ఢిల్లీ దర్బారు/ఏడవ ప్రకరణము

వికీసోర్స్ నుండి

ఢిల్లీ ద ర్బారు.

5. ద ర్బారుల చరిత్రము

ఏడవ ప్రకరణము.

పూర్వపు దర్బారులు

రాజు లేలు దేశములం దంతటను నొక ఏలికగతించి తరు వాతి ప్రభువు రాజ్యమునకు వచ్చిన మీఁదట నాతని రాజ్య భార నిర్వహణారంభమును సూచించుటకయి యొక వి శేషోత్సనము తప్పక జరుగుచు వచ్చుచున్నది. మానవునకు సంబంధించిన యుత్కృష్ట విషయములన్ని టికినివలె దీనికిని మతవిషయిక భక్తియే సర్వసాధారణముగ మూలాధారమయి కన్పట్టుచున్నది. ఆంగ్లే యభాషయందు ' నీయుత్సవమునకు “ కారొనేషన్' అనఁగా “ కిరీటధారణము' అను నామము ప్రవర్తించుచున్నది. 'పేరుం బట్టిచూడ నిద్దానికి మతవిషయికార్ధ మేమియు నుండునట్లు తోచదు. కాని యచ్చటి ఆచారములను బరిశీలించినచో నచ్చ టను నీయుత్సవమునకు విశేషార్థముగలదని తోఁచకమానదు. అటకిరీటమును రాజు నౌదల నిడుట కేర్పడినవాఁడు మహామతా చార్యుఁడు. ఇతఁడు రాజును రాజిని ప్రజలకుఁ బ్రదర్శించి ' కిరీట' ధారణోత్సవము ను బ్రారంభించును. తరువాత రాజు పైఁ బరమాత్ముని కృపనిలుచుగా తమని ప్రార్థన లొసంగఁ బడును. ఉత్తమమతాచార్యుఁడు రాజునకొక కొంత హితబోధ మొనర్చును.

“రాజు దేశమును చట్టముల ననుసరించియు న్యాయము ననుసరిం చియు పరిపాలింపఁ బ్రతిన నంగీక రించును. తదనంతర మమూల్య సుగంధ ద్రవ్యముతోఁ గాచిన నూనియచే మహామతాచార్యుఁడు రాజునడి నెత్తిమీదను, హృదయము మీఁదను అచేతుల మీఁదను సిలున ఆకారములను నిర్మించును. దీనివలన రాజుదన తలంపులను, హృదయమును, కార్యములను పరమాత్మునిపని యందే వినియోగింపుటకు సంస్కారమందెనని యర్ధము. ఇది ముగిసిన వెనుక ' మహామతాచార్యుఁడు రాజునకు న నేకవిషయ ‘ముల సం కేతించు నుపకరణములనొసంగి కిరీటము నాతని శిర ముననిడును. ఇదియె ' కిరీటధారణోత్సవము'న ముఖ్య భాగము. దీనికిఁబిదప నెల్లరును రాజునకు వినమితులయి తమనిధే యతందెలుపుదురు. రాజుతనకిరీటమును దీసియుంచి మోకా రించికూర్చుండి ఈశ్వరుని ప్రార్థించి రాజ్యమాతనివశముఁ జేసి లేచి మజుల కిరీటముంధరించును.

ఈ పైవర్ణన వలన ఆంగ్లేయ ' కిరీటధారణోత్సవము ' ‘నకుంగూడ మతవిషయిక సంబంధముగలదని విశదమగు చున్నది.

ఆవిషయమున మన దేశమునందలి పూర్వకాలపుఁ బట్టా భిషేకమహోత్సవము' తో నయ్యది తులఁదూగఁ జాలదు. పూర్వకాలమున నిచ్చటి పట్టాభిషేకములలో నుత్తమములు రాజసూయాశ్వ మేధయాగములు. అట్టి యాగములలో ధర్మ

రాజుచే నింద్రప్రస్థ పురమున జరుపఁబడినది మనంర్ఱింగిన వానిలో ముఖ్యముగ నెన్నఁబడవలసియున్నది. 1 [1]దానితో దులఁదూగు నది మరల నాతఁడే హస్తినాపురమున నొనర్చిన అశ్వమేధ యాగము.

ధృతరాష్ట్రుఁ డనుమతింప ధర్మ రాజు ఇంద్రప్రస్థపురము రాజధానిగ రాజ్యమేల మొదలిడి మయునిచే సభాభవనమును గట్టించెను. అచ్చట ధర్మ రాజు మొదటిద ర్బారును రాజసూయ గమును జరిపెను.

దర్బారు జరిగినది సభాభవనప్రవేశ దివసముననని తెలియ వచ్చుచున్నది. నాఁడు భూరిభూసుర సమాజమును ధర్మసుతుఁడు భక్తికోడఁ బూజించి ధనార్థులఁదన్ని యశంబుగాంచిన వెనుక

మ. మదమాతంగ తురంగ కాంచన లసన్మాణిక్య గాణిక్యసం
పదలో లింగొనివచ్చి యిచ్చి ముద మొప్పం గాంచి సేవించిర
య్యుదయాస్తాచల సేతు శీతనగ మధ్యోద్వీపతుల్ సంతతా,
భ్యుదయు ధర్మజుఁదత్సభా స్థితుజగత్పూన్ల ప్రతాపోదయున్. "

ఆతరుణమున మహామునుల నేకులు సభారంగము నలు కరించియుండిరి. అందు నారదుండును నుండెను. అతఁడు ప్రోత్సాహింప " నారాయణ దేవుచేత ననుజ్ఞాతుండయి తమ్ము లయు ధౌమ్యు ద్వైపాయనాదులయు ననుమతంబున ధర్మ రాజు .............................................................................................

రాజసూయంబు సేయ " నుపక్రమించెను. సహ దేవుఁడు సర్వ సన్నా హములును జేయ నియోగింపఁబడెను. యజ్ఞోపకరణ తతులు సిద్ధమాయెను. సర్వసంభారములు నిండిపోయెను. ఇంద్రప్రస్థంబు చుట్టును సకలదిక్కులను అపార భూరిబహువిధా గారములును ప్రమదవనములును వెలయ నాపురమపర భూతల మయియె ప్పెను. ధర్మ తనయుఁడు క్రతుదీక్షవహించెను. భూ పాలకులందజుఱును వివిధోపాయనములు దెచ్చి యతని శ్రీపాద ముల కెఱఁగిరి.

ఇదేవిధమున నశ్వమేధయాగ సమయమున

విద్వత్సమూహంబు వివిధ దేశాధీశ, సంఘంబుఁ గార్యవిచారపరులు
నష్ట నాదికృత్యంబుల వారలు, బహు పరిచర్యలఁబరఁగుజనులు
వైశ్య ప్రముఖ పౌర వర్గంబులును ముఖ్య, హాలికాది జానపదావలులును
వైణిక గాయక వాంశికొదివి చూద, కమలును వారసుందరులులో ను
గాగ నేగుదెంచి కాంచి యవ్విభునిస
త్కారములఁబ్రమోదితంబులగుచు
భావములుద లిర్ప సేవించియుండన
క్కొలుపుసాల నెప్పె చెలువు మెఱ సెన్.

తదనంతరము యమనందనుఁడు మురారియు నానాపృథి వీశ్వరులును వెంటరాఁగ, ద్రౌపది ఓషధులుగొనిన డువఁ దావన కోటి మంత్రములు పఠింపుచుండ, నాఱు వృషభములను బూన్చిన మేటి నాగటితో నధ్వరభూమిని దున్ని సిద్ధము చేసెను.

స్వకాయకష్టము త్తమమని చూపుటకును రాజును హలికునితో సమానుఁడయని . చాటుటకును సంతకంటె బలమగు నుదా హరణము కాన లెనా?

ఇట్లు యజ్ఞ భూమి సంస్కరింపఁబడిన తరువాత నట చేరిన రాజులును వారి కళత్రములును ప్రసవగంధ పూజితము లయిన స్వర్ణ కుంభములను మోసి కొనిపోయి జాహ్ననీతోయ ములను గొనివచ్చిరి. అంతకుమున్నె ధౌమ్యుఁడు ఆలంకృతనుగు వేది కాతలంబున నుత్కృష్ట సన్నాహములతో భద్రపీఠంబు ఒక దానిఁ బ్రతిష్ఠించియుండెను. యమునాజలములు సంసిద్ధ మైనతోడనే యుధిష్టురుఁడు మంగళారావములతో గొని తేఁబడి ఆపీఠంబున నుండనియోగింపఁబడియెను. శోభ నాలం కరణము వలన నభిరామయయియుండిన పాంచాలిని అతని వామపార్శ్వ మున నాసీనఁ జేసిరి. అంత శుభముహూర్తంబగును మహాను భా వుఁడు కృష్ణుడు. అదివఱకు సంస్కారమందియుండిన శంఖమునం చుదకములనించి “పృథివిక ధిపతివిగమ్మ"ని జాయా సహితుఁడగు ధర్మజునకు అభిషేక మొనర్చెను. శంఖానక దుంధుభి ప్రభృతి మంగళ తూర్యరావంబులును వీర నాదంబులును చెలంగెను. అచ్చటఁ జేరిన రాజలోకంబును బెద్దలును కలశములలోని పవిత్రాంబువులతో ధర్మరాజు నభి షేకించిరి. ఇదియే ఆయాగ మున మనకు ముఖ్య భాగము. ఈయభి షేకమువలన నె సర్వ సాముతులును ధర్మరాజు సార్వభౌమత్వమును సంపూర్ణముగ

నొప్పుకొనిరి. దీని కన తరము దిగ్విజయ పరిపూర్తినిసం కేతించు యజ్ఞము నడచెను. దాని నిటవర్ణించు టనవసరము. అదినడచి నంత కాలమును నట చేశిన సర్వ జనులును సార్వభౌముని యతిథు లకు సమానంబుదిగి. దాని ముగి పుసమయమున “సామ్రాజ్య పదస్థుఁడైన యుధిష్ఠిరుండు భూసుర దీనానాథ ప్రముఖపాత్ర బు లకు వివిధధనంబు లొసంగెను. ” ఈషదముల ప్రయోగముఁబట్టి. ధర్మరాజు చక్రవక్తియును దన ప్రజకు నుత్త మవరము లొసంగె నని యూహింపవచ్చును.

ఔరంగ జేబుషట్టాభి షేకము.

యుధిష్ఠిరునకుఁ దరువాత ఢిల్లీ నగరమున పట్టభద్రు లయిన సార్వభౌములలో మొగలాయీలు ముఖ్యులు. అందును ఔరంగ జేబు ' సింహాసనారోహణోత్సవము ' వర్ణనీయము. సింహాసనారోహణోత్సవము' అను పదముపయోగించుట మహ మ్మదీయ చక్రవర్తుల కాలమునందలి పట్టాభిషేకోత్సవమునకును ఇతర కాలములందలి పట్టాభి షేకోత్సవములకును గల తారతమ్య మును సూచించు నుద్దేశముతోడ ననిగ్రహి చునది. మహమ్మదీ యులయుత్సవమున ముఖ్యతమభాగము చక్రవర్తి సింహాసనము పయిఁగూర్చుండుటయె. అభి షేకముగాని కిరీటమును ధరించుట గాని వారికాచారముగాదు. ఔర గ జేబు 1658 వ సంవత్సర మున రాజ్యమునకున చ్చెను. కానియతఁడు సర్వశత్రువులనడచి 1659 వ సంవత్సరమున సింహాసనారోహణోత్సనము జరిపెను.

ఆసంవత్సరము మేనెల 12 వ తేది సార్వభౌముఁడైన యారంగ జేబు గొప్పయూ రేగింపుతో ఢిల్లీ నగరమును జొచ్చెను, భేరీ మృదంగ కాహళముల శబ్దములతో భూనభోంతరాళములనిం చుచు సేవకా బృందంజులు ముందునడచె. వాని వెనుక మఖు- మలుతోడను వెండి బంగారు జరీలతోడను చకచకలీను మణుల' తోడను నలంక రింపఁబడిన ఝూ లులతో గప్పఁబడిన మదగజం బులు రజతశృంఖలములకు వేలు సువర్ణకింకిణులు మొరయ మంద గమనంబున బారులుదీరి ఏగుదెంచుచుండెను. అవ్వానిమీఁద సార్వభౌమచిహ్నంబులయిన గోళములతో గూడిన టెక్కె ములు మోసికొని భటులుగూర్చుండియుండిరి. ఈఏనుంగులకు వెనుక బంగరుజీనులతోడను అలంకరింపఁబడిన కళ్లెపువారుల తోడను మెప్పుపారశీ కాశ్వములును అరబ్బీ హయములును వరుస దీరియుండెను. వాని వెంబడి కరుణుల మొ త్తంబులును లొట్టి పిట్టతండంబులునునుండె. దీనిపిరుంద ధగధగలీను ఉత్తమాయుధ ముల ధరించిన కాల్బలములు పటాలములు పటాలములుగ నే నడచుచుండెను. వీని వెంక ప్రభువులును మంత్రులును గుంపులు సూడి చుట్టుఁగొలున నెల్లర దృష్టులనాకర్షించుచు నచ్చటిజనంబు లందఱుకును విభుండయిన గరంగ జేబు తనగజశాలయందలి యు తమ భద్రేభంబు పైనునిచిన బసిఁడి యం బారియం దాసీనుఁ డయి యే తేరుచుండె. ఇట్లూ రేగింపుతో దరలి యారంగ జేబు ఢిల్లీ కోటయందు

ణ "నాఁటి యుత్సవమున కేర్పడిన పట్టాభి షేక భవనముం జొచ్చెను. దాని పేరు 'దివాని ఆమ్.' అద్దాని లోకప్పును నలువది స్తంభము లును వెండిబంగారు జరీపని చేనొప్పు పారశీక దేశపు మఖలు గుడ్డ చేతను పేరుగాంచిన గుజరాతు దేశపు సరిగెబుటా వేసిన పట్టు చేతను, గప్పఁబడియుండెను. ప్రతి కమాను నుండియు క్రిందికి దిగజారు బంగారు గొలుసులకు రత్న ఖచిత సువర్ల గోళములు వేలుచుండెను. భవనమధ్యమునఁ గొంతభాగము చదరముగ పైడికమ్ముల కటాంజనము చే వేరు చేయఁ బడియుండెను. దాని 'నడుమ తన్న లంక రించు వజ్రములును కెంపులును పద్మరాగము లును మహా ప్రకాశ పరంపరలనీ నలోకమునందలి విచిత్రములలో నొక్కటని ప్రసిద్ధిగాంచిన మయూరాసనము సంస్థితమై యుండె. అద్దాని పురోభాగంబున సుందర తమమగు వితానంబొండు నాల్గు రత్నమయ దండముల ప్రాపున నెలకొల్పఁ బడియుండె. అందు ముక్తాహారము లె పగ్గములయి యుపకరించుచుండె. మయూరా సనమును జుట్టివచ్చ కటాంజనమునకు ముందటి రెండువైపులను వ్రేలు ముత్యపు గుచ్ఛములతో నలంక రిషఁబడిన భూరిచ్ఛత్ర ముల జతయుండెను. సార్వభౌముని సింహాసనమున కిరు ప్రక్క- లను శృంగార మైన భర్మ్యమంచకము లిడఁబడియుండెను. వీని యన్నిటికిని నెనుక స్వర్ణమయ పీఠములషయి నవరత్న ఖచిత ఖడ్గములును, శుద్ధకాంతుల ప్రసరింపఁ జేయు డాలులును, ఈటె లును, మున్నగు చక్రవర్తిగారి యాయుధములు ప్రదర్శింపఁబడి

యుండెను. పట్టాభి షేక భవనమునందలి బయలు ప్రదేశ మంత యును మఖుమలు గుడారములచే నావరింపఁబడి యుండెనని చెప్పవచ్చును. ఆగుడారములలో చిత్రమగు రత్న కంబళములు పరువఁ బడియుండెను. ఇప్పగిది ఎబ్భాగమునకుఁ దిరిగినను నవరత్నముల ప్రభలును వెండి బంగారముల కాంతులును మఖు మలు పెట్టుల శోభలును చూపరుల కానందము గొలుపుచుండెను.

శుభముహూర్త మాగతమైనదని జ్యోతిష్కులు తెలు పుట తోడనే తెరమరగున సంపూర్ణ సన్నాహములతో గూర్చొనియుండిన ఔరంగ జేబుచక్రవర్తి లేచివచ్చి సింహాసనము నధిష్టించెను. మంగళ శబ్దములును ఘనతూర్య రావములును చెలంగె. అంతట మెక గాయకుడు ముందుకువచ్చి యున్నత పీఠంబు పై నిలుచుండి చక్రవర్తిగారి నామధేయమును బిరుదు లును మున్నగువానితోఁ జేరిన 'ఖుత్బా' యను. ప్రకటనను గంభీర స్వసమునఁ జది వెను. సామంతు లెల్లరును చక్రవర్తికి నతు లొనర్చిరి. రాజ సేవకులు పన్నీరును బుడ్లుబుడ్లుగ సభాసదు లెల్లర మీదను కురిపించిరి. తాంబూలము తట్టలతోఁ బంచి పెట్ట బడియె. అత్తరు, పునుఁగు,జవ్వాది, అగరు, కస్తూరీ, మొదలగు సుగంధ ద్రవ్యముల పరిమళము , సభాభవనమున గుప్పుగుప్పుమని ప్రసరింపు చుండెను.

ఆనాఁడే ఔరంగ జేబు పేరునఁ క్రొత్త నాణ్యములు ముద్రింపఁబడెను. సామ్రాజ్యము నందలి వివిధ రాష్ట్రములకును ఈసింహాస నారోహణ వార్తందెలుపుచు నుత్తరములు పంపఁ బడెను.

ఇట్లు ముఖ్య సభాభననమున నుత్సనము ముగిసిన పిదప నౌరంగ జేబు అంతఃపురమున నెకదర్బారును మఱియొక ఆంత రంగిక దర్బారును నడి పెను. మొదటి దానికి స్త్రీలును, రెండన దానికి నాహూయమానులయి యుండిన యొక కొందుఱును, మాత్రమే రానియ్యబడిరి. అవ్వానియందు చక్రవర్తి తన కుచితముని తోఁచిన విధమునఁ దనవారలకు బహుమానము లిచ్చెను.

ఔరంగ జేబు సింహాసనారోహణ సమయమున అక్బ రుచే నుపక్రమింపఁ బడియుండిన1[2] నౌరోజుశకమును రద్దుపఱచి మరల హిజిరాశకమును బ్రారంభింప నియమిం చెను. త్రాగు బోతుతనము మున్నగు దురాచారములను మాన్పుటకు నధి కారుల నేర్పఱచెను. చిల్లరపన్ను లనేకములను దుడిచివై'చెను. ధాన్యము పై బాటలలో వేయఁబడు చుడిన సుంకములను పోలీసునకని ససూలు చేయఁ బడుచుండిన పన్ను లను తొలఁ గించెను. ఇవియే ఆతఁడిచ్చిన వరములు.

............................................................................................... .

ఒక వారము దినములు పండుగలు నడచెను. సొమంత రాజులును ప్రభువులును సార్వభౌమునకుఁ గొనుకల చెచ్చి యిచ్చిరి. అతఁడును వారికి నాతిథ్యమొసఁగి వారిని బిరుదులచే తను, గౌరవసూచక నస్ర సమితి చేతను, దర్జాలను హెచ్చిం చుట చేతను, ఏనుఁగులు గుఱ్ఱములు రత్న ఖచితాయుధములు మొదలుగాఁ గల బహుమాన వస్తువుల చేతను, దనియించెను.


  1. ఈయాగముల వర్ణన మహాభాంతమున సభాపర్వమునందును శాంతి ప్వమునందును గననగును.
  2. 1. ఇది పారశీకుల సంవత్సరాది. వారికిని ఈ దేశపు మహమ్మదీయు లకును భేదములుగలవు. కావున మార్పు.