Jump to content

కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు/సత్యరాజా పూర్వదేశ యాత్రలు-ప్రథమభాగము-ఆఱవ ప్రకరణము

వికీసోర్స్ నుండి

డనియ్యగూడదు. మనదెశమునందు పెట్టెలుచేయువారు పురుషులగుట చేత తాళము చెవులవిషయమయి యీదేశములో స్త్రీలు జరుపుదురను మోసపు పనులు మనదేశములో నుండవు. అంతేకాక యీపెట్టికానిర్మాణమువలన స్త్రీలకు మానరక్షణము కలుగుటయే కాక కమ్మరులకును వడ్రంగులకును క్రొత్తజీవనాధారము కలిగి దేశము భాగ్యసంపన్న మగును. కాబట్తి సాహితోపదేశమును మీరశ్రద్ధ చేయబోకుడు. నా దేశాటనమువలన గదా భరతఖండమున కీమహోపకారము కలుగుచున్నది ! దేశాటనము బహులాభప్రదమని పెద్దలన్నమాట వ్యర్ధ మగునా ?

పురుషులకు నలువది సంవత్సరములు దాటగానే రాజవాస బంధవిమోచనమగును. ఈనిర్బంధము వితంతుపురుషులకు సహితముండదు. అందుచేత పురుషులు స్వేచ్ఛగానుందుటకయి పత్నులకు విష ప్రయోగములుచేసియుందురుగాని, వితంతువులుకాగానే ముక్కుకో యుదురన్న భయముచేత నట్టిపనికి సాహసిమ పక వారు పత్నీభక్తికలవారయి యుందురు.

ఆఱవ ప్రకరణము

నాయజమానురాలైన ఫాంఢీభంగీగారు విద్వాంసురాలైన భాంగీఫింఢీగారిని నియమించి నా కింట విద్యచెప్పించుటయు, రంఢీ భాషలో నేను తగినంత పాండిత్యమును సంపాదించినతరువాత దొరతనమువారు క్రొత్తగాస్ధాపించిన పురుష పాఠశాలకు నన్ను పంపుటయు అక్కడ సహపాఠియగు మఱియొక పురుషునితో నాకు మైత్రికలుగుటయు మీకీవరకే తెలిపియున్నాను గదా ? మేమిరువురును తప్ప మఱియెవ్వరును పురుషు లాపాఠశాలలో చేర లేదు. మాకుపాధ్యాయుడుగా నియమింపబడిన జాతిపురుషుని పేరు చామర్జీ . అతడు కంఢీభాషయందు విశేషపాండిత్యము కలవాడు కాకపోయినను స్వభాషయందు మహవిద్వాంసుడయి సంగీతమునందును చిత్రలేఖనందును సిల్పములయందును ప్రకృతిశాస్త్రములయందును నిరుపమాన సామర్ధ్యముగల నాగరిశాగ్రగణ్యుడు. అతడు మాకిరువురకును విద్య చెప్పుటయేకాక పురుషులు పొందదగిన స్వాతంత్ర్యములను గూర్చియు విద్యాభ్యాసమువలన గలుగు లాభములను గూర్చియు కూడ పలు మాఱు బోధించుచుండెను. పురుషవిద్యాస్వాతంత్ర్యములు నాకు క్రొత్తవిగా గానబడకబోయిననుబట్ట్టి స్త్రీలకు దాస్యముచేయ నలవాటుపడిన నాసహాధ్యాయునికి మాత్రమని వింతగా గనబడి యత్యుత్సాహమును గలిగించుచు వచ్చెను. మాయుపాధ్యాయుడుపదేశించిన బోధనలవలనను చేసిన యుపన్యాసములవలనను గాకపోయినను స్రీలయధికారమును రూపుమాపి యాదేశమునందు పురుషస్వాతంత్ర్యమును నెలకొల్ప వలెనన్న యభిలాషచేత సహజముగానే వారిరువురకన్నను నాకెక్కువయుత్సాహముండెను. నా సహాధాయుడించుమించుగా నిరువది స్ంవత్సరముల ప్రాయముగలవాడు; అపత్నీకుడు నవనాహరికురాలయిన యప్పగారి ప్రోద్బలమువలన చిన్నప్పటినుండియు కొంచెము విద్యనేర్చినవాడు. పూర్వము లక్ష్మణస్వామివారు శూర్పణఖ ముక్కుకోసినట్లుగా, గురువులవార పత్నీకుడయిన యాతని ముక్కు నీవఱకే మొదలంట గోసియుందురుగాని , జాతి భాషచదివి నవనాగరికురాలయి రాజకీయోద్యోగము నందున్న యాతని యప్పగా రాపని సాగసిచ్చినదిగాదు. బంధు జనులకు విరోధముగా నిప్పుడాతనిని రాజకీయ పాఠశాలకు పంపినదనియు ఆయప్పగారె. సహపాఠియైన నామిత్రుని పేరుభాక్ష్మీఫోడ్. నేను క్రమముగా ప్రతిదినము పాఠశాలకు పోయి పాఠము చదువుచున్నను, నా మిత్రుడు మాత్రము నోములు మొదలయిన వాని నిమిత్తము వరమునకు మూడు నాలుగు దినములు బడి మానుచు వచ్చెను మన దేశమునందు స్త్రీల కెన్నినోములున్నవో యాదేశము నందు పురుషుల కంతకంటె రెట్టింపునోములున్నవి. వారాదివారమనాడు ప్రాతఃకాలము నందు కందపిలకను పూజింతురు; సాయంకాలమ నందు పెండలపు దుంపను పూజ చేయుదురు సోమవారమునాడు మధ్యాహ్నాము నన్నెకంటిని పూజింతురు. సాయంకాలము నందు రుబ్బురోటిని పూజ చేయుదురు. నడుమనడుమ వచ్చు విశేష వ్రతములుగాక యీ ప్రకారముగా దినమునకు రెండేసిచొప్పున పురుషులు సంవత్సరమున కేడువందల ముప్పదినోములు నోతురు. నామాన్యపురుషులన్ని నోములను నోచరుగాని యపత్నీకులను విత్తవంతులును విశేషముగా నోములను నోచి వాలతోకాలక్షేపము చేయుచు . తమని మును గురుతస్క రాచార్యులకు సమర్పించు చుందురు . మాసహధ్యాతుడున్ని నోములు నోచుచుండుట యప్పగారి కిష్టములేక పోయినను, అప్పగారికి తెలియకుండ నతడు బడిమాని యామె కొలువునకు పోయినతరువాత రహస్యముగా ముసలిదయిన తల్లి యొక్కయు ఇంటనున్న యితరపురుషులయొక్కయు ప్రోత్సాహముచేత నోములు నోచుచుండును. ఈనోములు నిష్పలములని నేనును మా యుపాధ్యాయుడయి చామర్జీగారునుకూడ పలుమాఱు నా మిత్రుడయిన భాఢీఫోడ్ కిబోధించుచువచ్చితిమిగాని యాతడు మావద్ద నాలోగుననేయని తలయుడించి నోములు మానివేసెదనని యొట్లుపెట్టుకొనుచువచ్చినను మము విడిచి యింటికి పోగానే యామాటలుమఱచి యధాప్రకారముగా ప్రవతించుచుండెను. ఎంత చదువుకొన్నను చిరకాలమునుండి వచుచున్న యాచారము నొక్కసారిగా మానుట యెంతటివారికిని కష్టసాధ్యముగా నుండును. అందుచేత నేనాతనిని ప్రతిదినమును పాఠశాలకితోడితెచ్చుటకయి యాతని యింటిమాగముననే పోయి యాతని నాతోపిలుచుకొనిపోవుచుంటిని .

ఇట్లు కొంతకాలము నడిచినపిమ్మట మేమిద్దఱమును గలిసి యొకనాడు పాఠశాలకు బోవుచుండగా మాగములో నాకొక విచిత్రమును జూపెదనురమ్మని నామిత్రుడు నన్నూరి బయటికి దీసికొని పోయెను. ఆవఱకే వేడుక చూచుటకై స్త్రీలచ్చటికి తీధప్రజలవలె వచ్చియుందిరి. ఆగుంపులో నడుమనడుమ పత్నీవియోగము పొందని పుణ్యపురుషులను కొందఱుండిరి. ఆపట్టణములో గత దినము రాత్రి ధనికురాలయిన యొకవృద్ధవణిజస్త్రీ మృతినొందెను. ఆముసలి దాని భర్త మృతురాలయిన తనపత్నితో కూడ సహగమనము చేయుటకు నిశ్చయించి శ్మశానవాటికకు పోయినందున వినోదమును చూచుటకును పుణ్యమును సంపాదించుటకును వేలకొలది జనులక్కడ గూడిరి. మేము వెళ్లిన తరువాత ముసలిదానిశవమును నలుగురు మోసికొని పోయి యవఱకు త్రవ్వియుంచిన గోతిలో నిలువుగా బోరిగిల పరుండ బెట్టిరి. అంతట పురోహితస్త్రీలు మంత్రములు చదువుచు భర్తనుచేయి పట్టుకొని యాగోతి యొద్దకుగొనిపోగా అఱువదియేండ్ల ప్రాయముగల యాముసలివాడు తనశరీరమున నున్న రెండుమూడు నగలను దీసి చెంత పురుషులకు దానముచేసి సంతోషపూర్వకముగా సమాధిలోనికిదిగి పత్ని యొక్క కుడి ప్రక్కకు తానును బోరగిల పడియుండెను. అప్పుడు పూరోహిత స్త్రీలు మనదేశములో వేదఘోషచేసినట్లుగా గడీయనేవేవేవో మంత్రములు చదివి యేకర్మలు చేతుచుండిరి. ఈలోపలవన్నిద్దఱు స్త్రీలు పెద్దగంపల నిండా మన్ను పట్టుకొని గోతిచుట్టును నిలుచుండిరి. అప్ప్డు మహాధ్వనితో వాఅద్యములు మ్రోగు చుండెను. ఆసందడిలో ముఖ్యురాలయిన యాజకస్త్రీ యేదో మంత్రము చదివి చేయివిసరగానే యొక్క సారిగా ప్న్నిద్దఱు స్త్రీలును తమగంపల్లోని మన్ను మీదపోసిరి. అటు తరువాత పుణ్యపురుషులొక్కరొక్కరేవచ్చి తట్టెడుతట్టెడుమన్ను మీదపోసి మొక్కిపోవుచువచ్చిరి . పాఠశాలకు పోవువేళ మించుచున్నదని యాస్ధలమును విడిచి నామిత్రుడును నేనును దారిపొడుగునను సహగమన విషయమై మాటాడుకొనుచు వేగముగా నంతట పాఠశాలకుబోయితిమి. ఆదేశములోనే బదియేంద్లు దాటీనతరువాతగాని పురుషుడు సహగమనము చేయరాదట. ఏబదియేండ్ల ప్రాయమునఱకును పత్నితో గాపురము చేసిన పురుషు డా దేశములో పుణ్యపురుషుడన బడును. అట్టి పుణ్యపురుషుడు పత్నీమరణ సమయము నందు సహగమనము చేసినపక్షమున ముప్పదిమూడు తరముల వఱకును తన తల్లి వంక వారిని తండ్రివంక వారిని మాత్రమే కాక తనపత్నియొక్క తల్లివంక వారిని తండ్రివంక వారినిగూడ తరింప జేసి మహాసావులను సహితము పుణ్యలోకమునకు బంపునట. ఆదేశమునందుశవములను పాతి పెట్టుటయేకాని దహనము చేయుటలేదు. సమాధియందు దంపతులను బోరగిల పరుండపెట్టుటకు కారణా మేమయిన నున్నదాయని నామిత్రుని నడిగినాను . పుణ్యలోకములు క్రిందిదట్టున నుండును గనుక వారియత్మలు తిన్నగా నడుగవంక పోవుటకయి యట్లు చేయుదురని యాతడుత్తరముచెప్పెను. పుణ్యలోకములు పయినుండుటచే నూధ్వలోకము లనబడుననియు, పాపలోకములు క్రిందనుండుటచే నదోలోకములనబడుననియు మనశాస్త్రములు చెప్పుచున్నవి. ఆదేశమువారు శాస్త్రవిరుద్ధముగా పుణ్యలోకములే క్రిందనుండు ననుచున్నారు. పుణ్యపాపశబ్దముల ప్రయోగమెట్లున్నను వారీప్రకారముగా సమస్తవిష్యములలోను పురుషుల నన్యాయము చేయుటచేత వారధోలోకములకేగుట నిశ్చయమని నేననుకొన్నాను. ఈ సహగమనమును వారి భాషలో భూతీఘీటీయందురు. స్వర్గ యాత్రయని దానికధనము. ఈసంభాషణ ముగియునప్పటికి మేముపాఠశాల చేరినాము. మాయుపాధ్యాయుడు చాలసేపటినుండి మానిమిత్తము వేచియుండి మేముపో గానే యింతయాలస్య మేలచేసితిరనియడిగెను . ఆలస్య కారణమును మేము "స్వగయాత్ర"ను జూడబోవుటగా జెప్పితిమి. అందుమీద నతడాదినమున పాఠములకట్టిపెట్టి నిజముగా నది నరకయాత్ర కాని స్వర్గయాత్రకాదనియు, అటువంటి క్రూరకృత్యమును జనులు వివేకముకలిగి తమంత మానకపోయినను దొరతనమువాడు బలవంతయు గానైనను మాంప వలెననియు బహుదూరము చెప్పెను. ఈప్రసంగములో మనదేశాచారము సంగతికొడావచ్చినది. పురుషుల విష్యమయి యిట్లుచేయుట దారుణ కృత్యమయినను భర్తృమరణము సంభవించినప్పుడనుగమనముచేయుట పతివ్రతలైన భార్యలకు పరమధర్మ మనియు, ఈ దేశమునందువలె ముసలివాండ్రు మాత్రమేకాక యేడెనిమిది స్ంవత్సరముల బాలికలు సహితము భర్తలుపోయినప్పుడు పూర్వ కాలమునందు మాదేశాములో సహగమనము చేయువుండిరి రనియు మాదేశమున కన్య దేశీయులు ప్రభువులగుటాచేత వారీ సమాచారమును మాంపించి పాపము కట్టుకొనిరనియు చెప్పి సహగమన మహాత్మ్యమును బోధించితిని. భర్తలు మృతినొందినప్పుడు భార్యలు భర్తలచితిమీదనెక్కి నిమిషములో నగ్నిహోత్రజ్వాలల కాహుతులగుదురని నేను జెప్పినప్పుడ తతడది క్రూరకృత్య మనియు, దొరతనమువారు దానిని మాంపుట శ్లాఘ్యకార్యమే యనియు, తనదేశమునందు ప్రభుత్వమువారి కట్టిసాహసము లేకయున్నదనియు, మహావ్యసనముతో బలికెను. పురుషులను ప్రాణముతో బూడ్చిపెట్టెడు దురాచారమును మాంపుటయవస్యమని నేనాతనితో నేకీభవించినను, మనదేశపు స్ంగతిని మాత్రమతడు తిన్నగ నాలోచించలేదనియు శాస్త్రములున్నసంగతి యతడెఱుహడనియు భావించి మాది కేవలాచారము కాదనియు, ప్రత్యక్షశాస్త్రమనియు, ఈకలియుగములో పరమప్రమాణమయిన వరాశరస్మృతియందు శ్లో. :: తిస్రఃకోట్యర్ధకోటీచ యానిలోమాని మానుషే

తావత్కాలం వసేత్స్వర్గే భర్తారం యానుగఛ్చతి.

అని భర్త తోడ సహగమనము చేసిన పుణ్య స్త్రీ మనుష్య దేహమున నెన్ని రోమములుండునో యంతకాలమనగా మూడుకోట్ల యేబదిలక్షల వేలయేండ్లు స్వర్గసుఖమును పొందునని చెప్పబడినదనియు, "యానిలోమానుమానుషే తామత్యబ్దసహవ్రాణి" యని హరీతుడికూడ స్పష్టముగా జెప్పినాడనియు అంగీరస స్మృతియందు

శ్లో.:: బ్రహ్మఘ్నోవా కృతఘ్నోవా మిత్రఘ్నోవాసి మానవః

తంవై పునాతి సానారీ ఇత్యంగీరసభాషితం .

అని సహగమనము చేసిన స్త్రీ భర్త బ్రహ్మఘ్నుడయినను కృతఘ్నుడయినను మిత్రఘ్నుడయినను కూడ నతనిని పవిత్రుని జేయునని చెప్పబడినదనియు, అందుచేత శాస్త్రనిహితమైన యీ యాచారమును నిషిద్ధమని చెప్పగూడదనియు, ఆస్తికులయిన వాఱందరును శాస్త్రప్రమాణమును శైరసావహించి యల్పమైన మనుష్యబుద్ధికి క్రూరముగా కానబడినను తప్పక యనుష్ఠింపవలసినదనియు, నింద్యమైన యాచారమును సిష్టులయిన మావారంగీకరించియుండరుగనుక తప్పక యిది సదాచారమే యనియు నేను నొక్కి చెప్పినాను. అందుమీద నతడు కొంచెముసేపాలోచించి స్వప్రయోజనపరులైన మనుష్యు లెవ్వరో యేవోకారణములచేత నట్టి శ్లోకమును కల్పించితుందురని పలికెను. నేనామాటల లొడబడక యవిమనుష్య కల్పితములగుట సాధ్యముకాదనియు, మనుష్య కల్పితములైన పక్షమున,

"నమోద్యాముకే మాసి అముకేపక్షేముకతిధౌ అముకగోత్రా
శ్రీమతీ అముకీదేవీ అరుంధతీ సమాచారత్వపూర్వక స్వర్గలోక
మహీయమానత్వ మానవాధి కరణ లోమసమ సంఖ్యాబ్దా
వఛ్ఛిన్న స్వర్గవాస భర్తృసహిత మోదమానత్వ మాతృపితృ

శ్వశురకులత్రయపూతత్వ చతుర్ద శేంద్రావఛ్చిన్న కాలాధికగణకా ప్సరోగణస్తూయమానత్వ పతిసహిత క్రీడమానత్వ బ్రహ్మఘ్న కృతఘ్న మిత్రఘ్న పతిపూతత్వ కామా భర్తృజ్వలచ్చితారో హణ మహంకరిష్యే"

అని సమ కల్పమేల పుట్టెననియు, మొట్తమొదట దీఇనికొక్కదానికి నాకు సమాధానము చెప్పవలసిన దనియు, నేను కోరితిని ఆసంకల్పమున కర్ధమేమని యతడు నన్నడిగెను. "నమస్కారము. నేడు ఈమానమున ఈపక్షమున ఈతిధియందు ఈగోత్రములగట్టియు ఈపేరుగలట్టియు శ్రీమతినైన నేను అరుంధతివలె నడుచుకొనుటవలన గలిగెడు స్వర్గలోకమహిమను పొందుటకును , మనుష్యశరీరమునం దెన్నిరోమములుండునో యన్ని సంవత్సరములు భర్తతో గూడ స్వర్గవాససుఖ మనుభవించుటకును, తల్లియొక్కయు తండ్రి యొక్కయు మానుగారియొక్కయు మూడు వంశములను పవిత్రముచేయుటకును, పదునలుగురింద్రులకాలమువఱకును అప్సరోగణముల స్తుతిని పొందుచు పతి సహితముగా క్రీడించుటకును , బ్రహ్మహత్య చేసినవాడయినను కృతఘ్నుడయినను, మిత్రద్రోహి యయినను భర్తను పవిత్రుని చెయుటకును, కోరి, మండుచున్న భర్తయొక్క చితినెక్కెదను" అని పై సంకల్పమున కర్ధమని నేను విఅవ్రముగా బోధించినాను. అర్ధము వన్న తరువాత సహితము మాయుపాధ్యాయుడు సహగమనము మంచి కార్యమని యొప్పుకొనక యిట్టి సంకల్పమును కొంచెము సంస్కృతము చదువుకన్నవారెవరైనను కల్పించ వచ్చునని సమాధానము చెప్పెను. ఇది కల్పన కాదనియు, ధర్మసాస్త్రములలో

"శ్లో. మృతేభర్తరి యానారీ సమారోహేద్ధుతాశనం సారుంధతీ సమాచార స్వర్గలోకే మహీయత."

అనియు, "శ్లో.యాచభర్తృపరా నిత్యంస్తూయమానాప్పరోగణైః క్రీడతేపతినాసార్ధం యావదింద్రాశ్చతుర్దశ."

అనియు, ప్రమాణములున్నవనియు, ప్రమాణబద్ధులమయిన మనము శాస్త్రతిరస్కారము చేఁయగూడదనియు, నేనెంతవాదించినను నామాటలయందు గౌరవముంచక మూర్ఖుఁడయి యతఁడు సర్వకారుణ్యుఁడయిన యీశ్వరుఁడిట్టిక్రూరకృత్యమును విధించియుండడఁనియు, ఇదియంతయు వితంతువుల ధన మపహరింపఁగోరియోమఱియెందుచేతనో స్వప్రయోజన పరులయినవారు చేసినమోసమనియు, యుక్తికినినీతికిని విరుద్ధముగానున్న శాస్త్రనులను నమ్మరాదనియు, ఆతఁడేవేవోకుయుక్తులను పన్నుటకారంభిచెను.ఆమాటలకు నేను చెవులుమూసికొని హరినామస్మరణ చేసికొని శాస్త్రవిశ్వాసములేని నాస్తికులతో సంభాషించినచో దోషమువచ్చునని యెంచియాప్రసంగము నంతటితో చాలించితిని.

అతఁడుమాత్రము సహగమన విషయము నంతటితో విడువక నాకనిష్టముగా నుండునని దానిని దూషించుటమాత్రము మానివేసి"సహగమనమును దొరతనమువారు మాన్పుటకు పూర్వముమీదేశములో సంవత్సరమునకెన్ని యనుగమనములు జరగుచువచ్చె" ననియు, "ఇప్పుడు మీదేశములో నెందఱువితంతువు లున్నారు" అనియు, నానావిధములయిన ప్రశ్నలువేయ మొదలుపెట్టెను.నాకువిద్యాగురువుగానున్న పెదామనుష్యుఁడడిగినదానికి ప్రత్యుత్తరము చెప్పకుండుట మూర్ఖతగా నుండుననియెంచి నాకు తెలిసినంతవఱ కాతఁడడిగిన ప్రశ్నల కన్నిటికినినేనిట్లుత్తరములను చేప్పితిని:-

"మా దేశములో సహగమన సదాచారమును మాన్పుటకయి మొట్టమొదట మాతాంతరులయిన కైస్తవమతాచార్యులు క్రీస్తుశకము ౧౮౦౪ న సంవత్సరమున కలకత్తానగరమునందు క్రొత్త ప్రయత్నము చేసిరి. వారాసంవత్సరమునందు పదుగురు మనుష్యులను నియమించి కలకత్తానగరముచుట్టునుమూఁఢామడల దూరములోఁగల గ్రామములయందు సహగమనముచేసిన పుణ్యసతుల సంఖ్యను లెక్కవేయింపఁగా, ఆఱుమాసములలోపల మున్నూఱుగురు పతివ్రతలు భర్తలచితులనెక్కి స్వర్గలోక నివాససుఖమును చూఱగొన్నట్టు దెలిసినది. ఆ సంవత్ససంవత్సరము మొదలుకొని సహగమనమునుమాన్పి దొరతనమువారు పాపము కట్టుకొనువఱకునుగల యిరువదియైదు సంవత్సరములలోను డెబ్బదివేల విధవలు మాదేశములో భర్తృసహగమనముచేసి పుణ్యలోకములకుఁబోయినట్టు దొరతనమువారి లెక్కవలననేతెలియవచ్చుచున్నది.ఆలెక్కలలో తగులని యిల్లాండ్రెందఱుందురో! దీనిని బట్టి మాదేశముదేశములలో నెల్లఁబవిత్రమయినదనియు మీకు భోధపడియుండవచ్చును. ఆసంగతిపోనిండు.మతాంతరులైన క్రైస్తవాచార్యుల యల్పకృషి యీశ్వరుఁడు మాయందుందుటవలననప్పుడేమియు కొనసాగినదికాదు.అటుతరువాత రామమోహనరాయలను పతితుఁడొకఁడుమాలోనేబయలుదేఱిక్రీస్తుశకము ౧౮౧౮ వ సంవత్సరము మొదలకొని సహగమనమును రూపుమాపుటకయి మహాకృషి చేయనారంభించెను.ఒక్క కలకత్తా నగరమునందు ౧౮౧౫ వ సంవత్సరములో౨౫౩ రును, ౧౮౧౾ వ సంవత్సరమునందు౨౮౯ గురును,౧౮౧౭ వ సంవత్సరమునందు,౪౪౨గురును,౧౮౧౮ వ సంవత్సరమునందు ౪౪ గురును,౧౮౧౯ వ సంవత్సరమున౪౨౧ గురును, ౧౮౨౦ వ సంవత్సరమున౩౭౦ గురును, ౧౮౨౧ వ సంవత్సరమున ౩౭౨ గురును, ౧౮౨౨ వ సంవత్సరమున౩౨౮ గురును, ౧౮౨౩ వ సంవత్సరమున ౩౪౦ రును, ౧౮౨౪ వ సంవత్సరమున ౩౭౩ గురును, ౧౮౨౫ వ సంవత్సరమున ౩౯౮ గురును, ౧౮ ౨౬ వ సంవత్సరమున ౩౨౪ గురును, ౧౮౨౭ వ సంవత్సరమున ౩౩౭ గురును, ౧౦౨౮ వ సంవత్సరమున ౩౦౯ గురును, మహాపతివ్రతలు చిత్యారోహణముచేసి పదునలుగురింద్రుల కాలమువఱకును భర్తలతోఁగలిసి స్వర్గలోకసుఖమును భవించుటకుఁబోయిరి. 'దైవము దోసకారులకె తోడయివచ్చూ నన్న నన్నుతోక్తిప్రకారముగా పతభ్రష్టుల కృషిననుసరించి ౧౮౨౮ వ సంవర్సమునందప్పటి పరిపాలకులయిన బెంటింకు ప్రభుబుగారు సహగమనమునుమాన్పి ప్రతి సంవత్సరమును అంతమంది పతివ్రతలు పుణ్యలోకములకు పోకుండనిరోధించిన పుణ్యమును కట్టుకొనెను.

" మా దేశములో ౧౮౮౧ వ సంవర్సమునందు ప్రభుత్వము వారు వేయించిన జనపరిగణనప్రకారముగా స్వదేశప్రభువుల సంస్థానములలోఁగాక యింగ్లీషు రాష్త్రములో౨౦౯౩౮౬౨౬ గురు వితంతువులున్నారు.ఈసంఖ్యవలన మొత్తముమీఁద మాదేశములో నయిదుగురేసిస్త్రీల కొక్కొక్క వితంతువున్నట్టు కానఁబడుచున్నది. ఇఁక బ్రాహ్మణులలోనన్ననోముగ్గురాఁడువారిలోనొక్కతెవిధవగానున్నది."

ఈవిధముగా నేను చెప్పినసంగతి విన్నతరువాత౧౮౭౯ వ సంవత్సరములోనే భరతఖండమును విడిచిపోయిననాకు ౧౮౮౧ వ సంవత్సరములో హిందూదేశమునందు దొరతనమువారు వేయించిన జనసంఖ్యను గూర్చి యెట్లుతెలిసెనని నాసత్యచరిత్రమును జదివెడివారిఁలోగొందఱికి సందేహము కలుగవచ్చును.దానికి సర్వజన సమాదరణీయమయిన సమాధానమును చెప్పెదనువినుఁడు.నేనీ౦౮౮౧ వ సంవత్సరమునందు రండీదేశములోనున్నమాట వాస్తవమే. అయినను ౧౮౮౦ వ సంవత్సరమునందు భరతఖండములో మొట్టమొదట బొంబయినగరములో దివ్యజ్ఞాన సమాజము స్థాపింపఁబడుటయు, అప్పుటినుండియు కూటుహూమీ మొదలైన మహాత్ములు దూరదేశవాతలను తెచ్చుచుండుతయు, మీరందఱు నెఱిఁగియేయున్నారుగదా? అట్టిసంగతిలో బుద్ధి మంతులైన మీకు వేఱుగఁదెలుపువలసినదేమున్నది? మీకిప్పుడుపేరును జెప్పనుగాని దివ్యజ్ఞాన సమాజమువారి మహాత్ములలోనివాఁడే యొక మహానుభావుఁడునేఁటివఱకును మన భరతఖండములో జరుగుచున్న సువార్తల నెప్పటికప్పుడుతెచ్చి నాకనుగ్రహించుచున్నాఁడనిమాత్రము మీసంశయ నివారణార్ధము చెప్పుచున్నాను.ఈ సంభాషణమయిన తరువాత మేము పాఠశాలనువిడిచి ఇంటికిఁబోతిమి.

అటుతరువాత రంఢీనగరములో పూర్వమెప్పుడునులేని పురుషవిద్యాభ్యాసమును క్రొత్తగానెలకొల్పుచున్న విషయమయివిద్యాంసువండ్రందఱునుజేరి సభలు చేయుట కారంభించిరి.ఆసభలలో పూర్వాచార విరుద్ధమగా పురుషులకు విద్యచెప్పించువారిని, అటువంటివారికి తోడ్పడువారిని, అందఱిని వెలివేసి మతగురువులకు వ్రాసి బహిష్కారపత్రికలు తెప్పించుటకు నిశ్చయింపఁబడినది. ఈసంక్షోభమునకు భయపడి నామిత్రుఁడయిన భాడీఫోడ్ అప్పగారతనినిబడి మాన్పించినందున మాపాఠశాలకెల్ల నేనొక్కఁడనే విద్యార్ధినైనాను.నాయజమానురాలయిన ఫాంఢీభంగీగారు మాత్రము జడియక ధైర్యమువహించినన్నుపాఠశాలకు పంపుట మాననందున, సభాపత్నులును పౌరమహా కాంతలును జేరిసభవారామెను బహిష్కారముచేసిరి.అటు తరువాత జరిగిన చర్యను మఱియొక ప్రకరణమునందు వివరించెదను.

ఏడవ ప్రకరణము

బహిష్కారపత్రిక వచ్చినతరువాత ఫాంఢీభంగీగారు తమప్రయత్నమును విడువక తమ మిత్రురాండ్రను రాజకీయ పాఠశాలలోని పయితరగతుల యందుఁజదువుకొను బాలికలను పోగుచేసి పురుష విద్యాభ్యాసముయొక్క యావశ్యకమును గూర్చి యుపన్యాసములుచేయుట