కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు/రాజశేఖరచరిత్రము-మూడవ ప్రకరణము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

మూడవ ప్రకరణము

రుక్మిణి యింటికిఁ బోవుట - గృహవర్ణనము - రాజశేఖరుఁడుగారు వచ్చి కచేరిచావడిలోఁ గూర్చుండుట - బందుదర్శనము - స్వహస్తపాకియైన వైశ్వదేవపరుడు.

సోపానము లెక్కి వీధిపొడుగునను దేవాలయముదాఁక తిన్నగా నడిచి, అక్కడ నుండి కుడి చేతి వంక నున్న వీధిలోనికి మళ్ళి కొంతదూరము పోయిన తరువాత, రుక్మిణి తూర్పువైపు సందు లోనికి రెండడుగులు పెట్టి నిలుచుండి వెనుకకు తిరిగి రెండుమాఱులు మెల్లగాదగ్గెను. ఆ దగ్గుతో సిద్ధాంతిగారి భార్యకూడ నిలుచుండి ' అమ్మాయీ! నేనుందునా?' అని వెనుక తిరిగి పలికెను.

రుక్మి-'మంచిది. సోమిదేవమ్మగారూ! నా కొఱకయి మీరు చుట్టు తిరిగి యింటికి వెళ్ళవలసి వచ్చినదిగదా?'

సోమి -ఎంతచుట్టు?నిమిషములో వెళ్ళెదను.

రుక్మి- 'పోయిరండీ

సోమి- బీదవాండ్రము మా మీఁద దయయుంచవనుజుండీ.

రుక్మి- 'దానికేమి? వెళ్ళిరండీ' అని నాలుగడుగులు నడిచి మరల వెనుక తిరిగి ' సోమిదేవమ్మగారు ! చెప్ప మఱచిపోయినాను. సాయంకాలము దేవాలయములోనికి వెళ్ళునప్పుడు మీరొక్కపర్యాయము వచ్చెదరుకాదా?'

సోమి- అవశ్యము, ఆలాగుననే వచ్చెదను. నేను పోయివస్తునా?

అని సోమిదేవమ్మ నదచినది. సిద్ధాంతిగారు గాని ఆయన పెద్దలుగాని యెప్పుడును యజ్ఞము చేసినవారు కాకపోయినను , సోమి
రాజశేఖర చరిత్రము

దేవమ్మ పుట్టినింటివంక వారిలో మాత్రము యజ్ౙము జేసినవారు బొత్తిగా లేకపోలేదు. సాక్షాతుగా ఆమె పితామహుఁడే యజ్ౙము చేసి యేఁటేట నొక్కక్కటిచొప్పున మూడు పదులమీఁద నాలుగు శ్రావణ పశువులను బట్టి మఱి రంభాదులతో స్వర్గసుఖ మనుభవింపబోయెను. సోమిదేవమ్మ తండ్రి యజ్ౙము చేయకపోయినను, తండ్రి యెంతో ధన వ్యయము చేసి సంపాదించుకొన్న వేళ్ళను మాత్రము పోఁగొట్ట నిష్టములేనివాఁడయి తన కుమారునకు సోమ జులనియు, మారెకు సోమిదేవమ్మ యనియు, నామకరణములు చేసెను. రుక్మిణియు సందులో నూఱుబాగలు నడిచి, అక్కడనుండి దక్షిణ్ముగ తిరిగి, ఆ సందులో రెండుగుమ్మములు దాఁటి పెరటి దారిని మూడవయిల్లు ప్రవేశించెను.

రాజశేఅఖురుఁడుగారి యిల్లు ఆకాలపుటిండ్లలో మిక్కిలి సుందరమైనది. వీధిగుమ్మమునకు రెండుప్రక్కలను రెండు గొప్ప అరుగులు కలవు. ఆ రెండు అరుగులకును మధ్యనుపల్లముగా లోపలికిఁబోవునదవ యున్నది. ఆనడవమొగమున సింహద్వారమున్నది. ద్వారబంధువు పట్టెలకు గడపదావున ఏనుఁగుతలమీఁద సింహము గూర్చుండి కుంభస్ధలమును బద్ద్దలు చేయుచున్నట్టు చిత్రముగా చెక్కబడి యున్నది. ఇరుప్రకలనందు నా సింహములయెక్క శిరోభాగములు మొదలుకొని గొడుగుబల్లవఱకును పువ్వులును కాయలను గల లత చెక్కఁబడి యున్నది. ఈకమ్ములకు పయిగా రెండు ప్రక్కలను కఱ్ఱగుఱ్ఱములు వీధి వైపునకు ముందరి కాళ్ళు చాచి చూచువరిమీఁద దుముకవచ్చునట్లుగాఁగానిపించును. ఈ గుఱ్ఱముల కాళ్లకే శుభదినములందు మామిడాకులతోరణములు గట్టుచుందురు. గుఱ్ఱముల రెంటికిని నడుమనుండు గొడుగుబల్లమీదఁ నడుమను మూడవ ప్రకరణము

పద్మమును పద్మముల కిరుపార్శ్వములను గుఱ్ఱములవఱకు చిత్రములయిన యాకులును పువ్వులును తీఁగెయును చెక్కఁబడియున్నవి.ఆఁతీగపైని కాళ్లు మోపి ఫలములను ముక్కుతో పొడుచుచున్నట్టు నడుమనడుమ చిలుకలఉ చిత్రింపబడి యున్నవి.వీధితలుపులకు బలమైన గ్రంధులు చేయఁబడి వానిపయినిసహి మొకవిధ మయిన పుష్పలత మలచఁబడియున్నది.


గుమ్మము దాటిలోపలికి వెళ్ళినతొడనే చావడియుండెను. ఆచవడి కెదురుగా పెద్దకుండు ఒకటియు౦డెను. వర్షము కురియునప్పుడు నాలుగు వైపులనుండియు చూరు నీళ్ళాకుండులోఁబడి వీధీచావడి క్రింద నుండు తూమూగుండ వీధీలోనికి బోవును. ఆకుండుకుత్తరవైపునను దక్షిణపువైపు నను ఒకదానికొకటియెదురుగా రెండు చావళ్ళుండును. అందుదక్షినపుదిక చేరిచావడి. దానిలో వివాహదులయందు తాంబూలములకు పిలిచిన బంధువులును పెద్ద మనుష్యులును సభ చేసి గూర్చుండగా , క్రింద బోగముమేళము జరుగుచుండెను. ఇతరసమయములలో పెద్ద మనుష్యులు చూడ వచ్చినప్పుడును. మధ్యాహ్నభోజన మయిన తరువాత పురాణకాల క్షేపము జరుగునప్పుడు, శిష్యులప్పుడు చదువుకోవచ్చినప్పుడును రాజశేఖరుడుగా రందుకూర్చుందురు.ఆచావడి రెండుప్రక్కలను రెండుగదులు గలవు. ఆచావడి దక్షిణపువైపు గోడకు పొడుగునను ఱెక్కల తలుపు లుండి, తీసినప్పుడెల్లను సభవారిచెమట లార్ప మలయ మారుతమును లోపలికిఁ బంపుచుండెను. ఆతలుపులకు వెనుక పంచపాళియు,దానివెనుక పలువిధము లయిన పూలమొక్కలతో నేత్రములకు విందుకొలుపు చిన్నదొడ్డి యుండెను. ఆచావడిలో మూడు గొడలకును నిలువె డెత్తునకుపయిని మేకులకు గొప్పపటములు

రాజశేఖర చరిత్రము

 వేయఁబడియున్నవి. అందు దశావతారములును మాతమే కాక, కృష్ణుఁడు గోపికల వలువలు నెత్తికొనివచ్చి పొన్నచెట్టు మీఁదఁ గూర్చుండి వారిచేఁ జేతు లెత్తి మ్రొక్కించుకొనుచున్నట్టును, వెన్నలు దొంగిలినందు కయి తల్లి రోటను గట్టిపెట్టి దాని నీడ్చుకొని పొయి మద్దులఁ గూలఁద్రొచినట్టును, మఱియు ననేక విధముల కృష్ణ లీలలుగల పట్టములును, కుమారస్వామి తారకాసురుని జంపుచున్నట్టును, పార్వతి మహిషసురుని వధించుచున్నట్టును, శివుఁడు త్రిపుసంహరమును చేయుచున్నట్టును నున్న సంబంధము లయిన పటములును, విఘ్నేశ్వరుడు ,సరస్వతి, గజలక్ష్మి , చతుర్ముఖుడు మొదలుగాగల మఱికొన్ని పటములును, గొడల నలంకరించుండెను.ఉత్తరపు ప్రక్క చావడిము ఈ విధముగానే యుండును. గాని గోడ కొక్కగుమ్మముమాత్రమే యుండి, అది తరచుగా మూయఁబడి యుండును. ఈ చావడిలో రెండు మూడు పాతసవారీ లెప్పుడును వ్రేలాడఁ గట్టఁబడి యుండును. రాజశేఖరుఁడుగా రప్పుడప్పుడు గ్రామాంతరములకుఁ బోవునప్పుడును పెద్దమనుష్యు లెవ్వరయినఁ దఱచుగా నెరు వడుగునప్పుడును ఉపయోగపడుచుండు క్రొత్త సవారీ మాత్రము ఋరకా వేయఁబడి చావడిలొ క్రిందనే పడమటిగోడదగ్గఱఁ జేర్పఁబడి యుండును. ఈచావడిగోడ కున్న తలుపు తీసి యుత్తరపు పంచపాళిలోనికి సోయినతోడనే దొడ్డిలొ నుయ్యియొకటి కనఁ బడును ఆనూతిపయి నుండుగిలకలు కీచుధ్వని చేయుచుండ నిరుగుపొరుగులవారు సదా నీళ్ళుతోడుకొని పొవుచుందురు. ఆనూతికి పడమటివైపున ధాన్యము నిలువ చేయు గాదెలు రెండు లోగిలిని చేరక ప్రత్యేకముగాఁ గడ్డింపఁబడియున్నవి. నూతికి సమీపముగా వీధిలొనికి పాణిద్వార మొకటియున్నది ఇంతకు మునుపు రుక్మిణివచ్చిన దాద్వారముననే. ఆదారినే యిరుగుపొరుగు వారు

మూడవ ప్రకరణమ

వచ్చి నీళ్ళుతోడుకొని పొవుచుందురు. మఱియు మధ్యాహ్నసమయమున చుట్టుప్రక్కల నొండు స్త్రీలు వారిని చూడవచ్చునప్పుడు, రాజశేఖరుఁడుగారు కచేరిసావడిలోఁ గూర్చున్న కాలమున లోపలి యాఁడువారు వెలుపలికి వెల్లవసినపుడును, ఆత్రోవనేవచ్చుచుఁబోవుచుందురు.

లోపలికుండునకు నాలుగుప్రక్కలను పనస కాయచేక్కననాలుగుస్తంభములున్నవి. వీధిచావడి కెదురుగానుండు పడమటిచావడిలొ లొపలికి పోవు నడిమి గుమ్మమొకటి యున్నది. ఆ గుమ్మమున లోపలికి ఁ బోవఁగానే చావడియొకటి కనిపించును. ఆ చావడి దక్షిణపు వైపున గుమ్మమొకటి యున్నది. ఆ ద్వారమున లోపలివెళ్లిన రాజశేఖరుఁడుగారు బరుండు గదిలోఁ బ్రవేశింతుము. గదిలొనుత్తరపు గోడ పొడుగునను దూర్పునుండి పడమటకు పందిరిపట్టె మంచము రాతిదిమ్మల మీఁద నాలుగుగాళ్ళనుమోపి వేయబడియున్నది. మంచమునకు చుట్టును దొమతెరయును జలరును దిగవేయఁబడియున్నది. పందిరిస్తంభములకు నడుమును లక్కపూసిన కొయ్యపళ్ళెములను బరిణెలు నుండెను. పందిరికి మధ్యగా లక్కకాయలను పువ్వులను గల చిలకల పందిరియొక్కటి వ్రేలాడుచుండేను. గొడాలకు సుద్దతొ వెల్లవేయఁబడి యుండెను. గోడలపొడుగునను రుక్మిణియుతల్లియు నోపికచేసినట్టిన గోడసంచులు తగిలించఁబడి యుండెను.ఆ గోడసంచులకు కొంచెము మీఁదుగా గుడ్డ చిలుకకు దారములతో త్రాళ్ళకు కట్టబడి గాలికి సుందరముగ కదులుచుండును.గోడకు పెద్దమేకులు కొట్టి వానిమీఁదఁబెట్టిన బల్లమీద కొండపల్లి బొమ్మలును లక్కపిడతలును గది కలంకారభూతముగ నుండెను. గోడ సంచులు కొట్టిన మేకులకు దశావతారములు మొదలయినపటములు చిన్నవి వేయబడియున్నవి. దక్షిణపుగోడకు శ్రీరాములవారి పట్టాభిషేకము తగిలింపబడి యున్నది. దానినే రాజశేఖరుడుగారు నిద్రలేచినతోడనె చూచి, ఆవల మఱియొకవస్తువునుజూతురు. గదికంబయిని ఆందమయిన బల్లకూర్పుకూర్పుబడియుండెను. మంచమున కెదురుగా దక్షిణపుగోడపోడుగునను గడమంచెమీగా వరుసగా కావడిపెట్టెలు పెట్టబడి యున్నవి. ఆ పెట్టెలలో సాధారణముగా ధరించుకొను వస్త్రములును నాగరలిపితో బంగాళాకాకితములమీద వ్రాయబడిన రాజశేఖరుడుగారి సంస్కృతపుస్తకములును వేయబడియుండెను. గదిలో పడమటిగోడతట్టున పెద్దమందస మొకటి గట్టితాళము వేయబడి యుండెను. ఆమందసములోపలనున్న చిన్న తాళపుపెట్టెలలో నగలును పండుగదినములలో ధరించుకొను విలువబట్టలును రొక్కమును ఉండును. చీకటిరాత్రులలో దొంగల భయము విశేషముగా నుండునప్పుడు రాజశేఖరుడుగారు ఆమందసముమీదనే పఱపు వేయించుకొని పరుందురు. మందసమునకును కావడిపెట్టెలున్న గడమంచెకును మధ్యను దక్షిణవైపున గదినుండి దొడ్డిలోనికి బోవుమార్గ మొకటి కలదు. ఆ మార్గమున దొడ్డిలో ప్రవేశించినతోడనే విశాలమయిన చేమంతిమడి యొకటి పచ్చని పూవులతోను మొగ్గలతోను నేత్రోత్సవము జేయుచుండెను. దాని కెడమ ప్రక్కను గొంచెముదూరమున మల్లెతీగెలు పందిరిమీద నల్లుకొని యకాలమగుటచే నప్పుడు పుష్పింపకపోయినను పచ్చనికాంతుల నీనుచు మనోహరముగా నుండెను.

రాజశేఖరుడుగారి పడకగది ముందఱిచావడిలో దూలమునకు జిలుకపంజర మొకటి వ్రేలాడగట్టబడియుండెను. అందులో నున్న చిలుక సదా "ఎవరువారు" "ఎవరువారు" "పిల్లివచ్చె కొట్టు కొట్టు""కూరోయితోటకూర" మొదలగుమాటలనుసహజ మధురస్వరముతోపలుకుచుండును. ఆదూలమునకేమఱికొంత దూరమునరామాయణము మొదలయినతాటాకు లపుస్తకములుత్రాళ్ళతో వ్రేలాడఁగట్టఁబడియుండును. ప్రొద్దుననేనిద్రలేచిరుక్మిణి చిలకనుపంజరమునుండి తీసిచేతిమీఁదనెక్కించుకొని "చేతిలోవెన్నముద్ద "మొదలుగాఁగల పద్యములనుసహితము నిత్యమునునేర్పుచుండును. ఆకాలములోఁదఱచుగా స్త్రీలుచదువుకొను నాచారములేకపోయినను, రాజశేఖరుఁడుగారుతనకుమార్తెమీఁదిముద్దుచేతిదానెరుక్మిణికిక్రొత్తపుస్తకమును అన్యసాహాయ్యము లేకుండనర్ధముచేసికొను శక్తిగలుగునంత వఱకువిద్యనుచెప్పెను ఆమెస్వభావముచేత నేతెలివిగలదగుటచే విద్యకూడ దానికి సాయమయి చిన్నతనములోనే యుక్తాయుక్తివివేకమును జ్ఙానమునుకలదియాయెను. తండ్రి యామెకు చదువుచెప్పుటచూచి యసూయచేత నిరుగుపొరుగులవారు చాటున గుసుగుసలాడు కొనిరిగాని, రాజశేఖరుఁడుగారు ధనికులగుట వలన నేమియుఁబలుకు సాహసింపకపోయిరి. అట్లనివారు బొత్తిగానూరుకున్నవారుకారు. పెద్దవాఁడని రాజశేఖరుఁడు గారుగౌరవముతోఁ చూచుచుండెడి యొకయాప్తబంధుని మెల్లఁగాబ్రేరేపించి, ఆయనచేతాందఱునుసభలోఁ గూర్చుండియుండగా "నాయనా!మనయింట ఆఁడుపిల్ల్లలను జదివించు సంప్రదాయములేదే, మనరుక్మిణినేలచదివించెదవు? "అనిపించిరి. రాజశేఖరుఁడుగారు విద్యవలని లాభములనెఱిఁగిన వాడగుటవలనను, స్త్రీవిద్యయే శాస్త్రమునందును నిషేధింపఁబడియుండక పోవుటయు పూర్వపుపతివ్రతలందఱు విద్యావతులయి యుండుటయు నెఱిఁగినవాఁడగుట వలనను ఆవృద్ధుని వాక్యములను లక్ష్యముచేయక స్త్రీవిద్యాభ్యాసమునకనుకూలముగాఁ గొన్ని స్మృతివాక్యములను జదివి మీ రాజశేఖరచరిత్రము

యభిప్రాయమేమనిసభలోనున్నవారినడిగెను. వారందఱునుమనస్సులో స్త్రీవిద్యయన్ననేవగించువారేయయినను రాజశేఖరుఁడుగారి యభిప్రాయముతెలిసి న పిమ్మటదానికివ్యతిరిక్తముగా నేమియుజెప్ప నలవాటుపడినవారుకారుగావునస్త్రీవిద్యాభ్యాసమువలనగణనాతీతములయినలాభములుగలవనిపొగిడిరుక్మిణికివిద్యనేర్పుచున్నందునకయి రాజశేఖరుఁడుగారినిశ్లాఘించిరి.


చిలుక పంజరమున్న తావునుండి నాలుగుబారలు నడిచిన తరువాత పడమటింటిద్వారమున్నది. పడమటియిల్లు విశాలమయి యేఁబదిమందిబ్రాహ్మణులు భోజనములు చేయుటకుఁ జాలియుండును. ఇఁకఁగొంచెము సేపునకు భోజనములకులేతురనఁగావెళ్ళిచూచినయెడల, మూరెడుమూరెడెడముగా రెండుగోడల పొడుగునను పీటలునుపీటలకుముందఱపిఁడిమ్రగ్గుతోపెట్టిన పట్లును చాలుగానుండును. పడమటింటి యీశాన్యమూలను గచ్చుతోఁగట్టినదేవునరుగుకలదు. ఆయరుగుపయిన 'భువనేశ్వర ' మనుదేవ తార్చనసామానులను సాలగ్రామాదులును పెట్టుపెట్టెయుండును. ఆపెట్టెమీఁదనే రాజశేఖరుఁడుగారు మడితో నిత్యమునుపారాయణచేయు శ్రీమద్రామాయణమును సుందరకాండము పెట్టఁబడియుండెను. రాజశేఖరుఁడుగారు స్నానముచేసి వచ్చిదేవునరుగుముందఱ పీటవేసికొనికూర్చుండి రామాయణమును పంచపూజయుచేసికొందురు. దేవునరుగునకెదురుగానున్న తలుపుతీసికొని యావలకువెళ్ళిన చోనొకపెరటిలోనికిఁబోవుదము. అక్కడసున్నముతోను ఇటుకలతోనుకట్టినతులసి కోటయొకటి నాలుగయి దడుగులయెత్తున నందమైయుండెను. ఆకోట లోపలల క్ష్మితులసియుకృష్ణతులసియు శ్రద్ధాభక్తులతోఁ బెంపఁబడుచుండును. ఆసమీపముననే కొంచెముదూరమున తులసివనమును మూడవప్రకరణములు


ఆవల నిత్తెమల్లిచెట్టును వాని చేరువనున్న నందివర్ధనపుచెట్టుమీఁదనల్లుకొన్న కాశీరత్నములను రాజశేఖరుఁడు గారికి నిత్యమునుదేవతార్చన కయి పుష్పపత్రాదులను సమకూర్చుచుండును. ఆపైని రుక్మిణియుఁ జెల్లులునుప్రేమతోఁ బెంచుకొనుచున్నబంతిచెట్లను, బొగడబంతిచెట్లను, జంత్రకాంతపుచెట్లను గోడపొడుగుననువరుసగానుండును. పడమటింటినంటియేదక్షిణవైపుననున్న వంటయింటి దొడ్దిలోపల నరఁటిబోదెలుపిలకలతో నిండియుండి చూపుపండువుగానుండును. రాజశేఖరుఁడుగారు ప్రత్యహమునూ అబోదెమొదలనెస్నానము చేయుదురు.

వెనుక చెప్పినచొప్పున రుక్మిణి స్నానముచేసివచ్చి గోదావరినుండి చెంబుతోఁదెచ్చిన నీళ్ళను తులసికోటలోఁబోసిమ్రొక్కి, తడిబట్టలతోనే చుట్టునుమూడు ప్రదక్షిణములుచేసి, లోపలికిఁబోయితడిబట్టవదలి పట్టుబడ్డకట్టుకొని యొక చేతిలోఁగుంకుమబరిణియు రెండవచేతిలో నక్షతలను బసపును బియ్యపు పిండియును గల గదులు పట్టెయునుబట్టుకొనివచ్చి, తులసికోటలో నంటియున్న ముందరివేదికమీఁద నీళ్ళుచల్లి చేతితో శుభ్రముచేసి బియ్యపుపిండితోపద్మములు మొదలయిన వింతవింతల మ్రుగ్గులను బెట్టుచు నడుమ నడుమఁజిత్రముగాఁ గుంకుమతోను పసపుతోను నలంకరించుచుఁగూర్చుండి, మధురస్వరముతోమెల్లగా, 'లంకాయోగము ' పాడుకొనుచుండును.

ఈలోపుగా రాజశేఖరుఁడుగారు వెంటనున్నవారితో నానావిషయములను ముచ్చటించుచునడుమనడును వారి కిఱ్ఱుచెప్పులజోళ్ళచప్పుడులలో నడఁగిపోయిన మాటలనుమరల నడుగుచుఁబలువురతోఁగలసి యింటికి వచ్చి, పాదరక్షలను నడవలోవిడిచి యొకరొకరేవచ్చి కచేరిచావడిలో రత్నకంబళముల మీఁదఁగూర్చుం
రాజశేఖర చరిత్రము

నగాఁ దామును దక్షిణపు గోడ కానుకొని యెండలో నుండి నడిచి వచ్చిన బడలిక చే బట్టిన చెమ్మట పోవ నుత్తరీయముతో విసరు కొనుచు గూరుచుండిరి. అప్పుడు నభిరాఘవాచార్యుడు నామముల తిరుమణి బెత్తికలు లేవ నెడమచేతులు నలుపు కొనుచు రాజశేఖరుడుగారి మొగము మిద జూడ్కి నిగిడించి,'దేవరనారి కీనడుమ స్వామి మిద్ కొంచె మనుగ్రహము తక్కువగా నున్నది.'అని యొకచిఱునవ్వు నవ్వి లేచి నిలువబడి బట్టలో నున్న గన్నేరుపూలలో మాలెను దీసి చేతిలో బట్టుకొని 'స్వామివారి యందు బరిపూర్ణకటాక్ష ముంచవలెను'అని వినయముతోప బలుకుచు మెల్లగా హస్తమునం దుంచెను.

రాజశేఖరుడుగారుభక్తితోబుచ్చుకొని,'యీమధ్య మనజనార్దనస్వామివారికి జరగవలసిన యుత్సనము లేమయిన నున్నవా' అని యడిగిరి.

రాఘ: పదియేనుదినములలోమార్గశిరశుద్ధచతుర్దశినాడును, పూర్ణిమనాడును వరుసగా తిరుమంగయాళ్వారి యొక్కయు,తిరుప్పాణాళ్వారియొక్క యుతిరునక్షత్రిములు వచ్చుచున్నవి.నెల దినములలో ధనుర్మాసము వచ్చుచున్నది. ఆ నెలదినములును స్వామికి నిత్యోత్సవములు సంక్రాంతి దినములలో నధ్యయనోత్సవమును జరగవలసి యున్నవి.ధనస్సులోనే పుష్యబహుళ ద్వాదశినాడు తొందరడిప్పొడియాళ్వారి తిరునక్షత్రము వచ్చుచున్నది.ఆ దినమున స్వామి యుత్సవముకన్నను విశేషముగా జరగవలెను.


రాజ-నిత్యమును స్వామికిబాలభోగమును నందాదీపమును క్రమముగా జరుగుచున్నవా? మూడవ ప్రకరణము

రాఘ-తమరు ప్రతిమాసమును దయచేయించెడి రూపాయలును బాలభోగమునకు జాలకున్నవి. ఇప్పుడుస్వాము లధికముగా వచ్చుచున్నారు.నందాదీపము క్రిందఁదమరు దయచేయు రూపాయతో మఱియొక రూపాయను జేర్చి యొకరీతిగా జరుపుకొనివచ్చుచున్నారు కాని నందాదీపములో మఱియొకరికి భాగముండుట నాకిష్టములేదు. స్వామికి బొత్తిగా వాహనములులేవు; పొన్నవాహన మొక్కటి యుండెనా రేపటి యద్యయనోత్సవములో నెంతయైన నిండుగానుండును. అది యీయేటికిఁగాకపోయిన మీఁదటికైనను మీకేదక్కవలెను. ముందుగా చెవిని వేసియుండిన నెందున కయినను మంచిదని మీతోమనవిచేసినాను.


రాజ-మొన్న దేవాలయములో స్వాములలో స్వాములేమో పొట్లాడినారట.


రాఘ-ద్వారకాతిరుమల నుండి వచ్చినస్వామి సాపాటుచేసి కూర్చుండి యుండగా, పెంటపాడు నుండి వేంచేసినస్వామి పెరుమాళ్ళ సేవచేసి వచ్చి కూర్చున్నరు.వారిద్దరిలో నొకరు తెంగలెవారును ఒకరు వడహలెవారును గనుక, నామముక్రింద పాద ముంచవచ్చును కూడదని మాట పట్టింపులు పట్టుకున్నారు.

రాజ-ఊరకే మాటలతో సరిపోయినదా?

రాఘ-తరువాతఁగొంచెము చేయిచేయి కలసినదిగాని ముదర నీయక నేనును నాతమ్ముడును అడ్డమువెళ్ళి నివారించినాము.

రాజ-మన జనార్దనస్వామివారి కేమాత్రము మాన్యమున్నది?

రాఘ- ఏడుపుట్ల మాన్య మున్నందురుగాని, అయిదుపుట్లు మాత్రము భోగమువాండ్రక్రింద జరుగుచున్నది. తక్కిన రెండుపుట్ల భూమియు అర్చకులది గాని స్వామిది కాదు.
రాజశేఖర విజయము


రాఘ-మొన్న జరిగిన స్వామి యుత్సనములలోభోగము మేళము రాలేదే.


రాఘ:.... వారన్ని యుత్సవములలో రారు. రాజమహేంద్ర వరములో గాపుర మున్నారుగనుక చిల్లరపండువుల కెల్ల బండ్లుచేసికొనివచ్చు, బహుప్రయాసము. ఒక్క స్వామి కళ్యాణదినములలో రధోత్సవము నాడు మాత్రము వత్తురు. అప్పుడు వారి బత్తెము క్రింద స్వామి ద్రవ్యములో నుండి నాలుగు రూపాయిలు మాత్ర మిచ్చుట యాచారము.


ఇంతలో నెవ్వరో ముప్పది సంవత్సరముల వయస్సుగల చామనచాయ గృహస్థు తెల్ల బట్టలు గట్టుకొని కుడిచేతిలో నున్న పొన్నుకఱ్ఱ నాడించుచు, ముందఱనక కూలివాడు బట్టలమూటను నెతిమిద బెట్టుకొని నడువ,నడవలో నుండి చావడిలోనికి చొరనగా నడచివచ్చి అచ్చట నిలువబడి,"ఓరీ! రామిగా!మూట లోపలికి తీసికొనిపోయి యెవరినైన బిలచి రాజశేఖరుడుగారు పరుండుగదిలోబెట్టి రా" అని కూలివానిని నియమించి, కూరుచున్న వారి నందఱిని త్రోచుకొనుచు నడుమ నుండి వచ్చి మున్నెంతో పరిచయము గలవానివలెనే తాను రాజశేఖరుడు గారి ముందఱ తివాచిమిద గూర్చుండెను. రాజశేఖరుడుగా రావఱ కెన్నడును అతని మొగమే యెఱుగక పోయినను పెద్దమనుష్యు డింటికివచ్చినప్పుడు మర్యాదచేయక పోయిన బాగుండ దని, కొంచెము లేచి 'దయచేయుడ 'ని చేయిచూపి తాను గొంచెము వెనుకకు జరగి చోటిచ్చి"యింటివద్ద నందఱును సుఖముగా నున్నరా?" యని కుశలప్రశ్నమును జేసి "మిరెవర"ని యడిగిన దప్పుపట్టుకొందురేమేయని సం శయించుచు నూరకుండిరి. అప్పుడావచ్చినాతడు తన పొడుము కాయను రాఘవాచార్యుల వంక మూడవ ప్రకరణము


బొర్లించి యాతని పొడుముబుర్రకు పుచ్చుకొని ; మునుపు చేతిలో నున్నపట్టును బాఱవ్ై చి క్రొత్తపట్టు పట్టీ నగము పీల్చి రాజశేఖరుఁడు గారివ౦కఁ దిరిగి “రాజశేఖరుఁడుగారు ననుమఱచి పోయినట్టున్నారు| ”. అనెను.


రాజ–“లేదు లేదు.” అని మొగమువ౦కఁ బాఱఁజూచిరి.క్రొత్త–ఇంకను నానవాలుపట్టలేదు. మీరు నన్నూ పది సంవత్సరములు క్రి౦దట రాజమహే౦ద్రవరములో రామమూర్తిగారి లొపల జూచినారు. నేను వామరాజుభైరవమూర్తిని. మనమందఱమును దగ్గ బ౦ధువూలమూ , మీతల్లిగారి మేనత్తయల్లుఁడు మామేన మామగారికి సాక్షాత్తుగా నొకవేలు విడిచినమేనత్తకొడుకు , మొన్నమాఅన్నగారు సా౦బయ్యగారు మీయింట నెలదినములుండివఛ్ఛిన తరువాత మీరుచేసిన యాదరణనే నిత్యమును సెలవిచ్చుచు విచ్చిరి; వెళ్ళునపుడు మీరుపెట్టిన బట్టలనుసహితము పెట్టెతీసి చూపినారు. దానిని జూచి మన బంధువులలో నొకరు మీ రింతయనుకూలమయిన స్ఢితిలో నున్నారని పరమానందభరితుఁడ నయినాను.


ఆమాటలువిని లోపలి గదిలోఁబండుకొని యున్న యొక ముసలాయన దగ్గుచు లేచివఛ్ఛి“ఓరీ భైరవమూతి నీ వెప్పుడు వఛ్ఛినావు”


భైర−ఓహోహొ ! ప్రసాదరావుగారా మీరు విజయంచేసి యొన్నాళ్ళయినది ‽


ప్రసా–రెండుమానములనుండి యిక్కడనే యున్నాను.బంధువని రాజశేఖరుని జూచిలపోదమని వఛ్ఛి యితనిబలవంతమునకు మాఱు చెప్పలేక యిక్కడఁ జిక్కుపడ్డాను. మన బంధువులలో రాజశేఖరుఁడు బహుయోగ్యుఁడు సుమీ;”అని కూర్చుండెను. రాఘ - తాతగారూ ! మీకు రాజశేఖరుఁడుగా రెటువంటి బంధువులు‽

ప్రసా - ఇప్పుడు మావాని బంధుత్వము విన్నారుగదా ? వీని మేనమామ బావమఱది నాకుమా ర్తెయత్తగారి సవతితమ్ముఁడు.

ఈ ప్రకారముగా సంభాషణము జరుగుచుండగా లోపలినుండి స్త్రీకంఠముతో సీతా! సీతా!" అని రెండుమూడు పిలుపులు వినబడినవి. అప్పుడు రాఘవాచార్యు లందుకొని, "అమ్మాయీ సీతమ్మా" అని పిలిచి లోపల అమ్మగా రెందులకో పిలుచుచున్నారు. అని చెప్పెను. అప్పుడు నూతివైపు పంచపాళిలో దన యీడుపడుచులతో గూడి గవ్వలాడుచున్న యేడుసంవత్సరముల యీడు గల చామనచాయపిల్ల పరికిణి కట్టుకొని కుడిచేతిలో పందెమువేయు గవ్వలను ఎడమచేతిలో గళ్ళుగీచినసుద్దకొమ్మును బట్టుకొని 'వచ్చె వచ్చె' నని కేకలువేయుచు కాళ్ళగజ్జెలు గల్లుగల్లుమన చావడిలోనుండి పడమటింటి గుమ్మమువైపునకు బరిగెత్తుకొని వెళ్ళెను. ఆచిన్నది రాజశేఖరుడుగారి రెండవకుమార్తె. అట్లువెళ్ళి గుమ్మమున కీవలనే నిలుచుండి సీత - 'అమ్మా ! ఎందుకుపిలిచినావు?'

మాణిక్యాంబ - నాన్న గారితో వంటయినదని స్నానమునకు లేవచ్చు నని చెప్పు.

మాణిక్యాంబ రాజశేఖరుడుగారి భార్య. ఆమె రుక్మిణితో సమానమయిన తెలివి గలదియు విద్య నేర్చినదియు గాకపోయినను, గృహకృత్యములను జక్క పెట్టుటయందును పాకము చేయుట యందును నిరుపమాన మయిన ప్రజ్ఞ కలది; రూపమున చాలవఱకు పెద్దకుమార్తెను పోలియుండునుగాని మొగము కొంచెము ముదురుది గాను దేహచ్ఛాయ యొకవాసి నలుపుగాను కనబడును. ఆమె
మూడవ ప్రకరణము


ముప్పదినాలుగేండ్లవయస్సు కల దయ్యును దూరమున నుండి చూచుటకు చిన్నదానివలెనేయాండును.


అంతట సీత మరల జావడిలోనికి బరుగెత్తుకొని వచ్చి, 'నాన్నగారూ!వంట అయినదట!అమ్మ స్నానమునకు లెమ్మనుచున్నది ' అని చెప్పి, యెప్పటియట్ల గవ్వలాడుట కయినూతి పంచ పాళిలోనికి బోయెను.


రాజ-ప్రసాదరావుగారూ!మిరుస్నానము చేయుదురేమో నూతిదగ్గఱకు బొండి. భైరవమూతిగారూ! గోదావరికి వెళ్లెదరా?లేక నూతియొద్దనే నీళ్ళుపోసుకొనెదరా?


భైర-----కార్తికసోమవారము గనుక గోదావరికే వెళ్ళెదను.


అప్పుడక్కడ నున్నవా రందఱును లేచి, రాజశేఖరుడుగారి యొద్ద సెలవు వుచ్చుకొని యెవరి యిండ్లకు వారు వెళ్ళిరి. రాజశేఖరుడు గారును పడమటింటి లోనికి నడచిరి. లోపల సానమిద గంధము తీయుచున్న మాణిక్యాంబ మట్టియలచప్పుడుతో పడమటింటి దొడ్డి తలుపుకడకు నడచి,యొకకాలు గడప కీవలను రెండవ కాలు పం చపాళిలోను బెట్టి, కుడిచేతితో ద్వారబంధమును బట్టుకొని నిలువబడి 'రుక్మిణీ!బాబయ్యగారు స్నానమునకువచ్చినారు;వేగిరము వచ్చి నీళ్ళందిమ్ము 'అని కేకవేసెను. ఆ పిలుపు విని,దేవతార్చనకు బూలు గోయుచున్న రుక్మిణి "వచ్చుచున్నాను "అనిపలికి తొందరగా రాగిహరివారణముతో నిత్య మల్లిపుష్పములను తులసి దళములను దెచ్చి దేవున కరుగుమీద బెట్టి తండ్రిగారికి నీళ్ళిచ్చుటకయి వంటయింటి దొడ్డిలోనికి బోయెను. మాణిక్యాంబ కంచుగిన్నెలలో గంధాక్షతలును గూటిలోనున్న యద్దమును విభూతి పెట్టెను గొనివచ్చి దేవు నరుగువద్ద నున్న పీటదగ్గఱ బెట్టినది.
రాజశేఖర చరిత్రము


తోడనే లోపలి నుండి నలుపదియేండ్లు దాటిన విధవయొకతె విడిచికట్టుకొనిన తడిబట్టచెఱగు నెత్తిమిదినుండి రానిచ్చి మునుగు వేసికొని, పొయిలోనిబూడిద నొపటను బొట్టు పెట్టుకొని వెండి చెంబులజోటితో మడినీళ్ళను దెచ్చి పీటయొద్ద నుంచెను. తరువాత రాజశేఖరుడుగారు స్నానముచేసి, జుట్టు తుడుచుకొని కొనలు ముడివై చుకొని, అప్పు దాఱవేశిమడిబట్టను గట్టుకొని వచ్చి, దేవునరుగు ముందఱనున్న పీటమిద గూరుచుండి యాచమనము చేసి, విభూతిపండు కొంచెము చిదిపి నీళ్ళతో దడిపి చేతి యంగుష్ఠమును కనిష్ఠకయు దప్ప తక్కిన మూడువ్రేళ్ళతోను నొసటను భజములను కంఠమునకు కడుపునను ఱొమ్మునను రేఖలను తీర్చి, భువనేశ్వరము తాళము తీసి విగ్రహములను సాలగ్రామములను పళ్ళెములో నిడిమంత్రములు చదువుచు దేవతార్చనమున కారంభించెను. ఇంతలో తక్కినవా రందఱును స్నానముచేసివచ్చి గోడల పొడుగునను పీటలమిద గూరుచుండిరి.


భోజనమునకు రావలసినవా రందఱును లోపలికి వెళ్ళిన తరువాత మాణిక్యాంబ మడి విడిచి నడిమి తలుపు వేసివచ్చి పడక గదిలో కూరుచుండి తమలపాకులు చుట్టుచుండెను. ఇంతలోవీధి తలుపువద్ద "రాజశేఖరుడుగారూ!" అని పిలుపుమిద పిలుపుగా పొలము కేకలు వలె నిరువది కేకలు వినబడెను,"వచ్చె వచ్చె"నని లోపలినుండి పలుకుచు మాణిక్యాంబ వచ్చులోపలనె, కేకలతో గూడ తలుపు మిద దబదబ గుద్దులు వినబడెను. ఆమె వెళ్ళి తలుపుగడియ తీయునప్పటికి, నుదట దట్టముగా బెట్టినవిభూతి చెమ్మటతో గలిసి చప్పిదౌడలకు వెల్లవేయ జెవుల కుండలములు య్యాలలూగ ముడుతలు పడియున్న ముసలిమొగమును, అంగ మూడవ ప్రకరనము


వస్త్రముతో జేర్చి చుట్టినబట్టలస దునుమం దునుండి కనబదు తెల్లని జుట్టుగతయును లొపలి నీరుశావినోవతులపై నున్న దర్భాసననముచే లవుగాగన ఁబడు క్రష్ణాజినపుచుట్టగల మూపులును వీపునుండి కుడిభుజముమమీ ద్రుగా వచ్చిన కృష్ణాసనపుత్రాడుకునను గట్టబ్రడ్డ రాగిజారీయును వారసంచియు గల యెండు ఱొమ్మనుగల నల్లనిపొడుగయిన విగ్రహ మొకటీ ద్వారబంధము పొడుగునను నిలువంబడి యుండెను. తలుపుతీయగ్రానే యావిగ్రహము తిన్నగా పడమటింటీవై పునకు నడచి లోపల రాజశేఖరుఁడుగారి కెదురుగా నిలువంబడెను.

                                               రాజ–శాస్త్రులుగారూ;  విూదేయూరు?                                    
                                                శాస్త్రి–మాది కాసూరగ్రహారము,  మా  యింటిపేరుబులుసువారు;  నాపేరు  పేరయ్యసోమయూజులు. విూకీర్తి జగద్విఖ్యాత  మయినది. పదిమందిబ్రాహ్మనుల కింతయన్నము  పెట్టినను సంభావన  యిచ్చినను  భూమివిూద్ర సార్దకజన్మము మీదికాని నావంటి  వ్యర్దుని  బ్రతు కెందుకు?     
                              

రాజ–శార్తికసోమవారము విూరు రాత్రిదాక నుడేదరా?

సోమ–పెద్దవాఁడ నయినాను, ఇపుడుండ లేను,

రాజ–సొరుయాజులుగా రెండబడినట్టున్నారు. అట్లయిన వేగిరము నూతిదగ్గఱ్ నాలుగు చేదల నీళ్ళు పోసికొనిరండి. వడ్డన యవుతున్నది.

సోమ: మీ భోజనములు కానిండి. నాదొక్క మనవి యున్నది. నాకు స్వహస్త పాకము కావలెను. పొయ్యి కొంచెము గోమయముతో శుద్ధి చేసి నాలుగు వస్తువులు అమర్చిన యడల స్నానము చేసి వచ్చి పాకము చేసి కొనెదను. రాజశేఖర చరిత్రము


రాజ-వేఱేపొయ్యిలేదు. మీరు దయచేసిమాపాకములోరావలెను.


సోమ-నాకుస్త్రీపాకముపుచ్చుకోనని నియమము. మీయింటవంటచేయువారు పురుషులేకదా?


రాజ-మాపినతల్లికుమార్తెవంటచేసినది. మాయింటనెప్పుడును స్త్రీలేవంటచేయుదురు.


సోమ-అయ్యా!స్త్రీపాకమేకాకుండనియోగిపాకముకూడ నేనెట్లుపుచ్చుకొందును? కొంచెమత్తెసరుపెట్టించిన నేనువచ్చిదింపుకొనుదును.


సోమ-(కొంచెము సేపనుమానించి)నేనెఱుఁగుదును. మీదిమొదటినుండియుశిష్టసంప్రదాయము-మీతాతగారెంతోకర్మిష్టులు; మీతండ్రిగారుకేవలముబ్రహ్మవేత్త, మీయింట నాకభ్యంతరము లేదు గాని యొకచోట భోజనము చేసినానన్న మఱియొక చోటను గూడనాలాగుననే చేయమందురు. నేనిక్కడభోజునము చేసినమాటనుమీరు రహస్యముగా నుంచవలెను. కార్తికసోమవారము గనుక గోదావరిఁబోయి నిమిషములో స్నానము చేసివచ్చెదను. ఇంతలో వడ్డనకానిండి.


అని పేరయ్య సోమయాజులు కృష్ణాజినమును నారసించుయు నట్టింటఁ బెట్టిగోదావరికిఁ బోయి స్నానము చేసివచ్చి, కృష్ణాజినమునువ చావడిలో క్రిందఁబఱిచి దానిమీఁద దర్భాసనమువేసికొని కూర్చుండి, గోముఖములోఁ జేయి దూర్చి లోపలరుద్రాక్షమాలను ద్రిప్పుచు కన్నులుమూసుకొని జపముచేయ నారంభించెను. ప్రసాదరావు నల్లమందువాఁడనని తొందరపడుటను వడ్డించియున్న యన్నమును
మూడవ ప్రకరణము


కూరలును చల్లారిపోవుటను జూచి లోపల విస్తళ్ళ ముంద ఱగనిపెట్టుకొనియున్న వారు లేచివచ్చి పలుమాఱు పిలువగాబిలువగా సోమయాజులు రెండుగడియలకు మౌనముచాలించి లేచివచ్చి విస్తరిముందఱ గూరుచుండెను. అప్పు డందఱును పరిషేచనములుచేసి భోజనముచేయ మొదలుపెట్టిరి.


రాజ- రాజమహేంద్రవరమునుండి శుభ లేఖ తీసికొనివచ్చిన నీళ్ళకావడివెంకయ్యజాడ లేదు. ఎక్కడ గూర్చున్నాడు?


వెంక-అయ్యా! అయ్యా! ఇదిగో సోమయాజులు గారి వెనుకమూల విస్తరివద్ద గూరుచున్నాను.


సోమ-ఈపాకము దిన్యముగా నున్నది. దీని ముందఱ నల భీమపాకము లెందుకు?


వెంక- సోమయాజులు గారూ! నిన్న సత్రములో పండిన బీరకాయ యింతరుచిగా లేదు నుండీ!


రాజ-ఏ సత్రము?
వెంక-నిన్న రాజమహేంద్రవరములో నొక కోమటియింట గృహప్రవేశమునకు సంతర్పణ జరగినది. బొల్లి పేరయ్యగాడు వంటచేసివాడు. అక్కడ సోమయాజులుగారును నేనును ఏకపజ్త్కినే కూరుచున్నాము.

ఈ ప్రకారముగా నన్యోన్యసంభాషణములు గావించుకొనుచు భోజనము చేసి యందఱును పడమటిం టి దొడ్డిలో చేతులు కడుకొని తేనుచు బొజ్జలు నిమురుకొనుచు వచ్చి చావడిలో గూర్చుండిరి. సోమయాజులుగారు మొట్టమొదట నాలుగుదినము లుండదలచుకొనియే వచ్చినను, భోజనమయమున జరగిన ప్రసంగమును జరగిన ప్రసంగమును బట్టి నిలువ మనసొప్పక సంభావనను సహిత మడగకయే వెంటనే తాంబూలము బుచ్చుకొని నడచిరి.