1820 లో 'ఉపయుక్త గ్రంథకరణ దేశ భాషాసభ ఏర్పడి తెలుగులో అప్పటికి పెద్దలోటుగాఉన్న వచనరచనకు పాఠ్యగ్రంథనిర్మాణానికి నడుంకట్టింది. 1840 లో బ్రౌన్‌ తెలుగువచనంలో రాసిన తెలుగువ్యాకరణం వెలువడింది. అతని తెలుగు-ఇంగ్లీషు, ఇంగ్లీషు-తెలుగు నిఘంటువులు 1852లోను, బ్రౌణ్య మిశ్రభాషానిఘంటువు 1854 లోను వెలుగుచూశాయి. 1855-66 లో రాబర్డ్‌ కాల్డ్‌ వెల్‌ రాసిన ద్రవిడభాషా తులనాత్మక వ్యాకరణం శతాబ్దాలుగా భాషావిషయంలో తెలుగు విద్వాంసులకున్న దురభిప్రాయాలను కొంతవరకయినా పోగొట్టింది. భాషలు మారతాయని, మార్పు చెడిపోవటం కాదని, 'సకల భాషలకును' సంస్కృతం 'జనని' కాదని ఈ వ్యాకరణం ప్రతిపాదించింది.

9.8. పాఠ్యప్రణాళికలో వచ్చిన మార్చులవల్ల విద్యావిధానంలో కూడా మార్చు వచ్చింది. అంతవరకూ పంచకావ్యాలకూ తర్కవ్యాకరణాదులకూ పరిమితమైన విజ్ఞానబోధలో చరిత్ర, భూగోళం, ప్రకృతి భౌతిక శాస్త్రాలు, విభిన్న సారస్వత ప్రక్రియలూ చోటుచేసుకున్నాయి. గురుమూర్తిశాస్త్రిగారి 'విక్రమార్కుని కథలు' (1819), 'పంచతంత్ర కథలు' (1934), ఏనుగుల వీరాస్వామయ్య గారి 'కాళీ యాత్రాచరిత్ర' (1838), మామిడి వెంకయ్యగారి 'ఆంధ్ర దీపిక' (రచన 1816, ప్రచురణ 1848), బ్రౌన్‌ బైబిల్‌ అనువాదము (1827), ఆర్జెన్‌ తెలుగు వ్యాకరణము (1873), జార్జి బీర్‌ 'ప్రపంచభూగోళము' (185), గురుమూర్తిసాస్త్రి గారి తెలుగువ్యాకరణము (1836) మొదలైనవి పాఠ్యగ్రంథాలుగా ఉండేవి. 1848 లో పరవస్తు చిన్నయసూరిగారు 'ఉపయుక్త గ్రంథకరణ దేశభాషాసభ'కు అధ్యక్షులయ్యేటంతవరకు పాఠ్యగ్రంథాల్లో వ్యాకరణ రచనల్లో అనాటి శిష్టవ్యావహారికమే వాడుకలో ఉండేది. ఆయన 1853 లో 'నీతిచంద్రికను'ను, 1855 లో ఆధునికయుగం : గ్రాంథికవ్యావహారికవాదాలు 273

'బాలవ్యాకరణము' రచించి రాజధానికళాశాలలో ప్రధానాంధ్రాధ్యాపకులయిన తరవాత పరిస్థితులు తలక్రిందుగా మారేయి. ఆంగ్లభాషాసంప్రదాయాలతో పరిచయ మేర్పడ్డ కారణంగా తెలిగువారికి కలిగిన మరోలాభం పత్రికాప్రచురణ. మొదట తెలుగు పత్రిక 'వర్తమాన తరంగిణి' లోనూ, రెండోది 'సుజన రంజని' (సూరి సంపాదకుడుగా 1845 లో వెలిసింది) లోనూ, తరవాత తరవాత గ్రాంథిక భాషకే స్థానం కలిగినా తొలిరోజుల్లో వ్యావహారికమే ఉండేది. సామినేని ముద్దు నరసింహంనాయుడుగారు 1840 లో రాయగా ఆయన మరణానంతరం 1862 ప్రచురితమైన 'హితసూచని' పీఠికలో ఆనాటి అభ్యుదయగామి పండితుల దృక్పథం తెలియవస్తుంది. సిద్ధాంతచర్చ చేసి అర్దానుస్వార శకటరేఫలను వర్ణించాలని చెప్పిన వారిలో ఆయనే ప్రథముడు. 1897 లో వెలుగుచూసిన గురజాడ అప్పారావుగారి 'కన్యాశుల్కము' ఆ సిద్ధాంతాలను ఆచరణలో పెట్టిన మొట్ట మొదటి మహాగ్రంథం.

9.9. అటు సాహిత్యంలోనూ పెద్దమార్పువచ్చింది. సంఘ సంస్కరణతో బాటు భాషా సాహిత్య సంస్కారాన్ని తలపెట్టిన కందుకూరి వీరేశలింగంగారు (1848-1919) విభిన్న సాహితీశాస్త్ర ప్రక్రియలను 'సరళ గ్రా౦థిక' భాషలో (1880) వెలువరించటం ఆరంభించారు. క్షీణయుగ సాహిత్యప్రక్రియల్లో భాషలోనూ రచనలోనూ కనిపించే సాము గారిడీలకు ఆయన స్వస్తి చెప్పేరు. ఇటు కన్యా శుల్క మార్గం అతినూతనమైన భాషాభావవిప్లవం రేకెత్తించింది. కావ్యభాష వ్యవహారభాష కెప్పుడూ దూరంగా ఉంటుండేదని, సంప్రదాయ పండితులు తమనాటి వ్యవహారభాషను మరచిపోతుండేవారని, పాశ్చత్యవిద్వాంసులు చేసినవాదం కొందరినై నా ఆకర్షించటం మొదలయింది- ఇరవయ్యో శతాబ్దానికి ముందుగానే1 . ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం గిడుగు వెంకటరామమూర్తి గారు సవర భాషకు 1892 లో రచించిన నిఘంటు వ్యాకరణాలు. ఆయేడే టి. ఎమ్‌. శేషగిరి శాస్త్రిగారి 'ఆర్థానుస్వారతత్వము' కొంతకు కొంత భాషాశాస్త్రధోరణిలో వెలువడింది. ఆనాటికి ఆంగ్లదేశంలోనే అధునాతన మనిపించిన 'ప్రత్యక్షపద్ధతి (Direct Method) లో విద్యాబోధన చేయటాన్ని తెలుగుదేశ౦లో ప్రవేశ పెట్టిన గిడుగు రామమూర్తి గారు విజ్ఞాన సముపార్జనకు పురాతనకావ్యభాషకాక ఆధునాతన శిష్టవ్యావహారిక మే చాలా మంచిదని గ్రహించి ప్రచార మారంభించారు.

(18) 274 తెలుగు భాషా చరిత్ర

9. 10. పై పరిస్థితులకు తోడు సాహితీరంగంలో అన్యోన్యస్పర్థలవల్ల పండితకవులు రెండు వివాదాలు తెచ్చిపెట్టుకొన్నారు. వాటిలో మొదటిది పాత్రోచిత భాషావివాదం ; రెండోది ఎవరు గ్రా౦థికభాషావేత్త లనేది. ఈ రెండూ ఇంచుమించు ఒకే కాలంలో వచ్చాయి. సంస్కృతనాటకాలను అనుసరిస్తున్న కొందరిని వాటిలో ఉత్తమపాత్రలకు సంస్కృతాన్ని, నీచపాత్రలకు ప్రాకృత భేదాలనూ వాడటం ఆకర్షించింది. వేదం వేంకటరాయశాస్త్రీగారి 'నాగానంది' మనే తెలుగు నాటకంలో (1896) తొలిసారిగా నీచపాాత్రలకు వ్యావహారికభాష ఉపయుక్తమైంది. దాంతో సనాతనవాదులకూ సంస్కరణవాదులకూ జగడం మొదలయింది. ఈ విషయాన్ని పరిష్కరించటానికి 1898 డిసెంబరులో మద్రాసులో పండితపరిషత్తు చర్చలు చేసింది. నాటకరచనలో 'గ్రామ్య' పదాలను వాడరాదని వడ్డాది సుబ్బారాయుడు (రాజమండ్రి), ధర్మవరం కృష్ణమాచార్యులు (బళ్ళారి), నాగపూడి కుప్పుసామయ్య (చిత్తూరు) గారలు వాదించారు, పూండ్ల రామకృష్ణయ్యగారు నెల్లూరునుంచి నడుపుతున్న "అముద్రిత గ్రంథ చింతామణి” పత్రికలో ఎరగుడిపాటి వేంకటచలముగారు రసపోషణ ప్రధానమైన నాటకాల్లో 'పాత్రోచిత భాష' అవశ్యం ప్రయోగించదగిందని వాదించారు ( 'నాటకాదుల) యందు గ్రామ్యభాష యుపయోగింపఁదగునా' ? తగదా ? -అ. గ్రం. చిం. 1899 ఎప్రిల్‌, సం. 12, సం. 4). ఆనాటికే కందుకూరి వీరేశలింగం, కోలాచలం శ్రీనివాసరావు, వేదం వేంకటరాయశాస్త్రిగారలు రాసిన నాటకాలు పదకొండింటిలో ఈ విధానం ఆచరణకు వచ్చింది. ఈ వాదాన్ని పూండ్లవారు సమర్ధించారు. కొద్ది కాలంలోనే వ్యతీరేకభావం సన్నగిల్లింది. గ్రాంథికవాదనికి గండి పడ్డది. ఇక రె౦డో రంగం. కందుకూరివారు ఆపండితులని నిందించిన కొక్కొండ వేంకట రత్నంపంతులుగారి 'ప్రసన్నరాఘవనాటకం' గ్రామ్యతాభూయిష్టమని 1898 లో వేదంవారు తమ 'ప్రసన్నరాఘవవిమర్శునము' లో దూషించారు. వేదంవారికి కూడా గ్రా౦థికభాష సరిగారాదని గిడుగువారు 1897 లో తొలిసారిగా ప్రకటించిన 'ఆంధ్రపండిత భిషక్కుల భాషాభేషజము' అనే ఖండన గ్రంథంలో సప్రమాణంగా నిరూపించారు. సరిగా ఆ కారణంవల్లనే శిష్టవ్యావహారికాన్ని సర్వాంధ్రో పయోగార్థం వాడాలని గిడుగువారనటంతో సంకుచితవిద్యాస్పర్థ ఒక మహోద్యమానికి దారితీసింది. అంతవరకూ చర్చారూపంలో ఉన్న వాదోపవాదాలు గిడుగువారి రాకతో ఉద్యమరూపం ధరించాయి. సామినేనివారి కాలంలో ( 1840) ఆధునికయగం .: గ్రా౦థిక వ్యావహారిక వాదాలు 275

బీజప్రాయంగా ఉన్న అభిప్రాయం ఇరవయ్యో శతాబ్ధం తొలిరోజులనాటికి ఉద్యమ రూపం ధరించగానే సనాతనవాదులూ సంస్కరణవాదులూ, తమలోఉన్న స్పర్థలను విస్మరించి గిడుగువారిమీద ఒక్కటై మోహరించారు.


9.11. ఇరవయ్యోశతాబ్దపు భాషాచరిత్రకూ వ్యావహారికోద్యమచరిత్రకూ అవినాభావసంబంధముంది. ఉద్యమారంభం 1910లో అయిందనవచ్చు. నూతన బోధనపద్ధతిని వివరించటానికి అయేడు మే నెలలో విశాఖలో సమావేశపరిచిన ఉపాధ్యాయులను పనిలోపనిగా గిడుగువారు వ్యావహారిక రచనలను ప్రోత్సహంచమని, వాటిని పాఠ్యగ్రంధాలుగా అనుమతించమని అభ్యర్థించారు. భావంలో, భాషలో, ఛందస్సులో నూతనమార్గాలు తొక్కిన గురజాడ అప్పారావుగారి 'నీలగిరి పాటలు, ముత్యాల సరాలు' ఆయేడే ప్రచురితమయినాయి.. గురజాడవారు గిడుగు వారి వాదాన్ని సమర్థిస్తూ నవంబరు 24 న 'గ్రామ్యశబ్దవిచారణ' మనే వ్యాసం, సంవళత్సరాంతంలోగా 'వాడుకభాష-గ్రామ్యము' అనే వ్యాసం రాశారు. వీటితో గ్రాంథికవ్యావహారాల్లో ఏది ఉపాధేయమన్న వాదన శాస్త్రచర్చగా పరిణమించింది.

9.12. గిడుగువారివాదంలో ప్రధానమైన సిద్దాంతాలు నాలుగు : (1) సామూహిక విద్యాసౌకర్యాలకు కావ్యభాష చాలదు. (2) శాస్త్రగ్రంథాలను, వచన రచనలను శిష్టవ్యవహారభాషలో రాయటమనే సంప్రదాయం మనకుంది. దాన్ని పరిహరించరాదు. (3) ఆధునిక విద్యాబోధన పద్ధతికి శిష్ణవ్యవహారభాషే తగింది. (4) గ్రాంథికభాష పండితులకే రాదు దాన్ని అభ్యసించటం కష్టసాధ్యం. అందరు విద్యార్థులకూ ఆ భాషాజ్ఞానం అక్కరలేదు. సూరిగారి వ్యాకరణం కావ్యభాషను కూడా పూర్తిగా వర్ణించలేదు. కాబట్టి దాన్ని ఆధారం చేసుకొని మన పూర్వకవి ప్రయోగాలను దిద్ది ప్రచురించటం నేరమని గిడుగువారు వాదించారు. మద్రాసు విశ్వవిద్యాలయం సెనేట్‌లో తమకున్న పలుకుబడిని ఉపయోగించి. గిడుగు గురజాడలు వ్యావహారికరచనలు పాఠ్యగంధాలుగా ఉండవచ్చునన్న ప్రభుత్వ నిర్ణయం సంపాదించారు. (20-9-1912 నాటి G. ౦. Ms. No. 3098). వారి వాదాన్ని అంగీకరించిన మొదటితరం అనుయాయుల్లో ఒకరైన నెట్టి లక్ష్మినరసింహంగారు రాసిన 'గ్రీక్పురాణకథ' లనే పుస్తకాన్ని స్కూల్‌ ఫైనల్‌ విద్యార్థులకు ఉపవాచకంగా నియమించటంతో పెద్ద సంచలనం బయలుదేరింది. ఈ గ్రంథం అర్థగ్రాంథికంలో కృతిమ వ్యావహారికంలో ఉండి నిశితవిమర్శల పాలై 276 తెలుగు భాషా చరిత్ర

అశక్తసహాయం చేసింది. విశాఖ కళాశాలాధ్యక్షులు పి. టి. శ్రీనివాసయ్యంగారి 'Indian Practical Arithmetic' (1911), వీరి పీఠికతో ఆయేడే వెలువడ్డ వేదం వేంకటాచలమయ్యగారి 'విధి లేక వైద్యుడు' అనే పుస్తకమూ అలాంటి రచనలే. శ్రీనివాసయ్యంగారి 'Life of Death- A Plea for Vernaculars' అనే కరపత్రం గ్రాంధికాన్ని తీవ్రంగా నిరసించి సనాతన పండితులను బాగా రెచ్చ కొట్టింది. పై సిద్ధాంతాలను ప్రచారం చేయటానికి విజయనగరంలో ' ఆంధ్ర సారస్వత సంఘాన్ని' నెలకొల్పేరు. విజయనగర కళాశాలాధ్యక్షులు కిళా౦బి రామానుజాచార్యులుగారు దీనికి అధ్యక్షులు, బుర్రా శేషగిరిరావుగారు కార్యదర్శులు. కొన్ని సంవత్సరాలుగా వాడుకలోఉన్న భాషలోనే గ్రంథరచన చేయాలని, శిష్టవ్యహారభాషే నేటి ప్రామాణికభాష కాబట్టీ పఠన పాఠనాలు అందులోనే జరగాలని పై సంఘంవారు తీర్మానించారు.

పై సిద్ధాంతాలవల్ల భాషాసాహిత్యాలు అవ్యవస్థలో పడిపోతాయని, వ్యావహారికమనేది గ్రామ్యమేనని, నమ్మినవారు జయంతి రామయ్యగారి ఆధ్వర్యాన కాకినొాడలో 'ఆంధసాహిత్యపరిషత్తు' (Telugu Academy) స్థాపించారు. ఆనాటి పెద్ధపండితులు వేదం వేంకటరాయశాస్త్రి, కాశీభట్ట బ్రహ్మయ్యశాస్త్రి, వావిలికొలను సుబ్బారావు (వాసుదాసు) గారలూ తదితరులూ ఈ సంఘంలో సభ్యులు. ఆశయ్యప్రచారానికి 'ఆంధ్రసాహిత్య పరిషత్పత్రిక' ను ప్రచురించారు. (వాసుదాసుగారు 'ఆధునిక వచనరచనావిమర్శన' మనే పుస్తకంలో వ్యాకరణరీత్యా వ్యావహారికం గ్రామ్య మేనని తీర్మానించారు). ఈ సంఘంలో గిడుగు, గురజాడలు కూడా సభ్యులై నారు. మద్రాసు పచ్చయప్ప కళాకాలలో వీరు జరిపిన ప్రథమ సాంవత్సరికసభలో శతఘంటము వేంకటరంగశాస్త్రిగారు గ్రామ్యాన్ని సమర్థిస్తూ ప్రసంగిస్తే, గిడుగువారు 'ఆంధ్రభాషాచరిత్ర'అనే వ్యాసం చదివి శిష్టవ్యావహారికాన్ని సమర్థించారు. ఈ వివాదంమీద అనేకులను ఆహ్వానించి గోష్టి ఏర్పాటు చెయ్యాలనే నిర్ణయం జరిగింది. ఆ తరవాత పరిషత్తువారు నవంబర్‌ 24న కందుకూరి వీరేశలింగంగారి అధ్యక్షతన 'గ్రామ్యాదేశనిరసనసభ' జరిపేరు. అధ్యక్షులవారు భాష 'నాగరభాష, గ్రామ్య' మని రెండువిధాలని, మొదటిది సంస్కృతంలాగా పరిష్కృతం కాబట్టి కావ్యరచనకు పూర్ణంగా ఫనికివస్తుందని, రెండోది పామరవినోదార్థం పాత్రోచితభాషగా అక్కడక్కడ వాడదగిందని సెలవిచ్చారు. పూర్వకాలపు తెలుగువ్యాకరణాలు ముఖ్యంగా కావ్యాలకోసం ఉద్దేశింపబడ్డాయని, గద్యానికి ఆధునికయుగం : గ్రా౦థిక వ్యావహారిక వాదాలు 277

భాలవ్యాకరణమే శరణ్యమని వారి భావం. వ్యావహారికరచనల్లో మాండలిక పదజాలంచేరి భాషా 'పరిశుబ్రత' చెడిపోతుందని వారి విశ్వాసం. జయంతి రామయ్యగారు వ్యావహారిక రచనల్లో 'సులభత' లేదని నన్నయనాటికే 'స్థిర'పడ్డ తెలుగుకూ, షేక్సిపియర్‌ కాలంవరకూ మారుతూవచ్చి అప్పుడే స్థిరపడ్డ ఇంగ్లీషుకూ పరిణామక్రమంలో భేదంలేదని, మాండలికమయమైన నిస్సారకవితతో నిండిన గ్రామ్యగ్ర౦థాలు పాఠ్యగ్ర౦థాలుగా పనికిరావని వాదించారు. అన్యభాషాపదాలతో నిండిన వ్యావహారికం సుబోధకంకాదని, ఉన్నపదజాలం గ్రంథరచనకు చాలదని, వ్యాకరణ విరుద్ధమైన వ్యావహారికపదాలు నిషిద్ధాలని వేమూరి విశ్వనాథశర్మగారు అభిప్రాయపడ్డారు. విసంధి పాటించటం, అర్దానుస్వార, శకటరేఫలు వదిలి వేయటం, అన్యదేశ్యాలు వాడటం తప్పని వారి మతం. వ్యావహారికరచనలు పాఠ్యగ్ర౦థాలు కారాదని శాసించగోరుతూ పరిషత్తువారు ప్రభుత్వానికి ఒక వినతి పత్రం సమర్పించ నిర్ణయించినారు. అందులోని ముఖ్యాంశాలివి : (1) “పన్నెండో శాతాబ్దినాటి” (?) నన్నయనుంచి నేటి కందుకూరివారివరకూ గ్రాంథికభాషమారనేలేదు. (2) పూర్వకవులందరూ ఏనాటి భేదమూలేని ఒకేభాషారీతిలో రాశారు. కాబట్టి గ్రాంథికంలో ఏకరూపత (Uniformity), దానికి ప్రామాణికత ఉన్నాయి. (3) ఆధునికా౦ధ్రభాషకు ప్రత్యేకస్థానం లేదు. (4) భవిష్యత్తులో దుర్గ్రాహ్యమూ దుర్చోధమూ అయ్యే ఈ వ్యావహారికానికి వ్యాకరణసూత్రాలు లేవుకాబట్టి అది పాఠ్యగ్ర౦థరచనకు పనికిరాదు.

9.13. పై సిద్ధాంతాలతో అంధ్రదేశంలోని కవిపండిత మేధావులందరినీ ఈ రెండు సంఘాలవారూ ముగ్గులోకి దింపేరు. కాలక్రమాన చర్చలవేడి పెరిగింది. 1912 మే 15, 16 తేదేలలో పరిషత్తు ఆధ్వర్యంలో మద్రాసులో ఒక పండితసభ జరిగింది. దానికి కొమర్రాజు లక్ష్మణరావుగారు అధ్యక్షులు, పేరి కాశీ నాథశాస్త్రిగారు లౌకికవైదికసంస్తృతాల మధ్య ఉన్నట్లే గ్రా౦థికవ్యావహారికాల మధ్య 'వ్యాకరణసిద్ధ' మైన భేదముందీని వాదించారు. వాదప్రతివాదాల తర్వాత, పిల్లల పుస్తకాల్లోమాత్రం విసంధి పాటించాలని, అన్యత్రా గ్రాంథికమే శరణ్యమని తీర్మానించారు.3 ఆ తరవాతి నెలలో వేదంవారి 'గ్రామ్యాదేశ నిరసన' మనే పుస్తకం ఈవాదానికి మంచి సమర్థన గ్రంథంగా వెలువడింది. గ్రామ్యగ్రా౦థిక వివాదంలో తమ విశ్వాసాలను వివరిస్తూ పరిషత్తువారు తయారుచేసిన వినతిపత్రాన్ని ఆగస్టు 7 న సర్‌ బయ్యా నరసింహేశ్వరశర్మగారు గవర్నరుకు సమర్పించారు. 278 తెలుగు భాషా చరిత్ర

స్కూల్‌ఫైనల్‌ విద్యార్థి ప్రాచీన నవీన పాఠ్యగ్రంథాల్లో వేటినయినా చదివే అవకాశమిమ్మని అభ్యర్థించగా ప్రభుత్వానుమతి సెప్టెంబర్‌ 20న (జి. ఒ. 3098) లభించింది. ఇది గ్రా౦థికవాదానికి తొలివిజయం. ఆ తరవాత మరింత ఒత్తిడి చేసి, ఒక్కొక్క విద్యార్థికాక ఒక్కొక్క పాఠశాల ఈ రెండు రకాల్లో ఏరకం గ్రంథాలను నిర్ణయిస్తే అదే ఆ బడి మొత్తానికి అన్వయించాలనే ఉత్తరువును సెఫ్టెంబర్‌ 29 న (జి. ఒ 3479) సంపాదించారు. ఇది మలి విజయం, దీంతో మరింత పుంజుకొని వ్యావహారికవాదాన్ని అవహేళనచేస్తూ పానుగంటి లక్ష్మీనరసింహారావుగారు 'గ్రామ్యవాదుల భాషాపవాద' మనే పుస్తకం ప్రచురించారు.

ఇది ఇలా ఉండగా తమకు ఆంగ్ల భాషాజ్ఞానమేకాని ఆంధ్రభాషాపరిచయం లేదన్న అపప్రథను పోగొట్టుకోడానికి గిడుగువారు 'ప్రాఁదెనుఁగుఁగమ్మ' ప్రకటించారు. అనాటి వైయాకరణుల్లో సర్వోత్తము లనిపించుకున్న తాతా సుబ్బరాయశాస్త్రిగారు 'ఆ౦ధ్రభాషాసంస్కరణ' మనే వ్యాసంలో (అం. సా. ప. ప. సం. 2 (1912), సం. 3) ఏ భాషనైైనా పూర్ణంగా సంస్కరించటం మానవాసాధ్యమని, సంస్కృతానికి పాణిన్యాదుల వ్యాకరణాలే చాలవని, మన పూర్వులు కూడా శిష్టా ప్రయోగానుగుణంగా ఆయాకాలాల్లో వ్యాకరణసంస్కరణం చేసేవారని, ఇప్పటి శిష్టాచారం ప్రకారం తెలుగు వ్యాకరణాన్ని సంస్కరించాలని, అన్యదేశ్యాలు స్వీకరించకపోతే వ్యవహారహాని సంభవిస్తుందని, అక్షరసమామ్నాయంనుంచి అర్ధానుస్వార శకటరేఫలను తొలగించాలని శాస్త్రనిదర్శనాలను ఉదాహరిస్తూ వ్యావహారికవాదాన్ని సమర్థించారు. వజ్ఘల చిన సీతారామశాస్త్రిగారు 'ఆంధ్రభాష' అనే వ్యాసంలో (ఆం. సా. ప. ప.సం. 2(1912), సం.4) మనపూర్వవ్యాకరణ సూత్రాలనే పాటించదలిస్తే కావ్యప్రపంచమంతా గ్రామ్యతాభూయిష్ట మవుతుందని, ఒకనాటి గ్రామ్య మిప్పుడు కాదని వాదించారు. మద్రాసు రాజధాని కళాశాలలో వాసుదాసుగారి అధ్యక్షత క్రింద 1912 డిసెంబరు 11, 12 తేదీలలో ఆంధ్రభాషాభివర్ధనీ సమాజమువారు బుర్రా శేషగిరిరావుగారిచేత 'ఆంధ్రాంగ్ల భాషల్లో వ్యావహారికభాషా ప్రయోజనాల మీద ఉపన్యాసాలిప్పి౦చారు. ఆ సమయంలో సభాధ్యక్షులు ఖండనోపన్యాసం చేస్తూ, అక్షరసంఖ్యనుబట్టి చూసినా తెలుగే ఇంగ్లీషుకన్న అభివృద్ధిచెందిన భాష అని గ్రాంథికభాషలో అన్యదేశాలు కొద్దిగా ఉండగా మాండలికాలు మొదలేలేవని, వ్యావహారికమనే భాషకు ఒక వ్యాకరణంగాని నిఘంటువుగాని లేనందున అప్రామాణికమైన ఆ భాషలో రచించరాదని ఆక్షేపించారు. ఆధునికయుగం : గ్రా౦థిక వ్యావహారిక వాదాలు 279

'గ్రామ్యవాదులు' వాడే “internal sandhi, liaision” అనే మాటలకు వారు చెప్పిన అర్థం, చేసిన వివరణాత్మకవిమర్శన చదివి ఆనందించదగ్గవి.

9. 14 గ్రాంథికవాదుల్లో చాలామంది జయంతి రామయ్యగారి లాగానే చాలావరకు ఉన్నతోద్యోగాల్లో ఉన్నవాళ్ళే. వాళ్ళ ఒత్తిడి ఎక్కువై మద్రాసు ప్రభుత్వం వ్యావహారికోపయోగాన్ని మరింత సంకుచితపరుస్తూ 1913 జనవరి 10 న (జి. ఒ. 20) మరో ఉత్తరువు జారీచేసింది. ఒక పాఠశాలలోని విద్యార్థులు గ్రాంథికవ్యావహారికాల్లో దేని వైపు మొగ్గచూపితే ఆ శైలినే మొత్తం పాఠశాల అంగీకరించినట్లు భావించి సమాధానపత్రాల మీద గుర్తు పెట్టాలని ఆ ఉత్తరువు నిర్ణయించింది. అంటే ప్రధానోపాధ్యాయుల అభిప్రాయాలు చెల్లుబడికి వస్తాయన్న మాట. చివరకు సంన్కరణ నేతిబీరకాయగా పరిణమించింది. గ్రాంథికవాదులకు ఇది ఘనవిజయం. ఇందుకు ప్రత్యుత్తరంగా గిడుగు వేంకట రామమూర్తిగారు ఇంగ్లీషులో 'A Memorandum on Modern Telugu' అనే కరపత్రాన్ని ప్రచురించారు. దానికి ప్రతిగా జయంతి రామయ్యగారు 'A Defence of Literary Telugu' అనే కరపత్రాన్ని ప్రకటించాంరు. గిడుగు వేంకటసీతాపతిగారి 'సొడ్డు', గురజాడ అప్పారావుగారు మద్రాసు విశ్వవిద్యాలయానికి ఇచ్చిన 'ఆధునికాంధ్ర వచన రచన' అనే నివేదిక వ్యావహారికవాదానికి సహాయకారులు కాగా, పానుగంటివారి 'గ్రామ్యవాద విమర్శనము', పురాణపండ మల్లయ్యశాస్త్రిగారి 'ఆంధ్ర భాషా సంస్కరణ విమర్శనము', మల్లాది సూర్యనారాణశాస్త్రిగారి 'గ్రామ్యమా ? గ్రా౦థకమా ?' అనే వ్యాసము, పి. సూరిశాస్త్రిగారు సంకలనం చేసిన 'The Grahmya Controversy అనేవి గ్రా౦థికవాదానికి తోడ్పడేవి. ఆంధ్రసాహిత్య పరిషత్తు తృతీయ వార్షికోత్సవ సందర్భంలో గ్రాంథికవ్యావహారిక వివాదంలో పరిషదభిప్రాయాన్ని నిరూపించవలసివచ్చింది. అంతకుముందు నియమించిన ఉపసంఘ నివేదిక అప్పటికి అందలేదు. కాబట్టి నిర్ణయం వాయిదా వేయమని గిడుగు గురజాడలు వాదించినా సంఖ్యాబలప్రాతిపదికమీద 1912 మే నాటి పండిత గోష్టి ఆభిప్రాయమే పరిషదభిప్రాయమనే నిర్ణయం జరిగింది. దీంతో ఈ వివాదాన్ని సభాముఖంగా పత్రికాముఖంగా పరిష్కరించుకోవాలన్న అభిలాష ఉభయపక్షాలకూ కలిగింది. కాని అప్పటికే కొందరు గ్రాంథిక వాదంలో శిథిలత ప్రవేశించింది. నండూరి మూర్తిరాజుగారు 'గ్రామ్యవాద విమర్శన' మనే వ్యాసంలో వ్యావహారికవాదుల 'ధ్వనిశాస్త్రమూ' గ్రాంథికవాదుల 'వ్యాకరణమూ' 280 తెలుగు భాషా చరిత్ర

భిన్నమైన వంటూనే, ఉభయపక్షాలవారూ రాజీవడి నవీనవ్యాకరణం రాయటం మంచిదని ఉద్బోధించారు. 'ఆంధ్రభాషాసంస్కార' మనే వ్యాసంలో పప్పు మల్లి కార్జునుడుగారు 'కొందరు' పద్యానికి గ్రాంథికమూ గద్యానికి వ్యావహారికమూ మంచిదంటున్నారని, తమ వాదాన్ని సమర్ధి౦చుకోడానికి గిడుగువారు చూపిన కావ్య ప్రయోగాలన్నిటికీ పాఠాంతరాలున్నాయని అటూఇటూ కాకుండా వాదించారు. అయితే వాదశిథిలత వచ్చినా తీవ్రత తగ్గలేదనటానికి 1914 లో జరిగిన చర్చలే తార్కాణం.

9. 15. మద్రాస్ యూనివర్శిటీ 1914 లో 'కాంపోజిషన్‌ కమిటి' అనే సంఘాన్ని నియమించింది. అందులో గ్రా౦థిక వ్యావహారిక వాదులకు మొట్టమొదట సమప్రాధాన్యం ఉండేది ; తటస్థులు కొందరుండేవాళ్ళు. ఇంటర్మీడియట్‌ పాఠ్య గ్ర౦థాలు కాదగిన పుస్తకాల పట్టిక నొకదాన్ని జి. వెంకటరావుగారు సమర్పించారు. వాటిలోని పదజాలాన్ని ప్రాచీనార్వాచీనాలుగా విభజించి అర్వాచీనా లనే ఆమోదించాలని మొదట నిర్ణయించారు. అయితే ఆ శబ్దాల నిర్ణయం దగ్గర పేచీవచ్చింది. ఇంతలో ప్రాంతీయ ప్రాతినిధ్యం సరిగాలేదని అందోళనచేసి గ్రా౦థికవాదులు మరియిద్దరు తమ వారిని చేర్చగలగటంతో సంఖ్యాబలం వారివైపు మొగ్గింది. కొమ్మరాజు లక్ష్మణరావుగారు A Memorandum of Telugu Prose అనే వ్యాసంలో గ్రాంథికవాదం చేశారు. గురజాడవారు తమ వ్యతిరేకతను సోపపత్తి కంగా సుడీర్చ వ్యాసరూపంలో (The Minute of Dissent to the Report of the Telugu Composition Sub-Committee : MD) ఆంగ్ల భాషలో చర్చించగా మరి ముగ్గురుసభ్యులు సంతకాలు చేశారు. వ్యావహారిక రచనా స౦ప్రదాయం మనకు శతాబ్దాలుగా ఉన్నదని రుజువుచేస్తూ గిడుగువారు 'నిజమైన సంప్రదాయం' మనే చిన్నపుస్తకం రాశారు. వ్యావహారికవాదులు ఎలమంచిలిలో జరిపిన విద్వత్సభలో శిష్షవ్యావహారికం గ్రామ్యం కాదనే వరుల చినసీతారామస్వామిగారి తీర్మానం నెగ్గింది. పర్లాకిమిడి కళాశాలలో ఆగష్టు 3 న బి. మల్లయ్య శాస్త్రిగారి అధ్యక్షతన జరిగిన ఆ౦ధ్రసారస్వతపరిషత్తు వార్షికోత్సవసమావేశ౦లోనూ వ్యావహారిక వాదాన్ని సమర్థించటం జరిగింది.చారిత్రకదృక్పథంతో భాషాపరిశీలన జరగాలని, పఠనపాఠనాలు ఆధునికభాషలోనే జరగాలని నారాయణ మూర్తిగారు ఉపన్యసించారు. ఆధునికయుగం : గ్రాంథిక వ్యావహారిక వాదాలు 281

9. 16. కాకినాడలో జూలై 1 న 'ఆంధ్రభాషా సంరక్షక' సమాజాన్ని పురాణపండ మల్లయ్యశాస్త్రిగారు కాశీభట్ట బ్రహ్మయ్యశాస్త్రిగారు మొదలై నవారు స్థాపించారు. గ్రా౦థికవాదాన్ని బలపరుస్తూ 'కొత్త తెలుఁగు-మంచి తెలుఁగు ; పులుల _ దండులు-పూలదండలు' మొదలైన కరపత్రాలు ప్రచురించారు. 28-6-1914 నాటి కాకినాడ సమావేశ౦ నుంచి 23-8-1914 నాటి అన్నవరం సమావేశంవరకూ 24 బహిరంగసభల్లో న్యాయవాదులు, ప్రభుత్వోద్యోగులు, కొందరు రచయితలు గ్రా౦థికవాదాన్ని సమర్థిస్తూ ప్రసంగాలు చేశారు. ఇందులో గమనంచవలసిన విశేషాలు రెండు : గంజాం. పర్లాకిమిడి జిల్లాలలో వ్యావహారికవాదానికి బలం చేకూరగా, కృష్ణాగోదావరి జిల్లాలల్లో గ్రా౦థికానికి మద్దతు లభించింది. (2) గ్రాంథికవాదానికి అండగా నిలిచిన వారిలో ఎక్కువమంది పలుకుబడి 'కలవారే' గాని 'తెలిసిన'వారు కారు, ఈ వివాదవ్యవహారం పత్రికలకు కూడా ఎక్కింది. జూలై, ఆగష్టు నెలల ఆంధ్రపత్రిక, హిందూలలో అనేకులు మారుపేర్లతో వాదోపవాదాలు చేశారు. (చూ. Arguments for and against Modern Telugu-Scape and Co., Cocoanada). వీటీలో ఎక్కువభాగం గ్రాంథికవాదాన్ని సమర్థించేవి. ఆ వాదవిధానం తీవ్ర౦గా విచిత్రంగా ఉండేది. అందులోని ముఖ్యాంశాలివి : (1) వ్యావహారిక మనేది నింద్య గ్రామ్యం అందులో కులవృత్తి ప్రాంత భేదాలవల్ల ఏకరూపతలేదు. ఈ మాండలికాలవల్ల అది సులభంగా అర్ధంకాదు. (2) జరిగిన వెయ్యేళ్ళుగా గ్రాంథికం మారలేదు. (3) వ్యావహారికం వ్యాకరణవిరుద్ధం కాబట్టి ప్రామాణికం కాదు. (4) వ్యావహారికంవల్ల ప్రాంతీయభేదాలేర్పడి ఆంధ్రోద్యమం దెబ్బతింటుంది కాబట్టి అది పనికిరాదు. (5) ఆధునికభాషకు ప్రత్యేకంగా వ్యాకరణంగాని సాహిత్యంగాని నిఘంటువుగాని లేవు కాబట్టి అది పఠనపాఠనాలకు తగదు. (6) ఆంగ్లభాషాపరిణామంతో ఆంధ్రభాషాపరిణామాన్ని పోల్చరాదు. లిఖిత వాగ్రూపాలో తెలుగులో ఉన్న భేదాలు ఇంగ్లీషులో ఉన్నవాటికన్నా తక్కువ. (7) వెయ్యేళ్ళ క్రితమే స్థిరపడ్డ తెలుగును 'కోయ, సవర, చచ్చట' భాషలున్న కేవల వ్యవహారదశకు 'ఆటవిక స్థితి'కి దించరాదు. (8) గ్రాంథికాన్ని నీచస్థితికి దించేకన్నా వ్యావహారికాన్ని ఉచ్చస్థితికి తేవటం మంచిది. (9) వ్యావహారికాన్ని అంగీకరిస్తే ప్రాచీనసాహిత్యం అర్థం కాకుండా పోయి కాలక్రమాన నశించి పోతుంది. (10) ఆధునికభాషలో ఉన్న ఒకటి రెండు పుస్తకాలకన్నా నన్నయ భాషే సులభంగా అర్థమవుతుంది. కాబట్టే గ్రాంథికమే మంచిది. ఇంత దూకుడుగా 282 తెలుగు భాషా చరిత్ర

ఉద్ధృతంగా వచ్చిపడ్డ, గ్రా౦థికవాదప్రవాహం ఒక్కసారిగా ఎండిపోయింది - గ్రాంథికపాఠ్యగ్రంథాలు రాగానే.

9.17. కందుకూరి వీరేశలింగంగారు,దివాకర్ల తిరుపతిశాస్త్రిగారు, చిలుకూరి వీరభద్రరావుగారు మొదలైన విద్వాంసులు పాల్గొన్న కొవ్వూరు సారస్వత మహాసభలో (1916 నవంబరు 19) నూరేళ్ళుగా పెద్దల వాడుకలో ఉన్న పదాలన్నీ నిర్దుష్టాలన్ని, దేశవ్యాప్తంగా ఉన్న రూపాలు పూర్వప్రయోగం లేకపోయినా సాధువులేనని తీర్మానించారు. 1919 లో గిడుగువారు 'తెలుగు' పత్రికను (ఆంగ్ల భాషలో) స్థాపించి ఉద్యమం సాగిస్తూనే వచ్చారు. అంతవరకూ గ్రా౦థిక వాదానికి మూలవిరాట్టుగా ఉన్న కందుకూరివారు వ్యావహారికవాదాన్ని అంగీకరించి 'వర్తమానవ్యావహారికాంధ్రభాషాప్రవర్తకసమాజము' (1918 ఫిబ్రవరి 28) స్థాపించి దానికి అధ్యక్షులయినారు. గ్రాంథికవాదుల కిది గొడ్డలిపెట్టు. ఇది భరించలేని గ్రా౦థికవాదులు చివరకు వ్యక్తిదూషణకు దిగేరు (ఆంధ్రసాహిత్యపరిష దష్టమ సమావేశ౦-జూన్‌ 7 : వేదంవారి ప్రసంగం). కాని పరిషత్తువారు కూడా కొండదిగి 1924 అక్టోబర్‌ 13 న వ్యావహారిక భాషాబహిష్కారం రద్దుచేయక తప్పలేదు. వ్యావహారిక వాదం క్రమంగా బలపడుతూ వచ్చింది. పంచాగ్నుల ఆదినారాయణ శాస్త్రిగారు సూత్రధారులుగా 1933 మార్చి 10-12 తేదిల్లో జరిగిన 'అభినవా౦ధ్ర కవి పండితసభ' బోధనభాషగా వ్యావహారికాన్ని స్వీకరించాలని తీర్మానించింది. ఆయేడు గిడుగువారు ప్రచురించిన 'గద్యచింతామణి' (ప్రథమభాగం) వచనరచనా స౦ప్రదాయాన్ని ససాక్షికంగా నిరూపించి సనాతన పండితవర్గాలకు గండికొట్టింది. 1936 లో 'నవ్యసాహిత్యపరిషత్తు' వెలిసింది. అభినవా౦ధ్రరచయితల్లో వ్యావహారికానికి అనుకూలంగా ఉన్నవాళ్ళందరూ ఇందులో చేరేరు. పరిషత్తువారు 'ప్రతిభ' అనే పత్రికను నడిపేరు. శరపరంపరంగా సమర్థకవ్యాసాలూ వ్యావహారిక రచనలూ రావటం మొదలయింది. 1937లో 'జనవాణి' అనే దినపత్రికకు సంపాదకత్వంవహించి తాపీ ధర్మారావుగారు మొట్టమొదటిసారిగా వ్యావహారికాన్ని పత్రికా భాష చేశారు. గ్రాంథిక భాష చివరకు విశ్వవిద్యాలయాల్లో పాఠ్యగ్రంథాల్లో తల దాచుకోవలసి విచ్చింది. విభిన్నసాహత్యప్రకియల్లో-పద్యకావ్యాల్లో తప్ప-వ్యావహారికమే నిలిచింది. గ్రా౦థికంకూడా “సులభగ్రా౦థిక” “సరళ గ్రాంథికాది” బహురూపాలతో మునపటి సలక్షణతను పోగొట్టుకొని గతానుగతికమైన ఆప్రతిభ రచనల్లో జీవచ్చవంగా ఉండవలసిన కాలం వచ్చింది. ఆధునికయుగం : గ్రాంథిక వ్యావహారిక వాదాలు 283

9. 18. గ్రా౦థికవాదులు చాలాకాలం నిశ్శబ్దంగా ఉండి 1958-60 లలో ఒకసారి, తిరుగా 1965-70 లలో ఒక తూరి, అప్పుడప్పుడు అక్కడక్కడ అనుకూలవాతావరణాల్లో తలఎత్తుతూ దించుతూ దోబూచులాడటం మొదలుపెట్టేరు. వాళ్లు శాస్త్రవిచారణవల్ల సాధించలేని విజయాలను రాజకీయ సాంఘికసమస్యలేవైనా అనుకూలంగా సమకూడినప్పుడు నెరవేర్చుకోదలచినట్టు నిదర్శనాలున్నాయి. 'జయంతి' పత్రికను స్థాపించిన తొలిరోజుల్లో ఈలాంటి ప్రయత్నమొకటి జరిగింది. సంపాదకులు ఒకవంక శిష్టవ్యావహారికానికి 'ప్రజామోదం' లభించిందని చెప్తూనే రెండోవైపు దుష్టప్రయోగాలతో నిండిన సారస్వతానికి ఒక 'వ్యవస్థ' కల్పించటమే తమ లక్ష్యమని ప్రకటించారు. కేవలం ఆధునికసమస్యలను చర్చించటంవల్ల ఈ శైలికి ఈ గౌరవం వచ్చిందన్నారు. (జయంతి, 1958 నవంబరు, సంపాదకీయం). 1959-60 సంవత్సరాల 'జయంతి' సంచికల్లో జువ్వాడి గౌతమరావుగారు ('వ్యవహారభాష-వ్యాకారణము' 59: మే: 'పత్రికారచన-సాహిత్యము' 60:ఫిబ్రవరి) కుల ప్రాతిపదికను తెచ్చిపెట్టేరు. వ్యావహారిక మనేది 'కృష్టాజిల్లా బ్రాహ్మణభాష' అనీ, తాముకూడా తమ ప్రాంతీయభాష ఉండగా దానికి 'దాస్యం'చేయవలసి వచ్చిందనీ వాపోయారు ! వారి ఇతరవాదాలు సరికొత్త పాతవి మరికొన్ని లేకపోలేదు. కావ్యభాషకు వ్యాకరణం రాయటమే అసాధ్యమైనవ్వుడు ప్రా౦తీయపదబంధురమైన వ్యావహారికం విషయం చెప్పనక్కరలేదని ఇప్పటి వ్యావహారిక రచనలన్నీ విజాతీయాలనీ, వీటికి ప్రచారగౌరవాలిస్తున్న పత్రీకలు బాధ్యతా రహితాలన్నీ, వ్యావహారిక వాదం ప్రాచీనకావ్యాలమీద నిరాదరణ కలిగిస్తూంది కాబట్టి ఆమోదయోగ్యం కాదనీ వారు సెలవిచ్చారు. వీరికి కొండముది శ్రీరామచంద్రమూర్తిగారూ, జలాంతళ్చంద్రచపలగారూ సవివరంగా సమాధానాలిచ్చారు. 'ఆంధ్రభాష-అవ్యవస్థ' అనే వ్యాసంలో (జయంతి, 1960 ఏప్రిల్‌) 'గాండీవి' గారు ఆకు కందని పోకకు పొందని భావాలు వెలిబుచ్చారు. శిష్ణవ్యావహారికం ప్రాచీనకవి సమ్మతంకాదని, దానికి వ్యాకరణరచన చేయనక్కరలేదని, గ్రా౦థికానికే ఒక వ్యవస్థలేదని, అందువల్ల ఏవో కొన్ని సామాన్యసూత్రాలు రాసి అందరూ ఒకేరీతి వ్యావహారికం రాయటమే మేలని వారి అభ్మిపాయం. 'ఏవోకొన్ని సూత్రాల'కోసమే ఈ ఆరాటమైతే ఆనాటికే పారనంది రామస్వామిశాస్త్రిగారు, మల్లాది సూర్యనారాయణశాస్త్రిగారు, వడ్లమూడి గోపాలకృష్ణయ్యగారు రాసిన వ్యాకరణసూత్రాలున్నవన్న సంగతి వారు స్మరించవలసింది. ఇంకా పూర్వకాలంలో రావిపాటి గురుమూర్తి 284 తెలుగు భాషా చరిత్ర

శాస్త్రిగారిలాంటి కొందరు ఇదేపని చేశారని గుర్తుకు తెచ్చుకోవలసింది. అయితే ఈ చర్చలు ఏ కొద్దిమందినో ఆకర్షించినందువల్ల కోలహల మేమి జరగలేదు.

9.19. 1965నుంచి వచ్చిన వాదోపవాదాలు పాఠ్యపుస్తకాల శైలి విషయంలో వచ్చాయి. అంతవరకూ పాఠ్యగ్రంథాలన్నీ అర్థగ్రా౦థికమో సరళ గ్రా౦థికమో లాంటి ఏదోఒక రీతిలో ఉంటుండేవి. ఆంధ్రప్రదేశావతరణవల్ల తెలుగు నేర్చుకోవాల్సిన వారు రెండురకాలవారైనారు. తెలుగు మాతృభాషగా కలవారు ఒకరకం, ఆ౦ధ్రేతరులు మరోరకం. ఆంధ్రేతరులు తెలుగు నేర్చుకోవటం నిత్యవ్యవహారంలో ఇబ్బంది లేకుండా జరుపుకోవటానికి కాబిట్టి వాళ్ళకోసం రాసిన పాఠ్యగ్రంథాల్లో వ్యావహారిక మే ఉండాలని భద్రిరాజు కృష్ణమూర్తిగారు వాదించి గ్రాంథికంలో ఉన్న పుస్తకం తమ చేతిమీదుగా అచ్చుకారాదని అభ్యంతరం లేవదీశారు. ప్రభుత్వం ఈ విషయంలో ఏకాభిప్రాయాన్ని సాధించాలన్న భావంతో అన్ని రంగాల్లోను విద్వాంసులను ప్రతినిధులను తిరుపతిలో సమావేశపరిచింది. "అనేక తర్జనభర్జనలయిన తర్వాత పింగళి లక్ష్మీకాంతంగారి అధ్యక్షతన ఆ సమావేశంవారు ఓకరాజీకి వచ్చారు. మొదటి భాషగా తెలుగు నేర్చుకొనేవాళ్ళ పాఠ్య గ్రంధాల్లోని తెలుగువాచకాలు మాత్రం సరళ గ్రా౦థికంలో ఉండాలని, రెండో భాషగా తెలుగు నేర్చే వాళ్ళుగాని, శాస్త్రవిషయాలను తేలుగులో నేర్చుకొనే ఆంధ్ర విద్యార్థులు గాని చదివే పాఠ్యగ్రంథాల్లో వ్యావహారికమే ఉండాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. ప్రభుత్వంవారు ఈ నిర్ణయాన్ని ఆమోదించి వివరణాత్మకంగా ఆయా శైలీభేదాలను (గ్రా౦థకవ్యావహారికాలను శైలీ భేదాలుగా గుర్తించి వీటిని వివరించే సంఘాన్ని శైలీ సంఘం - Style Committee - అని ప్రభుత్వం వ్యవహరించింది) నిరూపించటానికి పింగళి లక్ష్మీకాంతంగారినే అధ్యక్షులుచేసి ఒక సంఘం నియమించారు. ఆ సంఘంవారు 1966 నాటికి తమ పని నెరవేర్చారు. తెలుగును రాజభాష చేయదలచిన ప్రభుత్వానికి ఈ నిర్ణయాలు చాలా అవసరం. తెలుగును అధికారభాషగా గుర్తిస్తూ 1966లో ఆంధ్రప్రదేశ్‌ అధికారభాషా చట్టం (9వ చట్టం) శాసించింది. తెలుగును అధికారభాష చేయటంలోని కష్టసుఖాలు పరిశీలించి సలహా ఇమ్మని ప్రభుత్వంవారు అప్పటి విద్యాశాఖాకార్యదర్శి జె.పి.ఎల్‌. గ్విన్‌ అధ్యక్షతన మరో సంఘం నియమించారు. (జి. ఓ. 3051, 1966 డిసెం. 28). గ్విన్‌ సంఘంవారు ముఖ్యంగా ఆంధ్రేతరులకు తెలుగు నేర్పటానికి భాషను ఆధునికీకరించటానికి, విశ్వవిద్యాలయాల్లో తెలుగును బోధనభాష చేయ