Jump to content

చర్చ:వేమన పద్యాలు

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
విషయాన్ని చేర్చు
వికీసోర్స్ నుండి
తాజా వ్యాఖ్య: దింపుకొనే పుస్తకానికి మార్పులు టాపిక్‌లో 3 సంవత్సరాల క్రితం. రాసినది: Arjunaraocbot

సమగ్రంగా వేమన పద్యాలు చేర్చడం

[మార్చు]

వేమన పద్యాలు రెండు నుండి మూడు వేలుంటాయని పరిశోధకుల అంచనా. ప్రస్తుతం వేమన శతకము లోని పద్యాలను వికీపీడియా నుండి మాత్రం ఇక్కడికి కాపీ చేశాను. మీ దగ్గర సరయిన పద్యాలు ఉంటే, దీనిలో లేవని నిర్ధారణ చేసుకున్న తర్వాత మాత్రమే ఇందులో చేర్చండి.Rajasekhar1961 06:43, 19 జూలై 2007 (UTC)Reply

రాజశేఖర్ గారూ, వేమనపద్యాలు C P బ్రౌన్ సేకరణలలో 5000 కు పైనే ఉన్నాయి. వాటినుండి గొల్లపూడి వారి ప్రచురణలలొ 3250 పద్యాల వరకూ ప్రచురితమయ్యాయి.
మీ వద్ద 1300 పద్యాలు ఉన్నాయి అని అన్నారు. చాలా మంచి వార్త. తాత్పర్యములతో సహా ఉంటే ఇంకా బాగుండేది. అయినా పరవాలేదు. మీ వద్దనున్న పద్యాలను చేర్చండి. నా దగ్గర 1116 పద్యాలు తాత్పర్యములతో సహా ఉన్నాయి. తరువాత నేను తాత్పర్యములను చేరుస్తాను. కాని మీరు పద్యానికి ఒక పేజీ పెట్టవద్దు.
నా వద్ద ఉన్న పద్యాలు నేను చేర్చినవి కాక ఇంకా, కాలగతి - కర్మఫలములు, కులతత్వం, గురుతత్వం, చెణుకులు, తాత్వికత, డాంబికులు, పంచకైష్యములు, పరిణామ క్రమం, మూర్ఖులు, పరమలోభులు, విద్య, సాధకులు, స్త్రీ వర్గం, మోహావేశం, ధనమూల మిదం జగత్, గుణం, హితబోధలు, బయలు వేదాంతం, ప్రపంచ స్వభావ పద్ధతి, అనుబంధం, జన శృతి పద్యరత్నాలు, ఫలశృతి అని ఒకొక్క పేజీలో చేర్చవచ్చు. కాని తరువాత ఇతర పద్యాలు చేర్చవలసి వచ్చినప్పుడు అవి ఉన్నాయో లేదో చూడటం కష్టమవుతుంది.
అందువలన వేమన పద్యాలను అక్షర క్రమంలో అక్షరానికి ఒక పేజీ చొప్పున పెట్టి అందులో చేర్చండి. అప్పుడు ఎవరికైనా తెలిసిన పద్యాలను చేర్చడానికి కూడా అనుకూలంగా ఉంటుంది.
వైజాసత్య గారూ, మీ అబిప్రాయాన్ని కూడా తెలియచేయండి. అన్వేషి 04:52, 30 జూలై 2007 (UTC)Reply
నాకూ అర్ధంకాని విషయం. ఏంచేయాలో ఏమో? మిగిలిన వికీసోర్స్‌లు మనకొచ్చిన సమస్యలాంటి సమస్యను ఎదుర్కొన్నట్టు లేవు. ఎందుకంటే వికీ సోర్స్ లో ఒక ప్రచురించిన పుస్తకాన్ని యధాతధంగా మాతృక (అచ్చు పుస్తకం)లో ఏ పేజీలుంటే అదే విధంగా పేజీలవారిగా అమరుస్తారు. ఇలా సొంత అమరికలు చెయ్యలేదు. ఇలా గురుతత్వం కులతత్వం అంటూ విభజనలు చేస్తే డూప్లికేటు పద్యాలను వెతికిపట్టడం చాలా కష్టం ఒకే పద్యం ఒకటి రెండి విభాగాల్లో రావచ్చు. కాబట్టి మీరన్నట్టు కేవలం అక్షర క్రమంలో అక్షరానికి ఒక పేజీ చొప్పున అమరుద్దాం. --వైఙాసత్య 08:12, 30 జూలై 2007 (UTC)Reply
అక్షరక్రమంలో ఏర్పాటు చెయ్యడమే సరైన పద్ధతి. మరి ఇప్పటికే రెండు ప్రదేశాలలో వేమన పద్యాలున్నాయి. రెండింటిని ఒకే దగ్గర వేమన పద్యాలుంచం మంచిది. అక్షరక్రమంలో ఉన్నవాటిని అనుభవం ఉన్న మీలో ఎవరైనా చేస్తేబాగుంటుంది. ప్రతి పద్యానికి దాని మూలం (బ్రౌన్ లేదా గొల్లపూడి లేదా మరేదైనా) కూడా తెలిపితే బాగుంటుంది.Rajasekhar1961 08:42, 4 ఆగష్టు 2007 (UTC)

పుస్తక మూలం

[మార్చు]

అన్వేషి పై విభాగంలో పేర్కొన్నది, వ్యాసంలో తాత్పర్యం కల పద్యాలు గొల్లపూడి వీరాస్వామి సన్ పబ్లిషర్స్ & బుక్ సెల్లర్స్, 2006 లో ప్రచురించిన సి.పి.బ్రౌన్ సంకలనం వేమన పద్యరత్నాలు , లోనివి. వ్యాఖ్యాత డా॥పోచనపెద్ది వెంకట మురళీకృష్ణ. --అర్జున (చర్చ) 12:21, 31 మే 2021 (UTC)Reply

వేమన పద్యాలు/అ లాంటి వ్యాసాలలో కేవలం పద్యాలు మాత్రమే వున్నవి.--అర్జున (చర్చ) 12:24, 31 మే 2021 (UTC)Reply

దింపుకొనే పుస్తకానికి మార్పులు

[మార్చు]

దింపుకొనే పుస్తకానికి అవసరమైన మార్పులు చేశాను. --Arjunaraocbot (చర్చ) 11:08, 1 జూన్ 2021 (UTC)Reply