కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు/రాజశేఖరచరిత్రము-నాల్గవ ప్రకరణము

వికీసోర్స్ నుండి

నాల్గవ ప్రకరణము

   
పురాణకాలక్షేపము-రాజశేరుడుగారి స్థితి-ఆయన దానమఱది
దామోదరయ్య చరిత్రము- మిత్రుడు నారాయణమూర్తి కథ-ఎఱుక
యడుగుట.


రాజశేరుడుగారు భోజనము చేసిన తరువాత ఒక్క నిద్రపోయి లేచి, తాంబూలము వేసికొని కచేరిచావడిలోనికి వచ్చి కూర్చుండిరి.అంతకుమునునే గ్రామమున గల పెద్దమనుష్యులు పలువురు వచ్చి తగినస్థలములలో గూర్చుండి యుండిరి. అప్పుడు రాజశేరుడుగారు 'సుబ్రహ్మణ్యా!'అని పిలిచినతోడనే 'అయ్య 'అని పలికి లోపలి నుండి పదియాఱు సంవత్సరము వయసు గల యెఱ్ఱని చిన్నవాడొకడు వచ్చి యెదురు నిలువబడెను. అతడు రాజశేరుడుగారి జేష్ఠపుత్రుడు; సీత పుట్టిన తరువాత రెండుసంవత్సరములకు మఱియొక పిల్లవాడు కలిగెనుగాని యాచిన్నవాడు పురుటిలోనే సందుగొట్టిపోయెను. ఆ వెనుక మాణిక్యాంబకు కానుపు లేదు. సుబ్రహ్మణ్యము యొక్క మొగ మందమైనదేకాని మూడేండ్లప్రాయమున బాలరోగము వచ్చినప్పుడు పసపుకొమ్ముతో గాల్చిన మచ్చమాత్రము నొసటను గొంచెము వికారముగానుండెను; కన్నులు పెద్దవి; నుదురు మిట్టగా నుండెను; తలవెండ్రుకలు నిడువుగాను నల్లగాను ఉండెను. చేతుల బంగారు మురుగులును చెవులను రవలయంటుజోడును అనామికను పచ్చదాసిన కుందనంపుపని యుంగరమును ఉండెను.

రాజ-సుబ్రహ్మణ్యా! అందఱితో గూడ నీవు మధ్యాహ్నము భోజనమునకు వచ్చినావుకావేమి?</poem>
నాల్గవ ప్రకరణము


సుబ్ర-కార్తికసోమవారము గనుక,ఈదినము రాత్రిదాకనుండి మఱిభోజనము చేయవలెనుకున్నాను.


రాజ-లోపల బల్లమీద ఆదిపర్వ మున్నది తీసికొని వచ్చి శాస్త్రులుగారిని వెళ్ళి పిలుచుకొని రా.


తండ్రి యాజ్ఞ ప్రకారము సుబ్రహ్శణ్యము లోపలికి వెళ్ళి పుస్తకమును దీసికొనివచ్చి తండ్రిచేతి కిచ్చి,నడవలో నుండి నడచి వీధిగుమ్మము మెట్లు దిగుచు, దూరమునుండి వచ్చుచున్నయొక నల్లని విగ్రహమును జూచి 'వేగిరము రండి 'అని కేక వేసి, తాను మరలి వచ్చి శాస్త్రులుగారు వచ్చుచున్నారని చెప్పి చావడిలో నడుముగా పుస్తకమును ముందఱ బెట్టుకొని కూర్చుండెను.ఇంతలో శాస్త్రులును బుజముమిద చినిగిపోయిన ప్రాతశాలువును మడతపెట్టి వేసికొని, బంగారము ఱేకెత్తుటచే నడుమనడుమ లోపలి లక్క కనబడుచున్న కుండలములజోడు చెవులనల్లలవాడుచుండ వచ్చి సభలో గూర్చుండెను. రాజశేఖరుడుగారు సాహిత్యపరులయ్యును, ఆకాలమునందు పెద్ద పుస్తకమును జదివి మఱియొక పండితునిచే అథము చెప్పించుట గొప్ప గౌరవముగా నెంచబడుచుండును గనుక,ఆ శాస్త్రులు వచ్చువరకును పుస్తకమును జదువక గనిపెట్టుకొని యుండిరి.


రాజ----మి రీవేళ నింతయాలస్యముగా వచ్చినారేమండీ?


శాస్త్రి---ఇంతకుమును పొకపర్యాయము వచ్చి చూచిపోయినాను. తమరు లేవలేదని చెప్పినందున, వేఱేయొజ్ పెద్ద మనుష్యునితో గొంచెము మాటాడవలసిన పనియుండగా మీరు లేచుచున్నప్పటికి మరల వత్తమని వెళ్ళినాను. ఆయనతో మాటాడుట కొంచెమాలస్య మయినది. క్షమించవలెను- నాయనా! సుబ్రహ్మణ్యమూ పుస్తకము విప్పు?
రాజశేఖర చరిత్రము


సుబ్రహ్మణ్యము పుస్తకమును విప్పుచు, తుండము వేశదంతమును దోరపుబోజ్జయు యను విఘ్నేశ్వర సవపద్యమును నారంభించి చదువుతుండగా శాస్త్రులందుకొని యా పద్యము కడవఱాకు నయిన తరువాత, 'అంజలిజేసి మ్రొక్కెద మదంబకు ' మొదలుగాగల సరస్వతీ ప్రాధకానమును, పిమ్మట ప్రాంళుపయోదసీలతను భాసితు ' మొదలుగాగల వ్యాసస్తోత్రములను , పిదప మఱికొన్ని పద్యములను తానుగూడ కలిపి చదివెను . ఈ లోపల సుబ్రమహ్మణ్యము గతదినము విడిచిపెట్టిన భాగమును దీసి , అర్జునుడుద్వారకానగరమునకు వెళ్ళిన భాగమునందలి


 " ద్వాదశ మాసికవ్రతము ధర్మవిధిం జరపంగ నేని గం

గాదిమహా నదీ హీనవదాది మహాగిరిదశాన్ంబు మీ

సాదప యోజనదర్శనము పన్నుగజేయుట జేసి పూర్వసం

పాదితసర్వపాపములు వాఎస్ భృశంబుగ నాకు నచ్యుతా! "


అను పద్యమును జదివెను. అప్పుడు శాస్తుృలు పద్యములో నున్నవి కొన్నియు లేనివి కొన్నియు గల్పించి దీఘములు తీయుచు వధముచెప్ప మొదలుపెట్టెను. అర్ధము చెప్పుచున్న కాలములో సుబ్రహ్మణ్యము పుస్తకముయొక్క సూత్రమునకు గట్టియున్న పుడకను జ్రతిలో బట్టుకొని త్రిప్పుచుండెను . అదిచూచి శాస్తుృలు ఉలికిపడి ముక్కుమీద వ్రేలు వైచుకొని పుస్తము చదువు చుండాగా దాని నాప్రకారము ముట్టుకోవచ్చునా? వ్యాసులవారు దానిమీద గూరుచుందరే' యని దగ్గఱ నున్నవార్రి కావిషయమయిన కధ నొకదానిని జెప్పెను. ఆమాటమీద నందులో నెవ్వరో నడిగినదానికి బ్రత్యుత్తరముగా, వ్యాసులవారు దగ్గఱనుండి వెళ్ళుచుండినంగాని వారు స్మరణకు రారనియు, వారప్పు డామార్గ

నాల్గవ ప్రకరణము

ముననే యాకాశముమీద దివ్యవిమాన మెక్కి వెళ్ళుచునారనియు చెప్పి ఆకాశమువంక జూచి కన్నులు మూసుకొని మూడునమస్కారములు చేసెను. ఈ ప్రకారముగా సంజవేళకు ఆదిపర్వము ముగిసి నందున వాటికి బురాణకాలక్షేపమును జాలించి " స్వస్తిప్రజాభ్యః " మోదలుగాగల శ్లోకమును జదివి యెవరి యిండ్లకు వారు వెళ్లి పోయిరి.


రాజశేఖరుడుగారి యింటికి నిత్యమును బంధువులు నలువది తరములు గడచి పోయినను వంశావృక్షముల సహితము చూచుకోనక్కఱలేకయే తమబంధుత్వము జ్ఞాపకముంచుకొని రాజశేఖరుగారి మీదిప్రేమచేత నాతనినిచూచి యాదరించి పోవలెనను నిద్దేశముతో వచ్చి నెలలకొలదినుండి తినిపోవుచు వస్త్రములు మొదలగువానిని బహుమానములు నడయు చుందురు. ఊరినుండు పెద్దమనుష్యులు అపరిచితులయిన వారును గూడ రజశేఖరుడుగారియింట వంట దివ్యముగాచేయుదు రని శ్లాఘించుదురు; వారు చేయుస్తోత్రపాఠముల కుబ్బి రాజసేఖరుడుగారును వారువచ్చినప్పుడెల్ల పిండివంటలును క్షీరాన్నమును మొదలగువాన్ని చేయించి వారిచేత మెప్పువడయ జూచుచుందురు. అన్న ముడుకక పోయినను, పులుసు కాగకపోయినను, పప్పు వేగకపోయినుకూడ వారివంట బాగుండలేదని యెవ్వరును జెప్పలేదు - ఊరకే వచ్చినపదార్ధమునం చెప్పుడును రుచి యధికముగా నుండునుగదా ? కోందఱు బంధువులు తాము వెళ్ళునప్పుడు కొంత సొమ్మును బదులుపుచ్చుకొని అదివఱకు దఱచుగా వచ్చుచు బోవుచు నుండువారే యైనను అంతటి నుండి తీరికలేక బదులుతీర్చుట కయి మరల నెప్పుడును వచ్చెడివారు కారు. ధనవంతుడు గనుక

రాజశేఖర చరిత్రము

ఆయన కెల్లవారును మిత్రులుగా నుండిరి - ఆ మిత్రసహస్రములలో నొకడైనను నిజమైనయాప్తు డున్నాడో లేడో యన్ననగతిని మాత్రమాయనకు ధనలక్ష్మీ తెలియనిచ్చినదికాదు. అట్టి మిత్రోత్తము లందరును రాజశేఖరుడుగారికి స్తుతిపాఠములతో భూమి మీదనే స్వర్గసుఖమును గలిగించి యాయన నానందింప జేయుచుదా మాయన యిచ్చెడి ధనకనవస్తు వాహనముల నాతని ప్రీతికై యంగీకరించుచుందురు. నిత్యమును యాచకు లసంఖ్యముగానిచ్చి తమ కష్టకధలను గాధలుగా జెప్పి చినఱకు దమ కేమయినను ఇమ్మని తేల్చుచుందురు- అట్టివారు నటించెడి యాపదల నన్నిటిని అతడు నిజమయినవానిని గానే భావించి సాహాయ్యము చేయుచుండును. కొందఱు బ్రాహ్మణులు పిల్లవానికి వివాహము చేసికొనెద మనియు, ఉపనమునము చెసికొనెద మనియు, తాము యజ్ఞములు చేసెదమనియు, సత్రములు సమారాధనలు చెయించెద మనియు, చెప్పి యాయన వద్ద ధనమార్జించుకొని పోచుందురు. మిత్రుల వేడుకకయి రాజశేఖర్ గారియింట రాత్రులు తరుచుగా గానవినోదములును నాట్య విశేషములును జారిపోతాది నాటకగోష్టులును జరుగుచుండును. మోసగాండ్రు కొందరు తమకమ్ముడుపోని యుంగరములు మొదలగు వస్తువులను దెచ్చి , వానిలో జెక్కినరాళ్లు వెలయెఱిగి కొనగలిగి సరసులు రాజసేఖరుడుగారు తప్ప మఱియొకరు లేరని ముఖప్రీతిగా మాటలు చెప్పి వస్తువులంత వెల చేయక పోయినను మాటలనే యక్కువవెలకు విక్రయించి పోవుచుందురు. గ్రామములోని వైదిక బృందముయొక్క ప్రేరణచేత సప్తసంతానములలో నొకటైన దేవాలయ నిర్మాణము జీయ నిశ్చయించుకొని, రాజవరపు కొండనుండి నల్ల రాళ్ళు తెప్పించి రాజశేఖరుడుగారు రామపాద క్షేత్రమునకు సమీపమున నాంజనేయునకు గుడికట్టింప నారంభించి నాలుగు

నాల్గవ ప్రకరణము


సంవత్సరములనుండి పనిచేయుచుండె . కాని పని సగముకంటె నెక్కువ కాకపోయిన ను పనివాండ్రును పనిచేయింప దిరుగుచుండెడి యాశ్రితులును మాత్రము కొంతవరకుభాగ్యవంతులయిరి. ఈ ప్రకారముగా దన్ననాదరము చేసి యితరులపాలు చేయుచువచ్చు చున్నందున, ధనదేవత కాతనియం దాగ్రహమువచ్చి లేచిపోటకు బ్రయత్నము చేయుచుండెను గాని చిరపరిచయమును బట్టి యొక్క సారిగా విడువలేక సంకోచించుచుండెను. ఈ సంగతిని దెలిసికొని దారిద్ర్య దేవత యప్పుడప్పుడువచ్చి వెలుపలనుండియే తొంగిచూచు, భాగ్యదేవత యాతనిగృహము చోటుచేసినతోడనే తాను బ్రవేశింపవలెనని చూచుచుండెను. రుక్మిణి వివాహములో నిచ్చిన సంభావన నిమిత్తమై రాజశేఖరుడుగారికి మాన్యములమీద గొంతఋణ మైనందున దానిమీద వడ్డి పెరుగుచుండెనే కాని మఱియొక తొందర యేమియును గలుగుచుండలేదు.


రాజశేఖరుడుగారివలన బాగుపడినవారు పలువురున్నను వారిలోనెల్ల దామోదరయ్యయు, నారయణమూర్తియు ముఖ్యులు. ఆఇద్దరిలో దామోదరయ్య రాజశేఖరుడుగారి బావమఱది; రాజశే ఖరుడుగారి తోడబుట్టిన పడుచునే యాతనికిచ్చిరి. కాని యామె ఒక్కకుమారుని మాత్రము గని కాలము చేసెను, ఆ కుమారున కిప్పుడు పదియేను వత్సరములున్నవి; అతని శంకరయ్య . అతని కెనిమిది సంవత్సరములు దాటకముందే తల్లి పోయినందున , అతడు చిన్నప్పటినుండియు మేనమామగారియింటనే పెరిగినాడు. అతనికే సీతనిచ్చి వివాహముచేయ వలయునని అల్లిదండ్రుల కిద్దరికీని నుండెను, భార్య పోయినతరువాత దామోదరయ్య రాజశేఖరుడుగారి సాయముచెతనే రెండవవివాహము చెసిగొనెనుగాని యాచిన్నది

రాజశేఖర చరిత్రము

పెండ్లినాటికి తొమ్మిదిసంవత్సరములలోపు వయస్సు గలది. గనుక, ఈడేరి కాపుగమునకువచ్చి రెం డుసంవత్సరములుమాత్రమే యయినది. అతనికి ద్వితీయ కళత్రమువలన సంతానమింకను కలుహలేదు. దామోదరయ్య మొదటినుండియు మిక్కిలి బీదవాడు; అతనికి రాజశేఖరుడుగారి చెల్లెని నిచ్చునప్పటికి రాజశేఖరుడుగారి తండ్రియు ధనవంతుడు కాడు. వారిది పూర్వము వసంత వాడ నివాసస్ధలము, రాజసేఖరుడుగారి తండ్రి తనయింటికి గోడలు పెట్టుంచుట కయి పుట్టలు ద్రవ్వించుచుండగా నొకచోట నిత్తడిబిందెతో ధనము దొఱకినది. ధనము దొరికిన తరువాత స్వస్ధలములో నున్న విశేషగౌరవ ముండదని యాచించియో, లోకుల యోర్విలేని తనమునకు జడిసియో రాజశేఖరుడుగారి తండ్రి దారపుత్రోదులతో నిల్లుని వాడ వెంట బెట్టుకొని వచ్చి యప్పటినుండియు ఈ ధవళగిరియందే నివాసముగా నుండి యాచుట్టుపట్టులనే మాన్యములు గొని కొంత కాలమునకు మరణము నొందెను. భాగ్యపోవు వఱకును దామోదరయ్య రాజశేఖరుడుగారి యింటనే యుండి , ఆయనపేరు చెప్పి ధనము యితరులవద్ద తెచ్చి తా నపహరించుచు బయికి దెలియనియ్యక దాచుకొనుచుండెను. తరువాత అప్పులవారు వచ్చి తొందరపెట్టి నపుడు రాజశేఖరుడుగారే సొమ్మిచ్చుకొనుచుండిరి. తోడబుట్టిన పడుచు పోయిన తరువాత దామోదరయ్య చేయు నక్రమములకు సహింపలేక యొకనాడు రాజశేఖరుడుగా రాతనిని కఠినముగా మందలించిరి. అందుమీద గోపము వచ్చి దామోదరయ్య తన్ను బావమఱిది కట్టుబట్టలతో నిల్లు వెడలగొట్టినాడని యూరివారందరి ముందఱ జాటుచు దేశాంతరమునకు లేచిపోయి, యాఱు నెలలకు గడ్దమును తలయును బెంచుకొని మరల వచ్చి, భూత

నాల్గవ ప్రకరణము


వైద్యుడనని వేషమువేసుకొని నుదుట పెద్ద కుంకుమబొట్టు పెట్టుకొని వీధులవెంబడి తిరుగుచుండెను. అవరకే దామోదరయ్య తా నార్జించుకొన్న ధనమును వేఱుజాగ్రత్త చెసికొన్నందున అప్పు డాధనముతో నొక యిల్లుగట్టి ఆ గ్రామములోనే ప్రత్యేకముగా నొక చోట గాపురముండెను. అతని భూతవైద్యము నానాటికి బలపడి నందున ఊర నెవ్వరికైన కాలిలో ముల్లుగ్రుచ్చుకొన్న నాతనిచేత విభూతి పెట్టించుచుందురు. ఈ విధముగా దామోదరయ్య భాగ్యవంతుడగుట యేగాక , జనులచేత మిక్కిలి గౌరవసహితము పొందు చుండెను.


రెండవయాతడైన నారాయణమూర్తి మొదట సద్వంశమున బుట్టినవాడేకాని దుర్మార్గులతో సహవాసముచేసి తనకుగల కాసువీసములను వ్యయము జేసికొని బీదవాడయ్యను పయికిధనికుని వలె నటించుచుండెను. అతనికి భాగ్యము పోయినను దాని ననుసరించి యుండిన చిహ్నములుమాత్రము పోనందున , నారాయణమూర్తి తఱచుగా రాజశేఖరుడుగారి యింటికి వచ్చుచు రహస్యమనిచెప్పి రాజశేఖరుడుగారిని లోపలికి బిలిచుకొనిపోయి తన యక్కరను దెలిపి సొమ్ము బదులడుగు చుండును. ఆఋణము మరల తీరునది కాదని దృఢముగా నెఱిగియు, రాజశేఖరుడుగారు మానవతుల గౌరవమును కాపాడుచుంటయందు మిక్కిలి యభిలాష కలవారు గనుకను, అతడు చిన్నతనములో తనసహ పాఠిగనుకను, అడిగిన మొత్తమును రెండవా రెఱుగకుండ చేతిలోబెట్టీ పంపుచుందురు. అతిధానముతో సరిగవస్త్రములు సుగంధద్రవ్యములు మొదలగువానిని గొనుచు మిత్రులకు షడ్రసోపేతముగా విందులు చేయుచుండును. ఇదిగాక యాత డితరస్ధలములలో జేసిన ఋణములకయి ఋణప్రదా

లు తొందరపెట్టినందున, రాజశేఖరుడుగారు తన సొంతసొమ్ములో నుండి అప్పుడప్పుడు మూడువేల రూపాయలవఱకు నిచ్చి యాతనిని ఋణబాధనుండి విముక్తునిజేసిరి. రెండుసంవత్సరముల క్రిందట నారయణమూర్తి యొక్క పెత్తండ్రిభార్య సంతులేకుండ మృతినొందినందున , ఆమె సొత్తు పదివేలు రూపాయలు అతనికి జేరెను. ఆ సంగతి తెలిపినతొడనే రాజశేఖరుడుగారు పారమానందభరితులై నారాయణమూర్తి యింటికి బోయి యాతని నాలింగనము చెసికొని తనకీయవలసిన యప్పును దీర్పవలసినపని లేదనియు యావద్ధనముతోను గౌరవముతో సుఖజీవనము చేయవలసినదనియు జెప్పి యాదరించిరి. రాజశేఖరుడుగారి కీవఱకు బదులు చేయవలసిన యవస్యకమంతగా తట స్దింపనందునను , ధనము విశేషముగ నున్నందునను నారాయణమూర్తి కావలసినయెడల తనధనమును వాడుకోవచ్చునని రాజశేఖరుడుగారితో బలుమారు పూర్వము చెప్పుచు వచ్చెను.


ఒకనాడు నాలుగు గుడిల ప్రొద్దెక్కిన తరువాత రాజశేఖరుడు గారు కచేరిచావడిలో బలువురతో గూరుచుండియున్న సమయమున రుక్మిణి నూతి వద్దకువచ్చి యక్కడనుండి పెరటి గుమ్మము దగ్గఱకు బోయి లోపలనేనిలుచుండి, తరిగిన గుమ్మడికాయ పెచ్చులను వీధిలో బాఱవేయవచ్చినన పొరిగింటివారి యాడుపడుచుతో మాటాడుచుండెను . అప్పుడు చెతితో తాటాకు గిలకగుత్తుల నాడించుచు నెత్తిమీద నొకబొట్టుపెట్టుకొని యొక్క యెఱుగత యామార్గమున బోవుచు రుక్మిణి మొగమువంక నిదానించి చూచి నిలువబడి "అమ్మా! నీకు శీఘ్రముగానే మేలు కలుగుచున్నది; భాగ్యము కలుగుచున్నది. నీ మనసులో నొక విచారము పెట్టుకొని కృశించుచున్నావు. ఎఱుక యడిగితే నీ మనసులో నున్నది సూటిగా జెప్పెద" నని చెప్పెను .

నాల్గవ ప్రకరణము


అ మాటలు విని యాప్రబోధికను దొడ్దిలోనికి బిలుచుకొని పోయి కొట్లచాటున గూరుచుండబెట్టి తాను లోపలికిబోయి చేటాలో బియ్యము పోసి తెచ్చి యాబియ్యమును దనచేతిలో నుంచుకొని ముమ్మాఱు తనచేయి ఫాలమున మోపి మ్రొక్కి కార్యమును తలచుకొని రుక్మిణి తన చేతిలోని బియ్యమును చేటలో విడిచిపెట్టెను. అప్పుడాయెఱుకత తాను వల్లించినరీతిగా నిష్టదైవతముల దలచుకొని నాకీయుడని వేడుకొని యామచేయి పట్టుకొని "భాగ్యము కల చెయ్యి, ఘ్రొష్ట గల చెయ్యి" యనిపలికి, నీ నొక్క తలపుతలంచినావు; ఒక్కకోరిక కోరినావు; ఒక్క మేలడిగినావు; అది కాయో పండో కల్లో నిజమో చేకూఱునో చేకూఱదో యని తొృక్కట పడుచున్నావు; అది కాయ కాదు పండు ; కల్ల కాదు నిజము. శీఘ్రముగానే చేకూరనున్నది. ఆడువారివంక తలంపా మగవారివంక తలపాయందు వేమో మగవారంటే గడ్డము ఆడువారు అంటే లక్కాకు" అని రుక్మిణి ముఖలక్షణములను చక్కగా కనిపెట్టి 'మగ వారివంక తలం' పన్నప్పుడామె మొగ మొకవిధముగా నుండుట చూచి సంగతి నూహించి "నీది మగవారివంక తలంపు ; శీఘ్రము గానే కార్యము గట్టెక్కనున్నది; నీరొట్టెనేతబడనున్న" దని చెప్పి తక్కిన ప్రసంగమువలన రుక్మిణి మనసులోని సమ గతి నంతను దెలిసికొని, రుక్మిణిమగడు దేశాంతరగతు డయినవాతనా వఱకే విని యున్నదికాన "నీమగడు చెడుసావాసము చేత దేశాలపాలయి తిరుగుచున్నాడు; నీమీది మోహముచేత నెల దినములలొ నిన్ను వెదకుకొనుచు రాగలడు" అని చెప్పి సంచిలోని వేరునొకదానిని తీసి పసపుదారముతో చేతికి కట్టి ప్రాత బట్టయు రవికయు బుచ్చుకొని, మగనితొ గలిసి కాపురము చెయుచున్న తరువాత క్రొత్తచీర

రాజశేఖర చరిత్రము

పెట్టుమని చెప్పి తనదారిని బోయెను. రుక్మిణీయు బరమానంద భరితురాలయి అంత సూటిగా దన మనోగతమును దెలిపి నందునకై యెఱుకతయొక్క మహత్త్వమును మెచ్చుకొని యబ్బుర పడుచు లోపలికి బోయెను.