కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు/సత్యరాజా పూర్వదేశ యాత్రలు-ప్రథమభాగము-ఐదవ ప్రకరణము

వికీసోర్స్ నుండి

ప్రార్థించినందునను నాలుగు దినము లయినతరువాత యాధాప్రకారముగా వచ్చి నాకామె మరల విద్యచెప్పనారంభించినది. ఆ దినము మొదలుకొని యిఁక నేనామెతో మన దేశమును గూర్చి మాటాడకూడదని యొట్టుపెట్టుకొంటిని. అటు తరువాత జరిగిన వృత్తాంతమును మీకు ముందు ప్రకరణములయందుఁ జెప్పెదను.

ఐదవ ప్రకరణము

వెనుకఁజెప్పినట్లు మాకలహముతీఱి మేమిద్దఱమును సమాధానపడిన తరువాత మా ఫిండీగారికి నా మీఁద అపరమితానుగ్రహము వచ్చినది. ఆయనుగ్రహము వచ్చుటకు కారణము నేనామెకు పరమభక్తుఁడనయి మనదేశములో శిష్యులు గురువులకు శుశ్రూష చేయునట్లుగా సమస్తోపచారములను చేయుచు అనువర్తనముకలిగి మెలఁగుటయేకాని మఱియొకటికాదు. స్త్రీలయినను పురషులయినను విద్యచెప్పినవారు దైవసమానులు గనుక నేను స్త్రీకి దాస్యము చేయుచుంటినని మీరు నన్ను నిందింపక నాగురుభక్తికి మెచ్చుకొనవలెను. అదిపోనిండు. అటు తరవాత శిష్యవత్సలురాలైన యామె యాదేశజనుల యాచార వ్యవహారములు మొదలయిన వన్నియు నాకు మర్మము విడిచి చెప్ప మొదలు పెట్టెను. ఆమె యొకఁనాడు భోజనము చేసి కూరుచుండి యుత్సాహముతో తాంబూలచర్వణము చేయుచు కూరుచున్నప్పుడు నేనుపోయి గరువందనము చేసి చేతులు జోడించుకొని యెదుట నిలుచుండి భక్తిపూర్వకముగా నిట్లదిగితిని.

అమ్మా! మీరూ సర్వమును తెలిసినవారు. స్వభాముచేత పురుషులే యెక్కవ బలముగలవారో స్త్రీలే యెక్కువ బలముగలవారో మీ శిష్యునకు సెలవియ్యవలెను.

పురుషులే యధికబలము గలవారని యామె సెలవిఛ్ఛినది . అప్పుడు మాయిద్దరికిని సంభషణ మిట్లుజరిగినది.

అమ్మా! స్త్రీ పురుషులలో పురషులే అధిక బలవంతులని మీరుసెలవిఛ్ఛుచున్నారుగదా‽ అట్లయిన పక్షమున, ఈదేశములో బలాధికులయిన పురుషులు బలహీనురాండ్రయిన స్త్రీ లకులోఁబడుట యొట్లు సంభవించినది‽ నా యీసంశయము తీర్పవలెను.

ఓయివెర్రివాఁడ! నీవేమియుతెలియని మూఢుఁడవుగదా పురుషులు స్త్రీలకు లోఁబడవలెననుట యీశ్వరోద్దేశము– (ఈశ్వేరుఁడమని పుంలింగ ప్రయోగము చేసినందుకు చదువరులు నన్ను మన్నింపవలెను. ఆదేశమునందు దేవుఁడాఁవాఁడనియే ప్రసిద్దము.ఆమె యీశ్వరియని యథ౯మిఛ్ఛునట్లుగా స్త్రీ లింగమునే ప్రయోగించినను మీకు తెలియుటకై నేనే యీశ్వరుఁడనుచున్నాను.) ౼బలవంతులుగనుక పురుషులు పొటుపడి పనిచేయుటకు ను, పత్నీసేవచేయుటకును, తగినవారు. అంతేకాని వారుస్త్రీలవలె ఆలోచనతో చేరిన పనులు చేయుటకుఁగాని గ్రంథరచన చేయుటకుఁగాని స్వభావముచేతనే తగరు. పురుషులు బలాధికులే కానిపక్షమున౼౼

మా దేశములో పురుషులు ఆలోచనతో చేరిన పనులు చేయుచు కవిత్వము చెప్పుచున్నారే౼

మధ్య నామాటల కడ్డమురాక నేను చెప్పెడిది సాంతముగావిని నీసంశయము పోఁగొట్టుకో. మీది కేవల రాక్షస సృష్టి. అందుచేతనే (నీమాటలునమ్మెడు పక్షమున) మీ దేశములో సర్వమును దేవతాసృష్టీ యోన మాదేశమునకు విపరీతముగా నున్నది. ఆసంగతి పోనిమ్ము. పురుషులు బలాదికులే కానిపక్షమున వారు పత్నులకు వంటచేయుటకును ఉపచారములు చేయుటకును, బరువులు మో యుటకును, ఎట్లు సధు౯లగుదురు ? మా దేశములోకూడ నలుఁడు భీముఁడు మొదలయినవారు పాకము చేయుటలో పూర్వకాలమునందు బహు సమథు౯లు.

అట్లయిన పక్షమున మాదేశమువలెనే మీదేశము పూర్వకాలమునందు మంచిదయియుండి యిప్పుడు చెడిపోయియుండును. స్త్రీలు బలహీనురాం డ్రగుటయే దేవుఁడు వారు౼

అందుకు సందేహములేదు. పూర్వకాలమందువలేఁగాక మా దేశమిప్పుడుతప్పక చెడిపోయినది.

స్త్రీలు బలహీనురాండ్రగుటయే దేవుఁడు వారు పనిపాటులు చేయనక్కఱలేక సుఖముగాకూర్చుండి యలోచనచేయుచూ ప్రభుత్వము చేయవలయునని యుద్దేశించెననుట నీకు నిదర్శనముగాఁ గనఁబడుచుండలేదా‽ ఇంతమాత్రము తెలిసికోలేని పక్షమున నీవు చదివిన చదువుతో నేమి ప్రయోజనము‽ ఇందుచేతనే పురుషు లొకవేళ చదివినను బుద్దిసంపదలో స్త్రీలతో సమానులు కాఁజాలరని మాపెద్దలు సెలవిఛ్ఛియున్నారు. ఇటువంటి మందబుద్దివగుట చేతనే బలవంతులయిన పురషులు బలహీనలయిన స్త్రీల కేల యడఁగియున్నారని నీకు సందేహము కలిగినది.

అవును. ఆ సందేహమును మీరు ముందుగాతీర్చి నన్ను ధన్యుని చేయవలెను.

స్త్రీలు బుద్దిబలముగలవారు. దేహబల మెంతయున్నను బుద్ది బలమునకు చాలదు. అందుచేతనే పురుషులు స్త్రీలకులోఁబడుట సంభవించినది.కేవల శరీరబలము గలవారయిన పురషులు బుద్దిబలము గలవారయిన స్త్రీలకు లోఁబడుట స్వభావముకాదా‽ ఈమాత్రపు స్వల్పాంశము నీకు తెలిసినదికాదు. ఇదే స్త్రీ బుద్దికిని పురుషబుద్దికిని గల తారతమ్యమ్యము . పురుషులు స్త్రీలకు లోఁబడియుండుట కింకొక రహస్యముకూడానున్నది. ఆడుమళయాళము

ఆరహస్యము కూడ నాకు సెలవిచ్చి మూఢుఁడనయిన నన్ను కృతాధుకాని చేయవలెను. మీశఘ@ండ నయినతరువత నాకు తెలియనివిషయ ముందఁగూడదు.

ఆది పరమరహస్యమముమే యయినను భక్తిశ్ర్యద్దలు కలవాఁదవగుట చేత నికుమర్మమువిడిచి చేప్పెడను. స్రిలు పురుషులమీఁద నధికారము చిఅల్లించఁ గలుగుటకు ప్రధానకారనము మంంత్రబలము , ఎంత బలవంతుననై నను లోఁబఱచుకొని దాసునిజేసిక్కుక్కవలె ఆడింపఁగలశక్తి మావద్దనునది.

ఆదిసత్యము, ఆశక్తి స్రిలవద్ద తప్పక యున్నది. సర్వ స్వతం త్రులమని చేప్పకొనుచున్న మాదేశమునందు సహితము పురుషులు స్త్రీలకు దాసులయి వారు చెప్పినట్లే నడుచుచున్నారు . సంస్కారకత౯ల మని పేరుపెట్టుకొని సభలలో పులులవలే నఱచెడు మాదేశమునందలి నవ నాగరిక పురుషులు కూడా పౌరుషహీను లయి ఇంటివద్ద భర్యలముందు నోరెత్తలేక పిల్లులవలే నొదిగొయుండి తాముచెప్పినట్లు భార్యలను నడిపింపలేక భార్యలు చెప్పినట్లె తాము నడుచుకొనుచున్నారు.

ఆలాగుననా? ఈమాట యింతకుముం దెప్పుడును చెప్పినావుకావేమి ? మిదేశమునందు పురుషులు స్వతంత్రులన్న నేనేమోయనుకొన్నాను. ఇప్పుడు నిజముతెలిసిపోయినది. మొదటినుండియు నీ మాటలయందు నాకెప్పుడును నమ్మకములేదు. నాదేశమునందువలెనే మీదేశమునందున పురుషులే స్త్రీలకు లోఁబడియున్నారు. మేమే స్వతంత్రులమని పయి కెవ్వరెన్ని వేషములు వేసినాను , ఈశ్వర సంకల్పమున కెన్నఁడయిన బికల్లము కలుగునా? ఈనవనాగరికుల మూలమున మాదేశవిప్పుడు కొంతకొంత చెడిపోవుచున్నది. ఇప్పటిపురుషులకు. సత్యరాజాపూర్వదేశ యాత్రలు

పూర్వపు పత్నీభక్తీ తగ్గు చున్నది. స్త్రీలిప్పుడు పురుషుల మటలే విసమొదలుపెట్టినారు.

ఈకడపట చెప్పన వాక్యములచేత నాకు కొంతసంతోషముకలిగింది. ఇక్కడ కూడ స్త్రీ లిప్పుడు పురుషుల మాటలనే , వినుచున్నారు గదా? వినుటయో స్వభావసిద్దము; వినకుండుటయే స్వభావవిరుద్దము. ఈయాలోచలన్నియు నామనస్సులో పుట్టినను, ఆమమే మనస్సు నోచ్చునని నేను పయికవలేను . ఈప్రసంగ మయిన తరువాత నేనామెకు భక్తతో నమస్కారించి నాకామంత్రముల నుపదేసింపక తప్పదని పాదములమిఁదపడి లేచినాడనుగాను. అప్పుడుపదేశీంచుటకు సమయము కానందున మరియొకప్పుడుపదేశీంచెదని చెప్పి, కొన్ని దినములయిన తరువాత నేనుమూఁడు వవాసముచేసి స్నానముచేసి ళుచినయి యమా వాస్యనాడు ప్రాత౯కాలమున పోయి సందర్సనము చెసికొని పాదప్రణామము చేయఁగా నాకామె వశీకరణ మంత్రము మొదలైన మహా మంత్రములను పెక్కింటిని ఉపదేశించినది. ఆమెనాతొచెప్పకపోయినను నేనీమంత్రములను మనదేశపు స్త్రీలకు చెప్పుదునను భ్రమతో నాకామె మఱి౦త ప్రీతి పూర్వకముగా నుపదేశించినట్టు నేను కనిపెట్టినాను. కాని నేనట్టిపని యెన్నడైనను చేయుదునా? ఈమంత్రముల నిందు ప్రకటించి మీకుపదేశించి యుందునుగాని , ప్రచురపఱిచిన పక్షమున స్త్రీలుకూడ గ్రహించి యీదేశమునందువలెనే మనదేశము నందుగూడా వారు పురుషులను తమకు దాసునులుగాఁ జేసికొందురేమోయను భయముచేత నేనిందు ప్రకటింప సాహసింపకున్నాను. ఓహిందూమహాజనులారా  ! దీనినిబట్టి నాకు మీయందనురాగము తక్కువపడినదని మీరెంచబోకుడు. నాదగ్గరకువచిన పక్షమున స్త్రీలకు చెప్పమని మీచేత ప్రమాణములు చేయించుకొని మంత్రసిద్దికొరకు మీవలన గురుదక్షిణలను స్వీకరించి మీకొక్కరికే సర్వ. ఆడుమళయాళము

మంత్రమలను ప్రయెాగోపసంహారములహతోను అంగన్యాస కరన్యాసములతోను రహస్యముగా నుపదేశించెదను.

అటు తరువాత మంచి పాండిత్యము సంపాదించె మాయజమాను రాలిగారి కోరికప్రకారముగా నేను పాఠశాలయందు ప్రవేసించాను. మఱియొక పురుషుఁడు కూడా పాఠశాలయందు చేరి నాకు సహపాఠియయి మిత్రుఁడయినాఁడు. మేమిద్దఱమును రహస్యముగానాలోచించుకొని యాదేశమునందలి పురుషుల కెలాగునైనను స్వతంత్రత్వము కలుఁజేయుటకు సర్వవిధములు ప్రయత్నము చేయవలెనని యొవ్వరికిని దెలియకుండ మాలోమేము ప్రమాణములు చేసికొన్నాము. స్త్రీలను లోఁబఱుచుకొనెడు నులభోపాయము నాకు తెలియును గనుక, మన కొక్కోకమునంగుఁ జెప్పబడిన "ఓం–కృష్ణాంగి–కృష్ణ ముఖ–పుష్పందాస్యామి– వశ్యమానయది–నభవతి–బ్రహ్మరుద్రాభవతి–స్వాహ్స్" అను పశీకరణ మంత్రము నేనాతనికి గురుదక్షింఅలేకుండ నుపదేశించి , దీనిని పదిలక్షలు జపించి పునశ్చరణచేసి తెల్లని పువ్వులు మంత్రించి స్త్రీలమీఁద చల్లవలెనని చెప్పినాను · గురుదక్షిణ లేకపోవుటచేత కాఁబోలను  ! ఈ మంత్ర మంతగా పనిచేసినదికాదు ·ఎట్లయినను మనమంత్రము లదేశపు మంత్రనులకు చాలవు . అందుచేతనే మనవారు మళయాళమంత్రములని గొప్పగా చెప్పుదురు. నేను పాఠశాలలో ప్రవేసించినది మొదలుకొని జరిగిన విశేషములను తెలుపుటకు ముందుగా దేశస్తుల యాచార వ్యవహారములను గూర్చి కొంత చెప్పుట యుక్తమని తలఁచు చున్నాను.

ఆ దేశమునందు స్త్రీలే సర్వస్వతంత్రురాండ్రనియు , పురుషులు వారి కాజ్ఞానువర్తులయి మెలఁగవలసిన వారనియు , నేనీవఱకే చెప్పియున్నాను . మన దేశమునందాఁడువారికి వలెనే యాదేశమునందు మగవారికి విద్యచెప్పింపరు . మనదేశము నందలి భోగస్త్రీలవలె నాదే . సత్యరాజాపూర్వదేశయాత్రలు

శకమునందు భోగపురుఘులయాత్ర మల్పవిద్య అభ్యసింతురుగాని అవి వారివ్రుత్తికి అనుకూలముగ వుండెను .మగవారిని చదువుకొండని చెప్పినచొ గొప్ప తప్పిదముగ నెంచి వారు కొపపడి ఘొరపపమును జేయుడన్నవానిని తిట్టునట్లు తిట్టుదురు. విద్య లేకపోవుట చెతనో మరి యేహేతువుచేతనొ ఆ దెసము నందు మగవరికి నగలయందానికి మన స్త్రిల కొంటెను విశేషముగ వుండెను.అక్కడ స్త్రిలకు నగలు అంతగ వుండవు.నగల నిమిత్తమె కాకపపొయిన పక్షమున పురుఘులకు మీసములను గడ్డములను భగవంతుడె కలిగించెనని యచ్ఛటి వారడుగుదుత్,

ఆడుమళ యాళము

తెచ్చినాను. విరూపు లగుటచేతనో యేమోకాని యీముక్కిడి పురుషులయం దక్కడ వ్యభిచార మెంతమాత్రమును గానబడదు. అట్లు లేకపోవుట కీనాసికా ఛేదనమే కారణ మగుట సందేహములేదు. పురుషులకు చేయుటచేత నిది దురాచారమయినను స్త్రీల విషయమయి జరిగించిన పక్షమున తప్పక సదాచారమే యగును. మన విత్ంతువుల కిట్లు ముక్కు కోసిన పక్షమున వారిలో వ్యభిచారము సమూలముగా నశించుననుటకు సందేహముండదు. ఇటువంటి సదాచారము మనస్మృతులలో నెక్కడ నైనను జెప్పబడి యాండకపోదు కాబట్టి యీయాచారమును మనము మనదేశమునందు తప్పక నెలకొల్పవలయును. నేను ధర్మశాస్త్రములను వదకి దీని కధారముగా కారిక నెందయినను కనిపెట్టెదను. యిప్పుడున్న స్మృతులలో దీని కాధార మొక వేళ దొరకపోయినను భిలస్మృతులయందయినను తప్పక యుండును గాని యుండకపోదు. ధర్మజ్ఞసమయముక్కొడా ప్రయాణమేగనుక మన పండితులందఱును వెంటనే సభచేసి శీఘ్రముగా నిట్టినిబంధనము నొక దాని నేర్పఱుప వయును.

ఆ దేశమునందు సహితము మనదేశామునందు వలెనే పత్నులు వయస్సున చిన్నవారుగాను, భతలు పెద్దవరుగాను ఉందురు. ఇష్ట మున్న యెడల స్త్రీ యనేక భర్తలను చేసికొనవచ్చునుగాని సంస్ధానాధీశ్వరులలో దక్క సాధారణముగా స్త్రీ లొక్కొక్క భర్తలతోనే తృప్తి పొందియుందురు. భర్తలు పుట్టునిండ్లకు వెళ్ళినప్పుడును, రోగాదికముచేత నశక్తులయి యుండి నప్పుడును, స్త్రీలు కామతురలయియున్న వారు భోగపురుషులుతొద్దకు పోదురు. పయి కారణములు రెండును లేక పోయినను ధనవంతురండ్రయిన స్త్రీలు భోగపురుషుల నుంచు కొందరు. ఈ భోగపురుషు లుగ్గుపాలనాటి నుండియు స్త్రీలను వలపించి తమవలలలో బడవేయదగిన వద్యలనభ్యసింతురు. హృదయరంజకమ సత్యరాపూర్వదేశ యాత్రలు

యిన సంగీతము వారికడానే యుండుటాచేత సంగీతము పాడంరనేర్చిన కుల పురుషునిగాని స్త్రీనిగాని మిక్కిలి నీచముగాజూతురు. సంగీతము వృత్తిగాగల కుల స్త్రీలను పంక్త భోజనములకు రానియ్యరు. కామోద్రేకమును గలిగించెడు శ్రావ్యములైన పాటలను, సరసోక్తులను, వశ్యౌషధములను, వశీకరణములను, నేర్చుకొని భోగపురుషులు గడ్డములను మీసములను తలను దువ్వుకొని నానా విధములయిన యాభరణములతోను పుష్పములతోను శరీరము లలంకరించుకొని, చిత్రవణములుగల వత్రములను ధరించి, మొగములకు తళుకుతళుకు మనెడు వణమేదోవేసికొని, అత్తరుమొదలైన సుగంధద్రవ్యములను పూసికొని , తమ మేనితావుల వీధుల గుబులుకొనగా దీపములు పెట్టిన తరువాత రూపమునుధరిం చిన గృహదేవత లనునట్లుగా దీపములవెలుతురున తళుకుతళుక్కున మెఱయుచు, దారినిపోవు యువతుల హృదయములు సంచలించునట్లుగా ప్రతిదినమును తమగుమ్మములయో నిలుచుంది స్త్రీలు తారసించునప్పుడెల్లను సిగ్గుపడి లోపలికిపోయి తలిపిలచాటునుండి మొగమీవలికిపెట్టి తొంగితొంగి చూచుచుందురు. అటువంటి సౌందర్యముగల పురుషులు మనదేశమునందులేరు. మణులుచెక్కిన బంగరు బొమ్మవలవలె నిలువబడి భూమికి దిగిన మెఱుపుతీగవలె వారు దీపమువెలుతురున మెఱయుచున్నపూడు నావంటి పూరుషులకు సహితము పోయి పయినుబడి కౌగలింప వలెనని బుద్ధిపుట్టుచున్నప్పుదు యువతులు వారినిమోపించి వారివలలోబడుట యేమియశ్చర్యము ? య్రబదియేండ్లు దాటినవారు సహితము తెల్లపడిన వెండ్రుకలకు నల్లరంగువేసికొని యలంకరించుకొని పదునాఱేండ్లు బాలకుమారులవలే గానబడుదురు. అయినను మనదేశమునందు వివాహములు మొదలయిన శుభ ఆడుమళ యాళము

కార్యములలో వేశ్యలను పాటలకు పిలుచునట్లగా వీరిని శుభకార్యములకు పిలువరు. మన దేవదాసులవలెవీరు దేవాలయముల యందును గానరారు. గృహదేవతలవలె నుండెదు వీరికి గృహములే దేవాలయములు, వీరే యందుండెడు దేవతలు. ఈదేవతాస్ందర్శనము నిమిత్తమయియే ధనవంతురాండ్రయిన స్త్రీలు వాఋఈ యాలయ మలకు బోయి తమదేహములను విత్తములను వారికి సమర్పించి వారిప్రసాదమును వేడుచుందురు. దేవతాభక్తిగలవారు ధనాదులయందు వైరాగ్యముగలవా రగునట్లే యీదేవతలను సదా సేవించువారును నిస్పృహత్వముచేత ధనముకొల్ల పెట్టి తాము జొగులగుదురు. మనదేవతలకువలెనే యిభోగదేవతలకును పరభార్యలయందే సంతానప్రాప్తి. అయినను మనదేవతలకువలె అమృతత్వములేనివీరికి వంశాభివృద్ధి యెట్లో నాకు తెలిసినదికాదు. విశేషవిత్తమిచ్చి బీదల చక్కని బిడ్డలను గొని వీరు వాఅరిని చిన్నప్పటినుండియు భ్రమరకీట న్యాయముచేత మర్త్యత్వము నుండి దేవతాతత్వమునకు లేవదీయురట !


అక్కడ హితము వివాహములకు కన్యావరులయిష్ట మక్కఱలేదు. తల్లిదండ్రులే ముఖ్యముగా తల్లులే కన్యావరణము చేయుదురు. పురుషులు యుక్తవయస్సు వచ్చినతరువాత వవాహముచేసెడు పక్షమున కురూపిణు లయిన పత్నులను చేసికొన కంగీకరింపక తల్లిదండ్రులు చెప్పినమాటవినక తరస్కరింతురు గనుక పురుషులకు గురుధిక్కారదోషము కలుగకుండ జేయుటకయి చిన్నతనము లోనే వివాహములుచేయు సదాచారమును వారిధర్మశాస్త్రములు విధించుచున్నవని చెప్పుదురు. వారిధర్మశాస్త్రములబట్టి స్త్రీకి పదునాఱు సంవత్సరములకు లోపలగర్భాధానము చేయకూడదు. పదునెనిమిదవ సంవత్సరమునందు చేయుటా శ్రేష్ఠము. గర్భాధానము నాటికి పురుషున కిర్య్వది సంవత్సరముల వయస్సుండవలేను. పదునాఱేండ్ల ప్రాయముననే స్రీకి సత్యరాజాపూర్వదేశా యాత్రలు

గర్భాఅధానము చేసినను పురుషునకప్పటి కిరివది స్ంవత్సరముల యిడుండవలెను గనుక , సాధారణాముగా పత్నికంటె భర్త నాలుగు సంవత్సరములు పెద్ద వాడుగానుం డవలెను. రెండవ పెండ్లి స్త్రీ కీనియమము లేదు . అప్పుడు భర్త యెంత చిన్న వాడుగానయిన నుండవచ్చును. అయినను పురుషున కిరువది సంవత్సరములు వచ్చువఱకును మాత్రము పునస్సందానము చేయగూడదు. అందుచేత పురుషులెదిగి శాపురమునకు వచ్చు వ ఱకు స్త్రీలిష్టమున్న యెడల భోగపురుషుల నుంచుకోవచ్చును. పురుషునకు పండ్రెండవ యేడుమొదలుకొని పదునాఱవయేడువచ్చు లోపల వివాహము చేయుదురు. భార్యలకన్న భర్తలు పెద్దవారుగా నుండవలిసిన ందుకు వారనేక కారణములు చెప్పుదురు. అందొక కారణము పురుషులకంటే ముందుగా స్త్రీలకు యుక్త వయస్సు వచ్చుట . స్త్రీలకు యుక్తవయస్సు వేగిరముగ వచ్చుటయే పురుషులకంటే స్త్రీలు శ్రేష్ఠురాండ్రగుటకు గొప్పనిదర్శనమనివ్వరు చెప్పుదురు. భర్తలు భార్యల కంటే పెద్దవారుగా నుండవలెననుట కింకకారణము పత్ను లెదిగిన తరువాత కనిపెట్టు కొని యుండ కుండుటకును, పురుషులు పత్నీ సేవ చేయిటకు సమర్ధులుగా నుండుటకు అని యీవఱకే చెప్పబడినది. అక్కడ వంటాచేయవలసిన వారు పురుషులేననియు నీవఱకే చెప్పబడినది. మనదేశామునందువలె స్త్రీలు వంటచేసెడు పక్షమున, వాఅరు గర్భిణులయి ప్రసవించిన సమయములు మొదలయిన వానియందు వుఘ్నము కలిగి చిక్కులు కలిగునుగనుక, అటువంటి ఆటంకములు కలుగకుండుట కయి భగవంతుడే పురుషులను పాకము చేయు వారినిగా నిర్మించెనని వారు వాదింతురు.

మనదేశము నందు స్త్రీలకు రాణీవాసమున్నట్లే యాదేశామునందు పురుషులకును గలదు. మనదేశమునం దట్టియాచారము లేకపోవుటచేత దానుకేమని పేరు పెట్ట వలయునో నాకు తెలియకున్నది. రంఢీభాష

ఆడుమళ యాళము

యందు దానికి "ఘోఢా" యని పేరు. అది మనదెశమునందలి ఘోషాపదములతో సమానమయినది. ఒక వేళ నది ఘోషాశద్దభవమై యుండును. వర్ణ వ్యత్యయవిధిని బట్టి తద్భవమునందు"షా" కు డా" రావచ్చును. దానిని నేను రాణివాసమునకు ప్రతిగ రాజవాసమని పిలిచెదను. మనదేశామునందలి స్త్రీలకు వలె రాణివాసము పండ్రేండవ యేట నారంభము గాక యా దేశము నందు పురుషులకు రాజవాసము పదునాఱవ యేట నారంభమగును. అక్కడి రాజవాసము మనరాణి వాసమువలె గాక మిక్కిలి విచిత్రమయినదిగా నుండును. సంస్ధానాధీశ్వరులును ధనికురాండ్రును మనమిక్కడ ధనమును మిత్తము చేయించినట్టుగా పెద్దయినుపపెట్టెలను చేయింతురు. ఒక్కొక్క పెట్టెయెత్తు ఏడదుగుల ఆఱంగుళములు; నిడివి యేడడుగుల మూడ్మ గుళములు వెడల్పు నాలుగడుగుల రెండంగుళములు. చుట్టును అమర్చిన యినుప రేకుదళసరి ముప్పాతిక అంగుళము. దానితలుపు రెండడుగుల వెడల్పును నాలుగడుగులఎత్తును కలదిగానుండును. ఈపెట్టెకు గాలివచ్చుటకును వెలుతురు వచ్చుటకును రెండువైపులను గోడలకు అడుగు చతురము గల రెండుగవాక్షములుండి వానికడ్డముగా ఇనుపకమ్ములు వేయబడి యుండును. ఈ రాజవాసమునందు పదునాఱు సంవత్సరములు వచ్చినది మొదలుకొని భాగ్యవంతుల పురుషులు పగలెల్లను నిర్బంధింప బడుదురు. ప్రాతఃకాలమున స్త్రీల భోజనము లగునప్పటికి తొమ్మిదిగంటలగును. తరువాత పదిగంటలకు లోపలభర్తల భొజనములు అగును . భర్తల భోజనములు కాగానే పత్నులు తమపురుషులను పయిన వర్ణింపబడిన రాజగృహముల యందు బెట్టితాళమువేసి తాళముచెవి తమయొద్దనుంచు కొని రాజకీయ కార్యస్ధానములు మొదలయినవానికి బోవుదురు. వారు మరల సాయంకాల మయిదుగంటల కింటికి వచ్చి తాళముతీయగా సత్యరాజాపూర్వ దేశ యాత్రలు

పురుషు లీవలకువచ్చి వంట మొదలయి నపనులు చేయుదురు. దీనిని బట్టి యినుపుగదులలో పురుషులు పగలెల్లను సోమరులయి హాయిగా మహారాజులవలె నిద్రపోదురని మీరనుకొందురేమో మీయూహ సరియైనది కాదు. పరుండుటకాగదిలో రెండడుగుల వెడల్పును అయిదడుగుల పొడుగునుగల మంచ మొకటియున్నను, అందులోనే పిండి మొదలయినవి విసరుటకు తిరుగండ్లును కూరలుతరుగుటకు కత్తిపీటలను తక్కిన పనులు చేయుటకు తగిన సాధన సామాగ్రియు నుండును గనుక వారందు లోనే పనిపాటులుచేసి కావలిసినప్పుడు మంచముమీద వెన్ను వాల్తురు. ఈ యాచారముచేత రంఢీ దేశామునందు కుల పురుషులలో వ్యభిచారమన్న మాట లేదు. స్త్రీలకెప్పుడును పురుషుల మీద అనుమానము విస్తారమగుట చేత ఈపురుషుల మీదకూడ దోషారోపణములు చేయుదురు గాని నేను చూచినంతవఱకు పురుషుల కొక్కరికిని గర్భములు రాకపోవుటచత నేను వారిమాటలు నమ్మను. ఈపెట్టెలను చేయు స్త్రీలు మాఱుతాళము చెవులను చేసి తమయొద్దనుంచుకొని విశేషధనమును స్వీకరించి ధనికురాండ్రయిన యితర స్త్రీల కమ్ముదురురనియు, అందు మూలమున వ్యభిచారముజరుగుననియు అసూయగలవారు లేనినిందలు కట్టుదురు. ఇనుపపెట్టెలను కొనుటకు శక్తిలేనివారిరీతిగా కఱ్ఱపెట్టెలను చెయింతురు. అందుకును సమర్ధులుకాని వారుతమపతులను గదులలోనే పెట్టి తాళముచేసి దానితోనే తృప్తిపొందియుందురు. ఈ యాచారమును మనముతప్పక మనదేశములోకూడ స్ధాపింపవలెను . అనుభవజ్ఞుడైన నామాటవిని మీరీ పెట్టెల పద్దతిని మనదేశములో వ్యాపింపజేసి స్త్రీలనందుంచి తాళమువేయుచు వచ్చినపక్షమున, అత్యల్ప కాలములోనే మనభరతక్గండమునందు జారత్వము రూపుమాసి పోయి మనదేశమ్,ఉ మహాపవిత్రమయినదగును. ఉత్తర ప్రత్యుత్తరములు జరుపుటకువీలుగలుగునుగనుక మనపెట్టెలకు మాత్రము గవాక్షములుం డనియ్యగూడదు. మనదెశమునందు పెట్టెలుచేయువారు పురుషులగుట చేత తాళము చెవులవిషయమయి యీదేశములో స్త్రీలు జరుపుదురను మోసపు పనులు మనదేశములో నుండవు. అంతేకాక యీపెట్టికానిర్మాణమువలన స్త్రీలకు మానరక్షణము కలుగుటయే కాక కమ్మరులకును వడ్రంగులకును క్రొత్తజీవనాధారము కలిగి దేశము భాగ్యసంపన్న మగును. కాబట్తి సాహితోపదేశమును మీరశ్రద్ధ చేయబోకుడు. నా దేశాటనమువలన గదా భరతఖండమున కీమహోపకారము కలుగుచున్నది ! దేశాటనము బహులాభప్రదమని పెద్దలన్నమాట వ్యర్ధ మగునా ?

పురుషులకు నలువది సంవత్సరములు దాటగానే రాజవాస బంధవిమోచనమగును. ఈనిర్బంధము వితంతుపురుషులకు సహితముండదు. అందుచేత పురుషులు స్వేచ్ఛగానుందుటకయి పత్నులకు విష ప్రయోగములుచేసియుందురుగాని, వితంతువులుకాగానే ముక్కుకో యుదురన్న భయముచేత నట్టిపనికి సాహసిమ పక వారు పత్నీభక్తికలవారయి యుందురు.

ఆఱవ ప్రకరణము

నాయజమానురాలైన ఫాంఢీభంగీగారు విద్వాంసురాలైన భాంగీఫింఢీగారిని నియమించి నా కింట విద్యచెప్పించుటయు, రంఢీ భాషలో నేను తగినంత పాండిత్యమును సంపాదించినతరువాత దొరతనమువారు క్రొత్తగాస్ధాపించిన పురుష పాఠశాలకు నన్ను పంపుటయు అక్కడ సహపాఠియగు మఱియొక పురుషునితో నాకు మైత్రికలుగుటయు మీకీవరకే తెలిపియున్నాను గదా ? మేమిరువురును తప్ప మఱియెవ్వరును పురుషు లాపాఠశాలలో చేర లేదు. మాకుపాధ్యాయుడుగా నియమింపబడిన జాతిపురుషుని పేరు చామర్జీ . అతడు