కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు/రాజశేఖరచరిత్రము-ఐదవ ప్రకరణము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

ఐదవ ప్రకరణము

సీత యొక్క వివాహ ప్రయత్నము- బైరాగి యొక్క ప్రసిద్ది- అతడు వైద్యమునకు గుదురుట - జనార్దన స్వామి యుత్సవము- రుక్మిణి యొక్క కాసులు పేరు పోవుట .


ఒకనాటి యుదయమున రాజశేఖరుడుగారు సభ తీర్చి చావడిలో గూర్చుండి యుండగా సిద్దాంతి వచ్చి తాటాకులతో అల్లిన యొరలోనుండి సులోచనముల జోడును దీసి ముక్కునకు దగిలించుకొని దాని దారమును నొసటనుండి జుట్టుమీదుగా వెనుకకు వేసుకునికూరుచుండి తాటాకుపుస్తకమునకు గాట్టిన దారములో గ్రుచ్చిన చిన్నతాటాకు ముక్కలను నాలు గయిదింటిని పయికిదీసి ముందుకు వెనుకకు త్రిప్పుచు వానివంక జూడసాగెను.


రాజ - సిద్దాంతి గారూ ! సీత కేసంబంధము బాగున్నది ?


సిద్దాం - చక్కగా నాలోచించి చూడాగా మంత్రిప్రగడ బాపి రాజు గారి కుమారునుజాతకము స్ర్వ విధముల నౌకూలముగా గనబడుచున్నది.


మంత్రిప్రగడ బాపిరాజు తన కొమారున కేలాగున నైన సీతను జేసికొన రాజశేఖరుడుగారితోడి బాంధవ్యమువలన బాగుపడవలెనని చిరకాలమునుండి కోరియున్న వాడు కాన , ఈనడుమ దన యింట జరిగిన సీతాకళ్యాణ సమయమున సిద్దాంతికి మంచి దోవతుల చాపు కట్టబెట్టుటయే కాక సీత నిప్పించిన యెడల నింతకంటె మంచి బహుమానము చేసెదనని యాశపెట్టెను.


రాజ - బాపిరాజు కుమారుడు నల్లని వాడు. చదువులోను తెలివిలేదని వినుచున్నాను. వా డప్పుడే దుస్సహవాసముచేత చెడు

రాజశేఖర విజయము


తిరిగుళ్ళు తిరగ నారంభించినాడట ! వానికి సీతనియ్యను, మస శంకరయ్య జాతక మెట్లున్నది ?


సిద్దాంతి - మీ మేనల్లునిజాతకము చూచినాను. సమస్తవిధముల చేతను దివ్యజాతకమే కాని జన్మనక్షత్రము కృత్తిక. మన సీతదికూడ కృత్తికానక్షత్రమే- శ్లో. అజైక ప్రాచ్చవిష్ఠాచ పూర్వ స్వధకృత్తికా ! మృగశీర్షించ విత్తాచ నవితోత్తర ఫల్గునీ ! జ్యేష్ఠాచ విశ్వతోయంచ నక్షత్రక్యేనినస్యతి! ఏకారాశౌపృధగ్ధిస్ణ్యేచో తమస్పూణివీడనం - అని శాస్త్రములో పయి నక్షత్రముల యైక్యము నందు కన్యావరులకు నశనము సంభవించునని చెప్పబడియున్నది . బాపిరాజు కొమారుని జాతకము సర్వోత్తమముగ నున్నది - అందులో కేంద్రాధిపతికి త్రికోనాధిపతి సంబంధము కలిగియున్నది; ఇతరు లయిన తృతీయ, షష్ఠ, ఏకాదశ, అష్టమాధిపతులతోడి సంబంధము లేదు- శ్లో. కేంద్రత్రికోణపతయ స్సంబంధేన పరస్పరం ఇతరైరప్రసక్తాశ్చే ద్విశేషశుభదాయకా అని శాస్త్ర ప్రకారమతడు మిక్కిలి యదృష్టవంతుడు. తక్కిన చిల్లర చేష్టలకు రూపమునకును నేమి ? మఱినాలు గేండ్లు పైబడిన యెంత బుద్దివంతుడగునో యెన రెరుగుదురు ? నా మాట విని చిన్నదాని నాతని కిండి.


రాజ- నేను బాపిరాజు కొడుకునకు పిల్ల నియ్యను. నాచెల్లెలు పోవునప్పుడు తన కొడుకునకు సీత నిచ్చునట్లు నాచేత చేతిలో చెయి వేయించుకున్నది, దామోదరయ్యయు సీతనిచ్చి శంకరయ్యను మీయొద్దనే యుంచుకొమ్మని నిత్యమును మొగమోట పెట్టుచున్నాడు. ఇప్పుడు నేను పిల్ల దానిని మఱియొకరి కిచ్చిన యెడల నా చెల్లెలు పోబట్టి యట్లుచేసితినని కలకాలము చెప్పుచుండును. అదిగాక మాశంకయ్య బహుబుద్దిమంతుడు; స్ఫుహద్రూసి; విద్యావినయసం ప

         ఐదవ ప్రకరణము
           

న్నుఁడు, పిల్లనాతనికే యిచ్చెదను, జాతకమును మీరు మఱియొక సారి శ్రద్దతో జూడవలెను,

అప్పుడు సిద్దాంతి తాను మఱియొక విధముగాఁ జెప్పిన కార్యము లేదని తెలిసికొని కొంచెముసే పాకాశమువంకఁ జూచి యనుమానించి "సీతజననము కృత్తికానక్షత్రముయొక్క యేపాదము?" అని ప్రశ్నవేసెను.


రాజ----ద్వితీయ పాదము,


సిద్దాం----శంకరయ్యది ప్రథనమపాదము, అవును, అనుకూలముగానే యున్నది----శ్ల్లో|| ఏకరేచైకిపాదేతు వివాహః|ప్రాణహానిదః దంపత్యోరేక నక్షత్రె భిన్నపాదేశుభావహ?|| ---- అనుశాస్త్రమునుబట్టి దోషము లేకపోఁగా శుభావహముగా కూడనున్నది. తప్పక సీత నీతని కిచ్చి వివాహము చేయుండి.


రాజ----ఈసంవత్సరములో పెండ్లికనుకూలమయిన ముహూర్త మెప్పుడున్నది?


సిద్దాంతి ----"శ్లో|| మాఘ పాల్గున వైశాఖ జ్యేష్టమాసా శుభప్రదాః" అనుటచే మాఘమా స మనుకూలముగ నున్నది. బహుళపంచమీమంగళవారమునాఁడు రవి కుంభలగ్నమం దున్నాఁడు. ఆముహూర్తము దివ్యమయినది ----

శ్లో|| అజ గో యుగ కుంభాళిమృగరాశి గతేరవ్ౌ | ముఖః కర్మ గ్రహ స్త్వన్యరాసికేన కదాచన|| అని ప్రమాణవచనము.

రాజ----మీకొమార్తె జబ్బు నీమ్మళముగా నున్నదా ?

సిద్ధాం----తమ కటాక్షమువలన నిమ్మళ్ముగానే యున్నది. నాఁడు మీరుచెప్పిన బైరాగి బహుసమర్దుఁడు. అతడు మాయింటగ్రహమును నిమిషములో వెళ్ళగొట్టినాఁడు. భూతవైద్యు లంచ

          రాజశేఖర చరిత్రము

ఱును మాచిన్నదానికిఁ బట్టినగ్రహమును వదిలించుట యసాధ్యమని విడిచిపెట్టినారు. అతడు మూడుదినములు జల మభిమంత్రించి లోపలికిచ్చి రక్షరేకు కట్టీనాఁడు. నాఁటినుండియు పిల్లది సుఖముగా నున్నది.

          రాజ ----మాచెల్లెలు సుబ్బమ్మకు దేహ మస్వస్తముగనున్నది.
   మనగ్రామములో నెవ్వరును మంచివైద్యులు కనఁబడరు. నాకేమి చేయుటకును తోఁచకున్నది.

రాఘ----బైరాగిచేత మం దిప్పించరాదా! అతడు మీరు సోమ్మిచ్చిన మాత్రము పుచ్చుకొనఁడు ; ఈయూర నెందఱికో ధర్మా ర్ద్దముగానే యౌషధములిచ్చి దీర్ఘ వ్యాధులను సహితము కుదిర్చినాఁడు.

రాజ----గట్టీవాఁ డయినయెడల నీ వాతని నొక్కపర్యాయము మధ్యాహ్నము మాయింటికి వెంటబెట్టుకోనివచ్చి సుబ్బమ్మను చూపెదవా ? నాలుగుదినములనుండి దానిశరీరములో రుగ్మతగా నున్నందున వంటకు మిక్కిలి యిబ్బందిపడు చున్నాము.

రాఘ----అవశ్యముగా దిపికొనివచ్చెదను. అతని కాభేషజములు లేవు. ఎవరుపిలిచినను వచ్చును.

సిద్ధాంతి----ఆతనిజడ స్వర్ణముఖీవిద్య కలదని చెప్పుచున్నారు. మహానుభావులు గోసాయీలలో నెటువంటివారైనను నుందురు.

రాఘ----ఆతఁడు ప్రతిదినమును దమ్మిడియెత్తు రాగి కరఁగి బంగారముచేయునఁట ! ఆతఁ డప్పుడప్పుడు బ్రాహ్మణులకు దాన ధర్మములు చేయుచున్నాఁడు. ఈవిద్యయే లేకపోయిన నాతనికి ధన మెక్కడనుండి వచ్చును  ?

రాజ----రాఘవాచారీ ! దేవున కధ్యయణనోత్సవములు శ్రమ ముగా జరుగుచున్నవా  ?. రాఘ - తమయనుగ్రహముండగా ఉత్సవములకేమిలోపము ? నిరుడు పుష్యమాసములో సంక్రాంతినాటి యుత్సవము ప్రత్యేకముగా తమ ద్రవ్యముతో జరిగినది. నిన్ననో మొన్ననోలాగున కనబడుచున్నది; అప్పుడే సంవత్సర మయినది. రేపే సంక్రాంతి - ఈసంగతి తమతో మనవిచేయుటకే వచ్చి సుబ్బమ్మగారికి జబ్బుగా నున్నందున సమయముకాదని యూరకున్నాను.

రాజ - క్రిందటి సంవత్సరము నూటయేబది రూపాయల నిచ్చినాను. ఈసంవత్సరము మాలోపల వివాహములు తటస్థమయినవి గనుక నూఱురూపాయలనుమాత్రమే యిచ్చెదను. ఏలాగున నయిన దానితో సరిపెట్టవలెను.

రాఘ - చిత్తము. దానికేమి? ఆలాగుననే చేసెదను.

రాజ - రాఘవాచార్యులూ! బైరాగి నవస్యముగా నేడే మాయింటికి తీసికొనివచ్చి నీవు మఱియొకపనిని చేసుకోవలెనుజుమీ? ప్రొద్దెక్కు చున్నది. శీఘ్రముగా వెళ్ళు - సిద్ధాంతిగారూ! మీకు సందేహముగా నున్నపక్షమున శంకరయ్యజాతకము మఱియొకసారి చూడుండి; ఎవరితోనైనా నాలోచించవలసి యున్న యడల, లచ్చయ్య శాస్త్రిగారికి కూడ ఆజాతకము చూపవచ్చును.

సిద్ధాంతి - చిత్తము. నా కటువంటి సందేహము లేదు.

రాజ - అట్లయిన, ఇప్పుడు బసకు పోయి తరువాత దర్శన మిండి.

అని చెప్పి పంపినతరువాత సభ వారందఱును తమయిండ్లకు బోయిరి. రాజశేఖరుడుగారు భోజనము చేసి చేయి కడుగుకొను నప్పటికి రాఘవాచార్యు లాభైరాగిని వెంట బెట్టుకొనివచ్చి యింట బ్రవేశ పెట్టెను. నిత్యమును రాజశేఖరుడుగా రాతనికి సకలోప 64 రాజశేఖర చరిత్రము


చారములును చేయుచు భక్తితో ననుసరించుచుండెను. సుబ్బమ్మకు వ్యాధి వెంటనే నిమ్మళించినను స్వర్ణము చేయువిద్యను నేర్చుకోవలె ననునాసక్తితో రాజశేఖరుఁడుగా రాతనిని విడిచిపెట్టక, యింటనే యుంచుకొని నిత్యమును పాలును పంచదారయు వేళకు సమర్పించుచు నెగళ్ళకు వలయు పుల్లలను సమకూర్చుచు బహునిధముల భక్తి సేయుచు నాతని యనుగ్రహసంపాదనకుఁ దగిన ప్రయత్నములు చేయుచుండెను.ఈ ప్రకారముగాఁగొన్నిదినములు జరగఁగా నింతలో జనార్దనస్వామివారికిఁ గళ్యాణోత్సవము సమీపించినది. ఆ యుత్సవమును జూచుటకై చుట్టుప్రక్కలగ్రామముల నుండి వేలకొలది జనులు వచ్చి ప్రతిగృహమునను క్రిక్కిఱిసినట్టు దిగియుండెను.

     మాఘశుద్ధమున నేకాదశినాఁడు రిధోత్సవమునకు వలయు ప్రయత్నములన్నియు జరుగుచుండెను. నాలుగుదినములు నుండి 

రధమునంతను నలంకరించి దాని పొడుగునను వన్నెవన్నెల గుడ్డలను చిత్రవర్ణము గల కాగితములను అంటించి, వెదురుకఱ్ఱల కొనలకు హనుమద్విగ్రహమును గరుడవిగ్రహమును గల ధ్వజపటములను గట్టి రధమునకుఁ దగిలించిరి. దేవుఁడుకూర్చుండు పైవైపున గొలలతో నున్న కదళికా స్తంభములను నిలిపి వానికి మామిడి మండలతోను వివిధపుష్పములతోను తోరణములను గట్టిరి. ఆ యరటికంబములకు నడుమను తెల్లని లక్కగుఱ్ఱములు రెండు రధము నీడ్చుచున్నట్లు ముంగాళ్ళు మీదికెత్తు కొని మోరలు సారించి వీధివంకఁ జూచు చుండెను. ఆ రధమునకుఁ బదియడుగుల దూరమున వెదురు వేళ్లతో నల్లబడి పయిన గుడ్డ మూయబఁడి వికృతాకారముతో నున్న యాంజనేయ విగ్రహములోను గరుడ విగ్రహములోను మనుష్యులు దూరి చూడవచ్చిన పల్లెలవాండ్రును పిల్లలును జడిసికొనులాగున

ఐదవ ప్రకరణము

నెగిరెగిరిపడుచు లక్కతలకాయల ద్రిప్పుచుండిరి . అప్పుడు పూజారులు పల్లకిలో నుత్సవవిగ్రహముల నెక్కించుకొని వాద్యములతో గొండదిగివచ్చి రధమునకు మూడు ప్రదక్షణములను జేయించి స్వామి నందు వేంచేయింపజేసిరి. చెంతలనున్నవరందఱును క్రిందనుండి యరటిపండ్లతో స్వామిని గొట్టుచుండగా రధముమీద, గూర్చున్న యర్చకులును తదితరులను చేతులతో దెలు తగులకుండ గాచు కొనుచు నడుమనడుమ జేగంటలు వయించుచు గోవిందా యని కేకలు వేయచుండిరి. ఆ కేకలతో రధమునకు గట్టియున్న మ్రోకులను వందలకొలది మనుష్యులు పట్టుకొని యిండ్ల కప్పులు వీధి యరుగులును కూలునట్ట్టుగా రధమునీడ్చుచుండిరి. అంతట బోగముమేళ యొకటి రధమునకు ముందు దూరముగా నిలువబడి మద్దెలమీద జేయివైచుకొని యొకటే యాడసాగెను. మద్దెలమీద దెబ్బ వినబడినతోడనే దేవునితో నున్న పెద్దమనుష్యులందఱును మూకలను త్రోచుకొనుచు వెళ్లి యాటక త్తియలముందు మున్నున్నవారిని వెనుకకు పంపి తాము పెద్దలయి యుత్సవమునందు గానవినోదమనకు కొఱత రాకుండ సమర్ధించుచుండిరి .


అప్పుడు రుక్మిణి సమస్తాభరణభూషితురాలయి ఉమ్మెత్త పువ్వువలె నందమై బెడబెడలాడుచున్న కుచ్చిళ్ళు మీగాళ్లపై నొఱయ, ఎడమ భుజము మీదనుండి వచ్చి జరీచెట్లుగల సరిగంచు పయ్యెదకొంగు వీపున జీరాడ కట్టుకొన్న గువ్వకన్నద్దిన నల్లచీర యామె యందమున కొక వింతయందమును గలిగింప , కాళ్ల యందియలును, పాంజేబులును, గళ్ళుగళ్ళున శ్ర్యావ్యనాదము చేయ , కుడుచేయితప్ప గడమభాగ మంతయు బయిటలో డాగి కనబడకయున్న వ్ంగపండుచాయగల గుత్తపుపట్టురైక నీరెండెలో ద్విగుణ

రాజశేఖర చరిత్రము

ముగా బ్రకాశింప, కొప్పులోని కమ్మపూవులతావి కడలకు బరిమళము లెనంగుచు గంధవహుని సార్ధకనాముని జేయ నడచివచ్చి వీధిలో నొక యరుగుచెంత నిలుచుండి రధమువంక జూచుచుండెను. ఈదేశములో సాధారణముగా స్త్రీలు తమభర్తలు గ్రామమున లేనప్పుడు విలివచీరలు కట్టుకొని యలంకరించుకొనుట దూష్యముగా చెంచువా రయినను, యితరులయింట జరుగుశుభ కార్యములయందు పేరంటమునకు వెళ్ళునప్పుడు గాని గ్రామములో జరిగెడి స్వామికళ్యాణ మహోత్సవమును గ్రామదేవతల తీర్ధములును జూడబోవునప్పుడు గాని యెరుపుతెచ్చుకొనియైన మంచిబట్టలను మంచినగలను ధరించుకొనక మానరు. అప్పటి యామె సౌందర్యమునేమని చెప్పుదును ! నిడుదలై సోగ లైనకన్నులకు గాటుకరేఖలొకసొగసు నింప, లేనవ్వుమిషమున నర్ధచంద్రుని బరిహసించు నెన్నుదురున బలచంద్రుని యకృతినున్న కుమ్మబొట్టు ర్ంగు లీన శృగారరస మొలికెడి యా ముద్దు మొగము యొక్క యప్పటి యొప్పిదము కన్నులకఱవు తీఱ జూచి తీఱవలిసినదే కాని చెప్పితీఱదు. రధ మామె దృష్టిపధమును దాటి పోయినతోడనే ద్వాదశోర్ధ్వవుండృములను దిట్టముగా ధరియించి దానరులు ఇనుప దీపస్తంభములలో దీపములు వెలిగించుకొని నడుమునకు బట్టు వస్త్రములను బిగించుకొని యొకచేతితో నెమలికుంచె యాడించుచు రెండవచేతిలోని గుడ్డచుట్టలు చమురులో ముంచి వెలిగించి సెగ పోకకుండ నేర్పుతో దేహమునిండ నంటించుకొనుచు ప్రజలిచ్చు డబ్బులను దీపస్తంభముల మట్లలో వేయుచు నదిచిరి. ఆ సందడి యడిగినతోడనే రుక్మిణీ తల్లియు మఱికొందఱును తోడనడువ బయలు దేఱి ఉత్సవమునిమిత్తమయి పొరుగూళ్ల నుండివచ్చిగిడారములలో

ఐదవ ప్రకరణము
బెట్టిన కంచరి దుకాణములను పండ్లయంగళ్ళను దాఁటి, మెట్ల పొడుగునను ప్రక్కలయందు బట్టలు పఱచుచు కూరుచున్న వికలాంగులకు సెనగపప్పును గవ్వలునువిసరివైచుచు, కాశికావళ్ళు ముందుపెట్టుకొని పుణ్యాత్ములను పాపాత్ములను స్వర్గమును నరకమును జూపెదమని పటములు చేతఁబెట్టుకొని వచ్చెడివారిని పోయెడివారిని నడ్డగించెడు కపట యాత్రికులకు తొలఁగుచు, కొండయెక్కి దేవతాసందర్శనార్ధము వెళ్ళెను. అక్కడ నిసుకుచల్లిన రాలకుండు మూఁకలో నుండి బలముగలవారు దేవునకుఁ బండ్లయ్యవలె ననునపేక్షతో దూఱి సందడిలోఁ బడి దేవతాదర్శన మటుండఁగా మందిలోనుండి యీవలంబడినఁ జాలునని నడుమనుండియే మరల యీవలకువచ్చి సంతోషించు చుండిరి. వారికంటెబలవంతులయినవారు గర్భాలయము వఱకును బోయి పండ్లను డబ్బును పూజారి చేతిలోఁబెట్టియీవలఁ బడుచుండిరి. అర్చకులును ఒకరు విడిచి యొకరు వెలుపలికివచ్చి చెమటచేఁదడిసిన బట్టలను పిండుకొని వెలుపలగాలిలో కొంతసేపు హాయిగానుండి మరల గర్భాలయములోఁ బ్రవేశించి యాయుక్కలో బాధపడుచుండిరి. ఈప్రకారముగా వచ్చినయర్చకులలో నొకఁడు మాణిక్యాంబను జూచి యామెచేతిలోనిపండ్లను బుచ్చుకొని లోపలికిఁబోయిస్వామికి నివేదనచేసి వానిలోఁగొన్నిపండ్లను తులసి దళములను మరలఁ దెచ్చియిచ్చి యందఱశిరస్సుల మీఁదను శఠగోపమునుంచెను. అంతట మాణిక్యాంబ వెనుకకుతిరిగి యాలయ ద్వారమును దాఁటుచుండెను.రుక్మిణి యామెచెఱఁగు పట్టుకొని వెనుక నిలుచుండెను. ఒక ప్రక్క సీతయుమఱియొకప్రక్క నొకముత్తైదువయు నిలువఁబడిరి. ఆ సమయములో నెవ్వడో వెనుకనుండి రుక్మిణి మెడలోనికి చేయి పోనిచ్చి కాసుల పేరును పుటుక్కున
రాజశేఖర చరిత్రము

త్రెంచెను. రుక్మిణి వెనుక మరలి చూచునప్పటికి చేయియు గాసుల పేరునుగూడ సదృశ్యములాయెను. రుక్కిణి కేకతో పదిమందియు వచ్చి దొంగను పట్టుకొనుటకయి ప్రయత్నము చేసిరి కాని యాదొంగనే వెదకుచుండెను.అప్పుడు రుక్కిణి మొదలగువారు ప్రదోషసమయమున నగపోయినం దునకయి మఱింత విచారించుచు నింటికి బోయిరి.