కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు/సత్యరాజా పూర్వదేశ యాత్రలు-ప్రథమభాగము-ఎనిమిదవ ప్రకరణము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

దోషారోపణములు చేయుచు , అనేకపవాదములను వేయుచు , వారిని మూర్ఖమహాజనుల ద్రష్టియందు హాస్యాస్పద్పులనుగాఁ జేయునారంభించిరి . ఈ పామర మహాజనాభిప్రాయ ప్రవాహనము నరికట్టి మరిలించుట కయి నాయజమానురాలును నేనునుగూడ పురుషస్వాతంత్ర్య విషయమున నుపన్యసించి నరంభించితిమి. నాయుపన్యాసముయొక్క పర్యవసానమును మీకుపయి ప్రకరణమునఁదుఁజెప్పెదను.

ఎనిమిదవ ప్రకరణము

గంభీదంభీగారి యుపన్యాసమయిన మూఁడవనాఁడు" పురుష స్వాతంత్ర్యములనుగూర్చి సత్యరాజాచార్యుడుపన్యసించును గనుక పర స్త్రీ మహాజనులఁదరును రాజకీయ పాఠశాలమందిరమునకు భానువారమునాఁడు ప్రాతఃకాలమున విజయం చేయఁ బార్ధింపఁ బడుచున్నారు" అని యొక ప్రకటన పత్రికను నాయజమానురాలయిన ఫాంఢీభంగీ గారు పురజులందరికి బంపిరి. కాల వైపరీత్యమువలనఁ గలుగిన యావిడ్డూరమును జూడవలయునని నాఁటి ప్రతఃకాలమున పురమునందలి సుందరీ బ్రందమంతయు పాఠశాలామందిరముకును దయచేసి సభ తీర్చియుండెను. ఆ వచ్చినవారిలో దుంఢీలంఢీగారును , గంభీదంభీగారును , అల్లరి జరగకుండ కాపాడుటకయి మాయజమానురాలిగారిని కోరిక ప్రకారముగాఁగొందఱు రక్షక భటురాండ్రును వేత్రహస్తలై వచ్చిరి. ఉపన్యాససమయము సమీపించినప్పుడు నాయజమానిరాలితోఁగలసి నేనచ్చటికిఁబోవునప్పటికి పారస్త్రీమహాజనులు "వంటయింటి మూలనడఁగి యుండక పురుషభూషణమైన లజ్జనువిడిచి మగవాఁడొకఁడు నేఁడు సభకువచ్చునఁట ! " అని యొకతెయు, "ఊరక
ఆడుమళయాళము

 
సభకు వచ్చుటకు మాట్రమేకాదు సిగ్గువిడిచి యచ్చట స్త్రీలముందు తగదునని ముచ్చటింపఁ బూనునట " అని యింకొక తెయు , కాలమహిమవలన నెట్టి నైపరిత్యములయినను పుట్టుచున్నవి.! అని మఱియొకతెయు, "తెఁ బడిపురుషుఁడూ సభలో ప్రసంగింపవెడలుట దేశారిష్టము !" అని వేరొకతెయు, ఇట్లు పురుషుల మాటలు సాగనిచ్చుట యవమానకరము.! " ఆ యొండొకతెయు , తమలోఁదాము ముక్కులమీద వ్రేళ్ళు వేసికొని యద్భుతపడుచు చెప్పుకొను మాటలు మాచెవులఁ బడినవి. అంతట నుపన్యాస సమయము సమీపించినందున సభ వారిచే దుండీలంఢీ గ్రాసనాసీనురాలుగాఁ జేయఁబడిరి. తరువాత నేనుపన్యసింప మొదలు పెట్టితిని;-

"ఓ పుణ్యసతులారా! స్త్రీలకు వలేనే పురుషులకును భగవంతుఁడు బుద్ఢిని దయచేసియున్నాడు."

పొరమహాస్త్రీలు లేదులేదు.ఇది సర్వాబద్ధము స్వభావవిరుద్ద్ధము. పురుషులకు బుద్ధిలేనేలేదు. స్ర్తీలకు సేవ చేసి బ్రదుకవలసిన పురుషులకు దేవుఁడు బుద్ధియిచ్చినాఁడనుట దైవదూషణము: శాస్త్రదూషనము.

"అమ్మలారా! నా మాటలు కొంచెము వినినితరువాత మీ యభిప్రాయమును జెప్పవచ్చును. కొంచెము శాంతివహింపుడు. ఈ దేశమునందు చదువు లేకపోవుటవలన పురుషులలో బుద్ధివికాసముకానరాకున్నను"

పార మహాకాంతలు (చెవులుమూసికొని) కటకాటా! నేఁడెట్టి పాపపు మాటలు వినుచుంటిమి ! పురుషులకఁట ! చదువఁట ! ఏమి యీ కలియునుప్రభావము! ఏమి యీదుష్కాలమహిమ! చదివిన పురుషుని జూచినచో నచేలస్నానము చేయవలేనని శాస్త్రములు చెప్పు

సత్యరాజాపూర్వదేశ యాత్రలు

 

చున్నవి. ఉన్నదుర్గుణములు చాలక పురుషులకు చదువుకూడా చెప్పించి మఱింతమతి చెఱుపవలెనుగా!

"అమ్మలారా! నావాక్యము కడతేఱవినుఁడు. ఈ దేశము నందు విద్య లేకపోవుటవలన పురుషులలో బుద్ధివికాసము కానరాకునన్ను, ఈదేశమునందలి స్ర్తీలకు వలేనే మాదేశమునందు పురుషులకు విద్య చెప్పించుట చేత వారక్కడ బుద్ధిశాలులయి."

పారమహాంగనలు -మీది పాడు దేశము;పిశాద దేశము; రాక్షసదేశము ;మీపాపిష్టి దేశముమాట మాకుచెప్పకు; మీది పాపాత్ములుండెడు నరకభూమి.

"మీరు నన్ను దూషించినను దూషింపుఁడు. పరమపాపమైన మా దేశమును మాత్రము దూషింపకుఁడు, మాది మహర్షులుండిన పుణ్యభూమి; యజ్ఞాదులకు జ్స్న్మస్ధానమయిన కర్మ భూమి; మాదేశ మనంతములయిన మహిమల కాస్పదమయినది. _ కుండలోనుండి పుట్టిన యొక మహాపురుషుఁడు సూర్యబింబమును పండిని మింగినాఁడు.రెల్లులోఁబుట్టిన యొక మహాపురుషుఁడు క్రౌంచమహాపర్వతమునకు తూటుచేసినాఁడు._"

పౌరమహానారులు _చాలు; నోరుమూసికో. నీవసత్యవాదివి; నీవు దొంగవు; నీవు కల్లఱివి. దైవస్రష్టిలో స్ర్తీలకుండును గాని పురుషులుకిట్టి మహిమ లెక్కడ నునుండవు. నీవు శంఠవు; త్రాగబోతువు; ఉన్మత్తుఁడవు.

"ఓయగ్రాసనాసీనులాలా! వీరు నన్నెట్లు దూషించుచున్నరోచిత్తగించుచున్నారా? "

ఆగ్రాసనాసీనురాలు_ ఓపౌరనారీమణులారా! ఒక్కనిమిష

`ఆడుమళయాళము

మూరకండుఁడు. ఓయుపన్యాసకా! నీవుపనికిమాలిన మీదేశవర్ణన మునుమాని చెప్పవలసినసంగతి చెప్పు.

" స్త్రీలకు వలేనేపురుషులకును గొన్ని స్వాతంత్ర్యములు గలవు"

"ఒక్తె_ఏనియులేవు.

ఇంకొకతె_ వారికున్న స్వాతంత్ర్యమంతయు స్ర్తీలకు దాస్యము చేయుట.

మఱియుకతె _ పత్నీశుశ్రూషచేయుట.
వేఱొకతె_స్త్రీసేవ చేసుకొనుచు మూలనడిఁగి యుండుట.

"నేనిచ్చటి పురుషులకు స్ర్తీ పరిచర్య ధర్మము కాదనను. శాకపాకములు జిహ్వకింపుగాఁ జేయుటకు సహితము పురుషుఁడు చదువునేర్చి పాక శాస్త్రము నభ్యసింప వలయును గదా?"

"పౌరమహాకామినులు _అక్కఱలేదు. అభ్యాసముచేతనే పాకముచేయు నేర్పుకలుగును. పురుషులకు స్వప్నములోను చదువన్న పేరు చెప్పఁగూడదు.


"అట్లనఁగూడదు. చదువుకొనకపోయినయెడల పురుషులు జ్ఞానహీనులయిన పశుసమానులగుదురుగదా?"


పౌర-- పురుషులు చదువులేనప్పుడే పశువులు. కోతి గొబ్బరికాయవలెవారికి చదువుగూడ నబ్బినపక్షమున, స్వభావదుష్టులయిన పురుషులు పశువులకన్నను తక్కువవారగుదురు. పురుషులకు జ్ఞానముతో పనిలేదు. పురుషులకు సమస్తధర్మములను సమస్తకర్మములను సమస్తపుణ్యములను సమస్త వ్రతములను పత్నీసేవలోనే యిమిడియున్నవి.పత్నులయుచ్ఛిష్ట భోజనమే పురుషులకు మోక్షసాదనము; పత్నుల పాదోదక పానమే పురుషులకు సర్వసుఖదాయకము. పురుషులకు పత్ని యొక్క తెయే

సత్యరాజాపూర్వదేశ యాత్రలు

పరమ దైవతము. పురషులకు పత్ని సేవయొక్కటియే శాస్త్రవివాహితమయిన సనాతనధర్మము.

"ఓ కాంతామతల్లులారా! తల్లులారా! న్యాయబుద్ధితో నాలోచింపుఁడు. శస్త్రము న్యాయవిరద్ధముగా నునప్పుడు_"

గంభీదంభీ_ అదిగో శాస్త్రదూషణ వచ్చుచున్నది. ఈ పాపాత్ముడు శాస్త్రతిరస్కారము చేయుచున్నది. శాస్త్రములో నున్న దేదియు న్యాయవిరుద్ధమగాదు. నిత్యమును నూఱుకల్లలాడుమన్నను, వేయిహత్యలు చేయిమన్నను , లక్షదొంగతనము లాచరించుమన్నను, శాస్త్రములోఁ జెప్పియున్నయెడల నివియన్నియు పరమధర్మములగును. ఓతోఁబుట్టువులారా! ఇట్లు కొఱగాని మగపుట్టువు పుట్టిన వ్యర్ధుఁడొకఁడు శాస్త్రనింద చేయుచుండగా చెవుకు పెట్టుకొని వినుచు నూరకున్నాడేమి? మీశాస్త్రాభిమానము చచ్చిపోయినదా? మీరు స్ర్తీజన్మ మేత్తలేదా?

ఒకతె_ఈ పురుషకీటకమును జావఁగొట్టుండి.

ఇంకొకతె_శాస్ర్తదూష్ణముచేసిన వీని నాలుకను కోయండి.

మఱియెకతె _ సిగ్గులేక సభకు నడిచివచ్చిన వీనికాళ్ళను విఱుగఁగొట్టుండి.

వేఱొకతె_ పురుషవిద్యయని కాఱులఱచిన వీనిగొంతు పిసుకండి.

ఈ ప్రకారముగా పలువురు పలు విధములుగా నన్ను దూషించుచు పరిహసించుచు నా మీఁదపడి నాయజమానురాలు వారించు చున్నను నిలువక కొందఱు వీపుమీదను కొందఱు మొగము మీదను చేతులతోను మోచేతులతోను కాళ్లతోను చరచియు పొడిఛియు తనియు నన్ను ప్ర్ర్ర్రాణావశిష్ఠుని జేసి విడిచిరి. రక్షకబటురాండ్రా సందడిలో దండపాణులయి యనభటులవలె నన్ను రక్షింపవచ్చినట్లు నాదాపునకు వచ్చిరి కాని వారిగుఱి యపూర్వమైన దగుట

ఆడుమళయాళము

చేతనో మఱియేహేతువు చేతనో వారి వేత్ర ప్రహారము లన్నియు నామీదనేకాని యల్లరి మూఁకమీఁద నొక్కటియు పడలేదు. కొంతసేపటికి నేను మూద్ఛిల్లితిని. రక్షకభటురాండ్రు నాకు శైత్యోపచారములు జేసి మూర్ఛతెలిసిన తరువాత నన్ను ధర్మవైద్యశాలకు బండి మీదగొనిపోయి యచ్చటి రాజకీయ వైద్యురాండ్ర కొప్పగించిరి. నే నిరువది దినములు వారిచికిత్సలో నన్ను తరువాతనేను లేచి భూమి మీఁద నడుగు పెట్టి కొంచెము తిరుగుట కారంభించితిని. రాజకీయోద్యోగిని లీదొమ్మిచేసిన వారిని పట్టుకొవలసిన దని రక్షక భటురాండ్రకాజ్ఞాపించినను, వారాదొమ్మి సమయమునందచ్చట నుండి భయము చేత కన్నులు మిరుమిట్లు గొని చూడలేనివారై నందున నొక్కరి నైనను పట్టుకోలేక పోయిరి. నేను వైద్యశాలలోనున్న దినములలో ప్రతిదినమును తప్పక ఫాంఢీభంగీగారు వచ్చి నన్ను చూచిపోవుచుండిరి. వైద్యశాలాధికారిణియు నాయందు పుత్రవాత్సల్యము కలదై నాపథ్య పానములను స్వయముగా విచారించుచు మంచిమందుల నిచ్చుచువచ్చెను. ఆకాలములో ఫాంఢీభంగీ తల్లిగారును రెండుమూడు పర్యాయములు వైద్యాశాలకు వచ్చి నాక్షేమమును విచారించుచు, ఒకనాఁడు నన్నుఁజూచి " నీవిట్లు కాని దేశములలో దిక్కుమాలిన పక్షివయి చచ్చుటకంటె సుఖముగా స్వదేశమునకుఁ బోయి హాయిగా నుండరాదా?" అని ప్రశ్నవేసెను. అప్పుడు మాయిరువురకు నిట్లు కొంత సంభాషణ జరిగింది._

"అమ్మా నాకును స్వదేశమునకుఁ బోయలెననియే యున్నది."

"ఉన్నయెడల శీఘ్రముగాఁబోరాదా?"

"పోవుటకు నాకు శక్తి లేదు. మాదేశమార్గము నేనెఱుఁగును."

"దారియెరుఁగకుండ మీదేశమునుండి మాదేశమునుండి మాదేశమున కెట్లు వచ్చితివి?"

"గురుప్రభావముచేత."

సత్యరాజాపూర్వదేశ యాత్రలు

 
"ఇప్పుడును మరల గురుప్రభావము చేతనే పొమ్ము."

"ఇప్పుడు దారిచూపుటకు మాగురువిక్కడలేఁడు."

"గురువునై దారిచూపుటకు నేనిక్కడనున్నాను. నాయుపదేశము గైకొమ్ము. నీవు శీఘ్రముగా పోనియెడల, నిన్నిచ్చటివారు తప్పక చంపివేయురు."

అని నాకామె యెకమంత్రము యుపదేశించి యీమంత్రమును మూఁడులక్షలు జపముచేసిన యెడల సిద్ధియగుననియు, అప్పుడా మంత్ర ప్రభావముచేత కోరిన దేశమునకు పోయి వాలవచ్చు ననియు, చెప్పెను. నెల దినములకు నేను పూర్ణముగా స్వస్తుఁడనయిన మరల నెప్పటియట్ల వీధిలో తిరుగ సాగితిని. తరువాత వైద్యశాల వారు నాకు బలమైన ఘాతకలిగినట్లు విముక్తి పత్రము నిచ్చిపంపి వేసిరి. నేను మరల వచ్చి ఫాంఢీభంగీగారి లోపలఁ బ్రవేశించితిని. నేను వీధిలో బయలు వెడలునప్పుడెల్లను స్త్రీలు నన్ను వ్రేలితోఁజూపి యెగతాళిఁ జేయుచు, వీని నీసారి ప్రాణములతో విడువగూడదని తమలో ననుకొనుచు, నన్నుఁజూచి నవ్వసాగిరి. స్త్రీలకు స్వాతంత్ర్యమున్నయెడల నెట్టికీడులుమూడునో కనిపెట్టితిరా? " నస్ర్తీస్వాతంత్ర్యమర్హతి" యని చెప్పిన మనశాస్త్రకారుఁడు వెఱ్ఱివాఁడు కాఁడు. సామాన్యులు కనిపెట్టలేరుకాని సర్వజ్ఞఉలైన మన పూర్వులేంతటి బుద్ధిమంతులైననౌతురు. మన దేశమునందు మాత్రము మనమెన్నఁడును పురుషనామము భూమి మీద హ్నున్నంతవరుకు స్ర్తీలకు స్వాతంత్ర్యమణుమాత్ర్రము రానియ్యఁ గూడదు.

అప్పుడు నాకాదేశము విడిచి శాఘ్రముగా పోవలేనన్న బుద్ధిపుట్టినది. ఇట్లు చెప్పఁగానే మీరు ననదేశమునందలి యాఁడు వారికివెఱచి పాఱిపోవుచున్న భీరునిగా భావింతురేమో! మీరట్లెంతమాత్రమును తలఁపఁగూడదు. మహా భారత యోధుల జన్మభూమియైన భరతఆడుమళయాళము

ఖండమునందు బుట్టి, యందులోను ముఖ్యముగా విఱికికండలేని బ్రాహ్మణు కులమునం దుద్భవిణ్చిన నాకు పౌరషము కొఱఁతవడునా? ముమ్మాటికిని పడదు. సమయము వచ్చిన యెడల నేను ప్రాణములను త్రణప్రాయంగా విడువఁగలను. అయినను నేనాదేశములో మృతుఁడ నయ్యెడు పక్షమున నాకు వీరస్వర్గము సిద్ధమేయినను , మీకీ వార్తలు చెప్పి మిమ్మానందింపఁ జేయువారు మఱియొకరు దొరకరని మీమిఁది యవ్యాజాను గ్రహము చేతినే నేను కరస్ధమైన యింద్రుని యర్ధాసనమును రంభా సంభోగమును మానుకొన్నానుగాని మఱియొక కారణ్ముచేతఁగాదు. నానిమిత్తమయి కష్టపడుచున్న ఫాంఢీభంగీగారిని విడిచి క్ర్ర్ర్రతఘ్నఁడనయి స్వార్ధపరత్వముచేత పోవుచునాండననియు మీరనుకొనఁగూడదు.నామూలమున ఫాంఢీ భంగీగారికి విపత్తులు వచ్చిన మాటసత్యమే. ఆయాపదలను దలఁచియే నేను తమ దేశమునుండి వెడలిపోయినయెడల తనపుత్రికకు కష్టములు తొలగునని ఫాండీభంగీగారి మాత నాకామంత్రము నుపదేశించినదిగాని నాయొందలి యొక్క నిర్వ్యాజానుగ్రహము చేతనేకాదు. ఆమాట పోనిండు. నే నాదేశమును విడువ యత్నించుట కింకొక ముఖ్యకారణము కూడఁ గలదు. హిందువులు దేశాటనము చేసి క్రొత్తదేశములను కనిపెట్టువారు కారనియు, నూతనముగా శోధించి చరిత్రములు వ్రాయ సమర్ధులుకారనియు, పశ్చిమ ఖండవాసులు మనమీఁద రెండు నిందలు మోపియునున్నారు. ఈరెండు నిందలను కల్లచేసి మన దేశమునకు ఖ్యాతితెప్పించవలెనన్న సచ్చింతతో నాయమూల్యములైన ప్రాణములు నాపాడుడేశమునకు బలిపెట్టక లేచి పోయినాడను. నేను కనిపెట్టిన యీదేశములను ,నేను నేను వ్రాసియీచరిత్రను , విన్న వారను హిందువులయం దిఁకముందీ రెండు నిందలు నారోపింపిపక నవకాశాము లేనివారయి హిందువు లెంతటికైన సమర్ధులేనియు యెప్పుకొని మనలను వేయి నోళ్ళ శ్లాఘించి
 

సత్యరాజాపూర్వదేశ యాత్రలుపూజింపవలసినవా రగుదురుగదా? ఓ చదువరులారా ! మన దేశమునకు నేను సంపాదించిన యీకీర్తి తో మీరు కొంతకాలము వరఱకు త్రప్తిపొందియుండుఁడు.

పరదేశయాత్ర త్వరితముగా నెరవేర్చ వలేనన్న బుద్ధితో నేనొంటిగా రంఢీనగర ప్రాంతము నందలి యరణ్యమునకుఁ బోయి నా యజమానురాలి తల్లి యుపదేశించిన మంత్రమును పునశ్చరణము చేయుచుండఁగా ఒకసిద్ధుఁ డాక్షస్మికముగా నాకాశము నుండిదిగి నాయెదుట నిలిచెను. నేనామహాత్మునకు భక్తి పూర్వకముగా నమస్కారము చేసి చేతులుజోడించు కొని నిలువఁ బడితని. ఆ అసిద్ధాంద్రుఁడను తానేయనియు, మంత్రసిద్ధి చిరకాలమునకు ఁగాని కాదని దివ్యజ్ఞానముచే నెఱిగి నాకాపరసరియ్యవచ్చితి ననియు, చెప్పి యామూలిక పేరు కూడ నాకనుగ్రహించి యద్రశ్యుఁ డయ్యెను. ఆయోషధి పేరు దుత్తూరవర్ణి. దానియాకులు నల్లయుమ్మెత్తా కులవలెనుందును. పువ్వులు కొండ తంగేడు పువ్వులవలె నుండును. కాడలు కలువ కాడలవలె నుండును. ఆచెట్టు సమూలముగాఁ దెచ్చి నూఱి పసరుదీసి కాలికి రాచుకున్నయెడల మనము కోరిన చోటికెల్లను మనోవేగమునఁ బోవచ్చును. ఈ చెట్లు విశాఖపట్టణము లోని యల్లికొండమీదఁ గావల సినన్నియున్నవి. నేనాచెట్టుపసరఱకాలికి పూసికొని లంకాద్విపమునకుఁ బోవలేనని మనస్సులో సంకల్పించు కొనఁగానే క్షణకాలములో నేసాలంక జేరితిని . ఈ ప్రయాణకథ మొదలగు వానిని గూర్చి మీకుముందు తెలిపెదను. నేను బయలు దేఱిన దినముతో రంఢీ దేశమనందు మూఁడు సంవత్సరములు రెండు మాసములు పందొమ్మిది దినములుంటిని.}}