చర్చ:తెలుగు భాగవతము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

వికీసోర్స్ కి సరిపోవుట మరియు నకలు హక్కులు[మార్చు]

వికీసోర్స్ లో ఇప్పటివరకు ఇచ్చిన వివరణలు మూలములు బట్టి నాకు భాగవతాన్ని కంప్యూటర్ తో విశ్లేషించిన వివరాలు గల గ్రంథమని అర్థమైంది. అయితే ఇది ఇప్పటికే పుస్తక రూపంలో ముద్రించినట్లు తెలియలేదు. అలా కానట్లయితే వికీబుక్స్ లో వుంచడము మేలు. ఇంకొక ముఖ్యమైన విషయం నకలుహక్కులు. వికీ ప్రాజెక్టులలో చేర్చిన వివరమంతా ఏప్రయోజనానికైనా ఎవరైనా వాడుకోటానికి వీలువుంటుంది. దీనివనరులు CC-BY-NC-SA పరిమితిలో వున్నందున, ఆ లైెసెన్స్ మార్చుకుంటే తప్ప వికీలో వుంచుట మంచిది కాదు.--అర్జున (చర్చ) 05:49, 5 జూలై 2013 (UTC)

  • నమస్కారం అర్జున రావు గారు. మీరు చూపుతున్న శ్రద్దకు ధన్యవాదాలు.

ఇక్కడ పెట్టబడు 'తెలుగు భాగవతము' నా "భాగవతము గణనాధ్యాయము" అనే అధ్యయనంలో భాగం. దీనితో సహా ఈ గణనాధ్యాయంలోనివి "సిసి లైసెన్సు నాన్ కమర్షియల్, యూజ్ ఎలైక్ (CC-BY-NC-SA)" కింద ఉన్నాయి. ఈ తెలుగు భాగవతంతో పాటు నా గణనాధ్యాయ సంకలనాదులు "తెలుగుభాగవతం.కం" (telugubhagavatam.com) అనే జాలికలో ఈ CC-BY-NC-SA లైసెన్సు కిందనే ప్రచురింబబడుతున్నవి. ఈ లైసెన్సు వివరాలు తెలుగుభాగవతం.కం లో చూడవచ్చు [1]. తెలుగుభాగవతం.కం ఒక లాభాపేక్ష రహితమైన వ్యాపారాత్మకముకాని (non commercial, non profit oriented) సంస్థ. ఇప్పటివరకు పుస్తకరూపంలో ఏవి ప్రచురించలేదు. వికీ బుక్స్ లో ఎందుకు పెట్టమంటున్నారో దయచేసి విరించండి. నా జిమైలు విఎస్ రావు50. వేగరి (ఈమైలు) అయితే నేను వెంటనే చూడగలుగుతాను.

      • క్షమించాలి లింకు చూపుట రాలేదు. శ్రమ తీసుకోగలరు.
పై వ్యాఖ్య సాంబశివరావు గారు సంతకచేయకుండా రాశారు.
  • లింకు ఇంతకముందే చూసి అనుమానం వచ్చి వ్యాఖ్య వ్రాశాను. వికీలో వున్నవి ఎవరైనా మార్పులు చేయవచ్చు. ఎవరైనా దేనికైనా వాడుకోవచ్చు. మీరు వాణిజ్యపరమైన వాడుకకు అనుమతించలేదు కాబట్టి, మీ గ్రంథము ఇక్కడ చేర్చితే మీరే అనుమతించినట్లు అవుతుంది. ఇక వికీబుక్స్ లో ఎందుకు సలహా ఇచ్చానంటే, మీ పనిలో ఆసక్తి గల ఇతరులు సహకరించటానికి అభివృద్ధిచేయటానికి వీలుంటుంది. వికీసోర్స్ లో మూలరూపము మార్చకుండ భద్రపరచటమే విధానం. --అర్జున (చర్చ) 12:10, 6 జూలై 2013 (UTC)
  • మిత్రులు అర్జున రావు గారికి,

క్షంతవ్యుడను సంతకచేయలేదు. దీనికి తె నుండి ఇం కి మారటానికి బద్దకం కూడా కారణమే నండి. ధన్యవాదాలు. మీరు చూపిన శ్రద్ధకి, అభిమానానికి శతధన్యవాదసుమాలు. అందరికి అన్నిరకాలుగా అందుబాటులో ఉంచాలన్న ఉద్దేశ్యంతోనే వికీలో పెట్టా లనుకుంటున్నాం. వికి కాపీరైటు నిబంధనలు మాకు అంగీకారమేనండి. మీ సహృదయత వలన కాపీరైటు విషయంలో కొంత వివరం తెలిసింది, వికీ బుక్స్ తెలిసింది. భాగవత పాఠ్యంలో అక్షరదోషాలు దిద్దటం తప్పించి ఇతర అవసరాలు నాకు తెలిసి లేవండి. కనుక ఇప్పుడు వికీసోర్సులో పెడదాం. ఇక నా భాగవత గణనోపాఖ్యానానికి సహకరించటానికి ఎవరు ముందుకు రారు అని నమ్మకం ఏర్పడిందండి. ఏం చేస్తాం పోనీ లెండి. V Sambasiva Rao (చర్చ) 11:34, 9 జూలై 2013 (UTC)

  • మీ స్పందనకు ధన్యవాదాలు. పోతన భాగవతం పుస్తకం చేర్చడానికి కొన్ని ప్రయత్నాలు జరుగగా, వాటిని ఒక చోటికి తీసుకురావటానికి ప్రయత్నం శ్రీ మహాభాగవతము-మొదటి సంపుటము తో ప్రారంభమైంది. అదే మూలం మీరు వాడినట్లయితే ప్రత్యేకంగా పేజీలు సృష్టించకుండా ఆ కృషికి సహకరించండి. మీ మూలము వేరైనట్లయితే ప్రత్యేకంగా చేర్చవచ్చు. అవసరమైతే ఆ మూలం నుండి నకలు చేసి అతికించవచ్చు. గణనోపాఖ్యానంలో విశేషాలను పుస్తకం రూపంలో వెలువరించాలనుకుంటే వికీబుక్స్ లో వ్యాసాలు వ్రాసి ప్రయత్నించండి. ఉదాహరణకు నేను తయారు చేసిన ఉబుంటు వాడుకరి మార్గదర్శిని చూడండి. శ్రీమహాభాగవతము, తెలుగు భాగవతము మధ్య గందరగోళాన్ని నివారించడానికి, వీలైతే విలీనం లేకపోతే తెలుగు భాగవతము ను తగినట్లుగా పేరు మార్చితే మంచిది. --అర్జున (చర్చ) 03:48, 10 జూలై 2013 (UTC)
  • సాంబశివరావు గారు చొరవతో నాతో ఫోన్లో చర్చించినతరువాత తెలిసిన విషయాన్ని ఇక్కడ పొందు పరుస్తున్నాను. తెలుగు అకాడమీ వారి మహాభాగవతమునకు, సాంబశివరావు గారి సంకలనమునకు తేడాలుంటాయి. వారి గణాంకాల విశ్లేషణ వారు కూర్చిన పుస్తకానికి సంబంధించినవి మాత్రమే. వారి కూర్పు ప్రజలకు మరింత చేరువచేయటానికి వికీసోర్స్ లో వుంచాలనుకుంటున్నారు. అయితే వర్డ్ లేక ఎక్సెల్ ఫైళ్లలో వున్న సమాచారాన్ని లేక వారి వెబ్సైటు లో వున్న సమాచారాన్ని రూపం చెడకుండా వుండటానికి వికీ సింటాక్స్ వాడి ఎక్కించాలి. ఈపని విస్తృతి దృష్ట్యా బాట్ ద్వారా చేయడం మంచిది. దీనికి సంబంధించి సిఐఎస్ ఎ2కె ప్రోగ్రామ్ డైరెక్టర్ విష్ణువర్ధన్ తో సంప్రదించమని సలహా. ప్రస్తుతానికి వ్యాసం పేరు అలానే వుంచి పనిమొదలైనప్పడు తగిన పేరుకు మార్చితే మంచిది. --అర్జున (చర్చ) 09:00, 10 జూలై 2013 (UTC)

రాజ శేఖర్ గారికి, అయ్యా, (1) పోతన ఇతర రచనలు 3 అప్లోడు చేసా. కాని నారాయణ శతకం బమ్మెర పోతన పుటలో ఉంది, చూసుకోకుండా పెట్టాసా. అందుచేత వాడుకరి:వైజా సత్య గారికి కాని అర్జున గారికి కాని చెప్పి రెంటిలో ఒకటి తీసేయించండి. (2) కొన్ని లింకులు సరిగా పెట్టలేక పోయా, సరిచేసిపెట్టండి. (3) తెలుగు భాగవతం లోని భాగవతమ, భోగినీ దండకం, వీరభద్ర విడయాలకి లింకులు పోతన పుటలో పెట్టించండి, నాకు రాటం లేదు. అలాగే నారాయణ శతకం ఉంచిన దాని లింకులు తెలుగు భాగవతం, పోతన పుటలలో పెట్టించ పెట్టండి. Thanking you sir, in anticipation.V Sambasiva Rao (చర్చ) 15:42, 26 జూలై 2013 (UTC)