కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు/రాజశేఖరచరిత్రము-ఆఱవ ప్రకరణము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

ఆఱవ ప్రకరణము

సొమ్ము పోయినందుకుమంత్రజ్ఞులు చేసిన తంతురుక్మిణిమగఁడు పోయిన వర్తనొకఁడు చెప్పుట. రుక్మిణికి రుగ్మ త వచ్చుట సోదె యగుట మగడుఁ పట్టుట భూతవైద్యము సువర్ణవిద్య బైరాగి సొమ్ముతో నదృశ్యుఁడగుట.</poem>

మఱునాఁడు ప్రాతఃకాలమున రాజశేఖరుఁడుగారు దంతధావనము చేసికొనుచు చీధియరుగుమీఁదఁ గూరుచుఁడియుండఁగా సిద్ధాంతి తంతోఁగూడ మఱియొక బ్రాహ్మణునిఁదీసికొని వచ్చియరుగుమీఁద నొకప్రక్కను చతికిలఁబడెను.చేతిలో వెండిపన్నువేసిన పేపబెత్తమును పట్టుకొని, తలయును గడ్డమును గోళ్ళును బెంచుకొని కనుబొమల సందున గొప్ప కుంకుమబొట్టు పెట్టుకొని గంభీరముగాఁ గూరుచున్న యీవిగ్రహమును నఖ శిఖపర్యంతమును తేఱిపాఱఁజూచి యాయన యెవరని రాజశేఖరుఁడుగారు సిద్ధాంతి నడిగిరి. "వీరు మహామంత్రవేత్తలు; మళయాళమునందుఁ గొంతకాలమునుండి మంత్ర రహస్యముల నామూలాగ్రముగా గ్రహించినారు; వీరిపేరు హరిశాస్త్రులవారు; వీరీవఱకు బహుస్థలములలో పోయినవస్తువుల నిమిషములో దెప్పించి యిచ్చిన్నార; వీరు నాలుగు సంవత్సరముల నుండివానప్రస్థాశ్రమమును స్వీకరించి యున్నారు." అని తా నాతనిని రెండుదినముల నుండియే యెఱిగినవాఁడయినను జన్మదినము నుండియు నెఱిఁగియున్నవానివలె నాతని చరిత్రమును చెప్పి, 'నఖగోమైర్వనాశ్రమీ' యను దక్షస్మృతి వచనమును జదివి గోళ్ళును వెండ్రుకలును బెంచు కొనుటచే వానప్రస్థుఁడగునని తల్లక్షణమును జెప్పెను. అప్పుడు హరిశాస్త్రులు తనమంత్రసామర్ధ్యమును గొంతసేపు పొగడుకొని తా నావఱకు పోయినవస్తువులు తెప్పించినానన్న స్థలములపట్టిక నొక దానిని బహుదినములు ప్రయాసపడి వల్లించినవానివలె తడవుకో కుండ జదివెను. అప్పుడు సిద్ధాంతి రుక్మిణివస్తువు పోయినసంగతి జెప్పి దానిజాడ చెప్పవలయునని ప్రార్థించెను. తోడనే హరిశాస్త్రులు తన ముక్కుపుటములయొద్ద వ్రేలుపెట్టుకొనిచూచి, ఆకాశము వంక జూడ్కినిగడించి వ్రేళ్లుమణచి యేమో లెక్కించి నిమిష మాలోచించి 'పోయినవస్తువు ఇక్కడకువచ్చుచు బోవుచు నుండు వారిచేతనే చిక్కినదికాని యిల్లు దాటిపోలే' దని చెప్పెను. ఇంతలో రాజశేఖరుడుగారి ముఖప్రక్షాళన మయినందున నందఱు గలిసి లోపలికి బోయిరి. నడవలో నిలుచుండి హరిశాస్త్రులు వస్తువును దెప్పించి యిచ్చుటకు తనదే భార మనియు, మధ్యాహ్నము వచ్చి యంత్రము వేసెదనుకాబట్టి యాసమయమున కింట నున్న సేవకు లందఱును సిద్ధముగా నుంచవలయు ననియు జెప్పి, 'లోపలి నుండి కొంచెముబియ్య మిప్పుడు తెప్పింపుడు' అని కోరెను. సిద్ధాంతియే లోపలికి బోయి యొక పళ్ళెముతో బియ్యమును దీసికొనివచ్చి శాస్త్రుల కోరికప్రకారము గృహమున గనబడ్డ భృత్యవర్గమును బిలుచుకొనివచ్చెను. ఆమీదట శాస్త్రులు తన మంత్రప్రభావమును గొంచెము చిత్తగింపవలయు నని మనవిచేసి, అక్కడ నున్నవారిలో నెవ్వరైన నొనవస్తువును దీసి రహస్యముగా దాచినయెడల వారి పేరును జెప్పెద నని చెప్పి, తాను వీధిలోనికి బోయెను. అప్పుడు రాజశేఖరుడుగారు తన యుంగరము లొకనిచేతి కిచ్చి పదిలముగా దాపించి, యాతడు వచ్చి కూరుచున్నతరువాత శాస్త్రులనులోపలికి బిలిచి యుంగరమును దాచినవానిని జూపు మని యడిగిరి. శాస్త్రులు తోడనేయక్కడ నున్న పదిమంది చేతులలో బియ్యమును బెట్టి యొక రొకరే వచ్చి బియ్యమును పళ్ళెములో బోయవలె నని చెప్పి ఆఱవ ప్రకరణము

తా నేమో మంత్రమును జపించుచుండెను. అప్పు డందఱును వరుసగా వచ్చి బియ్యము పళ్లెములోఁ బోసిరి. వెంటనే యతఁడుంగరమును దీసిన వాఁడీతఁడని చూపెను. అప్పుడక్కడనున్నవారందఱును నద్భుతరసాక్రాంతులయిరి. రాజశేఖరుఁడుగారును అతఁడు మహామంత్రవేత్త యని యొప్పుకొని నమస్కారము చేసి, పోయిన నగ యాతని మంత్రశక్తిచేత వచ్చునను నమ్మకముతో మధ్యాహ్నమునఁ దప్పక రావలయు నని పలుమారు ప్రార్ధించి తీసుకొని రమ్మని సిద్దాంతితోను జెప్పెను. సిద్దాంతియు శాస్త్రులును ముఖవిలాసముతో సల్లాపసుఖము ననుభవించుకొనుచు నింటికి నడచిరి. ఇక్కడకు వచ్చున్నప్పుడే సిద్దాంతియు శాస్త్రియు రహస్యముగా నన్ని సంగతులను మాటాడుకొని రాజశేఖరుఁడుగా రిచ్చుబహుమతిలో చెఱిసగమును బుచ్చుకొనునట్లు సమాధానపడిరి. కాఁబట్టి రాజశేఖరుఁడు గారికి నమ్మకము పుట్టించుట కయి ముందుగా చేయవలసిన తంతును కూడఁబలుకుకొన్న తరువాత, వస్తువును దాచినవాఁడు పళ్ళెములో బియ్యము పోయఁగానే వెనుకఁ దాను బోసెదననియు వాఁడే దానిని తీసి దాచినాఁడని చెప్పవలసిన దనియు సిద్దాంతి యింటివద్దనే నిర్ణయము చేసినందున శాస్త్రు లాతని సాహాయ్యము చేత నిమిషములో నుంగరమును దీసిన వానిని చూపఁగలిగెను. మధ్యాహ్నాభోజనము చేసి బయలుదేరి కావలసిన పరికరములతో సిద్దాంతియు హరిశాస్త్రులును వచ్చి రాజశేఖరుడు గారి యిల్లు చేరిరి. అంతకు మునుపే యింటగల పరిచారకులను తక్కిన వారును రావింపబడిరి. హరిశాస్త్రులకు వినబడినట్లుగా సిద్ధాంతి రధోత్సవ సమయమున రుక్మిణితో నెవరు వెళ్ళిరో కాసుల పేరు పోయినప్పు డెవ్వరెవ్వరెచట నుండొరో యా సంగతులు వెంట వెళ్లినవారి నడిగి తెలుసుకొను చుండెను. అంత సిద్ధాంతి వచ్చి రహస్యముగా శాస్త్రుల చెవులో నొక 72

రాజశేఖర చరిత్రము

మాట చెప్పి మరల వెళ్ళి యేమేమో సంగతులను మాటాడుచుండెను. ఇంతలో రాజశేఖరుడుగారు వచ్చి వారినందఱిని లోపలికి రండని పిలిచిరి. హరిశాస్త్రులు అమ్మవారి పెట్టెను. తీసికొని యిప్పుడే వచ్చెదనని చెప్పిపోయి గడియసేపు తాళి యిత్తడిపెట్టెను పట్టుకొని కుడిచేతి కొక రాగికడియమును దొడుగుకొని మరల వచ్చి, అలికి దిగవిడచియున్న చావడిలో నల్లని పచ్చని మ్రుగ్గులతో నొక్కవిగ్రహమును వేసి, దాని నాభిస్థానమునం దానుతెచ్చిన యిత్తడి పెట్టెను బెట్టి మూత తీసి 'జయజననీ' యని కేక వేసి కొంతసే పేమోకన్నులు మూసి కొని జపము చేసి , రాజశేఖరుఁడుగారివంక జూచి యొక తెల్ల కాగితము తెమ్మని యడిగెను. ఆ కాలములో కొండపల్లి కాగితములు తప్ప మఱియొకరీతి కాగితములు లేవు. రాజశేఖరుఁడు గారికుమారుఁడు లోపలికిఁ బోయి యొక తెల్లకాగితము దీసికొని వచ్చి యిచ్చెను. అప్పుడాకాగితము నందఱును జూచుచుండఁగాఁ సమానము లైన యెనిమిది ముక్కలుగాఁ జించి యం దొక్కముక్కను దనయొద్దనుంచుకొని తక్కిన యేడు ముక్కలను వారికిచ్చివేసి, తాను సాసించు దేవతయొక్క శక్తి చేత ఆకాగితపు ముక్కమీఁదికి వస్తువును దొంగిలించినవారి పేరు వచ్చునని చెప్పి, యా ముక్కను ఇత్తడి పెట్టెలోఁబెట్టి నిమిషమందుంచి యొక మంత్రమును జదివి యాముక్కను మరలఁ బయిటికిఁ దీసి తన చేతులోనే పట్టుకొని యందఱకును జూపి, దానిని క్రింద నుంచి మూలలను కుంకుము రాచి. హారతికర్పూరపు తునకతో దాని మిఁద బీజాక్షరములును యంత్రమును వేసి క్రిందనునిచి, యొకరొకరేవచ్చి దాని మిఁద జేయివైచి పొండని యాజ్ఞపించెను. స్పష్టముగా గనబడుచున్న యాతెల్లకాగితము మిఁద నెల్లవారును చేతులు వేసి పోయి యేమిజరుగునో చూత మనువేడుక

ఆఱవ ప్రకరణము

చేత దమస్ధానముల గూరుచుండి చూచుచుండిరి. అందఱును ముట్టుకొని పోయినతరువాత హరిశాస్తృలాముక్కనుదీసి సాంబ్రాణి దూపమువేసి, హారతికర్పూరము వెలింగించి దానిమీద ఆముక్కను నాలుగయిదుసారులు మోపి రాజశేఖరుడుగారి చెతికిచ్చెను. ఆయని చేతిలో బుచ్చుకొని చూచునప్పటికి దానిమీద పెద్దయక్షరములతో 'చాకలసరడు ' అని వ్రాసియుండెను. ఆకాగితముపైకెత్తగానే యెల్ల వారికిని స్పష్టముగా వంకర యక్షరములు కనబడు చుండెను. దగ్గరనున్న వారిలో నొకరుదానిని పుచ్చుకొని చదువు నప్పటికి చాకలి నర్వడొకడుతప్ప మిగిలినవా రందఱును నద్భుతప్రమోదమగ్న మానసులయి చప్పటలు గొట్టి శాస్త్రుల శక్తిని ఉపాసనా బలమును వేయినోళ్ళం గొనియాడ జొచ్చిరి. కొంద ఱక్కడ నున్నవారిలో ' వీడెనగదీసినదొంగ అప్పుడు వెనుక నిలుచున్నాడని వానిని నిందింపసాగిరి. సీత వచ్చి కాసులపేరు పోయినప్పుడు సర్విగాడు పండ్లుచేతిలో బట్టుకొని మా వెనుక నిలువబడినా డని చెప్పెను. అందుమీద నందఱును నగ హరించిన వాడు చాకలి సర్విగాడు తప్ప మఱియొకడు కాదని నిశ్చయించిరి. యింటనున్న వారును రాజశేఖరుడుగారునుకూడ ఆప్రకారముగానే నమ్మిరి. ఆవస్తువును రాజశేఖరుడు గారునుకూడ ఆప్రకారము గానే నమ్మిరి. ఆవస్తువును శీఘ్రముగా దెచ్చియిమ్మని యడిగినప్పుడు , ఆచాకలివాడు కంటికి నేలకు నేకధారగా తోదనము చేయుచు దా నేదోషము నెఱుగనని బిడ్డల మీదను భార్యమీదను ఒట్లు పెట్టుకొనసాగెను. కాని యదియంతయు దొంగయేడువని యెల్లవారును నిశ్చయము చేసికొనిరి. నయమున వాని నన్నివుధముల నడిగినను వాడు తను నిరపరాధి ననియే చెప్పి యేడుచుచు వచ్చినందున , హరిశాస్త్రులు రాజశేకరుడుగారిని చాటునకు 'మాట ' యని పిలుచుకొనిపోయి ' మీ సెల

రాజశేఖర చరిత్రము

వయినపక్షమున వీనుకి ప్రయోగము చేసి పోయిన వస్తువును దెప్పించెద ' నని చెప్పెను. వాడు చిన్నతనము నుండియు మిక్కిలి నమ్మకముగా బనిచేసినవా డయినందున వానికే హానియు జేయ నొడబక రాజశేఖరుడు వానిని కొలువునుండి మాత్రము తొలగించివేసిరి. వాడు తాను నిరపరాధి ననియేడ్చుచు నింటికి బోయెను. మొదట సిద్దాంతి శాస్త్రుల చెవిలో రహస్యముగా జెప్పినది చాకలి సర్వనిపేరు వ్రాయుమనియే. అతడమ్మవారిపెట్టెను దెచ్చుమిషమీద నెలుపలకు బోయి యొకకాగితపు ముక్కమీద నీరుల్లిపాయల రసముతో 'చాకలసరడ ' ని యక్షరజ్ఞానము చక్కగా లేకపోవుటచేత వా ఒత్తు పోగొట్టి వ్రాసి యాఱపెట్టి పెట్టెలో బెట్టుకొని వచ్చెను. రాజశేఖరుడుగారి కొమారుడు కాగితమును తీసికొనివచ్చినపుడు తానాపేరును వ్రాసిన కాగితమంత ముక్కను జింపుకొని తక్కిన దానినిచ్చివేసి, దానిని పెట్టెలో పెట్టినప్పుడు మార్చి మొదటి తన కాగితమును పయికిందీసెను . అదియు మునుపటి కాగితమువలెనే యున్నందున నెవ్వరు ననుమాన పడలేదు. ఆ కాగితము మీద హారతికర్పూరముతో బీజాక్షరములు వ్రాసినది యుల్లిపాయలకంపు పోవుటకే కాని మఱియొకందు నకుగాదు ; తరువాత సాంబ్రాని పొగలోను కర్పూరపు దీపము మీదను పొగచూరబెట్టుట మున్నుకనబడకుండ నున్నయక్షరములు స్పుటముగా గనబడు నట్టు చేయుటకయి కావించిన తంత్రము . ఈ ప్రకారముగా తన మంత్రప్రభావము చేత శాస్త్రులంతటి ఘసకార్యమును జేసినందునకయి వస్తువు దొరకక పోయినను రాజశేఖరుడుగా రతని కొక దోవతులచావును కట్టబెట్టి నాల్గు రూపాయల రొక్కము నిచ్చిరి. యింటికి బోయిన తరువాత హరిశాస్త్రులును సిద్ధాంతియు వానిని సమభాగంబులుగా బంచుకొనిరి .

ఆఱవ ప్రకరణము

ఆమఱునాడు జాము ప్రొద్దెక్కిన తరువాత రుక్మిణి యిక్కతెయు వడమటింటి పంచపాళిలో గూరుచుండి యెఱుకత చెప్పిన గడువు నిన్నటితో వెళ్ళిపోయెనే యింకను మగడు రాడాయెనేయని తలపోయుచు వస్తువు పోయిందునకయి విచారించు చుండెను. ఆ సమయమున నిరువది సంవత్సరముల వయసుగల యొకచిన్నవాడు లోపలికివచ్చి చేతిలోని బట్టల మూటను క్రింద బడవైచి రుక్మిణి మొగము వంక జూచి పెద్దపెట్టున నేడ్చెను. అదిచూచి రుక్మిణి సంగతియేమో తెలిసికొనకయే తానును నేడ్వజొచ్చెను. ఆరోదనధ్వని విని యింట నున్నవారందఱును లోపలనుండి పరుగెత్తుకొనివచ్చి యేమియని నడిగిరి. అప్పుడా చిన్నవాడు గ్రుడ్లనీరు గ్రుక్కుకొనుచు గద్గదస్వరముతో రుక్మిణి మగడు నృశింహస్వామి కాశినుండి వచ్చును త్రోవలో జగన్నాధము వద్ద పుష్యశుద్ధ నవమి నాడు గ్రహణి జాడ్యముచేత కాలధర్మము నొందెననియు, దహనాదికృత్యములను తానే నిర్వహించితి ననియు జెప్పెను. ఆమాటలు విన్నతోడనే యింటనున్న వారందఱును నొక్కసారిగా గల్లుమని యేడ్చిరి. ఆయాక్రంద ధ్వని విని చావడిలో నున్న రాజశేఖరుడుగారును పొరుగిండ్లవారును వచ్చి కారణంబున దెలిసికొని పలుతెఱింగుల విలపించిరి. అప్పుడక్కడనున్న పెద్దలందఱును వారిని వోదార్చి వారిచే స్నానములుచేయించి వేదాంత వచనముల నుపదేశిం పసాగిరి. యిట్లు కొన్నిదినములు జరిగిన తరువాత బంధువులు మొదలగు వారు రుక్మిణికి శిరోజములు తీయించు విషయమయి రాజఏశేఖరుడు గారితో బ్రసంగించిరి గాని, ఆయన తనకొమార్తె మీది ప్రేమచేత చిన్నతనములోనే యాపని చేయింప నొప్పుకొన నందున, నందఱును కూడ దానివలన నొకబాధకము లేదని చెప్పి యాయన చెప్పినవిధమే మంచిదని యొప్పుకొనిరి. 76

రాజశేఖర చరిత్రము

మనదేశములో పతిరహీతులగు యువతుల దురవస్ధను తలచుకొన్న మాత్రమున పగవారి కయినను మనస్సు కలుక్కుమనకమానదు. పతిశోకమును మఱువునట్లుచేసి యాదరింపవలసిన తల్లిదండ్రులే జీవితే శ్వరులుపోయి దుఃఖసముద్రములో మునిగియున్న తమ కడుపున బుట్టిన కొమార్తెలను కరుణమాలి సమస్తాలంకారములకును దూరురాండ్రను జేసి, తలగొఱిగించి కురూపిణులను జేసి మునుగువేసి మూలగూర్చుండ బెట్టుదురు ; రెండు పూటలను కడుపునిండ తిండియయిన బెట్టక మాడ్చి యందఱి భోజనములు నయినతరువాత మూడుజాములు కిన్ని మెతుకులు వేయుదురు ; మనసయినను మంచిబట్ట కట్టుతో నియ్యక అంచులేని ముతక బట్టనే కట్టుకోనిత్తురు. వేయేల ? మగడు పోయిన వారిజీవనములనే దుఃఖభాజనములనుగా జేసి వారిని జీవచ్చవములనుగా నుంతురు. ఎవ్వరును పెట్టినవిగాక పుట్టుకతోనే భగవంతుడలంకారముగా దయచేసినట్టియు చిన్నప్పటినుండియు చమురురాసి దువ్వి ప్రాణముతో సమానముగా పెంచుకొనుచున్నట్టియు చక్కని శిరోజములను నిర్దతుడైన మంగలివాని కత్తి కొప్పగించుట కంటె మానవతులకు ప్రాణత్యాగమే తోచును ; యింటగల కష్టమయి నట్టియు నీచమయనట్టియు పనులన్నియు వారిమీదనే పడును పుట్టినింట జేరగానే , వదినెలు మఱదండ్రును దాసినిగా జూతురు గారవమను మాట యుండదు; శుభకార్యము లందు నలుగురిలో దలయెత్తుకొని తిరుగుట నోచుకోగ పోగా మొగ మగపడినమాత్రమున మీద మిక్కిలి యెల్లవారును దుశ్శకునమని దూషింతురు. ఈ హేతువుచేతనే "విధవ " యనుమాటయే వినుటకు శూలమువలె గర్ణ కఠోరముగా నుండును ; యెవ్వనినైన 'విధవ ' యనుపేరును బిలిచిన మాత్రమున ఘోరమయిన తిట్టుగా నెంచుకొని వాడు మండిపడును.

ఆఱవ ప్రకరణము

ఈ స్దితి యంతయు కన్నులకు గట్టిన ట్లగపడి, ఆవర్తమానము తెలిసినదనినము మొదలుకొని రుక్మిణి రాత్రియు బగలును గదిలో నుండి వెలుపలికిరాక నిద్రాహారములు మాని మగనికయి శోకించుచు గృశింపసాగెను . విచారమునకుతోడు దేహముననేదియో వ్యాధి కూడ నాశ్రయించెను. ఆమె లేవలేనంత బలహీనురాలగు వఱకును వ్యాధిసంగతిని నెవ్వరును కనుగొన్నవారుగారు. కనుగొన్నతోడనే రాజశేఖరుదుగారు ఘనవైద్యుడని ప్రసిద్ధికెక్కిన జంగము బసవయ్యను పిలిపించిరి. అతడు రుక్మిణి పరున్నమంచము మీద గూరుచుండి యెడమచేయి పట్టుకొని నాడిని నిదానించి చూచి వాతనాడి విశేషముగా నాడుచున్నదనిచెప్పి, యామెకు బెక్కు దినములనుండి , శీతజ్వరము వచ్చుచున్నదనియు వెంటనే కనుగొనక పోవుటచేత జ్వరము దేహములో జీర్ణించిన దనియు జెప్పి వైద్య గ్రంధమునుండి -శ్లో పారాద్వారి మహాబలా త్రికటుకా జాజీరసోనా స్తధా ! విష్ణు క్రాసతినాడికా గృహభవోధూమ స్తులస్యాద్వయం నారంగస్య శలాటపత్ర మరలు త్వక్పత్ర నిర్గుడికా ! భార్గీపక్వ పట చ్చదాచ్చ సకలాన్ శీతజ్వరా న్నాశయేత్ - అను శ్లోకమును జదివి, తెప్పింపవలసిన వస్తువుల నొక కాగితముమీద వ్రాయించి యప్పటి కింటికి బోయెను. ఆమధ్యాహ్నమునకే రాజశేఖరుడు గారు వస్తువులనన్నింటిని దెప్పించి వైద్యునకు వర్తమానము నంపినందున, అతడువచ్చి వస్తువులను చూణముచేయించి పొట్లములు కట్టి, తేనె యనుపానముచేసి మూడువేళలను మూడుపొట్లములిమ్మని చెప్పి, నూనె, గుమ్మడి, బచ్చలి, పులుసు, కంద పనస మాత్రము తగుల గూడదని పధ్యమును విధించి , ప్రతిదినమును రెండు పర్యయములు వచ్చి చేయిచూచి గుణమును కట్టుకొని పోవుచుండును.

రాజశేఖర చరిత్రము

మొదట రుక్మిణికి శరీరము కొంచెము స్వస్ధపడ నారంభించినది కాని తరువాత రాత్రులు పలవరింతలు మొదలయినవి పుట్టి జ్వర మధికముగా సాగెను. అప్పుడు వైద్యుని బిలిచి జ్వర మింకను నిమ్మళించలేదేమని యడుగగా అతడు "రేవత్యామను రాధాయాం జ్వరో బహుదిన్ంభవేత్ " అని చదివీ యీ జ్వరము రేవతీనక్షత్రమున వచ్చినదికాన బహుదినమిలకుగాని పోదని చెప్పెను. కానియాతని మాటలయం దం తగా నమ్మకము చిక్కక గ్రామములోనున్న మఱియొక వైద్యుని బిలిబించి, రాజశేఖరుడు గారు రుక్మిణి జూపించిరి. అతడు చేయిచూచి పైత్య జ్వరమని చెప్పి , మూడుపూటలలో రుక్మిణిది వజ్రశరీరము చేసెదనని ప్రగల్భవచనములు పలికి, అతనియొద్ద మాటలేకాని మందులు విస్తారముగా లేనందున వాడుకప్రకారముగా 'లంఘనం పరమౌషధ ' మన్న యొక్క సూత్రమునే శరణము గావించుకొని లంకణములు కట్టనారంభించెను . అతడు నవజ్వరపక్వము కావలేనని పలుకుచున్నను లక్ష్యముచేయక , దినదిన క్రమమున రుక్మిణీ శుష్కించి యంతకంతకు మఱింత బలహీనురాలగుచుండుట చూచి యాతని యాతని వైద్యమును మానిపించి , మరల మొదటి వైద్యునే రావింపగా నతడు వెంటనే పధ్యము పెట్టించి యౌషధ సేవ నారంభించచెను. అ యౌషధబలమున వ్యాధి కొంచెము మళ్ళుముఖము వట్టినను ఒక పట్టున నిశ్శేషమయినది కాదు.

ఈ లోపల మాణిక్యాంబ యొక యాదివారమున నాడు నాలుగు గడియలకు దెల్లవాఱుననగా లేచి సుబ్బమ్మను వెంటబెట్టు కొని యెవ్వరును వెళ్ళక ముందే ముందుగా దాము వెళ్ళవలెనని బయలుదేఱి కొమార్తెమీద ప్రేమ చేత స్వయముగానే కోరలమ్మ గుడికి సోదె యడుగుటకయి వెళ్ళెను. ఆగుడి యొద్దనున్న మాలది

ఆఱవ ప్రకరణము

మాణిక్యాంబ ధూపమువేసిన మీదట నిష్టదేవత తన కావేశమయి నట్లు కనబడి తాను రుక్మిణి పెనిమిటినని బయలపడి , కాని దేశములో దిక్కుమాలిన పక్షినయి చచ్చిపోతినని యేడ్చుటాయే గాక తాను రుక్మిణి మీదమోహముచేత వచ్చితిననియు , ఆమెనుదనవద్దకు తిసుకొని పోయెదననియు జెప్పెను. ఆసంగతులు చెప్పునప్పుడు మాణిక్యాంబయు సుబ్బమ్మయు గూడ నేడువ సాగిరి ఆ యుద్రేకము శాంతి పొందిన పిమ్మట వారా మాలదానికి సమర్పించ వలసినదాని నర్పించి యింటికి బోయిరి. రుక్మిణికిని రాత్రులు కలలలోను పగలు సహితము కన్ను మూసికొను నప్పుడునుమగడెదుటా గనబడు చుండెను. ఒకా నొకప్పుడు మాటాడునట్లు సహిత మామెకు వినబడుచు వచ్చెనుగాని యా మాటలనామె గ్రహింప గలిగినదికాదు. ఆమె యొకానొకప్పుడెవరో గుండెల మీద నెక్కి కూరుచున్నట్టు తలచి నిద్రలో గేకలు వేయు చుండును.

ఇట్లుండగా నొకనాడు హరిశాస్త్రులు వికృత వేషముతో మరల వచ్చి రుక్మిణి చేయిచూచి భూతనాడి యాడుచున్నదని చెప్పెను. బై రాగిచేత విభూతి పెట్టించిరి కాని, అందు వలన రుక్మిణీ కేమియు గుణ మగపడలేదు . ఒక నాడొక బుడబుక్కల వాడు నెత్తి మీద తలగుడ్డ లో బక్షియీకలను బుజము మీద వేపబెత్తములు కట్టయు వీపున బెత్తములకు వ్రేలాడ గట్టిన పెద్దతోలు సంచియు నుండ డక్కి వాయించుచు వచ్చి , మాణిక్యాంబ శకున మడిగినపుడు గీతలును బొమ్మలును వేసి యున్న తాటాకుల పుస్తము చూచి తీర్ధమునకు వెళ్ళిన దినమున రావిచుట్టు మీద నిండి వచ్చి యొక కామినీ గ్రహమున సోకిన దినమున దిగదుడు పుపెట్టిన బోవుననియు జెప్పి యొక వేరుమొక్క యిచ్చి దానిని వెండి

రాజశేఖర చరిత్రము

తాయెతులో బెట్టి దండ చేతికి గట్టుమని చెప్పి యొక రూపాయ పుచ్చుకొని పోయెను. ఆ ప్రకారముగా మాణిక్యాంబ రుక్మిణి దిగదుడుపు పెట్టెనుగాని యందువలనను గార్య మగపడలేదు . ఒక దిన మున సుబ్బమ్మ కావేశము వచ్చి వేంకటేశ్వరులు బయలబడి యది యంతయు దన మహత్మ్యమే యనియు కొండకు వచ్చి తనకు నిలువు దోపిచ్చెద ననితల్లి మొక్కున్నపక్షమున సర్వము నివర్తియగు ననియు జెప్పెను. ఆ ప్రకారమే చేసెదనని మాణిక్యాంబ మ్రొక్కుకొని తన నగలలో నొకదానిని ముడుపుగట్టెను. గాని దాని వలనను రుక్మిణి దేహ స్ధితి యనుకూల దశకు రాలేదు .అంతట హరి శాస్త్రులు వచ్చి యీరాత్రి చిన్న దాని చేత బలికించి దయ్యమును వదల గొట్టేదనని ప్రతిజ్ఞ చేసి, తాను నాలుగు గడియల ప్రొద్దువేళ నే వచ్చి చావడి అలికించి దానినిండ రంగు మ్రుగ్గులతో ధైర్యశాలులయిన పురుషులు చూచినను భయపడు నట్టుగా వికృత మయిన స్త్రీ విగ్రహము న్నొకదానిని వేసి తాను స్నాననము చేసి జుట్టు విరియబోసికొని కుంకుమముతో మొగమంతయు నొకటే బొట్టు పెట్టుకొని, రుక్మిణిని స్నానము చేయించి తడిబట్టలతో న ట్టునడుమ గూరుచుండబెట్టి మొగమునకు విభూతి రాచి చుట్టును బిందె నాదములు మ్రోగునట్టు మనుష్యుల నియమించి, కన్నులు మిఱుమిట్లు గొన నెదుర గొప్ప దీపములు పెట్టించి, మంచి వారికి సహితము పైత్యోద్రేకము చేయు ధూపములు వేయుచు, చుట్టుపట్ల యిండ్ల లోని పిల్లలదఱును జడిసిగొనులాగున"హ్రం" "హ్రీం " అని పెద్ద గొంతుకతో బీజాక్షరముల నుచ్చరించుచు, గ్రుడ్లెఱ్ఱచేసి బెత్తముపుచ్చుకొని కొట్టబోయినట్టుగా రుక్మిణి మీదకి వెల్లి "ఉన్నది యున్నట్టుగా జెప్పు" మని కేకవేసెను. అవఱకే దేహస్మృతి తప్పి వికారముగా ఆఱవప్రకరణము. 81

జూచుచున్న యారుక్మిణి తల్లి సొదెకు వెళ్లి వచ్చి చెప్పిన ప్రకరముగా తాను నృసింహస్వామిననియు భార్యమీఁది మక్కువ తీఱక వచ్చి యావహించి నాఁడ ననియు, తనతోఁగూడ నామెను దీసికొనిపోయెద ననియు పలికెను. అంత నాపై త్యోద్రేకము పోవునట్టుగా రుక్మిణి మొగమున కేమోరాచి యామెకు తెలివి వచ్చిన మీఁదట లోపలికిఁగొనిపోయి శైత్యోపచారములు చేయుఁడని దగ్గఱ నున్న వారితో జెప్పి, హరిశాస్ర్తులు వచ్చి రుక్మిణిని పట్టినది మొండిగ్రహ మనియు, మహ మంత్రముచేతఁ గాని శాబరముల చేత సాధ్యము కాదనియు, అయినను తానుజేసిన తపస్సంతయు ధారపోసి వదలఁగొట్టెద ననియుఁ జెప్పి, రాత్రికి తొమ్మిదిమూరల క్రొత్త వస్త్రమును, అఖండమునిమిత్తము మణుగు నేయియు పుష్పములను, ఆఱుమూరల జనపనారత్రాడును, నాలుగుమేకులను, రెండుకుంచముల నీరుపట్టు లోత్తెన యిత్తడిపళ్లెమును సిద్ధముచేయించి రెండవ త్రోవలేని యొకగదిని గోమయముతో నలికించి యుంచుఁడని రాజశేఖరుఁడు గారితోఁ జెప్పిపోయెను. రాజశేఖరుఁడుగారా ప్రకారము సర్వము జాగ్రత్తపెట్టించి యాతనిరాక కెదురుచూచు చుండిరి. అతఁడు రాత్రితొమ్మిదిగంట లయినతరువాత వచ్చి గదిలో అఖండ దీపమును వెలిఁగించి; అమ్మవారి పెట్టెను దాని సమీపమున నుంచి, బియ్యపు ముగ్గుతో గదికి నడుమ నొక చిన్న పట్టుపెట్టి యందులో రుక్మిణిని గూరుచుండబెట్టి కొంచెముసేపు తనలో నేమో మంత్రమును జపించి దిగ్భంధనము చేసి గది నాలుగు మూలలను మంత్రోదక మును చల్లి రుక్మిణి నావలకు దీసికొనిపోవచ్చు నని చెప్పి, ఆమెను లోపలికిగొనిపోయిన తరువాత గదితలుపు లోపలిగడియవేసికొని గడియసేపుండి వెలుపలికివచ్చి పయిని తాళమువేసి, ఆగ్రహమునకు బ్రతికియున్నకాలములో నృసింహమంత్రము వచ్చియున్నది, కాబట్టి యది యేదేవతకును లోబడినది కాదనియు, తనయావచ్ఛక్తి వినియోగించి గదిని విడిచి రాకుండునట్లు బంధించిమాత్రము వచ్చితిననియు, తా నీవలనుండి శరభసాళ్వమును బ్రయోగించినచో ఘోర యుద్ధముచేసి లోబడునుగాని మఱియొక విధముగా లోబడదనియు చెప్పి - "ఓం-ఖేం-ఖం-ఘ్రసి-హుం-ఫట్-సర్వశత్రు సంహారిణే-శరభ సాళ్వాయ-పక్షిరాజాయ-హుం-ఫట్-స్వాహా" - అని శరభసాళ్వమును పునశ్చరణ చేయనారంభించెను. రెండుమాఱులు మంత్రము నుచ్చరించునప్పటికి గదిలోనుండి యొకమనుష్యుని మఱియెవ్వరో కొట్టుచున్నట్టు చిన్నచిన్న దెబ్బలు వినబడినవి; ఆపిమ్మట నొకపెద్ద దెబ్బ వినబడెను. ఈప్రకారముగా నరగడియసేపు దెబ్బలు వినబడుచువచ్చి సద్దడగినతరువాత గ్రహము సులభముగానె దొరికెననియు దానినిప్పుడే తీసికొనిపోయి గోదావరిలో గలిపెదననియు జెప్పి తానొక్కడును, గదిలోనికిబోయి యందలి సమస్తవస్తువులను దీసికొని హరిశాస్త్రులు వెళ్ళిపోయెను. ఆమఱుచటిదినము మొదలుకొని క్రమక్రమముగా రుక్మిణి జబ్బువదిలి యారోగ్యమును బొందసాగెను. తరువాత నాబ్రాహ్మణు డొకదినము రాగిరేకుమీదనొకప్రక్కను ఆంజనేయవిగ్రహమును బీజాక్షరములును రెండవ ప్రక్కను ఎటుకూడినను ముప్పదినాలుగు వచ్చునట్లుగా బదునాఱు గదులుగల యీక్రిందనున్నరీతి యంత్రమును వేసి, ఆ రక్షరేకును
కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf

రుక్మిణిమెడకు గట్టి యదియున్నంతకాలము నేవిధమయిన గాలియు సోకదనిచెప్పెను. కొమార్తెయొక్క గ్రహబాధ నివారణచేసినందునకయి రాజశేఖరుడుగారు శాస్త్రులకు దోవతులచాపు కట్టబెట్టుటయే కాక నూటపదియాఱురూపాయలను బహుమాన మిచ్చిరి. శాస్త్రులారాత్రి అమ్మవారి పెట్టెను దెచ్చినప్పు డందులో వేసి కొన్ని బొమ్మరాళ్ళను మాత్రము తెచ్చుకొనెను. ఆవలి కందఱను బంపివేసి తా నొక్కడును లోపల గూరుచున్నప్పుడు తలుపువేసుకొని గదియొక్క మట్టిమిద్దెకు నడుగామ మేకులను దిగగొట్టి యామేకులకు జనుపనారత్రాడును గట్టి, కొత్తబట్టలో గొంతముక్కను జించి వానికి గొంచెము కొంచెము దూరముగా బొమ్మరాళ్ళను ముడివైచి గుడ్డను దిట్టముగా నేతిలోముంచి యొకకొనకు జనుపనారత్రాడుకు వ్రేలాడగట్టి, దానికి సూటిగా క్రింద భూమిమీద పళ్ళెమునిండ నీళ్ళుపోసి నీళ్ళలో పువ్వులను చక్కగా బఱచి, ఆగుడ్డకొనకు దీప మంటించి హరిశాస్త్రులు వెలుపలికి వచ్చెను. అత డీవలకు వచ్చిన రెండుమూడు నిమిషముల కెల్లను గుడ్డ యంటుకొనగా మండుచుండెడుచమురుబొట్లు నీటిలోబడి టప్పుమని మనుష్యునిమీద దెబ్బ వేసినట్టు చప్పుడు కాసాగెను. ఆవల బొమ్మరాళ్ళవఱకును కాలినప్పు రాజశేఖర చరిత్రము

డారాయి యూడి నీళ్ళలోఁబడి గొప్పధ్వనిని జేయుచు వచ్చెను గాని పళ్లెములో నడుగునఁ ఋవ్వులుండుటచేత నిత్తడిపళ్లెముమీఁద వాయించిన ట్టెంతమాత్రము వినఁబడినదికాదు. ఆగుడ్డయంతయుమండిపోయినతరువాత ఆతడు లోపలికిఁ బోయి మసి మొదలగువానినిపూర్ణముగా నెత్తుకొని వెడలిపోయెను.

  రాజశేఖరుఁడుగారు నువర్ణ వద్యను గ్రహింపవలెనను నపేక్షతో నిత్యమును బై రాగికి సమస్తొపచారములను జరిపించుచు, ఆతని సమయము కనిపెట్టి యనుసరించుచు, అతఁ డొకనాడు గంజాయిత్రాగి యుల్లాసముగాఁ గూరుచున్నప్పుడుచేరబోయి వనయముతో "బావాజీ !లోకములో సువర్ణముచేయువిద్య యున్నదా?" అని యదిగెను. ఆతడు మందహాసము చేసి "ఉన్నది" అని చెప్పెను. ఆపయిన మాటలధోరణిని 'ఆవద్యయొక్కసంగతి యెటువంటిద 'ని రాజశేఖరఁడు మహాభక్తిశ్రద్ధలతో చేతులు జోడించుకొని యడిగిరి. అందుమీఁద నతఁడు 'ఆసంగతిపరమరహస్య మయినను నీకుఁజెపెద 'నని పూర్వ యుగములో స్పర్శ వేదివలన నినుము బంగార మగుచు వచ్చెనుగాని యీకలియుగములో స్పర్శవేది లేదనియు, పూర్వము శంకరాచార్యు లవా రొక యీఁ డిగవానికి సువర్ణముఖి యను విద్య నుపదేశింపఁగా వాఁడు చరకాలము బంగారమును జేసి కడపట యోగులలోఁ గలసి వారి కుపదేశించి దేహము చాలించె ననియు, తనగురు వావద్యను తనకుపదేశించెను గాని మంత్రముయొక్క పునశ్చరణము పూర్తికానందునఁ దనకది యింకను ఫలింపలే దనియు,  తానిప్పుడు పసరులతోమాత్రమే బంగారమును జేయగల ననియు, రాజశేఖరఁడుగారిమీఁది యనుగ్రహముచేతనే చెప్పినట్లుచెప్పి, ఎల్ల వారును దన్ను బంగారము చేయుమని బాధింతురు                                             ఆఱవ  ప్రకరణము

గాన ఆసంగతిని మహాస్యముగా నుంచవలె నని కోరెను, రాజశేఖరుఁడు తా నాప్రకారము గోప్యముగా నుంచెడనని ప్రమా ణముచేసి తనకు సువర్ణముచేయు యోగమును జెప్పుఁ డని బహువిధముల వానిని బ్రార్ధించి, దానిపయిని ఆబైరాగి యడి గృహ లు చేయఁగూద దనియు, చేసినయెదల వంశక్షయ మగువనియుఁ జెప్పి తనయెదల విశ్వసముగలవారికి తానే బంగారమును జేసి యిఛ్ఛెదనుగాని యోగమునుమాత్రము చెప్పనని చెప్పెను.

                                                అందుమీఁద     బంగారమునైన     జేయించుకోవలెనను   నాశపుట్టీ మరింత    శ్రద్ధాభక్తులతో     నాతని    నాశ్రయించుచు    నొకనాఁటి    యుదయకాలమున   రాజశేఖరుఁడుగారు    పాలును  శర్కరయుఁ డీసికొనిఛ్ఛి   యిఛ్ఛి  కూరుచుండీయుండఁగా ,    ఆబై రాగి     రాజ శే ఖ రుడుగారిమిఁద   దనకుఁ  బరిపూర్ణానుగ్రహముగలిగినటు . ముఖచిహ్నములవలనఁ     గవఁ బఱచుచు   నొకబేడయత్తు     బంగారమును   బేడయొత్తువెండినిఁ     దెమ్మని   యడిగి    యాతఁడు   తెఛ్ఛీయిఛ్ఛినతరువాత    వానిని రెండిని     నొకగుడ్డలో   కట్టి   రాజశేఖరుఁడుగారు      చూచుచుండఁగా   నిప్పులలో    వేసి   కొంతసే   పుండనిఛ్ఛి   యొకపసరును   దానిమీఁద   పిండి  కొంచెముసేపు  తాళపట్టుకారుతోఁ   దీసి  రెండుబేడలయెత్తు   బంగారమును  చేతులోఁబెట్టెను,అందుమీఁద   రాజశేఖరుఁదెగారు  మరింత   యాశకలవా రయి,    తమయింట   గల   బంగారమును   వెండిని   గలిపి   యేకముగ  బంగారమును   జేసిపెట్టుఁడని  బానిని  బహువిధముల  వేఁడుకొనిరి.   అట్లు   బేఁడుకొఁగా  బేఁడుకొఁగా   గోసాయి  యాతని   ప్రార్ధన    సంగీకరించి   యింటఁగల  బంగారమును  వెండినిఁజేర్చి  యొకముట  గట్ట్ట నియమించెను.   ఆతని   య్వగజాఞనుసారముగా  రాజశేఖరుఁడుగారు   తమయింటఁ  గలవారి   నగలునువెండిపాత్రములును   ధనమును  పోగుచేసి యొకపెద్ద 
రాజశేఖర చరిత్రము

మూటను గట్టి యింట నున్న వారుసహిత మెఱుగఁకుండ రహస్యముగ బైరాగియొద్దకుఁ దీసికొని వచ్చిరి. అతడు వెంటనే పిడకలదాలిపెట్టించి యామూటను రాశేఖరుఁడుగారి చేతులతోనే దానిలోఁ బెట్టించి పుతము వేసి ఆయనను లోపలికిఁ బోయి విసనగఱ్ఱను చెమ్మని పంపెను. రాజశేఖరుడుగారు విసనకఱ్ఱను బట్టుకొని మరల వఛ్ఛ్హునప్పటికి బైరాగి గొట్టముతో నూదుచుండెను; పిడకలసందున నుండి మూటయు కనఁబడుచుండెను. అప్పుడు బైరాగి మఱికొన్ని పిడకలను పైని బెట్టి మంట చేసి, తానువేమగిరికొడమీఁదఁ నున్న మూలికలను గొనివచ్చుట కయిఁ వెళ్ళె దననియు, తాను బోయి వానిని గొని వచ్చి పసరు పిండిన గాని యంతయు బంగారము కాదనియు, దాను వచ్చులోపల పిడకలను వేసి మంటచేయుచు జాగ్రతతోఁ గనిపెట్టుకొని యుండవలయుననియుఁ జెప్పి. మూలికలనిమిత్తమయి వెళ్ళెను. అతఁడు వనమూలికల కయివెళ్ళి యేవేళకును రానందున, రాజశేఖరుఁడుగారు తామక్క డనేయుండి, బైరాగిని పిలుచుకొని వచ్చుటకయి మనుష్యులనుబంపిరి. వారును గొడయంతయు వెదకి యొక్కడను అతని జూడను గానక మందుచెట్టు దొరకకపోవుటచేత దూరపుకొండలకు బోయినాఁ డేమో యనుకొని మరలవచ్చి యావార్తను జెప్పిరి. ఆబైరాగి బంగారముచేయు మూలికలు దొరకనందున గాబోలుమరలరానేలేదు. అతని నిమిత్తమయి యొక దినమువఱకు వేచియుండి రాజశేఖరుఁడుగారు పుటము దీసిచూచునప్పటికి దానియందు బంగారమును వెండియు లేదుగాని తెల్లని భస్మముమాత్ర ముండెను. సులభముగా రజితభస్మమును సువర్ణభస్మమును నయినందున రాజశేఖఁడుగారు సంతొషించి పదిలముగా దానిని దాచిరికాని, యేమికారణముచేతనొ యాభస్మమునందు బరువుగాని సువర్ణాదిభస్మములయందుండు గుణముకాని కనఁబడలేదు.