ఢిల్లీ దర్బారు/ఆఱవ ప్రకరణము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

ఢిల్లీద ర్భారు

.

5. మైసూరు రాజ్యము.

.
శ్రీ మైసూరు మహారాజు గారు.

ఆఱవ ప్రకరణము.

మైసూరురాజ్యము.

ప్రవేశిక

భరతవర్షమునందు స్వదేశ రాజ్యములలో మూఁడవది యయి విరాజిల్లునది మైసూరు. తూర్పుకనుమలును పడమటి కనుమలును నొక్కటిగఁ జేరు నీలగిరు లిద్దానికి శిరమని చెప్పు వచ్చును. అచ్చటినుండి ఈ దేశము వెడల్పగుచు నుత్తరమునకు వ్యాపించుచున్నది. ఈశాన్య దిగ్భాగమున బొంబాయి రాజ ధానిలోని రెండు జిల్లాలును నైఋతి మూలన కొడగును దప్ప దీని కన్ని వైపులను మద్రాసు రాజధానియెయెల్ల. ఇందు ఉన్న తము లగు పర్వతములును పురాతనములగు నడవులును 4,000-5,000 అడుగుల ఎత్తునకు దల లె త్తికొని గంభీరముగ నిలచియుండు. అసంఖ్యాకములగు దుర్గములునుగలవు. కావేరి, తుంగభద్ర, పాలేరు, ఉత్తర పినాకిని, దక్షిణపినాకిని, మున్నగుప్రసిద్ధ నదీ నదము లీ దేశమున ప్రవహించుచున్నవి.ఇందు సొంపులుగురిపించు జలపాతము లనేకములు. వానిలో 'గెర్సొప్పా జలపాతము సుప్ర . సిద్ధము. ఈ దేశ మీ విధమున నడవులు పర్వతములు నదులు జలపాతములు దుర్గములు మున్నగువానిచే నలంక రింపఁబ.. యుండుటయేగాక భూగర్భ నిక్షిప్త వస్తు సంపత్తి చేతను, ఉత్తమ సస్య సంప్రాప్తి వలనను, అపూర్వ జంతుజాల సమా వేశంబునను వర్ణ నీయమయి యున్నది. భరతవర్షమునం దిం కెచ్చటను ఈసీమయం దుత్పత్తియగునంతటి బంగా రుత్పత్తియగుట లేదు. మంచి గందపు చెట్లకును భద్రేభములకును నిది పుట్టి నిల్లు. తేఁకుమ్రాకులును నిటమెండు. కొమ్ముగల పశువులును నిచ్చట వి శేషము. "కాఫీ పైరు నకుఁగూడ నిదియే పట్టు. ఈరీతి నిది ప్రకృతి ఫలముల విషయమున ప్రఖ్యాతము. ఇఁక నిచ్చటి మానవ చరిత్రమునకు దిరిగితిమేని శంకరాచార్యులును రామానుజులును నిరువురును దీని నె దమ జీవనముచే పావనము చేసిరి. ఇంతియగాక దక్షిణ హిందూస్థానమున పరాక్రమమునకుఁ బేరుగాంచి రాజ్యము లేలిన కదంబులకును హొయి సణులకును బహుశః విజయనగరాధి పతులకును నిదియె జన స్థానము.

రెండుభాగములు

ఇట్టి విశేష చరిత్రగల మైసూరు దేశమును స్వరూపము వలన రెండు భాగములుగ విభజింపవచ్చును. పడమటి కనుమల నను సరించు పర్వత ప్రదేశమగు పశ్చిమదిశాభాగమునకు మల నాడు అని పేరు. పట్టణములు పల్లెలును గలిగి జనసమృద్ధితో మెప్పు తూర్పు భాగము మైదానము లేక బయలు 'సీమయని .

పిలువఁబడుచున్నది... . మలనాడు . చిత్రవిచిత్రములగు నరణ్య ముల చేతను పర్వతముల చేతను గప్పఁబడియున్నది. మైదానము నీటివసతినిబట్టి యనేక విధములయి యున్నది. ఉత్తరముననుండు చదరమయిన నల్ల రేగడి భూమి ప్రత్తిని జొన్నలను ఈను చున్నది. నదులనుండి త్రవ్వఁబడిన కాలునల నీటి పారుదలగల దక్షిణణ -పశ్చిమభాగములు చెఱకునకును వరి పైరునకును సదన ములయి పరగుచున్న వి. చెఱువుల పై యా ధారపడి యుండు భూములు టెంకాయ పోకతోఁటలచే నలంక రింపఁబడియున్న వి. తూర్పుదిక్కునండలి-ఎఱ భూమిలో రాగి మున్నగు కుష్కీ పైరులు పండుచున్నవి. శిలామయమయిన - విరివియగు మధ్య ప్రదేశము ముదుకగడ్డి బయ లై అటనట చల్లని నీడనీను తోపు లఁ బ్రదర్శింపుచున్నది.

నామ ప్రసంశ.

సంస్థానమునకంతకును రాజధానింబట్టి మైసూరు అని పేరు. . మైసూరు అనునది.. మహిష - ఊరుఅను రెండుపదముల

  • కూడిక వలన నై.నది: 'మహిషుఁడను * [1]రక్కసుఁ డొక్కఁడా

ప్రాంతముల నుండెడువాఁడఁట. వానిని చాముండియను పేరఁ బరగు 'ఈశ్వర సతి ద్వంద్వయుద్ధమునఁ బరిమార్చి ఆ ప్రాంతము , లందలి జనులకు : సుఖముఁగూర్చి' మహిషాసుర. మర్దనియను ............................................................................................

బిరుదు పేరుతో నచ్చట నివాసమేర్పఱచుకొని నేటికిని అనే కులచే నర్చన లందుచున్నది. అట్టి యా మహిషునికి చేరిన యూరగుటవలనను మహిష శబ్దము కన్నడమున మైసయని మారుటవలనను “మైసూరు' అయినది.

పురాతన నామము.

ఈ దేశమునకు ' మైసూరు ' అను పేరు పూర్వమునందు హిందూ వాజ్మయమున నెచ్చటను వాడబడియుండ లేదు. ఒక్క మహావంశమను బౌద్ధ గ్రంథమునందు మాత్రము మహిషమండ లమని ఈ ప్రదేశము పేర్కొనఁబడి యున్న దేగాని ఇతర గ్రంథము లందంతటను 'కర్నాటము', 'కర్నాటకము' అనుపదము లే ఉప యోగింపఁబడి యున్నవి. ఇప్పుడీ కర్నాటక పదము మైసూరు సీమకు బొత్తిగానన్వయింప కుండుటంబట్టియు అంతటితో నిలువక ‘కర్నాటక' 'కనర' శబ్దములు వేరు ప్రదేశముల కన్వయించు చుండుటం బట్టియు నీ పదముల నొక కొంత ఇట చర్చింపవలసి యున్నది. 'కర్నాట' కర్నాటక ' మను శబ్దముల కనేకులనేక యుత్పత్తులఁ జెప్పుచున్నారు. పండితులిద్దానిని సంస్కృత పద మనుచున్నారు.. సన్ వాటరు ఎలియట్ అను గ్రంథకర్త దీనికి “ శాతకర్ని ' * [2]మున్నగు పదములలోని 'క' (కర్ని' యను పద ములతో సంబంధము గలదనియు కావున నిది ప్రాచీన ప్రభువులు వలన వచ్చిన,, దనుచున్నాడు. మఱికొందడిది కర్ల + ఆట .......................................................................................

(అనఁగా చెవునకుపండువు) అని నిర్ణయి)చుచున్నారు. డాక్టరు గుడర్టు “కార్' 'నాడు' అను రెండుపదములు చేరి కర్నాట మయిన దనియు 'కార్ ' అనఁగా నలుపుగావున నల్ల రేగడి భూమినలన నీ పేరీ దేశమునకు వచ్చి యుండవచ్చుననియు నుడువు చున్నాఁడు. 'కాన్ ' 'నాడు'. అను పదద్వయ సమేళనముచే వచ్చినదనుట సమంజసమే కాని డాక్టరుగుండర్డుగారి యర్థము సరియైనది మూత్రము కాదని చెప్పవచ్చును. కార్ శబ్దము తెలుఁగు నందు 'కారు' అను రూపమునం గాననగును. మనభాషయందుఁ గూడ నీపదమునకు నలుపు' (చీఁకి టి) అని యే యర్థము. నాడు శబ్దము రెండు భాషలకును సామాన్య మే. కావున కారునాడు లేక కర్నాడు లేక కర్నాటము అనఁగా చీకటి దేశమని యర్థము తేలు చున్నది. ఈ చీకటి దేశము ఆంధ్రశబ్దము చే 1[3]సూచింపఁబడు దండ కారణ్యముదక్క మఱియెద్ది కాఁగలదు? ఆ కాలమున నిప్పటి మైసూరు నందు విశేషభాగము దండకారణ్యము లోనిదేయని చెప్పుటకు సందియ మనసరము లేదుగదా! 2 [4]అట్టిచో 'ఆంధ్ర' మనునది సంస్కృత భాషావిదులచే, కర్నాట శబ్ద పర్యాయ పదముగఁబ్రప్రథమమున నుపయోగింపఁబడి పిదప విభేద మేర్పడిన తరువాత నది తెలుఁగు శాఖకు చెం దెననుటలో సాహసమేమియు .............................................................................................

నుండఁజాలదు. ఆంధ్రులు కర్నాటకులని వర్ణింపఁబడి యుండు టకుఁగూడ 'నిదియె ' కారణమని 'తో (చుచున్నది. మఱియొక కొద్ది యాధారముగూడ నున్నది. " (కన్నడ' మను శబ్ద స్వరూప మును:మనకుఁ దోడుపడు చున్నది. ఇది కన్ :- నాము అను పద ములనుండి వచ్చిన దే. .కన్ అనఁగా కన్నడ భాషయందు చీకటి యనియే యర్థము. కావున - నిదియు చీకటి దేశ మను నర్థమునే ఇచ్చుచున్నది

ఇట్లు కర్నాట శబ్దము దండకారణ్యమునకు తెలుఁగు వారును కన్నడమువారును నట నైక్యమున నివసించు కాలమున వచ్చినదని చెప్పవచ్చును. మహమ్మదీయుల ప్రవేశముతోఁ గర్నా టక పదము దండకారణ్య ప్రదేశమునకు మాత్రముగాక మల దిగిన తరువాత ' దానికి దక్షిణమునను దూర్పునను నుండు భూభాగమునకుఁ గూడ వర్తింపజొచ్చెను. ఆంగ్లేయులు ప్రమాదవశమున నాపదమును మలదిగిన తరువాత నుండు బయళ్లకు మాత్రమె యన్వయింపఁ - జేసిరి. కావున న్యాయ ముగఁ గర్నాటక మను పేరుతో బరగవలసిన మైసూరున కా పేరు లేకుంటయు నితర ప్రాంతముల కా పేరు వచ్చుటయుఁ దటస్థించిన ది.

పురాణ ప్రసిద్ధమగు చరిత్రాంశములు.

మైసూరు నందు వి శేషభాగము - దండకారణ్యముగ నుం డెనని వ్రాయఁబడియెను. - పురాణములయందీ యరణ్యము .

పలుమారు పేర్కొనఁబడుచుండుటవలన ' మైనూరు. దేశపు బూర్వచరిత్రయందొక కొంత పురాణగాథల నుండియే వ్రాయ బడవలసి యున్నది. అగస్త్యుడు ఇల్వలవాతాపులను మడియిం. చిన ఘట్టము నెలమంగళము . వద్ద నర్క వతీ నది పయనుండు- స్తంభోదధి (కమ్మసంద్రము) అను గ్రామమని చెప్పఁ బడు చున్నది. ఇతరులగు ఋషులును నీ దేశమున తపోధనులయి నట్టును నుడువఁబడుచున్నది. గౌతముఁడు కావేరీ తీరమున శ్రీరంగ పట్నమునందును కణ్వుఁడు ఉన్న పట్నమునకు సమీపమున వేలూరు నొద్ది నదీతీరమునను, విభాండకుఁడు తుంగానది పయి శృంగేరికడను, మార్కండేయుఁడు భద్రానది పై కాండేయము ఒద్దను, దత్తా త్రేయుఁడు బాబా బుడ్డను పర్వతముల మీదను తపశ్చరణము సల్పినట్లు ప్రతీతి కలదు.

ఆర్యులు దక్షిణాపథమునకు వచ్చునప్పటికి మైసూరు సంస్థాన ప్రదేశమున రాజ్య మేలుచుండిన వారలలో రాక్షసులని వారిచేఁ - బిలువంబడిన స్థానిక రాజులుండినట్లు విశదమగు చున్నది. నిష్కర్షగ వీర లే యీ కాలము వారని చెప్పుట కాధా రములు లేవుగాని పురాణ గాథలను బట్టి 'తుంగభద్రమీఁది. హరిహరము రాజధానిగ గుహాసురుఁడును, చిత్రదుర్గము ముఖ్య పట్టణముగ హిడింబాసుకుఁడును, రహమను ఘరము నుద్ద బకాసురుఁడును, మైసూరను నామమునకుఁ గారణభూతుఁడగు మహిషాసురుఁడు చాముండీయందును ప్రబలులయిన ట్లూహింప వలసి యున్నది.

పరశురాముని జనాదికములకు గూడ మైసూరు భూమియే సదనమనుటకు నిదర్శనములున్నవి. జమదగ్ని సురభికి యజ మాని యనుటయు,, రేణుక తన మగనితోడ నగ్ని నిప్రవేశిం చుటయు, కార్తవీర్యుఁడు చంపఁబడుటయు, కస్యపుడు కుత్రియ "శేషమును గా పాడుటకయి పరశురాముని సముద్రతీరమునకు "వెడలిపొమ్మని శాసించుటయు, పరశురాముఁడు సగరుని వేడి సత్తకొంకణముల సంపాదించుటయు మున్నగు విషయముల సూచించుటకు సురభితాలు కాయును, చంద్రగుత్తిలోని రేణుక దేవాలయమును, కోలారునందు కొల్లాలమ్మగుడియు, తీర్థహళ్లి యును, సాగరను తాలూకాయును, హీరేమాగ ళూరులోని పరశు దేవాలయమును, హి రేమాగళూరునకుఁ బూర్వనామ మగు భాగ్గవపురియును చాలియుం డునని ‘రైస్' అను చరిత్ర 'కారుఁ డూహించుచున్నాఁ.డు.

రామాయణ కథ ననుసరించి కిష్కింధ వదలి శ్రీ రాముఁడు దక్షిణాభి ముఖుఁడై లంక కుఁదరలుట మన మెఱిఁగి నదె. కిష్కిధలో నిదగు పంపా సరోవరము తుంగభద్రాతీరమం దలి సుప్రసిద్ధమయిన విజయనగరముగదా. అచ్చటినుండి దక్షిణమున కేగుటకు మార్గము మైసూరు సంస్థాన భూమి ద్వారా యయి యుండవలయుననుటకు సందియము లేదు. జైన

రామాయణమునందు కిష్కింధ వానరధ్వజ రాజ్యమని పిలువఁ బడియున్న ది. దానియం దా రాజ్య చరిత్ర బాగుగ నియ్యఁబడినది. . అదెల్లయు నిచట వ్రాయు టనవసరము. దానిననుసరించినచో మైసూరున పశ్చిమో త్తరభాగము - రామాయణ కథలో ననే కాంశములకు పట్టుగనుం డెనని తేలుచున్న ది. భారత కథయందును మైసూరు ప్రదేశము ప్రాముఖ్యత నందియున్నది. అర్జునుఁడు తీర్థయాత్ర సలుపు నపుడుమ హేంద్ర పర్వతముల దాఁటీ మణి పురమును జొచ్చి అచ్చటి రాజు కూఁతును చిత్రాంగదను బెండ్లియాడి మూఁడేండ్లు వసించి బభ్రువాహనుఁ డను కొడుకును బడ సెనని చెప్పఁబడియున్నది. ఈమణి పురము శ్యామరాజు నగరమునకు సమీపమున నున్నట్లు నుడువఁబడు చున్నది.* దిగ్విజయసమయమున సహ దేవుఁ డు దక్షిణము పై దాడి వెడలి కిష్కింధను దాఁటి కావేరికడ కేగి మాహిష్మతీ రాజగు నీలుని జయించుచున్నాఁడు. ఈమహిష్మతి మైసూరనియే చెప్పవలసియున్నది. అటనుండి అతఁడు సహ్యాద్రుల మార్గమున కొంకణ, గౌళ, కేరళ రాజులను వశవర్తులఁ జేసికొనెనని నర్ణించుటవలన ! నీయూహకుఁ గొంచెము దార్డ్యముకలుగు చున్నది. కన్నడభాషయందుఁగల జైమినీ భారతమున మేధయాగ వర్ణనలో , బేర్కొనఁబడిన కొన్ని ఫలములును ..........................................................................................

  • బంగాళమునందలి మణిపురము బభ్రువాహనుని దనుచు న్నారట

గానిభారతమందలి వర్ణనలను బట్టి అదికాఁజాలదు .

19

మైసూరు దేశములోనివియని పరంపరగ జెప్పుకొనఁబడుచున్నది. బభ్రువాహనుని రాజధానియగు మణిపురమును గుఱించి పైని వ్రాయఁబడియెను. అశ్వమచ్చటికి వచ్చినతోడనే బభ్రు వాహనుఁ డద్దానిని పట్టెను. . అర్జునుని కుమారుఁడగుట వలన నతఁడు దానిని మహావైభవమునఁ దండ్రి కర్పింపఁ. బోయెను. విధివశమున నర్జునుఁడు పుత్రుని గుర్తింప లేక అతనిని తిరస్క రించెను. 'కావున వారిరువురకును యుద్ధము జరిగెను. యందర్జునుఁడు మృతుఁడయ్యెను. బభ్రువాహనుని తల్లి యగు చిత్రాంగద అర్జునునితో సహగమనము సేయ సిద్ధపడెను. దాని మీదట బభ్రువాహనుఁడు ఉలూపి సాయమున నాగుల యెద్ద సంజీవిని కలదని విని సామమున నది లబ్ధిపనందున వారితో యుద్ధము చేసి సంపాదించి తెచ్చి అర్జునుని బ్రతికించుకొనెను. తరువాత నాయజ్ఞపశువు రత్నపురమును అటు తరువాత కుంతలమును బ్రవేశించెను. ఈరత్న పురకుంతలములు కాడూరు జిల్లాలోని లక్వల్లి యనియు శివ మొగ్గ జిల్లాలోని కుబత్తూరు అనియు వాడు కొనుచున్నారు.

మైసూరు సీమ యందింకనుకొన్ని పురాణగాథలలోని స్థలములున్న వని వాడుక లున్న విగాని వాని నంతయును వివ రించుట మన కార్యమున కవసరముగాదు. కావున నింతటితో పురాణగాథల నటుండనిచ్చి చారిత్రిక విషయములఁ బ్రారం భింతము.

హిందూ దేశ చరిత్ర కంతటికిని పోలె మైసూరునకుఁ గూడ కాలనిర్ణయ విషయములకు నిశ్చయాధారమయినది ఆ లెగ్జాండరు దండయాత్రయె (క్రీ. పూ. 327.) అతఁడు హిందూస్థానమును వదలి తన దేశమునకుఁ దరలినతోడనే భరత వర్షమున నేకచ్ఛత్రాధిపత్యము వహించిన వాఁడు చంద్ర గు వ్యుడు. ఇతఁడే మన దేశమునకుఁ బ్రథమచక్రవర్తియని చెప్పవచ్చును. ఈతని వంశము మౌర్యవశము. ఈతని మనుమఁ డే బౌద్ధమతోద్ధారకుఁడయి లోక ప్రసిద్ధి గాంచిన అశోక వర్ధనుఁడు. చంద్రగుప్తుఁడు జై నుఁడు. జై నమత సిద్ధాంత ముల ననుసరించి అతఁడు తన జీవయాత్రాంతమున రాజ్యాధిక ములను వదులుకొని ప్రఖ్యాతుఁడగుభద్ర బాహుఁడను గురువు నాజ్ఞలఁ జెల్లించుచు తపశ్చరణ మొనర్చుటకుగాను అతనితోడం గూడ బయలు దేరెను. ఉజ్జయనీ నగరమున పండ్రెండు సంవత్సరము కఱవు రానున్నదని భద్రబా హుఁడు దన దివ్యజ్ఞానము చే నెఱింగి శిష్యులనందఱను వెంటఁ బెట్టుకొని దక్షిణాభిముఖుఁడై వెడ లెను. మైసూరు సీమలోని శ్రవణ బెళగొళము నొద్దకు వచ్చునప్పటికీ భద్రబాహువునకు మృ త్యువుసమీపించుట యెఱుక యయ్యెను. కావున నతఁడచ్చట నొక్క శిష్యునితో నిలచి తక్కినవారలను ప్రయాణము సాగింపు డనెను. అట్లు గురువుతో నుండిపోయిన యొంటరి శిష్యుఁణీ చంద్రగుప్తుఁడని తెలియవచ్చుచున్నది.శ్రవణ బెళగొళమునందు

భద్రబాహుఁడు పరలోకమున కేగువఱకును నతనికి సపర్య లొనర్చి పిదప పండ్రెండేండ్లు మునివృత్తినుండి భరతవర్షపు ప్రథమచక్రవర్తి పరమపదము నందె ననుచున్నారు. ఈకథకుఁ బ్రోద్బల మొసంగుటకు వలయు స్థల నామములును ఆలయము లును శాసనములును శ్రవణ బెళగొళమునందుఁ గలవు. ఈకథ మనము విశ్వసించినను విశ్వసింపకున్నను రైసుగారి వలన మైసూరు. నుండలమున ఈశాన్య భాగమునందు గనిపట్టఁబడిన అశోకుని శాసనములను బట్టి ఆ భాగము మౌర్యుల రాజ్యములో జేడియుండెననుట మాత్రము దప్పక సిద్ధించుచున్నది. అశో కుఁడు మహిష మండలమునకును (మైసూరు) వనవాసికిని (మైసూరు మండలమ: నందు నాయవ్య భాగము) తన మత ప్రచారకులను బంపెను. ఈ రెండును నతని రాజ్యపు సరిహద్దున కావలనుండిన ప్రదేశములని చెప్పవలసియున్నది. షి కారు పురమందలి బండని క్కె గ్రామముకడనుండు పండ్రెండవ శతా బపు శాసన మొక్కటి కుంతలమును మౌర్యుల రాజ్యములోని భాగముగ వర్ణించుచున్నది. ఇది రమారమి పడమటి కనుమలు పశ్చిమమున నెల్లగాఁగలిగి భీమా వేదవతుల మధ్య భాగమున నుండు భూభాగము. ఇందు శిన మొగ్గ, చిత్రదుగ్గము, బళ్లారి, ధార్వాడ, బిజాపురము జిల్లాలును వీని సరిహద్దులనుండు బొం బాయి రాజధాని నైజాము ఇలాకా భూములును . నిమిడి యున్నవి.

ఈవిధమున మౌర్యుల సామ్రాజ్యమున నుత్తర మైసూరు భూములు నుండెనని విస్పష్టముగ , నేర్పడుచున్నది. పురాణ గాథల ననుసరించి మౌర్యవంశజులు 137 సంవత్సరములు రాజ్య మేలినట్లు తేలుచున్నది. ఆ శాఖలో గడపటివాఁడగు బృహద్ర ధుని అతని సేనానియగు పుష్యమిత్రుడు. చంపించి సంగవంశ మును స్థాపించెను. వీరు 112 సంవత్సరములు రాజ్య మేలిరి: కాని ఆకాలములో కడపటి భాగమున కణ్వవంశమువారు వీరిని మించిన ప్రఖ్యాతి గలవారయి 45 ఏండ్లు సర్వ స్వతంత్రు లయి పరగిరి. వీరు సంగ భృత్యులని కూడ పిలువంబడి యుడు టచే వీరు మొదట మొదట సంగా, రాజులకు లోబడినవారయి యుండినను నుండవచ్చును. సుకరుడను కడపటి కణ్వరాజు ఆంధ్రభృత్య వంశమునకు స్థాపకుఁడగు సీముకుని (శ్రీము ఖుని) చేనోడింపఁబడెను. ఈ యాంధ్ర భృత్య వంశమున కే శాతవాహనులనియు తచ్ఛబ్ద ప్రాకృతమగు [5]శాలివాహను లని యు పేళ్లు. ఈ శాలివాహనులకు ముఖ్య రాజథాని కృష్ణాతీర మున నుండు ధారణికోట. వీరికి మరియొక రాజధాని కూడనుండె డిది. అది గోదావరీతీరమున (నిప్పటి నైజాము రాజ్యములోని) పైఠణ్ పురము. దీని కే ప్రతి స్థానమని పేరు. ఈ శతవాహను లు త్తర 'మైసూరు సీమను ఏలిరనుట శాసనములవలనను నాణ్య ముల వలనను నిశ్చయింపఁబడి యున్నది. ఇచ్చట రాజ్య ....................................................................................

భారము వహించిన రాజులకు శతకర్ణియనునది బిరుదు నామ ముగఁ గాన్పించు చున్నది. శాలివాహన వంశపు శాఖలోని వారగు నీ శతకర్ణుల కాలము క్రీII పూII "రెండు శతాబ్దములు ను అటుతరువాత రెండు శతాబ్దములును నని చెప్పవలసి యు న్నది. శాలివాహనుల శక్తి తగ్గిపోవుట తోడనె మైసూరు సంస్థాన ప్రదేశమున న నేకు లితరవంశములవారు వేరు వేరు భాగ ముల నాక్రమించుకొనిరి.

కదంబులు

క్రీస్తునకు వెనుక మూఁడన శతాబ్దమునకు వచ్చునప్పటికి మైసూరు సీమలో వాయవ్య దిగ్భాగమున కదంబులు రాజ్య మేలుట గానవచ్చు చున్నది. వీరితోఁగూడ మైసూరున రాష్ట్ర కూటులును మహా బలులును పల్లవులునుగూడఁ జూపట్టు చున్నారు. ఇంచుమించుగ నీ కాలమునకు వచ్చునప్పటికి నిశ్చ యాధారములు వలసినన్ని పొడఁగట్ట నారంభించు చున్నవి. కదంబుల రాజ్యమున పశ్చిమ మైసూరును, ఇప్పటి ఉత్తర కన్నడము జిల్లాయును తుళువమనంబడు దక్షిణక న్న డము జిల్లాయును జేరియుండెను. వీరి రాజధాని వనవాసి. కదంబనామమును గుఱించి చిత్రమగు కథయొక టి గలదు. పరశురాముఁడు సాగరమునుండి హైగ * [6]తుళువముల సంపాదించిన కొంతకాలమునకుఁ దరువాత నీనూతన భూప్రదే .................................................................................

శమును జూచుకోఱకుసహ్యాద్రులకు అనఁగా పడమటి కనుమ లకు పార్వతీ పరమేశ్వరులు విచ్చేసిరి. వారివలన నచ్చట ఒక కదంబ వృక్షు మునీడన ఒక బాలుఁడు పుట్టెనఁట. దానివలన నాసంతతికి కదంబ నామమయ్యె నందురు. ఇంకొక వాడుక ననుసరించి ఈశ్వరుఁడు త్రిపురాసురులఁ జంప పరిశ్రమ చేయు చో నతని ఫాలము నుండి స్వేదము కదంబ వృక్షు మూలము నకుఁ బారెననియు ఆ స్వేద బిందువులచే ఒక బాలుఁడు పుట్టె ననియుఁ జెప్పుకొనఁ బడుచున్నది. ఎటు లైన నేమి బాలుఁడు ఫుట్టెనని మాత్రము రెండు గాథలును నుడువు చున్నవి. ఆ సమయమున నా దేశమునకు రాజుండ లేదఁట. కావున రాజు.. 'నేర్పఱచుట కై సుస్థానేభ ముయొక్క తొండమునకుఁ బూ మాల నిచ్చి విడిచిరఁట. అది ఆమాలను గొనిపోయి అద్భుత జన్మ చరిత్రగల పై బాలుని కంఠమున నై చెననియు నతఁడే రాజ య్యేననియుఁ బరంపరగ నుడువఁబడుచున్నది, . ఈ పుక్కిటి పురాణకథ యొక్క యుద్దేశముమాత్రము స్పష్టము. కదంబులను వారు బయటినుండి వచ్చినవారుగాక ఆసీమయందె పుట్టినవా రని సూచించుట కిది కల్పింపఁబడి యుండనోపునని రైసు అభిప్రాయపడు చున్నాఁడు. కదంబ యను పేరువచ్చుట కొక వేళ ఈ వంశము వారుదమ కు దేవతయగు మాధు కేశ్వరునికిఁ బ్రియమైన పుష్పమునీను

ఈవృక్షమును దమకు కులనామముగఁ జేకొనికి గాఁబోలు.. నీరు బ్రాహణులు.

కదంబులలో మొదటివాఁడగు నీ పైఁ జెప్పిన బాలుని పేరు జయంతుఁడనియును త్రిలోచన , కదంబుఁ డనియును, త్రినేత్ర కదంబుఁడనియును గానవచ్చుచున్నది. ఇతని వంశపురాజులు క్రీ. శ. రెండవ శతాబ్దము మొదలు ఆఱన శతాబ్దము వఱకును స్వతంత్రులయి రాజ్య మేలినట్లును అనే కాశ్వమేధము లొనర్చి నట్లును గానవచ్చుచున్నది. వీరికిని నాగులకును బద్ధ నైరముండె డిది. పల్లవులును వీరికి శత్రువు లే. కావున కదదలంబులకును నాగులకును యుద్ధములు హెురాహోరిగ జరుగుచుండెను. కదంబులు పల్లవులచే నోడింపఁబడి తమబలమును గోలుపోయి యుండిరి. కాని మయూరశర్మయను కదంబుఁడు మఱలకదంబ వంశమునకు సంపూర్ణ స్వాతంత్ర్యమును సంపాదించి తనశక్తి సామర్థ్యముల వలన మహా ప్రసిద్ధి వడ సెను. పోయియుండిన వైభవమును మరల్చినవాఁ డగుటవలన వాడుకలోనుండు కొన్ని కథల ననుసరించి ఇతఁడే కదంబవంశ స్థాపకుఁడుగ వర్ణింప బడు చున్నాఁడు. నాగుల ప్రతాపమును వర్ణించుటకుఁ గాని వారి చరిత్రను వ్రాయుటకుఁగాని యిది యదను కాదు. వారి పేరుఁ జెప్పిన కాశ్మీరముగూడ యదరుచుండె ననిన * [7]వారెంతటి శత్రువు లనునదియు 'విశదము కాఁగలదు. వారినికదంబులలో ...........................................................................

  • .

నొక్కఁడగు' కృష్ణవర్మ జయించినట్లు అతనివంశజుడగు దేవవరుని శాసనమువలనఁ దేలుచున్నది. . ఈతనికి తరువాత నాగులు కదంబులకు సామంతులయి ప్రనర్తించిరి. కదంబవంశపు స్థానమును చాళుక్యు లాక్రమించుకొనుట తో నాగులువారికి సామంతులయిరి (కీ | శ || 556). విజయనగర సామ్రాజ్యము ప్రారంభమగు వఱకును కదంబులు సంపూర్ణముగ నశింప లేదు. చాళుక్యులకు సామంతులును ప్రతినిధులును నై అప్పుడప్పుడు మఱలమఱల ప్రాముఖ్యత గాంచుచుండిరి. ఈ వంశపు శాఖ లలో నొక్కటి. 'గోవా' ను రాజధాని చేసికొనిరాజ్య మేలు చుండెను. కాని విజయనగర : విజృంభణముతో నెల్లరును పేరైన లేక నశించిపోయిరి.

మహాబలులు.

రమారమి కదంబులు మైసూరునందు వాయవ్య మూలనఁ గానవచ్చు కాలముననె మహాబలులు తూర్పు దిశయందు గాన నగు చున్నారు. వీ రాంధ్ర దేశమునకు పశ్చిమ దిగ్భాగ మున -12,000 గ్రామముల పై యధి కారము వహించి ఏడునర లక్షల భూమిని ఏలిరని వీరి శాసనములవలనఁ దెలియవచ్చు. చున్నది. వీరి ముఖ్యమండలము ముళ బాగులు. వీరు బలి1[8] చక్ర వర్తి బాణాసురుల సంతతి వారని చెప్పుకొను చున్నారు.

1


ఆకథల నెల్ల నిట వివరింపఁబని లేదు. ఈ నంశ పురాజులకు బాణరసు లనియు పేరుగలదు. వీరు పదియవ శతాబ్దమునంతము వఱకును స్వాతంత్ర్యమున రాజ్య భారము వహించి తరువాత పల్ల వలకు లోఁబడి పోయినట్లు శాసనముల వలనఁ దేలుచున్నది. 'పదమూఁడవ శతాబ్దమునను పదు నేనవ శతాబ్దమునను వీరు మరల ప్రఖ్యాతికి వచ్చుచున్నారు. ఉత్తర ఆర్కాటు జిల్లాయం దును తిరున ల్వేలియందును అక్కాలమున వీరి శక్తి వెలింగి నట్లు కానవచ్చుచున్నది. కావున వీరు పల్లవుల చే నోడింపఁ 'బడిన తరువాత వీరిలోని సాహసికులు గొందబు దూర దేశము లకుఁ బోయి పరిశ్రమ చేసి మరలఁ గీర్తి సంపాదించిరని నిర్ణ యింపవలసియున్నది.

పల్లవులు.

మహాబలులతోఁ గూడ తూర్పుమైసూరు నందు రాజ్య భారము వహించి తరువాత మిక్కిలి ప్రఖ్యాతి నడసిన వారు 'పల్లవులు. వీరు భారతీయ జన్మమును బురస్కరింపఁ జూచు కొనిరిగాని చారిత్రికవిషయములను బట్టి వీరు పర దేశీయులనుట మనకిప్పుడు విశదమయి యున్నది. వీరు మొదట పారసీకము నుండి హిందూస్థానమును జొచ్చిన యొక తెగ వారు. క్రమక్రమ ముగ దక్షిణహిందూస్థానమును జొచ్చి వీరు మొదట ఆంధ్ర దేశమున స్థాన మేర్పఱచుకొనఁ జూచిరి. కాని గోతమపుత్రుఁ డను ఆంధ్ర రాజు వీరి నోడించెను. కావున వీరింకను దక్షిణ

దేశమునకుఁ దరలవలసినవారై తుట్టతుదకు రమారమి క్రీస్తు నకు తగువాత మూఁడవశతాబ్దమున కాంచీపురమునకు వచ్చి చేరి యచ్చట రాజ్య మేల మొదలిడి?. పారసీకమునుండి కాంచీ పురమునకు వచ్చునప్పటికి బహుకాలము పట్టియుండుననుట వేరుగ వ్రాయనలసిన పని లేదు. మొదట నీపల్లవులమత మే మయినదియు మన మెఱుగము. మనకుఁ దెలిసినంతనజకు వీరు కాల దేశముల ననుసరించి మతమును మార్చుకొనుచు శైవులును వైష్ణవులును బౌద్ధులును జైనులు నైనట్టులు వీరి చరిత్రము నలనఁ గన్పట్టు చున్నది. శాతవాహనుల ప్రభ తగ్గిపోవుటతో పల్లవులు వారి 'రాజ్యములో తెలుఁగు దేశ ముగనుండిన భాగము నాక్రమించుకొనిరి. నాలుగవ శతాబ్దమున కంచి నేలిన విష్ణు గోపుని కాలమునకు వీరు దక్ష్మిణహిందూస్థానమున బలవంతు లయి యుండిరని చెప్పవచ్చును. అప్పటినుండియే వీరికిని కదం బులకును వీరికిని చాళుక్యులకును యుద్ధములు విశేషము జరుగ నారంభించెను. ఇందు పల్లవులకును చాళుక్యులకును జరిగిన యుద్ధము లే అత్యుగ్రములని తోఁచుచున్నది. 640 వ సంవత్సరమున హియోను స్యాంగను చీనాప్రవాసికుఁడు కాంచీ పురమును దర్శింపవచ్చెను. అతని వ్రాతల ననుసరించి ఆపుర మయిదుమయిళ్ల చుట్టు కొలత కలదయి యుండెను. అచ్చట భూభాగము సారవంతమయి పేరు పెట్టఁబడి మంచి ఫల ముల నీనుచుండెను. ఉష్ణము మాత్రమధికముగ నుండెడిది.

జనులు ధైర్యవంతులుగ నుండిరి. వారు సూనృతపరులై నిష్కపటులుగ నుండి విద్యలయం దాసక్తిగల వారుగనుం డిరి. 10,000, బౌద్ధమతాచార్యులును, : 80 బ్రాహణ దేవా లయములును అనేకులు జైన నిర్గంథులును నుండిరి. ఇట్టి రాజధానిగల పల్లవులను 733 లో ' చాళుక్యులలోని రెండవ విక్రమార్కుడు మహాయుద్ధమున నోడిం చెను. నాఁటినుండి పల్లవుల బలము విచ్ఛిన్న మయ్యెను. అట్లుండియు వీరు 'నోలం బు'లను పేరుతో మైసూరు నందు పదియవశ తాబ్దము చివర దను కను రాజ్యభారము సహించి అప్పుడు దక్షిణ హిందూస్థాన ములోని పూర్వభాగము నంతయును ఆవరింపఁ జొచ్చియుండిన చోళులకుఁ లోఁబడి పోయిరి.

పల్లవులును వారి శాఖయగు నీనోలంబులును చాళుక్యు లకును చోళులకును సామంతులుగఁ. దరువాతి కాలమునఁ గానవచ్చచున్నారు.

గంగులు.

కదంబుల తోను పల్లవులతోను రమారమి సమకాలికులుగ మధ్యమైసూరును దక్షిణమైసూరును ఏలుచుండిన వారు గంగులు. వీరు త్తర దేశమున గంగాతీరమునందుండి వచ్చిన జాతి వారనుట కేమియు సందేహము లేదు. ఈజాతివారే గంగా ముఖమునఁ గొంత ప్రదేశమును చంద్రగుప్తుని సామంతులుగ నేలుచుండిరి. ఈశాఖ వారే కళింగమునుగూడఁ గొంత కాలమేలి రనుటకు

సం నిదర్శనము లున్నవి. 'మైసూరునకు వచ్చిన గంగులు పదునొకం డన శతాబ్దము ప్రారంభము వఱకును అట రాజ్య భారమును నిర్వ హించి రాజేంద్రచోళునిచే 1004 లో నోడింపఁబడిన తరువాత నారలలో నొక కొందరు మఱల కళింగము నంకకు నడచి గంజాము విశాఖపట్టణము జిల్లాలలో స్వతంత్ర రాజ్యముల పాదించుకొనిరి. మైసూరునకు నచ్చిన గంగులు “ దాడిగ మాధ వు'లను రాచకొమరులును వారి పరిజనము నని చెప్పవచ్చును. సింహనందియను జై నుని సాయమువలన వీరు క్రీ! శ|| రెండవ శతాబ్దమునకు వలాల (కోలారు)ను నందగిరి (నందిదుర్గమును) సాధించి మైసూరునందు రాజ్యమును స్థాపించుకొని ఆ రాజ్య మునకు గంగవాడి యని పేరు గలిగెను. ఈగంగులు మొదటి నుండియు జైనులగుటనలన దక్ష్మిణ హిందూస్థానములోఁ "బేరుఁ గనిన జై నవంశములలో వీరిదే ప్రఖ్యాతము. ఈ వంశములోని రాజు లెల్ల రకును “కొంగుని వర్మ' యనునది బిరుదునామము. వీరిలో మూఁడవవాఁడు రాజధానిని కావేరీ తీరముననుండు తల కారునకు. మార్చెను. ఏడవ వాఁడగు దుర్వినీతుఁడు పల్ల వుల నోడించి వారి భూములఁ గొన్నిటి నాక్రమించినదే గాక పూర్వదక్షిణ భాగములఁ దన రాజ్యమును వ్యాపింపఁ జేసెను. ఎనిమిదవ శతాబ్ద మధ్యమునకు గంగుల రాజ్యము మహా నైభవమంది శ్రీరాజ్యమని పిలువబడుచుండెను. శ్రీపురుషుఁడను వాడఁప్పుడు రాజు.అతఁడు రాజధానిని లు


మాన్యపురము (మన్నెయను నెలమంగళము తాలూకాలోని గ్రామము) నకు మార్చెను. ఆతఁడు గజశాస్త్రమను గ్రంథ మును గూడ వ్రాసెనఁట. ఈతని కొడుకు శివమారుఁడు రాజ్యమునకు వచ్చిన తరువాత నీగ్రంథము నే విపులము చేసి గజాష్ట కమను మఱియొక గ్రంథము వ్రాసెనఁట. ఇతని కాలమున రాష్ట్రకూటులు ప్రబలులై యీతని నోడించి చెర పెట్టిరి. రాష్ట్రకూట ప్రభువు మారుటతోనే యితఁడు విడువఁబడెను గాని మరల నీతఁడు రాష్ట్రకూట చాళుక్య హైహయులనందఱి నెదుర్చుటచే రెండవమారు పట్టుబడినట్లు గానవచ్చుచున్నది. కాని రాష్ట్రకూటులకు మిత్రులు కావలసి వచ్చిన దునను శివ మారుఁడు స్నేహము చేసికొని నందునను గంగుల సంతతికి మఱల స్వాతంత్ర్యము గలిగెను. ఈ ప్రకారము నెయ్యురయిన రాష్ట్రకూటగంగులకును తూర్పు చాళుక్యులకును 108 యుద్ధములు జరిగెను. ఈమధ్య కాలమున గంగులు మహాబల వంతులయిరిగాని తుదకు 1004 న మీ చోళులచే లోఁబఱ. చుకొనఁబడి యిదివఱకు చెప్పినపగిది చాళుక్యులను హొయి సణులను ఆశ్రయించిరి.

చాళుక్యులు

.

వీరిజన్మ భూమి యేదియైనదియుఁ జక్కఁగ విశడపడ లేదు. వీరయోధ్యనుండి వచ్చినట్లును చంద్రవంశము వారయి హరితి సంతతి వారయినట్లును పుక్కిటి పురాణములు గలవు.

కాని . అవి యవిశ్వసనీయములు. పేరును బట్టి చూడ నిది " శెల్యూకియా ' యను నామము మారుటవలన వచ్చినట్లు దోఁచుచున్న ది గావున వీరు చంద్రగుప్తచక్రవర్తి మామయగు తెల్యూకసు తెగకుఁ జేరిన వారయి యుండవచ్చుననియును అట్ల యినచో ఆ తెగవారికిని పల్లవుల పూర్వికులని మనమనుకొని, యెడి పారసీక దేశపు తెగవారికిని భారతవర్షమున కావల నే వైరము లుండుటంబట్టి దక్ష్మిణహిందూస్థానమున నీ పల్లవులకును చాళుక్యులకును జరిగిన ఘోర యుద్ధములు అనాదిశత్రుత్వము వలన నైనవని యూహింపవచ్చననియు రైసు వ్రాయుచు న్నాఁడు. కాని దీని నెంతవఱకు మనమాదరింపవచ్చ ననుట ముందు కాలమున తీర్మానము కావలసినదే. వీరి జన్మభూమి ' యెచ్చట నున్న నేమి, వీరు మాత్రము దక్షిణ హిందూస్థాన చరిత్రమునందు నాలుగైదు శతాబ్దముల కాలము ప్రాముఖ్య లలో నొక్కరుగఁ గన్పించుచున్నారు. వీటిలో మొదటివాఁడు జయసింహుఁడు. ఇతఁడు రాష్ట్రకూటులతో యుద్ధము చేసి వారిని జయిం చెను. "కాని పల్లవులతోఁ బోరుటలో మృతి చెందెను. ఇతని భార్య గర్భవతి పారిపోయి విష్ణు సోనుయాజియను బ్రాహణుని శరణుఁ జొచ్చెను. ఆయమ కుమారుఁ డగు మొదటి పులి కేశి పల్లవులను జయించి బాదామి(వాతాపి)రాజ ధాని చేసికొ నెను. అతని పుత్రుఁడు కీర్తివర్మ మౌర్యులను కదం బులను వశవర్తులను జేసి కొనెను. అతని యాత్మజుడు

మంగ ళేశుఁడు కళచుర్యులను జయించెను. ఇతని కొడుకగు 'రెండనపులి కేశి కాలమున నే చాళుక్య సామ్రాజ్యము మిక్కిలి విరివినందెను. ఇతఁడు రాజ్య మేలు నప్పుడే వేంగిపురము చాళుక్యులకు ప్రాప్తమయినది. ఆపట్టణము లభించుటతో చాళు క్యవంశము రెండు పాయలయి, పోయెను. రెండవ పులి కేశి రాజుగ పశ్చిమ చాళుక్యులును కుబ్జవిష్ణువర్ధనుఁడు రాజుగఁదూ ర్పు చాళుక్యులును పేరుగాంచఁ దొడంగి. తూర్పు చాళుక్యు లు వేంగియు రాజమహేంద్రవరమును ముఖ్య పట్టణములుగఁ బదునొకండవ శతాబ్దము నఱకును 'రాజ్య మేలి చోళులకు లోబడి పోయిరి. పశ్చిమ చాళుక్యులు మనకథకు నలసిన వారు గాన వారి చరిత్రనిట కొంచెము విరివిగ వ్రాయనలసి యున్నది,

రెండవపులి కేశి కన్యాకుబ్జమునకు రాజగు హర్ష వర్ధను నోడించి పర మేశ్వర బిరుదమును సంపాదిం చెను. అతనికిఁ దరు "వాత విక్రమార్కు డను రాజు 655 లో సింహాసనమునకు వచ్చు వఱకును పల్లవులు చాళుక్యులను బాధలు పెట్టు చుండిరని యూ హింషనలసి యున్నది. ఈవిక్రమార్కుడు మహశౌర్య సంప న్ను డు. రణరశికుఁడని ఇతనికి బిరుదు. ఇతఁడు పాండ్య, చోళ, కేరళ కలభ్రులను జయించి నను పల్ల వ రాజు నోడించ కంచి నాక్రమించుకొని నట్లును దెలియుచున్నది. ఇతని కుమారుఁ డును మనుమఁడును మునిమను మఁడును గూడ మిక్కిలి వీరత్వ మున రాజ్య మేలి నట్లు, గన్పించుచున్నది. కాని ఇతనిసంతతి

వారు పల్లవులతోఁ బోరాటము పెట్టుకొని దూర దేశమగు కాంచీపురము వంక నే దృష్టు లేకాగ్రచిత్తులయి సారించుచు వచ్చినందున వీరికిఁ బూర్వవిరోధులయి వీరివలన నోడింపఁబడి వీరికి లోబడి వీరిపొరుగున నివసించుచుండిన రాష్ట్రకూటులు సమయము వేచియుండి వీరిని కబళించి వేసిరి. కావున ఎనిమిదవ శతాబ్దము మధ్యమునకు రాష్ట్రకూటులు బలవంతులయి రెండు శతాబ్దముల కాలము చాళుక్యుల పేరును బై కి రాకుండఁ జేసిరి.

రాష్ట్రకూటులు.

ఇట్లు చాళుక్యులను అణగదొక్కి, శాసనములను బట్టి చూడ, మైసూరునందు మిక్కిలి బలవంతులయి రాజ్య మేలిన యీ రాష్ట్రకూటు లెవరు? వీరి చరిత్రయెక్టది? అనెడియంశములు మన మిట విచారింప వలసియున్నది. వీటికి రాజపుత్ర రాఠర్ లతో సంబంధముండిన నుండవచ్చననియు రెడ్లు అనువారు వీరి సంతతివారుగ నెన్నఁబడు చున్నారనియు చరిత్రకారులు వ్రాయుచున్నారు. వీరుదక్ష్మిణ హిందూస్థానమున బహుకాల ముగనుండి యుండవచ్చును. కాని వీరి చరిత్రయందు, మనకుఁ దెలిసిన వరకు, మొదటి రాజు చాళుక్యులచే నోడింప బడిన కృష్ణుఁడు. ఈ వంశములోని మఱియొక కృష్ణుఁడు మొదటి కృష్ణుఁ డను వాఁడు తన మేనల్లునితోఁ జేరి చాళుక్యులను చెండాడి 754వ సంవత్సర ప్రాంతమున రాష్ట్రకూట రాజ్యమును స్థాపిం ,

చెను. ఈ రాష్ట్రకూటుల కే రాట్టులనియు వీరి రాజ్యమునకే రాట్ట వాడి యనియుఁ బేళ్లుగలవు. వీరి రాజధాని మొదట నాసిక జిల్లాలోని మయూర ఖండముగ నుండెడిది గాని తొమ్మిదవ శతాబ్దమున నయ్యది నైజాము ఇలాకాలోని మాన్య ఖేటము (ప్రస్తుతపు మాల్ ఫేడు) నకు మారువఁ బడెను.

ఎనిమిదన శతాబ్దమునంతమున ధృవుఁడు లేక ధారవర్షుఁడు అనంబడు ఈవంశ పురాజు పల్లవరాజునోడించి యతఁడుదనకుఁ గప్ప ముగట్టు నల్లొనర్చెను. గంగుల రాజును గూడ చెఱపట్టెను. కొని యీతనికిఁ దరువాతి వాడగు గోవిందుడు గంగరాజు నకు స్వాతంత్ర్య మిచ్చుట ఇదివటి కే వ్రాయఁబడియెను. తొమ్మిదవ శతాబ్దములో రాష్ట్రకూట రాజ్య మేలిన అమోఘ వర్షుఁడను నృపతుంగ మహీపాలుఁడు బహుకాలము రాజ్యము చేసి కన్నడ భాషయం దభిరుచికలవాఁడై గ్రంథములు వ్రాసి కర్నాటక భాషయందును కర్నాటక జనులయందును దనకు గల యాదరణమును జూపి పరలోకమున కేగెను. అతనికి దరువాతి వాఁడగు అకాలవర్షుఁడు తూర్పు చాళుక్యులతో ఎడ లేని విగ్రహము జరిపెను. కాని వీరు పదియవ శతాబ్దమున చోళులకులోఁబడి పోవుటవలన చోళులకును రాష్ట్రకూటుల కును విగ్రహము ప్రారంభమయ్యెను. అప్పటికి రాష్ట్రకూటు లకు గంగులసాయ ముండినందున చోళులోడింపఁబడి వారి రాజు చంపఁబడెను. తరువాత రాష్ట్రకూటులకును గంగులకును

విభేదములు వచ్చినట్లున్నది. కావున రాష్ట్రకూటుల శక్తితగ్గుచు వచ్చినందున వారు పశ్చిమ చాళుక్యులకు 973 వ సంవత్సర మున లోఁ బడిపోయిరి.

పశ్చిమచాళుక్యులు.

మఱల చాళుక్య సామ్రాజ్యము ప్రారంభ మయ్యెను. ఆహనమల్ల బిరుదాంకితుఁడయిన తైలపుఁడు పశ్చిమచాళుక్య సామ్రాజ్య పునఃస్థాపకుఁడు. ఇతఁడు కక్కలుఁడను రాష్ట్రకూ టుని జయించి యాతని బిడ్డను పెండ్లాడి రెండువందల సంవత్స రముల కాలము దినదిన ప్రవృద్ధంగాంచి మించునట్లు దైవము చే నియోగింపఁబడిన సామ్రాజ్యమును సంపాదించి పెట్టి స్థిరకీర్తినందెను. ప్రథమచాళుక్య వంశమువారు పల్లవులతో వలె నీతని సంతతివారు చోళులతోఁ బోరాడవలసి వచ్చెను. క్రమ క్రమముగ పల్లవులను జయించి కంచిని గొని ఇతర రాష్ట్రముల నాక్రమించుకొనఁ జొచ్చియుండిన చోళులు గొంత కాలము దూర్పు చాళుక్యమండల మరాజక మయినందున నదియదను చేసికొని పశ్చిమ చాళుక్యుల లోఁబఱచుకొనఁ బ్రయత్నించిరి. ఈ పోరాటము రెండు పక్షముల వారికిని జయాపజయములు నిశ్చయములుగాక బహుకాలము జరిగెను. ఇరువారుల వారి సీమలకును యుద్ధములవలన మహా నష్టములు సంభవించెను. విగ్రహమధ్య కాలమున చాళుక్య రాజధాని కల్యాణునకు మారువఁబడెను.

1076 వ సంవత్సరమున ఆఱవ విక్రమాదిత్యుఁడు సింహాసనమునకు. వచ్చెను. ఇతఁడు మహాపరాక్రమశాలి. చాళుక్య విక్రమార్కశక మితని వలనఁ బుట్టిన దే. బిల ణుని విక్రమాంక దేవచరితము[9]నకు కథానాయకుఁ డితఁడే. ఈతని విజయముల వలన పశ్చిమ చాళుక్య రాజ్యము మహా న్నత్య మందెను. ఈతఁడు రాజకీయ శాంతి కొఱకు ఇతరవం శముల వారితో విరివిగ సంబంధ బాంధన్యములు చేసికొని. నట్లు గాననచ్చుచున్నది. విజ్ఞానేశ్వరుఁడితని కాలము నుదె యుండి మన హిందూ ధర్మశాస్త్రమునకు ముఖ్యా ధారము లలో నొక్కటగు మితాక్ష రన్యాయమును వ్రాసెను. ఇతఁడు “భువిపై కల్యాణముపోలు నగరము ఇదివఱకుండినదిగాదు. ఇప్పుడు లేదు. ఇక నెప్పటికిని ఉడఁజాలదు. విక్రమార్కునినంటి నృపాలుని గుణించి వినినదిగాని అట్టివానిని గనినది గాని లేదు” అని వ్రాసియున్నాము. ఈవిక్రమార్కుని రాజ్యాంతమున నే ముందుచాళుక్యశక్తి నిరూలకులుగా నున్న "హోయిసణులుగను పట్టిరిగాని ఇతని దండనాయకునిచే వారుపరాజితులయిరి. అయిన కాల ప్రవాహము నిలుచునది గాదు. విక్రమార్కుని యనంతరము చాళుక్య ప్రతాపము చల్లఁబడఁ జొచ్చెను, 1157 వ సంవత్సర మున చాళుక్య సైన్యాధిపతిగను-డి రానురాను బలవంతుఁడయి ........................................................................................

1

యుండిన కళ చుర్యవంశపు వాఁడగు బిజ్జలుఁడు దన ప్రభువు పై బడి యతని రాజ్యము నాక్రమించుకొనెను. ఇంతటితో చాళు క్యశక్తి నామావ శేషమై పోయెను.

కళచుర్యులు.

కళచుర్యు లిరువదియారు సంవత్సరములకంటె నె క్కుడు కాలము రాజ్యభారమును సహించ లేదు. లింగాయత మతము బిజ్జలుని బావచరంది యగు బసవని చే స్థాపనముందు టయు జైనమతమునకును దానికిని వివాదములు పుట్టుటయు మున్నగు విషయములన్నియు నీకళచుర్యుల కాలమున నే తట స్థించుట వలన వీరి వంశమునకుఁ గొంచెము ప్రాముఖ్యత గలిగి నది. వీరిని 1183న సంవత్సరమున హొయిసణులు మ్రింగి వేసిరి.

హాయిసణులు.

కదంబుల వంశమువలెనె హోయిసణవంశమును మైసూరు దేశము జన స్థానముగఁ గలది. హాయిసణులు తాముయాదవుల మని చెప్పుకొనియెదరు. దాని వలన నె వీరు చంద్రవంశము వార యినట్లు ప్రతీతి. వీరి మూలపురుషుని గుఱించి యొక. కథగలదు. ప్రస్తుతము ముద్దెరి తాలూకాలో పడమటి కనుమల ప్రాంత మున నంగడియను గ్రామముండు స్థానమున శశకపురముండెడిది. సణుఁడను వాఁడు ఆ గ్రామ సమీపమున నటవియం దాలయమున దమ కుల దేవతయగు వసంతికను ఒక నాఁడు పూజింపుచుండ నతిరౌద్రాకారము వహించిన యొక పులియతని వంకకు

దాఁటులు వైచుచువచ్చెనఁట. దానింజూచిఅచ్చటి యాచార్యుల డీసణునకు “హొయి! సణ' యనుచు నొక సలాకి నంది చ్చెనఁట. ఇతఁడు దానితో నేసి వ్యాఘ్రమును జంపుటవలన నీవంశమువా రికి హోయిసణులని పేరు వచ్చెనందురు. వీరి పతాకము శార్దూల పతాకమగుటకుఁగూడ నిదియె కారణముగ నెన్నఁ బడుచున్నది. ఈవంశ ఫుఁ బ్రథమసృపాలురు జైనమతస్థులు. హోయిస ణులు ప్రారంభదశయందు చాళుక్యులకు సొమంతులుగ నుండిరి. వీరికి మొదటి ముఖ్యపట్టణము ద్వార సముద్రము (ఇప్పటి బేలూరు తాలూకాలోని హళేబీడు). ఈవంశమునకు మూలవురుషుఁడగు హొయిసణుని గుజించి మనకంత విశేషముగఁ దెలియదు. కాని యాతని కుమారుఁడగు వినయాదిత్యుఁడు మలపులను అనఁగా కొండ దొరలను జయించి కొంత రాజ్యమును ఆక్రమించి విస్తీర్ణ మగు రాజ్యము నేలినట్లు దెలియుచున్నది. అతఁడు చెఱు వులు త్రవ్వించుట యందును దేవాలయములు కట్టించుట యందును మిక్కిలి శ్రద్ధఁ జేసెనని వ్రాయఁబడియున్నది. ఆలయ ముల గోడలకయి ఇటుక కాల్చుటకుగాను మట్టి త్రవ్విన ప్రదేశ ములు తటాకములుగ నేర్పడెననియు రాళ్లకయి భేదింపఁబడిన పర్వతములు నేలతో సమమయ్యెననియు వర్ణింపఁబడి యుండుట వలన నీతఁ డెంత యాస క్తితోఁ బనిచేసినదియు మన మూహింపఁ గల్గుదుము. ఇతఁడు కట్టించిన హళేబీడులోని హోయిసణేశ్వర దేవాలయము నేఁటికిని ఈతని కాలమందలి శిల్పకళా చాతుర్య

మును ప్రకటించుచున్నది. ఇతఁడు క్రీ|| శ|| 1047 మొదలు 1100 వఱకును ఏబదిమూఁడు సంవత్సరములు రాజ్య మేలుటవలన నితని కుమారుఁడు బహుకాలము యువరాజు పట్టమును ధరించి యితనికంటె ముందు పరలోకప్రాప్తి జెందెను. అయిన నీ యువరాజు చాళుక్యులకు కుడిభు జముగనుండి చోళమాళవ కళింగులను ఓడించి అరిభయం కరుఁడయి ప్రవర్తించినట్లు నుడువ బడియున్నది. కావున వీరికిని చాళుక్యులకును అన్యోన్య మైత్రియుండుట గాక వీరు గొంత రాజ్యము సంపాదించిన తరువాతఁ గూడ చాళుక్యులకు విడువరాని సహాయులుగ నుండిరని తేలుచున్నది.

వినయాదిత్యుని మరణానంతరము అతని ముగ్గురి మను మలలో నిద్దజుబహుస్వల్ప కాలము రాజ్యభారము వహించిరి. వారికిఁదరువాత ' నందు రెండవ వాఁడును దక్కిన వారు'పోఁగా బ్రతికియున్న వాఁడును నైన బిట్ట దేవుఁడు ప్రభుత్వమునకు వచ్చె ను. ఇతఁడును చాళుక్య నృపతుల సైన్యములలోఁ బేరునందిన వాడే. ప్రసిద్ధినొందిన చాళుక్య విక్రమాదిత్యుఁ డీతనిని గుఱించి “హోయిసణుఁ డొక్కఁడె అజేయుఁడగు రాకొమరుఁడు గాఁ గలఁడు' అని తీర్మానముగఁ బల్కియుండెనఁట! ఈ వాక్కునకను గుణముగ బిట్ట దేవుఁడు దిగ్విజయముఁ జేసి తన ప్రభుత్వమును తల కాను, కొంగు, నంగలి, గంగదొడి, నొలంబవాడి, మాసవాడి హుళి గేరి, హళసిగె, వనవాసి, హనుంగల్ అనునీ మండలము

లపై నెగడఁ జేసెను. 'ప్రస్తుతపు నామముల ననుసరించి ఈ రాజ్యము మైసూరుసీమయు, సేలము, కోయంబుత్తూరు, బళ్లారి, ధార్వాడ జిల్లాలలో నెక్కుడు భాగమును అగు చున్నది. ఇతఁడు సంపూర్ణ స్వాతంత్యమును స్థాపించు కొనెననియే 'చెప్పవచ్చును గాని ఈతని రాజ్యమునందు త్తర భాగమున దొరకిన , శాసనములను బట్టి 1172 వ సంవత్స రము దనుకను హోయిసణులు చాళుక్యులను అధిరాజులుగ నెప్పుకొనుచుండినట్లు విశదపడుచున్నది.

1117న సంవత్సరముబిట్ట దేవుని రాజ్య కాలమున మిక్కిలి ముఖ్యమయినది, అసంవత్సరమున నతఁడు శైవులగు చోళులచే దరుమబడి హోయిసణ రాజ్యముఁ జొచ్చిన శ్రీ రానూనుజా చార్యుల ప్రోత్సాహమువలన వైష్ణవుఁడయి విష్ణువర్ధనుఁడను నామమును ధరించెను. ఇతని కుమారుడు "రాజ్యము సేయునపుడు దేశమంతయును శాంతిమై యు౦డెను. ఆతనిపుత్రుఁడు నరసిం హుఁడు సింహాసనము నధిష్టించినతోడనె యాదవుల పై కరిగి వా రిని జయించి తుంగ భద్రాతీరమందలి దుర్గములను సాధించి పం డ్రెండు సంవత్సరముల కాలము చోళులకు సాధ్యము కాని ఉచ్చం , గియను పాండ్య రాజధానిని లోబఱచుకొని తన రాజ్యమును కృష్ణాతీరమువఱకును వ్యాపింపఁ జేసి వీరబళ్లాళుఁడను పేరువడ సెను. ఈతనివలననే హోయిసణులకు బళ్లాళులనియు నామము కలిగినది. ఇతని కొడుకగు సోమేశ్వరుఁడును యాదవులనోడించె

నని యున్న విగాని వీరబళ్లాళుఁడు యాదవులనుండి కొనిన ప్రదే శము మఱల వారికిఁ జెందినట్లు వారి సేనానుల వాక్కులవలన దెలియుచున్నది. అయిన సోమేశ్వరుఁడు దక్షిణమున స్వతంత్రుఁ డు చోళ రాజ్యములోని విక్రమపురమునందు నినసించు చుండెను.

హొయిసణులు పాండ్య రాజ్య విధ్వంసకులుగను చోళ రాజ్యసహాయులుగను వర్ణించు కొనుటచే, చోళులకును వీరికినీ మిక్కిలి మక్కువ యుండినట్లూహింపవలసి యున్నది. ఈసోమే శ్వరున కిద్ఱు కుమారులు. ఇతని మరణముతో వారిరువురును రాజ్యమును పంచుకొనిరి. మూఁడవనరసింహుఁడు ద్వార సముద్ర మునను 'రామనాథుఁడు దక్షిణమున అరవ దేశమునను పరిపాలిం చుచుండిరి. వీరి కాలము శాంతిమయియే జరిగిపోయెను. నరసిం హుని కుమారుఁడు మూఁడవ బళ్లాళుఁడు రాజ్యమునకు వచ్చిన తరువాత రెండుగా జీలిపోయిన హోయిసణరాజ్యము మఱల నెక్కటి యయ్యెను. కాని యతనికిఁ బ్రబలవిరోధులు గనుపిం చిరి. 1810 వ సంవత్సరమున అల్లాఉద్దీన్ సేనాని మాలిక్ కాఫుర్ దండెత్తివచ్చి ద్వార సముద్రమును ముట్టడించి రాజును పట్టుకొని పట్టణము కొల్లగొట్టి మోయ లేనంత సువర్ణ మును 'బట్టించుకొని వెడలి పోయెను. నరసింహుఁడు రాజధానిని మఱలఁ గట్టనారంభించెనుగాని మఱియొక మహమ్మదీయ సేనాని వలన నది 1326లో పూర్తిగ నశింపు చేయఁబడెను. ఇంతటితో

ప్రస్తుతో హోయిసణ బలమడం గెను. 1336న సంవత్సరమున విజయనగర సామ్రాజ్యము ప్రారంభమగుటతో హోయిసణ నామమం దులో మునిగిపోయెను.

విజయనగర సామ్రాజ్యము.

దక్ష్మిణ హిందూస్థానమున స్థాపితమయిన ప్రసిద్ధ సామ్రా జ్యములలో విజయనగర సామ్రాజ్యము కడపటి దనుట మా చదువరు లనేకులకుఁ దెలిసిన విషయమే. ఆ సామ్రాజ్యమును గుఱించి విపులములగు గ్రంథములు వాయఁబడి యున్న వి. కావున మాచదువరులకీ విషయము క్రొత్తదిగనుండఁ జాలదు. ఇట వీనిం గూర్చి విరివిగ వ్రాయుటయుఁ బొసఁగదు. ప్రయోగమునకు వలసిన వఱకు సంక్షేపముగ నిచ్చట వ్రాసె దము. విజయనగర సామ్రాజ్య స్థాపకులుగ నెన్నఁబడవలసిన వారు మువ్వురు. చంద్రవంశజులై యాదవసంతతికిఁ జేరిన హక్కఁడు బుక్కఁడు నను ఇరువురన్న దమ్ములును శ్రీశంకరా చార్యులమఠమునకథ్యక్షుఁడుగ నక్కాలముననుండినవిద్యారణ్య బిరుదాంకితుఁడగు మాధవాచార్యులును. హక్క బుక్కలిరువు రునుసంగమునికుమారులు. హక్కఁడు హరిహర రాయలను పేరునవ్యవహరింపఁ బడుచున్నాఁడు. మహమ్మదుతుగ్లకుయొక్క క్రౌర్యము చేఁబుట్టిన అల్లకల్లోల సమయమున స్వదేశీయు లును బహుశః హాయిసణులకు సామంతులుగ నుండినవారును నయిన వీరిరువురును మాధవాచార్యుల సాయము చే తుంగ భద్రాతీరమునఁ బూర్వము గిష్కింధా నగరముండిన ప్రదేశ మునందు విజయనగరమును గట్టుకొని అదివఱకు మహమ్మదీ యుల వశమయి పోయియుండిన ద్వార సముద్రమును, వరంగ ల్లును సాధించి.. మాధవాచార్యులు సాహాయ్యము చేయుటకు ముఖ్య కారణము జైనుల యొక్కయు జంగము వారి యొక్కయు సంఖ్య యభివృద్ధి యగుచుండుటయు మహమ్మదీయ మహా ప్రవాహము గ్రమక్రమముగఁ దమ్ము నావరించు కొన నుంకించు" చుండుటయు నీరెండు విరోధ వాహినులను నెదుర్చుటకుఁ దమ రేదేని యొక ప్రబల సాధనము సంపాదించు కొనవ లెనను ఆశ' వారికిఁ బుట్టుట యేయనియు విల్సను వ్రాయుచున్నాఁడు. ఇది యూహయేయైనను సరియైనయూహ యనియే అంగీకరింప వచ్చును.

విజయనగర సంస్థానా ధీశ్వరుల కులదై వము విరూపా క్షుఁడు. ఈవిరూపాక్షుని పేరిటనే విజయనగ రాధీశ్వరులు దానధర్మాదుల నెనర్చుచుండిరి. హరిహరుఁడు మొదటి రాజు. బుక్కరాయలు రెండవవాఁడు. వీరు దక్షిణ దేశమున కంత టికిని ప్రభువులైరి. కాని 1347 వ సంవత్సరమున బహమని రాజ్యము సం స్థాపింపఁ బడుట వలన వీరు త్తరమున దిగ్విజయము సలుపుటకు వీలు లేక పోయెను. ఇంతియ కాక బహమని సుల్తా నులకును విజయనగర రాజులకును ఎడ తెగని విగ్రహము ప్రారంభమయి లెక్క లేని యుద్ధములు నడచుచుండెను. మొదటి


సంగముని సంతతిలో నెనమండ్రుగురురాజులు రాజ్యమేలి.. వారిలో రెండవ హరిహర రాయల కుమారుఁడు దేవరాయలు ప్రతాప దేవ రాయలను బిరుదు పేరు నందెను.ఈతని కాల మున విజయనగరమును దర్శింప నే తెంచిన ఇటాలియా దేశస్థుఁ డగు 'నికలో డికాంటి' యను నతఁడును పారసీక దేశీయుఁడగు అబ్దుర్ రజాకును విజయనగర సామ్రాజ్య రాజధాని సంపద్వై భవములను వర్ణించియున్నారు.

సంగమరాజులలో కడపటివారి కాలమునకు బహమని సుల్తానులలో నొక్కఁడగు రెండన మహమ్మ దుషాహ విజయనగర సంస్థానమునం దెక్కుడు భాగము నాక్రమించుకొనఁ జొచ్చెను. అప్పుడతని నెదురుకొని జయిం చిన వాఁడు సాళువ నరసింహుఁడు. ఇతఁడు సంగ రాజుల ప్రతి నిధిగ తెలుఁగునామును పరిపాలించు చుండిన సేనానియగుటం చేసి క్రమక్రమముగ నీతనిశక్తి యభివృద్ధియై యుండెను. ఇతఁడు మహమదీయుల నోడించిన తరువాత నచిర కాలములోనే విజయనగర సింహాసనము నాక్రమించుకొనెను. కాని యీతని సంతతి కై నను ఆసామ్రాజ్యము నిలిచినది కాదు. ఈతని కడముఖ్య సహాయులుగ నుపచరించు చుండిన తుళువ వంశజులగు నీశ్వ రుఁడను నరసింహుఁడును మహాబలను తులయి యుండిరి. ఈతనికిఁ బిదప విజయనగగ సంస్థానమును నరసింహుడు కైవ

సముచేసికొని ఏల మొదలిడెను. ఆతని పుత్రుఁడే లోక


ప్రసిద్ధి గాంచిన శ్రీ కృష్ణ దేవరాయలు. ఈతని కాలమున నుండిన విజయనగర సామ్రాజ్యముతోఁ దులఁ దూగఁ గల్గు సామ్రాజ్యము మఱి యొక్కటి దక్ష్మిణ హిందూ స్థానమున నెప్పుడును స్థాపింపఁబడ లేదు. కృష్ణ దేవరాయలకుఁ దరువాత విజయనగర సామ్రాజ్యము రాను రాను అరాజక మగుచు వచ్చెను. కొంతకాలము గడచిన వెనుక అళియ రామరాజుసంపూర్ణ స్వతం త్రాధికారి యయ్యెను. అతఁడు మహావిక్రమశాలియై దక్షిణహిం దూస్థానము పై కృష్ణ దేవరాయనం బోలియెనిజ శక్తిని వ్యాపింప జేసెను. విడిపోయిన బహమని రాజ్యశాఖలలో విభేదము లు గూడఁ బుట్టించివారిమీఁద నధికారము సంపాదించెను. కాని ఇతఁడు గొంచెము గర్వము గలవాఁడై ప్రవర్తించుటచే మహమ్మదీయ సుల్తానులుమేల్కాంచి ఒక్కటిగఁ జేరి 1565న సంవత్సరమునఁ దల్లి కోటకడ నీతని నెదిర్చి జయించి చంపి వేసిరి. విజయనగరసామ్రాజ్య మంతటితోనంతరించెను. రామరాజు సోదరులు తిరుమల రాజును వెంకటాద్రియును వరుసగ పెనుగొండ యందును.చంద్రగిరి యందును స్థానము లేర్పఱచు కొనిరి.

పాళేగారులు.

ఇట్లు విజయనగర సామ్రాజ్యమును రూపు మాపిన మహమ్మదీయ సుల్తానులు దమలోఁ దమకుంగల ఈర్ష్యలవలన నాసామ్రాజ్య స్థానము నాక్రమించుకొన లేరై డి. విజయనగరా ధీశ్వరులు పూర్ణ శక్తితో పరిపాలించు చుండిన పదునారవ శతాబ్దమున నుత్తర దేశ మంతయును జక్రవ ర్తిగారి వలన నే పరిపాలింపఁ బడుచుండెను. దక్షిణ భాగము, ముఖ్యముగ మైసూ రుసీమ, అనేక ఖండములుగ విభజింపఁబడి అచ్చటి సామంత రా జుల ఆధీనమున కియ్యఁబడి యుండెను. వీరు చక్రనర్తిగారికి కప్పములుగట్టుచు యుద్ధ సమయముల సేనల నమర్చుచుండిరి. వీరందటిపై శ్రీరంగ పట్టణమున చక్రవర్తిగారి ప్రతినిధి యుండె డివాడు. విజయనగర సామ్రాజ్యము తలికోట యుద్ధములో విరియునప్పటికి శ్రీరంగపట్నమున శ్రీరంగరాయలు ప్రతినిధిగా నుండెను. సామ్రాజ్య విచ్ఛిన్న మయిన తరువాతఁ గూడ నీప్ర తినిధికిని పెనుగొండ యందలి చక్రవర్తిగారి కుటుంబమున కును సామంతరాజులుగ నుండిన వారు కొంత కాలము పేరు నకు గౌరవము గనుపజచుచు వచ్చిరి. కాని బలనంతులగు సా మంతులం దఱును నొక్కరొక్క రుగ స్వతంత్రులుగా కొచ్చి రే. ఇట్లు స్వతంత్రులైన వార లే పాళేగాగులని పిలువఁ బడు చున్నారు. ఇప్పటి మైసూరువంశము అట్టి పాళేగారులలో నొ క్కనిమూలమున నేర్పడినది. కావున నిటమైసూరు రాజవంశ చరిత్ర నిక ప్రారంభింతము.

మైసూరు రాజనంశము.

వాడుకననుసరించి మైసూరు రాజవంశమునకు మూల పురుషులు విజయ కృష్ణులను ఇద్దఱు సోదరులు. యదుసంతతి వారగు వీరు ద్వారకనుండి బయలు దేరి దక్షిణమున నెచ్చట నైన రాజ్య మేర్పఱచు కొనవ లెనను ఇచ్ఛగలవారయి ప్రయా ణము చేయుచుండిరి. ప్రస్తుతము మైసూరు నగరముండు ప్రదే శమున కనతి దూరమున హదినాడు అను గ్రామముం డెడిది. వీరిరువురును అచ్చటికి వచ్చునప్పటికా గ్రామపు ప్రభువునకు మెదడు చెడినుదున నతఁడు దేశమువదలి పోయియుండెను అతనికొ కే కుమార్తె గలదు. ఆమెను వివాహమాడ వలెనను దురాశ ప్రక్క గ్రామమగు కారుగహళ్లి ప్రభువునకుఁ బుట్టి యుండెను. అతఁడు హీనజనుఁ డయినందున హదినాడు వారు దమబిడ్డ నతని కియ్యనిష్టము లేని వారయి యుండిరి. అందువలన నతఁడు సమయము వేచియుండెను. హదినాడు ప్రభువు మనోచాంచల్యమున నెట నేనియు నేగుట తోడనె ఆవంశ మువారికి దిక్కు లేనందున కారుగహళ్లి ప్రభువు వారిబిడ్డను బలాత్కారమున సంపాదింప జంకిం చెను. కావున వారు దమ కన్యనతని కియ్యనియ్య కొనిరి.

స్వీక వివాహమునకు సకల సన్నాహములును జరుగుచుం డెను. ఆ గ్రామ సమీపమునకు నచ్చియుండిన ఈ విజయ కృష్ణు లిరువురును విషయము లెల్లయును విని హదినాడువారికి సాహాయ్యము చేయ నియ్యకొని మాయోపాయమున కారుగహళ్లి ప్రభువు పైఁ బడి అతనిని మడియించి అతని గ్రామ మును స్వాధీనము చేసికొనిరి. హదినాడు ప్రభువునకు పుత్రిక తమ వంశమునకు రక్షకులయియేఆంచిన' ఈ విజయకృష్ణు లకుఁ గృతజ్ఞురాలయి విజయుని వరించెను. కారుగహళ్లి హది నాడులు రెండును విజయుని సొమ్మయ్యెను. అప్పుడతఁడు “ఒడ యరు' అను బిరుదమును ధరించి లింగాయతమతమును రించెను. ఈతనివంశీకు లే నేఁటికిని మైసూరు సుస్థానము నేలు చున్నారు. ఇతనినుండి నేటివఱకును రాజ్య మేలిన వారి నామ ముల దెలుపు పట్టిక యొకటి మైసూరు సంస్థానము వారి చే సిద్ధ' పుషఁబడియున్నది. దాని నీ క్రిందఁ బొందుషఱ చితిమి.


యదురాయఁడు విజయుఁడు క్రీ. శ.
హిరేబెట్టద శ్యామరాజ ఒడయరు 1423-1458
తిమరాజ ఒడయరు ! 1458_1478
ఆకు బెరళుహిగేశ్యామరాజ ఒడయరు !! 1478_1513
బెట్టదశ్యామరాజ ఒడయరు III1513_1552
తిమ రాజ ఒడయరు II (అప్పన్న)1552_1571
బోళ శ్యామరాజ ఒడయరు IV 1571.1576


బెట్టద శ్యామరాజ ఒడయరు V 1576_1578

రాజఒడయరు I1578-1617

శ్యామరాజ ఒడయరు VI1617-1637

ఇమడిరాజ ఒడయరు II1637_1638

రణధీర కంఠీరవ నరసరాజ ఒడయరు1638-1659

దొడ్డ దేవ రాజ ఒడయరు 1659.1672

చిక్క • దేవరాజ ఒడయరు 1672.1704

కఁఠీరవ ఒడయరు (మూకరసు)1704_1713

దొడ్డ కృష్ణ రాజ ఒడయరు !1713_1731

శ్యామ రాజ ఒడయరు VII 1731-1734

కృష్ణ రాజ ఒడయరు II1734-1766

నంజ రాజ ఒడయరు1766-1770

బెట్టద శ్యామ రాజ ఒడయరు VIII1770-1776

భాసశ్యామరాజ ఒడయరు IX 1776-1796

కృష్ణ గాజ ఒడయరు II 1796_1868

శ్యామరాజేంద్ర ఒడయరు X1868-1894

రాజ ఒడయరు IV1895


ఈజాబితాలోని మొదటి నలువురను గుఱించియు మనకు వి శేషాంశము లెవ్వియుఁ దెలియవు. మూఁడవ శ్యామ రాజ ఒడయరు మాత్రము దన రాజ్యమును మువ్వురుకుమారు లకుఁ బంచి పెట్టెను. అప్పన్న యను తిమ్మరాజునకు హేమ్మన

హళ్లియు, కృష్ణ రాజునకు కెంబళయును, బోళ శ్యామరాజు నకు మైసూరును ఇచ్చెను. మొదటి ఇద్దఱకును సంతతి లేక పోవుటవలన మైసూరు శాఖవారి కే మరల రాజ్యముతయుఁ జెందిపోయెను. కాని ఒక శాఖ నిలిచిపోయినపుడు రాజ్యము ఇతర శాఖల వారి కందుచు వచ్చుచున్నది. బంధుత్వములును నీమూఁడు శాఖలలో నే జరుగుచున్నవి. విజయనగర సామ్రాజ్య ము విచ్ఛిన్న మగు సమయమున మైసూరునందు పరిపాలకుఁడుగ నుండిన వాఁడు బోళ శ్యామరాజ ఒడయరు. ఇతఁడు శ్రీరంగ పట్న ములోని విజయనగర సంస్థాన ప్రతినిధికిఁ గప్పము గట్టక చల్లఁగ నెగ వేయ మొదలిడెను. ఇతనికి తరువాత రాజ ఒడయరు 1610 న సువత్సరమున శ్రీరంగ పట్న ప్రతినిధియగు ముసలి తిరుమల రాజును తలకాడునకుఁ బారదోలి ఆ పట్న మును స్వాధీనము చేసికొనెను. అదే రాజఒడయరు 1613లో ఉమ్మత్తూ రును లోఁబజచుకొని దాని యిలాకా భూములను మైసూరు నకుఁ జేర్చుకొనెను. అంతటి " దృప్తి చెందక ఇతఁడు త్తర మున జగ దేవరాయని పొలమునుగూడ కొంత ఆక్రమించు కొనెను. స్థానిక ప్రభువుల నణంచి రైతులను దనవారుగఁ జేసి కొను యోగ్యత ఇతనికిఁ గలుగుట జేసి యీతఁడు విజయుఁ డగుచు వచ్చెను. ఇతఁడే వైష్ణవ మతమవలంబించిన మైసూరు రాజులలో మొదటివాడు. ఇతని తరువాత రాజ్యమునకు వచ్చిన ఆరవశ్యామరాజ ఒడయరును ఇతని విధమునఁ బ్రవ

ర్తించి 1630 వ సంవత్సరమున చెన్న పట్టణ భూములను వశపఱ చుకొని మైసూరు రాజ్యమునకు జగదేవరాయని పొలము లన్ని టినిఁ జేర్చి వేసెను.

కంఠీర వనరసింహుఁడు.

ఇతనికిఁ దరువాత ఇమ్మడి రాజు రాజ్యము నకు వచ్చెను గాని అతఁడు విక్రమరాజను మంత్రివలన విషముచేఁ జంపఁ బడెను. బెట్టద శ్యామరాజ ఒడయరు కుమారుఁడు కంఠీరవ నరసరాజు రాజ్యమునకు నిర్వచింపఁ బడెను. కాని మంత్రి విక్రముఁ డుమాత్ర మాతనికిఁ బట్టాభి షేకము చేయ కుండెను. అయిన నితఁడు బుద్ధిశాలియు బలవుతుఁడును నై నందున విక్రముని చర్యలను కనిపట్టి వానిని తన మనుష్యుల చేఁ దుదముట్టించి స్వతంత్రముగ రాజ్యభారము వహించెను. ఇట్లు సింహాసనము నెక్కిన కంఠీరవనరసరాజు మహాపరాక్రమ శాలి. ఈతనికాలమునకు బిజాపుర సంస్థానము 'బలవంతమయి యుండెను. అహమ్మదు నగరము 'మొగలాయీల వలన నశింపఁ జేయఁబడినందున ఢిల్లీ బాచుపాహకు లోఁబడినదే యయినను విజాపురము మాత్రము దక్షిణ హిందూస్థాన ములలో మిన్నయై వెలుంగుచుండెను. అట్టి విజాపురపు దండులు రండుల్లాఖానుఁడును శ్రీశివాజి తండ్రియైన పాజి యును నడుప శ్రీరంగపట్న ముమీఁదికి ఎత్తివ చ్చెను. కంఠీరవ నరసింహుఁడా బలముల నెదిర్చి చెండాడెను. దీనికిఁ దరువాత

నితఁడు దన సైన్యములతో బయలు దేరి దక్షిణమున మధుర నాయకునుండి సత్యమంగళముమున్నగు ప్రదేశములను, పశ్చిమ మున చెంగల్వులపరాజితులఁ జేసి ప్రియపట్న మును అర్కల గూడెమును,ఉత్తరమున(ఇప్పటి సేలములోని) హోసూరును, దీసి కొని మాగిదిక ధ్యక్షుఁడగు కెంపెగౌడుని ఎలహంక కడనోడించి యాతనిచేఁ గప్పము . కట్టించుకొనెను. ఇట్లు రాజ్యమును వి స్త రింపఁ జేసి శ్రీరంగపట్న ప్రాకార కుడ్యములను బలపఱచి తన పేరిట నాణ్యములు ముద్రింపించెను. కంఠీరవ హొన్నుల నియు పణములనియు ఆనాణ్యములె మైనూరు సీమయందు హైదరాలీకాలమువఱకుఁ జెల్లుచుండెను. ఈకంఠీరన నరిసిం హుఁడు గ్రామాధికారుల పొగరణచుట కై వారి పై పన్ను లధి కముగ వేయుచుండెను. ఇతఁడు మహాదానపరుఁడు. అనేక దేవాలయములకు ఈతఁడు పెట్టిన మాన్యము లె ముఖ్యాధార ములు. మైసూరు రాజధానిలో నేటికిని జరుగుచుండు దసరా యుత్సవము లీతనివలన నుపక్రమింపఁబడిన వే.

దొడ్డ దేవరాజు,

కంఠీరవ నరసింహుఁడు సంతానము లేని వాఁడయినం దున రాణియు సేనానియుఁ జేరి బోళ శ్యామరాజు మనుమని దొడ్డ దేవరాయని రాజుఁ జేసిరి. ఈతని కాలమున విజయనగర సామ్రాజ్యపు రాజులలో గడపటివాఁడగు శ్రీరంగ రాయలు బెడ్నూరునందు సర్వాధికారము నడుపు చుండిన శివప్ప నాయకు

నాశ్రయిం చెను. అతఁ డీతనినిసాకు చేసికొని దక్షిణముపయిదాడి వెడలి నచ్చెను. కాని మైసూరు సైన్యము లతనినిఁ దిరుగఁ గొట్టి సక్కరపట్నము, హాసను మున్నగుఁ బ్రదేశములను స్వాధీ నము చేసికొనెను. ఇవి యిట్లుండమధుర నాయకుఁడు మైసూరు పైకిదండెత్తవచ్చెను. అతఁడు దొడ్డ దేవ రాయనిచేఁ బరాజితుఁ డగుట యేగాక కొసరునకు ఈ రోడ్డు, ధారాపురములను మైసూ రునకప్పగింపవలసిన వాఁడాయెను. తిరుచినాపల్లియు నితర ముఖ్య పట్టణములును దొడ్డ దేవరాయని సైన్యములకు వలసి నంతధనమును ఈనవలసివచ్చెను. ఇల్లీతని కాలమున మైసూరు రాజ్యమున తూర్పు పడమరల సక్కెరపట్నము మొదలు సేలము వఱకును ఉత్తరదక్షిణముల చిక్కనాయకునిహళ్లి మొదలు ధారాపురము (కోయంబుత్తూరుజిల్లా) వఱకును వ్యాపించి యుండెను.

చిక్క దేవరాజు.

దొడ్డ దేవ రాజునకుఁ బిమ్మట రాజ్యమునకు వచ్చిన వాడు చిక్కదేవ రాజు, దొడ్డ దేవరాజునకు సింహాసన మిచ్చు నప్పు డితఁడును నద్దానికర్హుడుగ నుండెను. కాని అప్పు డీతని హక్కు విచారింపఁ బడదయ్యెను. దొడ్డ దేవ రాజు ప్రభువగుట తోడ నే ఇతఁడును ఈతనితండ్రియు హంగళములో చెఱయం దుంచఁబడిరి. ఇతనికి బాల్యమున ఎళందూరు నందుండ విశాలాక్ష పండితుఁ డను జై నుని స్నేహముగలిగి యుం

డెను.అతఁడును చిక్కదేవరాయల నెప్పుడును విడిచి యుండ లేదు. హంగళమునకుఁ గూడ వెంబడి యరిగియుండెను. కావున చిక్క దేవరాజు రాజగుటతోడ నె విశాలాక్ష పండితుఁడు మంత్రియయ్యెను. మతమును బట్టి అతనియెడఁ గొంతయ సంతుష్టి దేశమునఁ బుట్టెను. కాని రాజు యొక్కయు మంత్రి యొక్కయు సామర్థ్యమువలన నట్టి యసంతుష్టి అణఁగి పోయెను. ఈచిక్క దేవరాజు మైసూరు రాజులలోని మహా యశోవంతులలో నొక్కఁడు. ఇతఁడు రాజ్యమారంభించిన కొలఁది కాలములో దేశమంతటను తపాలావసతులను నిర్మించెను. తపాలాధి కారు లే గూఢచారులుగ నుపచరించుచుండిరి. వారాయా జిల్లాల లోని ఆంతర్యవి శేషములనుగనిపట్టి వ్రాసిపంపునట్లు కట్టుదిట్ట ములు సేయఁబడెను. 1675 మొదలు 1678 వఱకును చిక్క దేవరాజు రాష్ట్రమును బెంచుటయం దుద్యుక్తుఁడయి మద్గిరి భాగములను సంపాదిం చెను. ఆటు తరువాత పన్ను లలో మార్పులనేకములు చేయఁదొడంగెను. ఇతఁడు నేలపన్ను ఎక్కుడు చేయఁగూడదను నిర్ణయము చేసికొని ద్రవ్య మార్జి చవ లెనను అభిలాష మాత్రము విడువక చిల్లరపన్నులు విశే షము ప్రజల పై మోప మొదలిడెను. దానినలన నెక్కుడ సంతుష్టి పుట్టనారంభిం చెను. అది జంగమాచార్యులు ప్రేరే పణవలన నెక్కువయ్యెను. రైతులు భూములు దున్నుట మాని వేసి రాజీనామా లిల్చి దేశ మువిడిచి లేచిపోవ సన్నద్ధులయిరి.

దీనినంతయును గనిపట్టి చిక్క దేవ రాజు జంగమాచార్యులను నాలుగువందలమందిని తనతో సంభాషించి పోవుట కై కొలువు కూటమునకుఁ బిలుపించిన పగిది' పిలువంబంచి కొలువుకూట మునకు వెనుక ప్రక్కన ఇతరులకుఁ దెలియ రాకుండ పెద్దగోతి నొకదానిని దీసి యటహంతకుల నేమించియుంచి యప్పటి యాచారమున కనుగుణముగ రాజుతోఁ బ్రసంగించి వెనుకటి భాగమునకు జగము లొక్కడొక్కఁడుగ విందారగించు కుతూహలమునఁబోవ వారిని ఒక్కని తరువాత నొక్క-నిగఁ జంపించివేసెను.

ఈవిధమున నతి క్రూర - సాహస మొనర్చి అతఁడప్పటి యసంతుష్టిని మరల్పఁ గలిగెను. కాని యాతని మంత్రియే యింతటి కార్యములకుఁ గారకుఁ డని యెంచి ప్రజలతనిసయి విరోధమూని యొక కుట్రపన్ని అతనిని మడియించిరి. ఆతఁడు ప్రాణములు వినుచుచు తిరుమల అయ్యంగారు అను వానిని తన ప్రభువునకు సిఫార్సు చేసెను. చిక్కదేవరాజు మంత్రిమరణ మునకు మిక్కిలి వగచెనని వేరుగ వ్రాయవలసిన పని లేదు.

ఇప్పటికి మొగలాయి చక్రవర్తులు విజాపురము నాక్ర మించుకొని (1687) దానికి లోబడియుండిన కర్నాటక భాగ ములను స్వాధీనము చేసికొన నారంభించి యుండిరి. శ్రీరామండ లము ఏర్పడఁ జొచ్చియుండెను. చిక్కదేవ రాజు శ్రీ రామండల మున ప్రతినిధిగ నేర్పడిన ఖాసింఖానునితోడను అతని మూల

మున ఔరంగ జేబుతోడను మిక్కిలి మైత్రి సంపాదించి బెంగు భూరునుకొని మొగలాయీలకు నష్టముగాని మార్గములఁ దన రాజ్యమును వ్యాపింపఁ జేసికొనఁ గడంగెను. మొదటి సంవత్స రమున తుంకూరును, బారహలు సేలములలో నెక్కుడు భాగమును ఇతని స్వాధీనమయ్యెను. 1690-1694 ల లోపల బశ్చిమమున బెడ్నూరు ప్రభువు భూములను బాబాబుడ పర్వతములవఱకును నితఁడు వశపజచుకొ నెను. 1694 న సం నత్సరమున నతనితో సంధి చేసికొని అందు కొద్ది భాగము మాత్ర మతనికి నిచ్చి వేసెను.

1696 వ సంవత్సరమున చిక్క దేవరాజు మథుర నాయ కుని పైకి దాడి వెడలి తిరుచినాపల్లిని ముట్టడించెను. అయిన మహారాష్ట్ర సైన్యములు సమయము కనిపట్టి తన రాజధాని పై కెత్తి వచ్చుటవలన నీతఁడు తిరుచినాపల్లి ముట్టడిని వదల్చ వలసిన వాఁడయ్యెను. 1697 లో ఔరంగ జేబు కొలువున చిక్క దేవరాజు స్నేహితుఁడుగనుండిన ఖాసింఖానుఁడు గతించి పోయెను. అందువలనఁ దాను నవీనముగ గడించిన భూభాగ ము పైఁ దనహక్కు- స్థిర పఱచుకొను నుద్దేశముతో చిక్క దేవ ఢిల్లీకి రాయ బారమం పెను. పాదుషాహ రాయబారులకు అహమ్మదు నగరమున నే కానవచ్చినందున వారతండీయ తమ ప్రభువునకొక నూతనముద్రయు, జగ ద్దేవ రాజను బిరుదమును, దంతపు సింహాసనము నధిష్ఠించి కొలువుండుట కు తరువును

గొని వచ్చిరి. ఇంతియకాక వారు మొగలాయీల రాజ్యాంగ వ్యవస్థను బరిశీలించి దానిం గుణించిన అమూల్య జ్ఞానమును గూడ సంపాదించుకొని వచ్చి.. అద్దాని ఫలముగ మైసూరు నందును వేరు వేరు కార్యములకు వేరు వేరు రాజ్యాంగములు సంఖ్యకు పదునెనిమిది ఏర్పడెను. పన్నులు కాలక్రమమునఁ దప్పక వసూలు కాఁజొచ్చెను. ప్రతిదినమును రెండు వేల పూల వరహాల మొ త్తమును తన బొక్కసములో నిలువ పైకము నకుఁ జేర్చుటకు మున్ను చిక్క దేవరాయఁడు ప్రాతః కాల భోజ నము చేయుచుండ లేదని యొక వాడుక. అట్లు ధనము చేర్చిన వాఁడుగావున నే అతనికి నవకోటి నారాయణుఁడని పేరు. అతఁడు 76 సంవత్సరముల నయస్సున 1704 వ సంవత్సరమున పరమ పద మందెను. ఆతఁడు మృతి మెందునప్పటికి మైసూరు రాజ్యము' దక్షిణమున పళని అన్నా మలలు మొదలు ఉత్తరమున మిడగేశి వఱకును, తూర్పున కర్నాటక ఘరము మొదలు పడమట. కొడగు బాలముల సరిహద్దులవజకును వ్యాపించియుండెను.

దొడ్డకృష్ణ రాజు.

దొడ్డకృష్ణ రాజు కాలమున (17 13-31) శ్రీ రామండలము సంకుచితము చేయఁబడెను. ఆర్కాటు నవాబొక్కఁడు క్రొత్తం గనేర్పడెను. మైసూరు సంస్థానము ద్రవ్యవంత మయినందున నీ రెండు మండలములలోని మహమ్మదీయ ప్రతి నిధులును మైసూరు పైకి దృష్టులు నెగడింప మొదలిడిరి. మొగలాయి

పొదుషాహలు నామమాత్రులగుచు వచ్చుటవలన దక్షిణ హిం దూస్థానమున వారి ప్రతినిధులుగ నుండిన వారు స్వతంత్రులయి యొకరితో నొకరు పోట్లాడు కొనుటయు మహారాష్ట్రులు మరల బలవంతులయి చూపట్టుటయుఁ దటస్థించెను. అందుచే మైసూరు రాజులు అందఱకును దలయొగ్గి వారు దండెత్తినచ్చి నప్పుడు కప్పము లిచ్చి తప్పించుకొనవలసిన చ్చెను. బొక్కస 'ములోని ద్రవ్యము కర్చుపడి పోవుటయేగాక ఒక తరుణమున పీష్వాగారిని సమాధానపఱచుటకయి యీతనికిఁ గొన్ని తాలూ కాలు జామీనుగ నెసంగ వలసిన చ్చెను (1757). ఇట్టిదుర వస్థ కాలమున మైసూరు రాజుల ముఖ్యవంశము నిలచిపోవుటయు వేరు శాఖలలో నుండి వచ్చినవారైనను బుద్ధిమంతులు గాక పోవుటయు సంభవించుటచే రాష్ట్రములోని బలమంతయు మంత్రుల చేతులలో దొరకిపోయెను.

మంత్రు లేరాజులు.

అట్టి మంత్రులలో దేవ రాజ నంజ రాజులు మనకథకు నవసరము. ఇందులో నంజరాజు అప్పుడు ముజఫరుజంగు నాజరుజంగుల మూలమునను చందాసాహెబ్ ఆన్వారుద్దీనుల మూలము నను ఫ్రెంచివారికిని ఆంగ్లేయులకును జరుగు చుండిన పోరాటములలో రెండు ప్రక్కలను సమయాను 'కూలముగ సంబంధములు గలుగఁ జేసికొని పనిచేయుచుండెను.

అతని సై న్యములు దేవనహళ్లియను కోటను ముట్ట డించుచుండిన కాలమున హైదరు దన ధైర్యము చేతను సాహ సము చేతను అతనిని మెప్పించి కొంత సైన్యమునకు నాయకుఁ డయ్యెను. ఆపదమున నుండి ఆంగ్లేయులకును ఫ్రెంచివారి కిని నగుచుండిన యల్లకల్లోలములలోఁ దన బలమును, వృద్ధి పఱచుకోనఁ జొచ్చెను. మైసూరు దళవాయి*[10]చే తిరుచినాపల్లి కడ మహమ్మదాలీకి సాహాయ్యర్థము తీసికొని పోఁబడినప్పుడు హైదరు మహా సామర్థ్యము చూపి దిండిగల్లుకు లీజుదారుగ నేమింపఁబడెను. తిరుచినాపల్లి ముట్టడినుండి దళవాయి నంజు రాజు మైసూరునకువచ్చి చేరెను. అప్పటికి మైసూరునందు దళవాయి పై తిరుగు బాటు నకు సర్వ విషయములును సిద్ధపడి యుండెను. దేవ రాజు ఉద్యోగము వదలుకొని శాంతిమై కాల ము గడప నేగియుండెను.

నంజ రాజు దుర్భరమగు గర్వముతో రాజ్య కార్య ముల నడపుచుండుటవలన రాజున కాతని యెడ నసూయ పుట్టి యుండె. కావున రాచమందిరము వారందఱును జేరి దళవాయిని వెడలఁగొట్టి ప్రయత్నము లుపక్రమించి యుం డిరి. వారు దమకు సాయము కొఱకు 'హైదరాలీని రమ్మని వేఁడిరి. అతఁడు నంజరాజును లోఁబజచుకొని కొంతకాల మతఁడు. తౌజ్౽[11] దీసికొని నిరుద్యోగతనుండునట్లు చేసెను. ఇట్లు

+ ఇట్లు


నంజ రాజును వదలించిన తరువాత నతఁడు చేయుచుండిన సర్వ కార్యములకును హైద రే నియమింపఁబడెను.

ఇతఁడు చదువు వ్రాత లేమియు నెఱుగని వాఁడు. కాని జ్ఞాపక శక్తియు, యోచనాదార్థ్యమును గలవాడు. అందుచే నీతఁడు మొదటినుండియు ఖండేరావు అను మహారాష్ట్ర బ్రాహ్మ ణుని చదువరిని వెంటఁ బెట్టుకొని పనులు నెరవేర్చుకొనుచు వచ్చెను. ఆతఁడు గొంత ద్రోహము చేయ సెంచుటచే హైదరతనిని మాయోపాయమునఁ దీర్చి వేసెను. యెవ్వరును దలయె త్తికొని తిరుగఁగల వారు లేక పోవుటనలన సర్వశక్తులును హైదరున కే చేజిక్కెను. మహారాష్ట్రులును శీరానవాబును మైసూరు పై పలుమారు దాడి వేడలు చుండు టవలనను మైసూరు సైన్యములను అదపులో నుంచుకొ నవలసి వచ్చినందనను ఆర్థిక సైనిక స్వాతంత్ర్యమంతయును హైదరుదే యయ్యెను. నాఁటినుండియు "హైదరు పేరునకు మాత్రము దళవాయియే యైనను నిజమునకు స్వతంత్రుఁ డే యయి రాజ్యభారము నిర్వహించుచు రెండన కృష్ణ రాజు మృతి చెందిన మీఁదట నతని స్థానము: మఱిఒక వసివానిని తానే నేమిం చెను. హైదరు రాజు నేర్పఱ చుటం గురించి ఈ క్రింది కథ చెప్పఁబడుచున్నది.

హెదరురాజు నేరుట.

రెండవ కృష్ణ రాజు మరణానంతరము రాజు పదమునకుఁ

బుట్టుక వలన అర్హతగల బాలు రెల్లరును గొలువు కూటము నకు రానియోగింపఁబడిరి. వారు వచ్చి చేరునప్పటికి ఆస్థానము, మిఠాయి, పండ్లు, కాయలు, పూలు, ఆటవస్తువులు, పుస్తక ములు మున్నగు పదార్థములతో నింపఁబడి యుండెను. వారు చేరిన పిదప హైదరు వారినందఱిని కలయంగనుంగొని యెన్వరి కిష్టమయినది వారెత్తుకొనవచ్చునని వారితో నుడి వెను. అంత కొందఱు మిఠాయియు మఱికొందఱు పండ్లును ఆటవస్తు వులును ఈప్రకార మ నేకుల సేక పదార్థములను స్వీకరించిరి. కాని యొక్క కుఱ్ఱఁడు మాత్రము ఒక్కమూల నిడఁబడి మెఱుంగులీనుచుండిన పిడిక త్తి నొక చేతను నిమ్మపండు ఒక దానిని మఱియొక చేతను దీసికొనెను. దానింజూచి హైదరు " అల్ల డె. ఆబాలుఁడె రాజు. అతనికి మొదటిపని దేశ సంరక్ష ణము. రెండవది. సస్యాభివృద్ధి.అతనినిట తెండు. నను గౌగ లించు కొననిండు” అని యాతనిని ప్రశంసించి యతనికిఁ బట్టా భిషేక మహోత్సవము జరిగించెను.

హైదరు ప్రభుత్వము.

ఇట్లు రాజును నియమించినను సర్వాధికారము హైదరు దేయయియుండెను. ఆంగ్లేయ చరిత్రకారుల వలన నితఁడు లోకమున జనియించిన మహా రాజ్య నిర్మాతలలో ఒక్కడుగఁ బరిగణింపఁబడు చున్నాఁడు. ఇతని కాలమున మైసూరు సం స్థానము ఉత్తరమున కృష్ణవఱకును దక్షిణమున దిండిగల్లువ

కును వ్యాపించి యుండెను. రాజ్యమును నలువైపుల: బెం చుట సులభ సాధ్యముగాదు. అందున హైదరుకాలమున దక్షిణ హిందూస్థానము నందు నైజామును, మహారాష్ట్రులును, ఆం గ్లేయులును బలవంతులయియుండిరి. వీరందజతోడను పో రాత నికిఁదప్పి నదిగాదు.

మొదట మొదట హైదరునకును ఆంగ్లేయులకును స్నే హమే కాననచ్చుచున్నది. 1763 వ సంవత్సరమున హైదరు బెడ్నూరును సాధించి అది వఱకు నామకార్థముండిన రాజును అతని తల్లిని చెఱపాలయు నుంచిన పిదప ఆంగ్లేయుల కొక కొన్ని నర్తకపు హక్కులను ఇచ్చినట్లు నిదర్శనములున్నవి. 1766 లోఁ గూడ హైదరు ఆంగ్లేయులకు మళయాళములో వర్తక విషయమునఁ గొన్ని సదుపాయము లేర్పఱుచుకొనుట కును అనుమతి నిచ్చియున్నాఁడు. కాని అతఁడు సమయమున కందఱతో స్నేహము చేయుచు ఆది కానప్పుడు శత్రుత్వము వహించుచున్నట్లు నిర్ధారణ చేయవలసియున్నది. 'మొత్తము మీఁద నతఁడు ఫ్రెంచి వారితోడనే యెక్కుడు మైత్రిగలిగి. యుండెను. అందుచే నతఁడాం గ్లేయులతో నిరంతరము పోరా' డుచునే యుండవలసి వచ్చెను. మనకుఁ దెలిసినవఱకు నతని కిని ఆంగ్లేయులకును యుద్ధము ప్రాప్త మగుటకు మొదటి కార ణము నైజూము హైదరుపయి కెత్తిపోవు తరుణమున నాం- గ్లేయులు నైజామునకు సాయపడుటయే. నాఁటినుండియే

మైసూరు ప్రథమ విగ్రహము ప్రారంభమయ్యెనని చెప్పవచ్చును. దానిలో జరిగిన యుద్ధములలో హైదర'నేక 'పర్యాయము లషజయముది సంధిఁ జేసికొనఁ జూ చెనుగాని ఆంగ్లేయులు పడ నిచ్చినవారుగారు. కావున నతఁడు వీరిని మహాసాహసమున నెదిరి వీరికి దిగ్బ్రమ పుట్టించి వీరిని లోబఱచుకొను ఉద్దేశ ముతో 1769 న సంవత్సరమున నాశ స్మికముగ మద్రాసునకు సైన్యముతోఁగూడ వచ్చి చేరెను. అచ్చటి ఆంగ్లేయ పరిపాల కులకిది అశనిపాతము వోలెఁగానుపించెను. కావున వెంటనే స్నేహసంథికి నియ్యకొని. యుద్ధమునకుఁ బూర్వ మిరు వారుల వారికీం గలిగిన రాజ్యము వారివారికిఁ జెందునట్లును అకారణ ముగ మి మూఁడ వరాష్ట్రము వారెవ్వరైన తమలో ఒక్కరి పై దాడి వెడలి వచ్చినచో రెండవ వారు తోడ్పడనలసినదని యును షర్తు లేర్పఱుపఁ బడెను. ఈకడపటి షర్తె మఱల హైదరు నకును ఆంగ్లేయులకును విగ్రహము కలుగుటకుఁ గారణ మాయెను.

1771 వ సంవత్సరమున చౌతుకప్పము గట్ట లేదను గారణమున మహా రాష్ట్రులు హైదరు పైకి దండు వెడలి వచ్చిరి. కొంత కాలము స్వంతముగ పోరి హైదరు నుద్రాసు సంధిని జప్తికిఁ దెచ్చుకొని ఆంగ్లేయులను సాయము కోరెను. హైద రున కెప్పుడును ప్రతిపక్షమూను చుండిన ఆర్కాటు నవాబగు మహమ్మదు ఆలీ బోధనలవలన నాంగ్లేయులు. హైదరు పైకి మహారాష్ట్రులు ఎత్తివచ్చుట అకారణముగఁ గాదు కావున తాము సాహాయ్యమియ్య వలనుపడదని ప్రత్యుత్తరమిచ్చిరి. అందుచే హైదరు మహారాష్ట్రులకు లొంగి మిక్కిలినష్ట పడి వారిని మంచితనమునకుఁ దెచ్చకొనవలసి వచ్చెను. ఇట్టి విపత్కాల మునఁ జేయి.పిడిచిన ఆంగ్లేయ పరిపాలకుల పై అతనికి కినుక పుట్టి వృద్ధియగుచుండెను. అయిన నతఁడు మహాయుక్తి మం తుఁడు గావున దానినంతయును నప్పటికణఁచిపెట్టుకొని 1772 లో కొడగు రాజ్యమును ఆక్రమించి సమయము దొరకి నట్లెల్ల మహా రాష్ట్రులకుఁ దా మున్న ర్పించిన భూభాగము ను వశపఱచు కొనుచుండెను. ఇదికనిపెట్టి 1773 లో నుహారాష్ట్ర ప్రభువు రఘోబా హైదరును మర్దింప నే తెంచెను. కాని అతడుఁ దైస్యము సహించి రఘోబాను పేష్వాపట్టమున కొప్పుకొనుట "నభినయించి కొంత పైక మిచ్చెదనని వాగ్దానము చేసి తప్పించు కొనెను.


1778వ సంవత్సరమున అమెరి కాయందు ఆంగ్లేయ ప్రభుత్వము పై తిరుగుబాటు చేసి తన్మూలమున నేఁటి ప్రసిద్ధ సంయు క్త రాష్ట్ర మేర్పఱచిన అధిని దేశ ప్రజలకు ఫ్రెంచివారు సాయము చేసినందున ఇంగ్లాంపునకును ఫ్రాంసునకును విగ్ర హము ప్రారంభమయ్యెను. భరత వర్షము లోని ఆంగ్లేయ సైన్యములకు ఫ్రెంచివారి పట్టణములను ముట్టడించుట కర్తవ్య మయినందున నొక ఆంగ్లేయపటాలము మాహీ' యను పశ్చిమ

తీరమందలి పురమును బట్టు నుద్దేశముతో పంపఁబడెను. కాని “మాహీ' హైదరునకు లోఁబడిన ఒక సామంత రాజు దైనందు నను హైదరు రాజ్యములో నుండి పటాలములు పోవలసి యున్నందునను హైదరు 'మాహీ' పైఁ దనధ్వజమును ప్రేంచి వారి ధ్వజముతోఁగూడ నెక్కించి ఆంగ్లేయులు “మాహీ' వం కకుఁ బోకూడదని శాసిం చెను. కాని ఈతఁడొడ్డిన యాటంకము నిలచినది కాదు. 'మాహీ' ని ఆంగ్లేయులు పట్టుకొనిరి. దీని వలన - హైదరునకుఁ గలిగిన ఆగ్రహమును వర్ణింప నలవిగాదు. ఆ సమయముననే నైజామునకును ఆంగ్లేయులకును గుంటూరు సర్కారు విషయమున భేదములు ప్రారంభమయ్యెను. ఉత్తరహిందూస్థానమునను బొంబాయియందును ఆంగ్లేయులకు దుర వస్థలు వాటిల్లుచుండెను. కావున నారు హైదరును శాంత పఱచుటకు అనేక విధములఁ బ్రయత్నించిరి. మధ్యనర్తులనంపి చూచిరి. బహుమతు లిచ్చి తనియింప నెంచిరి. ఎన్ని పాట్లుపడి నను హైదరు వారిని మన్నించిన వాఁడు గాఁడు. అతని ఏర్పాటు లన్ని యుఁ దీరినతోడనే 1780 వ సంవత్సరమున డెబ్బదీ ఎని మిదేండ వయస్సున నతఁడు కుల వైరుల నిర్దూలము చేసెదనని పట్టుపట్టిన యావనుఁడగు కుమారునితోఁ గూడ 90,000 సైన్యమును నడపికొని ప్రజల సంపూర్ణాశీ ర్వాదములఁ గొనుచు సమర్ధులగు నధికారులు గొలువ నాంగ్లేయులమీఁద వెడలెను. నైజామును మహారాష్ట్రులును నితనికి సాహాయ్యము రానేర్పడి

యుండెను. కాని మహారాష్ట్రులు దనుకు వచ్చిన కష్టములు దప్పించుకొన పాటుపడుచుండిరి. గవర్నరు జనరలుగారి సామ వాక్యముల చేతను చాతుర్యముచేతను నైజాము ఆంగ్లేయుల పరమయి హైదరును చేరఁడయ్యెను. కావున ఇతనికిని ఆంగ్లే యులకును జరిగిన విగ్రహము మహా ఘోరమయ్యెను. హైద రాంగ్లేయులను ఆంగ్లేయులు హైదరును ఓడింపఁ జొచ్చిరి, ఇట్లు హైదరు జయాపజయములను గొనుచు దీక్షతోఁ బని చేసి ఆంగ్లేయులతో రెండుమారులు విగ్రహము నడిపి మైసూరు సంస్థానమునకుఁ గొఅంతరాకుండునట్లు నిలిపి 1782వ సంవత్సర మున రెండవ మైసూరు విగ్రహము జరుగుచుండఁగ నే మృతి నొందెను.

టిప్పూ సుల్తాను.

హైదరు మరణానంతరము అతని కుమారుఁ డైన టిప్పూ సుల్తాను రాజ్యమునకు నచ్చేను. ఇతఁడు విద్యావంతుఁ డేగాని మతా వేశ ముగలవాఁడు. 1784 సంవత్సరమున ఆంగ్లేయులతో సంధి చేసికొని మహారాష్ట్రులను నై జూమును జయించి ఇతఁడు దక్షిణ హిందూస్థాన పశ్చిమ తీరమునకు దండెత్తిపోయి రాజ్య ముల నాక్రమించి అందలి ప్రజలను మహమ్మదీయులు గావల సినదని నిర్బంధ పెట్టఁ బ్రారంభిచెను. వారట్టి పని కంగీకరింప నిచో వారిని చిత్రవధపాలు చేయుచువచ్చెను. ఇంతియె కాదు. ఇతనికిని ఆంగ్లేయులకును బద్ధవైరము. వారి సంరక్షణయం

దుండిన తిరువాన్ కూరు రాష్ట్రము నితఁడు ముట్టడింపఁబోయెను. కావున నాంగ్లేయ ప్రభుత్వము వారికిని ఇతనికిని మఱల విగ్ర హము . ప్రారంభమాయెను. మహారాష్ట్రులును నైజామును అంగ్లేయులకు సాయ మే తెంచిరి. గవర్నరు జనరలుగా నుండిన లార్డు 'కారన్ వా లీసే స్వయముగ సైన్యముల నడపుకొని నచ్చెను. కొంత పోరాటముమీఁద టిప్పూ పరాజితుఁడయి శ్రీరంగపట్నము నద్ద సంధి చేసికొనెను (1792). దానివలన నతని రాజ్యములో సగబాలును మూఁడుకోట్ల ముప్పది రూపా యలును శత్రువులకుఁ జెందిపోయెను. అతని కుమారులిరు వుకు ప్రతిభులుగా 'మెసంగఁబడిరి.

ఈ దురదృష్టమునకుఁ దరువాత టిప్పూ ఆంగ్లేయుల నెటైనను భరతఖండమునుండి పారదోలవలయునని బహు భం గుల ప్రయత్నము చేయ నారంభించెను. ఆఫ్ఘనిస్థానము, తుర్కీ, అ రేబియా, పారసీక ము మున్నగు మహమ్మదీయ విదేశములకు ఉత్తరములు వ్రాసెను. ఢిల్లీ, అయోధ్యా, హైదరాబాదు, పునహా, యోధపురము,జయపురము, కాశ్మీరము మున్నగు భార తేయ సంస్థానములకుఁ దన ప్రతినిధుల నం పెను. ప్రెంచి వారిని పలుమారు సాహాయ్యము వేఁడెను. వారికి నాయకుఁ డయి యైరోపాఖండము నంతయు వడంకఁ జేయుచుండిన నెపోలియను బోనపార్టునకును ఇతనికి గూడ ను త్తర ప్రత్యు.

త్తరములు జరిగెను. కాని నెపోలియను నావిక సై న్యము“ నెల్సను' అను ఆంగ్లేయ నావికావీరునిచే నోడింపఁబడినమీ దట నెపోలియను దూర్పు దేశముల పైకి నచ్చు నుద్యమము మానుకొనవలసి వచ్చెను. టిప్పూసుల్తాను చర్యలనంతటినిగని పట్టి యుండిన గవర్నరు జనరలు అతనిని .సమాధాన మడిగెను. అతఁడును సరియయిన ప్రత్యుత్తర మీయనందున అతనిపై విగ్రహము చాటింపఁబడెను.నైజామును మహా రాష్ట్రులును టిప్పూసుల్తాను గెలిచినచో నతఁడు దమ్ము నెచ్చట మ్రింగి వేయు నోయను భయమున నాంగ్లేయుల పరమయిది. విగ్రహము ప్రారంభమయ్యెను. ఒకటి రెండు యుద్ధములకుఁ దరువాత నాం గ్లేయులు శ్రీరంగపట్న మును మట్టడించిరి. టిప్నూ సంధి చేసికొ నుటకుఁ బ్రయత్నించెను. కాని రెండు పక్షములవారికిని షర తులు కుదిరినవి కావు. కావున ముట్టడి బలముగ సాగదొడఁగి 1799 వ సంవత్సరము మే నెల 4 న తేది శ్రీరంగపట్నము ఆంగ్లేయుల చేతఁ జిక్కెను. టిప్పూసుల్తాను యుద్ధమున బహు సాహసముతోఁ బోరి మడిసి పడి యుండెను. ఆతనితో మైసూరు నందు మహమ్మదీయ రాజ్య మంతరించి పోయెను. ఈవిగ్రహమున నాంగ్లేయులకు సాయము చేసిన స్వదేశీయ పరిపాలకుఁడు నైజామొక్కరుఁడె. మహారాష్ట్రులు యుద్ధ రంగమున కే రా లేదు. కాని టిప్పూసుల్తాను పరాజితుఁడయి మృతినొందిన తరువాత నాతని దేశమును బంచుకొను సమ

యమున నాగ్లేయులు వీరిని దల పెట్టవలసిన వారయిరి. టిప్పూ రాజ్యమును దామును నైజామును విభజించుకొన యత్నించిన పక్షమున మహారాష్ట్రులకుఁ దప్పక ఈర్ష్యజనిం చును. అంతమాత్రమె గాదు. నైజామునకు విశేషమగు భూభాగము " చేరిపోయి అతని శక్తి యెక్కుడయి పోవును. అది అప్పటి స్థితిలో ఆంగ్లేయ ప్రభుత్వము వారి కంతఫలప్రద ముగాఁ గనించ లేదు. కావున మిక్కిలి యోచనమీఁద మైసూరు మండలమునందుఁ బూర్వహిందూ రాజ వంశమును నెలకొల్పునట్లును టిప్పునకు సంబంధించిన ఇతర దేశ భాగమును దామును నైజామును మహారాష్ట్రులును విభజించుకొనునట్లు ను సైజూముతో 1799 లో చేసికొనిన సంధివలన ఏర్పఱుప బడెను. అందుచే 'బూర్వ హిందూ వంశమునకుఁ జేరిన కృష్ణ రాజ ఒడయరు. ఐదు సువత్సరముల బాలుఁడు మైసూరునకు రాజుగా నేమింపఁబడెను. అతనితో నదే తరుణమున ఒక సాహాయ్యసంధి (Subsdiary treaty.) తీర్చు కొనఁబడెను. ఈసంధివలన మైసూరునం దాంగ్లేయులు మహారాజునకు సాహాయ్యర్థము హైదరాబాదు మొదలగు ఇతర సంస్థానము లందు వలెనే సాహాయ్య సైన్యమును నిలుప నిర్ణయించుకొనిరి. దానికగు వ్యయమునకు గాను మైసూరు రాజు సంవత్సరమున కేడులక్షల పూలవరహాల -నియ్యనంగీక రించెను. ఇతర రాష్ట్ర ములతోఁ బోరుక లిగినప్పుడు ఆంగ్లేయుల సాయమున కై వలసిన

సైన్యముల కగువ్యయమునుగూడ గవర్నరు జనరలుగారి తీర్మా నము చొప్పున మైసూరు రాజు భరింప వలసి యుండుననియు నొక షర్తు ఈసంధిలోఁ జేర్పఁబడియెను. అయిన నీషర్తు 1807 న సంవత్సరమున మార్పునం దెను. అప్పుడు మైసూరు సైన్య మేర్ప డెను.అది యే ఆంగ్లేయుల సాయమునకుఁ గాను కొన్ని నిబంధనల ననుసరించి ఉపయోగింప నియమింపఁబడెను. ఈ రెండు సేనలకు అనగా సాహాయ్య సైన్యమునకును మైసూరు సైన్యము:నకును అగువ్యయములు రాజు భరింపనంతటి స్థితికి వచ్చినచో ఆంగ్లేయ ప్రభుత్వమువారు పరిపాలనా పద్ధతులను మార్చియో కొంత దే శమును ఆక్రమించుకొనియో లేక సర్వమును తమ యాధి పత్యమునకు మార్చుకొనియో తమ చిత్తమునకు వచ్చినట్లు ప్ర వర్తింపఁగలరనియు అట్లు రాజ్యము తీసికొనఁబడినచో రాజునకు సంవత్సరమునకు ఒకలక్ష రూపాయిలును రాజ్యపునిక రాదా యములో ఐదనవంతును ఇయ్యఁబడుననియును ఈ సంధవలనఁ దీర్మానింపఁబడెను.

పూర్ణయ్య

కృష్ణ రాజ ఒడయరు బాలుఁడుగ నుండినందున ఈ సంధి పత్రములో అతనివ్రాలును అతని తల్లి వ్రాలును దివాను పూర్ణయ్య వ్రాలును గానవచ్చుచున్నవి. ఇట దివాను పూర్ణయ్య ఎవ్వరయినదియు మాచదువరు లొకకొంత ఎఱుంగుదురుగాత. ఇతఁడు కోయంబుత్తూరు జిల్లాలోని యొకమాధ్వవంశమునకుఁ

జేరిన వాఁడు. హైదరుకాలమున నతనికడ ఇతఁడు పనికికుదిరి సామర్థ్యము చూపినందున ఇతఁడు ఆతనిచే మంత్రిగ నేమింపఁ బడియెను. హైదరాలీ ఆంగ్లేయుల పై యుద్ధమునకు బయలు దేరి నప్పుడు అతని సైన్యములకు వలయు సామగ్రినంతయు వెంట నడపి తన యజమానికి ప్రబలసాహాయ్య మొనర్చినవాడీ పూర్ణ య్య యే. హైదరు మరణానంతరము టిప్పూను బారదోలి హైదరు రెండవ కుమారుని సింహాసనారూఢుం జేయ వలయునని ప్రయత్నించిన వారిని విఫలమనోరధుల నెనర్చి టిప్పూసుల్తాను నకు మైసూరు రాజ్యమును దక్కించినవాఁడును ఈపూర్ణయ్య యే. కావున నితఁడు హైదరునకును టిప్పునకును మిక్కిలి ముఖ్యుండుగ నుండెను. టిప్పు యొక్క మతావేశము ఇతని వఱ కును వ్యాపిం చెనుగాని అతని తల్లిగారి హెచ్చరిక మీఁద టిప్పు పూర్ణయ్య గారియొద్ద మతపుమాటయె యెత్తుకొనుట మాని వేసెను. శ్రీరంగపట్న పుముట్టడిలో టిప్పు నిహతుఁడయిన పిదప ఇతఁడును ఆంగ్లేయుల చేతులలోఁ జిక్కెను. కాని టిప్పుసుల్తాను కడ నెర వేర్చుచుండిన ఆర్థికమంత్రిత్వ కార్యమునే కృష్ణ రాజఒడ యరు కడఁగూడ నెర వేర్ప నియ్యకొనుటవలన నాంగ్లేయ ప్రభు త్వమువారు పూర్ణయ్యను ఉద్యోగమునందుండ నియమించిరి. పూర్ణయ్యదివానుగను రాజ్య పాలకుఁడుగను నేర్పఱుప బడెను. కర్నలు క్లోసు అనునతఁడు రెసిడెంటయ్యెను. కర్నలు ఆర్తరు వెల్లస్లీ (తరువాత వెల్లింగ్టను ప్రభువయి నెగడిన వాఁడు)

సేనానాయకుఁడుగ నేమింపఁబడెను. ఇట్లేర్పడిన ఈమువ్వురి చేతులలో మైసూరు రాజ్యము క్షేమముగ జీవయాత్ర మొదలి డెను. అచ్చటచ్చట తిరుగఁబడియుండిన ప్రభువు లణఁచి వేయఁ బడిరి. దేశములోని సంగతులన్ని యును జక్కఁగ నెఱిఁగిన వాడుగాన పూర్ణయ్య రాజ్యములోని వరుంబడి మార్గముల బాగుగ నుపయోగింపఁ జొచ్చెను. టిప్పుసుల్తాను మంచిగంధపు చెక్క ఎగుమతి కాకూడదని ఉత్తరువు చేసియు డెను. కావున రాజ్యభవనములలోనది కొల్లలుగఁ జేరియుండెను. తెలిసిన వాడుగాన పూర్ణయ్య దానిని అమ్మి ఎక్కుడు ధనమును బొక్క. సమునకుఁ జేర్చెను. ఇతఁడు రాజ్య భారము నిర్వహించి నంత కాలమును ఆంగ్లేయ ప్రభుత్వము వారు మైసూరు పరి పాలన యందు జోక్యముకలుగఁ జేసికొనవలసిన యంశ మొక్కటి యును రా లేదు. దీని చే పూర్ణయ్య ప్రభుత్వమున లోపములు "లేవని చెప్పుటగాదు. కానిపూర్వపద్ధతుల నవలంబించుచు నిరంకుశముగ రాజ్యపాలనము చేసినను అతని కాలమున నేలాటి కష్టములును దటస్థింపకుండుట ఆతని పరిపాలనా శక్తిని వ్యక్తి కరించుచున్నదని మాత్రము అందఱకును దోఁచకపోదు. అతఁడు 1811 న సంవత్సరములోపల బొక్క సమున రెండుకోట్ల రూపాయలు చేర్చి పెట్టెనసినచో నతఁడు ఆర్థిక విషయముల “నెంత జాగరూకతతోఁ బనిచేసినదియు "నెల్లడియగుచున్నది. అతని పద్ధతులలోని ఒక్కలోపమును మాత్రమిచ్చటనె చూపుట

గర్తవ్యము. పన్ను వసూలున కతఁడేర్పఱచిన మార్గము ముందు కాలమున బాధను దెచ్చి పెట్టునదయ్యెను. అతఁడు అమల్దారుల నేర్పఱచి వారిని తాలూ కాలకనిపి నిర్ణీతమగు మొత్తమును నసూలు చేయవలసినదని యుత్తరువిచ్చును. వారు తక్కువ వసూలు చేసినచో స్వంతధనమచ్చుకొని తీరవలయు 'ననియు ఎక్కువవసూలు చేసినచో రాజుగారి ధనాగారమునకను పనలసినదనియు వారికి నను. ఈ పద్ధతి దీవాను స్వయముగ జాగరూకుఁడయి న్యాయమతి భ్రమింపక కార్యములను గమనిం చినంత కాలమును దుఃఖములను దెచ్చి పెట్టదయ్యెను. కాని రాజునకుఁ బైకము కానలసినచ్చినప్పుడును దివాను కఠినుఁడయి నప్పుడును దీనివలన సనర్థములు జరుగవీలుం డెను. అట్టి కష్టదశ ముందు వర్ణితమగును. పూర్ణయ్య నిరంకుశముగ పరిపాలించే నని పైన వ్రాసితిమి. ప్రజలకుమాత్రమె అతఁడు నిరంకుశుఁడు గాఁడు. రాజు విషయమునగూడ నతఁడు అట్టి విధముగ నే ప్రవ దించుచుండెను. కావునఁ జుట్టుముట్టుంగల పరిజనుల బోధన లచే రాజునక తనిపై నసూయజనిం చెను. అందువలన కృష్ణ రాజు ఒడయరు 1811 వ సంవత్సరమున నాంగ్లేయ ప్రభుత్వము వారికిఁ దానే రాజ్య భారము నిర్వహించుకొందునని తెలియఁ జే సెను. రెసిడెంటు పూర్ణయ్యను దివానుగానిలుప నెం చెనుగాని అతఁడియ్యకొనఁడయ్యెను. ఆ తరువాతి సంవత్సర మే శ్రీరంగ పట్ట ఇమున పూర్ణయ్య వైకుంఠ ప్రాప్తిఁ జెందెను.

కృష్ణ రాజ ఒడయరు.

పూర్ణయ్యను దొలఁగించి కృష్ణ రాజ ఒడయరు రాజ్యము నేల మొదలిడెను. బొక్క సము సంపూర్ణముగ నిండియుండిన స్థితి లో పదునాఱేండ్ల బాలుఁడగు నీభూపాలుఁడుపరిపాలనము ప్రారం భించి మూఁడుసంవత్సరములలో రాజ్యమును దారిద్ర్యమునకు దెచ్చి విడిచెను. స్తోత్రపాఠకులును, పరాన్న భుక్కులును, ఇతనికి ప్రాణ మిత్రులగుటవలన రెసిడెంటుగారి సంభాషణములును రాజ్యములోని భారతీయ పౌరుల నీతివచనములును ఇతని చెవున కెక్కినవిగావు. ఆంగ్లేయ ప్రభుత్వము వారు కొంతకాలమితనిని జంకించిచూచిరి. అప్పటికీని ఇతఁడు తనమార్గమునువదలినవాఁ డుగాఁడు. ద్రవ్యము లెక్క లేక వెచ్చ పెట్టఁబడుచుండుటవలనను. సైన్యమునకై అప్పులు పెరుగఁజొచ్చియుండుటవలనను పూర్ణ య్య చే నుపక్రమింపఁబడిన వసూలు పద్ధతిలో ని పైకనుపఱచిన లోపముచే నది మహాక్రూరముగ నుపయోగి పఁబడుట ప్రారం భమయ్యెను. ఉత్తమోద్యోగము లన్ని యును ఏలములో నమ్మ బడ మొదలిడెను. ఇంతియెగాక న్యాయ తీర్థానముల విషయ ముసఁ గూడ ప్రజల కరాజకము సంభవించెను. ఏన్యాయాధిపతి కిని శిక్ష, వేయు నధికార ముండినదిగాదు. అతఁడు ముద్దాయి నేరస్థుఁడని తీర్మానించిన తరువాత రాజు స్వయముగ నే శిక్షవిధిం చుచుంటయాచారము. కాబట్టి రాజు సోమరియగుటతోడనే న్యాయ తీర్మానములయందు భరింపరాని ఆలస్యము పొడసూ పెను.


ఇప్పగిది ఒక్కటి పై నొక్కటిగ నష్టములు ప్రజలకు సంభవింప నారంభించినందునఁ గ్రము క్రమముగ . నసంతుష్టి ప్రబలెను. 1830 న సంవత్సరమునఁ దిరుగు బాటులు ప్రారంభమయ్యెను. ఆంగ్లేయ సైన్యము లవ్వానినఁణచుటకు సాయము పోవలసి వచ్చెను. నగరము తాలుకాలో జరిగిన తిరుగుబాటును ఎదు ర్చుటకు సాహాయ్య సైన్యమంతెయును వలసి వచ్చెను. మిక్కిలి కష్టము మీఁద తిరుగుబాటు సైన్యములు విరిసిపోయి శాంతి సమకూరెను. తిరుగు బాటునకుఁ గారకులయిన ఒకరిద్దరు నాయకులు మాత్రము కొన్ని నెలల కాలము విడువక మైసూరు సీమను వేధించిరి. ఇట్టి స్థితిలో గవర్నరు జనరలుగారు కృష్ణ రాజ ఒడయరును సింహాసనమునుండి తొలఁగించుట శ్రేయ స్కరమని యెంచి ఆసంగతిని అతనికిఁ దెలియఁ జేసి ఇద్దరు కమీషనరులను రాజ్య భారమునకు నియోగించెను. రాజు వారి చేతికిఁ దన దేశము నప్పగించి మైసూరు నందలి తన నగ. రులోఁ గాలముఁ గడపఁగడఁగెను.

కమీషను పరిపాలన.

మైసూరు రాష్ట్రము ఈవిధముగ 1831. మొదలు 1881 వఱకును సంపూర్ణముగ ఆంగ్లేయుల ప్రభుత్వము క్రిందికి నచ్చెను. ఈఏబది సంవత్సరములను పరిపాలనా పద్ధతుల నను సరించి మూఁడు భాగములుగ విభజింప వచ్చును. మొదటి భాగమున పూర్ణయ్య చే నుపక్రమింపఁబడిన పద్ధతులే న్యాయా

మార్గమున ననుసరింపఁబడెను. రెండవ భాగమున నాంగ్లేయ 'పరిపాలనా పద్ధతులు గొంచెము కొంచెముగ నవలంబింపఁబడఁ జొచ్చెను. మూఁడవ భాగమున సంపూర్ణ ముగ నాంగ్లేయ పద్ధ తులే నెలకొలుపఁ బడియెను. ఆంగ్లేయ ప్రభుత్వము మైసూరు నందారంభమగు నప్పుడు “ కమిషనరుల క్రింది యుద్యోగస్థు లందఱును స్వదేశీయులుగ నుండవలెను. ప్రస్తుతముగల స్వదే శీయ స్థాపనలు తప్పక సాగించన లెను” అని గవర్నరు జనరలు గారి యాజ్ఞ. దాని ననుసరించి మొదట నేపని కైనను స్వదేశీ యులే నేమింపఁబడుచు వచ్చిరి. కాని పరిపాలనా పద్ధతి నంతయు మార్చవలసిన యవసరము గానవచ్చుటం బట్టి ఆయనుజ్ఞ నతి క్రమించవలసెను. స్వదేశీయులుగ నుండుచు వచ్చిన ఫౌజుదారు లను మండలాధికారుల స్థానములకు నలుగురు ఐరోపియనులు నేమింపఁబడిరి. తరువాతి క్రమక్రమముగ సహాయోద్యోగులును ఐరోపియనులే యగుచువచ్చిరి.1854వ సంనత్సరమున నాంగ్లేయ రాజ్యాంగముల ననుసరించి విద్యాశాఖయు (Public Instruction) నిర్మాణశాఖ (Public worlks) యు నేర్పఱుపఁ బడెను.

మొదటి కమిషనరులలో పేరుఁ గన్న వాఁడు 'కుబ్బను'. ఇతఁడు పన్ను వసూలు పద్ధతులను సంస్కరించి ప్రజలకు 'బాధ లేకుండఁ జేసెను. కుల్నాడు సీమలోఁ బ్రబలముగ నుండిన బానిస వ్యాపారమును రద్దు చేసెను. న్యాయవిచారణ విషయ '

మున జరుగుచుండిన దురాచారములను దొలఁగించెను. ఈరీతి. నీతని కాలమున మైసూరు జనులు శాంతి నందఁగలిగిరి. ఇతఁడు అనేకములగు చిల్లర పన్నులను త్రోసి వేసి 'నేలపన్ను నుగూడ తగ్గించినను వసూలు పద్ధతులలో చేసిన మార్పుల వలన మొదటి కంటే పన్నెక్కుడుకాఁగడంగెను. 1861వ సంవత్సరమున నితనికి వ్యాధి తటస్థించినందున పనికి రాజీనామానిచ్చి ఇంగ్లాండునకుఁ బయనమై పోవుచు సూయెజు వద్ద మృతి నందెను.

1862 వ సంవత్సరమున మైసూరు సంపూర్ణముగ నాంగే య పద్ధతుల ననుసరించి యే ఏలఁబడఁజొచ్చెను. సీమయంతయు మూఁడు డివిజనులుగను ఎనిమిది జిల్లాలుగను విభజింపఁబడెను.. డివిజనుల పై సూపరింటులును జిల్లాలపయి అసిస్టంటు సూపరింటు లును నేమింపఁబడిరి. ఆర్థికాంగము (Financial dept.) గొప్పసం స్కారములందెను. ఆదాయవ్యయగణన పత్రములును (బడ్జెట్టు లును) లెక్క తనికీలును (ఆడిట్టులును) ఉపయోగమునకుఁ గొని తేఁ బడెను. 1863 వ సంవత్సరమున సర్వే సెటలు మెంటులు ప్రారంభ మయ్యెను. నేలపన్ను 30 సంవత్సరములకొక పర్యాయము పరీ క్షింపబడు పద్ధతి యుపక్రమింపఁబడెను. ఇనాం కమిష నొకటి ఏర్పడెను. నీటి కాలువలును అడవులునుదగురీతిని అభివృద్ధి నందెను. న్యాయ తీర్మానాది కార్యములు పెరుగుచు వచ్చినందున జిల్లాలలో న్యాయాధి కారులు. నియమింపఁ బడిరి. విద్యాలయ ములు నెలకొల్పఁబడెను. (మ్యునిసిపాలిటీలు) గ్రామరక్షక .


సుఘములు ప్రారంభమాయెను. అంచె తపాలుపోయి నూతన తపాలా పద్ధతి నెగడెను. ఇట్లు ఆంగ్లేయ ప్రభువులచేఁ బరీ పాలింపఁబడు చుండు మండలములోనే యేవిశేషములు గలవో అవియెల్లయు మైసూరు నందుఁగాన నయ్యెను. కాని ఈ మార్పులు నలన మొదట చేసికొనిన నేమమును మాత్రము ఆంగ్లేయ ప్రభుత్వమువారు విడువనలసి వచ్చెను. వారు ఏషియను అధి కారులను అనేకులను నేమింపవలసిన వారైరి.

శ్యామ రాజేంద్ర ఒడయరు దత్తువ చ్చుట.

కృష్ణ రాజేంద్ర ఒడయరు ఆంగ్లేయధి కారులకు రాజ్యము నప్పగించిన తరువాత మూఁడు పర్యాయములు ప్రభు త్వము వారికి అర్జీ లిచ్చుకొని మఱల తన్ను రాజ్యమునకు నధికారి జేయవలసినదని వేసుకొనెను. ఆతఁడు కనుపఱచిన 'కారణములు మిక్కిలి యుక్తియుక్తములుగా నున్నవి. కానిఫల మేమియు లేదయ్యెను. 1866 న సంత్సరమునఁ బెట్టుకొనిన అర్జీలో దాను రాజ్యభారము వహించు నప్పటికి పదునా రేండ్ల పసివాఁడయినందునను దన విద్యాభ్యాసమునఁ గొంత స్వాతం త్ర్యా కాంక్ష ఆగ్లేయో పాధ్యాయుల నలన నే నేర్పఁబడినందు నను దాను అనుభవలోపమునఁ జేసి తప్పుత్రోవలఁ దొక్కి 'నది నిజమేయనియును, రానురాను దన యధీనమునుండి రాజ్యమును దొలఁగింపవలసి వచ్చుట ఆంగ్లేయులకుఁ దప్పకసంభ వించిన దేయనియును, కాని లోపములు దిద్దిన పిదపఁ దన్ను

మఱల రాజ్యాధిరూఢు. జేయకుండుట వ్యాధి గ్రస్తుఁడయిన నానిని రోగముకుదిరిన తరువాతఁ గూడ మంచమునకుఁ గట్టి పెట్టి నట్లున్నదనియును, తనకు రాజ్యము నిచ్చినది వైజామును ఆంగ్లే యులును నైనందున ఆంగ్లేయులు దన్ను శాశ్వతముగ పదభ్ర ష్టుం జేయుట అన్యాయమనియును ఒక వేళఁదనకు ఆంగ్లేయుల దయవలన మాత్రమే రాజ్యము చేకూరియున్నను ఆ ప్రభుత్వ మువారు ఇచ్చినది మఱల పుచ్చుకొనుట ధర్మవిరుద్ధమనియును వ్రాసి షంపెను. అందులోనె అతఁడు తాను దత్తు చేసికొనిన పుత్రుఁడగు శ్యామ రాజేంద్రఒడయరునకు ముందు రాజ్యము లభింపవలసి యుండుటను గుఱించియు మొఱ వెట్టి కొనెను. ఆంగ్లేయ ప్రభుత్వమువారి చేతు లోనికి మైసూరు పోయిన దాదిగ ఆసీమను మఱల స్వదేశీయ ప్రభువుల కప్పగింప పని లేదను వాద మొక్కటి వెలువడి యుండెను. కావున భరత ఖండమునందలి ఆంగ్లేయ ప్రభువులు కృష్ణ రాజ ఒడయరు దత్తు చేసికొనుటకుఁ గూడ నాటంకములు దెచ్చి పెట్టఁ బ్రయత్నిం చుచుండిరి. కాని విక్టోరియా మహారాష్ట్ర గారి ఉదార హృదయ మునకు మాత్ర మీపద్ధతి సరిపడినది కాదు. అందుచే నాయమ యొక్క ఇష్టమున కనుగుణముగ కృష్ణ రాజ ఒడయరుచే ద పుత్రుఁడుగ స్వీకరింపఁబడి యుండిన శ్యామరాజేంద్ర ఒడయ రును ఆంగ్లేయ ప్రభుత్వము వారు మైసూరునకు భవిష్యత్పరి పాలకుఁడుగ నొప్పుకొనిరి.


నాఁటినుండి శ్యామ రాజేంద్రుని విద్యాభ్యాసముప్రారంభింపఁ బడెను. ఆవిషయమును గూడ కృష్ణ రాజు ఒడయరు నకును స్థానికాం గ్లేయ ప్రభువులకును గొంత దూరము చర్చ జరిగెను. కాని కృష్ణ రాజ ఒడయరు అభిప్రాయమే. కడపట ఆమోదింపఁ బడెను. అయిన నతని చే శ్యామరా జేంద్రు నకు నుపాధ్యాయుఁడుగ నిర్ణయింపఁబడిన లెఫ్టనంటు కర్నలు హేయిన్సు అనునతఁడు 1869వ సంవత్సరమున రాజీనానూ నిచ్చెను. అతనికి దరువాత నతని స్థానమున ప్రసిద్ధచరిత్ర కారుఁడగు కర్నలు జి. బి. మాలిసను "నేమింపఁబడెను. అతనికి సహకారులుగఁ దరువాత దివానుపదమును సమర్థతతో నలం కరించిన రంగాచార్యులును, శ్యామురాజేంద్రుఁడు చదువుచుం డిన బడిలోని ప్రధానోపాధ్యాయుఁడగు జయ రామరావును నియమింపఁబడిరి. వీరును దరువాత మఱి కొందఱును గఱుప శ్యామరా జేంద్రుఁడు వలసిన జ్ఞానమును సమకూర్చు కొనెను. కృష్ణ 'రాజ ఒడయరు 1868లో నె మృతినొంది యుండెను. అప్పుడే శ్యామరా జేంద్రుఁడు పదునెనిమి దేండ్ల వయస్సు వాఁడయిన తోడనె అతఁడు విద్యాదికముల చే నర్హుఁడనితోఁచిన యెడల కొన్ని నిబంధనలతో సింహాసనమునకు రాగలఁడని ఆంగ్లేయ ప్రభుత్వము వారు చాటియుండిరి. "కావున యుక్తవయస్కు డయినపిదప 1885వ సంవత్సరమున శ్యామరా జేంద్ర ఒడయరున కాం గ్లేయులు మైసూరురాజ్య పరిపాలనము నిచ్చి వేసిరి.

అప్పు డేర్పడిన నిబంధనల ననుసరించి సాహాయ్య సైన్య వ్యయములకుగాను మైసూరు మహారాజు సంవత్సరమునకు ముప్పదియైదులక్షల ద్రవ్యము నిచ్చునట్లును, అతఁడు అంతః పరి పాలనక య్యు స్వసంరక్షణకయ్యు నియమించుకొను సైనికుల సంఖ్య గవర్నరుజనరలుగారి అనుమతి ననుసరించి తీర్చుకొన వలసినట్లును, అతఁడు పర రాష్ట్రములతో సంబంధములు కలి గించుకొనకుండు నట్లును, అన్ని విషయములందును గవర్నరు జనరలుగారి బోధనలను మహారాజు గమనింప వలసినట్లును, నిబంధనలను మించి అతఁడు ప్రవ ర్తించినచో నాంగ్లేయులకు రాజ్యము స్వాధీనమగునట్లును, దీర్మానింపఁ బడెను. ఇట్టికట్టు దిట్టములతో శ్యామరాజేంద్రుఁడు రాజ్య భారమును సహింపఁ బ్రారంభించు నప్పటికి మైసూరునకుఁ గొన్ని దురవస్థలు సంఘ టిల్లి యుండెను. ఏబది సంవత్సరము లాంగ్లేయులు ప్రభుత్వము నెఱపి సంస్కారముల నొనర్చి ఆదాయము నెక్కుడు చేసి యుండి రనుట సత్య మేకాని 1876వ సంవత్సరమున సంభవించిన మహా క్షామమువలన బొక్క సమున నిలువయుండిన రెండుకోట్లు అదృ శ్యమయి యుంటయే కాక ఆంగ్లేయులకు మైసూరు మహారాజు 80 లక్షల రూపాయలు అప్పుపడి యుండెను. రాజ్యములోని ప్రజలలో నైదవవంతు దుర్భిక్షమువాతఁ బడి మరణమంది యుండిరి. కావున శ్యామరా జేంద్రునకు మొదటి కర్తవ్యము ముందు క్షామములు రాకుండ నాపుటకు వలయు సదుపాయ

ముల నెనర్చుట యయియుండెను. అందువలన నతఁడు నీటి నసతుల 'నేర్పవచుట యందును రైలుమార్గముల నిర్మించుట యందును అత్యంత పరిశ్రమ సేయ కడఁగెను. అతనికా కార్య ముల నెల్ల సహాయుఁ డగుటకు నతనిచే దివానుగ నెన్ను కొనఁ బడియుండిన రంగాచార్యులకంటె నెక్కుడు సమర్థుఁ డెవ్వడు గలఁడు?

కృష్ణ రాజేంద్రుఁడు పరమపదమందిన వెంటనే అతని నగరునందలి ద్రవ్యరాసులను భూషణావళులను పరులు దోచు కొనకుండం గాచుట యందును, రాజభవన సేవక సమూహ మును సంస్కరించి ఉచిత భంగిని దీర్చుటయుదును, శ్యామ రాజేంద్రుని దత్తత నెదుర్కొని రాజ్యమపహరింప నే తెం చిన దురాతులను. విఫల మనోరధులుగఁ జేయుట యందును, సంపూర్ణ హృదయముతోఁ గార్యములు నెరవేర్చిన ఈరంగా చార్యులు అతనికిఁ దోడు నీడయయి నేటి మైసూరు సంస్థాన మందలి ఉత్తమ స్థాపన లన్ని టికీని విత్తునాటిన వాడని చెప్ప నచ్చును. శ్యామరా జేంద్రుఁడు సింహాసనము నెక్కుటతోడనే దివాను అధ్యక్షుడుగ మఱి ఇరువురు సభ్యులం జేర్చి యొక ఆలో చన సభ నేర్పఱచెను. వీరి కే చట్టముల నిర్మించు సధికారముగూడ నియ్యఁబడెను. రంగాచార్యులవారి కృషి చే కొలఁది కాలము లోనే మైసూరు ప్రతినిధి సభ ఏర్పడెను. దీనికిని దివానే అధ్య తుఁడయ్యెను. ఇందలి సభ్యులు మొదట మొదట మహారాజు

గారినలన నే నిర్వచింపఁ బడుచుండిరిగాని ఇప్పుడు ప్రజలకు నిర్వ చనశక్తు లియ్యఁబడినవి. ఇంతియగాక శ్యామ రాజేంద్రుని కాలమున బంగారు గనులఁ బనిచేయుట ప్రారంభింపఁ బడెను. . దానినలన మైసూరున కిప్పటి యాదాయము వరుబడి పద్దులలో ముఖ్యమగు పద్దుగ నెన్నఁ బడుచున్నది. మైసూరునందు స్త్రీ విద్యకుఁగూడ బ్రారంభము 1881వ సంవత్సరముననె. సంపాదన విషయమున నేమి, విద్యావిషయమున నేమి పరిపాలనా సంవి ధానముల విషయముల నేమి ఇట్లన్ని విధముల శ్యామరా జేం ద్రుఁడును రంగాచార్యులును మైసూరు రాజ్యమును దినదిన ప్రవర్ధమానముగఁ జేయగలుగు మార్గముల వెదకీ అవలంబిం చిరి. 1883 వ సంవత్సరమున రంగాచార్యులు మద్రాసునందు పరలోక ప్రాప్తిఁ జెందెను.

అతని స్థానమునకు స5'. కె. శేషాద్రి అయ్యరుగారు నియమింపఁబడిరి. ఇతఁడును రంగాచార్యుల పథమున నే రాజ్య పరిపాలన మొనర్చెను. ఈతని కాలమున ప్రతినిధి సభకును దాని కధ్యక్షుఁడుగ నుండుచువచ్చిన ఈతనికిని ఈవిధమగు ప్రతి స్థాపన యొక్క ప్రథమావస్థ యందును స్వాభావికమైన కొద్ది పాటి సంఘర్షణ దప్పినది కాదు. కాని ఇతఁడధికారము వహిం చిన పదునెనిమిది సంవత్సరములలో (1883-1901) నీ ప్రతినిధి సభ అనుభవ జ్ఞానముల సంపాదిం చె ననుటకుసందియము లేదు.

కృష్ణ రాజ ఒడయరు

శేషాద్రి అయ్యర్' దివానుగ నుండఁగ నె 1894వ సంవ త్సరాంతమున శ్యామరాజేంద్రుఁడు వైకుంఠ వాసి యయ్యెను. అప్పటికి అతని కుమారుఁడగు ప్రస్తుతపు మహారాజు కృష్ణ రాజు ఒడయరు పదిసంవత్సరముల బాలుఁడుగ నున్నందున వీగితల్లి పరిపాలకురాలుగ నేమింపఁ బడెను. ఆమెకు ఎప్పటియట్ల ఆలో చనసభ వారు, అనఁగా దివాను శేషాద్రి అయ్యరును మఱియిద్ద ఱు సభ్యులును, సహాయులుగ నుండిరి. 1901 వ సంవత్సరమున సర్ . పీ ఎన్. కృష్ణమూర్తి దివానయ్యెను. అతనికాలమున రాజు కీయోద్యోగస్థులకును మైసూరు ప్రతినిధి సభలోని సభ్యులకును పరస్పర విశ్వాసానురాగములు వృద్ధిపొండెను. 1902వ సంవ త్సరమున విద్యావంతుఁడును యుక్త వయస్కుఁడును నయి యుండిన కృష్ణ రాజ ఒడయరు లార్డుకర్జనుచే సింహాసనము నకుఁ బ్రక టింపఁ బడెను.

నాటినుండి యీమహా రాజు రాజ్యాంగ విషయములు జేసిన పరిశ్రమ మిక్కిలి యద్భతము. ఈతనికి మొదట సర్ పి. ఎన్. కృష్ణమూర్తియుఁ దరువాత.వి.పి. మాధవరావును దివానులుగ నుండిరి. ఇప్పటి దివాను . ఆనందరావు. వి. పి. మాధవరావు కాలమున శాసననిర్మాణసభ ప్రారంభమయ్యెను. అందు రాజుగారి ఆలోచన సభలోని మువ్వురు సభ్యులును జనులచే నిర్వచింపఁబడు నితర సభ్యులును గలరు. వీరు వివాహ

విషయములను బాలుర విషయములను ఇంకను ఇతర సాంఘి క విషయములను గూర్చిమిక్కిలి యుపయోగకరమగు కొన్ని శాసనముల నిర్మించి యున్నారు. 1906-1907లో ఇదేమాధవ రావుగారి కాలమున గ్రామిక విద్యాలయములలో బాలురకు బడి జీతములు పుచ్చుకొనక చదువు నేర్చుకొను నట్లు త్తరువయ్యెను. కావున నేఁడు మైసూరులో బాలురకు స్వదేశ భాష యందు ఉచి తముగ విద్యా దానము చేయఁబడుచున్నది. ఇటీవల మహా రాజు గారు తమ దేశముదలి చేతిపనులు మున్నగువానిని వృద్ధిపఱచు నుద్దేశముతోఁ బ్రజల సాయము లేక ఆపని సాగదనుటను జక్కం గ గురైరింగిన వారుగాన ప్రజలసంఘము నొక దానిని ఆర్థిక సభ యను పేర దమయాజమాన్యము క్రింద నెలకొల్పియున్నారు. దాని పరిశ్రమవలన మైనూరు భరతవర్షమున నున్న ఆ స్థానము నందగలదని కొందఱ కైనను దోఁచకతప్పదు. ఇట్టియూహ కెడమిచ్చు చిహ్నముల నేకములు ఇప్పుడే గానవచ్చుచున్నవి. స్త్రీ విద్యకై మైసూరు మహారాణిగారి కలాభవనము గాంచిన ప్రఖ్యాతి హిందూస్థానమునందలి మఱి యే స్త్రీవిద్యాలయమును గాంచియుండ లేదు. కొంత కాలము క్రిందట బెంగుళూరునందు జె. ఎన్. తాతాగారి యౌదార్యమువలన ప్రారంభింపఁబడిన అన్వేషణ విద్యాగారము (Research Institute) ఆసీమకంతటి కిని వన్నెఁ బెట్ట వేచియున్నది. దినదినమునకు సంఖ్యయందుఁబె పొందుచుండు యంత్రశాలలు ఆసీమ వెలుపటి ప్రాంతమునగల వారు ఆంగ్లేయసీమల ప్రజల కాశ్చర్యము గలిగించుచున్నవి. ఆర్థిక సభ జాగరూకులయి పట్టుదలతోఁ గార్యమునకు గడంగి నచో కృష్ణ రాజ ఒడయరు బహదూరుగారి మనోరథము సిద్ధించగలదు. దైవము సహాయుండగుగాక !

  1. విగ్రహములయందు మహిషుఁడు దున్నపోతు తలగలవాఁడుగఁ బ్రద ర్శింప బడుచున్నాఁడు.
  2. * వీరాంధ్రులు.
  3. ఆంధ్రశబ్దమున కుత్పత్తి నరియువారు మ. రా.. రా. శ్రీ. చిలుకూరి వీర భద్రరావు గారిచేవిరచితమయిన ఆంధ్రుల చరిత్ర పూర్వయుగమును జూచునది
  4. హిందూ మహాయుగము. మూఁడవ ప్రకరణము చూచునది.
  5. ఈ పేరును బట్టియే శాలివాహన శక మేర్పడినది.
  6. ఉత్తరకన్నడ జిల్లాకివి ప్రాచీన నామము.
  7. రాజతరంగణిం జూచునది
  8. ఇతని రాజధాని మహాబలిపురము.మహాబలుల కీదియ మొదటి రాజధానియే మొ?
  9. ఇది తిరుపతి వెంక టేశ్వర కవులచే రసవత్తరముగ తెలుగులోనికి, భాషాంతరము చేయఁబడి సరస్వతి పత్రిక యందు ముద్రింపఁబడిది.
  10. మంత్రి సంజ రాజు
  11. పిచిక్ అని యము.