ఢిల్లీ దర్బారు/ఎనిమిదవ ప్రకరణము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search


బ్రిటిషు దర్బారులు

ఔరంగ జేబునకుఁ దరువాత మన యైదవ జార్జి చక్ర వర్తికాలము వఱకును ఢిల్లీ నగరమునఁ బ్రసిద్ధ సార్వభౌము లెవ్వరును బట్టాభి షేక మహోత్సనము నంద లేదు. కాని విక్టో రియా మహా రాజిగారి ప్రతినిధిగ లిట్టను ప్రభువును, స ష్టమైడ్వర్డు చక్రవర్తి ప్రతినిధిగ లార్డుకర్జనును, నచ్చట దర్బారుల నడపి యున్నారు. వారివలన నే ఈ దర్బారు' పదమున కింత ప్రాముఖ్యత కలిగినది.

1877న సంవత్సరపు దర్బారు.

1858 వ సంవత్సరమున భరతవర్షపుఁ బ్రభుత్వము ఆంగ్లేయవర్తక సంఘమువారినుండి విక్టోరియా మహారాణి గారికి మారునఁ బడియెను. అట్టిమార్పువలన మన దేశమునకు నొక్క- విశేషగౌస్నము గలిగెను. ఏదోయొక వర్తక సంఘము గా పరిపాలనకును నుత్తమ జన్మమ ది యల రారు మహా రాణి పాలనకును నెంత తారతమ్యము గలదియు వర్ణించుటయే యన.

వసరము. అదున విక్టోరియా మహా రాజి రాజ్యమునకు వచ్చిన తోడనే 'మనకీ క్రింది వాక్యములుగల స్వాతంత్ర్య పత్రమును బ్రకటించి యెల్ల రయుల్లముల నాచంద్ర తారార్కముగ నాక ర్షించి వైచెను.

“క్రైస్తవ మతము యొక్క సత్యమును మేము దృఢముగా నమ్మిన వారమయి మతమునలనఁ గలిగెడు చిత్తశాంతిని మేము కృతజ్ఞతతో నొప్పుకొనుచున్న వారమయ్యును, మావిశ్వాస ములను మాప్రజలలో "నెవరి మీఁదను నిర్బంధించు కోరిక గాని స్వాతంత్ర్యముగాని మాకు లేదని చెప్పుచున్నాము. తమతమ మత విశ్వాసములను బట్టిగాని యాచారములనుబట్టిగాని యెవ్వరు నే విధముగాను మావలన నిగ్రహమును గాని యనుగ్రహ మునుగాని పొందక యందఱును సమానముగా ధర్మశాసన ములవలని సంరకుణమును నిష్పక్ష పాతముగాఁ బొందవలయుట మాయభిమతమును మాకు సంతోష కరమును నని మేము ఘో షించుచున్నాము. మా ప్రజలలో నెవ్వరియొక్క మతవిశ్వాస ములతోను పూజా విధానములతోను తామేవిధమయిన సంబంధమును మాక్రింది యధికారు లెవ్వరును కలుగఁ జేసికో గూడదనియుఁ గలుగఁ జేసికొన్న యెడల మాయాగ్రహమున కట్టినారు పాత్రులగుదురనియు మేముదృఢముగా విధించు చున్నాము,

మా ప్రజలయినంత వఱకు వారేజాతి వారైనను వారే తెగ వారైనను సామర్థ్యము వలనను సద్వర్తనము వలనను దాము చక్కగా నిర్వహించుట కర్హులయినవారు నూప్రభుత్వములోని పనులకు యథేచ్ఛముగాను నిష్పాక్షికముగాను చేర్చుకొనఁ బడవలయుట మాచి త్త మయియున్నది.

ఈశ్వరానుగ్రహమువలన దేశములో స్వస్థత మరల కలిగింపఁ బడినప్పుడు హిందూ దేశము యొక్క- నెమ్మదియైన కర్మ లను బ్రోత్సాహపఱచుటయు జనోపయు క్తములును వృద్ధికరము లునునైన పనులను పెంపుచెందించుటయు దేశములో నున్న సర్వప్రజల యొక్క లాభముకొఱకు పరిపాలనము జరపుటయు మాయత్యం తాభిలాషయయి యున్నది. మబలము వారి సంపదలోను మా క్షేమము వారితృప్తిలోను మాయుత్తమ ప్రతిఫలము వారి కృతజ్ఞతలోను, ఉండును. సర్వశక్తుఁడయిన ఈ శ్వరుఁడు మాకును మాక్రింద నధికారములో నుండువారికిని మాయీ యభీష్టములను ప్రజల మేలు కొఱకు కొన సాగించు టకు శక్తిని బ్రసాదించునుగాక !1[1]

ఇట్టి యుత్కృష్ట భావములతో భరతవర్ష మును బరి పా లింప మొదలిడిన శ్రీ విక్టోరియా మహా రాజగారు మన దేశము తోడి సంబంధమును దెలుపు బిరుదు నెద్దానిని . గూడ నీ 1877 న

............................................................................................ 1,

సంవత్సరపు దర్బారు వఱకును వహించి నదిగాము. అట్టి బిరుదు లేనందున నామె సార్వభౌమత్వమును సంకేతించు సాధనము లేక పోవుచుండుటను గమనించి 'భరతవర్ష చక్రవర్తిని' యను పట్టము నామె ధరించినదని ప్రకటించుట కే దర్బారు ఢిల్లీ యందు జరిగెను. అప్పుడు సర్వసామంతులును ప్రజలును గొం దజు పర దేశ రాజులును సభామంటపము నలంక రించి?. లార్డు లిట్టను ఆమహోత్సవమున విక్టోరియా మహా రాజిగారు “భరతవర్ష చక్రవర్తిని' బిరుదమును వహించిరని ప్రకటించి ఆమె భరతవర్షపు ప్రభువులకును బ్రజలకును నంపిన యను రాగ పూరిత మయిన యుత్తరమును జది వెను.జయజయారావ ములతో దర్బారు ముగింపునం దెను. నాఁటినుండి చక్రవర్తిని గారి ప్రతినిధి స్వదేశ సంస్థానా ధీశ్వరులకంటె నున్న తమగు దర్జా సందెను.

1903 వ సంనత్సరపు దర్బారు.

1903 వ సంవత్సరమున ఢిల్లీయందు సప్తమైడ్వర్డు చక్రవర్తిగారి యనుమతి ననుసరించి లార్డుకర్జను దర్బారు నడ పెను. అతఁడు దానికయి చేసిన వ్యయమును గుఱించి య నే కులు ఖండించుచు వ్రాసియున్నారు. కాని దర్బారు మాత్రము చూపరులకు మిక్కిలి యద్భతముగఁ గన్పించెననుటకు సంది యము లేదు. లార్డు కర్జను గారు ఢిల్లీని జొచ్చినప్పటి ఏనుంగుల

తోడి యూ రేగింపు పౌరవాత్య సంపదయిట్టిదని బాహాటముగఁ జాటుచుండెనఁట.

ఈదర్బారు సమయమున సప్తమైడ్వర్డు చక్రవర్తి ప్రజల కనురాగవాక్యములం దనప్రతినిధి ముఖమున నంపెను. ఈ దర్బారునకంటే సప్తమైడ్వర్డు చక్రవ ర్తిగారు 1908వ సంవ త్సరము నవంబరు నెల 4వ తేది సామ్రాజ్య పంచాశ ద్వాషి కోత్సవ సమయమున మనకనిపిన ఈ క్రింది వాక్యములుగల సందేశము వలన నెక్కుడు మనకు స్మరణీయులయి యున్నారు. “' 'మొదటినుండియు ప్రతినిధి స్థాపనా పద్ధతి క్రమక్రమ ముగ ప్రచారమునకు తేఁబడెను. అపద్ధతిని నివేకముతో " " పొంగింప సమయము వచ్చినదని నాప్రతినిధియగు గవర్నర్ జెనరలు గారికిని తక్కిన నా మంత్రులకును తోఁచి యున్నది. బ్రిటిష్ పరిపాలన చే వర్ధిల్లిప్రోత్సాహ పఱుఁబడిన యభిప్రాయ ములు గలవారగు మీలో ముఖ్య తరగతులవారు పౌరత్వ సమానత్వమును శాసన నిర్మాణ రాజ్య పరిపాలనముల దుముక కొంత యెక్కువ స్వాతంత్ర్యమును కోరెదరు. ఆ కోకను వివేకముతో నెర వేర్చుటచే ప్రకృతాధికార బలములు దృడ ములగునుగాని క్షీణింపపు. పరిపాలనము జరపు నుద్యోగస్తులు, అట్టి పరిపాలనమునకు లోఁబడిన వారి తోడను, దానివిషయ మై జన సామాన్యాభి ప్రాయమునకు ప్రేరకు లై దాని ప్రతిఫలిం పఁ జేయు వారితోడను, ఎడ తెగని సాంగత్యము కలిగియుండు

టకు నిప్పటికం టే నెక్కువగ సందర్భములున్న చోఁ బరిపాలన మింకను కార్యకారియై యుండును. ఈ యుద్దేశములకై యిప్పుడు 'జాగరూకతతో చేయఁబడుచుండు నేర్పాటులను గుఱించి నేను ప్రస్తావి పను. అవి మీకు త్వరలో తెలుపఁబడి హిత కారియయిన సవ్యవహారాభి వృద్ధికి ప్రధాన లక్షణముగా నుండునని నాకుమిక్కిలి నమ్మకము.

హిదూ దేశ క్షేమము విక్టోరియా రాజిగారి హృదయము నందలి యత్యంత ప్రియవిషయములలో ఒకటి. 1875 వసనత్సరమున దు నేను హిందూ దేశమును సందర్శించిన నాఁట నుండి ఆ దేశము యొక్కయు, అందలి ప్రభువుల యొక్కయు, ప్రజల యొక్కయు యోగ క్షేమములను చిరకాలత్వ కారణ ముచే క్షీణింపని యనురాగముతో కూడిన యుత్సాహము తోడ కనిపట్టి యున్న వాఁడను. నాయనుంగుఁ గొడుక గు వేల్సు ప్రభువుగారును, వేల్సు ప్రభ్విగారును మీతో కొన్ని దినములు నివసించి మీ దేశమునందు అమితానురాగమును, తదీయ 'సౌఖ్య సంత "షములయందు నిజముయిన ఆస క్తి గల శ్రద్ధయును, గలవారయి మరలివచ్చిరి. నా రాజ కుటుంబమునకును వంశ పరంపరకును హిందూ దేశ విషయముననున్న అత్యంతాను భావా పేక్షులుగల యీమనోభావములు ఈ రాజ్యము నందలి ప్రజల యొక్క, గంభీరమయిన యే కాభిప్రాయమును ఉద్దేశమును వాస్తవముగా తెలుపనే తెలుపుచున్న వి.

అతి దీర్ఘ కాలము పాలించిన యే రాజ్యము నందుఁగాని సామ్రాజ్యము నందుగాని ప్రభువులకును ప్రజలకును విధింపఁ బడినట్టి మహనీయ 'కార్యమును నెర వేర్చ నావశ్యకములయిన వివేకమును పరస్పర సద్భానమును దై వరక్షణానుగ్రహము లచే వర్దిల్లుగావుత.” 1[2]

శ్రీ జార్జిపట్టాభిషేకము.

గత సంవత్సరము డిసెంబరు మాసము 12 వ తేదీ ఢిల్లీ నగరమున నడచిన మనజార్జి సార్వభౌముని పట్టాభి షేకదర్బారు మహోత్సవము ' భరతవర్షమున జరిగిన ఇట్టి మహూ త్సవము లన్నింటిలో నగ్రస్థానము నందఁదగియున్నది. నాటి దినము మనచరిత్రమున సుదినము. కొంతకాలము పాశ్చాత్య పౌర వాత్య సభ్యత్వములు రెండును మన యీభరత వర్షమున ముఖాముఖియయి చెలంగి భార తీయులగు మనకు నూతనో జ్జీనము మెసం గెను. ఆయుజ్జీవమును బోషించుట మన ప్రభువు లకు ధర్మ మేయయి యుండెను. అయిన వారలలో నుత్తముఁ డగు దాను దన యుదారహృదయమును విప్పి గనుపఱచినం గాని వారి కవసరమగు బలంబు చేకూరదని తలంచి మనజార్జి సార్వభౌముఁడు నూతనపథంబున జాయాసమేతుండు తన సామ్రాజ్యమకుటంబున శిరోరత్నంబగు నీభరతఖండంబునకు

..........................................................................................

I.

విచ్చేసి ప్రాచీన వైభ వోపేతయగు నీదేశమును గారవించి చారిత్రిక ప్రసిద్ధిగాం చిన ఢిల్లీ పురంబున సింహాసనబు నధిష్టించి ప్రజలకు సంతసం బొసంగ నొక కొన్ని వరంబులఁ బ్రసాదించి మనకిఁకముందు మునుపటికంటె నెక్కుడు శ్రేయస్సు గలుగఁ గలదను నమ్మకమును ప్రజలయందు గల్గించినాఁడు. కావున నాటి యుత్సనము నిచ్చట సంగ్రహముగ వర్ణించెదము. 12 వ తేది ప్రాతః కాలమయి కాకమునుపే ఢిల్లీదర్బారు రంగమునందలి భననములయందును పటకుటీరముల యందునుజనుల కలకలము విననయ్యెను. సూర్యోదయ మగునప్పటికి సైన్యము లెల్లెయును దముకు నియమితమయియుండిన స్థలములలో గాయక బృంద ములతో బారులు దీరెను. ధూమశకటపు ఘులును, గుఱ్ఱపు బుళ్లును, మోటారు బండ్లును, రిక్షాలును లక్షులు లక్షలుగ, జూపరులను దర్బాగు రంగమునకుఁ గొని వచ్చి వదల మొదలి డెను. సామాన్య ప్రజలు ఇసుక రాల్చినఁ గ్రిందికి పడనీయక తండోపతండములుగఁ బాదచారులయి రాఁజొచ్చిరి. 9. 30 గంటలకు పట్టాభిషేకమంటపమునకుఁ బ్రజ సాగిపోవఁ బ్రారం చిరి. పదిగంట లగునప్పటికీ సర్వమును సిద్ధమయ్యెను. దూర దేశాగతులయిన నానారాజ్య ప్రతినిధులును భూషణావళులచే సలంకరింపఁ బడిన స్వదేశ సామంతరాష్ట్రాధి పతులును, అధి కారులును, నాహూయమానులయి యుండిన ప్రజానాయ కులును తమ తమ స్థానముల నాసీనులయి యుండిరి. 20 వేలు

సైనికులు మధ్య భాగమున నెల కొల్పఁబడి యుండిరి. 11 గంటల సమయమున మన గవర్నరు జనరలు గారగు హార్డింగు ప్రభు వును ఆతని యర్థాంగి హార్డింగు ప్రభ్వియుఁ బ్రవేసించిరి. 80,000 లు జనులు అనిమిషలోచనులయి సంచమజాచక్ర వర్తిరాకకయి యెదురు చూచుచుండిరి. ఫిరంగుల మోతలును దూరమున విన నయిన ఆనంద ఘోషములును చక్రన చక్రి వర్తినులు దమ నివసించు నగరునుండి వెలునడిరి నుటఁ 'దెలి పెను. కొన్ని నిమేషములలో జయ ఘోషము ఆ మండపము నందే మహా రావముగ విన నయ్యెను. అచ్చటి ప్రజ లెల్లరును లేచి నిలువుబడిరి.సైన్యములు గౌరవసూచకముగఁ దమ యాయుధ ముల నమర్చిరి. గాయక బృందములు రాజకీర్తసను దమ వాద్యముల చే. బలికించి.. మంటపమధ్యమున నింపఁబడి యుండిన జయ స్తంభము పై నాగ్లేయ సామ్రాజ్యవు బావుటా- ఎత్త బడెను. 101 ఫిరంగుల మోత +[3] ప్రారంభనూయెను. పంచమజార్జిచక్ర నర్తిగారి స్యందనము దర్బారు రంగము వద్దనిల చెను. సార్వభౌముఁడును సార్వభౌమియును స్వత రెంచిరి. గనర్నరు జనరలు వారికి స్వాగతమి చ్చెను. గొప్పయుత్సవములో పడికట్ల నెక్కి... 'రు ఇనుము కిరీట ముల నౌదలలనిడికొని పట్టాభిషేక మంటపము -సమర్పఁబడిన సింహాసనముల పై నాసీనులయిరి.గౌరవార్థ మేర్పడిన ................................................................................

ఫిరంగుల మోతనిలచుట తోడనే ఆపనికయి నియోగిం పఁబడియుండిన యుద్యోగస్థుఁడొకఁడు చక్రవర్తి గారి యనుమతిఁ బడసి దర్బారు ప్రారంభ మయ్యెనని తెలియఁ జేసెను. జయజయ ధ్వానములు చెలంగె. గాయక బృందముల ఆరావము లాగుటయే యాలస్యముగ మనజార్జిసార్వభౌముఁడు ఈ క్రింది వాక్యములఁ బల్కెను.“ నేను నేఁడు మీయందఱు మధ్యమునందు నుండుట కెంతయు సంతసించుచున్నాఁడను. ఈసంవత్సరము నేనును చక్రవర్తినియు ననేకాను స్థానములయందు నిమగ్ను లమయి యున్నందున సంతోషకరమగు విశేష పరిశ్రమచేయవలసి వచ్చి, నది. మేము మున్ను ఈ దేశమునకు వచ్చినప్పుడు మామనముల నెలకొని మమ్ముల కృతజ్ఞులం జేసిన సువిషయజ్ఞానము వ్యవధి యెక్కుడుగ లేకున్నను దూరము మిక్కుటమే యైనను మమ్మును మరల నీభూమికి రాఁబురికొల్పెను. . కావున మే మే దేశమును ప్రేమింప నేర్చియుంటిమో ఆదేశమగు నిచ్చట సప్పటింబలె స్వగృహసౌఖ్య మబ్బఁగలదను సంపూర్ణాశ 3 బయలు దేరి వచ్చినారము. పరమాతుని కృపామహిమచే గడ చిన జూన్. మాసము 22 వ తేదీ మావంశమునకుఁ బరంపరగ నచ్చుచుండు కిరీటము ప్రాచీనాచారముల ననుసరించియు నుచిత పద్ధతులం 'బట్టియు ' వెర్టుమినిస్టరు ఆబి' యందునామౌ దల పై నిడఁబడియె. అసమాచారమును నేను స్వయముగ మిగా కందఱకును బ్రకటిం చెదనని గడచిన జూలై మాసమున దెలియఁ 'జేసితిని. ఇట్లు నేనిచ్చిన వాగ్దానము నాయిప్పటి రాకనలన పరి పూర్ణమయినది. రాజభక్తియుతులగు భాగతీయ సామంత ప్రభువులకును విశ్వాససంపూరితులగు భారతపుత్రులకును మాయనురాగముం గనుపఱచుటకును భరతవర్ష సామ్రాజ్యపు క్షేమమును సౌఖ్యమును మేమెంత మనఃపూర్వకముగఁ గోరున దియు సేయుటకును మహదిచ్ఛగలవాఁడనయి గూడ చక్రవర్తినితోడ బయలు దేరి వచ్చినాఁడను. ఇతియగాక మా కిరీటధారణోత్సన సమయమున (నింగ్లాంకకున) నుండ లేక పోయిన వారికి ఢిల్లీ పురమున మాపున రాభి షేకమునుఁ జూచు ననకాశము గలిగించనలయు నని నా కిష్టము గలిగినది. నా గవర్నరులును, విశ్వాసపాత్రులగు నాయిత రాధి కారులును, నాసామంత ప్రభువులును, ప్రజాప్రతినిధులును, నా భరతనర్ష సైన్యములలోని ముఖ్య భాగములును గల యీ మహాసభం జూచి నాకు పరమానందమయినది. వారు శ్రద్ధమైనాకుఁ జూపఁడలంచి కొనిన రాజభ క్తి, సమాసనతులను సంపూర్ణ హృదత సతోషము, స్వయ ముగ నంగీక రింపనున్నాఁడను.']

సానుభూతి సంకలిత మనోగతియును ప్రేమా పూర్వక సుహృద్భావమును ప్రభువులను ప్రజలను నాతోడంగూడ

నీ సుసందర్భమున నైక్య మొనర్చు చున్న వను దృఢ భానము నాకు గల్గియున్నది. ఇట్టి మనోభావములను బ్రదర్శించు నుద్దేశముతో నా విశేషానుగ్రహ విశేషవి వేచనలం దెలుపు కొన్ని కార్యములచే నాపట్టాభి షేకమ సూత్సనమును స్మరణీయము సేయఁ దలంచి నాఁడను.ఆవ్వానిని నాగవర్నరు జనరలు ముందీమహా సభకుఁ దెలుపఁ గలఁడు.

మీహక్కులను స్వాతంత్ర్యములను గౌరవించు విష యమున నాకు వందనీయులగు నా పూర్వికుల చే నుడువఁ బడిన స్థిరవాక్యములను స్వయముగ దృఢ పఱచుటకును మీక్షేమ మును శాంతిని సంతుష్టిని హృదయపూర్వకముగఁ గోరుచుండు టను దెలియఁ జేయుటకును నాకీ తరుణమబ్బినందులకు సంత సించుచున్నాఁడను.

కృపామయుండగు నాపరమాత్ముడు నా ప్రజలను గాచుచు వారికి సౌఖ్యము:ను నభివృద్ధిని గలుగఁ జేయుటకు నాకు సాహాయ్యముం బ్రసాదించుగాత !

ఇచ్చటంగల సాముత ప్రభువులకును నాప్రజకును "మేము ప్రేమా పూర్వక స్వాగత మిచ్చుచున్నా రము.” సర్వ జనులకును సమానముగ వినిపించునట్టిసుస్వన మున నిట్టిసూక్తులు చక్రవర్తిగారి ముఖము నుండి వెలువడి

నప్పు డామహాసభవారు ముది తాత్ములయి యఖండముగ జయ జయ ధ్వానముల సలిపిరి.

తరువాత సన్మావతులు ప్రారంభమాయెను. మొదట గవర్నరు జనరలును, నున్నత సేనా నాయకుఁడును, గవర్నరు . జనరలుగారి యధికారసభా సభ్యులును నొకరి తగువాత నొకరు చక్రవర్తిగారికి నుచితవిధము: వినమ్రులయిరి.

వీరికిఁ బిదప మొదటియతస్తు స్వదేశ సంస్థ" నాధి: పతులు విచ్చేసిరి. అందు హైదరాబాదు, బరోడా, మైసూరు ప్రభు వులు మొదటి మువ్వురు. సీ పిరుండ. దక్కు గల వారు. '

వారికి వెనుక నితదన- సంస్థానాదీశ్వరులును మాండలిక ప్రతినిధులును సధికారులును దమతమ దర్జాననుసరించి స్వా భౌమున కెఱింగిరి.

ఇది యంతయుముగిసిగి, మరికొన్ని సుదర్మములు జరిగిన తరు వాత మంగళ ధ్వానములు చెలగ ముఖ్యంమందీశ వహనుడు పార్కును (Chief herald) • ఈ క్రింది ప్రకటన చదివెను.

రాజుగారి ప్రకటన

శ్రీజార్జి మహారాజ చక్రవర్తి. మా భుత్వపు ప్రథ సంవత్సరమగు, సుంకము వేయిన్నితొమ్మన్నూట వపదప సంవత్సరపు జూలై నెల ది. 19 వ తేది గలిగి నట్టియు నవంబరు నెల ది. 7 వ తేది గలిగినట్టియు రాజప్రకటనముల మూలమున ,........................

కండవ సంవత్సరపు జూను నెల ది 22వ తేదీని సర్వశ క్తుడగు భగవంతుని. కృపాప్రసాదములచే మా రాజపట్టాభిషేక మహోత్సవమును జరుపగలందులకు మారాజచిత్తమును ప్రక టించి వ్యక్తపరచి యుంటిమి గావునను; గడచిన జూను నెల ది22వ తేది గురువారమున సర్వశక్తుడగు భగవంతుని కృపాప్రసాద మువలన, పైని చెప్పిన మహోత్సవమును జరుపగలిగితిమి గావునను, పైని చెప్పిన మహోత్సవ మట్లు జరిగినదని మా హిందూ రాష్ట్రములలోని ప్రేమగల మా ప్రజలకు మేము స్వయ ముగా తెలియ పరచుటయును, మాగవర్నరులను లె ప్టి నెంటు' గవర్నర్లను; మా యితర ఆఫీసర్ల ను, మాసంరక్షణలోనున్న స్వదేశ రాజులను, సంస్థానాధిపతులను, ప్రభువులను, మా హిందూ సామ్రాజ్యపు పరగణా లన్ని టిలోను ఉన్న మాప్రతి నిధులను, మా సన్నిధికి బిలుచుటయును, మా ఆపేక్షయు అభి లాషయునై యున్న వని మేము మా ప్రభుత్వపు ప్రథమ సంవ త్సరమగు క్రీస్తుశకము వేయిన్ని తొమన్నూట పదునొకండవ సనత్సరపు మార్చి నెల ది 22వ తేదిగల మా రాజ ప్రకటనము మూలమున విశదపరచి యుంటిమిగావునను;

ఇప్పుడు మేము మా రాజప్రకటనమగు దీనిమూలమున దానిని విశదపఱచుచు మా ఆఫీసర్లందరికిని, ఢిల్లీలో సమా వేశ మయియున్న రాజులకు సంస్థానాధిపతులకు ప్రజలకు అందరి

కిని, మహారాజ చక్రవర్తిగా మా మంగళాశీర్వాదము లొసంగి ఇండియా సామ్రాజ్యము నెడల మాకుగల గాడ వాత్సల్య మును అందలి క్షేమాభ్యుదయముల విషయమున మాకు ఉన్నట్టియు సర్వదా ఉండు నట్టియు, శ్రద్ధను దృఢముగా స్పష్ట పఱుచుచున్నాము.

మా ప్రభుత్వపు ద్వితీయ సంవత్సరమైన వేయిన్ని తో మ్మ న్నూట పదునెకండవ సంవత్సరపు డిశంబరు నెల ది 12న తేదిని, ఢిల్లీ పట్టణములో మాయాస్థానమునుండి సాదరు చేయబడినది.

శ్రీమహా రాజు చక్రవ ర్తి గారిని భగవంతుని రక్షించు గాత:""*[4]

జయజయధ్వానములు చెలంగె. సైనికులు గౌరవ చిహ్నముగఁ దమయాయుధములఁ దగురీతి నిలిపిరి. సభయంత యు లేచి నిలువంబడియె. 101 ఫిరంగులు జార్జి సార్వభౌముఁడ య్యెనని నల్గిక్కులకుఁ జూటె. దర్బారు రంగమునకు "నెలుపట నుండిన సైన్యములు సంతోషమును జూప మందు లో నించిన బందూకుల ప్రేల్చిరి. అంతయు నొక్క-యానంద ఘోష, సము ద్రం బయ్యెను.

పిదప గవర్నగు జనరలు గారగు హాస్టింగు ప్రభువు చక్ర వర్తిగారి విశేషోత్తరువులఁ బ్రకటించిరి. ......................................................................................

అందు ఇతర వరములతో డంగూడ ప్రథమవిద్యకయి 50లక్షల రూప్యము లియ్యఁబడెనను సువార్తయుండెను. హార్డింగు ప్రభువు కూర్చొనిన వెనుక చక్రవర్తి చక్ర వర్తినులకు నాయురారోగ్యైశ్వర్యంబు లగు గాతమని ముమ్మారు సభ వారందఱును ఆశీర్వదించిరి.


సభను ముగింపు చేయుచు శ్రీపంచమజార్జి సార్వభౌ ముఁను అత్యద్భుతముగఁ బ్రజలు దలంపనై న దలంపని, రెండు వరంబుల నిచ్చెను. చిర కాలము ప్రజల మనోవ్యధకుఁ గారణ బయియుండిన వంగ దేశ విభజనము రద్దయిపోయె. భరతవర్షపు రాజధాని కలకత్తానుండి సుప్రసిద్ధమగు ఢిల్లీకి మారువ బడియె. భార తేయుల మనంబులల రె. ఈవరముల గుఱించియు నీదర్బారును గుఱిం చియు నిఁక బెంచి వ్రాయవలసిన పని లేదు. సౌహృదయమున సామ్రాజ్య పరిపాలనకుం గడంగి యుండు మన జార్జి మేరీలకు నాయురారోగ్యైశ్వర్యంబులు పరమాతుండిచ్చి కాపాడు గాక !

ఓం శాంతిః శాంతిః శాంతిః
  1. రావుబహదూరు క. వీళేశలింగము పంతులు గారి విక్టోరియా రాజిచరిత్రము, (84-85 ఫుటలు).
  2. Quotation fom Fort St. George.Gazette.
  3. * ఇది రాజు గారి గారి గౌరవార్థమేర్పడినది.
  4. * Quotation from Fort St. George Gazette.