కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు/సత్యరాజా పూర్వదేశ యాత్రలు-ప్రథమభాగము-ఏడవ ప్రకరణము

వికీసోర్స్ నుండి

మంతులైన మీకు వేఱుగఁదెలుపువలసినదేమున్నది? మీకిప్పుడుపేరును జెప్పనుగాని దివ్యజ్ఞాన సమాజమువారి మహాత్ములలోనివాఁడే యొక మహానుభావుఁడునేఁటివఱకును మన భరతఖండములో జరుగుచున్న సువార్తల నెప్పటికప్పుడుతెచ్చి నాకనుగ్రహించుచున్నాఁడనిమాత్రము మీసంశయ నివారణార్ధము చెప్పుచున్నాను.ఈ సంభాషణమయిన తరువాత మేము పాఠశాలనువిడిచి ఇంటికిఁబోతిమి.

అటుతరువాత రంఢీనగరములో పూర్వమెప్పుడునులేని పురుషవిద్యాభ్యాసమును క్రొత్తగానెలకొల్పుచున్న విషయమయివిద్యాంసువండ్రందఱునుజేరి సభలు చేయుట కారంభించిరి.ఆసభలలో పూర్వాచార విరుద్ధమగా పురుషులకు విద్యచెప్పించువారిని, అటువంటివారికి తోడ్పడువారిని, అందఱిని వెలివేసి మతగురువులకు వ్రాసి బహిష్కారపత్రికలు తెప్పించుటకు నిశ్చయింపఁబడినది. ఈసంక్షోభమునకు భయపడి నామిత్రుఁడయిన భాడీఫోడ్ అప్పగారతనినిబడి మాన్పించినందున మాపాఠశాలకెల్ల నేనొక్కఁడనే విద్యార్ధినైనాను.నాయజమానురాలయిన ఫాంఢీభంగీగారు మాత్రము జడియక ధైర్యమువహించినన్నుపాఠశాలకు పంపుట మాననందున, సభాపత్నులును పౌరమహా కాంతలును జేరిసభవారామెను బహిష్కారముచేసిరి.అటు తరువాత జరిగిన చర్యను మఱియొక ప్రకరణమునందు వివరించెదను.

ఏడవ ప్రకరణము

బహిష్కారపత్రిక వచ్చినతరువాత ఫాంఢీభంగీగారు తమప్రయత్నమును విడువక తమ మిత్రురాండ్రను రాజకీయ పాఠశాలలోని పయితరగతుల యందుఁజదువుకొను బాలికలను పోగుచేసి పురుష విద్యాభ్యాసముయొక్క యావశ్యకమును గూర్చి యుపన్యాసములుచేయుట ఆడుమళయాళము

కారంభిచెను. ఆయుపన్యాసములవలనను రాజబాషాగ్రంధపఠన మహత్త్వమువలన మనసు కరఁగినవారయు కొందఱుబాలికలెన్నికష్టములకయిన నోర్చి పురుషవిద్యాభివృద్ధిని జేయుటకు నిశ్చయించుకొని నాయజమానురాలికి సర్వవిధములతోడ్పడుచు, వెలివేయఁబడినయామెతోఁగలిసి రహస్యముగా భోజనములు చేయుటకారంభించిరి.అందుచేత రంఢీ నగరములో మఱింత సంక్షోభము కలిగెను. రాజభాషవలన పిల్లలు చెడిపోవుచున్నారనియు, వారినందఱిని రాజకీయపాఠశాలకు బోకుండమాన్పించి వారికిరంఢీమతమునుభోధించి వారిని పూర్వపదాచార నిష్ఠురాండ్రను జేయవలయుననియు, విద్యాంసురండ్రచేత వారమునకు రెండుసారులు బాలికలకు మతబోధ చేయింపవలయుననియు, లౌక్యాధికారలులోనున్న పురములోని ప్రముఖరాండ్రు నిశ్చయముచేసి సభలు చేయించుటయేకాక, తమగ్రామమున కొక్కసారి విజయము చేసి జీర్ణోమతోద్ధారణము చేయవలెనని పీఠాధిపత్నియైనమతాచార్యురాలికి విజ్ఞాపనము పంపిరి.నవనాగరికురాండ్రకు మాయజమానురాలు నాయకులైనట్టే పూర్వాచారపరాయణలయిన పూర్వనాగరిక పక్షమువారికి దుంఢీలంఢీగారు ,నాయకురాలయి, తనయావచ్చక్తిని వినియోగించి సంస్కారపక్షమువారిని ముఖ్యముగాఁదత్సక్షానుసారిణు లయిన బాలికలను బాధించి పూర్వాచారస్థాపనము చేయమొదలుపెట్టెను. దుంఢీలంఢీగా రాపట్టణమునకుఁ బ్రాడ్వివాకురాలు. రాజకీయోద్యోగము నందుంటవలన నవనాగరికపక్షావలంబకులయిన దొరతనము వారికి విరోధముగాఁబనిచేయుటకిష్టములేనిదై, తానుచాటున కపటనాటకమునకు సూత్రధారులుగానుండి యామెయాగ్రామములో మిక్కిలి కర్మిష్ఠురాలని ప్రసిద్ధిచెందిన గంభీదంభీగారిని నాయకురాలినిగాఁజేసెను. ఈగంభీదంభీగారు లోకములోని కర్మిష్ఠురాండ్రలో నగ్రగణ్యురాల; ప్ర్రాతఃకాలముననే స్నానముచేసి ముక్కు మూసుకొని కూరుచుండి ప్రతిదినమును పగలు రెండు యామములవఱకును రేఁగుగింజల జపమాలిక త్రిప్పుచు జపముచేయుచుండును.మన దేశములో రుద్రాక్షలవలెనే యాదేశములో బదరీబీజములు మిక్కిలి పవిత్రమయినవి.ఇక్కడవలె నక్కడదేహమున విభూతిధరించరు. మనదేశమునందువలె మూఁడు రేఖలుఁగాగాక యొక్కటేరేఖగా లలాటమునందంతటను భూరేణువుపూసికొందురు.అందులో శోణమృత్తికపరమపావనమైనది. తదభావమునందు నదులలోనిదిగాని, తదభావమునందు చెఱువులలోనిదిగాని, తదభావమునందు నూతులలోనిదిగాని ఏమృత్తికయైనను ధరింపవచ్చును. మనగంభీదంభీగా రొక్కలలాటమునందు మాత్రమేకాక దేహమునందంతటను జేగురుమట్టినే పూసికొనిపూచిన మోదుగువలె కన్నులపండువగాఁగానఁబడుదురు.ఆమెకుఁగల భక్తియు మితంతయుఁజేయుదు.ఆమె దేవతానివేదనము చేయకకల్లయినను త్రాగదు; మాంసమయినను తినదు;దేవతార్పణము చేయకచౌర్యమునయిననుజేయదు.వేయేల? ఆమె తనదేహమును దేవతాసమర్పణముచేసియే వ్యభిచరించును.జ;తనజిహ్వను దేవాఅసమర్పణముచేసియేకల్లలాడును.ఆత్మ కర్తృత్వముంచుకొనక కర్మనిష్ఠులు మన దేశమునందు"తత్సత్ బ్రహ్మార్పణమస్తు" అని కర్మలనన్నిటిని బ్రహ్మార్పణము చేసినట్లే యామెయు తనకర్మలనన్నిటిని స్వదేవతకు ధారపోయును. కాఁబట్టియామెయీపనియు తన యిష్టదేవతాప్రీతికొఱకేచేయ దీక్షవహించినందున, అభీష్టసిద్ధికయి ప్రతిపక్షులవిషయమున నేదారణకృత్యమును జేయుటకును పాపభయ యామెకులేదు.కాని దొరతనమువారి భయముండుటచేత లోలోపలనెన్నికానిపనులు చేసినను తత్పక్షమువారు ప్రత్యక్షముగా ప్రతిపక్షులతలలు బద్ధలు కొట్టిదౌర్జన్యముచేయుటకు మాత్రము సాహసింపకుండిరి. రాజకీయోద్యో గినులయిన రంఢీ దేశవాసినులకు పలువురుకింకొక కష్టముకూడ వచ్చినది.వారావల సత్యప్రియలైన నవ నాగరికాగ్రగణ్యలయినట్టుగా నటించితమ పయియధికారిణుల మెప్పుపొందకవలయును; ఈవల పూర్వమతాచారాభిమాననీయలయినట్లు నటించి మూఢప్రజలను సంతోషపెట్టవలయును; మధ్యను తమ హృదయములన్నియు నవనాగరిక పక్షముననే యుండుటచేత సంస్కారములను మెల్లగా నెలకొల్పుట నిమిత్తమేపైకి పూర్వ నాగరికపక్ష మవలంబించినట్లు మెలఁగవలసి వచ్చినదని నవనాగరికురాండ్రను సమాధాన పఱపవలయును.కాఁబట్టివీరు నాటక ములయందలి నటులవలె మూఁడు చోట్లమూఁడు విధములయిన వేషములు వేసి పరస్పర విరుద్ధములయిన మూఁడు కధలను వినిపించవలసిన సామర్ధ్యమును వహించినవారయినారు.వీరు దేనియందును నమ్మకములేనివారయు దురభిమానదేవుని దుశ్చింతాదేవిని మాత్రమేభక్తితో కొలుచు వారగుటచేత తత్పీృతికరముగా వారు శ్రద్ధతో చేయునదియంతయు సాధుసంతాపప్రయత్నము తప్ప మఱియొక్కటి కానరాదు.

ఇంట తల్లిదండ్రులు బాలికలను భాధింపుచు పురుషవిధ్యాభ్యాసము మంచిదన్న పక్షమునను మంచిదన్న పక్షమువారితో చేరిన పక్షమునను గృహములముండి వెడలఁగొట్టెదమని బెదిరించినందున వారిలో పలువురు వాదము చేయుటకును నవనాగరికలతో మాటాడుకకునుమానుకొనిరి.కొందఱుతల్లులంతటినైననూరకుండక పాఠములుమానివేసి పంచకాలములయందును"మిధా" చేయవలసినని సంధ్యావందనమువంటి నిత్యకర్మ.ఈనిత్యకర్మను ప్రతిస్త్రీయును ప్రాతఃకాలము,పూర్వాహ్నము, మధ్యాహ్నము, అపరాహ్నము, సాయంకాలము అను పంచకాలములయందును తప్పకచేయవలయును. అది చేయనివారికిగతులులేవు.అయినను పట్టణములయందలివారు మిధాచేయునట్లు కొందఱు నటించినను నిజముగా చేయువారుమాత్రమేలేరు. జననీజనకుల నిర్భంధమెక్కువయినప్పుడు బాలికలు తమకుమిధా చెప్పవలసినదని వారినడుగ మొదలుపెట్టఁగా వారు తమగుట్టు బయలపడకుండ మొట్టమొదట కోపపడియు తరువాత తమకు తీరికలేదనియునుపేక్షచేసి, చేయకపోయిననుపమిధా చేయుచున్నామని చెప్పి శోణమృత్తికాధారణమును మాత్రము చేసినచాలునని చెప్పిరి.మఱికొందఱుజనులు తాము మిధా నేర్చుకొనవలెనని పురోహితురాలిని పిలిపించియడిగిరి. పురోహితురాలును కొంచెముసేపాలోచించి తన నిమిత్తమై పల్లెయందున్న తనచెల్లెలు మిధాచేయుచున్నందున పట్టణములయందు వాడుకలోలేనిదానిని తాను నేర్చుకోవలసిన యావశ్యకము లేకపోయినదనియు, పట్టణములయందుప యుక్తమయున యర్ధశాస్త్రమును మాత్రమే తానభ్యసించితిననియు. తగినంతధనమిచ్చెడుపక్షమున పల్లెనుండి తనచెల్లెలిని పిలిపించెదననియు చెప్పెను. సూర్యకరతాపముచేత చెఱువులోనినీరింకినట్టే ధనముపేరుచెప్పఁగానే వారిమనోసరస్సునందూరిన మిధాభ్యాసాభిలాష ప్రవాహ మింకిపోవును.అర్ధశాస్త్రమనఁగా నేమోమీలోఁగొందఱికి తెలియకపోవచ్చును.అత్నీకులు మొదలయిన వారిచేత నోములు వ్రతములు మొదలయినవి చేయించివారివలన ధనమును గ్రహించెడిశాస్త్రమే యర్ధశాస్త్రము.

పురుష విధ్యాభ్యాసమున కాధారముగా గాధాయని చెప్పఁబడెడువారి వేదములయందు ప్రమాణమున్నదని నవనాగరికురాండ్రెక్క్డిసో యొక వచనమునుదీసికొనివచ్చిరి.మిధాకువలెనేగాధాకర్ధమేలేదనియు, ఉన్ననువేదము దేవభాషయగుటవలన దానియర్ధముదేవతలకేకాని మనుష్యులకు తెలియదనియు, అందుచేత పూర్వము పురుషవిధ్యగలదని వేదప్రమాణమును జూపినవారిమాట యంగీకార్యముకాదనియు,పుణ్యముకొఱకు వేదమంత్రముల నూరకకర్మలు మొదలైనవాని యందుఁబఠింపవలసినదే కాని వాని యర్ధముతో పనిలేదనియు, విద్వాంసురండ్రు వాదింపసాగిరి.ఆవాదములో పండితురాండ్రలో పండితురండ్రకు వేదమున కర్ధమున్నదా లేదాయన్నమీమాంసయొకటి యవాంతరముగా వచ్చినది.అప్పుడు పండితరండ్రలో మూఁడువంతులు వేదమున కర్ధమేలేదనియు, అర్ధమున్నట్టుతామెప్పుడును పెద్దలవలనవినలేదనియు, అర్ధమేయున్నపక్షమునజనులొక్కరైననేల యభ్యసింపరనియు, అర్ధములేకపోవుటచేతనే వానికాపూజ్యత వచ్చినదనియు, వాదించి యర్ధములేనట్టే సిద్ధాంతముచేసిరి; ఒకవంతు మాత్ర మాకాలమునందు మనుష్యుల కెవ్వరికిని తెలియక పోయినను వేదముల కర్ధమున్నదనియు, వేదములకర్ధమున్నదని తమ తాతముత్తాతలు తమతో చెప్పునట్టు తమ తాతలవలన చిన్నప్పుడువిన్నామనియు, వేదార్ధములే శాస్త్రములని శాస్త్రములలో జెప్పఁబడియున్నదనియు, వాదించిరి కాని యధికసంఖ్య గలవారిచేత వారివాదముపూర్వపక్షము చేయఁబడినది. ఆసభలో నవనాగరికులైన యొక తె లేచి నిలిచి దొరతనమువారు మనపూర్వగ్రంధములను సంపాదించుటకు ప్రయత్నము చేయుచున్నారనియు, ఒకపురాతన దేవాలయములో మూలఁబడియున్న జీర్ణతాళపత్రపుస్తకముల కట్టనువిప్పి శోధింపఁగానందులో వేదమునకు వ్యాఖ్యానమొకటి కనబడినదనియు, వారుదానిని పరిశీలించి ముద్రింపించుచున్నారనియు, వేదమునకర్ధము కలదనియు చెప్పెను.ఆమె మాటలు విద్వాంసురాండ్రెవ్వరును నమ్మక స్వదేసస్థులకెవ్వరికిని దొరకనిపుస్తకము వారికి దొరికియుండదనియు,దొరికినను విద్వాంసురండ్రకు కానియర్ధము వారికిగునని నమ్మఁగూడదనియు దేవాలయములోని ప్రాఁతపుస్తకములలోనిదని చెప్పియేదో యర్ధమును కల్పించి ముద్రించుచున్నారనియు, ముద్రితగ్రంధమును ముట్టినను పాపమువచ్చునుగాన దానినికొన్నవారినిచదివినవారిని బహిష్కారము చేయుటకు శీఘ్రకాలములోనే గ్రామమునకు విజయము చేయఁబోయెడు జగద్గురువులను ప్రార్ధింప వలయుననియు, ఐకకంఠముగా నిశ్ఛయము చేసికొనిరి.

ఇట్లు సభలు జరుగుచుండఁగానే జగద్గురువులవారు తాము విచచ్చేయుచున్నట్లు సభాపత్నులకు శ్రీముఖమును బంపిరి. శ్రీముఖము వెనుకనే శ్రీవారును గుఱములతో ను ఏనుఁగులతో ను వాధ్యములతోను విజయుంచేసిరి.అప్పుడింటింటను భిక్షలు జరుగుట కారంభించినవి.ఉద్యొగములో నున్నవా రొక్క రొక్క రు మూఁడేసి నెలల జీతము పాదపూజ సమర్పించుకోవలసి వచ్చినది. అప్పుడింటింటను నాసికాహొత్సములు జరగ మొదలు పెట్టేను .ఆనాసికోత్సవములో మొట్టమొదట నాసహధ్యాయుఁడై న భాఢిఫొడ్ యొక్క ముక్కు ముక్కలయ్యొను .ఇతర సమయములయందు పట్టుదల లేకపొయినను స్వాములవారు వచినప్పుడు మన దేశమునందు భాల వితంతువుల శిరోజములు సహితముతీయించి వేయునట్లుగానే యాదేశమునందు జగద్గురువులు వచినప్పుడపత్నీకుల ముక్కులన్నియుకోసివేయుదురు. జగద్గురువులవా రక్కడ నున్నకాలములో నొక సభచేసి యాసభకు నా యజమానురాలయినఫాంఢీభంగీగారినికూడ పిలిపించిరి. అప్పుడు పురుషవిద్యాభ్యాసముకూడదని యేశా స్త్రములలోఁ జెప్పఁబడియున్నదని ఫాంఢీభంగీగారు జగద్గురువులను ప్రశ్నవేసిరి. నిత్యమును భిక్షలధికముగాఁ జేయుచుండుటవలన జగద్గురువులవారికి పిండివంటల నామము లేకాని పు స్తకముల నామములు రానందున, ఆప్రశ్నకుత్తరము చేప్పవలసినదని ::::::వారాఅస్ధాన:::::: విద్యాంసురాండ్రయిన:::::: శిష్యురాండ్ర కాజఞపించిరి. ఆ మహవిద్వాంసురాండ్రును కొంచెముసే పాలోచించి తాము స్వస్ధానమునకుపోయిన తరువాత మూలపీఠమువదనున్న యనాదిగ్రంధమును దీసి పు స్తకముల నామములను వెనుకనుండి పంపెధమని చెప్పించులకొనిరి. త్రాగుఁబోతులకును, ఆడుమళయాళము

మాంసభక్షకులకును, వ్యభిచారులకును వెలిలేక లోకాభివృద్ధి నిమిత్తమయి యత్నించుచున్న తమకు నిష్కారణ్ముగా బహిష్కారమువేయుట యేమి న్యాయమని నాయజమానురాలు భయపడక జగద్గురువులవారి నడిగెను. అప్పుడు తదాస్థానపండితురాండ్రలో నొక వృద్ధాంగన యందుకొని శాస్తోక్తప్రకారముగా నడచుకొనువారి నేల బహిష్కరింప వలయుననియు,

"మాఖే మాఘే మాఠే మాఢే
మాధే మామే మిమే మిమే"

అను శాస్త్రప్రమాణమునుబట్టి పయిపనులు చేసినవారు దోషులు కారనియు, సమాధానముచెప్పెను. ఆప్రమాణవచనమున కర్ధమేమో సెలవియ్యవలసినదని నేను వేఁడుకొనఁగా, ఆమహాపండితురాలు నాయందనుగ్రహించి, "మద్యము, మంసము, మత్స్యము, ముద్ర, మైధునము, అను మకారములు మహాపాపనిరాకరములు" అనిచెప్పెను.ఈయొక్క వచనముతోనే

"మద్యంమాంసంచ మత్స్యంచ ముద్రా మైధున మేవచ మకారపంచకంచైవమహాపాతక నాశనం"

అను ప్రాణితోషిణి గ్రంధములోని శ్లోకము నాకు స్మరణకువచ్చి రంఢీ శాస్త్రములన్నియు హిందూశాస్త్రములనుండియేతీసికొనఁబడినవనియు వారి వేదమును మనవేదశాఖయే యనియు నేను నిశ్చయముచేసితిని. అప్పుడు నీతికి విరుద్ధమయిన శాస్త్రమెట్లు ప్రమాణమగునని నాయజమానురాలా విద్వాంసురాలిని నిశ్శకముగా నడిగెను. అందుమీఁద నామె యత్యాగ్రహావేశము కలదయి శాస్త్రతిరస్కారమును జేసినందునకయి మఱియొక ముఖము చూచిన పాపమువచ్చునని కోపపడి, ఈయనర్ధ మంతయు రాజకీయపాఠశాలలోఁ జదువుటవలన వచ్చి సత్యరాజాపూర్వదేశ యాత్రలు

నదిగనుక దొరతనమువారి బడికిపిల్లలను బంపువారికందఱికిని శిక్షవిధింప వలయునని శ్రీజగద్గురువులవారితో మనవిచేసి, తత్క్షణము నాయజమానురాలిని గురుసాన్నిధ్యమునుండి గెంటించివేసెను. జగద్గురువుల వారును ధనలక్ష్మీప్రియురాండ్రగుటచేత శిష్యురాలి మాటనుబట్టి దొరతనము వారిపాఠశాలకు పిల్లలకుపిల్లలను బంపువారందఱును బదేసిసువర్ణము లపరాధము చెల్లింప వలయుననియు, చెల్లించువఱకును గ్రామము లోనివారెవ్వరును వారియిండ్లకు శుభకార్యములకు పోఁగూడదనియు, వెంటనే సభాపత్నులపేర శ్రీముఖములను బంపిరి.అయినను సభాపత్నుల బాలికలు సహుతము కొందఱు రాజభాషను చదువుకొనుచున్నవారగుటవలన వారా శ్రీముఖములనంతగా నాదరించిన వారుకారు. ఇంతకును రంఢీనగరములో నాజగద్గురువులవారి శిష్యకుటుంబము లన్నియు నూఱు మాత్రమేయున్నవి. అయినను తన్మతావలంబులు మాత్రమేమిక్కిలి చదువుకొన్నవారుగాను, ధనికులుగాను, చెల్లుబడికల వారుగానువున్నారు. ఈజగద్గురుపీఠ స్థాపకురాలయిన శ్రీశ్రీశ్రీ ఆది జంఢాముంఢార్ండా దేవిగారు పూర్వకాలము నందెప్పుడో పదునాఱు మతముల నుద్ధరించినంకున తత్పీఠమునకువచ్చిన వారికందఱికిని షోఢశ మతోద్ధారిణీబిరుదము పారంపర్యముగా వచ్చుచున్నది. అందు చేతనే యీపీఠమువారు జగద్గురువులమని యుతక్కిన సర్వమతముల వారును తమకుశిష్యప్రాయులేయని యుచెప్పు కొందురు. ఆమతముల పేరులనన్నిటిని దెలుపుట వలన నాకు వృధాయాసమేకాని దానివలన మీకేమియు లాభముగలుగదు. ఇటువంటి బిరుదము లాదేవివారికి మూఁడువేలమున్నూటముప్పది మూఁడుగలవు. ఆదేవిగారు షోడశమతముల నుద్ధరించినను, వాలిలోనెల్లను జంఢామతమును సర్వోత్తమమయినదని స్థాపించినారు. ఆమతసిద్ధాంతములించుమిణ్చుగా మనదేశమునందలి శాక్తేయ మత సిద్ధాంతములను బోలియున్నవి. భేదమంతయు మనలోనున్నస్త్రీనిదీసివేసి వారు దానిస్థానమునఁ బురుషునిబెట్టుకొన్నారు. అందులోను మద్యపానముగలదు; మాంసభక్షణముగలదు; సంభోగముగలదు; ముద్రలుగలవు. వీనినన్నిటిని బట్టిచూడఁగా వారుతమ శాస్త్రమును మనయాగమ తంత్రముల నుండి దొంగిలించుకొన్నట్టు తోఁచుచున్నది. మనముద్రలలో నెల్లనుబ్రధానమైన "హ" అను ప్రసాదముద్రను శ్రీచక్రమునువారు తీసికొన్నందున వారు తమమతము నంతను మనపంచమామ్నాయమయిన తంత్రము నుండియే తస్కరించి రనుటనిశ్చయము. అప్పుడువచ్చిన నయాజగద్గురువుల వారికి ముప్పది సంవత్సరముల వయ్యస్సుగలదు; ఆదేవిగారురూపము చేతనుచక్కని వారనియే చెప్పవచ్చును; ఆమె ప్రతిదినమును జంఢాపూజ చేయుదురు. ఈయుపాసనము స్త్రీకిబదులుగా బురుషుని బెట్టినయెడల, సమస్త విషయములలోను మనదేశములో వీరులనఁబడెడు మహా భక్తాగ్రేసరులు చేసెడి యుపాసనముతో సరిపోలును గనుకుమీకు తేటగాతెలియుటకయి మనదానినిక్కడ ప్రమాణవచనపూర్వకముగా కొంచెము వివరించెదను. శాక్తేయాచారముల లోని దయినయిది వామాచారము; దీనినాచరించు వారు కౌలికులనఁ బడుదురు. కౌలికులనగా నుత్తమ కులీనులని యర్ధము. ఈపదము చేతనే వీరిశ్రేష్ఠత్వము వెల్లడియగుచున్నను ప్రమాణ వాదులయిన మీతృప్తికొఱకు పరమప్రమాణమయిన శ్యామారహస్య తంత్రమునుండి వామాచారముయొక్కయు కౌలసిద్ధాంతము యొక్క యుసర్వోత్కృష్టతము స్థాపించు ప్రమణముల నిందుదాహరించెదను:-

శ్లో.సర్వేభ్యశ్చోత్తమావేదావేదేభ్యోవైష్ణవంపరం
 వైష్ణవాదుత్తమంశైవంశైవాద్దక్షిణముత్తమం
 దక్షిణాదుత్తమం వామణ్వామాత్సిద్ధాంతముత్తమం
 సిద్ధాంతాదుత్తమంకౌలంకౌలాత్పరతరంనహి.

"అన్నిటిలోనువేదములుత్తమములు; వేదములుకన్న వైష్ణవముత్తమము;వైష్ణముకన్న శైవముత్తమము; శైవముకన్న దక్షి ణాచారముత్తమము; దక్షిణాచారముకంటె వామాచారముత్తమము; వామాచారము కంటె సిద్ధాంతముత్తమము; సిద్ధాంతమునకంటె కౌలముత్తమము; కౌలమునకంటె శ్రేష్ఠతరమయినది లేదు " అని ప్రమాణ వచనముల కర్ధము.ఇప్పుటుకౌలముయొక్క శ్రేష్ఠత్వము స్థాపనమయినందున, కౌలాచారమును సప్రమాణముగా శక్తిశోధనతంత్రము నందుఁచెప్పఁబడినరీతిగాఁ గొంత వివరించెదను:-

శ్లో.నటీకాపాలినీవేశ్యారజకీనాపితాంగనా
బ్రాహ్మణీశూద్రకన్యాచతధగోపాలకన్యకా
మాలాకారన్యకన్యాపినవకన్యాఃప్రకీర్తితాఃఏ
తాసుకాంచిదానీయపూజయేచ్చక్తికౌలికః

మహావిశాయామానీయనవకన్యాశ్చభైరవాన్

తదీయంమంత్రమాలిఖ్యతస్మిన్తామేవపూజయేత్
క్రేస్థాపయేద్వామేకన్యాంభైరవవల్లభాయ్.
ముక్తకేశాంవీతలజ్జాంసర్వాభరణభూషితామ్
ఆనందలీనహృదయాంసౌందర్యాతిమనోహరామ్
శోధయేచ్చుద్ధిమంత్రేణసురానందామృతాంబుఖిః

ఆనందతర్పితాంకాంతాంవీరఃస్వానందవిగ్రహాః
రితేనతర్పయేత్తత్రశ్రీచక్రేవీరసంసది

పీత్వాపీత్వాపునఃపీత్వాయావల్లుఠతిభూతలే
ఉత్థాయచపునఃపీత్వాపునర్జన్మనవిద్యతే.

మఱింత పచ్చి బూతుగా నుండునని కొన్ని ప్రమాణ వచనములను వదలివేసినందుకు చదువరులునన్ను మన్నింపవలెను. "నటియు, కాపాలివియు, వేశ్యయు, చాకలిదియు, మంగలిదియు, బ్రాహ్మణియు, శూద్రయు, గొల్లదియు, పూలుగూర్చునదియు,నవకన్యలనఁబడుదురు. వీరిలో నొకతెను దీసికొనివచ్చి కౌలికుఁడు శక్తి పూజచేయ వలెను. అర్ధరాత్రము నందు నవకన్యలనుతెచ్చి.... తత్సంబంధమైన మంత్రమును లిఖించి దానిని పూజింపవలెను. శ్రీచక్రమున వామభాగము నందు తలవిరియఁ బోసికొన్నదియు దెసమొలదియు సర్వాభరణ భూషితము ఆనందలీన హృదయయు సౌందర్యాతి మనోహరయు అయిన యాభైరవీకన్యను నిలువఁబెట్టి సురానందామృత జలముతో శుద్ధిమంత్రము చేతశుద్ధి రాలినిచేయవలెను. ఆనందవిగ్రహుఁడయినవీరుఁడు ఆనంద తర్పితురాలయిన యాకాంతను శ్రీచక్రమునందు రతిచేతతృప్తి నొందించవలెను. త్రాగిత్రాగి భూమి మీదపడువఱకు నుమరలత్రాగి లేచి మరల త్రాగి పునర్జన్మము లేని వాఁడగును" అనిపయి ప్రమాణవచనముల తాత్పర్యము. ఈప్రకారముగానే యచ్చటిజగద్గురువులవారునుశీధనమయమునందు శ్రీచక్రమునందు ప్రాసాదముద్రను పూని ఈశ్వరాత్మకముగా నొక యౌవన పురుషుని పూజించి సంభోగించి సురాపానము చేసి యానందపరవశులగు చుందురఁట! మనదేశము నందువలెనే యాదేశమునందును శాస్త్ర విశ్వాసమును మత ధర్మాచరణమును తక్కువగుట వలన జగద్గురువు లీ మతధర్మమును స్వాచరణమువలనఁ జూపువఱకును దానినిజనులు మఱచి పోయినట్టేయున్నదిగాన, నేనున్నకాలములో రంఢీనగరము నందీయాచారము కనఁబడమేలేదు. ఇదికలి మహిమయని గురువులయభి ప్రాయము.

ప్రాసాదమంత్ర మహిమము మమంత్ర విశ్వాసములేని నవనాగరికులకుఁదెలియకపోవచ్చునుగాన వారియుపయోగము నిమిత్తమిందుసప్రమాణముగా కులార్ణవతంత్రము నుండితెలిపెదను. దీనినిబట్టియే నాది యప్రామాణికవాదము కాదనియు,సర్వజన సమాదరణీయమనియు, బుద్ధిమంతులు గ్రహింపవచ్చును.

శ్లో.శ్రీప్రాసాదపరామంత్రమూర్ద్వామ్నాయప్రతిష్ఠితం
ఆవయోఃపరమాకారంయోవేత్తిసఃశివఃస్వయం.

శివాదిక్రిమి పర్యంతం ప్రాణినాం ప్రాణవర్త్మనాం
విశ్వాసోచ్చ్వాసరుపేణ మంత్రోయం వర్తతేప్రియే.

అని కేవల సదాశివుఁడే శ్రీమహాదేవికి " మనయిద్దఱ పరమకారా మయినట్టియు ఊర్ధ్వామ్నాయ (తంత్ర) ప్రతిష్టతమయినట్టియు శ్రీ ప్రాసాద పరామంత్రము నెవ్వఁ డెఱుగునో వాఁడు తానేశివుఁడు. ఓ ప్రియులారా! శివాది క్రిమి పర్యంతమునుగల జీవ జంతువులలో నిశ్వాసోచ్చ్వా సరుపము చేత నీమంత్రము వర్తించుచున్నది." అని యుపదేశించియున్నడు."హ్స" అను ప్రాసాద మంత్రములో హకారము నిశ్వాస రూపమనియు , సకార ముచ్ఛ్వాస రాపమనియు తెలియవలెను. శాస్త్రప్రమాణము కలిగి యుండుట చేత మనపురుషులలో నిదిసదాచారమేయయినను స్త్రీలలో మాత్ర మిదిదురాచరమని నేను భావించెదను; ఆదేశమునందేలాగుననో స్త్రీలు స్వతంత్రురాండ్రయి తమ కనుకూలముగా శాస్త్రములను తాఱుమాఱు చేసినందున, ఈయనర్ధమంతయు పుట్టినది. ఆసంగతి పోనిచ్చి కథాంశమును వినుఁడు.

సాభాపత్నులు శ్రీజగద్గురువులవారి యాజ్ఞ నంతగా మన్నించక పోవుటయు , అందుచేత మతధర్మము లాచరణములేక చెడిపోవలసినగతి సంభవించుయు చూచి ఖేదపడి గంభీదంభీగారు జీర్ణమతోద్ధారణమునకు గురుభక్తి నిలుపుటకు సభచేసి పూర్వాచాగ శాస్త్రమహిమలను భూషించుచు, నవనాగరికురాండ్రను దూషించుచు, గొప్ప యుపన్యాసము చేసిరి. అదిమిక్కిలి పెద్దదగుటవలన దానిక డపటి భాగమును మాత్ర మిందు తెలిఁగించెదను:

" ఓమహాకాంతలారా! నాయుపన్యాసము విన్నారు కదా! ప్రజలేట్లు చెడిపోవుచున్నరో కన్నారు గదా! నవ నాగరికకు రాండ్రలన దేశమునకు ఁ గలుగుచున్న యనర్ధములను గనిపెట్టినారు గదా! వారిప్పుడు పురిషులకు విద్య కావలెననుచున్నారు; రేపు అపత్నీకుల
ఆడుమళయాళము


ముక్కులు కోయఁగూడ దందురు; ఆపయిని పుణ్యపురుషులు నినుపపెట్టెలలో పెట్టి తాళము వేయఁగూడ దందురు; అటుపిమ్మట వ్రద్ధపురుషులు పత్నులతో సహగమనము చేయఁగూడదందురు ; కట్టకడపట అపత్నీకులయిన పురుషులు మరల వివాహమే చేసి కొనవచ్చు నందురు. ఇంతకు వచ్చినది మఱియెంతకైనను రాకమానదు. ఆదుష్టురాండ్ర ప్రయత్నాంకురములను వికసింపనియ్యక మనము మొగ్గలలోనే త్రుంచి వేయవలేను. దేశాచారము సంరక్షిపవలయును. శాస్త్రధర్మములను నిలుపవలెను. దేశమతాభిమానుములను వహింపవలెను.ఆమూడురాండ్ర శాస్త్రజ్ఞానము లేని వారయి బుద్ధివాదములు చేయుచున్నారు. శాస్త్రబద్ధులమయిన మనకు మనుష్యబుద్ధి ప్రమాణముకాదు. పయి మతసత్యములు శాస్త్రముచేతఁగాక మఱి యేబుద్ధివలనఁ దెలియును? పాపాత్మురాండ్రయిన నవనాగరికురాండ్రు శాస్త్రనిషిద్ధమై ద్వాదశమహాపాతకములలోను గోరతమమైన పెండలవు దుంపకూరను రహస్యముగా నెవ్వరు నెఱుఁగకుండ తినుచున్నారఁట ఎంతఘ్ోరక్రత్యము చేయుచున్నారో చూచినారా? చూచినట్లొక్కరు పలుకరేమి? స్వపక్షస్ధాపనము కొఱకును పరపక్ష నిరాకరణము కొఱకును కల్లలాడవచ్చును. మతవిషయమున అసత్యదోషము లేదు. ఇది సూక్ష్మధర్మము. నామాట నమ్ముఁడు. చూడకపోయినను మీరిప్పుడు చూచినట్లు చెప్పుచున్నారు. నాకిప్పుడు పరమసఓతోషముగా నున్నది. మీరు నవనాగరిక బోధను నిర్మూలము చేయుటకు శ్రీజగద్గురువులు వారి యధికారము ను వ్యాపింపఁజేయుటకును దేశ మతాభిమానులు గలవారు ప్రాణములు కాశపడక పోరాడుఁడు".
ఈయుపన్యాసమువలన జనులు మనస్సులన్నియు పూర్వాచార పక్షమును తిరిగిపోయినట్టు కానఁబడినవి. మఱుసటిదినము మొదలుకొని ప్రజలు నవనాగరికుల విషయమున ననేకసత్యములను జెప్పుచు, అనేక

దోషారోపణములు చేయుచు , అనేకపవాదములను వేయుచు , వారిని మూర్ఖమహాజనుల ద్రష్టియందు హాస్యాస్పద్పులనుగాఁ జేయునారంభించిరి . ఈ పామర మహాజనాభిప్రాయ ప్రవాహనము నరికట్టి మరిలించుట కయి నాయజమానురాలును నేనునుగూడ పురుషస్వాతంత్ర్య విషయమున నుపన్యసించి నరంభించితిమి. నాయుపన్యాసముయొక్క పర్యవసానమును మీకుపయి ప్రకరణమునఁదుఁజెప్పెదను.

ఎనిమిదవ ప్రకరణము

గంభీదంభీగారి యుపన్యాసమయిన మూఁడవనాఁడు" పురుష స్వాతంత్ర్యములనుగూర్చి సత్యరాజాచార్యుడుపన్యసించును గనుక పర స్త్రీ మహాజనులఁదరును రాజకీయ పాఠశాలమందిరమునకు భానువారమునాఁడు ప్రాతఃకాలమున విజయం చేయఁ బార్ధింపఁ బడుచున్నారు" అని యొక ప్రకటన పత్రికను నాయజమానురాలయిన ఫాంఢీభంగీ గారు పురజులందరికి బంపిరి. కాల వైపరీత్యమువలనఁ గలుగిన యావిడ్డూరమును జూడవలయునని నాఁటి ప్రతఃకాలమున పురమునందలి సుందరీ బ్రందమంతయు పాఠశాలామందిరముకును దయచేసి సభ తీర్చియుండెను. ఆ వచ్చినవారిలో దుంఢీలంఢీగారును , గంభీదంభీగారును , అల్లరి జరగకుండ కాపాడుటకయి మాయజమానురాలిగారిని కోరిక ప్రకారముగాఁగొందఱు రక్షక భటురాండ్రును వేత్రహస్తలై వచ్చిరి. ఉపన్యాససమయము సమీపించినప్పుడు నాయజమానిరాలితోఁగలసి నేనచ్చటికిఁబోవునప్పటికి పారస్త్రీమహాజనులు "వంటయింటి మూలనడఁగి యుండక పురుషభూషణమైన లజ్జనువిడిచి మగవాఁడొకఁడు నేఁడు సభకువచ్చునఁట ! " అని యొకతెయు, "ఊరక